1 ENS Live Breaking News

ఓటిఎస్ క్రింద రూ.10 కోట్లు వసూలు.. జిల్లా కలెక్టర్

జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  9,600 మంది వినియోగించుకున్నార‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి తెలిపారు. ఈ ప‌థ‌కం క్రింద సుమారు రూ.10కోట్లు వ‌సూల‌య్యింద‌ని అన్నారు. వీరంద‌రికి రెండు రోజుల్లో రిజిష్ట్రేష‌న్లు పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కంపై టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ప్ర‌తీ ల‌బ్దిదారుడికి రిజిష్ట్రేష‌న్ చేసేందుకు మూడు సెట్ల రిజిష్ట్రేష‌న్ ప‌త్రాలు వ‌స్తాయ‌ని, ఇలా ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాకు 2,800 సెట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు. జిల్లాలో ఇంత‌వ‌ర‌కు 130 రిజిష్ట్రేష‌న్లు జ‌రిగాయ‌ని, మిగిలిన‌వారికి కూడా రెండు రోజుల్లో రిజిష్ట్రేష‌న్ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మూడు సెట్ల‌లో ఒక‌టి ల‌బ్దిదారునికి ఇస్తార‌ని, ఒక‌టి స‌చివాల‌యంలో, మ‌రొక‌టి స‌బ్ రిజిష్ట్రార్ వ‌ద్దా ఉంటుంద‌ని తెలిపారు. తాశీల్దార్ విక్ర‌య‌దారునిగా, ల‌బ్దిదారుడు కొనుగోలుదారుడిగా ఈ రిజిష్ట్రేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.


2000-2004 సంవ‌త్స‌రాల మ‌ధ్య అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఒన్‌టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కాన్ని వినియోగించుకున్న‌వారికి, ప్ర‌స్తుతం కేవ‌లం రూ.10కే రిజిష్ట్రేష‌న్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. అప్ప‌ట్లో డ‌బ్బు చెల్లించిన‌వారికి, నో డ్యూస్ స‌ర్టిఫికేట్‌ను మాత్ర‌మే అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు.  అటువంటి వారికి కూడా ఇప్పుడు రిజిష్ట్రేష‌న్ల‌ను జ‌ర‌పాల‌ని ఆదేశించారు. దీనికోసం ల‌బ్దిదారులు త‌మ పాసుపుస్త‌కం లేదా నో డ్యూస్ స‌ర్టిఫికేట్ల‌ను తీసుకురావాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్) మ‌యూర్ అశోక్‌, హౌసింగ్ పిడి కూర్మినాయుడు, జిల్లా రిజిష్ట్రార్‌, తాశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-12-16 07:04:44

కాకినాడ జిజిహెచ్ కు ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ యూనిట్..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలోని కాకినాడ జిజిహెచ్ కు అధునాతన ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ యూనిట్ రాబోతుంది. ఈ మేరకు సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆరోగ్యశాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒకప్పుడు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ యూనిట్లు కాకినాడ జిజిహెచ్ కు మంజూరు కావడంతో నిరుపేద రోగులకు కార్పోరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందే అవకాశాలున్నాయి. ఎంఆర్ఐ యూనిట్ కాకినాడకు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

Kakinada

2021-12-13 17:16:47

"సంపూర్ణ గృహ హక్కు" రిజిస్ట్రేషన్లు వేగం పెంచాలి..

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు కల్పించే రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  డా. ఏ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని అన్ని మండలాల, తాహసిల్దార్ లు, ఎంపీడీవోలు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ లతో ఈ విషయమై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంపూర్ణ గృహ హక్కు పట్టాలను కలిగి ఉన్నట్లయితే చేకూరే లాభాలను లబ్ధిదారులకు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన   అవకాశం వినియోగించుకో 
వాలన్నారు.  రిజిస్ట్రేషన్ చేసే  విధివిధానాలను గూర్చి జిల్లా రిజిస్ట్రార్ అధికారులకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొనగా కలెక్టర్ కార్యాలయం నుండి జెసి  ఎం.వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ జెసి కల్పనా కుమారి, గృహ నిర్మాణ శాఖ పి డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రంగయ్య, జడ్పీ సీఈఓ నాగార్జునసాగర్, వివిధ మండలాల గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-13 11:51:24

సైనిక కుటుంబాల సంక్షేమానికి విరాళాలు అందించండి..

