1 ENS Live Breaking News

శంఖవరం మండంలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్..

శంశవరం మండలంలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మండంలో 16 ఎంపీటీసీ స్థానలుండగా ఇప్పటికే 8 స్తానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8 స్థానాలకు ఎన్నికలు జరిగాయి అందులో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ప్రత్యర్ధులపై గెలుపొందారు. శంఖవరం ఎమ్మెల్యే ప్రత్తిపాడు ఎమ్మెల్యే నివాస మండలం కావడం విశేషం. అంతేకాకుండా వైఎస్సార్సీపీకి ఈ మండలంలో పట్టుకూడా చాలా ఎక్కువా వుంటుంది. అదే జోరు నేడు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ  చాలా స్పష్టంగా కనిపించడం విశేషం. దీనితో పార్టీశ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Sankhavaram

2021-09-19 12:39:22

దోమల నియంత్రణకు గంభూషియా విడుదల..

దోమల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శంఖవరం సర్పంచ్ బి. గన్నియ్యమ్మ, ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ అన్నారు. గురువారం  శంఖవరం మండల కేంద్రంలోని మురుగునీటి కాలువల్లోని దోమల లార్వానియంత్రణకు గంభూషియా చేపలను విడిచి పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రభలుతున్నవేళ దోమలను నియంత్రించడానికి పంచాయతీ అన్నివిధాల క్రుషి చేస్తుందన్నారు. అదే సమయంలో కాలువల్లో ఎవరూ చెత్తవేయకూడదని సూచించారు. ప్రతినిత్యం ప్రత్యేక శాణిటేషన్ డ్రైవ్ కూడా చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, జూనియర్ సహాయకులు రమణమూర్తి, పంచాయతీ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పడాల భాష తదితరులు  పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-16 16:28:01

పాఠశాలల అభివ్రుద్ధి చరిత్రగా నిలిచిపోతుంది..

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మనబడి - నాడు నేడు పధకం  కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో ఆధునిక సాంకేతికత, సౌకర్యాలకు ఓ వరవడిగా మారిందని కాకినాడ ఎంపీ వంగాగీత పేర్కొన్నారు. బుధవారం శంఖవరం మండలంలోని మనబడి... నాడు -నేడు పధకం తొలి విడత అభివ్రుద్ధఇ కార్యక్రమాలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్, ఎంపీ వంగా గీతతో కలిసి నూతనంగా పునఃప్రారంభం చేసి ప్రజలకు అంకితం చేశారు. ఇందులో భాగంగా మండలంలోని అన్నవరం, గొంధి కొత్తపల్లి, అచ్చంపేట, నెల్లిపూడి పంచాయితీ శివారు తిరుపతి అగ్రహారం, కొంతంగి కొత్తూరు, అన్నవరంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, కత్తిపుడిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, దీని సమీపంలోని ఈబీసీ కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు మన బడి - నాడు నేడు పధకంలో వివిధ నవీకరణ అభివృద్ధి పనులను వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎంపీ మాట్లాడుతూ, పాఠశాలల విద్య, అంగన్వాడీ విద్య, మహిళా సాధికారత, మహిళా శక్తి సంఘాల బలోపేతం, లాభసాటి ఆర్ధిక లావాదేవీల నిర్వహణపై ఆమె కూలంకషంగా మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్ధులకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయిని మించిన వాతావరణ కలుగజేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. జగన్న విద్యా కానుకలనూ, ఆక్ఫర్డ్ ఆంగ్ల నిఘంటువులనూ విద్యాశాఖ తరఫున విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంఖవరం ఎంఈఓ సూరిసెట్టి వేంకటరమణ, ఎంపీడీఓ జె.రాంబాబు, గొంధి కొత్తపల్లి సర్పంచ్  ఈగల విజయదుర్గ, అచ్చంపేట సర్పంచ్ బొట్టా చైతన్య, ఎస్.జగ్గంపేట సర్పంచ్ బైరా ఉప్పారావు, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, శంఖవరం మండల పంచాయితీల వార్డు సభ్యుల సంఘ అధ్యక్షుడు గౌతు వాసు, ది కత్తిపూడి కర్షకసేవా సహకార సంఘం మాజీ అధ్యక్షుడు గౌతు సుబ్రహ్మణ్యం (నాగు), ఆయా పాఠశాల అభివృద్ధి సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-15 15:01:06

జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉంటా..

