సముద్ర మార్గ రవాణా, వ్యాపార వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర మారిటైంబోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం వీజేఎఫ్ డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను, కార్గో డిమాంద్ను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పోర్టుల ప్రగతి పై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం, భవనపాడు, కాకినాడ సెజ్, రామయపట్నం పోర్టుల ప్రగతికి కార్యాచరణ జరుగుతోందన్నారు. నిజాంపట్నం ఫేజ్-2, మచిలీపట్నం ఫేజ్-2, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లును రూ.1221 కోట్లతో నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా బుదగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమాడక (విశాఖ), బియ్యపు తిప్ప (వెస్ట్ గోదావరి, ఓడరేవు (ప్రకాశంజిల్లా)లలో ఫిషింగ్ హార్బర్లు ప్రగతిని ప్రణాళికలను తయారు చేయ్యడం జరిగిందన్నారు. గతంలో మారిటైంశాఖ తీవ్రనిర్లక్ష్యానికి గురయిందని, కుంటుపడిన ప్రగతికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ స్వస్తి పలికి అన్ని విధాల ఈ శాఖను బలోపేతం'చేస్తుందన్నారు. ఈ శాఖలలో ఖాళీలను కూడా భర్తీ చేస్తూ సమద్రమార్గ రవాణా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కాయల వెంకటరెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది కాకినాడ పోర్టు, రామాయపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టుల కార్గో రవాణా ద్వారా రూ.285.60 కోట్లు రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లభించిందన్నారు. ఈ ఏడాది జూన్ మాసం వరకు రూ. 70.57 కోట్ల రూపాయలు వరకు ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది వరకు పిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధి దశలో కార్యకలాపాలు ముందుకు సాగుతున్నాయన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని అర్జిస్తున్న విశాఖపట్నంలో మారిటైం బోర్డు సేవలను మరింత విస్తృతపరిచి పోర్టుల ప్రగతికి అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అన్ని వర్గాల వారి సహాయసహకారాలను తీసుకుంటూ పోర్టు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి పరుస్తామని ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండదన్నారు. ప్రతిష్టాత్మకమైన మారిటైం బోర్డు చైర్మన్ గా తనను నియమించిన రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉత్తరాంధ్ర నాయకులు విజయసాయిరెడ్డి, వై.సి.పి. రాష్ట్ర నాయకులకు కాయల వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడూ జర్నలిస్ట్ లుకు అండగా ఉంటామని. తన వంతు సహకారము అందిస్తామన్నారు.. కార్య క్రమంలో ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు,కార్యదర్శి ఎస్.. దుర్గారావు లు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు సంక్షేమం కోసము తమ పాలక వర్గం పూర్తి స్థాయిలో పని చేస్తుంది అన్నారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.. నార్ల భవన్ అధునీకరణతో పాటు అంతర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తామన్నారు.. తొలుత విజేఎఫ్ కార్యవర్గ సభ్యులు కాయల వెంకట రెడ్డి ను ఘనముగా సత్కరించారు. ఉపాద్యక్షుడు అర్. నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమం లోజాయింట్ సెక్రటరీ దాడి రవి కుమార్, కార్య వర్గ సభ్యులు ఇరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.