1 ENS Live Breaking News

జిసిసి ఉత్పత్తులను టిటిడి ప్రోత్సహించాలి..

తిరుమల తిరుపతి దేవస్థానంలో గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తులకు అవకాశం కల్పించాలని గిరిజన కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతి రాణి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కోరారు.  తిరుమలలో సోమవారం ఆమె చైర్మన్ ను కలిశారు. గిరిజనులు తయారు చేసిన పసుపు. కుంకుమ, తేనె తో పాటు.మరికొన్ని ఉత్పత్తులు ఆయనకు అందజేశారు. టిటిడి జిసిసి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గిరిజనులకు మరింత ఉపాది కలుగుతుందన్నారు. అంతేకాకుండా నాణ్యమైన ఉత్పత్తులను టిటిడి లో వినియోగించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్ పద్ధతిలో పసుపు,కుంకుమ, చింతపండు పండించేట్లైతే టీటీడీ లో అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పారు.

Tirumala

2021-08-30 09:00:24

సెప్టెంబరు 2న ఉచిత మెగా వైద్య శిబిరం..

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని వచ్చేనెల 2వ తేదీన వైఎస్సార్సీపీ యువ నాయకులు డాక్టర్ దర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో  నరసన్నపేటలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణ మెడికల్ సెంటర్ (కేఎంసీ), జెమ్స్ సారథ్యంలో జరగనున్న ఈ వైఎస్సార్ మెగా వైద్య శిబిరంలో 46 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు నిర్వహించే రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లాటకర్ విశిష్ట అతిథిగా ప్రారంభించనున్నారు. రోగులకు ఉచితంగా మందులను అందజేసి, వైద్య పరీక్షల్లో తీవ్రత గుర్తించిన రోగులకు జెమ్స్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తారు. వైద్య శిబిరం ఏర్పాట్లకు సంబంధించి స్వతహాగా వైద్యులైన యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యతో జెమ్స్ ప్రతినిధులు డాక్టర్ బాల మురళి, డాక్టర్ ప్రవీణ్ లు నరసన్నపేటలో సోమవారం ఉదయం సమావేశమై ఏర్పాట్లు చేశారు.

Srikakulam

2021-08-30 08:54:11

ఆత్మరక్షణకు దిశయాప్ రక్షణ కవచం..

ఆత్మరక్షణే ఆయుధమని, చట్టం ప్రతి మహిళకు రక్షణ కవచం వంటిదని వక్తలు అభిప్రాయపడ్డారు. శక్తి ఎంపవరింగ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ (సేవ), శ్రీప్రగతి మహిళా మండలి కుటుంబ సలహా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్‌ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన " లైంగిక వేధింపులు-మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు సేవ అధ్యక్షురాలు పైడి రజని అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఎస్ఐ ఎం.ప్రవల్లిక మాట్లాడుతూ, చదువుకొనే బాలికలు, వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు తరచూ వేధింపులకు గురవుతూనే ఉన్నారని, వీరంతా చట్టాలపై అవగాహన ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. వక్తగా హాజరైన ఏపిడబ్బ్యుజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, (ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్‌ మాట్లాడుతూ సమాజ ప్రగతిలో మహిళ కీలకపాత్ర పోషిస్తుందని, మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవభావంతో వ్యవహరించాలన్నారు. మహిళల కోనం ఉన్న చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవ అధ్యక్షురాలు పైడి రజని మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణకు కుంగ్‌పూ, కరాటే, కిక్‌ బాక్సింగ్‌లాంటి మార్ష‌ల్‌ ఆర్ట్స్‌ ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళల రక్షణ కోనం ఉన్న చట్టాలను ఆమె బాలికలకు వివరించారు. సచివాలయ ఉమెన్‌ ప్రాటెక్షన్‌ సెక్రటరీ షబానా బేగమ్‌ మాట్టాడుతూ దిశ చట్టంపై ప్రతి బాలికకు అవగాహన ఉన్నప్పుడు సమాజంలో మార్చు వన్తుందన్నారు. దిశ యాప్‌, మహిళా చట్టాల గురించి వక్తలు వివరించారు. అనంతరం ఎస్‌ఐ ప్రవల్లిక, పైడి రజని, షబానా బేగమ్‌లను కిక్‌ బాక్సింగ్‌, కంగ్‌పూ, కరాటే విద్యార్థినులను సత్కరించారు. తొలుత కుంగ్‌పూ, కిక్‌బాక్సింగ్‌ క్రీడాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు పైడి గోపాలరావు, కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.విజయకుమార్‌, కార్యదర్శి వై.హేమంత్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి డి.హరీష్‌, (ట్రెజరర్‌ వై.పవన్‌యాదవ్‌, సాయిబాబా చిల్డ్రన్‌ కరాటే స్కూల్‌ డైరెక్టర్‌ టి.శ్రీనివాసరావు, కుంగ్‌పూ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌.చంద్రరావు, కోచ్‌లు గాయత్రీ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-30 08:46:36

