1 ENS Live Breaking News

ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో లబ్ధిదారునికి ఇసుక చేరాలన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇసుకపై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో ఆయన సమీక్షించారు.  ప్రజలకు, ప్రభుత్వ అవసరాలకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రీచ్ లను గుర్తించి ఇసుక తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు.   నదీ పరీవాహక కొన్ని ప్రాంతాల్లో సందర్శించాలని మైన్స్ డిడిని ఆదేశించారు. శాంతినగర్ వద్ద నిర్మాణం జరుగుతున్న డైక్ పనులు వద్ద ఇసుక తరలించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు లేఖ పెట్టాలన్నారు.   గృహ నిర్మాణానికి అవసరమైన స్టాక్ పాయింట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రణస్థలం, రాజాం ప్రాంతంల్లో ఎక్కడా ఇసుక స్టాక్ పాయింట్ లేదని, అక్కడ అవసరమైన భూమి అందుబాటులో లేకపోతే లే ఔట్లను వినియోగించుకోవాలని చెప్పారు. డిశంబరు 1వ తేదీ నాటికి ఇసుకను స్టాక్ పాయింట్ ల వద్ద నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు.   ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని జయ ప్రకాష్ పవర్ వెంచర్స్ జిల్లా ఇన్చార్జి రాజేష్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో డిడి మైన్స్ సిహెచ్ సూర్య చంద్రరావు, ఎడి బాలాజి నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ బి, ఆర్ అండ్ బి ఎస్ఇ కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్ ఇ, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-24 08:03:07

మెరిట్ జాబితా రేపు ఆన్ లైన్ లో ప్రకటన.. డిఎంహెచ్ఓ

తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ క్రింద అర్బన్ పీహెచ్సీల్లో నియమించే వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ అభ్యర్ధుల జాబితా రేపు తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఈమేరకు మంగళవారం కాకినాడ లో జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్ధులు జాబితా ఆధారంగా ఒరిజిన్ సర్టిఫికేట్లతో నిర్ధేశించిన తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన సూచించారు. ఇందులో స్టాఫ్ నర్సులు 35, మెడికల్ ఆఫీసర్లు 40, ల్యాబ్ టెక్నీషియన్-1, హాస్పటిల్ అటెండెంట్-3, శానటరీ అటెండ్-3, కన్సల్టెంట్ క్వాలిటీ మెంటర్ పోస్టు ఒకటి ఉన్నదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.

Kakinada

2021-11-23 16:20:45

సమాజసేవే సత్య సాయిబాబా లక్ష్యం..

ప్రపంచ దేశాలలో లక్షలాదిమంది హృదయాలలో పిలిస్తే పలికే దైవం గా నిలిచిన సత్య సాయి బాబా తుది శ్వాస వరకు సమాజసేవే తన ఊపిరిగా సేవలు అందించారని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ  సర్పవరం జంక్షన్ లో  బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సత్య సాయి బాబా 96 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  పట్నాయక్ మాట్లాడుతూ 1926 నవంబర్ 23న సత్య సాయిబాబా  జన్మించారని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి విద్య, వైద్య, తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వీరభద్రరాజు మాట్లాడుతూ మతాలు, కులాలు,  ప్రాంతాలు,  వర్గాలు, దేశాల కతీతంగా సాయి భక్తులు సేవా మార్గంలో  పయనిస్తున్నారన్నారు. భక్తుల మనస్సుల్లో సానుకూల దృక్పథం తీసుకురావడం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి సత్య సాయి బాబా బాటలు వేశారని కొనియాడారు. అనంతరం  వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ ,బాపిరాజు, రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-23 07:53:33

వాహన దారుల పట్ల జిల్లా ఎస్పీ దాత్రుత్వం..