దేశ రక్షణలో అమరులైన, క్షతగాత్రులైన సైనిక మరియు మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాలని పౌరులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ విజ్ఞప్తి చేసారు. సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా మంగళవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ తమ తొలి విరాళాన్ని అందించి సాయుధ దళాల పతాక దినోత్స వేడుకలను లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణ కొరకు అహర్నిషలు శ్రమించి ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. దానికొరకు పతాక నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా ప్రజలను, పారిశ్రామిక, వ్యాపారవేత్తలను కోరారు. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లుగా సైనిక కుటుంబాల సంక్షేమానికి విరాళాలు అందలేదని, ఈ ఏడాదిలో అందరూ విరివిగా విరాళాలు అందించి సైనిక కుటుంబాల సంక్షేమానికి కృషిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పతాక నిధికి విరాళాలు అందించేవారు డైరెక్టరు, సైనిక సంక్షేమ శాఖ, విజయవాడ వారి అకౌంట్ నెం.33881128795కు నేరుగా జమ చేయాలని లేదా జిల్లా సైనిక సంక్షేమాధికారి, శ్రీకాకుళం పేరున చెక్కు డ్రాఫ్టును తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, పెద్ద రెల్లి వీధి, శ్రీకాకుళం వారికి పంపవలసినదిగా కోరారు.  పతాక నిధికి మీరు అందిచే విరాళాలకు  ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుందని తెలిపారు. అనంతరం స్థానిక పెద్ద రెల్లి వీధిలోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయములో పతాక దినోత్సవ వేడుకలను జిల్లా సైనిక సంక్షేమాధికారి జి. సత్యానందం ప్రారంబించారు. ఈ కార్యక్రమములో మాజీ సైనిక సంఘం సభ్యులు, గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, సుబేధర్ సూర్యనారాయణ, హవల్దార్ రవికుమార్ మరియు యన్.సి.సి. ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆదినాయణ మరియు జిల్లా సైనిక సంక్షేమ కార్యలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-12-07 07:43:45

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి కి గంట్ల పూజలు..

ఆధ్యాత్మిక భక్తిభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సింహాచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం  శ్రీనుబాబు మార్గశిరమాస ఏర్పాట్లును పరిశీలించి ఆలయ సిబ్బందిని ప్రసంశించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్న నేపథ్యంలో ఆలయ వర్గాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. తొలి గురువారం సందర్భంగా పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు సేవలందించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Visakhapatnam

2021-12-06 17:00:19

వైభవంగా అయ్యప్పస్వామి అంబలం పూజ..

కార్తీక మాసం మొదలుకొని 45 రోజులపాటు అయ్యప్పలు ఎన్నో నియమాలతో స్వామీ దీక్ష పూర్తిచేస్తారని ఆ సమయంలో ఒక్కసారైనా అయ్యప్పలు అంబలం పూజనిర్వహించుకొని స్వామి కటాక్షాలు పొందుతారని సింహాచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం అన్నారు. ఎంతో దీక్షతో ఎన్నో నియమాలతో విశాఖలోని కంచరపాలెం ధర్మానగర్‌ ప్రాంతంలో మళ్ల కిరణ్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలం పూజలో గంట్ల శ్రీనుబాబు పాల్గొని అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల ధారణలో అయ్యప్పమాలకు విశేష గౌరవం వున్నదన్నారు. అలాంటి స్వాముల సమూహంలో జరుగుతున్న అంబలం పూజలో పాల్గొనడం ఆ అయ్యప్ప కరుణగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అప్పలనాయుడు, సత్తిబాబు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-06 16:58:41

డా.బీ.ఆర్.అంబేద్కర్‌కు గంట్ల ఘన నివాళి..

భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సేవలను జాతి ఎప్పుడూ మరిచి పోదని,  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం డా.బీఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా డాబాగార్డెన్స్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లిర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, అంబేత్కర్ రచించిన భారత రాజ్యంగం  బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకం అయ్యిందన్నారు. భారత దేశానికి అంబేద్కర్‌ అందించిన సేవలు మరపు రానివని అన్నారు. అంభేత్కర్ ఆశయాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని గంట్లశ్రీనుబాబు సూచించారు.

Visakhapatnam

2021-12-06 16:57:21

11 మందికి కారుణ్య నియామకాల్లో పోస్టింగ్లు..

విశాఖజిల్లాలో వివిధ శాఖలలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలక్టర్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు.  సోమవారం కలెక్టరు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నియామక ఉత్తర్వులను సంబంధిత అభ్యర్ధులకు అందజేశారు.  వీరిలో 5గురికి గ్రామ రెవెన్యూ అధికారులు (వి.ఆర్.ఓ)లుగా మరో 6 గురికి వివిధ శాఖలకు కేటాయించారు. కలెక్టరు కార్యాలయం, సమాచార శాఖ డి.డి. కార్యాలయం,  నర్సీపట్నం ఆర్.డి.వో. కార్యాలయం,  పబ్లిక్ హెల్త్, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు ఒక్కొక్కరిని ఆఫీస్ సబార్డినేట్ లను కేటాయించారు.                   

Visakhapatnam

2021-12-06 12:41:47

సేంద్రియ రైతులకు జీవీఎంసీ నుంచి అన్ని విధాల సహకారం..

విశాఖ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు మహా విశాఖ నగర పాలక సంస్థ నుంచి ఏ రకమైన సహాయం చేయాలో ఆలోచించి కార్యాచరణతో ముందుకు వస్తానని నగర పాలక సంస్థ  కమిషనర్ లక్ష్మీ షా హామీ ఇచ్చారు. ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న స్థానిక రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి  వారి మార్కెటింగ్ మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆర్గానిక్ మేళా ను సందర్శించిన ఆయన అరగంట సేపు అన్ని  షాపులను సందర్శించి  ఏ ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు. 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కండువా కప్పి ఆయనకు స్వాగతం పలికారు. మేళాలో ఉత్తమ స్టాల్ గా ఎంపికైన సెంట్రల్ జైలు దుకాణం  సిబ్బందికి ఆయన జ్ఞాపికను అందజేశారు. ఇంత పెద్ద ఎత్తున వైవిధ్యభరితమైన ఉత్పత్తులతో సేంద్రీయ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మేళా కమిటీ  కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి , జే వీ రత్నం, కన్వీనర్ జలగం కుమారస్వామి, జి ఎస్ ఎన్  రాజు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-05 15:45:46

సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు ఇవ్వండి..

