1 ENS Live Breaking News

ఈవిఎం గోదాములను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల‌లోని ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి శ‌నివారం త‌నిఖీ చేశారు. అక్క‌డి భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. సీళ్ల‌ను ప‌రిశీలించారు. గోదాములకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతోపాటు  సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఎంపిడిఓ రాజ్‌కుమార్‌, తాశీల్దార్ కెవి ర‌మ‌ణ‌రాజు, ఎల‌క్ష‌న్ సూప‌రింటిండెంట్ భాస్క‌ర‌రావు, ఎల‌క్ష‌న్ డిటి డి.శైల‌జ‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయ‌కులు స‌ముద్రాల రామారావు, సిపిఐ నాయ‌కులు తాలాడ స‌న్నిబాబు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Nellimarla

2021-09-04 05:57:16

భూ ఆక్రమణలపై లోకాయుక్తలో పిర్యాదు..

యస్.రాయవరం మండలం, గుడివాడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ నల్లపురాజు వెంకట్రాజు, అతని తండ్రి బంగార్రాజు, అధ్యక్షుడు నీటి సంఘం, అప్పటి తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్, డిప్యూటీ తహశీల్దార్ ఎమ్.వీరభద్రాచారి,మండల సర్వేయర్ టి.రామారావు, లపై యు.ఎఫ్.ఆర్.టి.ఐ కన్వీనర్ లోకాయుక్త  కు పిర్యాదు చేశారు. వాటిని శనివారం మీడియాకి విడుదల చేశారు. ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేయకుండా, తన తాత ల నుండి వారసత్వం గా ఒక్క సెంటు భూమి రాకుండా, గుడివాడ, పెదఉప్పలం, చినఉప్పలం 3 గ్రామాల లో 4 గురు పేరున ఎకరాలు 47.71 సెంట్లు గతం లో రెవెన్యూ రికార్డు లలో "అనాదీనం" భూమి (ప్రభుత్వ భూమి) గా ఉన్న ఈ భూములు మొత్తం తమ 4గురు కుటుంబ సభ్యుల పేరున రెవెన్యూ రికార్డు లలో అక్రమంగా నమోదు చేయించుకున్నారు. ఆక్రమించు కొన్నందున ఈ  భూముల పై అనేక అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రికార్డులు తారు మారు చేసినట్టుగా తెలుస్తుందని దీనిపై విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 పెదఉప్పలం రెవెన్యూ చినఉప్పలం గ్రామము లోని సర్వే నెం. 51-1 లో ఎకరాలు 33.69 సెంట్లు, సర్వే నెం. 115-1 లో ఎకరాలు 23.10 సెంట్లు మరియు సర్వే నెం. 115-3 లో 21.65 సెంట్లు వెరశి మొత్తం ఎకరాలు 98.44 సెంట్లు నల్లా రెడ్డి నాయుడు పేరున తేదీ 09.05-37 న ప్రభుత్వ భూమి అక్రమణ దారుగా  నోటీసు, 10-1 ప్రకారం నల్లా మల్లయ్య అప్పారావు పేరున 51-1 లో ఎకరాలు 33.69 సెంట్లు, సర్వే నెం. 115 లో ఎకరాలు  22.90 సెంట్లు, సర్వే నెం.117 లో ఎకరాలు 17.80 సెంట్లు, వెరిశి మొత్తం ఎకరాలు 74.39 సెంట్లు భూమి ఉండగా, తేదీ 31.12.2008న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపుసామాజిక వర్గానికి చెందిన వారు 8  మంది వ్యక్తుల పేరున పాస్ బుక్స్ కలిగి ఉన్న మొత్తం ఎకరాలు 74.39 సెంట్లు, ఆంధ్ర ప్రదేశ్ గజిట్ 2018 (22A) ప్రకారం సర్వే నెం. 115 లో ఎకరాలు 22.90 సెంట్లు, సర్వే నెం.117 లో ఎకరాలు  17.80 సెంట్లు వెరశి మొత్తం ఎకరాలు 40.70 సెంట్లు  ప్రభుత్వ భూమిగా ఉండగా, ఈ భూమి తో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిబంధనలకు విరుద్దంగా రొయ్యల చెరువులు త్రవ్వి అనుభవిస్తుండం తదితర అన్ని అవినీతి, అక్రమాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అదే విధంగా యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామం లో  జాతీయ రహదారి పై నుంచి యలమంచిలి గ్రామము లోనికి వెళ్ళు తారు రోడ్డు కు కుడి వైపున గతంలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పెట్రోల్ బంక్ ను ఆనుకుని కొండకు ఉత్తర దిక్కున ఉన్న అట్లాంట్ రాక్ గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భూములను, దక్షిణం వైపు కొండలను ఆనుకొని ఖాతా నెం. 116 లో ఎకరాలు 8.015 సెంట్లు భూముల పైన విచారించి చట్ట ప్రకారం వీరిపైకూడా చర్యలు  తీసుకొవాలంటూ పిర్యాదు లో పేర్కొన్నారు. ఈ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తేదీ 25.01.2021 న 
స్పందన కార్యక్రమం లో తహసీల్దార్, యస్.రాయవరం కు పిర్యాదు చేసినట్టు వివరించారు. తేది 24.03.2021న తహసీల్దార్ కు ఇచ్చిన పిర్యాదు కుఎండార్స్మెంట్ ఇచ్చారని, తేది 31.07.2021, 10.08.2021 న జిల్లాకలెక్టర్, విశాఖపట్నం తో పాటు పలు శాఖల అధికారులకు పిర్యాదు చేసినట్లు కూడా ఆయన వివరించారు. తక్షణమే అధికారులు విచారణ చేపట్టి భూములు స్వాధీనం చేసుకోకపోతే మరిన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించే అవకాశం వుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