ఐపీఎస్ అధికారులంటే కేవలం కింది స్థాయి అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణ కేసుల విధించే విషయంలో ఆదేశాలు జారీచేయడం చూసిన వాహనదారులకు..అదే ఐపీఎస్ అధికారులు తలచుకుంటే అదే వాహన దారుల ఇబ్బందులను కూడా అదే స్థాయిలో పట్టించుకోవడం తూర్పుగోదావరి జిల్లాలో కళ్లకి కట్టినట్టు కనిపించింది. అవును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డు చిద్రమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటం మీడయా కధనాల ద్వారా తెలుసుకుని అక్కడి పోలీసు సిబ్బంది ఈ విషయం తెలియజేశారు. దీనితో రామచంద్రాపురం డిఎస్పీ పర్యవేక్షణలో సిఐ ఎన్వీ భాస్కర్ అనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డుతో పాటు ఇంకొన్ని రోడ్లపై పడ్డ గుంతలను తన సిబ్బందితో క్వారీ రాయి గుండతో కప్పించారు. ఈ పనికి పోలీస్ సిబ్బంది శ్రమధానంతో ఇదంతా చేపట్టారు. మనసున్న అధికారి ఇలాంటి సేవచేసే పనులు అప్పగిస్తే పోలీసు సిబ్బంది అంతే నిబద్ధతో ఏ విధంగా చేస్తారో ఈ శ్రమధానంతో నిరూపితమైంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అదే ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నా చూస్తూ ఊరుకోరని తూర్పుగోదావరి జిల్లా పోలీసు నిరూపించి, గుంతలు పడిన రోడ్డును బాగుచేసి చూపించారు. ఖాకీలు చేసిన ఈ సేవకు వాహనదారులు ఫిదా అవుతున్నారు. ఈ అంశం ఇపుడు జిల్లాలోనే చర్చనీయాంశం అవుతుంది.

Kakinada

2021-11-23 02:56:11

కకనకదాసు చూపిన జ్ఞాన మార్గంలో నడవాలి-జిల్లా కలెక్టర్

భక్త కనకదాసు వెనుకబడిన కులం లో, కడు పేద కుటుంబం లో జన్మించిమప్పటికి గొప్ప తత్వ వేత్తగా ఎదిగిన  వ్యక్తి యని ఆయన చూపిన జ్ఞాన మార్గం లో అందరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో భక్త కనక దాసు జయంతిని ఘనంగా నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు  లు  తొలుత జ్యోతిని వెలిగించి    కనక దాసు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కన్నడ భాష లో అనేక కీర్తనలను రచించిన కనక దాసు  గొప్ప భక్తుడు,  ఆధునిక కవి, తత్వ వేత్త, సంగీత కళాకారుడని కలెక్టర్ పేర్కొన్నారు. వందేళ్లు జీవితాన్ని గడిపిన  వ్యక్తి అసలు కులమనేదే లేదనే తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారని తెలిపారు. తక్కువ కులం లో పుట్టారని కృష్ణుని ఆలయం లోనికి పూజారులు ప్రవేశించ నీయలేదని, ఆయన భక్తికి  తార్కాణం గా  కృషునిని దర్శన భాగ్యం లభించిందని, అంతటి భక్తి పరాయనత గలా వారని పేర్కొన్నారు. నిజాయితీ గా వ్యవరించే వారికి ఎప్పటికైనా మంచే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ. పి.డి డా. అశోక్ కుమార్, పశు సంవర్ధక శాఖ జె.డి డా.రమణ, మెప్మా పిడి సుధాకర్, డిడి ఫిషరీస్ నిర్మలా కుమారి, సమగ్ర శిక్షా పి.డి స్వామి నాయుడు,  బి.సి సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భ0గా  కనక దాసు రచించిన కన్నడ  కీర్తన ను మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు హృద్యంగా ఆలపించారు.

Vizianagaram

2021-11-22 14:22:48

సోమవారం స్పందన రద్దు.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్

తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవరం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలోని జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సోమవారం స్పందన ఉందనుకొని జిల్లా కార్యాలయానికి వచ్చేవారు స్పందన రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రేపు నిర్వహించే స్పందన రద్దు చేస్తున్నామని తదుపరి స్పందన యధాతధంగా కొనసాగుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు నేరుగా కలెక్టర్ కార్యాలయానికి రాకుండా తొలుత గ్రామసచివాలయాల్లో  స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే  మాత్రమే జిల్లా కలెక్టర్  కార్యాలయానికి  సమస్య పరిష్కారం కోసం రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Kakinada

2021-11-21 15:32:32

పోషకాల గని కోడి గుడ్డు.. బాలల సంక్షేమ అధికారి వెంకట్రావు..

కోడిగుడ్డులో అధిక పోషకాలు ఉన్నందున ప్రభుత్వం కూడా అంగన్వాడి కేంద్రాల ద్వారా బాలలకు పోషకాహారంగా అందిస్తుందని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్. వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలోని  సర్పవరం జంక్షన్ లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు పంపిణీ చేపట్టారు. వెంకటరావు మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా ప్రభుత్వం రోజూ కోడిగుడ్డు ఇస్తుందని తెలియజేశారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, కోడి గుడ్డు లో ఆరు గ్రాముల ప్రోటీన్లు, 14 రకాల పోషక పదార్థాలు ఉన్నాయన్నారు.  అందుచే ప్రతి ఒక్కరు  రోజుకొక గుడ్డును ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి అవినాష్ రెడ్డి,  న్యాయవాది యనమల రామం,  సంఘం నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-21 13:34:35

ఉత్సాహంగా భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు..