సాయుధ‌ దళాల పతాక నిధికి ప్ర‌జ‌లంతా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీన సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా,  మన జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు క‌లెక్ట‌ర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాలను దేశం ఎన్న‌డూ విస్మ‌రించ‌జాల‌ద‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.  పాకిస్తాన్, చైనా  యుద్ద సమయాలలోను, కార్గిల్ పోరాటంలో, ముంబాయి తాజ్ హోటల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను మన సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు, జాతి యావత్తు గర్విస్తోంద‌ని తెలిపారు. ఎంతో మంది సైనిక సహోదరులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించార‌ని, వారికి మనమందరం ఎంతగానో ఋణపడి ఉన్నామని పేర్కొన్నారు. ఆ సాహసోపేత వీర జవాన్ల‌కు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు, సాయుద దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
         ఈ ప‌ర్వ‌దినం సందర్భంగా పతాక నిధికి విరివిగా విరాళాలను అందించాల‌ని, జిల్లాలోని పౌరులకు, వ్యాపారస్తుల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కు విజ్జప్తి చేశారు. విరాళాలను జిల్లా సైనిక సంక్షేమ అధికారి, విజయనగరం వారి పేరుమీద‌, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబరు 52065221666, IFSC CODE; SBIN0020931, MICR NO.535002017 నందు గాని డైరెక్టర్, సైనిక వెల్ఫేర్, విజయవాడ పేరున చెక్కు / డ్రాఫ్ట్ తీసి జిల్లా సైనిక సంక్షేమ  కార్యాలయం, విజయనగరం వారికి పంపించాల‌ని సూచించారు.  సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా ఈనెల 7వ తేదీన‌, యన్‌.సి.సి. విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వచ్చి విరాళాలు సేకరిస్తార‌ని, వారికి  విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమానికి త‌మవంతుగా స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరారు.  పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్నురాయితీ లభిస్తుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Vizianagaram

2021-12-05 13:46:37

సింహగిరిపై వరుస పండుగలు,భారీ ఏర్పాట్లు.. ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు

ఉత్తరాంధ్రాజిల్లాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని సింహగిరిపై వరుస పండుగుల తాకిడి నెలకొనబోతుంది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా అదేస్ధాయిలో ఐదు రోజుల పాటు  సింహచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి తరలిరానున్నారు. ఈ మేరకు శనివారం సింహచలం దేవస్దానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు సింహాద్రినాథుడు, క్షేత్రపాలకుడైన త్రిపురాంతక స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలం తరువాత సంక్రాంతితో కలిపి ఈ ఏడాది అప్పన్న ఉత్తరద్వార దర్శనం భక్తులకు లభించనుందన్నారు. ఆరోజున ఉత్తర ద్వారంలో కొలువున్న అప్పన్నను దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో కొలువున్న శ్రీమన్నారాయణనుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుందన్నది అప్పన్న భక్తకోటి ప్రగాడ విశ్వాసంగా శ్రీనుబాబు వివరించారు.  జనవరి12న అప్పన్న ఉత్తర ద్వార దర్శనం(ముక్కోటి ఏకాదశి), 13న భోగి,14న సంక్రాంతి,15న కనుమ పండుగులు రానున్నట్లు చెప్పారు. 16న ముక్కోనమ పండుగ ఘనంగా జరుపుకోనున్నారన్నారు. అయితే ఆయా పండగుల నేపథ్యంలో సంక్రాంతి పర్వదినం రోజున అప్పన్న మకరవేట ఉత్సవాన్ని(గజేంద్ర మోక్షం) ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనుబాబు చెప్పారు. ఆయా పండుగ రోజుల్లో భక్తులకు కనువిందు చేసే విధంగా సింహాద్రినాధుడి ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ  ఆధ్వర్యంలో సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు రోజుల పాటు వరుస పండుగల నేపథ్యంలో భక్తులంతా స్వామిని దర్శించుకుని సేవించి,తరించాలని శ్రీనుబాబు విజ్ఞప్తి చేశారు. 

Simhachalam

2021-12-04 08:16:36

ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి..

తుఫాన్ అనంత పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కోరారు. తుఫాను  పరిస్థితులను పరిశీలించుటకు సంతబొమ్మాలి మండలం కారిపేట తదితర ప్రాంతాల్లో కలెక్టర్ శనివారం పర్యటించారు.  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అందిస్తున్న ఆహారపదార్థాలను పరిశీలించారు. స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. కేంద్రంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అదేసమయంలో తుఫాను అనంతరం పరిస్థితుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాలకు గోడలు తడిసిపోయి ఉండవచ్చని, గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగవచ్చని, విద్యుత్ తీగలు క్రిందకు ఉండవచ్చని వాటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలకు వర్షపు నీరు తాగునీటి కలిసి కలుషితం కావడం వలన పలు వ్యాధులు సంభవించే అవకాశాలు ఉంటాయని వాటిని పరిశీలించాలని అన్నారు. నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణం సంబంధిత వైద్య అధికారిని కలవాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో సమస్య ఉంటే వాటిని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని చెప్పారు. అధికారులకు సహకారం అందిస్తూ తుఫాను సమయంలో సురక్షితంగా ఉండుటకు ప్రయత్నించాలని కలెక్టర్ అన్నారు.

