1 ENS Live Breaking News

క్రీడాకారుల వివరాలు అందజేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారుల వివరాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయానికి అందజేయాలని ఆ సంస్థ జిల్లా ముఖ్య క్రీడా శిక్షణాధికారి బి.శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు 2020-21 మరియు 2021-22 సం.లలో దారిద్ర్యరేఖకు దిగువన ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారు మరియు అర్హత పొందిన క్రీడాకారులు తమ వివరాలను వీలైనంత త్వరగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, సెట్ శ్రీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం, శ్రీకాకుళం వారికి అందజేయాలని కోరారు. ఇతర వివరాల కొరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయ పనివేళల్లో 98660 98642 లేదా 92488 07249 మొబైల్ నెంబర్లకు సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2021-09-03 16:46:05

5న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు..

డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురష్కరించుకొని సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ఆహ్వాన సంఘం కార్యదర్శి జి.పగడాలమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఆదివారం ఉదయం 10గం.లకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్,   రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, పాడిపారిశ్రామిభివృద్ధి శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు. వీరితో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు తదితరులు హాజరవుతారని ఆమె  ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Srikakulam

2021-09-03 16:45:13

అధిక ఫీజులు వసూలుచేస్తే కఠిన చర్యలు..

ప్రభుత్వం నిర్ధేశించిన  ధరలకంటే  అధిక ధరలు వసూలుచేస్తే సంబంధిత ఆసుపత్రులు మరియు ల్యాబరేటరీల రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.చంద్రనాయక్  హెచ్చరించారుఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు.  కోవిడ్  పరీక్షల  కొరకు  వచ్చిన  రోగులనుండి  ప్రైవేటు  ఆసుపత్రులు, ల్యాబరేటరీలు కోవిడ్  పేరుతో  అధికమొత్తంలోరుసుములు  వసూలు చేస్తున్నట్లు  జిల్లాయంత్రాంగం దృష్టికి  వచ్చిందన్నారు. కోవిడ్   పరీక్షలకు  సంబంధించి  రేపిడ్  యాంటీజెన్  పరీక్షకు  రూ. 230/-లు,ఆర్.టి.పి.సి.ఆర్.పరీక్షకు రూ.499/-లు, హెచ్.ఆర్.సి.టి  పరీక్షకు రూ.3,000/-లు  మాత్రమే  వసూలు చేయాలని చెప్పారు. లేనిఎడల అట్టి  ప్రైవేటు ఆసుపత్రులు  మరియు  ల్యాబరేటరీలు  యాజమాన్యంపై  క్రమశిక్షణ చర్యలు  తీసుకోబడునని మరియు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆయా ఆసుపత్రులు, ల్యాబరేటరీల రిజిస్ట్రేషన్లు తక్షణమే రద్దు చేయబడునని  హెచ్చరించారు. అలాగే ఎపిడిమిక్ డిసిజేసేస్ యాక్ట్ అనుసరించి కోవిడ్ నిబంధనల ప్రకారం అట్టి యాజమాన్యాల నుండి జిల్లా కలెక్టర్ వారు నిర్ధేశించిన అపరాధ రుసుములను వసూలు చేయబడునని  ఆయన  ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.

Srikakulam

2021-09-03 16:44:22

డిగ్రీ రెండు మాద్యమాలు కొనసాగించాలి..

ప్రభుత్వ  డిగ్రీకళాశాల లో తెలుగు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా కొనసాగించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ డిగ్రీ కళాశాల ఆర్జెడి సిహెచ్. కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ ,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగుమీడియం విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారని ఆర్జేడీకి వివరించారు. ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకొని రెండు మాద్యమాల్లో ఈ కార్యక్రమంలో ఎ, టి రాజా ఎస్ఎఫ్ఐ నగర నాయకులు మణికంఠ సాయి లోవ తల్లి, సత్య, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-03 16:42:13

ఈనెల7కి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తికావాలి..

