1 ENS Live Breaking News

20, 21తేదీల్లో మంత్రి బొత్స పర్యటన..

రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌, శ‌నివారాల్లో జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. పుర‌పాల‌క మంత్రి గురువారం సాయంత్రం 5 గంట‌ల‌కు విశాఖ చేరుకొంటారు. శుక్రవారం రోజంతా జామి, గంట్యాడ‌, గుర్ల‌, చీపురుప‌ల్లి మండ‌లాల్లో ప‌ర్య‌టించి గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాలు, రైతుభ‌రోసా కేంద్ర భ‌వ‌నాలు, నాడు - నేడు కింద ఆధునీక‌రించిన పాఠ‌శాల‌ల‌ను, ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ ల్యాబ్‌ను ప్రారంభించ‌నున్నారు. 20వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జామి మండ‌లం విజినిగిరిలో గ్రామ స‌చివాల‌యం నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. 11-30 గంట‌ల‌కు గంట్యాడ మండ‌లం కొర్లాంలో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని, రైతుభ‌రోసా కేంద్ర భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు.
మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు గుర్ల మండ‌లం ఎస్‌.ఎస్‌.ఆర్‌.పేట‌లో గ్రామ స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. 3.30 గంట‌లకు చీపురుప‌ల్లి మండ‌లం వంగ‌ప‌ల్లిపేట‌లో వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ భ‌వ‌నాన్ని ప్రారంభిస్తారు. 4.00 గంట‌ల‌కు చీపురుప‌ల్లి మండ‌లం పేరిపిలో నాడు - నేడు కింద ఆధునీక‌రించిన పాఠ‌శాల‌ను ప్రారంభిస్తారు.  21వ తేదీ శ‌నివారం నాడు స్థానికంగా ఏర్పాటైన కార్య‌క్ర‌మాల్లో పాల్గొని విశాఖ వెళ‌తారు. సాయంత్రానికి విజ‌య‌వాడ చేరుకుంటారు.

Vizianagaram

2021-08-19 16:07:39

కోవిడ్ నిబంధనలతోనే పండుగలు జరుపుకోవాలి..

విజయనగరం జిల్లాలో రాబోయే పండగలన్నిటిని కోవిడ్ తగ్గే వరకు కోవిడ్ నిబంధనల ననుసరించి జరుపుకోవాలని జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో  మైనారిటీ సంక్షేమ శాఖ వారు ముద్రించిన నో మాస్క్ – నో  ఎంట్రీ నినాదం తో ఉన్న పోస్టర్లను ఆవిష్కరించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ  ముస్లిం సోదరులకు మొహరం శుభాకాంక్షలు తెలియజేసారు.  శుక్రవారం  ముస్లిం సోదరులు  జరుపుకునే మొహరం పండగను  భక్తి శ్రద్ధలతో కోవిడ్ నడుమ జరుపుకోవాలని అన్నారు.  వ్యక్తుల మధ్య కనీసం  6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని,  అలింగానాలు వద్దని అన్నారు.  ప్రతి ఒక్కరు మాస్క్ వినియోగించాలని, శానిటైజర్  వాడాలని సూచించారు.   రోజు రోజుకు కోవిడ్ కేసు లు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు.  పాఠశాలలు తెరుచుకున్నాయని, పిల్లలకు  కోవిడ్ సోక కుండా జాగ్రత్తలు  తీసుకోవాలని అన్నారు.  కోవిడ్ నియంత్రణ కు  ప్రజలంతా సహకరించాలని  విజ్ఞప్తి చేసారు.  ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి.కిషోర్ కుమార్, జే. వెంకట  రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  మైనారిటీ సంక్షేమ అధికారి అరుణ కుమారి , ముస్లిం సోదరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-19 16:03:45

వికలాంగులకు కృత్రిమ అవ‌య‌వాలు..

విభిన్న ప్ర‌తిభావంతుల‌కు కృత్రిమ అవ‌య‌వాల‌ను పంపిణీ చేసేందుకు, ఈ నెల 23 నుంచి నియోజ‌వ‌ర్గాల వారీగా శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాలు మ‌రియు వ‌యోవృద్దుల సంక్షేమ‌శాఖ అధికారులు, కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రం, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల సహకారంతో కృత్రిమ అవయవాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలతో గురువారం వెబ్క్స్ మీటింగ్  నిర్వహించారు.   ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వారు అందించే కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ, పంపిణీ గురించి వివ‌రించారు. కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిప‌ర్ల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కృత్రిమ అవ‌య‌వాల‌ను త‌యారు చేసి, ఉచితంగా అంద‌జేయడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 23, 25, 27 తేదీల్లో నియోజకవర్గాల వారీగా శిబిరాల‌ను ఏర్పాటు చేసి, కృత్రిమ అవ‌యవాల‌ను పంపిణీ చేసేందుకు, కొలతలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ శిబిరాల్లో దివ్యాంగులు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. 

కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రం (ఏఎల్ఎంయు),  గురుదేవ ఛారిట‌బుల్ ట్ర‌స్టు, అసోసియేష‌న్ సాయి కొరియ‌న్ త‌దిత‌ర సంస్థలు కృత్రిమ అవయవాలను, కాలిపర్స్ పంపిణీ చేస్తాయని చెప్పారు. శారీరకంగా వికలాంగత్వం ఉన్నవారికి ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ శిబిరాల ఏర్పాటు గురించి గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి, ఎక్కువమంది వినియోగించుకొనేవిధంగా చూడాలని కోరారు.
      ఈ సమావేశంలో వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు నీలకంఠ ప్రధానో, వివిధ మండలాల ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-19 16:02:05

పరిసరాల పరిశుభ్రతతో దోమలు దూరం..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల నివారణ చేయాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎల్.రాం మోహన్ పిలుపు నిచ్చారు.  ఆగస్ట్ 20 న శాస్త్ర వేత్త, బ్రిటిష్  వైద్యాధికారి   సర్ రోనాల్డ్  రాష్ జన్మ దినం సందర్బంగా  అంతర్జాతీయ దోమల దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు.  గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా మలేరియా అధికారి డా.తులసి తో కలసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. అంతర్జాతీయ దోమల దినోత్సవం సందర్బంగా  ప్రతి పి.హెచ్.సి పరిధి లో ర్యాలీ లను నిర్వహించి గ్రామాల్లో దోమల నివారణ పై అవగాహన కల్పించడం జరుగుందన్నారు. దోమల వలన  కలిగే వ్యాధులు, వ్యాధి లక్షణకు, తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి వద్ద, పరిసరాల్లో, కార్యాలయాల్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని,  దోమలు లేకుండా చేయడమే కాక,  వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే తగు పరీక్షలు  చేయించుకోవాలని అన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని,  దోమల పై అశ్రద్ధ పనికిరాదని అన్నారు.

Vizianagaram

2021-08-19 15:32:15

గ్రామసచివాలయ సేవలు వేగం పెరగాలి..

గ్రామ/వార్డు సచివాలయాల పనితీరు, అందుతున్న సేవలు మరింత పెరగాలని  రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయల ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కలెక్టర్లకు సూచించారు. గురువారం ఈ మేరకు సచివాలయల ద్వారా అందిస్తున్న సేవల వివరాలు, ఇతర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏ జిల్లాల్లో ఏ విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.  కాకినాడ కలెక్టర్  క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ/ వార్డు సచివాలయల పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను  వివరించారు. సచివాలయం ద్వారా బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫించన్ కార్డుల నిమిత్తం అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సి.హరికిరణ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కు వివరించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-19 15:21:53

ఎవరి రేషన్ కార్డులు రద్దుకావు..

