1
ఏపీ పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా మహిళా పోలీసులను ఏ ఇతర విధులకు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శిలు వినియోగించడానికి వీల్లేదంటూ పోలీస్ బాస్, డీజీపీ గౌతం సవాంగ్ మెమో( Rc.No.7113/C3/2021, Dated: 03-09-2021) జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా తెలియజేశారు. ఈ విషయంలో రాష్ట్రంలో చాలా మంది ఎంపీడీఓలు, వివిధశాఖల అధికారులు తమ అనుమతి లేకుండా విధులు కేటాయించడం సరికాదని ఆ మెమోలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.netప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక వార్త కధనాలుగా తీసుకెళ్లడంతో డిజీపీ అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిల కంటే అత్యంత వేగంగా స్పందించారు. తమ సిబ్బందిని తమశాఖ పనుల తరువాత ఖాళీ ఉంటే.. అదీ ముందస్తు అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే వినియోగించాలని ఆ మెమోలో పేర్కొన్నారు. జిఓనెంబరు 59 ద్వారా మహిళా పోలీసులంతా హోంశాఖకు చెందిన ఉద్యోగులని గుర్తించాలని.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి విధులన్నీ పోలీస్ శాఖకు చెందినవే నని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గ్రామవార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శికి, పోలీస్ శాఖ ముఖ్యకార్యదర్శికి, అన్ని జిల్లా పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు ఆ మెమో లేఖనులేక పంపారు. దీని ద్వారా గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను ఇకపై ఏ పనులకు పడితే ఆ పనులకు, గ్రామసచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలు కార్యాలయ పనులకు, ఇతర ప్రభుత్వశాఖల విధులకు వినియోగించడానికి వీలుండదు. గతంలో వీరు పోలీస్ శాఖకు చెందినవారైనప్పటికీ మండల స్థాయిలో ఎంపీడీఓ బాసులుగా పెత్తనం చెలాయించేవారు.
ఆ సమయంలో ఇటు స్టేషన్ ఎస్ఐలకు చెప్పలేక, ఇటు అధికారులు చెప్పిన పనులను చేయలేక మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొన్ని సందర్భాల్లో పంచాయతీ కార్యదర్శిల దగ్గర నుంచి మా పనైతే చేయడానికి ముందుకు రావడం లేదనే మాటలు కూడా పడేవారు. ఈ విషయాలన్నీ నిఘా వర్గాలు, మీడియా కధనాల ద్వారా డిజీపీకి చేరకడంతో ఉన్నఫళంగా ఈ అత్యవసర మెమో జారీచేశారు. అయితే ఈ విషయంలో ముందునుంచీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలు మహిళా పోలీసులను ఇతర ప్రభుత్వశాఖల విధులు చేయవద్దని చెబుతున్నప్పటికీ లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవడంతో వీరు ఇబ్బందులు పడుతూ, ఇతరశాఖల పనులు, కార్యాలయంలోని అన్నిరకాల పనులు చేయాల్సి వచ్చేది. ఆ సమయంలోనే గ్రామసచివాలయాల్లో ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల పనులు చేస్తున్న తీరుపై ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో కొందరు పోలీసు సిబ్బంది కూడా మహిళా పోలీసుల విషయంలో చేస్తున్న వ్యంగ్యమైన కామెంట్లును కూడీ డీజీపి కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. వాస్తవానికి పోలీస్ శాఖ ద్వారా అపాయింట్ మెంట్లు ఇచ్చిన తరువాత కూడా చాలా స్టేషన్ లో హోంగార్డు నుంచి ఎస్ఐ వరకూ వివిధ రకాలుగా మీరు మాలా పోలీసులు కాదని, ప్రభుత్వం గుర్తించినంత మాత్రన మేము గుర్తించాలా అనే భారీ పదాలను కూడా వినియోగించేవారు. అయితే ఈ మాటలన్నీ ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లవనుకున్నారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులు, రెండుమూడు శాఖలకు సంబంధించి చేస్తున్న విధులను ప్రజలు, ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేకంగా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యప్ ద్వారా ప్రత్యేక కధనాలు ప్రచురించడంతోపాటు, డిజిపి కూడా చాలా త్వరాగా మహిళా పోలీసులు పడుతున్న ఇబ్బందులు, అవమానాలను గుర్తించారు.
ఈ విధానానికి ఎలాగైనా అడ్డుకట్టవేయాలని నిర్ణయించుకొని మెమో జారీచేశారు. ఆ మెమోతో ఇప్పటి వరకూ మండలంలో తామే బాసులమని ఫీలపైపోయిన ఎంపీడీఓలు, సచివాలయాల్లో మా మాట వినకపోతే జీలాలు ఆపేస్తాం.. పకి రాసేస్తాం అంటూ బీరాలు పోయిన పంచాయతీ సెక్రటరీల గొంతులో పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. అటు ప్రభుత్వం కూడా డీజీపి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం ఈమెమో విషయంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిని రాష్ట్రంలో ఎన్నిజిల్లాల్లో ఎంతమంది ఎంపీడీఓలు, ఎన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీలు ఏస్థాయిలో పాటిస్తారోననేది మాత్రం ప్రశ్నార్ధకమే. ఏ ప్రభుత్వ శాఖలో అయినా జిఓలుగానీ, మెమోలుగా అమలుకాకపోతే ఆశాఖల ముఖ్యకార్యదర్శిలు పట్టించుకోని దాఖాలాలే ఇప్పటి వరకూ గ్రామసచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ ఉన్నాయి. కానీ మొదటి సారిగా డీజీపీ నేరుగా ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు మహిళా పోలీసులకు అప్పగిస్తున్న అదనపు విధుల విషయంలో మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించడంతో వారందరికీ ఒక రకంగా లక్ష్మణరేఖ అడ్డుపడినట్టు అయ్యింది. ఏది ఏమైనా పోలీస్ బాస్ మెమో మాత్రం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపి క్ గా మారింది. అటు తమ సమస్యను పరిష్కరించడంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చేసిన సహాయాన్ని గుర్తిస్తూ మహిళా పోలీసులంతా ఈఎన్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఫోన్లు చేసి తమ హర్షాన్ని, అనందాన్ని వ్యక్తం చేశారు. మీ మేలు మరిచిపోలేమంటూ ధన్యవాదములు తెలియజేశారు. అదేవిధంగా డిజీపీ గౌతం సవాంగ్ సర్ తేంక్యూ.. అంటూ మెసేజులు తమ తమ సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున మెసేజులు పెడుతున్నారు..!