తూర్పుగోదావరిలో అత్యధిక వర్షపాతం ఇక్కడే..

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా సఖినేటి పల్లిలో అత్యధికంగా 38.2 మిల్లీమీటర్లు వర్షపాతం, అత్యల్ఫంగా ఎటపాకలో 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని కాకినాడ కలెక్టర్ కార్యాలయం తెలియజేసింది. సోమవారం కాకినాడలో ఈ మేరకు మీడియాకి ప్రకటనల విడుదల చేసింది. జిల్లాలో 64 మండలాల పరిధిలో మొత్తం 147.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, ఏవరేజిన 2.3మిల్లీ మీటర్లు వర్షపాతంగా ఉందని అందులో పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగా కాకుండా  తూర్పుగోదావరి జిల్లాలో సాధారణ వర్షం మాత్రమే నమోదు కావడం విశేషం.

Kakinada

2021-08-30 08:37:13

లోకానికి పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడే..

మహా విశాఖ ఓల్డ్ సిటీలోని శ్రీ వివేకానంద వృద్ధుల, అనాధ ఆశ్రమం లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ భగవానుడు, అమ్మవార్లను  సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది  వివిధ పూజలు అనంతరం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తొలి పూజలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు విశేష పూజాది కార్యక్రమాలు,భజనలతో పూర్తిచేశారు.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంస్థ సభ్యులు,వృద్ధులు,భక్తులు పాల్గొని శ్రీ కృష్ణ భగవానుడి సేవలో తరించారు. తొలుత ఆశ్రమం కు చెందిన గోమాతకు సభ్యులందరూ విశేష పూజలు జరిపారు. గోమాతను అందంగా అలంకరించి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, లోకానికి పరమాత్ముడు ఆ కృష్ణ భగవానుడు ఒక్కరే అన్నారు. సర్వ మానవాళిని రక్షించేది ఆయనే అని కృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు. సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ, ప్రతి ప్రతియేటా అన్ని పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధులూ,అనాధలకు  తమ ఇళ్ళకు దూరంగా ఉన్నామన్న భావన రాకుండా ఉండాలనే ఆయా పండుగలు జరుపుతామన్నారు. మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశేష సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు. అందరు ఆరోగ్యం గా ఉండాలని  పలు పూజలు చేపడతామన్నారు. సంస్థ సభ్యులు తో పాటు బండారు గజపతి స్వామి,శీరం శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖసిటీ

2021-08-30 06:33:09

భావితరాలకు తెలుగుభాష ఔన్నత్యాన్ని తెలియజేయాలి..

