1 ENS Live Breaking News

పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి..

పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఆయన ఆరవ జోన్ 75వ వార్డు పరిధిలోని పెద్ద గంట్యాడ, నెల్లిముక్కు, పిట్టవాని వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో సరిపడిన పారిశుధ్య కార్మీకులు ఉన్నారని పిన్ పాయింట్ వారిగా కార్మీకులను సర్దుబాటు చేసి, ఎవ్వరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని ఆదేశించారు. కాలువలు, గెడ్డలను పరిశీలించి, గెడ్డలలోని చెత్తను తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్ద 3 రంగుల డస్ట్ బిన్లు ఉండేలా చూడాలన్నారు. దుకాణాదారులు వద్ద ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను పరిశీలించి, నిషేదిత ప్లాస్టిక్ ను వాడరాదని, దుకాణాదరుడు నిషేదిత ప్లాస్టిక్ ను వాడినయడల వారి వద్ద నుండి అపరాదరుసుం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ని ఆదేశించారు. అనంతరం పెద్ద గంట్యాడ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరుచున్న విధానాన్ని పరిశీలించి అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని సిబ్బందికి సూచించారు. వ్యాక్సినేషన్ వేయించుకొనుటకు వచ్చినవారు కోవిడ్ నిబంధనలు పాటించి వ్యాక్సినేషన్ వేయించుకోవలసినదిగా   కోరారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వార్డు సచివాలయ శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.    

విశాఖ సిటీ

2021-06-30 15:31:30

గెడ్డలను ఆక్రమిస్తే కఠిన చర్యలు..

మహావిశాఖ నగర పరిధిలో ఎవరు గెడ్డలను ఆక్రమించినా ఉపేక్షించేది లేదని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. బుధవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్ 54వ వార్డు రెడ్డి కంచరపాలెం, సూర్య నగర్-1&2, 104 ఏరియాలోని ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెడ్డల ఆక్రమణను తొలగించాలని, గెడ్డల ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాటి చెట్లపాలెం నుండి ఎన్.ఎ.డి. జంక్షన్ వరకు  గ్రీన్ బెల్ట్ ఏరియాలో చెత్త ఎక్కువగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ అధికారులను అదేశించారు. సన్ రైజ్ క్లబ్ ఎదురుగా గ్రీన్ బెల్ట్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ ను కోరగా పరిశీలిస్తామని బదులిచ్చారు. చాలా చోట్ల బహిరంగ ప్రదేశాలలో చెత్త పోగులుగా కన్పించడంతో వాటిని వెంటనే తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. 104 ఏరియాలో యుజిడి కనక్షన్ మరియు పైపు లైన్ కొరకు రోడ్లను తవ్వి సరిగా పూడ్చక పోవడంతో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. నలంద నగర్ లోని గెడ్డ, సూర్య నగర్-2 వద్ద ఉన్న పెద్ద కాలువ, 104 ఏరియాలోని గెడ్డలను పరిశీలించి, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలు, కాలువలలోని వ్యర్ధాలను తొలగించాలని, భూగర్భ డ్రైనేజి మ్యాన్ హోల్ నుండి మురుగునీరు పొంగకుండా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ చల్ల రజని, ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కె.కె.రాజు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాలరావు, డిసిపి శిల్ప, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ రాజేష్,  శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.                  

Visakhapatnam

2021-06-30 15:21:24

గెడ్డలను ఆక్రమిస్తే కఠిన చర్యలు..

