1
ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఖచ్చితంగా కోర్టుల్లో శిక్షలు పడటం ఖాయం.. ఎవరో చేసిన నిర్ణయాలకు మనం బలికావాల్సి వస్తుంది.. ప్రభుత్వం కోర్టుల్లో వేసే కేసులన్నీ వీగిపోతున్నాయి.. బలమైన డిఫెన్స్ కనీసం ఐఏఎస్ లకు కూడా దొరకడం లేదు.. హైకోర్టుల్లో దోషుల్లా గంటల తరబడి నిలబడటం ఏం బాలేదు.. సీనియర్ ఐఏఎస్ లగా ఉండి మనకిదేం ఖర్మ.. ఏదోఒక నిర్ణయం తీసుకోవాలి.. లేదంటే ఖచ్చితంగా కోర్టు శిక్షలు పడిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లుగా పేరుపడిపోతాం.. అందులోనూ ప్రభుత్వానికి మీడియా మొత్తం వ్యతిరేకం అయిపోయింది.. ఏ చిన్న తప్పు జరిగిన బూతద్ధంలో పెట్టి చూపిస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాలనుకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.. ఇవీ గత కొద్ది రోజుల నుంచి ఏ ఐదుగులు ఐఏఎస్ లు కనిపించినా చర్చించుకునే మాటలు, తీవ్రంగా ఆలోచనలు చేస్తున్న తీరు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. అంతేకాదు కొందరు ఐఏఎస్ లు అనుకూల మీడియా వద్ద కూడా ఇదే ప్రస్తావన చేస్తున్నారట. వాస్తవమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ ల పరిస్థితి అలానే వుంది. ప్రస్తుతం సుమారు పది మంది ఐఏఎస్ లు వివిధ జిఓల, ప్రభుత్వ శాఖల విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ లను ప్రాధమిక శిక్షవేసి కోర్టులోనే గంటల తరబడి నిలబెట్టాయి కూడా. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ద్వారా వాదించే లాయర్(జిపి) కాస్త గట్టిగా వాదించి డిఫెన్సు చేయాల్సి వుంది. వారంతా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కోర్టుల్లో మాత్రం ప్రభుత్వం తరపున వేసే కేసులన్నీ వీగిపోతున్నాయి. ముఖ్యంగా హైకోర్టు ప్రభుత్వంలోని ఐఏఎస్ లను కోర్టుదిక్కారం పదే పదే చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే ప్రభుత్వంలోని కొందరు సీనియర్ ఐఏఎస్ లు, ప్రభుత్వ శాఖలు, వ్యవహారాలు, జీఓలపై అవగాహన లేని కొందరు సలహాదారులు చేస్తున్న సూచనలు కూడా ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ లను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి.
దానికి ప్రధాన ఉదాహరణలు జీఓనెంబరు-2, జీఓనెంబరు 149. ఇందులో జీఓనెంబరు 2 విషయంలో అయితే పంచాయతీలు ఉండగా, ఎందుకు గ్రామసచివాలయాలను ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే పదాన్ని కూడా వాడిందంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. దానికితోడు, ప్రభుత్వంలోని ఐఏఎస్ లపై సలహాదారుల ఒత్తిడి అధికం కావడం, రూల్ పొజిషన్ కు వ్యతిరేకంగా పనచేయించడం, ఏక పక్ష నిర్ణయాలు ఇలా చాలానే సీనియర్ ఐఏఎస్ లను అడకత్తెరకు బలిచేస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఐఏఎస్ లు చేస్తున్న తాత్సరమే వీరికి కోర్టుల్లో శిక్షలు పడేలా చేస్తున్నాయి. గతంలో ఐఏఎస్ లకు కోర్టు కేసుల విషయంలో కాస్త వెసులుబాటు వచ్చేది. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వంలో ఎంతటి వారికైనా మినహాయింపులు ఇవ్వడం లేదు. ఒక వేళ దిక్కరిస్తే.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ప్రాధమిక శిక్షలు వేసేస్తున్నాయి.. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ జిపిలు కాస్త గట్టివారైతే కోర్టుల్లో కేసులను ఎదుర్కోవడానికి ఆస్కారం వుంటుంది. కానీ విచిత్రంగా ఎంత పోరాడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉండటంతో సీనియర్ ఐఏఎస్ లు ఆంధ్రప్రదేశ్ లోని సర్వీసులను విడిచిపెట్టి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని చూస్తున్నట్టు విశేషంగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో గత ఏడాదిన్నరలో జరిగిన పరిణామాలు చూసుకున్నా.. దానికి బలం చేకూరుతుంది. గతంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ను తీసుకొచ్చ హడావిడి చేసిన ప్రభుత్వం ఇపుడు ఆయనను పక్కన పెట్టింది. ఇలానే అజయ్ కల్లాం, పీవీరమేష్ ఇలా చాలాం మంది సీనియర్ ఐఏఎస్ ల సర్వీసు పూర్తియినా వారి తెచ్చి అధికారం అప్పగించి అతి కొద్ది నెలల్లోనే వారిని పక్కన పట్టింది.
వాళ్ల సమయంలో వచ్చి జీఓలన్నీ ప్రస్తుతం కోర్టులో వాదన దశలో ఉన్నాయి. నాలుగు పదులు సంఖ్యలో ఉన్న ప్రభుత్వ సలహాదారులు వలన కూడా ఐఏఎస్ లకు తలపోటు మరీ అధికం అవుతుంది. అందులో చాలా మందికి కేబినెట్ ర్యాంకు ఉండటం, వారి ఆదేశాలు ఐఏఎస్ లు శిరసా వహించాల్సి రావడం కూడా ఇందుకు మరోప్రధానక కారణమవుతుంది. ఇదే సమయంలో ఐఏఎస్ లు చేస్తున్న నాన్చుడు దోరణి కూడా కోర్టులకు ఆగ్రహం తెప్పిస్తుంది. కోర్టులను గౌరవించాల్సిన సమయంలో కోర్టు ఆదేశాలను దిక్కరించి.. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టుగా ఐఏఎస్ లు పరిగణించ బటం వీరికి తీవ్ర స్థాయిలో తలఒంపులు తెస్తున్నది. ఐఏఎస్ లో నే కోర్టు శిక్షలు పడిన వారంతా మిగిలిన ఐఏఎస్ ల ముందు కూడా దోషులుగా మిగిలిపోతున్నారు. సీనియర్ ఐఏఎస్ లకు హైకోర్టులు వివిధ ప్రభుత్వశాఖల్లో తీసుకున్న నిర్ణయాల కారణంగా వేస్తున్న శిక్షలతో విసుగు చెందిన వీరంతా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతే కూల్ కూల్ గా సర్వీసులు పూర్తిచేసుకోవచ్చుననే ఆలోచనలో పడ్డారట. వచ్చే ఆరునెలల్లో సుమారు పది మంది వరకూ ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లాని భావిస్తున్నట్టుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. చూడాలి జరుగుతున్న ప్రచారంలో నిజమెంత, ఎంతమంది కేంద్రానికి బిచానా సర్దేస్తారు.. ఆపై ఏం జరుగుతుందనేది.!