1 ENS Live Breaking News

జర్నలిస్టులకు బాసటగా నిలిచిన కలెక్టర్..

మహావిశాఖలోని జర్నలిస్ట్ లు వారి కుటుంబ సభ్యులకు బూస్టర్ డోస్ కోవిడ్ టీకా ప్రక్రియను 2రోజుల పాటు నిర్వహించి సహకరించినందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఎ)  అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ తరపున జర్నలిస్టుల శ్రేయస్సు దృష్ట్యా తాను చేసిన వినతికి స్పందించిన కలెక్టర్ స్పందించి జేసీ అరుణ్ బాబు చే ప్రత్యేకంగా టీకా క్యాంపు ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు.  విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఎన్జీవో హోంలో  సోమవారం జర్నలిస్టులకు ప్రారంభించిన బూస్టర్ డోస్ టీకా ప్రత్యేక డ్రైవ్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా క్షేత్రంలో న్యూస్ కోసం తిరిగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బూస్టర్ డోస్ వేక్సినేషన్ ప్రత్యేకంగా జరపడం ప్రశంసనీయం అన్నారు.  సంబంధిత సిబ్బందిని 2 రోజుల పాటు కేటాయించి అందించిన సేవలకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఎ ) తరపున జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ అరుణ్ బాబు లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఎం.వి.ఎస్.అప్పారావు,ఉపాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్,పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-01 13:26:50

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లకు సత్కారం

మహా విశాఖ అభివృద్ధిలో జర్నలిస్టులు అందించిన సహకారం మరుపురానిదని నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, కమిషనర్‌ లక్ష్మీ శ కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా(ఎన్‌ఎజె) రెండో సారి నియమితులైన వైజాగ్‌ జర్నలిస్టుల ఫొరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబును సోమవారం నగర మేయర్‌, కమిషనర్‌లు ఘనంగా సన్మానించి సత్కరించారు. మేయర్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో  వీరు మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారం వల్లే విశాఖ నగరం అంతర్జాతీయ స్ధాయిలో అనేక పేరు ప్రతిష్టలు, అవార్డులు సాధించగలగిందన్నారు. 2007 నుంచి జీవీఎంసీ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఎన్నో సలహాలు, సూచనలు అందజేసి జీవీఎంసీ అభివృద్ధికి శ్రీనుబాబు ఎంతగానో కృషి చేశారని మేయర్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల మిత్రులు అందించిన సహకారం వల్లే తాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వరుసుగా రెండో సారి జాతీయ జర్నలిస్టుల సంఘం(ఎన్‌ఎజె) కార్యదర్శిగా నియమితులు కావడం జరిగిందన్నారు. తాను 2007 నుంచి నేటి వరకూ జీవీఎంసీకి సంబంధించిన అనేక కథనాలు రాయడంతో పాటు, నగరాభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. 1997 నుంచి నేటి వరకూ  తాను మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 8 జాతీయ స్ధాయి అవార్డులతో పాటు, మొత్తం 29 అవార్డులను సాధించి వాటిని జర్నలిస్టుల మిత్రులకే అంకితం చేసినట్లు చెప్పారు.భవిష్యత్‌లో కూడా  జర్నలిస్టుల  సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌, ప్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, కో-ఆప్షన్‌ సభ్యులు బెహరా భాస్కరరావు, అదనపు కమిషనర్‌ యాదగిరి శ్రీనివాసరావుతో పాటు, వైకాపా నాయకులు గొలగాని శ్రీనివాస్‌ పలువురు కార్పోరేటర్లు పాల్గొని శ్రీనుబాబును అభినందించారు.