గెడ్డలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. బుధవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్ 54వ వార్డు రెడ్డి కంచరపాలెం, సూర్య నగర్-1&2, 104 ఏరియా తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ గెడ్డల ఆక్రమణను తొలగించాలని, గెడ్డల ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాటి చెట్లపాలెం నుండి ఎన్.ఎ.డి. జంక్షన్ వరకు  గ్రీన్ బెల్ట్ ఏరియాలో చెత్త ఎక్కువగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ అధికారులను అదేశించారు. సన్ రైజ్ క్లబ్ ఎదురుగా గ్రీన్ బెల్ట్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ ను కోరగా పరిశీలిస్తామని బదులిచ్చారు. చాలా చోట్ల బహిరంగ ప్రదేశాలలో చెత్త పోగులుగా కన్పించడంతో వాటిని వెంటనే తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. 104 ఏరియాలో యుజిడి కనక్షన్ మరియు పైపు లైన్ కొరకు రోడ్లను తవ్వి సరిగా పూడ్చక పోవడంతో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. నలంద నగర్ లోని గెడ్డ, సూర్య నగర్-2 వద్ద ఉన్న పెద్ద కాలువ, 104 ఏరియాలోని గెడ్డలను పరిశీలించి, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలు, కాలువలలోని వ్యర్ధాలను తొలగించాలని, భూగర్భ డ్రైనేజి మ్యాన్ హోల్ నుండి మురుగునీరు పొంగకుండా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ చల్ల రజని, ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కె.కె.రాజు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాలరావు, డిసిపి శిల్ప, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ రాజేష్,  శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.                       

విశాఖ సిటీ

2021-06-30 15:12:58

జనం మెచ్చన జిల్లా కలెక్టర్ ఆయన..

ఆయ‌న జిల్లాకు ప్ర‌థ‌మ పౌరుడు. జిల్లా యంత్రాంగానికి అధినేత‌. కానీ అత‌ను ఏనాడూ త‌న హోదాను చూపించ‌లేదు. అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేదు. చెర‌గ‌ని చిరున‌వ్వుతో,  అతి సామాన్యుడిలా ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోవ‌డం, అంద‌రినీ అప్యాయంగా ప‌ల‌క‌రించ‌డం ఆయ‌న నైజం. ఆయ‌నే మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఐఏఎస్‌... జ‌నం కంటే ముందే చెరువుల్లో, కాలువ‌ల్లో దిగి చెత్తను ఎత్తి, పూడిక‌ల‌ను తొల‌గించి శుభ్రం చేసినా, ప్ర‌తిరోజూ తెల్ల‌వార‌క‌ముందే లేచి, వేలాది మొక్క‌ల‌ను స్వ‌యంగా త‌న చేతుల‌తో నాటి, ప‌ట్ట‌ణాన్ని హ‌రిత‌మ‌యం చేసినా.. అది ఆయ‌న ఒక్క‌రికే చెల్లింది. ఆవేద‌న‌తో త‌మ గోడు వినిపించుకోవ‌డానికి గ్రీవెన్స్‌కు వ‌చ్చేవారికి, క‌డుపునిండా అన్నంపెట్టి పంపించే గొప్ప మ‌న‌సు మ‌న జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ సొంతం. గొప్ప వ్య‌క్తిత్వం మూర్తీభ‌వించిన ఆయ‌న‌,  మ‌న‌సున్న మ‌నిషిగా, జిల్లాలో  ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్న మ‌న క‌లెక్ట‌ర్‌...మ‌రోసారి త‌న మంచి మ‌న‌సును ప్ర‌ద‌ర్శించారు. ఎస్‌.కోట మండ‌లం బొడ్డ‌వ‌ర గ్రామంలో లేఅవుట్‌ను త‌నిఖీ చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు, అక్క‌డ దూరంగా నిల్చొని ఏదో చెప్ప‌బోతున్న ఒక గిరిజ‌న వృద్దుడిని గ‌మ‌నించారు. ఒంటిపై బ‌ట్ట‌లు కూడా లేని ఆ వృద్దున్ని ఆప్యాయంగా ద‌గ్గ‌రికి పిలిచారు. ఆయ‌న గోడు విన్నారు. త‌న పాక కాలిపోయింద‌ని, ఇళ్లు కావాల‌ని అత‌ను కోరగా, వెంట‌నే మంజూరు చేయాల‌ని తాశీల్దార్‌ను ఆదేశించారు. ఆ పెద్దాయ‌న‌కు మాస్కు లేక‌పోవ‌డాన్ని చూసి, త‌న బ్యాగులోనుంచి ఒక మాస్కును తెప్పించి, క‌లెక్ట‌ర్‌ స్వ‌యంగా త‌న చేతుల‌తోనే తానే, ఆ వృద్దుడికి మాస్కును  క‌ట్టారు. మాస్కు లేకుండా తిర‌గ‌వ‌ద్ద‌ని, ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని చెప్పి పంపించారు. క‌లెక్ట‌ర్ గొప్ప మ‌న‌సును స్వ‌యంగా చూసిన అక్క‌డివారంతా అబ్బుప‌డ్డారు.

