1 ENS Live Breaking News

చింతపల్లి బీచ్ రిసార్ట్స్ అభివృద్ధికి చర్యలు..

విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలం చింతపల్లి లో బీచ్ రిసార్ట్స్ అభివృద్ధి కి  ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   పర్యాటక శాఖ అధికారులని ఆదేశించారు. ఆదివారం  కలెక్టర్ తీర ప్రాంతాలైన  కోనాడ, తిప్పలవలస, బిజిపేట, చింతలవలస లో పర్యటించి  రిసార్ట్స్ ను సందర్శించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ చింతపల్లి రిసార్ట్స్  ఆధునీకరణకు త్వరగా ఒక  కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసి పంపాలన్నారు.  బిజిపేట, తిప్పలవలస  మత్స్యకార నాయకులు కలెక్టర్ ను కలసి  ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ స్థానిక శాసన సభ్యులు తో మాట్లాడి తగు నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని అన్నారు.  ఈ పర్యటనలో  తహసీల్దార్  కృష్ణ మూర్తి,  ఏ.పి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్  ప్రతినిధులు శుభ్రమణ్యం,  మత్స్యకార నాయకులు  చిన్నప్పన్న , స్థానిక  మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-22 15:32:50

రేపు ఆంధ్రకేసరి టంగుటూరి జయంతి..

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆగష్టు 23 సోమవారం నాడు రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్  ఏ. సూర్యకుమారి తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలోని జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి కార్యాలయాల్లో సోమవారం టంగుటూరి జయంతి వేడుకలను కోవిడ్ నిబంధనల మేరకు జరుపుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10-30 గంటలకు నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని అధికారులు, వారి సిబ్బంది హాజరు కావాలని పేర్కొన్నారు.

Vizianagaram

2021-08-22 15:27:48

రోడ్డు పనులను సత్వరమే పూర్తిచేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి ఛాంబరులో జిల్లాలోని రోడ్డు పనులపై శనివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానంలో RWS శాఖ ప్రతిపాదించిన 19 రోడ్లలో 13 రోడ్లకు ఆమోదించడం జరిగిందన్నారు. ఆ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన 6 రోడ్లకు సర్వే చేసి అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా ఐ.టి.డి.ఎ పరిధిలో చేపడుతున్న 3 రోడ్లలో 1 రోడ్డు ఆమోదించడం జరిగిందని, మిగిలిన 2 రోడ్లకు కూడా సర్వే చేసి అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్,  జిల్లా అటవీశాఖాధికారి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-21 17:11:32

గ్రామ పరిపాలన కోసమే సచివాలయాలు..

ప్రజలకు పారదర్శకంగా పాలన అందాలంటే గ్రామ పరిపాలనా విభాగం అభివృద్ధి చెందాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలంలోని నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి డా. సీదిరి అప్పలరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సత్వరమే అందుకోవడంతో పాటు ప్రజా పరిపాలనా విభాగం మెరుగుపరిచేందుకు సచివాలయాలు ఉపయోగపడతాయని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో గ్రామ పరిపాలన జరిగితే గ్రామ స్వరాజ్యం ఏర్పాటుచేసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి భావించి సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేశారని గుర్తుచేసారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసారని తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా  ప్రజా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని తెలిపారు. వ్యవస్థల్లో ఉన్న లోపాలతో ప్రజలపై భారం పడకూడదని, ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి తక్షణమే లబ్ధిదారునికి అందేలా చూసే బాధ్యత సచివాలయ వ్యవస్థ చూసుకుంటుందని అన్నారు. సచివాలయాలు అన్ని గ్రామ అభివృద్దికి దేవాలయాలు అని అన్నారు. ప్రజా పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా నారాయణపురంలో సచివాలయంకు నూతన భవనం ప్రారంభించుకుంటున్నమని అన్నారు.

 వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరుగాలం కష్టపడే రైతుకు  భరోసాగా ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు.  రైతుకు నిత్యం తోడుగా ఉండాలని రైతు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి భాటలు వేస్తున్న రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ది జరగాలని కోరుకుంటున్నామని, ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రతి సచివాలయం వద్ద ప్రజా ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేసారు. అందులో భాగంగా ఆరోగ్య కేంద్రం ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వైద్యం అందని గ్రామాలకు నేడు సచివాలయాల చెంతనే వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మందస మండల తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-21 17:10:37

ఏకలవ్య పాఠశాలలు త్వరగా పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలోని ఐ.టి.డి.ఎ పరిధిలో చేపడుతున్న ఏకలవ్య పాఠశాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ­పేర్కొన్నారు. ఏకలవ్య పాఠశాల జిల్లా స్థాయి కమిటీ సమావేశం సీతంపేట ఐ.టి.డి.ఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏకలవ్య టీచర్ల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బడ్జెట్ నిధులు విడుదల కోసం డైరెక్టర్ కు లెటర్ రాయాలని కలెక్టర్ సూచించారు. తొలుత ఏకలవ్య పాఠశాలల తరగతులు జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్న ఆయన ఉపాధ్యాయులకు అవసరమయ్యే శిక్షణను ఇప్పించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీలో ఉన్న ఎడ్యుకేషన్ ప్రతినిధులు వారి పరిధిలోని పాఠశాలను తనిఖీ చేయాలని సూచించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీధర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మిపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.చంద్రనాయక్, ఇన్ ఛార్జ్ జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సర్వ శిక్షా అభియాన్ ప్రోజెక్ట్ అధికారి యస్.తిరుమల చైతన్య, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆచార్య బిడ్డిక అడ్డయ్య, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, ఐ.టి.డి.ఎ ఓ.ఎస్.డి యుగంధర్, ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాసులు, వి.సుబ్రమణ్యం, గురుకులం సెల్ ఇన్ ఛార్జ్ వెంకటేశ్వర్లు, కమిటీ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-21 17:04:06

సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలి..

శ్రీకాకుళం ప్రతి సోమవారం ఖాదీ, చేనేత వస్త్రాలు ధరించడం సాంప్రదాయంగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ పొందూరు ఖాదీ జాతీయ, అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిందని అయినప్పటికీ ఖాదీ, చేనేతకారుల ఆర్థిక స్థితి గతులు అనుకున్న స్థాయిలో ఉండడం లేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ, చేనేత కార్మికులకు తగిన ప్రోత్సాహం అందించి వారి జీవన పరిస్థితులు మెరుగుకావడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న కార్మికులకు ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల క్రింద చేయూతను ఇస్తున్నాయని ఆయన తెలియజేస్తూ జిల్లాలో చేనేత కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం ఖాదీ, చేనేత వస్త్రాలను ధరించి ఖాదీ, చేనేత కార్మికులకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా సహకారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Srikakulam

2021-08-21 16:16:29

అర్హులందరికీ పథకాలు అమలు చేయాలి..

అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అంద‌జేయడం ద్వారా, వాటి ల‌క్ష్య సాధ‌న‌కు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి కోరారు.  జిల్లా అవ‌స‌రాలు, స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా యూనిట్ల‌ను రూపొందించి, వాటిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు.  వైఎస్ఆర్ క్రాంతిప‌థం, డిఆర్‌డిఏ, మెప్మా కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శ‌నివారం క‌లెక్ట‌ర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల ప‌రంగా అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను,  జిల్లాలో వాటి ప్ర‌గ‌తిని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు వివ‌రించారు. వైకెపి, డిఆర్‌డిఏ ద్వారా వైఎస్ఆర్ చేయూత‌, వైఎస్ఆర్ బీమా, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ ఆస‌రా, సున్నా వ‌డ్డీ, వైఎస్ఆర్ పింఛ‌న్ కానుక‌, నైపుణ్య శిక్ష‌ణ‌, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్న‌తి త‌దిత‌ర ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. మెప్మా ద్వారా అమ‌లు జ‌రుగుతున్న‌ వైఎస్ఆర్ బీమా, జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ ఆస‌రా, స్వానిధి, ఉపాధి క‌ల్ప‌నా ప‌థ‌కాలు, టిట్కో హౌసింగ్‌, క్లాప్ త‌దిత‌ర ప‌థ‌కాల‌ను ప్ర‌గ‌తిని వివ‌రించారు. కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డంతోపాటుగా, డిజిట‌ల్ ఎక‌నాల‌డ్జ‌మెంట్ త‌ప్ప‌నిస‌రి చేశామ‌ని చెప్పారు. క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, జిల్లాలోని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని సూచించారు. ఆయా ప్రాంతాల సామాజిక అవ‌స‌రాలు, భౌగోలిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని, యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. పేద‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న క‌ల్పించి, వాటిని అట్ట‌డుగు స్థాయికి అందేలా చూడాల‌న్నారు. పథ‌కాల‌కు ఎంపిక చేసిన ల‌బ్దిదారుల జాబితాల‌ను ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అంద‌జేయాల‌ని చెప్పారు. 