తెలుగు భాష ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతో పాటు తెలుగు భాషా పరిరక్షణకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆదివారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు ,తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా "తెలుగు భాష - ప్రయోగాలు - పరిశోధనలు" అనే అంశంపై వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ సదస్సులో కాకినాడ గ్రామీణం రమణయ్యపేట మంత్రి కన్నబాబు క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు.     ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కొంతమంది పండితులు మాత్రమే మాట్లాడడానికి, చదవడానికి పరిమితమైన గ్రాంథిక భాషను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి  ఉద్యమాన్ని చేపట్టి  వ్యవహారిక భాష ద్వారా పామర జనులు సైతం చదవటం,మాట్లాడగలిగే విధంగా చేసిన గొప్ప మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని  అన్నారు. ఆ మహనీయుని పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం శుభపరిణామమన్నారు. తెలుగు భాషలో కాలక్రమేణా అనేక పరిణామాలకు లోను కావడంతో ఎన్నో ఇతర భాషల పదాలు తెలుగులో స్థిరపడ్డాయన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన వ్యవహారిక భాషా ఉద్యమ ఫలితంగా తాపీ ధర్మారావు లాంటి గొప్ప కవులు ఎందరో 1930 సంవత్సరం నుంచే వ్యవహారిక భాషలో తమ రచనలు చేయడం జరిగిందన్నారు. అమ్మలాంటి తెలుగు భాష అజరామమైనదని,తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో విధానాలు అమలు చేస్తున్నారన్నారు. నేటి ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ గా మారుతున్న తరుణంలో పేద విద్యార్థులు సైతం ఈ పోటీ ప్రపంచంలో నిలవాలనే  ఉద్దేశంతో తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషను ప్రాథమిక స్థాయి నుంచి బోధించేందుకు ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఒకే పాఠ్యాంశాన్ని తెలుగు,ఇంగ్లీష్ భాషలలో పక్కపక్కన ముద్రించిన  పాఠ్యపుస్తకాలు  అందిస్తున్న రాష్ట్రం మనదేనని, దీని ద్వారా పిల్లలు పాఠ్యాంశాన్ని అంశాన్ని సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు భాష మీద నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు పాటు పడే సంస్థలను,వ్యక్తులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కాళీపట్నం రామారావు మాస్టారు స్థాపించిన కళా నిలయానికి డా. వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును ఇటీవలే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగువాడిగా తన వంతు బాధ్యతగా తెలుగు భాష అభివృద్ధికి పరిరక్షణకు పాటుపడడం జరుగుతుందని మంత్రి తెలిపారు. తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించడానికి అన్ని విశ్వవిద్యాలయాల వారు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకు సాగాలని మంత్రి  కన్నబాబు విశ్వవిద్యాలయ అధిపతులకు తెలిపారు.   ఈ వర్చువల్ సదస్సులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, తెలుగు, సంస్కృత అకాడమి అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-29 16:02:00

అభిప్రాయ సేకరణకు అందరూ ఆహ్వానితులే..

నూతన యువజన విధానాన్ని రూపొందించేందు యువత సమగ్ర అభివృద్థికి అవసరమైన రాష్ట్ర స్థాయి యువజన విధానమును (స్టేట్ యూత్ పాలసీ) రూపొందించుటకు సూచనలు, సలహాలు తెలియజేయాలని సెట్ శ్రీ, ముఖ్య కార్య నిర్వహణాధికారి కె. సూర్యప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.    యువజన సర్వీసుల శాఖ, కమీషనర్ సి. నాగమణి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశములపై స్టేట్ యూత్ పాలసీ రూపొందించుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.  రాష్ట్రంలోని యుతి, యువకులకు అవసరమైన విద్య, ఉపాధి మరియు ఉద్యోగ కల్పనకు అవసరమైన ఒక సమగ్ర రోడ్డు మ్యాప్ తయారు చేయుటకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సూచనలు, సలహాలను ఆహ్వానించినట్లు  ఆ ప్రకటనలో వెల్లడించారు.  శ్రీకాకుళం జిల్లాలో సదరు సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను స్వీకరించుటకు ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజా వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రజావేకకు జిల్లాలో గల మేధాులు, యువజన సంఘ సభ్యులు, ఎన్.జి.ఓ. ప్రతినిధులు, CII,FICCI యువజన పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు, సామాజిక సేవా కార్యకర్తలు, జాతీయ యుజన అవార్డు గ్రహీతలు, తదితరులు వారి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలతో  వ్రాత పూర్వక కాపీలతో హాజరు కావలసినదిగా కోరియున్నారు.  ముఖ్యముగా వారి సూచనలు, సలహాలు యువతకు సంబంధించి విద్య, ఉపాధి మరియు ఉద్యోగ కల్పనకు అనుగుణంగా తయారుచేయవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు.  ఈ కార్యాక్రమమునకు అందరు ఆహ్వానితులేనని తెలిపారు.  ఇతర వివరముల కొరకు  బి.వి.ప్రసాద్ రావు, మేనేజరు, సెట్ శ్రీ శ్రీకాకుళము వారి సెల్ నెం.8341478815 ను సంప్రందించవలసినదిగా  ఆ ప్రకటనలో తెలిపారు.