Vizianagaram

2021-06-30 14:06:48

హౌసింగ్ గ్రౌండింగ్ కి పక్కా ఏర్పట్లు..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజూరు చేసిన గృహాలను ప్రారంభించడానికి క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి.  అధికారులు, ప్రజా ప్రతినిధులు  గత మూడు రోజులుగా మేళా ఏర్పాట్ల పై నిమగ్నమై ఉన్నారు.  లే అవుట్ల   తయారీ,  ప్లాట్ల  మార్కింగ్,   షామియానా, నీరు, భూమి పూజలకు అవసరమగు గోతులు,  ఇసుక, సిమెంట్, ఇతర పూజా సామాగ్రిని  లే అవుట్ల  వద్ద సిద్ధం చేసారు.   లబ్ది దారులను వారి ప్లాట్ల వద్దకు  తీసుకురావడానికి , వార్డ్, గ్రామ స్థాయి కమిటీలను వేసి వాలంటీర్ల కు బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది.    ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై వారిని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వచ్చేలా ఏర్పాట్లను గావించారు.  నియోజక వర్గం ఇంచార్జ్ లు, మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యం లో లబ్ది దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా వారి ప్లాట్ వద్దకే వెళ్లి పూజ చేసుకొని,  నిర్మాణాలను  చేపట్టేలా  చేసారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం రవాణా ఏర్పాట్లను గావిస్తున్నారు.  జిల్లాలో మొదటి విడత లో  928 లే అవుట్లలో 98 వేల 286 ఇళ్ళను  మంజూరు చేయడం జరిగింది. కోర్ట్ కేసు లు, ఇతర కారణాలతో  కొన్ని స్థలాలు పెండింగ్  లో ఉన్నప్పటికీ 75 వేల మందికి ప్రస్తుతం గృహ నిర్మాణాలను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం జూలై 1,3,4 తేదీలను మేళా కోసం ప్రకటించినప్పటికీ మొత్తం ప్రారంభాలన్ని 1 వ తేదీనే పూర్తి అయ్యేలా కలెక్టర్  ప్రత్యెక వ్యూహ రచన చేసారు.  1 న అవకాశం లేక  మిగిలిపోయిన వారు  3,4 తేదీలలో ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసారు.  జిల్లాలో 75 వేల గృహాలకు ఈ మూడు  రోజుల్లో ప్రారంభించాలని లక్ష్యంగా చేసారు.  గృహం మంజూరైనప్పటికి రిజిస్ట్రేషన్, జియో  టాగింగ్, మాపింగ్ జరగని వారికీ కూడా ఈ మేళా లో ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పిస్తూ  మంజురైన అన్నిటిని ప్రారంభించాలని  కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు.  

నియోజక వర్గాల  పర్యవేక్షణకు ఐ.ఏ.ఎస్ అధికారులు..
జిల్లాకు ప్రత్యెక పర్యవేక్షణాధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను  ప్రభుత్వం నియమించగా, జిల్లా నుండి జే.సి (రెవిన్యూ) గజపతి నగరం,  బొబ్బిలి  నియోజక వర్గాలకు, జే.సి అభివృద్ధి డా. మహేష్ కుమార్ ను నెల్లిమర్ల, చీపురుపల్లి, జే.సి ఆసరా జే. వెంకట రావు కు సాలూరు నియోజక వర్గానికి ఇంచార్జ్ లుగా నియమించారు. జే.సి హౌసింగ్ మయూర్ అశోక్ ను విజయనగరం , ఎస్.కోట  నియోజకవర్గాలకు కేటాయించగా , ఐ టి డి ఎ ప్రోజ్ర్ట్ అధికారి కుర్మనాద్ ను పార్వతి పురం, కురుపాం కు నియమించారు.  వీరితో పాటు  ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని, మండల ప్రత్యేకాధి కారులను   నియమించారు. 

