1 ENS Live Breaking News

ఇళ్ల నిర్మాణంలో స‌హ‌క‌రించండి..

పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో ఇళ్లు మంజూరైన లబ్దిదారుల‌ ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందించ‌డం ద్వారా వారంతా మెగా గ్రౌండింగ్ మేళాలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వ‌చ్చేలా చొరవ చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల చైర్‌ప‌ర్స‌న్‌లు, మేయ‌ర్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌ను కోరారు. జిల్లాలోని మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గ ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం టెలి కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్నఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. జిల్లాలో జూలై 1, 3, 4 తేదీల్లో మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వ‌హిస్తున్నామ‌ని మొద‌టి రోజునే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా త‌మ వార్డు ప‌రిధిలోని ల‌బ్దిదారుల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. ప‌ట్ట‌ణానికి దూరంగా లే అవుట్‌లు ఉన్న‌చోట అక్క‌డ‌కు ల‌బ్దిదారులు చేరుకునేలా బ‌స్సులు ఏర్పాటు చేస్తున్నామ‌ని, మంగ‌ళ‌, బుధవారాల్లో ఆయా ల‌బ్దిదారుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్ల‌ను, ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం ఏవిధంగా స‌హాయ‌ప‌డుతుందో వారికి వివ‌రించాల‌ని కోరారు. జూలై 1న ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన పూజా సామాగ్రి, టెంట్‌లు వంటి ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. లే అవుట్ల‌కు ల‌బ్దిదారుల‌ను తీసుకువెళ్లి వారికి సంబందించిన స్థ‌లంలో ఇంజ‌నీరింగ్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ల స‌హ‌కారంతో స్థలంలో మార్కింగ్ చేయించాల‌న్నారు. ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఇసుక‌, నీరు, ఇటుక వంటి ఇళ్ల నిర్మాణ సామాగ్రిని సిద్దం చేసుకోవాల‌ని సూచించారు.
జిల్లాలో 98 వేల మందికి ఇళ్ల‌స్థ‌లాలు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని, ఇందులో 75 వేల ఇళ్ల‌ను రెండు ద‌శ‌ల్లో నిర్మాణం చేసుకోవ‌ల‌సి వుంద‌న్నారు. జిల్లాలోని అన్ని శాఖ‌ల అధికారుల‌ను ఇందులో భాగ‌స్వామ్యం చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు.
జిల్లాలోని ప‌ట్ట‌ణాల్లో నిర్మిస్తున్న ఇళ్ల‌లో 70శాతం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోనే నిర్మిస్తున్నామ‌ని, అతి పెద్ద లే అవుట్ అయిన  గుంక‌లాంలో ఇద్ద‌రు అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌న్నారు. డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ కె.సుబ్బారావుకు మూడు బ్లాకులు, ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్‌కు మూడు బ్లాకులు అప్ప‌గించామ‌న్నారు.
జిల్లాలో మెగా గ్రౌండింగ్‌మేళాల‌పై జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. సిపిఓ కార్యాల‌యంలో ఈ కంట్రోల్ రూం ఏర్పాట‌వుతుంద‌ని, ప్ర‌తి గంట‌కూ జ‌రిగిన గ్రౌండింగ్ వివ‌రాల‌తో రాష్ట్ర స్థాయికి స‌మాచారం అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
రాష్ట్రంలో న‌వ‌రత్నాల్లో భాగంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో జిల్లా మొద‌టి, రెండు స్థానాల్లో నిలుస్తోంద‌ని, అత్యంత ముఖ్య‌మైన ఈ కార్య‌క్ర‌మంలోనూ ప్రజాప్ర‌తినిధుల‌, అధికారుల స‌హ‌కారంతో మొద‌టిస్థానంలో నిలుస్తామ‌నే విశ్వాసాన్నివ్య‌క్తం చేశారు.

టెలికాన్ఫ‌రెన్సులో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్‌లు, క‌మిష‌న‌ర్‌లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-28 11:03:06

స‌మిష్టిగా కోవిడ్‌పై విజ‌యం సాధించాం..