బియ్యం కార్డులో పేర్లున్న వారిలో ఇంకా ఈ-కేవైసీ పూర్తికానివారు వారి కుటుంబ ప‌రిధిలోని వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా ప్ర‌క్రియ‌ను పూర్తిచేయించుకోవాల‌ని, ఎవ‌రి బియ్యం కార్డూ ర‌ద్దు కాద‌ని.. ఈ విష‌యంలో అన‌వ‌స‌ర అపోహ‌లు, భ‌యాలు వ‌ద్ద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. గురువారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ నుంచి జాయింట్ క‌లెక్ట‌ర్‌.. వ‌ర్చువ‌ల్ విధానంలో బియ్యంకార్డుదారుల ఈ-కేవైసీ అంశంపై మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ కార్డులో పేర్లున్న వారిలో ఎవ‌రికి ఈ-కేవైసీ కాలేదో వారికి నోటీస్ ద్వారా స‌మాచారం అందిస్తున్నామ‌ని, వారు మాత్ర‌మే ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా త‌మ వాలంటీర్ ద్వారా ప్ర‌క్రియ‌ను పూర్తిచేసుకోవాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. ఈ-కేవైసీ చేసే స‌మ‌యంలో వేలిముద్ర‌లకు సంబంధించి ఎవ‌రికైనా, ఏదైనా స‌మ‌స్య ఎదురైతే మాత్ర‌మే వాటిని అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాల‌కు వెళ్లాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో 272 ఆధార్ అప్‌డేష‌న్ కేంద్రాలు ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఈ కేంద్రాల వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టికే 1,99,944 మందికి ఈ-కేవైసీని పూర్తిచేశామ‌ని, మిగిలిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేస్తామ‌ని, అందుకు త‌గిన ఏర్పాట్లు చేశామ‌ని  ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నెల చివ‌రినాటికి అవ‌స‌రం మేర‌కు స‌మ‌యం పెంపుపై ప్ర‌భుత్వానికి నివేదించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ-కేవైసీ  ప్రక్రియ స‌జావుగా సాగేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌కూ బ‌యోమెట్రిక్ అథెంటిఫికేష‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని.. ప్ర‌స్తుతం ఈ-కేవైసీ స‌మ‌యంలో స‌మ‌స్య‌లు ఎదురైన వారు వాటిని ప‌రిష్క‌రించుకుంటే వివిధ ప‌థ‌కాల ల‌బ్ధి విష‌యంలోనూ స‌మ‌స్య రాద‌ని వివ‌రించారు. అయిదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఈ-కేవైసీ అవ‌స‌రం లేద‌ని, ఆపై వ‌య‌సు పిల్ల‌ల‌కు వ‌చ్చే నెల చివ‌రి వ‌ర‌కు స‌మ‌యం ఉంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు.

కాకినాడ

2021-08-19 15:18:08

మంత్రి అవంతి ని కలిసిన జిసిసి చైర్మన్..

రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును జిసిసి చైర్మన్ శోభాస్వాతిరాణి ,గుల్లిపల్లి గణేష్ దంపతులు బుధవారం సీతమ్మధారలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా 21వ తేదీన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిసిసి రాష్ట్రంలోనే మంచి కార్పోరేషన్ గా తీర్చిదిద్దాలని, తద్వారా గిరిజనులకు మంచి ఉపాది అవకాశాలు లభించాలని అన్నారు. జిసిసి ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ తోపాటు, అరకు కాఫీకి మరింత డిమాండ్ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం మహిళల పక్షపాతికావడంతోనే అత్యధిక కార్పోరేషన్ పదవులు మహిళలకు దక్కాయని అన్నారు. జిసిసికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా శ్రమించాలన్నారు. 

Visakhapatnam

2021-08-18 16:33:10

అర్హులందరికీ నష్టపరిహారం అందాలి..

చట్టప్రకారం అర్హులైన వారికే నష్ట పరిహారం అందేలా అధికారులు పద్ధతి ప్రకారం పారదర్శకతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. నీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, రామాయపట్నం పోర్టుల భూ సేకరణలపై సంబంధిత అధికారులతో బుధవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమీక్షించారు. రెవిన్యూ వ్యవస్థ జిల్లాలో సరిగా లేకపోవడంతో పలు రకాల భూ సమస్యలు ఎదురవుతున్నాయని కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. కొన్ని మండలాల్లో రెవిన్యూ దస్త్రాలు ట్యాంపరింగ్, వెబ్ ల్యాండింగ్ లో అక్రమాలు జరిగాయన్నారు. రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ముఖ్యంగా సగదు అనుసంధానంతో చేపట్టే భూ సేకరణ ప్రక్రియలో అధికారులు పారదర్శకంగా నిజాయితితో పనిచేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ బద్ధంగా విధులు నిర్వర్తించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. రెవిన్యూ వ్యవస్థను సరిచేయాల్సిన బాధ్యత జిల్లా సంయుక్త కలెక్టర్ పై ఉందని, ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఆయన మార్గనిర్దేశం చేశారు.