Srikakulam

2021-08-28 16:18:34

పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 6 కేంద్రాలు..

పాలిసేట్ -2021 ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 1న తిరుపతిలో  6 కేంద్రాలు 2692మంది  హాజరు కానున్నారని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని తిరుపతి ఆర్ డి ఓ వి. కనకనరసా రెడ్డి  సంబందిత  అధికారులను ఆదేశించారు.  శనివారం ఉదయం స్థానిక ఆర్. డి. ఓ. కార్యాలయంలో పాలిసేట్ -2021  నిర్వహణ పై సంబంధిత అధికారులతో  అర్దిఒ సమీక్ష నిర్వహించి  పలు సూచనలు చేశారు.  ఆర్. డి. ఓ. మాట్లాడుతూ   ప్రవేశ పరీక్ష ను  సమర్థవంతంగా నిర్వహించాలని పొరపాట్లకు తావివ్వరాదని అన్నారు.  పరీక్షా సమయం ఉదయం 11.00  నుండి మ. 1.00 వరకు ఉంటుందని, గంట ముందే పరీక్షా కేంద్రాలలోకి అభ్యర్థుల  అనుమతి ఉంటుందని తెలిపారు.  పరీక్షకు హాజరగు విద్యార్థులు హెచ్. పి. పెన్సిల్, పెన్, ఎరేజర్ మినహా ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి ఉండదని సూచించారు. పరీక్షా సమయంలో   విద్యుత్ శాఖ విద్యుత్  అంతరాయం లేకుండా చూడాలని,  నగరపాలక సంస్థ, త్రాగు నీరు, పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని అన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని, పటిష్ట బందోబస్తు  ఏర్పాటు చేయాలని సూచించారు.  ప్ర్రతి విద్యార్థి మాస్కు తప్పనిసరి అని,  వైద్య ఆరోగ్య శాఖ  కోవిడ్ 19 నిబంధనలు పాటించి  పర్యవేక్షించాలని సూచించారు. అభ్యర్థుల సందేహాలకు హెల్ప్ డెస్క్ 9985129995 సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు.   ఈ సమీక్ష లో పద్మారావు,  రీజనల్ జాయింట్ డైరెక్టర్  టెక్నికల్ ఎడుకేషన్, అబ్జర్వర్లు నరసింహా రెడ్డి, శివప్రసాద్,  ఫ్లయింగ్  స్క్వాడ్  గా వ్యవహరించనున్న యుగంధర్, ఆర్ టి సి, పోలీస్, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.  తిరుపతి పరీక్షా కేంద్రాలివే.. 1. శ్రీ పద్మావతి  డిగ్రీ  అండ్ పి. జి. కాలేజి , 2. ఎస్. వి. ఆర్ట్స్ కాలేజి, 3.  ఎస్. వి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ( టి టి డి  ఏడి బిల్డింగ్  ఎదురుగా), 4. ఎస్. జి. ఎస్. ఉన్నత పాటశాల  ( టి టి డి  ఏడి బిల్డింగ్  ఎదురుగా) , 5. ఎస్. వి. జూనియర్ కాలేజి  6. శ్రీ  పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలు పరీక్షా కేంద్రాలు గా వున్నాయి. 