ప్రభుత్వ శాఖ‌ల‌న్నీ క‌లిసిక‌ట్టుగా, స‌మ‌ర్థ‌వంతంగా కృషి చేయ‌డం వ‌ల్లే, జిల్లాలో కోవిడ్‌పై విజ‌యం సాధించామ‌ని  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌హమ్మారిపై పోరులో క్రియాశీల‌కంగా ప‌నిచేసిన‌ ప్ర‌తీఒక్క‌రినీ ఆయ‌న కొనియాడారు. కోవిడ్ స‌మ‌యంలో ఆరోగ్య‌మిత్ర‌లు అందించిన సేవ‌ల‌ను ప్ర‌శంసించారు. డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ‌ అభినంద‌న స‌భ క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ను, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌ను, జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారిని, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావును ఘ‌నంగా స‌త్క‌రించారు. ఆరోగ్య మిత్ర‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ చేతుల‌మీదుగా జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్ర‌ణ‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇత‌ర జిల్లాల‌కు దిక్సూచిగా మారింద‌న్నారు. ప‌రిమిత వ‌న‌రులున్న‌ప్ప‌టికీ, ప్ర‌తీఒక్క‌రూ త‌మ శ‌క్తికి మించి ప‌నిచేశార‌ని ప్రశంసించారు. అందువ‌ల్లే కోవిడ్ చికిత్స‌లో గానీ, మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డంలో గానీ మ‌న జిల్లా, ఇత‌ర జిల్లాల‌కు ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోనే అతిత‌క్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాగా మారామ‌ని చెప్పారు. జిల్లాలో కోవిడ్ స‌మ‌యంలో ఆక్సీజ‌న్  కొర‌త రాకుండా  చేయ‌డంలో, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ మహేష్ కుమార్ విశేష‌మైన కృషి చేశార‌ని కొనియాడారు. ఆసుప‌త్రులు, ప‌డ‌క‌ల యాజ‌మాన్యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించార‌ని అభినందించారు. డిఎంఅండ్‌హెచ్ఓ, డిసిహెచ్ఎస్ త‌మ‌కు అప్ప‌గించిన విధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించార‌ని చెప్పారు. వేక్సినేష‌న్‌లో కూడా మ‌న జిల్లా రికార్డు సాధించింద‌ని, 5 ఏళ్లు లోపు పిల్ల‌లున్న త‌ల్లులు 94 శాతం మందికి వేక్సినేష‌న్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచామ‌ని తెలిపారు. కోవిడ్ మూడోద‌శ వ‌స్తే ఎదుర్కొన‌డానికి జిల్లా యంత్రాంగం స‌ర్వ‌స‌న్న‌ద్దంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

             జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్‌ను అదుపుచేయ‌డంలో ప్ర‌తీఒక్క‌రూ అంకిత‌భావంతో ప‌నిచేశార‌ని అభినందించారు. మ‌న‌ది పేద‌ల జిల్లా కావ‌డంతో, సుమారు 83 శాతం మందికి ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా కోవిడ్ వైద్యం అందించి, వారి ప్రాణాల‌ను కాపాడారని ప్ర‌శంసించారు. వైద్య సేవ‌లు అందించే క్ర‌మంలో ఆర్థికంగా ఎటువంటి ఆరోప‌ణ‌లు రాకుండా,  ఆరోగ్య‌మిత్ర‌లు చ‌క్క‌ని ప‌నితీరు క‌న‌బ‌రిచార‌ని కొనియాడారు.

             ఈ సంద‌ర్భంగా ఆరోగ్య‌శ్రీ జిల్లా కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్‌ యు.అప్ప‌ల‌రాజును క‌లెక్ట‌ర్ చేతుల‌మీదుగా స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో టీమ్ లీడ‌ర్లు బి.సురేష్‌, టి.జ‌నార్థ‌న్‌, ఏ. భాను, నారంనాయుడు, ఉమా, దేవి, ఆరోగ్య‌మిత్ర‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-28 11:00:59

సీఎస్ఆర్ పనులు సత్వరమే జరగాలి..

అమలాపురం నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్ ఎస్ వి బి వసంతరాయుడు అధ్యక్షతన  జరిగిన సమీక్ష సమావేశంలో కెయిర్న్ ఎనర్జీ, వేదాంత , పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్&బి అధికారులతో ప్రతీ సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్న సిఎస్ఆర్ నిధుల వినియోగం, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై మంత్రి విశ్వరూప్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను నివారించడానికి సిఎస్ఆర్ నిధుల వినియోగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. నియోజకవర్గంలోని తీర ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజా ఉపయోగకరమైన త్రాగునీరు, రోడ్లు, కల్వర్టులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై మంత్రి సమీక్షించారు. ఇందులో కొన్ని పనులు పూర్తవగా, కొన్ని పనులు ప్రగతిలో ఉండగా, కొన్ని పూర్తి కాలేదు. అలాగే ప్రారంభం కాని పనులపై సమీక్షించి అందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఆర్ ఇ జి ఎస్ తో ముడిపడి ఉన్నాయని నిధులు నిలిచిపోవడం వలన ఆ పనులు నిలిచిపోయాయని పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు మంత్రి విశ్వరూప్ కు వివరించారు. అనంతరం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిఎస్ఆర్ నిధులు రూ.10 కోట్ల 93 లక్షలతో చేపట్టనున్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి, తక్షణమే పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతీ మూడు నెలలకొకసారి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించి, సంబంధిత పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని రావాలని మంత్రి విశ్వరూప్ కోరారు.
                 ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ కె. చంటిబాబు, డిఈఈ రాజ్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ డిఇఇ ఎన్. పార్థసారధి, సిపివో బాలాజీ, వేదాంత,  కెయిర్న్ ఎనర్జీ అధికారులు కె.శ్రీహరి,సతీష్, పాషా, ఆర్&బి అధికారులు, ఉప్పలగుప్తం తహశీల్దార్ ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2021-06-28 09:18:38