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 7 నాటికి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సర్వే ఎడి ప్రభాకరరావు ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న భూ రక్షణ, శాశ్వత భూ హక్కు, భూ రక్ష పై పైలెట్ గ్రామాల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులుతో కలసి శుక్రవారం  సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఒఎల్ఆర్ పక్కాగా ఉంటే సమస్యలు ఉండవని చెప్పారు. ఏ రోజు ఎన్ని గ్రామాల్లో పనులు జరుగుచున్నవో ఆ వివరాలు రాసుకోవాలన్నారు. పిఒఎల్ఆర్ ప్రగతి పై వారానికి రెండుసార్లు సమావేశం జరగాలని ఆదేశించారు. డిజిటల్ పంచాయతీల పనులు ఎంత వరకు వచ్చింది డిపిఓ రవి కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే పనులు వేగవంతం చేయాలని  కలెక్టర్  ఏడి సర్వేను ఆదేశించారు.  రీ సర్వే 3 ఫైలట్ గ్రామాల్లో డ్రోన్ తో సర్వే పూర్తి అయినదని, సెప్టెంబర్ 7 నాటికి గ్రౌండ్ వేలిడేషన్ పూర్తి చేయాలన్నారు. సమస్యలు ఉంటే 30 రోజుల్లో(అప్పీలు చేసుకోవాలి) పరిష్కారంచేసి సమస్య అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. డ్రోన్ సర్వే పూర్తి అయిన భూ యజమానులైన రైతులకు నోటీసులు జారీ చేసి వారి సమక్షంలోనే పిఒఎల్ఆర్ ప్రకారం సర్వే చేసి లోపాలుంటే సరి చేయాలని ఆదేశించారు. ఎల్పిఎం జనరేషన్ చేసి సరిచేయాలని, అప్పటికి ఎక్సటెంట్ సరిపోకపోతే డివిజన్ పరిధిలో అప్పీలు చేసుకోవాలని, అప్పటికి సంతృప్తి చెందకపోతే జిల్లా స్థాయిలో అప్పీలు చేసుకొని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పారు. అనంతరం రెవిన్యూ ప్రకారం పాసు పుస్తకాలు జారీ చేయబడునని వివరించారు. ఈ సమావేశంలో భూ సర్వే శాఖ సహాయ సంచాలకులు కుంచె ప్రభాకర్, ఉప కలెక్టర్ టి సీతారామమూర్తి, డిపిఓ రవి కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-03 12:51:18

25 MSMEలకు 3.4 కోట్ల రూపాయలు జమ..

ఔత్సాహిక  పారిశ్రామిక వేత్తలు  పరిశ్రమల స్థాపనకు  ముందుకువచ్చి పరిశ్రమలను స్థాపించాలని  జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్య కుమారి పిలుపునిచ్చారు.   శుక్రవారం  తాడేపల్లి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  సూక్ష్మ, చిన్న మధ్య  తరహ పరిశ్రమలకు 2 వ విడత  రాయితీ ని  రాష్ట్ర వ్యాప్తంగా వారి ఖాతాల్లో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బటన్ నొక్కి  జమ చేసారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి కలెక్టర్ తో పాటు శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లబ్ది దారులకు మెగా చెక్కును అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా లో 2 వ విడత క్రింద 25 ఎం.ఎస్.ఎం.ఈ  లకు  3.4 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.  ఈ అర్ధిక సహాయాన్ని పరిశ్రమల అభివృద్ధికి వినియోగించుకోవాలని అన్నారు.  వచ్చే  సోమవారం పరిశ్రమల అభివృద్ధి పై సమావేశం నిర్వహిస్తున్నామని, ఔత్సాహికులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.  
ఈ కార్యక్రమం లో వరల్డ్  విజన్ సంస్థ , సెట్విజ్  ఆధ్వర్యం లో నవరత్నాల పై ముద్రించిన నవరత్న మాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కరోనా లో కూడా సహాయం :  నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ 
పరిశ్రమల  స్థాపనకు ముందుకు వచ్చే యువతీ యువకులకు  ప్రస్తుత ప్రభుత్వం  అనేక అవకాశాలను అందిస్తూ ప్రోత్సహిస్తుందని  నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన  మీడియా తో మాట్లాడుతూ  రాష్ట్రం లో అన్ని జిల్లాల కంటే విజయనగరం లో తక్కువ పరిశ్రమలు ఉన్నాయని,  ప్రభుత్వం పరిశ్రమలకు అందించే రాయితీల పై ప్రచారం ఎక్కువగా జరగాలని అన్నారు. ఎస్.సి. ఎస్.టి. బి.సి.,మైనారిటీ , మహిళల, విద్యార్ధుల  సంక్షేమానికి   పధకాలను, రాయితీలను అందించడానికి ప్రభుత్వం ఒక క్యాలెండర్ ను రూపొందించి,  ప్రకటించిన తేదీల కు అనుగుణంగా క్రమం తప్ప కుండా అందిస్తూ  కరోనా కాలం లో ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.  ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్  జే. వెంకట రావు,  పరిశ్రమల జనరల్ మేనేజర్ జి.ఎం. శ్రీధర్ , ఎ.డి సీతారాం , ఐ.పి.ఓ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-09-03 11:09:45