విశాఖలోని పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులకు తాను నిరంతరం అండగా ఉంటానని, వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పరవాడ యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులందరికి తన సొంత నిధులతో ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక జాబితాను రూపొందించామన్నారు. పరవాడలో జర్నలిస్టుల కాలనీలో అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంకా పెండింగ్ ఉన్న జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. దీంతో పాటు అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు హెల్త్  ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఫెడరేషన్ పరవాడ యూనిట్ కు సంబంధించి తాను తన వంతు సహకారం అందిస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులకు తాను అన్ని వేళల అందుబాటులో ఉంటానన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను విపులంగా తెలియజేయడం జరిగిందన్నారు. అర్హులందరికి అక్రిడేషన్లు జారీ చేయాలని, వాటితో పాటు ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరామన్నారు. విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి. నారాయణ మాట్లాడుతూ ఫెడరేషన్ అనుబంధంగా పరవాడలో జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే జిల్లాలోని సర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అరుకు, పాడేరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ తమ అనుబంధ అసోసియేషన్లు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చె వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ యూనిట్ అధ్యక్షులు లాలం కృష్ణారావు, కార్యదర్శి పైలా సన్యాసినాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆర్.గోపి, కార్యదర్శి జి.మోహనరావు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జెడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లతో పాటు జాతీయ సభ్యులు జి.శ్రీనివాసరావు, ఏపి బ్రాడ్ క్రాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి) బి. ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్, గాజువాక నుంచి పితాని ప్రసాద్ తదితరులంతా పాల్గొన్నారు.

 
మృతి చెందిన జర్నలిస్టులకు ఘన నివాళులు:
తొలుత కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టులు ప్రకాష్, కారునాయుడుల మృతికి ఘనంగా నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యత్వ కార్డులను సభ్యులకు ఎమ్మెల్యే చేతులు మీదుగా అందజేసి ఘనంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా పరవాడ ఆంధ్రప్రభలో సేవలందిస్తూ మృతి చెందిన పాత్రికె యుడు ప్రకాష్ సతీమణికి రూ.25వేలు ఎమ్మెల్యే సొంత నిధులను అందజేశారు. ఇప్పటికే మరికొందరికి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Paravada

2021-09-15 14:52:35

శంఖవరంలో విద్యార్ధులకు అర్ధాకలి భోజనం..