Srikakulam

2021-12-04 08:11:22

తహసిల్థార్లు నుండి సమాచారం సేకరించాలి..

శ్రీకాకుళం జిల్లాలో  మండలాలకు సంబంధించి తహసిల్థార్లు నుండి పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు.  జవాద్ తుఫాన్ కు సంబంధించి మండలాల్లో పరిస్థి ఏ విధంగా ఉన్నదని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు, అక్కడ ఎంత మంది ప్రజలు ఉన్నారు, వారికి ఆహారం సరఫరా చేస్తున్నది లేనిది తెలుసుకోవాలన్నారు.  ప్రస్తుత పరిస్థితి మండలాల్లో ఏ విధంగా ఉన్నదీ తెలుసుకోవాలని పేర్కొన్నారు.  వర్షపాతం నమోదు, గాలులు వేగం, తదితర అంశాలపై మండలాల నుండి సమాచారం సేకరించాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో ఆయా విభాగలకు సంబంధించిన పర్యవేక్షకులు, కంట్రోల్ రూరం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-12-04 07:53:06

అప్పన్న దేవస్థానం అభివృద్ధికి సహకారం..

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బృందం పేర్కొంది. ఈమేరకు శుక్రవారం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల  శ్రీను బాబు, మేడిద మురళీ కృష్ణ, దశమంతుల మాణిక్యాలరావు, యండమూరి వెంకట్రావు తదితరులు వరాహ పుష్కరిణి ప్రాంతంతోపాటు కొండ దిగువన శ్రీవెంకటేశ్వర ఆలయం ప్రాంతాలను వీరు సందర్శించారు. వరహా పుష్కరనీ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని తాము ఇప్పటికే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రతిపాదించినట్లు శ్రీనుబాబు చెప్పారు. వరాహ పుష్కరిణి ప్రాంతం  అభివృద్ధి చేస్తే భక్తులుకి ఆహ్లాద కరమైన వాతా వరణం కలుగుతుందని , ఇక్కడ సేద తీరే అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా సాయంత్రం పూట గ్రామ ప్రజలు కూడా ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం కలుగుతుందని  శ్రీనుబాబు  పేర్కొన్నారు. ఇక అడవివరం స్మశానానికి వెళ్లే రహదారిని కూడా మెరుగు పరచవలసిన అవసరం ఉందని, నాలుగు వైపులా రహదారులు అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం సుందరముగా  విరాజిల్లుతోంది అన్నారు.
ఆదివారం నాటి పోలి పాడ్యమి సందర్భంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు  ప్రశంసనీయంగా ఉన్నాయని వీరు కొనియాడారు. పుష్కరిణిలో నాచు పట్టిన పలు ప్రాంతాలను  పరిశీలించారు. అనంతరం ఇక్కడ పేరుకుపోయిన కొంత చెత్తాచెదారాన్ని వీరు క్లీన్ అండ్ గ్రీన్ ద్వారా తొలగించారు. తదుపరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తులను  లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు.  అక్కడ కైంకర్య పరుడికి సక్రమంగా జీతం చెల్లిస్తున్నందుకు  ఈవో సూర్య కళ కి  ధన్యవాదాలు తెలియజేశారు. గతములో జీతం లేకపోవడం వల్ల తాము ఈ విషయాన్ని ఈఓ దృష్టికి తీసుకు వెళ్ళడంతో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దాతల సహకారంతో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి ధనుర్మాసం నాటికి వేంకటేశ్వర స్వామి ఆలయం లో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అక్కడ చెక్ డామ్ పరిశీలించారు.