మెటర్నటీ లీవు మంజూరుచేయండి..

మెటర్నిటీ లీవులు అమలు చేయాలని కోరుతూ కేజిహెచ్ కోవిడ్‌`19 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం ఈ మేరకు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్‌ & అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జెఎసి కార్యదర్శి పి.మణి మీడియాతో మాట్లాడారు. కెజిహెచ్‌లో కోవిడ్‌ కాలంలో గత ఏడాది139 కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు జిఓ.నెం.241 ద్వారా తమను ప్రభుత్వం నియమించిందన్నారు.  నియామక పత్రాల్లో మెటర్నిటీ లీవులు, సెలవులు వర్తిస్తాయని స్పష్టంచేసిందన్నారు. అయితే ఇటీవల వీరి  కాంట్రాక్ట్‌ ముగియడం, కోవిడ్‌ నేపధ్యంలో మరో 6నెలలు కాంట్రాక్ట్‌ను పొడిగించిన తరుణంలో తమకు మెటర్నిటీ లీవులు, ఇతర శెలవులు, అమలు కావని కెజిహెచ్‌ సూపరిన్‌టెండెంట్‌ చెప్పారని వారో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌లో పని చేసిన వారికి 6నెలల మెటర్నిటీ లీవులు ఇవ్వాలని స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలున్నా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెటర్నటీ శెలవులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి ప్రధాన కార్యదర్శి పి.మణి, కాంట్రాక్ట్‌ స్టాప్‌ చెల్లాయమ్మ, చంద్రకళ, మానస, మాధురి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
  

Visakhapatnam

2021-09-03 10:21:14

జిడిపి వృద్థికి ఎంఎస్ఎంఇలు దోహదం..

రాష్ట్ర జిడిపి వృద్థికి ఎంఎస్ంఇలు దోహదపడతాయని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారం పేర్కొన్నారు.  శుక్రవారం ఎంఎస్ఎంఇ, హేండ్లూమ్స్, స్పిన్నింగ్ మిల్స్ లకు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్సెంటివ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం సహకారం అవసరమన్నారు.  ముఖ్యమంత్రి పెద్దమనసుతో ఎంఎస్ఎంఇలకు ఇప్పటి వరకు 2086.42 కోట్లు ప్రోత్సాకాలు ఇచ్చినట్లు చెప్పారు.  22, మే 2020 నెలలో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 450.27 కోట్లు, 29 జూన్, 2020లో ఎంఎస్ఎంఇలకు రీ స్టార్ట్ ప్యాకేజి కింద 453.64 కోట్లు,  29, జూన్, 2020న  ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు 58.51 కోట్లు, 3, సెప్టెంబరు 2021న ఎంఎస్ఎంఇలకు  440 కోట్లు, 3, సెప్టెంబరు 2021న టెక్స్ టైల్స్ / స్పిన్నింగ్ మిల్స్ కు 684 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు.  పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చట్టం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.  చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పటికే తమ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో పాలకొండ శాసన సభ్యురాలు వి. కళావతి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-03 10:13:44

లైంగిక వేధింపులెదురైతే ఫిర్యాదు చేయండి..