మీకు పంపిన భోజనం చాలకపోతే ప్రక్కనే ఉన్న మోడల్ స్కూలులో ప్రతీరోజూ భోజనం మిగిలిపో తుంది.. అది అడుక్కొనితెచ్చి మీహైస్కూలులో పిల్లలకు పెట్టండి.. దానికి కంగారు పడిపోతే ఎలా.. తీసుకొచ్చిన భోజనాలు చాలకపోవడం, గ్రుడ్లు సరిపోవకపోవడం సదామామూ లేకదండీ.. విద్యాశాఖలో ఏ అధికారి పెద్దగా ఇలాంటివి పట్టించుకోరు.. ప్రతీదానికి కంగారు పడిపోతే ఎలా.. మాస్టారూ..! ఏంటి ఇవేవో విద్యాశాఖలో కాస్త పెద్ద స్థాయిలో అధికారులు అన్న మాటలనుకుంటున్నారా.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. శంఖవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలకు  బెండపూడి నుంచి మధ్యాహ్నానం భోజనం తీసుకువచ్చే నిర్వాహకుల సిబ్బంది అన్నమాటలివి.. ఈ మాటలు అన్నది ఎవరినోకాదో..  సాక్షాత్తూ జిల్లా పరిషత్ హైస్కూలు హెచ్ఎం సూర్యనారాయణని.. ఈ రసవత్తర అర్ధాకలి మధ్యాహ్నాన భోజనం విషయాలు కాస్త తెలుసుకుంటే.. షరా మామూలుగానే బుధవారం పాఠశాలకు అరకొరగా భోజనాలు తీసుకువచ్చారు నిర్వాహకులు.  అందులో పాఠశాల విద్యార్ధులు 30 మందికి భోజనాలు సరిపోలేదు. దీనితో తమ మిగిలిన పిల్లలకు భోజనాలు పంపాలని, వారిని పస్తులతో ఉంచలేమని నిర్వాహకులకు ఫోనులో కబురు పంపారు పాఠశాల హెచ్ఎం. వెంటనే(2.30 గంటలకు అప్పటి వరకూ పిల్లలు అర్ధాకలితోనే ఉన్నారు.) సిబ్బంది భోజనం తీసుకువచ్చారు. వస్తూ వస్తూనే ఇప్పటికిప్పుడు గ్రుడ్డు పెట్టలేమని, అవి ఉడికి తీసుకు రావాలంటే సమయం పట్టేస్తుందని.. కావాలంటే రేపు పంపిస్తామని మా నిర్వహాకులు చెప్పారని భోజనం తీసుకొచ్చిన సిబ్బంది చెప్పుకొచ్చారు. భోజనంగా కిచిడీ, అందులోకి బంగాలళ దుంపల కూర మాత్రమే పంపారన్నారు. భోజనాలు పెడుతూనే, మీ పాఠశాలలో పిల్లలకు భోజనాలు లేకపోయినా.. పూర్తిగా సరిపోకపోయినా ఇంతకంగారు పడిపోవడం ఏంటి మాష్టారు.. ప్రక్కనే మోడల్ స్కూలులో భోజనాలు రోజూ మిగిలిపోతున్నాయి. అక్కడి నుంచి అడుక్కుతెచ్చి మీ పిల్లలకు పెట్టొచ్చుగదా అన్నారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన హెచ్ఎం మాకేం అంత ఖర్మపట్టలేదు. ప్రభుత్వం మా పిల్లలకు కూడా భోజనానికి డబ్బులు ఖర్చుచేస్తుంది.. భోజన నిర్వహకులకు బిల్లుల రూపంలో ఇస్తుంది. భోజనాలు చాలకపోతే సరిపడా వెంటనే తేవాలి తప్పితే మేము ఇంకో పాఠశాలకు వెళ్లి మిగిలిపోయిన భోజనాలు అడిగి తెచ్చుకోవడం ఏంటి ఇది పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులకు విషయాన్ని చూపిస్తూ.. చూడండి ఇదీ పిల్లలకు భోజనాలు చాలడం లేదంటే ప్రక్కనే వున్న పాఠశాల నుంచి మిగిలిపోయిన భోజనాలు అడిగి తెచ్చుకోమంటారా.. ఇదేమైనా పద్దతిగా ఉందా మీరే చెప్పండి అన్నారు.. అయినా ఒక హైస్కూలు ప్రధాన ఉపాధ్యాయులతో భోజనాలు తీసుకొచ్చే సిబ్బంది ఈ విధంగా మాట్లాడం మీరే చూస్తున్నారుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేను ఎంఈఓ కి ఫిర్యాదు చేస్తాను. తెచ్చిన భోజనంలో కూడా గ్రుడ్లు కూడా లేవు. అదీ భోజనం సమయం అయిపోయిన తరువాత తీసుకు వచ్చారు. 10వ తరగతి పిల్లలు కనుక భోజనాలు లేకపోయినా ఇంత సేపు ఆగారు. అదే చిన్న పిల్లల పరిస్థితి అయితే మేము ఏం చేయాలి.. వారు ఆకలి తట్టుకో లేక  కళ్లు తిరిగిపడిపోతే బాధ్యత ఎవరిది అంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయాన్ని నిర్వాహకులకు హెచ్ఎం వెంకటేశ్వర్  ఫోనులో  తమ సిబ్బంది అన్న మాటలు తెలియజేయగా.. ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోవద్దని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని సర్ది చెప్పుకున్నారు. కాగా ఈ విషయమై ఎంఈఓ  ఎస్వీరమణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోనులో సంప్రదించినా స్పందించలేదు. ఏది ఏమైనా మధ్యాహ్నాన భోజన పథకంలో విద్యార్ధులకు తెచ్చే భోజనాలు పిల్లలకు చాలకపోతే పక్కనే ఉన్న పాఠశాలల్లో మిగిలిపోయిన భోజనాలు అడిగి తెచ్చి పెట్టాలని ఉచిత సలహాలు ఇచ్చిన నిర్వాహకుల వైఖరిని విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్వీకరిస్తారో తేలాల్సి వుంది..!

Sankhavaram

2021-09-15 14:23:43

శంఖవరంలో భూ వివరాలు స్వచ్ఛీకరణ..

శంఖవరం మండలంలో భూముల రీ-సర్వేలో భాగంగా రికార్డుల స్వచ్ఛీకరణ జరుగుతోందని తహశీల్దార్ కె.సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం శంఖవరం తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించి 6రకాల ఫార్మాట్ లలో రికార్డుల పరిశీలన జరుగుతుందన్నారు. మొత్తం రికార్డుల పరిశీలన పూర్తయిన తరువాత సర్వేయర్లు భూములు రీసర్వే చేపడతారని అన్నారు. 32 రెవిన్యూ గ్రామాల్లో  32వేల622 ఎకరాలు(పోరంబోకు, ప్రైవేటు, ప్రభుత్వ, గ్రామకంఠాలు) భూమి వుందన్నారు.  ప్రస్తుతం 70 ఏళ్ల క్రితం నాటి రికార్డులు పరిశీలన జరుగుతుందన్నారు. 