తిరుపతి

2021-08-28 14:46:57

తిరుమలలో ఆగస్టు 30న గోకులాష్టమి..

తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 30వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం  నిర్వహించనున్నారు.   శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు.  అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. అదేవిధంగా ఆగస్టు 31న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని సాయంత్రం 4 నుండి 5 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. కాగా, ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు. యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ కోవిడ్ - 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వ‌హించనుంది.ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31న శ్రీవారి ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ సేవ‌లైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2021-08-28 10:30:16

రహదాలే అభివ్రుద్ధికి కీలకం..బెల్లాన

ర‌హ‌దారులే  అభివృద్దికి కీల‌క‌మ‌ని, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. రోడ్ల‌ను నిర్మించ‌డం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ది వేగ‌వంత‌మ‌వుతుంద‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి గ్రామ స‌డ‌క్ యోజ‌న ప‌థ‌కం క్రింద చేప‌ట్ట‌నున్న‌ గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణంపై, పంచాయితీరాజ్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు అవ‌గాహ‌నా స‌ద‌స్సు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ‌నివారం జ‌రిగింది. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావ‌స్తున్న నేప‌థ్యంలో, దేశంలో నిర్వ‌హిస్తున్న అజాదీ కా అమ్రిట్‌ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ సెమినార్‌ను ఏర్పాటు చేశారు.  ఈ సెమినార్‌ను ప్రారంభించిన ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పించేందుకు పిఎంజిఎస్ వై ప‌థ‌కం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. ఈ ప‌థ‌కానికి కేంద్ర ప్ర‌భుత్వం 60శాతం, రాష్ట్ర ప్ర‌భుత్వం 40శాతం నిధుల‌ను కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టికే రెండు ద‌శ‌లుగా చేప‌ట్టిన పిఎంజిఎస్‌వై ప‌థ‌కం క్రింద వేసిన సుమారు 865 కిలోమీట‌ర్ల రోడ్ల ద్వారా, మారుమాల ప్రాంతాల‌కు ర‌హ‌దారుల సౌక‌ర్యం క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌స్తుతం మూడో ద‌శ ప‌నులు ప్రారంభం కానున్నాయ‌ని, దీనికోస‌మే ఈ సెమినార్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.  ముఖ్యంగా గిరిజ‌న‌ ప్రాంతాల‌పై ఎక్కువ దృష్టి పెట్టాల‌ని సూచించారు. క‌నీసం వంద మంది నివాసం ఉంటున్న‌ గిరిశిఖ‌ర గ్రామాల‌కు కూడా ర‌హ‌దారి సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు కృషి చేయాల‌ని ఎంపి కోరారు.  

                సెమినార్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, పంచాయితీరాజ్ ఎస్ఇ పి.విజ‌య్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ ఎంవిఎన్ వెంక‌ట‌రావు, పిఏ టు ఎస్ఇ చీక‌టి దివాక‌ర్, ప‌లువురు డిఇఇలు, ఎఇఇలు, ఇత‌ర ఇంజ‌నీరింగ్ అధికారులు పాల్గొన్నారు.  ఉత్త‌మ ఇంజ‌నీర్ల‌కు ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు.

Vizianagaram

2021-08-28 08:47:17

Simhachalam

2021-08-28 02:42:35

30న సెలవు కారణంగా స్పందన వుండదు..

శ్రీ కృష్ణాష్టమి పండుగ పర్వదినం సందర్భంగా ఆగష్టు 30 న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా కలెక్టర్  ఏ. సూర్యకుమారి తెలిపారు. ఈ కారణంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో  స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సెలవు సందర్భంగా స్పందన వుండదనే  ఈ విషయాన్ని గుర్తించి ఆరోజు వినతులు ఇచ్చేందుకు కలెక్టర్ కార్యాలయానికి  ప్రజలు ఎవరూ రావొద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 

Vizianagaram

2021-08-27 15:55:19

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి.