పించన్ల పంపిణీ మధ్యాహ్నం 2 గంటల కు మార్పు..
గృహ నిర్మాణాల  మేళా కు  లబ్దిదారులు, వాలంటీర్లు హాజరవుతున్న దృష్ట్యా  ఉదయాన్నే పంపిణీ చేయవలసిన పించన్ల పంపిణీ  మధ్యాహ్నం 2 గంటల తర్వాత  పంపిణీ  చేయడం జరుగుతుందని  సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్  తెలిపారు.  గృహ మేళా పూర్తి అయిన వెంటనే వాలంటీర్లంత పించన్ల పంపిణీ కి హాజరు కావాలని  ఆదేశించారు.  

Vizianagaram

2021-06-30 13:53:22

ఏజెన్సీ రోడ్ల‌కు త‌క్ష‌ణ‌మే అనుమ‌తులు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని  ఏజెన్సీ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణానికి త‌క్ష‌ణ‌మే క్లియ‌రెన్స్ ఇచ్చి, మారుమూల ప్రాంతాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యాన్ని క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఆదేశించారు. సాలూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దిపై క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో బుధ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. నియెజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ది ప‌నులు, పెండింగ్ ప‌నుల‌పై వివిధ శాఖ‌ల వారీగా స‌మీక్షించారు. పెద్ద‌గెడ్డ‌, అడారుగెడ్డ ఆధునీక‌ర‌ణ ప‌నులు, ర‌హ‌దారుల నిర్మాణం, పెండింగ్ బిల్లులు, ఉపాధి హామీ ప‌నులు, ఆర్అండ్‌బి, అట‌వీశాఖ‌,  ఐటిడిఏ శాఖ‌ల ప‌నుల‌పై చ‌ర్చించారు.  ఎంఎల్ఏ పీడిక రాజ‌న్న‌దొర మాట్లాడుతూ, ర‌హ‌దారులే అభివృద్దికి కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు.  ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పించిన‌ప్పుడే, విద్య‌, వైద్యం అందుతాయ‌ని, తద్వారా గ్రామాలు అభివృద్ది చెందుతాయ‌ని అన్నారు. అయితే ఏళ్ల త‌ర‌బ‌డి ప‌లు గిరిజ‌న గ్రామాలు ర‌హ‌దారి సౌక‌ర్యానికి నోచుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొన్ని గిరిశిఖ‌ర గ్రామాల‌కు ర‌హ‌దారి నిర్మాణం ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమితం అయ్యింద‌ని చెప్పారు. ర‌హ‌దారులు లేక‌పోవ‌డం వ‌ల్ల పేద గిరిజ‌నుల‌కు క‌నీసం బియ్యాన్ని కూడా స‌క్ర‌మంగా పంపిణీ చేయ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. అధికారులు ఏళ్ల‌త‌ర‌బ‌డి ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, అట‌వీశాఖ నుంచి అనుమ‌తులు రాక‌పోవడం వ‌ల్లా, వ‌చ్చిన నిధులు వెన‌క్కు వెళ్లిపోతున్నాయ‌ని, ఇక‌నైనా ఈ ప‌రిస్థితిని మార్చాల‌ని కోరారు.

