హోంగార్డుల సంక్షేమం కోసం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారులో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎం.ఎన్. రెడ్డి కుటుంబానికి యాక్సిస్ బ్యాంకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు క్రింద వచ్చిన రూ.30 లక్షల చెక్కును గురువారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అందజేశారు. అంతేకాకుండా జిల్లా హోంగార్డ్ ల ఒక్క రోజు జీతం మొత్తం Rs.2,10,160/- ల చెక్కును వారి భార్య ఎం. సత్యవేణితోపాటు జిల్లా హోంగార్డ్ యూనిట్ నందు విధులు నిర్వహిస్తూ మరణించిన హోంగార్డ్ పి. శ్రీనివాస్ నకు జిల్లా హోంగార్డ్ ల ఒక్క రోజు జీతం మొత్తం Rs.2,12,290/- ల చెక్కును అతని భార్య పి. శ్రీదేవికి అందజేశారు. ఈ దర్బారు సందర్భంగా 2021 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మరియు SSC లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 19 మంది జిల్లా హోంగార్డ్ ల పిల్లలకు Rs. 35,500/- ల మెరిట్ స్కాలర్షిప్ లను అందించి, విద్యార్ధినీ విద్యార్ధులకు వారి భవిషత్తు ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి అనే దానిపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ, హోంగార్డులు వారి విధి నిర్వహణలో ఎదుర్కొనే సమస్యలు విని పోలీసు శాఖ ద్వారా వారికి రావలసిన రాయితీలను వెనువెంటనే అందేలా సంబంధిత విభాగ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎం.ఎన్. రెడ్డి , హోంగార్డ్ పి. శ్రీనివాస్ కుటుంబాలకు డిపార్టుమెంట్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వపరంగా కుటుంబ సభ్యులకు రావలసిన అన్ని రాయితీలు సత్వరం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ అంబికా ప్రసాద్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ పి.రామచంద్రరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రామకోటేశ్వర రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ జెవిరమణ, హోంగార్డ్ ఆర్ఐ .శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు..