1 ENS Live Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికలకై నోడల్ అధికారుల నియామకం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌ర‌గ‌బోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తూ క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు ఆయా నోడ‌ల్ అధికారికి కేటాయించిన విభాగాన్ని పేర్కొంటూ గురువారం ప్ర‌త్యేక ఉత్వ‌ర్వులు జారీ చేశారు. సిబ్బంది కేటాయింపు, స‌ర్దుబాటు అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావును, ర‌వాణా వ్య‌వ‌హారాలు చూసేందుకు మోట‌ర్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ దుర్గాప్ర‌సాద్‌ను, ఎన్నిక‌ల సిబ్బంది శిక్ష‌ణ‌, ఎన్నిక‌ల ఖ‌ర్చు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించేందుకు కో-ఆప‌రేటివ్ ఆడిట్ అధికారి ఎస్‌. అప్ప‌ల‌నాయుడును, ఎన్నిక‌ల సామాగ్రి, ఇత‌ర ఏర్పాట్ల‌ను చూసుకునేందుకు మెప్మా ప్రాజెక్ట్ అధికారి బి. సుధాక‌ర్‌ను, మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ అమ‌లు తీరును ప‌రిశీలించేందుకు సీపీవో జె. విజ‌య‌ల‌క్ష్మిని, ఎన్నిక‌ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారిగా డీఎస్‌వో ఎ. పాపారావును, శాంతి భ‌ద్ర‌త‌లను ప‌ర్య‌వేక్షించేందుకు అద‌న‌పు ఎస్పీ పి. స‌త్యనారాయ‌ణ‌ను, బ్యాలెట్ పేప‌ర్‌, డ‌మ్మీ బ్యాలెట్ వ్య‌వ‌హారాల‌ను చూసేందుకు జిల్లా టూరిజం అధికారి వ‌ర్మ‌ను, మీడియా వ్యవ‌హారాలు ప‌ర్య‌వేక్షిందుకు స‌మాచార పౌర సంబంధాల శాఖ స‌హాయ సంచాల‌కులు డి. రమేష్‌ను నియ‌మించిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఆయా నోడ‌ల్ అధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా, స‌జావుగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి సూచించారు.

Vizianagaram

2021-11-11 16:25:31

ఘ‌నంగా అబుల్ క‌లాం ఆజాద్‌ జ‌యంతి..

స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు, స్వ‌తంత్ర భార‌త దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ క‌లాం జ‌యంతి వేడుక‌లు ప‌ట్ట‌ణంలో ఘ‌నంగా జ‌రిగాయి. గురువారం ఆయ‌న జ‌యంతిని పుర‌స్క‌రించుకొని స్థానిక ఉర్దూ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ముఖ్య అతిథిగా, జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ముందుగా అబుల్ క‌లాం ఆజాద్ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఆయ‌న ఆశ‌యాల సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని, ఆయ‌న జీవితాన్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. పిల్ల‌లే రేప‌టి త‌రం భ‌విష్య‌త్త‌ని.. వారిని బాగా చదివించాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో కాసేపు ఉర్దూ పాఠ‌శాల విద్యార్థుల‌తో క‌లెక్ట‌ర్ ముచ్చ‌టించారు. అంద‌రూ బాగా చ‌దువుకోవాల‌ని, గొప్ప‌వారు కావాల‌ని ఆకాంక్షించారు. వివిధ పోటీల్లో విజేత‌లుగా నిలిచిన విద్యార్థుల‌కు క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం స్థానిక పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని క‌లెక్ట‌ర్‌, జేసీలు ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మంలో మైనారిటీ సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు బి. అరుణ కుమారి, డీఈవో స‌త్య‌సుధ‌, ముస్లిం పెద్ద‌లు, మ‌హిళ‌లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-11-11 16:23:21

తూర్పుగోదావరి జిల్లా నలు చెరగులా ‘దిశ’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిల సంరక్షణార్ధం అందుబాటులోకి తీసుకొచ్చిన దిశ యాప్ తూర్పుగోదావరి జిల్లా నలు చెరగులా దావానంలా వ్యాప్తి చెందుతూ మహిళల ‘దశ’ను మరుస్తోంది. జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు సారధ్యంలో నోడల్ ఆఫీసర్, డిఎస్పీ మురళీ మోహన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని  మహిళా పోలీసులతో దిశ యాప్ ను జిల్లా అంతటా అత్యంత వేగంటా విస్తరింప చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 95లక్షల మంది ఈ దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలా పరిధిలో 10 లక్షల 62 వేల 494 మందికి పైగా దిశ యాప్ ని ఇనిస్టాల్ చేయించారు. దిశయాప్ ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశించడంతో ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అన్ని జిల్లాల దిశ నోడల్ ఆఫీసర్లు కూడా ఈ దిశ యాప్  వినియోగం, ఇనిస్టాలేషన్స్ పై ప్రత్యేకంగా మండల, డివజనల్ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి మరీ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

 ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దిశ ద్విచక్రవాహనాలు, పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులో కూడా ఉంచారు. ఏజెన్సీ ప్రాంత మండలాలలో  నెట్ వర్క్ ఉన్న చోట్ల దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించే కార్యక్రమాన్ని గ్రామసచివాలయ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీసులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మురళీ మోహన్ మాట్లాడుతూ, దిశ యాప్ ఒక్క మహిళలకే కాకుండా పురుషులు కూడా ఉపయోగించుకొని, ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.  చదువు రాని వారు కూడా  మొబైల్ ను 5 సార్లు షేక్ చేస్తే  ఎస్.ఓ.ఎస్ ఓపెన్ అవుతుందనే విషయాన్ని అన్ని వర్గాలతోపాటు గిరిజ గ్రామాల్లోని గిరిజనులకు తెలియజేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీని ద్వారా వారికి అవసరమైన రక్షణ అందుతుందనే భరోసా కల్పించడానికి వీలుపడుతందన్నారు. గత సంవత్సరం నుండి దిశా చట్టం మీద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుండటం కూడా దిశయాప్ ప్రజల్లోకి త్వరగా వెళ్లడానికా ఆస్కారం ఏర్పడింది.  

దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నది.  ప్రతి ఇంటిలో దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకొనే  విదంగా  అవగాహన కలిగించేలా ఆ బాధ్యత అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తీసుకునేలా జిల్లా అధికారులు సైతం క్యాంపైన్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల దిశయాప్ ను పురుషులు సైతం తమ మొబైల్స్ లో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో ఉన్నవారికి సహాయం అందిచడానికి వీలుపడుతుందే జిల్లా పోలీసు సందేశాన్ని ప్రతీఒక్కరూ స్వీకరిస్తున్నారు. ఈ విషయంలో మీడియా ప్రత్యేక పాత్ర పోషించడం, దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలను ప్రజల్లోకి వెంటేనే తీసుకెళ్లడంలో తమవంతు బాధ్యతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ, పత్రిక, ఆన్ లైన్ మీడియా కంటే, మొబైల్ న్యూస్ యాప్స్ ద్వారా సత్వరమే ప్రజలకు సమాచారం తెలుస్తున్నది. రాష్ట్రప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో చట్టంగా మారిస్తే మరిన్ని ఫలితాలు రావడానికి, ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్ని వేళల్లో ఉపయోగపడి.. ఒక రక్షణ కవచంలా మారివుంది. రానున్న రోజుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్ లోనూ దిశయాప్ ఒక అత్యవసర వనరుగా ఉపయోగపడి రాష్ట్రప్రభుత్వ ఆశయం, మహిళలకు 24 గంటలూ రక్షణ కల్పించేలా మరింత అభివ్రుద్ధి చెందాలని ఆశిద్దాం..!

Kakinada

2021-11-11 13:31:39

మత్స్యకారుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం.. ఫిషరీష్ డిడి నిర్మలకుమారి

మత్స్యకారుల ఆర్ధిక అభివ్రుద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేకచర్యలు చేపడుతుందని  విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి అన్నారు. మంళవారంవారం విజయనగరం జిల్లాలోని చేప పిల్లల పెంపక కేంద్రాల నుంచి తీసుకు వచ్చిన 2.44.లక్షలు చేప పిల్లలను, పాచిపెంట మండలం కొండికనలవలస పెద్దగెడ్డ రిజర్వాయర్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వానితులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం మత్స్య సంపదను అభివ్రుద్ధిచేసి తద్వారా మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి చేప పిల్లల పెంపకాన్ని చేపడుతుందన్నారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్ లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలిపెట్టామన్నారు. చేపల వినియోగాన్ని పెంపకాన్ని మరింత పెంచాలనే మత్స్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతన్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీలు, మత్స్యశాఖ సిబ్బంది, అధిక సంఖ్యలో మాత్సకారులు పాల్గొన్నారు.

Pachipenta

2021-11-09 15:53:55

తూ.గో. లోనే టస్సార్ పట్టు అత్యధిక సాగు..

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా టస్సార్ పట్టు సాగు జరుగుతోందని ఉద్యనావనశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.రామ్మోహన్ తెలియజేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టస్సార్ పట్టుసాగు, ఎగుమతులు ఉన్నాయన్నారు. సుమారు 1200 ఎస్టీ కుటుంబాలతో జిల్లాలో ఈ సాగు చేపడుతున్నామన్నారు. పట్టుతయారీకి సంబంధించిన రైతులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం ఈరకం పట్టుపై రైతులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని సాగుచేయడానికి ముందుకి వస్తున్నారన్నారు. గతంలో హార్టికల్చర్ కు వనరులు, సిబ్బంది తక్కువగా ఉండేవారని, ప్రస్తుతం గ్రామసచివాలయాలు ఏర్పాటైన తరువాత ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. వాణిజ్యపంటలను మరింత ప్రోత్సహించేందుకు ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యవంతం చేస్తున్నట్టు ఆయన వివరించారు.

Kakinada

2021-11-09 07:26:22

2021-11-08 18:13:08

విశాఖజిల్లాలో స.హ.చట్టం అమలు పరిశీలన..

విశాఖజిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలిస్తామని రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావు తెలియజేసారు. సోమవారం జిల్లాలో పర్యాటనకు వచ్చిన  సమాచార హక్కు చట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావును, డి ఆర్.ఓ శ్రీనివాసమూర్తి,  ప్రత్యేక ఉపకలెక్టర్ రంగయ్య, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రామోహన్ రావు , తహశీల్దార్ జ్నానవేణి, డిప్యూటి డైరక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ   సర్క్యుట్ హౌస్ లో కలిసారు.  ఈ సందర్భంగా కమిషనరు జిల్లాలో  సమాచార హక్కు చట్టం  అమలు సంబంధిత విషయాలపై  జిల్లా రెవెన్యూ అధికారి ను అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో అధికారులతో ఈ విషయంపై సమీక్ష సమావేశం, అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన  తెలియజేసారు. 

Visakhapatnam

2021-11-08 17:23:25

Rajahmundry

2021-11-08 09:32:55

సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి..

హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి విశాఖ శారదా పీఠం నిరంతరం కృషి చేస్తుందని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు.' నాగుల చవితి పర్వదినం రోజున జన్మించిన స్వరూపానందేంద్ర కు సోమవారం సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు స్వరూపానందేంద్రను పీఠంలో  కలుసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామీజీని ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడు జ్ఞాపికను శ్రీనుబాబు దంపతులు అందజేశారు. ఈసందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సినసమయం ఆసన్న మయ్యిందన్నరు. ఆ విషయము లో విశాఖ శారదా పీఠం ముందువరుసలో ఉంటుందని భరోసా ఇచ్చారు. సింహాచలం దేవస్థానం అభివృద్ధి కి పూర్తి స్థాయిలో కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు.

Pendurthi

2021-11-08 08:10:41

విశాఖలో 18 మందితో స్నేక్ రెస్క్యూ టీమ్ ..

నాగులచవితి పర్వదినం సందర్భంగా మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 18 మంది స్నేక్ రెస్క్యూ టీమ్ ప్రత్యేక సేవలు అందించనున్నట్టు స్నేక్ సేవర్ సొసైటీ అధ్యక్షుడు రొక్కం కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలుపోసే సమయంలో ఎక్కడైనా పాములు కనిపించినా, ఇబ్బందులు ఎదురైనా తమ రెస్క్యూ బ్రుందం సహాయ సహయసహకారాలు అందిస్తుందన్నారు. దానికోసం మహానగర వాసులు 98491 40500 లేదా 8331840500 నెంబర్లలో సంప్రదించాల్సి వుంటుందన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులు, ప్రభుత్వ అధికారులు సద్వినియోగం చేసుకోవాలని స్నేక్ సేవర్ సొసైటీ నిర్వాహకులు కోరారు.

Visakhapatnam

2021-11-07 15:42:57

ఇక సురక్షితంగా పాపికొండల జల యాత్ర..

చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో సుమారు రూ. 70 లక్షలతో ప్లోటింగ్‌ రెస్టారెంటు ప్రారంబించుకోవడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన స్దానిక పద్మావతి ఘాట్‌ వద్ద  బోటు ప్లోటింగ్‌ రెస్టారెంటును ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గోదావరి అందాలను ఇష్టపడని తెలుగు వారు ఉండరని, స్దానికంగా ఉన్న సాహితీ వేత్తలు గోదావరి అందాలపై చక్కటి పుస్తకాలు రచించారని కొనియాడారు. రాజమహేంద్రవరం ఒక పురాతన సాహితీ నగరంగా విరాజిల్లుతోందన్నారు. గోదావరి నదికి ఇరువైపులా పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలు మెండుగా వున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ వారు నిర్వహించిన సమావేశంలో గొదావరి నది ప్రాంత పర్యాటక రంగ అభివృద్దికై పలు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. ఇన్వెస్టరు ప్రెండ్లీ పాలసీ విదానం పునరుద్దరించడం జరిగిందని దీనిద్వారా ప్రభుత్వ, ప్రవేట్‌ భాగస్వామ్యంతో రిసార్టు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని పిచ్చుకలంక రిసార్డును సుమారు రూ 250 కోట్లతో త్వరలో పిపిటి విధానంతో నిర్మాణం చేపడతామన్నారు.  95 మంది సభ్యులు కెపాసిటి గల ప్లోటింగ్‌ రెస్టారెంటు ప్రారంభం అయిందని త్వరలో అన్ని చోట్ల  ప్లోటింగ్‌ రెస్టారెంట్ల విదానాన్ని అమలు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్దికి మన రాష్ట్రంలో 945 కిలోమీటర్లు పొడవుగల సముద్రతీరం, జీవనదులు ఉన్నాయన్నారు. అడ్వంచర్‌ టూరిజం టెంపుల్‌ టూరిజంల్లో. అభివృద్దికి అవకాశాలు ఎక్కువగా వున్నాయన్నారు. రాష్ట్రంలో మూడు చోట్ల సీప్లేన్‌ సౌలభ్యాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు చర్యలు  ప్రతిపాదించామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు మనకు ఉన్నాయన్నారు.13 జిల్లాలను పర్యాటక రంగ అభివృద్దికై నాలుగు సర్క్యుట్లుగా విభజించడం జరిగిందన్నారు. పలు దేవాలయాల్లో ప్రసాదం స్కీము అమలు దిశగా చర్యలు చేపట్టి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు, రైల్‌ మార్గాలు, జాతీయ రహదారులు కనెటివిటీలు విసార్తంగా ఉన్నాయన్నారు. విశాఖలో టూరిస్టుల కోరకు ఒక జెట్టీని ఏర్పాటు చేయడం జరుగుతోందని త్వరలో ప్రారంబించడం జరుగుతుందన్నారు. ఇన్వెస్టరు ప్రెండ్లీ పాలసీ విదానంలో పెట్టుబడి దారులను పిపిటి విదానం ద్వారా ఆహ్వానించడం జరుగుతోందన్నారు. పెట్టుబడి దారులు  ప్రాజెక్టు ప్రారంభం నాటినుంచే లీజ్‌  చెల్లించాల్సి వుంటుందన్నారు. అంతర్జాతీయ టూరిజం చార్డులలో ఎపిని నిలపాలనే  తపనతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సీని షూటింగ్‌లకు మోక్షానికి అనువైనా ప్రాంతంగా గోదావరి ప్రాంతం విరాజిల్లుతోందన్నారు. గోదావిరి పాపికొండలు విహార యాత్రకు 11 బోట్లను అనుమతి ంచడం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం 29 రకాలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కోట్లాది నిధులు వెచ్చించి నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతోందన్నారు బోట్ల సామర్ద్యాలను పరిగణనలోనికి తీసుకొని అనుమతులు ఇవ్వండం జరుగుతోందన్నారు.గోదావరి ప్రాంత పర్యాటకరంగ అభివృద్దికి పార్లమెంటు సభ్యులు వారి ఆకాంక్షకు అనుగుణంగా పలు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ గోదావరి పాత రైల్వే హెవలాక్‌ బ్రిడ్జ్‌ ఇతర ప్రాంతాలలో పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలను పరిగణనలోనికి తీసుకొని నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. నగర కమీషనరు అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ రెస్టారెంటు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుందని,,నగరంలో పురాతన కట్టడాలు అభివృద్దికి నగర ఆర్దికాబివృద్దికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ది సంస్ద చైర్మన్‌ ఎ వరప్రసాదరెడ్డి, రుడా చైర్మన్‌ షర్మిళారెడ్డి, జె.సి.ఎ భారవతేజ,సబ్‌ కలెక్టరు ఇలాక్కియా ఇడి మాల్‌ రెడ్డి వీరనారాయణ, వెంకటాచలం, తదితరులు పాల్గొన్నారు. 

Rajahmundry

2021-11-07 13:16:01

నిర్దేశిత కాల వ్యవధిలో గృహాలు పూర్తి చేయాలి..

ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలో గృహ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని  శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను నిరుపేదలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అందులో మొదట విడత గా సుమారు 16 లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 10,237 ఇల్లు నిర్మాణం దశ లో ఉన్నాయని చెప్పారు.ఇంకా నిర్మాణం ప్రారంభించని గృహాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.  గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు సలహాలు, సూచనలు అందజేసి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసే విధంగా సహాయ పడాలని సూచించారు. ప్రతి లే అవుట్ అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నక్కా గణపతి, డిఇ గాలి రామ్మూర్తి, బొడ్డేపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-11-07 13:03:21

నేడు స్పందన కార్యక్రమం రద్దు..

శ్రీకాకుళంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీచేసారు. గత కొన్ని వారాలుగా ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరిస్తున్న సంగతి విదితమే. అయితే జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున నవంబర్ 8న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, వ్యయప్రయాసల కోర్చి ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకోవద్దని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2021-11-07 13:01:49

ఒడిషా–ఏపిల మధ్య సమస్యల పరిష్కారానికి సిఎం కృషి..

శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన వంశధార – నేరేడి ప్రోజెక్ట్ నిర్మాణంలోని సమస్యలు తొలిగి త్వరలోనే పూర్తిచేసుకోనున్నట్లు మాజీమంత్రివర్యులు, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టౌన్ హాలులో ఈ మేరకు ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి ప్రోజెక్టు నిర్మాణంపై చర్చించనున్నట్లు చెప్పారు. సిఎం చేస్తున్న అవిరళ కృషితో ప్రోజెక్టుకు ఒడిషాతో ఉన్న జలవివాద సమస్యలకు చరమగీతం పడనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 1962లో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేరేడి బ్యారేజుకు శంకుస్థాపన చేసారని, అది నేటికి సఫలం కాలేదన్నారు. సరిహద్దు రాష్ట్రమైన ఒడిషాతో తలెత్తిన బేధాభిప్రాయాల వలన గడిచిన 62 ఏళ్లలో బ్యారేజ్ నిర్మాణానికి నోచుకోలేదని, ముఖ్యమంత్రి తీసుకున్న సాహోసోపేతమైన నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పెద్ద వరం కాబోతుందని తెలిపారు. ఇందుకు  జిల్లా ప్రజలు, రైతాంగం తరపున హృదయపూర్వక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు లభించారని, ఈగోలకు పోకుండా ప్రజల మంచి చెడ్డలను ఆలోచించి, జీవనప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనిచేయడం ఉన్నతమైన సంప్రదాయమని, ఆ సంప్రదాయం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని ఆయన స్పష్టం చేసారు. జిల్లా ప్రజల కోసం సిఎం తీసుకుంటున్న చర్యను అందరూ అభినందించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు  ఉందని, ప్రజల కోసం ఆలోచించే ఆదర్శవంతమైన వ్యక్తి నవీన్ పట్నాయక్ అని కొనియాడారు. 1936కు ముందు శ్రీకాకుళం ఒడిషా రాష్ట్రంలో ఉండేదని, తదుపరి ఆంధ్రా ప్రాంతంగా విభజించబడిందని ఆయన గుర్తుచేసారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణంలో కోర్టులు ఇచ్చే తీర్పులు కంటే నేరుగా సిఎం గారిని కలిసి సమస్యలను పరిష్కరించుకోవడం సంతోషకరమని, సిఎం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఈ ప్రోజెక్టు నిర్మాణంతో ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద ప్రోజెక్టు కాగలదని ధర్మాన పేర్కొన్నారు. ఈ ప్రోజెక్టును నాటి ముఖ్యమంత్రి దివంగత డా.వై.యస్.రాజశేఖరరెడ్డి మంజూరుచేసారని, రాష్ట్రంలో జలయజ్ఞం పేరిట ఒకే టెర్ములో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రోజెక్టులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అందులో భాగంగానే వంశధార, తోటపల్లి, మడ్డువలస- ఎక్స్ టెన్షన్, మహేంద్రతనయపై నిర్మించిన ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు ప్రారంభించబడ్డాయని, తోటపల్లి పూర్తయిందని, వంశధార ప్రోజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద ప్రోజెక్టు వంశధార అవుతుందని అన్నారు. బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జల ఒప్పందం ప్రకారం మన వాటాకు 57.5 టి.ఎం.సిలు వస్తాయని, ఆ వాటాలో 45 టి.ఎం.సిల నీటిని ఇపుడే వినియోగించుకునే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారుల సమాచారమని ఆయన వివరించారు. ఒడిషాకు పెద్దఎత్తున నీటివనరులను వినియోగించుకునే భూభాగం గాని అవకాశంగాని, అనువుగా లేదన్నారు. ఇటువంటి పరిస్థితిల్లో నీటిని వృధా కానివ్వకుండా భారతీయులుగా గుర్తించి విశాలమైన ఈ ఒప్పందాన్ని అమలుచేయడానికి నవీన్ పట్నాయక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రజలందరి తరపున వినమ్రంగా కోరుతున్నట్లు చెప్పారు. ఇది ఒడిషా ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల వాదన, ఆవేదన, కోరిక, మనోవాంఛ అని, ఇది రేపటి సమావేశానికి దోహదం కావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నాలతో జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీరనుందని ధర్మాన స్పష్టం చేసారు. 

Srikakulam

2021-11-07 12:47:53

సెల్ ఫోన్లు ఇచ్చారు సిమ్ కార్డులు మరిచారు..

తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళాపోలీసులకు ప్రభుత్వం విధినిర్వహణ నిమిత్తం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. అయితే సెల్ ఫోన్లు అయితే పంపిణీచేసింది తప్పితే అందులో వినియోగించే సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఆ సెల్ ఫోన్లన్నీ మూలన పడి ఉన్నాయి. జిల్లాలో సుమారు 850 మంది మహిళా పోలీసులకు ప్రభుత్వం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. ఫోన్లలో వినియోగించేందుకు గ్రూప్ సిమ్ కార్డులు పంపిణీ మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించే సెల్ ఫోన్లు కావడంతో వాటిని మహిళా పోలీసులు అలాగే ఇంట్లో ఓ మూలన భద్రంగా దాచిపెట్టి ఉంచారు. అటు జిల్లా అధికారులు సైతం ప్రభుత్వం నుంచి సిమ్ కార్డుల విషయమై ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.

Kakinada

2021-11-07 05:46:49