Sankhavaram

2021-09-14 11:04:57

శంఖవరంలో 30 మందికి కంటివైద్య పరీక్షలు..

శంఖవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు వైఎస్సార్ కంటి వెలుగు ప్రోగ్రామ్ అప్తాలమిక్ ఆఫీసర్ టిడి.లలితాదేవి తెలియజేశారు. మంగళవారం శంఖవరం పీహెచ్సీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు నిర్వహించిక మెడికల్ క్యాంపులో 30 మందికి పరీక్షలు చేయగా అందులో ఇద్దరికి కేటరాక్ట్  ఆపరేషన్లు అవసరమవుతాయని గుర్తించామన్నారు. వారిని జిల్లా కేంద్రంలోని కంటి ఆసుపత్రికి తరలించనున్నట్టు ఆమె వివరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-14 11:04:07

రేపు శంఖవరం మండలంలో ఎమ్మెల్యే పర్యటన..

శంఖవరం మండలంలో బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పర్యటించి నాడు-నేడు కింద అభివ్రుద్ధి చేసిన  పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని ఎంఈఓ ఎస్వీ రమణ చెప్పారు. మంగళవారం శంఖవరంలో ఈ మేరకు ఎంఈఓ మీడియాకి ఎమ్మెల్యే పర్యటన వివరాలు తెలియజేశారు. మండలంలో ఎంపీపీ స్కూలు జి.కొత్తపల్లి, అచ్చంపేట, టి.అగ్రహారం(నెలిపూడి), కత్తిపూడి, కొంతంగి, అన్నవరం(రావిచెట్టు సెంటర్) పాఠశాలల్లో నాడు-నేడులో అభివ్రుద్ధిచేసిన అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఎంఈఓ వివరించారు.

Sankhavaram

2021-09-14 10:03:37

వెటర్నరీ సహాయకులకు వారంతపు శిక్షణ..

శంఖవరం పశుసంవర్ధక డిస్పెన్సరీ పరిధిలోని గ్రామ సచివాలయ వెటర్నరీ సహాయకులకు ప్రత్యేక వారాంతపు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.వీరరాజు తెలియజేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని డిస్పెన్సరీలో మండలంలోని 20 మంది గ్రామ సచివాలయ వెటర్నరీ సహాయకులకు ఈ శిక్షణ మరయు పరీక్షలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ, పశువులకు ప్రాధమిక వైద్యం, వ్యాధుల నిర్ధారణ, తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన అంశాలపై వారంతా గ్రామాల్లో పాడి రైతుల పశువులకు చికిత్సలు అందజేస్తారన్నారు.

Sankhavaram

2021-09-13 11:51:15

శంఖవంరంలో 300 మందికి కోవిడ్ టీకా..

శంఖవరం మండలం కేంద్రంలోని మూడు గ్రామ సచివాలయాల పరిధిలో 300 మందికి కోవడ్ టీకాలు వేసినట్టు వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. సోమవారం ఈ మేరకు పీహెచ్సీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక కోవిడ్ డ్రైవ్ లో వేయాల్సిన టీకాల్లో మిగిలిన పోయిన వాటిని ఈరోజు పూర్తిచేసినట్టు చెప్పారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్ రెండు రకాల టీకాలను ప్రజలకు అందించామన్నారు. రెండవ డోసుకి కోవీషీల్డ్ టీకాలను వేసినట్టు చెప్పిన ఆయన మొదటి టీకాకకు కోవాగ్జిన్ ప్రాధాన్యత ఇచ్చినట్టు వైద్యాధికారి వివరించారు. 

Sankhavaram

2021-09-13 11:44:38

సత్యదేవుని అన్నదాన ట్రస్టుకి రూ.లక్ష విరాళం.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సాలగ్రామ రామశేషు సోమవారం శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి అన్నదానం ట్రస్టుకి రూ.లక్ష విరాళంగా సమర్పించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. అంతకు ముందు దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారికి తమ కుటుంబం పేరున అన్నదానం చేయాలని కోరారు. దాతలకు అర్చక స్వాములు ఆశీర్వాదాలు అందించగా, ఈఓ వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వో కొండలరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2021-09-13 07:43:33

స్పీడు పెంచిన అన్నవరం దేవస్థాన ఈఓ..