Visakhapatnam

2022-01-31 07:14:28

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో పోరాటం..గంట్ల

దేశవ్యాప్తంగా జర్నలిస్టు ల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో పోరాటం సాగిస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం విశాఖలోని వైశాఖి జల ఉద్యానవనంలో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి  ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ,  జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. అయితే వీటిని పునరుద్ధరించాలని ఇప్పటికే తాము జాతీయ జర్నలిస్టుల సంఘం( ఎన్ ఏ జే) తరపున  పార్లమెంటు సబ్ కమిటీకి నివేదిక అందజేసినట్టు గుర్తుచేశారు. అవసరమైతే ఈ అంశాలపై న్యాయ పోరాటం సాగించాలని కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్నామన్నారు. ఎప్పటికప్పుడు దశలవారీగా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నామన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు సమస్య తో పాటు పెండింగ్  ప్రధాన సమస్యలు పరిష్కారమవుతాయని శ్రీను బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ అర్బన్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయన్  మాట్లాడుతూ, ప్రతి యేటా సభ్యత్వ నమోదు కార్యక్రమం క్రమం తప్పకుండా చేపడుతున్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సభ్యుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తమ యూనియన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు, ఏపీ బ్రాడ్ కాస్ట్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ,  ఇతర నేతలు ఎ.సాంబ శివ రావు, మధు,ఆనంద్, పి. నాగేశ్వర రావు, కృష్ణ వేణి, జయశ్రీ, తరుణ్ జ్యోతి, సుజాతా మూర్తి, తదితరలు తో పాటు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-29 07:52:14

హోంగార్డు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటాం..

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు  ఆర్.ఎస్.ఎస్ శివ కుటుంబానికి జిల్లా మెరైన్ హోంగార్డులు అందించిన తమ ఒక్క రోజు జీతం మొత్తం రూ.12,780/-ల చెక్కును వారి భార్య ఆర్. దేవికి అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కరణం కుమార్ అందజేశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,  ప్రభుత్వపరంగా మ్రుతి చెందిన కుటుంబ సభ్యులకు రావలసిన అన్ని రాయితీలు సత్వరం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యర్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-01-29 07:47:57

గ్రేటర్ కాకినాడను జిల్లాగా ప్రకటించాలి ..

కాకినాడజిల్లా ఏర్పాటు అభినందనీయమని.. అయితే తూర్పు గోదావరిజిల్లావిభజన వలన కాకినాడకు దక్కే అదనపు ప్రయోజనాలు ఏమీ లేవని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నా రు. కాకినాడను పూర్వా శ్రమంలో కాకనందివాడ  వంశీయులు పరిపాలిం చిన తరువాత ఫ్రెంచ్ డచ్ వారు ఇక్కడి ప్రాంతాన్ని కెనడా దేశం తో పోలుస్తూ కో-కెనడా గా కీర్తించి గౌరవించా రన్నారు. ఆంగ్ల పరిజ్ఞాన భాషకరువైన వాడుకలో కొందరు ప్రభుద్ధులుకోకనాడగా పిలిచారని
కాకినాడ ఎక్స్ ప్రెస్ కు  కోకనాడ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టడం జరిగిందని అన్నారు. ఆపేరు మార్చి కాకినాడ ఎక్స్ ప్రెస్ గా రూపాంతరం చేయాలని కోరారు. ప్రభుత్వం కాకినాడ జిల్లా విభజన తో సరిపెట్టరాదని జిల్లా కేంద్రం విస్తరించి గ్రేటర్ కాకినాడ గా వృద్ది చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ స్థాయి నుండి స్మార్ట్ సిటీ స్థాయికి అప్ గ్రేడ్ చేసినా154 ఏళ్లుగా కాకినాడ విస్తీర్ణం పెరగలేదని జిల్లా కేంద్రం నుండి జిల్లా ఏర్పాటు వరకు వచ్చిన కాకినాడ గ్రేటర్ గా మార్చకపోతే నేతి బీరకాయ చందం గానే వుంటుందన్నారు.

Kakinada

2022-01-27 10:29:39

సమాచారశాఖలో ఉత్తమ ఏపీఆర్వో గా కిషోర్ కి అవార్డు..

విశాఖజిల్లా సమాచారశాఖలో ఏపీఆర్వోగా పనిచేస్తున్న కిషోర్ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు వచ్చింది. విధినిర్వహణలో చురుకుదనం, జర్నలిస్టులకు సకాలంలో సేవలు అందించడం వెరస ఆయను జిల్లా అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ బేరక్స్ లో జరిగిన ఉత్సవాల్లో కిషోర్ కి ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టర్, జివిఎంసీ కమిషర్ డా.లక్ష్మీషాలు సంయుక్తంగా అందజేశారు. కిషోర్ కి ఉత్తమ అవార్డు రావడం పట్లు పలువురు జర్నలిస్టులు, సమాచారశాఖలోని సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు తీసుకోవాలని ఆకాంక్షించారు.