S Rayavaram

2021-09-04 04:14:17

పారిశుధ్యానికి అధిక ప్రధాన్యత ఇవ్వాలి..

వర్షాలు ప్రారంభమై నందున గ్రామాలలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత నివ్వాలని సంయుక్త కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు.  ఆయన పద్మనాభం మండలంలో రేవిడి కృష్ణాపురం పద్మనాభం అనంతవరం గ్రామాలలో పర్యటించి సచివాలయాలను తనిఖీ చేశారు.  వానలకు మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతాయని ఫలితంగా మలేరియా ప్రబలే ప్రమాదం ఉందన్నారు.  కాబట్టి నీరు నిల్వ ఉండకుండా సంపూర్ణ పారిశుద్ధ్యం ప్రతిరోజూ చేస్తూ ఉండాలన్నారు.  అందరూ కోవిడ్ నిబంధనలను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగులందరూ సమయపాలన, బయోమెట్రిక్ తప్పనిసరిగా పాటించాలని,  సంక్షేమ పథకాలకు సంబంధించిన  చెల్లింపులకు రసీదులను వెంటనే పంపించాలన్నారు. వైయస్సార్ భీమాలో అర్హులందరినీ నమోదు చేయాలన్నారు. స్పందన కార్యక్రమం తప్పక నిర్వహిస్తూ ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కేంద్రాలు, ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు.  ఈ పర్యటనలో మండల అభివృద్ధి అధికారి జి.వి. చిట్టిరాజు, మండల ఇంజనీర్ సుధాకర్ రావు, ఈ.వో.ఆర్.డి. ఎన్. ఉషారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు

Padmanabham

2021-09-03 17:00:21

ఆన్ లైన్ పరీక్షలకు సిలబస్ పఠనం చేయాలి..