Simhachalam

2021-12-03 09:39:54

తుపాను కారణంగా 4వ తేదీన పాఠశాలలకు సెలవు..

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా  రానున్న 3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపద్యంలో  జిల్లా యంత్రాంగం, ప్రజలు ముందు జాగ్రత్తలతో అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కోరారు.  మధ్య అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఈ నెల 4వ తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిస్సా తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల డిశంబరు 3 నుండి 5వ తేదీ వరకూ తూర్పు గోదావరి జిల్లాలో బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ  హెచ్చరిక జారీ అయిందని ఆయన తెలిపారు.                                    తుఫాను హెచ్చరిక నేపద్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారిని వెంటనే తీరానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని మత్య్సశాఖ అధికారులను ఆదేశించారు.  పెనుగాలుల వల్ల ప్రమాదాలు సంభవించకుండా  పూరిళ్లు, తాటాకు, పెంకుటిల్లలో నివశిస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. అలాగే వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండవద్దని హెచ్చరించారు. రానున్న 2,3 రోజులలో భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని, కావున ప్రసవ తేదీకి దగ్గరలో ఉన్న గర్భవతులందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రులలోని ప్రసవ నిరీక్షణ గదులకు తరలించాలన్నారు. గంటకు 80 కి.మీ. వేగంతో తుఫాను ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, చెట్లు విద్యుత్ స్థంబాలు కూలి రహదార్లకు అంతరాయం ఏర్పడే అవకాశం దృష్ట్యా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.            రవాణా అవరోధాలను తొలగించేందుకు అవసరమైన జెసిబిలు, పవర్ కట్టర్లు, రంపాలు, ట్రాక్టర్లను సిద్దంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాల వల్ల త్రాగునీటి సరఫరాకు ఆటంకం కలుగకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని ఎటువంటి  అంతరాయం లేకుండా సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు.   రెవెన్యూ, అగ్నిమాపక, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాలు, పోలీస్ తదితర రక్షణ,సహాయ శాఖలకు సెలవులు రద్దు చేసి, అధికారులు, సిబ్బంది అత్యవసర విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుఫాను హెచ్చరికలను మీడియా, వలంటీర్ల వ్యవస్థ, టాంటాం ద్వారా ప్రజలకు ఎప్పటి కప్పుడూ తెలియజేయాలని, మండల ప్రత్యేక అధికారులు తమతమ మండల కేంద్రాలలో ఉండి ముందస్తు జాగ్రత్తలను, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు ఈ నెల 4వ తేదీన స్థానిక శెలవు దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  కలెక్టరేటులోను, అన్ని డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు, కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలియజేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందకు  ప్రమాణిక విపత్తు నియంత్రణ కార్యాచరణలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నంబర్లుః
1. జిల్లా కలెక్టరు కార్యాలయం, కాకినాడ 1800-425-3077
2. ఆర్డిఓ, కాకినాడ కార్యాలయం 0884-2368100
3. ఆర్డిఓ, అమలాపురం కార్యాలయం 08856-233208
4. ఆర్డిఓ, రామచంద్రపురం కార్యాలయం 08857-245166
5. ఆర్డిఓ, పెద్దాపురం కార్యాలయం 9603663227
6. పిఓ.ఐటిడిఏ, రంపచోడవరం కార్యాలయం 1800-425-2123
7. సబ్ కలెక్టర్, రంపచోడవరం కార్యాలయం 08864-243561
8. సబ్ కలెక్టర్, రాజమండ్రి కార్యాలయం 0883-2442344
9. ఆర్డిఓ, ఎటపాక కార్యాలయం 08864-285999, 7331179044

Kakinada

2021-12-02 15:59:57