0-5 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఓరల్ పోలియో వాక్సిన్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ పై డిఎంహెచ్ ఓ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదివారం ఈ నెల 27వ తేదీన జరుగుతుదని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్ లు, అన్ని పంచాయతీ కేంద్రాలు, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలోని అన్ని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు లోను వేయడం జరుగుతుందని వివరించారు. అర్హులైన చిన్నారులు అందరకీ ఈ వాక్సిన్ వేయించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోసుకోవలసినదిగా తల్లిదండ్రులను కోరారు. పల్స్ పొలియో కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం వేయుచున్న ఈ చుక్కలు అదనపు డోసు మాత్రమేనని, ఇదివరకే వాక్సిన్ తీసుకొన్నప్పటకి మరల పల్స్ పోలియో రోజున తిరిగి ఈ వాక్సిన్ వేయించవలసినదిగా తల్లిదండ్రులను కోరారు. మన దేశంలో ఆఖరి పోలియో కేసు జనవరి 2011లోను, మన రాష్ట్రంలో జులై 2008లోను, మన జిల్లాలో జనవరి 2007లోను నమోదైనట్లు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మన భారత దేశాన్ని మార్చి 13, 2014 న పోలియో రహిత దేశం గా ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గలిగిన 4,86,173 మంది చిన్నారులు కు ఓరల్ పోలియో వాక్సిన్ వేయుటకు లక్ష్యం గా నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3836 పోలియో కేంద్రాలను, 123 ట్రాన్సిట్ కేంద్రాలను, 86 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగింది. 15,144 మంది వ్యాక్సినేటర్లును, 379 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 481 High Risk ప్రాంతాలు (Slums, Nomads, Brick klins, Construction Areas, Fisherman Community, Hard to Reach Areas) ను గుర్తించి వాటిని సూక్ష్మ ప్రణాళికలో చేర్చి ఆ ప్రాంతాల్లోని అర్హులైన 14,513 చిన్నారులకు పోలియో వాక్సిన్ వేయుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన పోలియో చుక్కులు వేయని వారికి పోలియో కేంద్రాలు 28వ తేదీ నుండి 2వ తేదీలలో గృహ సందర్శన లో భాగం గా పోలియో బూత్ లలో వాక్సిన్ వేయని చిన్నారులు ను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, 123 ట్రాన్సిట్ (రైల్వే స్టేషన్, బస్టాండ్, తదితరమైనవి) కేంద్రాలలో 3 రోజుల పాటు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, రెవెన్యూ, పంచాయితీ రాజ్, తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాక్సినేషన్ అధికారి ఎస్.జీవన్ రాణి, తదితరులు పాల్గొన్నారు.