Visakhapatnam

2022-01-26 13:00:21

కేంద్రం జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాల్సిందే.. గంట్ల శ్రీనుబాబు

భారత దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం(ఎన్ ఎ జె)  తరఫున మరింతగా కృషి చేస్తామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. 2వసారి జాతీయ కార్యదర్శిగా నియమింపబడ్డ తరుణంలో శ్రీనుబాబును మంగళవారం'సింహాచలంకు చెందిన  పలు అసోసియేషన్ లు కు చెందిన యువత ఘనంగా సత్కరించింది. డాబాగార్డ్ న్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు మాట్లాడుతూ, తాను ఏ పదవిలో ఉన్నా ఎటువంటి లాభాపేక్ష లేకుండా యూనియన్లు కి అతీతముగా  జర్నలిస్టులందరికీ మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలను గుర్తించామని దశలవారీగా వాటిని పరిష్కరించేందుకు పార్లమెంట్ సబ్ కమిటీ కి కూడా నివేదిక ఇవ్వ ఇవ్వనున్నట్టు చెప్పారు. జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో సింహాచలం కి చెందిన అంబేద్కర్ కాలనీ అద్యక్షులు అప్పలరాజు,కార్యదర్శి.. చంటి, బంగారు బాబు, వంగలపూడి రమణ, శంకర్, చిట్టి,శివ.. తో పాటు లండ శ్రీను, దొంతల సంతోష్, గంట్ల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-25 09:51:35

22వ వార్డులో రోడ్లకు మరమ్మత్తులు.. కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్..

విశాఖలోని జివిఎంసీ 22వ వార్డులో గుంతలు పడిన రోడ్లకు మోక్షం కలిగింది. రూ.1.20 లక్షలతో శనివారం మరమ్మత్తు పనులు చేపట్టారు. 8నెలలు కిందట వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు 22వ వార్డులో రోడ్డులు మరమ్మత్తులకు రూ.లక్ష 20 వేలు మంజూరు చేయగా ఆ నిధులతో పిఠాపురం కాలనీ, పీతలవాని పాలెం, సిద్దార్థ నగర్, రేసపువానిపాలెం, మంగాపురం కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్డుల మరమ్మత్తులు చేశారు.  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దగ్గరుండి రోడ్డు పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయని జీవీఎంసీ కమిషనర్ దృష్టిలో పెట్టామన్నారు. ప్రస్తుతం రోడ్ల మరమ్మత్తులకు కేటాయించిన నిధులతో పనులు చేస్తున్నామన్నారు. వార్డు సమస్యలు పరిష్కారం చేయడానికి నిరంతరం పాటు పెడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ సత్యశ్రీ .సాయి వర్క్ ఇన్స్పెక్టర్, సచివాలయ ఎమినెట్స్ కార్యదర్సులు ప్రసాద్, హేమంత్, కార్తీక్, రవితేజ, తరుణ్, సత్యకళ, సుజాత, నాయకులు సత్యం, పెసల శ్రీను, వియ్యాపు రామకృష్ణ, రవి, దేవా పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-22 07:48:10

6613 మందికి కోవిడ్ బూస్టర్ డోసు టీకా పంపిణి..

తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఒక్కరోజే 6613మందికి కోవిడ్ బూస్టర్ డోసు కోవిడ్ టీకా అందించినట్టు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.భరతలక్ష్మి తెలియజేశారు. గురువారం కాకినాడలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ కోవిడ్ రెండవ డోసు టీకా 40447 మందికి అందిచామని పేర్కొన్నారు. జిల్లాలోని 64 మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, గ్రామ సచివాలయాల్లో ఆరోగ్య మిత్రాల ద్వారా కోవిడ్ టీకా వేస్తున్నట్టు ఆమె తెలియజేశారు. అదేవిధంగా 15-17 ఏళ్ల వయస్సు వన్నవారికి 390 మందికి కోవిడ్ టీకా వేసినట్టు చెప్పారు. జిల్లాలో కోవిడ్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నందున కోవిడ్ టీకా తీసుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకి రావాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.భరతలక్ష్మి మీడియా ద్వారా జిల్లా వాసులకు సూచించారు.

Kakinada

2022-01-20 17:04:13

అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి..

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి  జర్నలిస్టు వాటాగా రూ. 1250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250 లను చెల్లిస్తుందని కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి తెలియజేశారని విశాఖజిల్లా సమాచారశాఖ డిడి మణిరామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.  జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code: 8342 – 00 – 120 -01-03-001-001 VN, DDO Code : 2703 – 0802 – 003 నందు తమ వాటాను చెల్లించాల సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను విశాఖజిల్లా కేంద్రంలోని సమాచార, పౌరసంబంధాల శాఖ  కార్యాలయంలోనూ అందజేయవలసిందిగా ఆ ప్రకటనలో తెలియజేశారు. కొత్తగా అక్రిడిటేషన్ పొందినవారు  వారి కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తుల ఆధార్ కార్డు కాపీ, ఫొటోలు కూడా జతచేయాలని సూచించారు.