           కృష్ణా జలాలు 2022వ సంవత్సరంలో టన్నెల్ ద్వారా ప్రకాశంలోకి తరలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భూములు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం నగదు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేజ్-1 కింద ప్యాకేజి ఒకటి నుంచి ఐదు వరకు నిర్దేశించిన గ్రామాలలో భూసేకరణ అత్యవసరంగా చేపట్టాలన్నారు. ప్రతినెల లక్ష్యాలను నిర్దేశించుకుంటూనే 824 ఎకరాలు భూసేకరణ త్వరలో పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులైన 7,262 మందిలో ఆర్. అండ్. " ఆర్. ప్యాకేజి కింద 2,411 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయగా, మిగిలిన 761 మందికి తక్షణమే ప్లాట్లు ఇవ్వాలన్నారు. ప్యాకేజి ప్రక్రియలో అనర్హులను పూర్తిగా తొలగించాలన్నారు. అసైన్డ్ భూములు, ఆక్రమిత భూముల నిర్ధారణలో స్పష్టత ఉండాలన్నారు.

          రామాయపట్నం పోర్టుకోసం ప్రతిపాధించిన భూములను వేగంగా సేకరించాలని కలెక్టర్ చెప్పారు. రావూరు, చేవూరు గ్రామాలలో ప్రభుత్వ, చుక్కల భూమి పట్టా భూముల వివరాలపై సమీక్షించారు. జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ పక్కాగా నిర్వహించాలన్నారు. భూముల లెక్కింపు జరుగుతోందని. 32 గ్రామాలలో డ్రోన్ కెమేరాలతో భూముల స్థితిగతులను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మొదటి విడతలో మరో ఏడు గ్రామాలను అదనంగా చేర్చినట్లు ఆయన వివరించారు. సంబంధిత ఏడు గ్రామాలలో 4,549.47 ఎకరాలలలో సర్వే చేయాలన్నారు. ఆ ప్రాంతాలలోని 2,234 మంది రైతులకు నోటీసులు జారీ చేయాలన్నారు.

          వై.పాలెం-పామూరు జాతీయ రహదారికి 104 ఎకరాల భూ సేకరణ వేగంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వై.పాలెం-పామూరు 565 జాతీయ రహదారికి మిగిలిన 164 ఎకరాలు వేగంగా సేకరించాలన్నారు. యడ్లపల్లి గ్రామంలో అటవి భూములను పరిశీలించాలని, ఆ భూముల దస్త్రాలు నిశితంగా పరిశీలించాలన్నారు. చీరాల ఒంగోలు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినప్పటికి 6.63 ఎకరాలకు భూ సేకరణ సమస్య ఉందని, తక్షణమే పరిష్కరించాలన్నారు. సి.ఎస్.పురం కందుకూరు జాతీయ రహదారి నిర్మాణానికి 89 ఎకరాల భూ సేకరణలో జాప్యంపై ఆయన ఆరాతీశారు. పర్చూరు. పెదజాగర్లమూడి రాష్ట్రీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. గుంటూరు-గుంతకల్లు రైల్వేలైన్ నిర్మాణానికి 56 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉండటంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూడూరు-విజయవాడ మూడవ రైల్వేలైన్ విస్తరణకు, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణానికి 153 ఎకరాల భూమి వేగంగా సేకరించాలన్నారు.
            సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి. ఆండ్, ఆర్.) జె. వెంకట మురళి, డి.ఆర్.ఓ. ఎస్. సరళా వందనం, మార్కాపురం ఆర్.డి.ఓ. లక్ష్మీ శివజ్యోతి, ప్రత్యేక ఉప కలెక్టర్లు గ్లోరియా, వసంతబాబు, శ్రీదేవి, నారదముని, సర్వే ల్యాండ్స్ ఏ.డి. రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధి కారులు పాల్గొన్నారు.
       

Ongole

2021-08-18 15:27:13

మసగ్ర భూ సర్వేకి ప్రత్యేక ప్రణాళికలు..

వైఎస్సార్ జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు-భూ ర‌క్ష కార్య‌క్ర‌మానికి సంబంధించి స‌మ‌గ్ర భూ రీస‌ర్వే కార్య‌క‌లాపాలు ప్ర‌ణాళిక ప్ర‌కారం ద‌శ‌ల వారీగా కొన‌సాగుతున్నాయ‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ తెలిపారు. బుధ‌వారం విజ‌య‌వాడ నుంచి కేంద్ర పంచాయ‌తీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ అలోక్ ప్రేమ్‌న‌గ‌ర్‌, స‌ర్వే ఆఫ్ ఇండియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి సీసీఎల్ఏ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్‌.. భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌, రీస‌ర్వేపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, పంచాయ‌తీరాజ్‌, స‌ర్వే అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వే ఆఫ్ విలేజ‌స్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాల‌జీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వా) కార్య‌క్ర‌మానికి స‌మాంత‌రంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మ‌మైన భూ రికార్డుల స్వ‌చ్ఛీక‌ర‌ణ‌, రీస‌ర్వే ప‌నుల‌ను ప్ర‌త్యేక బృందాలతో నిర్వ‌హిస్తున్న తీరును వివ‌రించారు. డ్రోన్ ఫ్ల‌యింగ్ స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాల‌ను ద‌శ‌ల వారీగా పూర్తిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం డ్రోన్ ఫ్ల‌యింగ్‌, ఓఆర్ఐ మ్యాప్స్‌, గ్రౌండ్ ట్రూతింగ్ త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్‌.. జిల్లా పంచాయ‌తీరాజ్‌, స‌ర్వే అధికారుల‌తో స‌మీక్షించారు. స‌మావేశానికి జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