                క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగ్‌లో ఉన్న ర‌హ‌దారుల‌న్నిటికీ వెంట‌నే క్లియ‌రెన్స్ ఇవ్వాల‌ని ఆదేశించారు. దీనికోసం గురువారం నుంచి అట‌వీశాఖాధికారులు, పంచాయితీరాజ్ ఇంజ‌నీర్లు సంయుక్తంగా త‌నిఖీలు చేయాల‌ని, రోజుకు నాలుగు రోడ్లు చొప్పున ప‌రిశీలించి, ఆమోదం తెల‌పాల‌ని సూచించారు. క్లియ‌రెన్స్ వ‌చ్చిన వెంట‌నే యుద్ద‌ప్రాతిప‌దిక‌న పెండింగ్‌లో ఉన్న 11 ర‌హ‌దారుల‌ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని పంచాయితీరాజ్ శాఖ‌ను ఆదేశించారు. అలాగే సుమారు 48 గిరిశిఖ‌ర గ్రామాల‌కు ఐటిడిఏ నిధుల‌తో ర‌హ‌దారి సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఉపాధిహామీ ప‌థ‌కం క్రింద ప్ర‌తిపాదించిన ప‌నుల‌ను, ఆర్అండ్‌బి శాఖ త‌ర‌పున ప్ర‌తిపాదించిన ర‌హ‌దారుల‌ను ప‌రిశీలించి ఆమోదించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.  స‌మావేశంలో ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, డిఎఫ్ఓ స‌చిన్ గుప్త‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-30 13:48:18

అప్పన్న హుండీచిల్లర రూ.6.27లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ రాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో హుండీల ద్వార లభించిన చిల్లర 6.లక్షల 27వేల 305 రూపాయలు వచ్చిందని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. బుధవారం ఆమె ఆలయంలో మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్నిహుండీల్లోని చిల్లరను పరకామణి లో లెక్కించగా ఈ మొత్తం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు ప్రత్యేక ఆహ్వానితులు, విజెఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు స్వయంగా పర్యవేక్షించడంతోపాటు పరకామణి సేవలో పాల్గొన్నట్టు ఆమె వివరించారు.

Simhachalam

2021-06-30 12:40:19

ఇక అప్పన్న దర్శనాలు రాత్రి 7వరకు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ రాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనాలు జూలై 1వ తేది నుంచి ఉదయం 6.30 నుంచి రాత్రి 7గంటల వరకూ అనుమతిస్తామని దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. బుధవారం ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా తగ్గుముఖం పట్టిన సందర్భంగా రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పెంచిన సమయాన్ని అమలు చేస్తామని వివరించారు. కాగా  ఉదయం 6:30 నుంచి 11:30 వరకు దర్శనాలు, ఆ తరువాత ఉదయం 11:30 నుంచి మధ్యహా్నం 12:15 రాజభోగం  (భక్తులకు దర్శనాలుండవు)  ఆ తరువాత 12:15 నుంచి 2:30  దర్శనాలు ఉంటాయి. మళ్లీ   2:30 నుంచి 3:00  స్వామివారి పవళింపు  (దర్శనాలుండవు) చివరిగా మధ్యాహ్నం   3:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని ఈఓ వివరించారు. ఈ కొత్త సమయాలను భక్తులు గుర్తించి స్వామిని దర్శించుకోవాలని కోరారు.

Simhachalam

2021-06-30 12:35:24

ఎస్ఈబి పై మహిళా పోలీసులకి శిక్షణ..

గ్రామ సచివాలయ మహిళా పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎక్సైజ్ శాఖ) నిర్వహించే కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి వుండాలిని  ప్రత్తిపాడు ఎస్ఈబి సిఐ అజయ్ కుమార్ సింగ్ సూచించారు. బుధవారం 7వ బ్యాచ్ మహిళా పోలీసులకు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో విధులుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మహిళా పోలీసులు గ్రామాల్లోని నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు, సారా తయారీ తదితర విషయాలపై ఎప్పటి కప్పుడు స్టేషన్ కి  సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో సారాఅమ్మకాలు జరగకుండా చూసే బాధ్యత మహిళా పోలీసులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం మధ్య నియంత్రణ విషయంలో ప్రత్యేక ప్రణాళిక తో ముందుకెళుతున్న సమయంలో అన్ని గ్రామాల్లోనూ అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఇందులో భాగంగా సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులు ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ, ప్రభుత్వ లక్ష్యాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం స్టేషన్ లో ముద్దాయిలపై కేసులు రాసే విధానం,  రికార్డులు, వివిధ మధ్యం కేసుల్లో పట్టుబడ్డవారిని ఏ విధంగా ఖైదు చేస్తారో చూపిస్తూ  సిఐ మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్ కళాంజలి, పి.ఉషారాణి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Prathipadu

2021-06-30 11:57:23

అప్పన్నకు సీఆర్పీఎఫ్ ఏడీజీపీ పూజలు..