మహిళాపోలీసులు హోంశాఖ ఇచ్చిన సిలబస్ ను బాగా పఠనం చేయడం ద్వారా ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం పెట్టే ఆన్ లైన్ పరీక్షను సులభంగా ఉత్తీర్ణులవుతారని చైతన్యపూరిత ప్రసంగం చేశారు అన్నవరం ఎస్ఐ రవికుమార్. శుక్రవారం ప్రత్తిపాడు సర్కిల్ కార్యాలయంలో మహిళా పోలీసులకు ప్రొబేషన్ పరీక్షకు సంబంధించిన  శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులంతా గతంలో తీసుకున్న శిక్షణ అంశాలు, ప్రాజెక్టు వర్క్ కు సంబంధించిన విధివిధానాలను క్షణ్ణంగా తెలుసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ శిక్షణ ఇస్తున్నట్టు ఎస్ఐ తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Prathipadu

2021-09-03 15:41:51

జ్వరాల నింత్రణకు దోమలపై దండయాత్ర ..

మహా విశాఖ నగర పరిధిలో దోమలను నివారించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని జివిఎంసి కమీషనర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. శుక్రవారం ఈ విషయమై విశాఖలో ఆమె మాట్లాడుతూ, నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా దోమల నివారణే ప్రధాన ధ్యేయంగా అన్నిరకాల చర్యలు చేపట్టిందన్నారు. ప్రతీ రోజూ జివిఎంసి ఇంటింటా సర్వేనిర్వహిస్తున్నామరు. ఈసీజనల్ వ్యాధులు విస్తృతం కాకుండా ముందస్తు చర్యలైన పరిసరాల పరిశుభ్రత ద్వారా ప్రతీ ఇంటా దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తుంచి నివారణ ప్రారంభిస్తామన్నారు. ఈ చర్యలలో సంబందిత అధికారులు, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, మలేరియా సిబ్బంది ద్వారా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు తమవంతు బాధ్యతగా జివిఎంసి సిబ్బందికి సహకరిస్తూ, ప్రతీ శుక్రవారం “డ్రై డే” ను విధిగా పాటించి దోమల నివారణ చర్యలకు బాధ్యత వహించాలని కమిషనర్ కోరారు. ముఖ్యంగా మంచినీటి నిల్వలలోనే దొమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయని ప్రజలు గమనించాలన్నారు. వారానికొకసారి తప్పనిసరిగా వాటర్ ట్యాంకులలో నీటి నిల్వలను ఖాళీ  చేసి, ఆరబెట్టి తాజాగా నీటిని నింపుకోవాలని కమిషనర్ తెలిపారు.    

Visakhapatnam

2021-09-03 13:04:44

ఫ్రైడే డ్రైడే ప్రతీ వారం తప్పనిసరి..

వారానికి ఒక రోజు నీటి కుండీలు ఆరబెట్టే కార్యక్రమం తప్పక చేపట్టాలని సచివాలయ కార్యదర్శి శంకరాచార్యులు సూచించారు. శుక్రవారం శంఖవరం గ్రామసచివాలయం-2 పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ, జ్వరాలు అధికంగా వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు, మంచినీటి కుండీలపై మూలు వేసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరాల లక్షణాలు కనిపిస్తే తక్షణమే గ్రామవాలంటీర్ల ద్వారా సమాచారాన్ని ఆరోగ్య సహాయకులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-03 09:46:41

90శాతం పూర్తైన 5 రైతు భరోసాకేంద్రాలు..

రౌతులపూడి మండలంలో మరో 5 రైతుభరోసా కేంద్రాలు 90శాతం నిర్మాణాలు పూర్తిచేసుకున్నాయని అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గోపీనాధ్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం రౌతులపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 17 ఆర్బీకేలు మంజూరు కాగా ఇప్పటికే  ఒకటి ప్రారంభం అయ్యిందన్నారు. మరో 5 త్వరలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. నిర్మాణాలు పూర్తైపోయి రంగులు వేసే దశలో ఉన్నాయన్నారు. ఈనెలాఖరుకు వీటిని ప్రారంభించే అవకాశం వుందని ఆయన వివరించారు. మిగిలిన ఆర్బీకేలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు.