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా పై వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, మలేరియా సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి. సృజన  ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాదికారులతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ , దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ జరపాలని, ప్రతీ రోజు జోనల్ స్థాయిలో అధికారులు వార్డులలో సందర్శించి, ప్రతీ శుక్రవారం “డ్రై డే” పాటించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వంనూతనంగా ప్రవేశపెట్టిన “సిటిజన్ అవుట్ రీచ్” కార్యక్రమంను పెద్దఎత్తున ప్రచారం చేసి, అందులో అమలవుతున్న 543 సేవలు, ప్రభుత్వం చేపడుతున్న పధకాల గూర్చి ప్రజలకు వివరించాలని, అందుకొరకు అధికారులు ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. శనివారం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ లో ఒక లక్ష వ్యాక్సినేషన్లు వేయించాలని, అందుకు జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేకాదికారులు, కార్యదర్శులు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, లక్ష్యాన్ని పూర్తీ చేయాలని, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి 18 సం. ల పైబడిన వారికందరికీ కోవేగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ కొరకు వ్యాక్సినేషన్ వేయు సెంటర్లకు తీసుకొచ్చి వేయించాలని ఆదేశించారు. 

Visakhapatnam

2021-08-27 15:30:04

ఆర్.బి.కె ల ద్వారా 32 శాతం విక్రయాలు..

శ్రీకాకుళం జిల్లాలోని 820 రైతు భరోసా  కేంద్రాల ద్వారా ఆ గ్రామ రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేశారు.జిల్లాలో ఇప్పటి వరకు 713 రైతు భరోసా కేంద్రాల ద్వారా 6,570 టన్నులు యూరియా, 2,341 టన్నుల డి.ఏ.పి, 54 టన్నులు పొటాష్ ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లావ్యాప్తంగా విక్రయాలలో 30% ఎరువులు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అందించవలసి ఉందని అన్నారు. కాని ఇప్పటివరకు జిల్లాలో 21,985 మెట్రిక్ టన్నులు గాను 8,971 మెట్రిక్ టన్నులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేసి విక్రయాల్లో 32% లక్ష్యాలను సాదించడం జరిగిందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. కావున శుక్రవారం వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

Srikakulam

2021-08-27 14:30:05

తపాలా పథకాలను వినియోగించుకోవాలి..

శ్రీకాకుళం తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని తపాలా శాఖ పర్యవేక్షకులు అద్దేపల్లి కాంతారావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఛాంబరులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఐపిపిబి ( ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ) ద్వారా తపాలా శాఖ ఖాతాదారులు  ఏ బ్యాంకు ఖాతాలోని నగదునైనా తమ ఇంటివద్దనే సంబంధిత పోస్ట్ మేన్ ద్వారా నగదు పొందేలా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. అలాగే పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను ప్రతీ ఏడాది ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను కూడా ఇంటివద్దనే పొందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తపాలా శాఖ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఏడాదికి కేవలం రూ.12/-లు చెల్లించి పి.ఎం.ఎస్.బి.వై (ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన) ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని, ఏడాదికి రూ.330/-లు చెల్లించి రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా పొందవచ్చన్నారు. సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా 10ఏళ్ల లోపు ఆడపిల్లలకు అత్యధిక వడ్డీని (7.6 శాతం) చెల్లించడం జరుగుతుందన్నారు. గ్రామీణ తపాలా జీవిత బీమా ద్వారా 19 సం.ల నుండి 45 సం.ల వయస్సు గల గ్రామీణ ప్రజలు  బీమా చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు సరైన అవగాహన లేక తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదని, ఇప్పటికైనా వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

Srikakulam

2021-08-27 14:24:25