మహిళా ఉద్యోగిణిలు, సిబ్బంది పనిచే చోట లైంగిక వేధింపులకు గురైతే కచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) దృష్టికి తీసుకురావాలని న్యాయవాది సామాజిక వేత్త రహీమున్నీసాబేగమ్ కోరారు. విశాఖలో శుక్రవారం  కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో జరిగిన  ప్రత్యేక సమావేశంలో ఆమె ఎథిక్స్ /పోష్ కమిటీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా  పలు కీలక అంశాలపై చర్చించారు. మహిళా ఉద్యోగులు పనిచేసే చోట ఏవిధంగా ఉండాలో, ఉండకూడదో కూడా అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు ఎవరూ అభద్రతా భావంతో ఉందొద్ధని చట్టం,న్యాయం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా మహిళా ఉద్యోగులకు అండగా ఉండే పలు అంశాలను కూడా అక్కడి ఉద్యోగినులకు తెలియజేశారు. ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్) పైనా చర్చించి మహిళల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు.

Visakhapatnam

2021-09-03 10:06:40

50,693.90 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దం..

తూర్పుగోదావరి జిల్లాలోని 64 మండలాల్లాల్లో 50,693.90 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దంగా ఉన్నాయని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.విజయ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం ఈమేరకు కాకినాడ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు ఎరువులును సమ్రుద్ధిగా మంజూరు చేసిందన్నారు. వీటిని అన్ని మండలాలకు సరఫరా చేసినట్టు ఆయన వివరించారు. రైతులు వినియోగాన్ని బట్టీ గ్రామసచివాలయ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు. రైతులకు నకిలీ ఎరువుల వినియోగించకుండా ప్రభుత్వమే నాణ్యమైన ఎరువులను సిద్దం చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ఎరువలన్నీ అగ్రిల్యాబ్ ద్వారా టెస్టింగ్ లో నాణ్యత పరిశీలించి వచ్చివేనని  జాయింట్ డైరెక్టర్ వివరించారు.

Kakinada

2021-09-03 09:37:54

15నుంచి ఆగ్రిమార్కెటింగ్ లో ఈ-పర్మిట్లు..

తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబరు 15 నుంచి వ్యవసాయాధారిత వ్యాపారాలకు సంబంధించి ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు సూర్యప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఈ మేరకు కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వ్యాపారస్తులను సాధారణ పద్దతిలో అనుమతులు మంజూరు చేసేవారమని, ఇక నుంచి ఆన్ లైన్ ద్వారా పర్మిట్లు మంజూరు చేయడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. తద్వారా వ్యాపారస్తులకు ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని 22 మార్కెట్ కమిటీలకు సమాచారం అందించినట్టు ఏడి  ఆ ప్రకటనలో తెలియజేశారు.

Kakinada

2021-09-03 09:36:54

తాశీల్దార్‌పై దాడి చేసిన‌వారిపై చ‌ర్య‌లు..

విజ‌య‌న‌గ‌రంజిల్లా  మ‌క్కువ తాశీల్దార్ వీర‌భ‌ద్ర‌రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్ప‌డిన వ్యక్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి తెలిపారు. విధులు నిర్వ‌ర్తిస్తున్న మ‌క్కువ‌ తాశీల్దార్‌, ఆర్ఐ, విలేజ్ స‌ర్వేయ‌ర్‌, మ‌హిళా పోలీసుపై కొంద‌రు వ్య‌క్తులు రెండు రోజుల క్రితం దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌పై, క‌లెక్ట‌ర్ స్పందించారు. వారిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేసి, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని,  ఇలాంటి సంఘ‌ట‌న పున‌రావృతం కాకుండా చూడాల‌ని, జిల్లా ఎస్‌పిని కోరిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాగా మ‌క్కువ తాశీల్దార్ డి.వీర‌భ‌ద్ర‌రావు, ఇత‌ర రెవెన్యూ సిబ్బందిపై జ‌రిగిన దాడిని, జిల్లా రెవెన్యూ అసోసియేష‌న్ తీవ్రంగా ఖండించింది. తాశీల్దార్‌, ఇత‌ర ఉద్యోగుల‌కు, రెవెన్యూ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు టి.గోవింద‌, గొట్టాపు శ్రీ‌రామ్మూర్తి, కోశాధికారి ర‌మ‌ణ‌రాజు త‌మ సంఘీభావాన్ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే జిల్లాలోని తాశీల్దార్లు అంద‌రూ, రెవెన్యూ ఉద్యోగులంతా క‌లిసి మ‌క్కువ వెళ్లి వారికి అండ‌గా నిలిచేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్‌పిల‌ను కోరిన‌ట్లు వారు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Vizianagaram

2021-09-03 09:15:13

బధిర అభ్యర్థులకు APVCC టచ్ ఫోన్లు..

బధిర అభ్యర్థులకు ఎపివిసిసి ద్వారా టచ్ ఫోన్లు ఉచితంగా సరఫరా చేయబడునని విభిన్న ప్రతిభావంతుల శాఖ హాయ సంచాలకులు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  జిల్లాలో గల 18 సంవత్సరములు నిండి 40 సంవత్సరములు లోపు ఉన్న 10వ తరగతి మరియు ఆపై తరగతులు చదువుకున్న చదువుచున్న బధిర అభ్యర్థులకు APVCC ద్వారా టచ్ ఫోన్ ఉచితముగా సరఫరా చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.   దృవ పత్రములు ఆన్ లైన్ లో apdascac.ap.gov.in అనే వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోనవలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసిన వారు సదరం (వైద్యదృవ పత్రము 40 శాతము ఆపై బడి ఉండవలెను), ఆధార్ కార్డు,  తెల్ల రేషన్ కార్డు, Sign language Certificate (ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఆడియోలజిస్ట్ ద్వారా), 10వ తరగతి మరియు ఆ పై తరగతులు చదువుకున్న సర్టిఫికేట్లు జతచేయవలసినదిగా ఆ ప్రకటనలో వివరించారు.  అప్లోడ్ చేసిన తదుపరి ఆన్ లైన్ రశీదుతో పాటు ఆన్ లైన్ లో చేసిన దరఖాస్తును జత చేసి సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, శ్రీకాకుళం కార్యాలయంనకు (Hard Copy)పోస్టు ద్వారా గానీ, కార్యాలయ పని వేళల్లో అందజేయవలసినదిగా తెలిపారు.  జిల్లాలో గల అర్హులైన బధిరులు అభ్యర్థులు ఈ అవకాశము సద్వినియోగము చేసుకోవలసిందిగా ఆ ప్రకటనలో కోరారు. కార్యాలయము Mail Address addwskim@gamil.com పంపవలసినదిగా పూర్తి వివరములకు సహాయ సంచాలకులు వారి కార్యాలయము పోన్ నెం. 08942 240519 కు సంప్రదించవలసినదిగా ఆ ప్రకటనలో తెలిపారు.

Srikakulam

2021-09-02 12:24:03

కూరగాయల దాత‌ల సేవ‌లు అభినంద‌నీయం..

టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగానికి దాత‌లు ప్ర‌తి సంవ‌త్స‌రం కోట్లాది రూపాయ‌ల విలువ చేసే కూర‌గాయ‌ల‌ను విరాళంగా అందిస్తున్నార‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌శంసించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం కూర‌గాయ‌ల దాత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ కూర‌గాయ‌ల దాత‌లు అందించే కూర‌గాయ‌ల‌తో ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు రుచిక‌ర‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. 2004 నుండి ఎటువంటి అంతరాయం లేకుండా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ప్రతి నెలా లక్షల రూపాయల విలువైన కూరగాయలు విరాళంగా ఇస్తున్నార‌న్నారు. గో ఆధారిత సహజ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టి, రసాయన రహిత కూరగాయలను పండించాల‌ని దాత‌ల‌ను కోరారు. శ్రీ‌వారి భ‌క్తుక‌లకు ఉదయం మరియు సాయంత్రం వేర్వేరు మెనూలతో రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలని టిటిడి నిర్ణయించింద‌న్నారు. టిటిడి అన్నప్రసాదం విభాగం కోరిన మెనూ ప్రకారం కూరగాయలను సరఫరా చేయాలని కూరగాయల దాతలను ఆయన కోరారు. ప్ర‌తి రోజు కూరలు, సాంబార్ మరియు రసం తయారు చేయడానికి మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో రోజుకు 90 యూనిట్లు అవుతుంద‌ని, ఇందులో ఉద‌యం 56 యూనిట్లు, రాత్రి భోజనంలో 34 యూనిట్‌లతో (ఒక యూనిట్ 250 మంది యాత్రికులకు అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించ‌డానికి సమానం) తయారు చేయబడుతున్నాయ‌న్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అన్నప్రాదం విభాగంలోని ఒక్కో యూనిట్‌కు 48 కిలోల కూరగాయలు అవసరం అవుతాయ‌ని తెలిపారు.