Kakinada

2021-08-18 15:15:55

పొగాకు వాడ‌కాన్ని నియంత్రించాలి..

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ధూమ‌పానంపై, పొగాకు వాడకంపై నియంత్ర‌ణ  ఉండాల‌ని జేసీ మ‌హేష్ కుమార్ అభిప్రాయ‌పడ్డారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ధూమపానం చేయ‌కుండా సంబంధిత అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో జ‌రిగిన నేష‌నల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్‌లో ఆయ‌న ఈ మేర‌కు మాట్లాడారు. పొగాకు వాడ‌కాన్ని త‌గ్గించేందుకు చ‌ట్టంలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, జ‌రిమానాలు విధించాల‌ని చెప్పారు. ముఖ్యంగా యువ‌త పొగాకు వాడకానికి ద‌గ్గ‌ర కాకుండా చూడాల‌న్నారు. పిల్ల‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచించారు. అనంత‌రం పొగాకు వాడ‌కంపై హెచ్చ‌రిక‌లు, సూచ‌న‌ల‌తో కూడిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మాల్లో జేసీ జె. వెంక‌ట‌రావు, టొబాకో స్టేట్ క‌న్స‌ల్టెంట్ శివ‌కుమార్‌, డీఎం &హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, జిల్లా కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, డీఐవో డా. గోపాల కృష్ణ‌, అద‌నపు ఎస్సీ పీఎస్ఎన్ రావు, అద‌నపు డీఎం & హెచ్‌వో రామ్మోహ‌న్‌రావు, ఇత‌ర అధికారులు, వైద్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-18 15:13:39

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి..

క‌రోనా మూడో ద‌శ‌ను ఎదుర్కొనేందుకు అన్ని ర‌కాలుగా సిద్ధంగా ఉండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఆర్‌. మ‌హేష్ కుమార్ అధికారుల‌కు సూచించారు. జిల్లాలో గుర్తించిన 15 ఆసుప‌త్రుల్లో అన్ని ర‌కాల‌ వ‌స‌తులు స‌మ‌కూర్చుకొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో తీసుకొనే చ‌ర్య‌లు, అనుస‌రించాల్సిన ప‌ద్దతుల‌పై చ‌ర్చించేందుకు జేసీ జిల్లా వైద్యారోగ్య శాఖ‌, ఇత‌ర అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో గుర్తించిన 15 ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో ముంద‌స్తు ఏర్పాట్లు జ‌రిగేలా, అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చుకొనేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. మూడో ద‌శ‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా ముందుగానే అప్ర‌మ‌త్తంగా  ఉండాల‌ని ఆదేశించారు. మొద‌టి రెండు ద‌శ‌ల్లో జ‌రిగిన ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకొని జాగురూక‌త వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.  డీఎం &హెచ్‌వో ర‌మ‌ణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, జిల్లా కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, డీఐవో డా. గోపాల కృష్ణ‌, అద‌నపు ఎస్సీ పీఎస్ఎన్ రావు, అద‌నపు డీఎం & హెచ్‌వో రామ్మోహ‌న్‌రావు, ఇత‌ర అధికారులు, వైద్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-18 15:12:50

19 సాయంత్రం వరకూ ఆగ్రి గోల్డ్ నమోదు..

అగ్రి గోల్డ్ స్కీం లో డబ్బు చెల్లించిన ఒరిజినల్ రసీదు ఉన్నవారు గడువు లోపు నమోదు చేయించుకొలేని వారు లేదా గ్రామ వలంటీర్లు డేటా ఎంటర్ చేయకుండా ఉన్నవారు సమీప ఎంపీడీఓ కార్యాలయాలలో తమ డాక్యుమెంట్లు ఇవ్వవచ్చని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఆగస్టు 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వటం జరిగిందనీ ఆయన చెప్పారు.  తరువాత ఎట్టి పరిస్థితుల్లోను కొత్త దరఖాస్తులు అంగీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.