కాకినాడ విశ్వహిందూ పరిషత్  ఆధ్వర్యంలో ఆదివారం  జగన్నాదపురం సామా పబ్లిక్ స్కూల్ మరియు గాంధీనగరం మునిసిపల్ హైస్కూల్ లోను  ప్రఖండస్తాయి భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించినట్టు  జిల్లా ప్రముఖ్ లు గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం పై జరిగిన ఈ పోటీలలో రెండుచోట్ల 150మంది  పోటీదారులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాలకు ఎంపిక చేయబడ్డవారిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు వివరించారు. న్యాయ నిర్ణేతలుగా  దుర్గాప్రసాద్, బి.శ్యాంసుందర్, డా.రమాదేవి, శ్రీమన్నారు, రవి వర్మ, మంగామని లు వ్యవహరించారని చెప్పారు. కార్యక్రమంలో  ఆర్.రవిశంకర్ పట్నాయక్, సహకార్యదర్శి ఉదయ్ భానోజి, ప్రఖండ ఇంచార్జ్ లు బచ్చు మహాలక్ష్మి, శ్రీకృష్ణ వాణి,ఈమని పరమేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-21 13:31:03

ప్రాణిక్ హీలింగ్ తో అద్భుత ఫలితాలు..

ప్రాణశక్తికి కేంద్రాలుగా ఉన్న ఏడు చక్రాలలో శక్తి ప్రసరణలో అంతరాయం కలిగితేనే రోగాలు వస్తాయని వాటిని ప్రాణిక్ హీలింగ్ చికిత్సతో నివారించవచ్చని ప్రముఖ వైద్య నిపుణురాలు ఎం.వరలక్ష్మి  చెప్పారు. ఆదివారం కాకినాడలోని  సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాణిక్ హీలింగ్ అనేది వ్యాధులను నయం చేసే ఒక ప్రాచీన  శాస్త్రీయ వైద్య విధానమని తెలియజేశారు. రోగి శరీరం యొక్క జీవధాతు పదార్థాలన్నీ ప్రాణశక్తిని సరి చేస్తాయని పేర్కొన్నారు. శరీరాన్ని సజీవంగా, ఆరోగ్యవంతంగా ఉంచే జీవ శక్తి లేదా ప్రాణాధార శక్తి ప్రాణశక్తి  అని గుర్తు చేశారు. ప్రాణా లేదా జీవనాధార శ్వాసను రోగి శరీరంలోకి ప్రసరింపజేయడంతో రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుందని వరలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-21 13:27:34

సైక్లింగ్ తో ఆరోగ్యం..స్వప్నిల్ దినకర్ పుండ్కర్..

ప్రతినిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలో గోదావరి సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ నగరాన్ని సైకిల్  ఫ్రెండ్లీ నగరంగా మార్చేందుకు సైక్లింగ్ ట్రాక్లను విస్తరించనున్నామని, నగర వాసులు  ఈ ట్రాక్లను సైక్లింగ్కు వాడుకోవడం ద్వారా తగిన వ్యాయామం జరిగే పలు ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు అని తెలియజేశారు. కాకినాడ నగరం సైకిల్ ఫర్ చేంజ్  ఛాలెంజ్ కు ఎంపికైన సందర్భంగా ప్రతీ ఒక్కరూ సైక్లింగ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  భావితరాల వారికి కాలుష్య రహిత వాతావరణం అందించేందుకు ఈ సైకిల్  ట్రాక్లు ఎంతో దోహదపడతాయన్నారు. కనుక నగర వాసులంతా ఉత్సాహంగా సైక్లింగ్ లో పాల్గొనాలని చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ సిటీ

2021-11-21 12:52:35

విశాఖలో రేపటి స్పందన కార్యక్రమం రద్దు..

విశాఖజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు. సోమవారం స్పందన ఉందనుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేవారు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రేపు నిర్వహించే స్పందన రద్దు చేసి, తరువాత ఎప్పటి నుంచి స్పందన నిర్వహిస్తామో ముందుగానే తెలియజేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా తొలుత గ్రామసచివాలయాల్లో స్పందను సద్వినియోగం చేసుకొని..అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు మాత్రమే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Visakhapatnam

2021-11-21 12:01:10

విద్యా ప్రమాణాలు మరింతగా పెంచాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు.  శనివారం వి ఎం ఆర్ డి ఎ చిల్డ్రన్ ఎరీనా లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి వారి తెలివితేటలు మూర్తిమత్వాన్ని బట్టి వారు అభివృద్ధి సాధించే రంగాల కు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. పదవ తరగతి లో శత శాతం ఉత్తీర్ణత  సాధించాలన్నారు.  ప్రభుత్వం విద్యారంగానికి అనేక రాయితీలను కల్పిస్తుందని పేద విద్యార్థుల అభివృద్ధికి జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి పథకాలను ప్రవేశపెట్టారని వీటిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.  ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలన్నారు. మీ దగ్గర చదువుకున్న వారు ఉన్నత పదవులను అలంకరిస్తే ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి అన్నారు. పిల్లలకు మంచి అలవాట్లు ఆరోగ్య సూత్రాలు సమాజం పట్ల అవగాహన పెంపొందించాలి అన్నారు జె వి కె కిట్లు అందరికీ అందేటట్లు చూడాలన్నారు. 

జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్ చంద్రకళ మాట్లాడుతూ పాఠశాలలకు మంచి వాతావరణం కల్పించాలని, గదులు పరిసరాలు మరుగుదొడ్ల తో సహా అన్నీ పరిశుభ్రంగా  ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నాడు నేడు పనులను వేగంగా పూర్తి అయ్యే విధంగా సహకరించాలన్నారు. పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకు తగిన బాటలు వేయాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతి కుమారి జీవీఎంసీ డిప్యూటీ డి ఈ ఓ శ్రీనివాస్  రామరాజు డైట్ ప్రిన్సిపాల్  మాణిక్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-11-20 13:34:28

ఓటరు నమోదు పక్కాగా నిర్వహించాలి..

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు నమోదు పక్కాగా ఉండాలని సంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీత బూత్ స్థాయి అధికారులకు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి 2022 నాటికి 18 సంవత్సరములు నిండబోవు లేదా నిండిన వారందరికీ తప్పకుండా ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. మొబైల్ అప్లికేషన్ లేదా ఆన్ లైన్ ద్వారా కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే చిరునామా మార్పుకు, ఓటరు కార్డు సవరణకు కూడా అవకాశమున్న సంగతిని ఓటర్లకు వివరించాలని ఆమె పేర్కొన్నారు. ఓటరు సేవలు ఇప్పుడు మరింత చేరువలోకి వచ్చయన్న సంగతిని ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన డోల మోనిక, తల్లి మహాలక్ష్మిలతో జె.సి ముచ్చటిస్తూ ఓటరు నమోదు గురించి ఏ విధంగా తెలిసింది అని ఆరాతీయగా, వాలంటీరు ద్వారా తెలిసినట్లు చెప్పడంతో జె.సి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమ్మరీ రివిజన్ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని, దీన్ని అవసరమైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.వెంకటరావు, ఉప తహసీల్దార్ ఎస్.సతీష్, బూత్ స్థాయి అధికారులు డి.వరలక్ష్మి, జి.లత, వి.హరీష్ కుమార్, చైతన్య, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-20 11:43:16

పోలీసులకు ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ అందజేత..

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖకు “ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్”ను  సిద్ధాంతం మరియు దివాన్ చెరువు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఎస్పీ కార్యాలయంలో అందజేశాయి. ఈ సందర్బంగా శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం కిట్లను ఎస్పీ రవీంధ్రబాబుకి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు సేవలు అందించే పోలీసుల కోసం ఆలోచించి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.  ట్రాఫిక్ పోలీసులు వేసుకునే రిఫ్లక్టివ్ జాకిట్లు 410, రిఫ్లక్టివ్ టేప్స్ 80 మీటర్లు, కాషన్ టేప్స్ 70రోల్స్, 35 ఫస్ట్ ఎయిడ్ కిట్స్, 35 బోటమ్ లైట్స్, 35 మంచినీటి కూలర్లు, 35 ఎల్ఈడీ టార్చిలైట్లు, 15 మెగా ఫోన్లు అందజేశారు. తమ సంస్థ సిఎస్ఆర్ సేవ కింద వీటిని అందజేసినట్టు నిర్వాహకులు అనిల్ బొమ్మిశెట్టి, తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-11-19 15:46:25