వివిధ ప‌థ‌కాల ద్వారా రుణాల‌ను అందించ‌డంతోపాటుగా, వాటి రిక‌వ‌రీపైనా దృష్టి పెట్టాల‌ని సూచించారు. రిక‌వ‌రీ విష‌యంలో భోగాపురం, చీపురుప‌ల్లి, గుర్ల మండ‌లాలు వెనుక‌బ‌డి ఉండ‌టంపై ఆరా తీశారు.  సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించి, ప‌థ‌కాల అమ‌లును ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. బీమా ప‌థ‌కాన్ని పేద‌లంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డం ద్వారా, వారి జీవితాల‌కు భ‌రోసా ల‌భిస్తుంద‌న్నారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం ప్ర‌గ‌తి త‌క్కువ‌గా ఉంద‌ని, వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. ఈ నెలాఖ‌రునాటికి ఈకెవైసి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని, నైపుణ్య శిక్ష‌ణ జ‌ర‌గాల‌న్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతంలో గృహ నిర్మాణ కార్య‌క్ర‌మం భారీ స్థాయిలో జ‌రుగుతోంద‌ని, అందువ‌ల్ల హౌసింగ్ లోన్స్‌పై దృష్టి పెట్టాల‌ని, ముఖ్యంగా గుంకలాం లేఅవుట్ ల‌బ్దిదారుల‌కు రుణాల‌ను త్వ‌ర‌గా మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  ఈ స‌మీక్షా స‌మావేశంలో డిఆర్‌డిఏ, వైకెపి ప్రాజెక్టు డైరెక్ట‌ర్ అశోక్‌కుమార్‌, మెప్మా ప్రాజెక్టు డైరెక్ట‌ర్ సుధాక‌ర రావు, డిఆర్‌డిఏ ఏపిడి సావిత్రి, డిపిఎంలు, టిపిఎంలు, ఏరియా కో-ఆర్డినేట‌ర్లు, ఏపిఎంలు, సిసిలు, సిఎంఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-21 15:36:18

18ఏళ్లు దాటినవారందరికీ కోవిడ్ టీకా..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 18 ఏళ్లు దాటిన‌వారంద‌కీ కోవిడ్ వేక్సిన్ వేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీఒక్క‌రూ వినియోగించుకొని, వేక్సిన్ వేయించుకోవాల‌ని కోరారు. జిల్లాలో జ‌రుగుతున్న కోవిడ్ వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై త‌న ఛాంబ‌ర్‌లో శ‌నివారం స‌మీక్షించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ కోవిడ్ వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన‌ట్లు క‌లెక్ట‌ర్ చెప్పారు. సోమ‌వారం నుంచి ఈ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేస్తున్నామ‌ని, ప్ర‌తీఒక్క‌రూ దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఇప్పటికే జిల్లాలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 వేక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. వీటిలోని 26 కేంద్రాల్లో ప్ర‌త్యేకంగా కో-వేగ్జిన్ వేస్తార‌ని, మొత్తం 80 కేంద్రాల్లోనూ కోవిషీల్డ్ వేక్సిన్ వేస్తార‌ని  చెప్పారు. అన్ని పిహెచ్‌సిలు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల‌లో వేక్సినేష‌న్ జ‌రుగుతుంద‌న్నారు. వివిధ రంగాల వారీగా కూడా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఈనెల 24న, 18 ఏళ్లు దాటిన‌ బిసి  కాలేజ్ హాస్ట‌ల్ విద్యార్థుల‌కు, హాస్ట‌ల్‌ సిబ్బందికి వేక్సినేష‌న్ ఏర్పాటు చేశామ‌న్నారు. అలాగే హొట‌ల్స్ అసోసియేష‌న్ ద్వారా, హొట‌ల్ సిబ్బందికి, సివిల్ స‌ప్లయిస్ కార్పొరేష‌న్ ద్వారా ఆ సంస్థ‌ సిబ్బందికి, వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా వేక్సినేష‌న్ నిర్వ‌హిస్తామ‌న్నారు.
     
           జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు సుమారుగా 9,74,091 మందికి మొద‌టి డోసును, 2,32,226 మందికి రెండో డోసును వేక్సిన్ వేశామ‌ని చెప్పారు. హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు శ‌త‌శాతం వేక్సినేష‌న్ జ‌రిగింద‌న్నారు. పిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లుల‌కు శ‌త‌శాతం, గ‌ర్భిణిల‌కు సుమారు 75శాతం వేక్సినేష‌న్ పూర్తిచేసిన‌ట్లు చెప్పారు. వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములై, జిల్లాలో ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఈ స‌మావేశంలో డిఐఓ డాక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, డిబిసిడ‌బ్ల్యూఓ కీర్తి, ఎన్ఐసి అధికారి న‌రేంద్ర‌,  ప‌లువురు డాక్ట‌ర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-21 15:32:30

ఆ ప్రాంతంలో అంత వర్షపాతమా..వామ్మో

తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడులో 106.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. అతితక్కువగా కూనవరంలో 0.2 మిల్లీమీటర్లు నమోదు కాగా రాజమండ్రి డివిజన్ లో అత్యధికంగా గోకవరం 78.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏడు డివిజన్లలో రమారమి 0.05 మిల్లీ మీటర్లు నుంచి 56 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 21.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్టుగా కలెక్టర్ కార్యాయం పేర్కొంది..

Kakinada

2021-08-20 12:12:28

అప్పన్నకు జివిఎంసీ కమిషనర్ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని వలక్షవ్రతం సందర్భంగా శుక్రవారం మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ కమిషనర్ స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కమిషనర్ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-20 11:43:46

బాధితురాలిని ప‌రామ‌ర్శించిన మంత్రులు..

ప్రియుడిచేతిలో దాడికి గురై, జిల్లా కేంద్రాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న, పూసాటిరేగ మండ‌లం చౌడ‌వాడ‌కు చెందిన రాముల‌మ్మ‌ను, ఆమె కుటుంబ స‌భ్యుల‌ను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాములు పుష్ప శ్రీ‌వాణి, మున్సిప‌ల్ శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. ఆసుప‌త్రి వైద్యాధికారుల‌తో మాట్లాడి, వారి ఆరోగ్య ప‌రిస్థితిని వాక‌బు చేశారు.  ప్రాణాపాయం లేద‌ని, ఎటువంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, చికిత్స‌క‌య్యే ఖ‌ర్చునంతా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ఆ కుటుంబానికి  ధైర్యం చెప్పారు.ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి మీడియాతో మాట్లాడుతూ,  ఈ సంఘ‌ట‌న చాలా దుర‌దృష్ట‌క‌మంటూ, దానిని ఖండించారు. పెళ్లి చేసుకోవాల్సిన వ్య‌క్తే, త‌న‌కు కాబోయే భార్య‌పై అనుమానంతో దాడి చేశాడ‌ని, పెట్రోలు పోసి నిప్పంటించాడ‌ని చెప్పారు. అయితే బాధితులు త‌క్ష‌ణ‌మే స్పందించి, దిశ యాప్‌ను ఉప‌యోగించ‌డంతో, స‌కాలంలో పోలీసులు అక్క‌డికి చేరుకొని, బాధితుల‌ను జిల్లా కేంద్రాసుప‌త్రికి త‌ర‌లించార‌ని చెప్పారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి తీసుకువ‌చ్చిన దిశ యాప్ వారి ప్రాణాల‌ను కాపాడింద‌ని అన్నారు. దిశ‌యాప్‌లో ఎస్ఓఎస్‌ బ‌ట‌న్‌ను బాధితురాలి సోద‌రి ప్రెస్ చేయ‌డంతో, వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందింద‌ని తెలిపారు. రాష్ట్రంలోని ఆడ‌బిడ్డ‌లంతా దిశ‌యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని కోరారు. ఆప‌ద స‌మ‌యంలో ఎస్ఓఎస్ బ‌ట‌న్ నొక్కితే, పోలీసులు అక్క‌డికి చేరుకొని రక్ష‌ణ క‌ల్పిస్తార‌ని చెప్పారు.

               మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, చౌడ‌వాడ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఎటువంటి ప్రాణాపాయం లేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ మెరుగైన వైద్యం కోసం విశాఖ‌ప‌ట్నం స్టీలుప్లాంటు బ‌ర్న్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిపారు. దాడికి పాల్ప‌డిన రాంబాబును, అత‌నిని ప్రోత్స‌హించిన‌వారిని గుర్తించి, వారికి శిక్ష ప‌డేలా చేస్తామ‌ని అన్నారు. బాధిత‌రాలు రాముల‌మ్మ‌కు, నిందితుడు రాంబాబుతో 8 నెల‌ల నుంచీ ప‌రిచ‌యం ఉంద‌ని, ఇద్ద‌రూ ప్రేమించుకుంటూ, అక్టోబ‌రులో పెళ్లి చేసుకోవ‌డానికి పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒప్పందం కుదిరింద‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, రాముల‌మ్మ‌పై అనుమానంతో పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టేందుకు రాంబాబు ప్ర‌య‌త్నించాడ‌ని చెప్పారు.  ఆ కుటుంబాన్ని ఆదుకొనేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి అన్నారు.  బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన వారిలో జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి, ఎస్‌పి దీపిక‌, ఎంఎల్‌సి పెనుమ‌త్స సురేష్ బాబు, ఎంఎల్ఏలు బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.

Vizianagaram

2021-08-20 10:50:50

సెప్టెంబరు 9న జాతీయ లోక్ అదాలత్..

తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబరు 9న రాజమండ్రిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి ఎం.బబిత తెలియజేశారు. వివిధ కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నరు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమంలో వివిధ కేసులను పరిష్కరించుకోవచ్చునన న్యాయమూర్తి కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Rajahmundry

2021-08-20 10:33:23

శబ్ద కాలుష్యం లేని ఆటోలు నడపాలి..

శ్రీకాకుళం నగరంలో శబ్ద కాలుష్యాన్ని వెదజల్లుతూ లౌడ్ స్పీకర్లతో తిరుగుతున్న ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, ట్రాఫిక్ డిఎస్పీ సి.హెచ్.జి వి.ప్రసాద్ ఆదేశాలు మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాల్లో లౌడ్ స్పీకర్ లు ఏర్పాటు చేస్తూ శబ్ద కాలుష్యం కలిగిస్తున్న ఆటో డ్రైవర్లకు,  ఇతర వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్లను తొలగించారు. ట్రాఫిక్ యస్ ఐ లక్షణ రావు మాట్లాడుతూ పర్యావరణ హితాన్ని కోరుతూ శబ్ద కాలుష్యం చేసే ఆటోల పై చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు శాఖ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ స్వచ్ఛ శ్రీకాకుళం సాధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్లు హేమచంద్ర , జనార్దన్, హోమ్ గార్డ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Srikakulam

2021-08-20 09:47:58

తుపానుపై అప్రమత్తంగా ఉండండి..

బంగళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల కాలంలో తుఫానుగా బలపడే అవకాశం వుందని వాతావరణ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో విపత్తు నియంత్రణ, సహయక యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అప్రమత్తం చేశారు.  అల్పపీడన ప్రభావంతో ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకూ గంటకు 45 నుండి 60 కిమీ వేగంతో తూర్పు తీరంలో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతవారణ కేంద్రం తెలియజేసిందని.. దీని  దృష్ట్యా మత్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీచేశారు.  జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల కేంద్రాలలో  రక్షణ, సహాయక శాఖల సమన్వయతో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు – కలెక్టరేట్, కాకినాడ –18004253077, సబ్ కలెక్టరు ఆఫీసు, రాజమహేంద్రవరం – 08832442344, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎటపాక – 08748285279, పిఓ, ఐటిడిఏ ఆఫీసు, రంపచోడవరం –18004252123, ఆర్డిఓ ఆఫీసు, అమలాపురం – 08856233100, ఆర్డిఓ ఆఫీసు, కాకినాడ -08842368100,  ఆర్డిఓ ఆఫీసు, రామచంద్రపురం –08857245166.

Kakinada

2021-08-20 09:23:24

శ్రీ పద్మావతి ఆలయంలో వరలక్ష్మీవ్రతం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం  వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సంప్రదాయ పుష్పాలతో  ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా  ఆరాధించారు. అనంతరం శ్రీ వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని, ఆచరించవలసిన విధానాన్ని  ఆగమ పండితులు   శ్రీనివాసాచార్యులు  తెలియజేశారు.  తరువాత ఐదు రకాల కుడుములతో పాటు 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.  2713 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసి వర్చువల్ గా ఈ వ్రతంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి  వేణుగోపాల కృష్ణ,  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు  బాబుస్వామి పాల్గొన్నారు. భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేసింది.

Tirupati

2021-08-20 09:00:45