Rowthulapudi

2021-09-03 09:39:03

మండలంలో 112 టన్నులు వ్యవసాయ ఎరువులు..

రౌతులపూడి మండలంలో 112 టన్నులు ఎరువులు సిద్దంగా ఉన్నాయని వ్యవసాయాధికారి పడాల గాంధి తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు మండలానికి పూర్తిగా ఎరువులు కేటాయించిందన్నారు. రైతుభరోసా కేంద్రాల పరిధిలోని రైతులకు, గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా వీటిని అందజేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఎరువులు చేరిన విషయాన్ని పొలంబడి కార్యక్రమంలో కూడా రైతులకు తెలియజేస్తున్నట్టు ఆయన తెలియజేశారు.  కావాల్సిన నాణ్యమైన ఎరువులను రైతుభరోసా కేంద్రాల నుంచి కొనుగోలు చేసుకోవచ్చునని వ్యవసాయాధికారి తెలియజేశారు.

Rowthulapudi

2021-09-03 08:39:29

త్వరితగతిన పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్..

శంఖవరం మండలంలో త్వరిత గతిన పోలింగ్ స్టేషన్లు మ్యాపింగ్ జరుగుతుందని తహశీల్దార్ కె.సుబ్రమణ్యం తెలియజేశారు. ఆయన శుక్రవారం శంఖవరం తహశీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో 49 పోలింగ్ స్టేషన్లకు గాను 23 స్టేషన్లు మ్యాపింగ్ జరిగిందన్నారు. 41 మంది బిఎల్వోలు ప్రొఫైల్ అప్లోడ్ చేశారన్నారు. మండలంలో రెండు ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్ లేని చోట్ల ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు జరగలేదన్నారు. కొందరు బిఎల్వోల దగ్గర గరుడాయాప్ మ్యాపింగ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాటిని జిల్లా అధికారులకు నివేదించినట్టు తహశీల్దార్ వివరించారు.

Sankhavaram

2021-09-03 08:35:33

శంఖవరంలో సాయినాధునికి బంగారు బొట్టు..

శంఖవరంలో శ్రీవాణి నవ దుర్గా ఆలయానికి ఎదురుగా వున్న షిర్డీసాయినాధుడికి గౌరంపేట గ్రామానికి చెందిన గుండ్రాజు సతీష్, వాసు దంపతులు బంగారు బొట్టును కానుకగా సమర్పించారు. ఈ మేరకు గురువారం ఆలయంలో వారే స్వయంగా సాయి విగ్రహానికి అతికించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, బాబావారికి తాము బంగారు బొట్టు చేయిస్తామని అనుకున్నామని, ఏకాదశి సందర్భంగా ఈరోజు దీనిని తీసుకొచ్చి బహూకరించినట్టు వారు తెలియజేశారు. అంతకుముందు బాబావారికి ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు వాటిని పంపిణీ చేశారు. గురువారం కావడంలో అత్యధిక సంఖ్యలో బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అంకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-02 15:58:20

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యసహాయకులు సూర్యకుమారి అన్నారు. గురువారం  శంఖవరం-6 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా కేంద్రం పరిధిలోని తల్లులకు, పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహనకల్పించడానికి మాసోత్సవాలు నిర్వహించడ వలన మంచిఫలితాలు వస్తాయన్నారు. గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు ఐసిడిఎస్ కేంద్రం నుంచి అందించే విలువైన సూచనలు సలహాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త నూకరత్నం, ఆశ కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-02 15:08:23

అర్హులైన పేదలందరికీ పక్కాఇళ్లు..

అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి సౌకర్యాన్ని కల్పిస్తామని జిల్లాకలెక్టర్  మల్లిఖార్జున తెలిపారు. గురువారం రోలుగుంట మండలం కొండ పాలెం గ్రామం లో నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ల కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి నిరుపేద కు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇళ్ళ నిర్మాణాలను కూడా చేపడుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. నిర్మాణ పనులు వేగవంతంగా చేయాల్సిందిగా లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య ,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. నాడు- నేడు కార్యక్రమానికి కోట్లాది రూపాయలను ఖర్చుచేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నదని,  తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించి,ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను  పుచ్చు కోవాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి సత్యవతి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇల్లులేని నిరుపేద మహిళలకు గృహ నిర్మాణాలను అందిస్తున్నారన్నారు.ఈ ఘనత ఆయన కొక్కరికే దక్కుతుందన్నారు.
            చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రోలుగుంట , కొండపాలెం గ్రామాలకు చెందిన  75 మంది అర్హులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. లబ్ధి దారులు,అధికారుల సమన్వయం తో  ఆరు నెలల్లో నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
          ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో ఆర్ గోవిందరావు, రోలుగుంట తాసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.

Rolugunta

2021-09-02 14:49:19

శంఖవరంలో ఉత్సాహంగా పౌష్టికాహార ర్యాలీ..

పౌష్టికాహారంపై అందరూ అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అంగన్వాడీ కార్యకర్త బుల్లెమ్మ అన్నారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని అంగన్వాడీ-2 కేంద్రం పరిధిలో పౌష్టికాహారా మాసోత్సవవాల సందర్భంగా  చిన్నారులతో కలిసి ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కేంద్రం పరిధిలో అవగాహన కల్పించారు. అనంతరం కార్యకర్త మాట్లాడుతూ, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. అదేవిధంగా కడుపులో పెరిగే పిల్లల ఎదుగుల చక్కగా వుంటుందన్నారు. అంతకుముందు చిన్నారులతో పౌష్టికాహారానికి సంబందించిన కూరగాయలు, పప్పు, పాలు, ఇతర దినుసుల పేర్లు చెబుతూ తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, చిన్నారులు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-09-02 14:38:51

పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలి..

గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు కడుపులో పెరిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుందని 104 డాక్టర్ ఎస్.ఎస్.రాజీవ్ కుమార్ అన్నారు. బుధవారం అన్నవరం-3 పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లల తల్లులంతా పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే బలవర్ధక ఆహారం తీసుకోవడంతోపాటు, నిత్యం, పాలు, ఆకుకూరలు, పప్పు, గ్రుడ్లు అధికంగా తీసుకోవాలన్నారు. ఏఏ ఆహారాల్లో పోషక విలువలు ఉంటాయో అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకర్తల ద్వారా తెలుసుకొని పాటించడం ద్వారా తల్లుల ఆరోగ్యంతోపాటు, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే బాలమ్రుతం పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Annavaram

2021-09-02 08:08:33

సాగర తీరాన్ని శుభ్రం చేసిన యువకులు..

విశాఖజిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రేవుపోలవరం తీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను గ్రామ యువకులు శుభ్రం చేశారు. బుధవారం తీరంలో ఫాస్టిక్ వ్యర్థాలు,మద్యం సీసాలు,వివిధ వ్యర్థాలను శ్రమదానం చేసి ఏరివేశారు. నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే తీరాన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఎంతైన ఉందని, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని యువకులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యాటక ప్రదేశాలను అభివ్రుద్ధి చేయడం ద్వారా జిల్లాకు మంచి పేరు వస్తుందన్నారు. అదేసమయంలో ఇలాంటి ప్రాంతాలన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని.. ప్రజాప్రతినిధులు స్పందించకపోతే యువతే తమ సొంత నిధులతో సముద్ర తీరాన్ని శుభ్రపరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతకాయల బంగ్రారాజు, యజ్జల బంగారు చిట్టి,దూడ నూకరాజు,చోడిపల్లి గజిని,గనగళ్ళ శ్రీను,సూరాడ ధనరాజు, గరికిన గోవిందు,చోడిపల్లి రాజు,చోడిపల్లి మహేంద్ర తదితరలు పాల్గొన్నారు.

ఎస్.రాయవరం

2021-09-02 05:41:53