Srikakulam

2021-08-18 15:02:21

న్యాయ సలహా మేరకే దుకాణాలు అప్పగింత..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం బుధవారం స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన జరిగింది.  143 దుకాణాలను గుత్తేదారులకు ఇచ్చే అంశంపై వాయిదా వేశామని తెలిపారు.  ఈ అంశంపై న్యాయ సలహా కోరామని,  న్యాయ సలహా వచ్చిన తర్వాత ఆయా దుకాణాలను గుత్తేదారులకు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.  143 దుకాణాలు నుండి తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలు గుత్తేదారులు నుండి వసూలు చేయాలని స్థాయి సంఘం నిర్ణయించిందని,  నిధులు వసూలు అయిన తర్వాత  న్యాయ సలహా, స్థాయి సంఘం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని అంతవరకూ ఈ అంశము వాయిదా వేస్తున్నట్లు చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ సమావేశంలో స్థాయి సంఘ సభ్యులు, అదనపు కమిషనర్ అవ్వారి వెంకట రమణి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, డి.సి.(రెవెన్యూ) పి. నల్లనయ్య, కార్యదర్శి లావణ్య, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-08-18 14:34:21

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ముందు ఉండాలి..

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో శ్రీకాకుళం జిల్లా ముందు ఉండాలని జిల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సంబంధిత అధికారులతో బుధ వారం కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జిఎస్టి, కర్మాగారాలు, బాయిలర్లు, భూగర్భ జలవనరులు, డ్రగ్స్, మునిసిపాలిటీ, రెవిన్యూ, పరిశ్రమలు, కార్మిక శాఖ, పర్యాటక, పట్టణ ప్రణాళిక, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలు వీటిలో ప్రధానంగా భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు. ఈ శాఖల క్రింద 402 విభాగాల వినియోగదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఎంత సులభంగా సేవలు పొందవచ్చు అనే విషయంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఆగస్టు చివరి వారంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కార్యాలయానికి భౌతికంగా రాకుండానే దరఖాస్తు చేయడం, సంబంధిత పత్రాలు పొందడం జరగాలని ఆ విధానం ఏ మేరకు ఉపయుక్తంగా ఉందో పరిశీలించాలని ఆయన అన్నారు. విధానాల్లో మంచి మార్పులకు సూచనలు స్వీకరించాలని వాటిని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతోందని ఆయన వివరించారు. మంచి విధానాల సూచనలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇంకా మెరుగు పడుటకు అన్ని చర్యలు తీసుకోవాలని, జిల్లా ఆదర్శవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.ఉమామహేశ్వర రావు, జిఎస్టి సహాయ కమీషనర్ రాణి మోహన్, జిల్లా అగ్ని మాపక అధికారి సి.హెచ్.కృపావరం, కార్మిక శాఖ ఉప కమీషనర్ ఎస్.డి.వి ప్రసాద రావు, జిల్లా రిజిస్ట్రార్ సత్యనారాయణ, పర్యావరణ ఇంజినీర్ ఎస్.శంకర నాయక్, కర్మాగారాల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్. సత్యనారాయణ, భూగర్భ జల వనరుల శాఖ ఎడి లక్ష్మణ రావు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-18 14:31:32

హడ్కో కాలనీలో గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్..

పరిశుభ్రమైన శ్రీకాకుళం నగరం ఆవిష్కృతం కావాలని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు పిలుపునిచ్చారు. 47 వ డివిజన్ హడ్కో కాలనీలో  గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్  ఓబులేసు బుధవారం హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తమ వీధివాడలతో  సహా నగరాన్ని పరిశుభ్రముగా ఉంచుటకు సహకరించాలని కోరారు. నగరంలో తడి, పొడి చెత్త, ఇతర వృధా పరికరాలను వేయుటకు మొత్తం మూడు రంగుల బట్టలను సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది జ్ఞానేశ్వర్, రామినాయుడు, వాలంటీర్స్ సాహు, చిరంజీవి,ధనలక్ష్మి, దివ్య , మాజీ కౌన్సిలర్ ఏ. రామ్మోహన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-18 14:15:07