       కూరగాయల దాతలు కూడా గత ఒకటిన్నర దశాబ్దాలుగా టిటిడి అన్నప్రసాదం కార్యకలాపాల్లో భాగమైనందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టిటిడి అవసరానికి అనుగుణంగా కూరగాయలను సరఫరా చేయడానికి దాత‌లు వెంటనే అంగీకరించారు. ఈ సంద‌ర్భంగా దేశీయ‌ గో ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి సేంద్రియ సాగుపై తాము ఖచ్చితంగా దృష్టి పెడతామని వారు హామీ ఇచ్చారు. అద‌న‌పు ఈవో కోరినట్లుగా దర్శన సమయంలో ప్రతి రోజు 500 అరటి పండ్లను శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు అందించడానికి వారు అంగీకరించారు. తిరుమల శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సంవత్సరానికి ఒకసారి కూరగాయల దాతలను సన్మానించ‌డం ఆన‌వాయితీ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సమావేశానికి హాజరైన 14 మంది కూరగాయల దాతలకు అదనపు ఈవో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఈవో  కూరగాయల దాతల‌ను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో సన్మానించారు. ఈ స‌మావేశంలో అన్నప్రసాదం డెప్యూటీ ఈవో   హరీంద్రనాథ్, కేటరింగ్ ఆఫీసర్  జిఎల్ఎన్‌ శాస్త్రి, ఏఈవో  గోపీనాథ్, కూరగాయల దాతలు పాల్గొన్నారు.

Tirupati

2021-09-02 12:17:54

పారాయ‌ణంతో మార్మోగిన స‌ప్త‌గిరులు..

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని ప్ర‌థ‌మ‌, ద్వితీయ సర్గల‌లో ఉన్న మొత్తం 143 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో స‌ప్త‌గిరులు మార్మోగాయి. బాల‌కాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆధ్యాప‌కులు ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ ‌మ‌న పూర్వీకులు మ‌న‌కు అందించిన దివ్య శ‌క్తి మంత్రోచ్ఛ‌ర‌ణ అని, దీనితో స‌మ‌స్త రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌పంచ శాంతి, క‌రోనా మూడ‌వ వేవ్ చిన్న పిల్ల‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని ప్ర‌భుత్వాలు, వైద్య సంస్థ‌లు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో పిల్ల‌లు, పెద్ద‌లు అన్ని వ‌ర్గ‌లవారు సుఖ‌శాతంతుల‌తో ఉండాల‌ని బాల‌కాండ పారాయ‌ణం నిర్వ‌హ‌స్తున్న‌ట్లు చెప్పారు. బాల‌కాండ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సర్గల్లోని మొత్తం 143 శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మ‌రి నివార‌ణ మంత్ర పారాయ‌ణం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌న్నారు. దీనిని పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న ఆరోగ్యం, సుఖం, శాంతి, విద్యా, ఐశ్వర్యం సిద్ధిస్తాయ‌ని వివ‌రించారు.

            ఆచార్య ప్ర‌వా రామ‌క్రిష్ణ సోమ‌యాజులు పర్యవేక్షణలో డా.కోగంటి రామానుజాచార్యులు, శ్రీ ఇంద్ర‌కంటి స‌త్య కిషోర్ పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.   ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం   " రామరామ జ‌య రాజ రామ్‌.. రామ‌రామ జ‌య సీతా రామ్  ", అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో,   "  శ్రీ హ‌నుమాన్ జ‌య హ‌నుమాన్ జ‌య జ‌య క‌పివ‌ర బ‌హుబ‌ల‌వాన్  " అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.

              ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు  మోహ‌నరంగాచార్యులు, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి పాల శేషాద్రి పాల్గొన్నారు.

Thirumalgiri

2021-09-02 11:19:45