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం విధినిర్వహణలో కాస్త దూకుడు పెంచారు. గాడితప్పుతున్న ఆలయ సాంప్రదాయాలను, సిబ్బంది చేతవాటాలను కట్టడని చేసేందుకు నడుం బిగించారు. ఏకంగా దేవస్థానంలోని స్వామివారికి పూజలు నిర్వహించే ప్రధాన అర్చకుడు, ఉప ప్రధాన అర్చకులనే సస్పెండ్ చేశారంటే దేవస్థానంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందోఅర్ధం చేసుకోవచ్చు. దేవస్థానంలో ఏం జరుగుతుందని రాష్ట్రస్థాయిలో అధికారులు ప్రశ్నించడానికి ముందుగానే ఈఓనే రంగంలోకి దిగి ప్రత్యేక ఏరివేత కార్యక్రమానికి ఉపక్రమించారు. తప్పుచేస్తే ఎంతడివాడినైనా ఇంటికి పంపిస్తాననే చెప్పే క్రమంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేసి ట్రెండ్ స్రుష్టించారు. వాస్తవానికి దేవస్థానాల్లో ప్రధాన అర్చకులను సస్పెండ్ చేయడమంటే కాస్త కత్తిమీద సాముతో కూడుకున్న పని. కానీ దేవస్థాన ప్రతిష్టకు భంగం వాటిల్లితే..దానికి కారకులు ఎంతటి వారైనా ఉపేక్షించనని ఇద్దరు అర్చకుల సస్పెండ్ మొత్తం ఆలయంలోని అధికారులు సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. దానికితోడు స్వామివారికి సంబంధించిన సమాచారాన్ని భక్తులకు చేరవేసే విషయంలో ద్రుష్టిపెట్టని ఆలయ అధికారులు, సిబ్బంది, వారికి ఆదాయం వచ్చే విషయాలను ఒక రింగ్ లా ఏర్పాటై చాపకింద నీరులా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీనితో స్వామివారికొచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఈఓ ఆదిలోనే ఈ మామూళ్లు, అడ్డదారి ఆదాయ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకొని ఒకరిద్దరు పెద్ద తలకాయలను ఆధారాలతో సహా సస్పెండ్ చేస్తే గాడిలో పడరని ఈఓ భావించి.. ఆవిధంగా చర్యలకు ఉపక్రమించడం ఇపుడు దేవస్థానంలో చర్చనీయాంశం అయ్యింది. స్వామివారి ఆలయంలో ప్రధాన, ఉప ప్రధాన అర్చకులనే సస్పెండ్ చేశారంటే మనమెంత అనే ప్రచారం.. అర్చకులను  సస్పెండ్ చేసిన వెంటనే దేవస్థానంలో గుప్పుమంది. అయితే వార్నింగ్ కోసమే ఈ సస్పెండ్ లు చేసి ఊరుకుంటారా లేదంటే అన్ని విభాగాల్లోనూ ప్రక్షాళన చేపడతారా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది.

Annavaram

2021-09-13 05:17:28

శంఖవరంలో 2190 మందికి కోవిడ్ వేక్సిన్..

శంఖవరం మండలంలో 2190 మందికి కోవిడ్ వేక్సిన్ వేసినట్టుఎంపీడీఓ జె.రాంబాబు ఒక ప్రకటనలో  తెలిజేశారు. ఆదివారం శంఖవరం మంలంలో ఆయన మీడియాకి ఈ మేరకు వివరాలను విడుదల చేశారు. మండంలోని అన్ని గ్రామ, సచివాలయాలు, సబ్ సెంటర్ల పరిధిలో ఈ కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు. సాయంత్రం ఆరు గంటలకే పూర్తిస్థాయిలో వేక్సిన్ల టార్గెట్ పూర్తిచేసినట్టు వివరించారు. అన్ని కేంద్రాల్లోనూ ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ నిబంధనలను అమలు చేసి కార్యక్రమాన్ని పూర్తిచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Sankhavaram

2021-09-12 13:32:07

దవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్టు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విపత్తు నియంత్రణ అధారిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసకున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. అయినప్పటికీ దవళేళ్వరం చెట్టు ప్రక్కల ప్రాంతాల్లోని గ్రామాలు, కాలువ ఆధారిత ప్రాంతాల్లో మెడికల్, రెవిన్యూ సిబ్బంది సర్వెలెన్స్ మాత్రం కొనసాగుతుందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా సచివాలయాలకు సమాచారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Dhavaleswaram

2021-09-12 13:07:49