Visakhapatnam

2022-01-20 10:35:46

విశాఖలో 104 కాల్ సెంటర్లు నెంబర్లు ఇవే..

విశాఖజిల్లాలో కరోనా నేపథ్యంలో జిల్లా అధికారులు 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కోవిడ్ చికత్స, పరీక్షలు, సలహాలు, సంప్రదింపుల కోసం జిల్లావాసులు 104 కాల్ సెంటర్ లో 0891-2501271, 2501272  నెంబర్లలో సంప్రదించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఇక్కడ నోడల్ ఆఫీసర్ గా 9849112471 లో సంప్రదించవచ్చు. అదేవిధంగా  కోవిడ్ పరీక్షలు ఇంటి దగ్గరే చేయించుకోవాలనుకుంటే.. 8309150237, 8309875283లోనూ సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు.

Visakhapatnam

2022-01-20 08:44:52

హోం గార్డు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం..

హోంగార్డుల సంక్షేమం కోసం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారులో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎం.ఎన్. రెడ్డి కుటుంబానికి యాక్సిస్ బ్యాంకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు క్రింద వచ్చిన రూ.30 లక్షల చెక్కును గురువారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అందజేశారు. అంతేకాకుండా  జిల్లా హోంగార్డ్ ల ఒక్క రోజు జీతం మొత్తం Rs.2,10,160/- ల చెక్కును వారి భార్య  ఎం. సత్యవేణితోపాటు  జిల్లా హోంగార్డ్ యూనిట్ నందు విధులు నిర్వహిస్తూ మరణించిన హోంగార్డ్  పి. శ్రీనివాస్ నకు జిల్లా హోంగార్డ్ ల ఒక్క రోజు జీతం మొత్తం Rs.2,12,290/- ల చెక్కును అతని భార్య  పి. శ్రీదేవికి అందజేశారు. ఈ దర్బారు సందర్భంగా 2021 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మరియు SSC లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 19 మంది జిల్లా హోంగార్డ్ ల పిల్లలకు Rs. 35,500/- ల మెరిట్ స్కాలర్షిప్ లను అందించి, విద్యార్ధినీ విద్యార్ధులకు వారి భవిషత్తు ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి అనే దానిపై దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,  హోంగార్డులు వారి విధి నిర్వహణలో ఎదుర్కొనే సమస్యలు విని పోలీసు శాఖ ద్వారా వారికి రావలసిన రాయితీలను వెనువెంటనే అందేలా సంబంధిత విభాగ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎం.ఎన్. రెడ్డి , హోంగార్డ్ పి. శ్రీనివాస్ కుటుంబాలకు డిపార్టుమెంట్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వపరంగా కుటుంబ సభ్యులకు రావలసిన అన్ని రాయితీలు సత్వరం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఎస్బీ డిఎస్పీ అంబికా ప్రసాద్,  ఐటీ కోర్ ఇన్స్పెక్టర్  పి.రామచంద్రరావు,  పిసిఆర్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రామకోటేశ్వర రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్  జెవిరమణ, హోంగార్డ్  ఆర్ఐ .శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు..

కాకికానాడ రూరల్

2022-01-20 07:29:07

జివిఎంసీ 22వ వార్డులో ఆధార్ సేవలు ప్రారంభం..

మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియం వార్డు కార్యాలయం మేడ పైన ఉన్న 149 సచివాలయంలో  గురువారం ఆధార్ సేవలను  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఆధార్ సేవలు అందించడానికి 149వ నెంబరు సచివాలయంలో ఆధార్ కేంద్రం మంజూరయిందని చెప్పారు. ఈ కేంద్రంలో ఆధార్ కార్డు లోని పేర్లు, చిరునామా, తప్పు ఒప్పులు సరిచేయడంతోపాటు, కొత్త ఆధార్ కార్డులు, కార్డుల్లో ఫోన్ నంబర్ నమోదు వంటి సేవలు ఉంటాయన్నారు. వార్డు ప్రజలు ఆధార్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ శ్రీలక్ష్మీ, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ కార్యదర్శి హరిత, భారతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-20 07:03:20