సింహాలచంలోని శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రష్మీ శుక్లా, సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా, 198 వ బెటాలియన్ కమాండెంట్ కెకె చాంద్ లు బుధవారం  దర్శించుకున్నారు. వారికి ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామికి ప్రత్యేక పూజలు చేసి, కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు అధికారులకు  స్వామి వారి ప్రసాదం తో పాటు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా  ఇటీవలే పరిశుభ్రం చేసిన నరసింహ అవతారాలు వాటి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. స్థలపురాణం, కళ్యాణ మండపం గురించి  ఆలయ సిబ్బంది ఐపీఎస్ అధికారులకు  వివరించారు. శిఖర దర్శనం చేసుకుని ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రశంసించారు. వరాహ, నరసింహస్వామి ఒకే అవతారంలో  దర్శనమివ్వడం అపురూపమని రష్మీ శుక్లా అభిప్రాయపడ్డారు.

Simhachalam

2021-06-30 05:35:20

Tadepalle

2021-06-29 15:18:26

మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా సక్సెస్ కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవతం చేయడానికి ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మద్యాహ్నం సత్తెనపల్లి పట్టణంలో 2, 3 వార్డు సచివాలయాలను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పని చేస్తున్న వార్డు సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది విధులను పరిశీలించారు. వార్డు సచివాలయంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలను అడిగి తెలుసుకున్నారు. గృహనిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంతమందిని మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ద్వారా సన్నద్ధం చేశారని ప్రశ్నించారు. 2, 3 వార్డుల పరిధిలో మొత్తం 174 మంది లబ్ధిదారులను ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకునేందుకు గుర్తించడం జరిగిందని సచివాలయ  అడ్మిన్ సెక్రటరీ ఎం. విజయలక్ష్మీ, ఇంజనీరింగ్ సెక్రటరీ సుశ్మితలు  తెలిపారు. వీరిలో బీమవరం గ్రామ శివారుల్లో రెండు చోట్ల లే అవుట్ల ను గుర్తించి అర్హత కలిగిన లబ్ధిదారులకు  ఇళ్ళ స్థలాలు కేటాయించినట్లు  జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ కు వివరించారు. ఇప్పటి వరకు 30 మంది లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునేందుకు ముందుకు వచ్చారని అన్నారు.. మిగతా 144 మందికి స్థానిక కౌల్సిలర్ లు, మెప్మా నోడల్ అధికారిణి  నాగేశ్వరీలతో కలిసి అబ్ధిదారులతో బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా-రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా, ఆ సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కార మార్గాలను  చూపుతామన్నారు. అవసరమైతే ఆర్ధిక ఇబ్బందులు ఉన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు స్ర్తీశక్తి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ  కార్యక్రమంలో సత్తెనపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, తహాశీల్ధార్ రమణ కుమారి,గృహనిర్మాణశాఖ అధికారులు, వార్డు సచివాలయ సబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sattenapalle

2021-06-29 14:26:32

రేపు అందరికీ కోవిడ్ ఫస్ట్ డోస్ వేక్సిన్..

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో  బుధవారం హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 సంవత్సరాలు దాటిన వారికి కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ టీకాలు పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు.  అలాగే కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ టీకా వేయించుకుని 28 రోజుల వ్యవధి పూర్తయిన వారికి రెండవ డోస్ టీకాలు వేస్తారని  తెలియజేశారు.  జిల్లాలో కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకుని సెకండ్ డోస్ వేయించుకోవలసిన వారు ఇంకా 10 వేల మంది వరకూ ఉన్నారని వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.   

Kakinada

2021-06-29 14:22:43

నాణ్యమైన విద్యకు ఏపీ కేరాఫ్ అడ్రస్..

రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్ధికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్  రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో నాబార్డ్ – ఆర్ఐడిఎఫ్  రూ.7.25 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శంఖుస్థాపన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు  శంకరరావు  అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ 2009 లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు అయిన తరువాత 360 మంది విద్యార్థులకు గాను 160 మంది మాత్రమే చదువు కొంటున్నారన్నారని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేక అరకొర వసతులతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదులలో నడుస్తుండటం బాధాకరామన్నారు.  గతంలో పని చేసిన ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై కొంతైనా దృష్టి సారించి వుంటే పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనం సమకూరి వుండేదన్నారు.  రెండు సంవత్సరాల కాలంలోనే  విద్యార్డుల కలను నెరవేర్చే దిశగా పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానానికి కృషి చేసిన  పెదకూరపాడు శాసన సభ్యులు శంకరరావును మంత్రి అభినందించారు. కేవలం 18 నెలల కాలంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో అధికారులు పని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో నూతన భవనంలో వృత్తివిద్యా కోర్సులను కూడా ప్రవేశపెడతామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి సంక్షేమ పధకాలను అమలు చేసి  అక్కచెల్లమ్మల కుటుంబాలలో తోబుట్టువుగా మారిపోయారన్నారు.  రాష్ట్రంలో నాడు - నేడు ద్వారా జరుగుతున్న పాఠశాలల అభివృద్ధిని పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కేబినేట్ కమిటీ  ఆమోదించి అమలు చేసే ఆలోచనలో ఉందంటే ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల పనితీరును రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. రూ.7.25 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ఈ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి భవిష్యత్ అవసరాల దృష్ట్యా కావలసిన నిధులు మంజూరు చేసి, అక్కడే అదనపు భవనాలను నిర్మించి రాష్ట్రంలోనే ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాలగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్  వెల్లడించారు.
 
  నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాలకు సొంత  భవనం సమకూరడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకరరావు ల ఫలితం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారనడానికి అమ్మ ఒడి, విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు – నేడు పధకాల ద్వారా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే ఉదాహరణ అన్నారు.  కరోనా విపత్కర పరిస్థితులల్లో కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని సరిదిద్ది పౌష్టికాహారం అందించేందుకు అమ్మ ఒడి ఉపయోగపడిందన్నారు.  ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 360 మందికి గాను 160 మంది విద్యార్దులు చదువుతున్నారని, తగినంత మంది అధ్యాపకులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.  దీంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్డుల శాతాన్ని పెంచేందుకు ఇక్కడే  వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ను కోరారు.. 

  పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పెను మార్పులను   తీసుకువచ్చి విద్యా పట్ల తమకున్న  అంకితభావాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చాటిచెప్పారని అన్నారు.  శ్రీ కృష్ణార్జునుల అనుబంధాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను విద్యా శాఖ మంత్రి తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నారని  నంబురు శంకరరావు కొనియాడారు. రూ. 7.25 కోట్లతో క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను నిర్మిస్తున్నామన్నారు. పద్దెనిమిది నెలల్లోనే  భవన నిర్మాణాన్ని  అన్ని వసతులతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 

  సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు గా మరుగున పడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం కొరకు శాసన సభ్యులు నంబూరు  శంకరరావు చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న నిరక్షరాస్యతను సున్నా శాతానికి తీసుకొచ్చే విధంగా పిల్లల చదువుల కొరకు అమ్మఒడి వంటి పథకం ప్రారంభించిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.  రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా  కొన్ని లక్షల కుటుంబాలలో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. 

  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ క్రోసూరు పరిధిలోని విప్పర్ల గ్రామం వద్ద పెదకూరపాడు  శాసన సభ్యులు నంబురు శంకర రావు చొరవతోనే 4.50 ఎకరాల స్థలంలో పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు అవకాశం కల్పించగలిగామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య కన్నా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసుకోవలసిన ఆవశ్యకతను గుర్తు చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్నత విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన భూమిని పెదకూరపాడు  శాసన సభ్యులు నంబురు శంకర రావు  స్థానిక రైతులతో మాట్లాడి భూమిని సేకరించి విద్య శాఖకు అందించడం జరిగిందన్నారు.  
 
  సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి మాట్లాడుతూ గత రెండేళ్లుగా పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేదన్న విషయాన్ని పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకర రావు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు విద్యా శాఖ మంత్రి కృషి చేస్తున్నారన్నారు.  వీరిద్దరి చొరవతో క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం నిర్మించుకోవడానికి అవకాశం కలిగిందన్నారు.  ప్రస్తుతం విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వలన విద్యార్డులకు నేరుగా ఇంటికే పాఠ్య పుస్తకాల పంపిణీ, నాడు – నేడు పధకం ద్వారా పాఠశాల అభివృద్ది, పిల్లల ఆరోగ్య పరిరక్షణనకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలను విద్యాశాఖ ద్వారా ప్రభుత్వమే నిర్వహిస్తున్నదన్నారు. ఒక్క జిల్లాలోనే రెండు మెడికల్ కళాశాలలు రావడం ఎంతో కష్టతరమైనప్పటికీ ముఖ్యమంత్రి చొరవతో వాటికి శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు.  జిల్లాలో మూడు పాలిటెక్నిక్ కళాశాలలు వుంటే గుంటూరు లో రెండు, క్రోసూరులో ఒకటి  ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

  కార్యక్రమంలో విద్య శాఖ రీజనల్  జాయింట్ డైరెక్టర్ పద్మారావు, ఏ.పి.ఎస్.డబ్ల్యూ.ఐ.డి.సి ఈ.ఈ కరుణాకర్ రెడ్డి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కే.వి. రమణ రావు, క్రోసూరు మండల తహశీల్దారు, యంపీడీఓ,  క్రోసూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంపా జ్వాలా లక్ష్మీ నరసింహారావు, విప్పర్ల  గ్రామ సర్పంచ్  నర్రా శేషయ్య, క్రోసూరు ఉప సర్పంచ్ షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. 

Krosur

2021-06-29 14:20:22

దిశయాప్ ప్రతీ మహిళ సెక్యూరిటీ గార్డ్..

మహిళలంతా దిశ యాప్ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో అది సెక్యురిటీ గార్డ్ గా పనిచేస్తుందని ప్రముఖ న్యాయవాధి, సామాజిక వేత్త రహిమున్నీసాబేగం పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో ఆమె దిశ యాప్ వినియోగంపై మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చాలా మంచి రక్షణ వ్యవస్తను దిశ యాప్ ద్వారా రూపొందించిందన్నారు. దీనిని అత్యవసర సమయంలో వినియోగించడం ద్వారా పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందుతాయన్నారు. ప్రతీ ఒక్క మహిళ సెల్ ఫోనులో దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దుండగల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ యాప్ మహిళల ఫోన్లలో ఉంటే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేంత దైర్యం కూడా వస్తుందన్నారు. అనంతరం దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత, దీనిని ఏ విధంగా వినియోగించాలో కూడా సహచర మహిళా లాయర్లకు వివరించినట్టు చెప్పారు. త్వరలో మహిళలకు, విద్యార్ధినిలకు చైతన్యం తీసుకు రావడం కోసం ప్రత్యేకంగా పాల్గొనే కార్యక్రమాల్లో దిశ యాప్ కోసం ప్రస్తావిస్తానని ఆమె వివరించారు. కాలేజీ వెళ్లే యువతులే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా అత్యవసర సమయంలో దీనిని ఉపయోగించవచ్చునన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవాలని ఆమె సూచించారు. యాప్ ఇనిస్టాల్ చేసుకున్న ప్రతీ ఒక్కరూ మరో ముగ్గురు...వారంతా ఒక్కొక్కరూ ముగ్గురు ముగ్గురితో యాప్ ని స్వచ్ఛందంగా ఇనిస్టాల్ చేయించడానికి ముందుకి రావాలని రహిమున్నీసాబేగం కోరారు.

Visakhapatnam

2021-06-29 13:22:10