శివారు భూములకు నీరు అందిస్తాం..

 రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక ప్రభుత్వం  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం వజ్రపుకొత్తూరు మండలం పిఎసిఎస్ నూతన అధ్యక్షులుగా దువ్వాడ హేంబాబు చౌదరి ప్రమాణస్వీకారం  చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత పిఎసిఎస్ కమిటీలు తీసుకోవాలని అన్నారు. నూతనంగా పదవి చేపడుతున్న దువ్వాడ హేంబాబు చౌదరి సర్ధవంతంగా పనిచేస్తాడని నమ్ముతున్నాను అని అన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో ఉద్దాన, పల్లపు ప్రాంత రైతులు ఉన్నారని వారి అభివృద్దికి తోడ్పడుతూ ముందుకు పోవాలని అన్నారు.ఇటీవల ప్రభుత్వం నష్టపోయిన రైతులకు 10.50  కోట్లు రూపాయలు అందించిన విషయం గుర్తు చేశారు. ఉద్దాన ప్రాంతంలో జీడి రైతులకు మేలు జరిగేలా ఫార్మర్ ప్రొడక్ట్స్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులు సంఘాలుగా ఉన్నారని తెలిపారు. ఏఫ్.పి.ఒ, పిఎసిఎస్, మార్కెట్ కమిటీలు సమన్వయంతో రైతుల సమస్యలు తెలుసుకుని మరింత ప్రభుత్వ సంక్షేమం అందించాలని కోరారు.రైతుకు విత్తనాలు, ఎరువులు, నీరు సకాలంలో అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతు విత్తనం వేసే దశ నుండి పంట చేతికి వచ్చే  వరకు ఆర్.బి.కె ల ద్వారా రైతుకు భరోరాసా కల్పిస్తున్నమని అన్నారు.

వజ్రపుకొత్తూరు శివారు భూములకు ఈ ఏడు సాగు నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాము అని అన్నారు. ఈ ఏడాది రైతు రుణాలు పిఎసిఎస్ ల ద్వారా అధిక శాతం లబ్ధిదారులకు అందించి రైతు పంట ఉత్పత్తిని పెంచే దిశగా పిఎసిఎస్ లు పనిచేయాలని కోరారు. ప్రతి పిఎసిఎస్ పరిధిలో 5 వందల మెట్రిక్ టన్నుల గొడాములు నిర్మిస్తున్నామని వాటికి త్వరలో టెండర్లు కూడా వేస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు సబ్సిడి, రైతు భీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి రైతుకు మేలు జరిగేలా సర్పంచ్ లు ,ఎంపిటిసి అభ్యర్ధులు కలిసి రైతుకు చేయూత కావాలని అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఉండకుండా వంశధార చానల్స్ అన్ని మరమ్మత్తులు చేయించుకున్నామని అన్నారు.  అంతే కాకుండా గ్రామాల్లో మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావడానికి అముల్ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో సొసైటీలు పెడతాం అని అన్నారు. వారికి కూడా డిసిసిబి, పిఎసిఎస్ ద్వారా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీలో  కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అందరం కలిసి పని చేయాలని అన్నారు.

వజ్రపుకొత్తూరు పిఎసిఎస్ అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన దువ్వాడ హేంబాబు చౌదరి మాట్లాడుతూ  రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు తనపై నమ్మకం ఉంచి పిఎసిఎస్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి అందిస్తాను అని అన్నారు.  ఈ కార్యక్రమంలో   గురయ్యనాయుడు, పలాస నియోజకవర్గం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పివి సతీష్, స్థానిక నాయకులు హనుమంతు వెంకటరావు దొర, భాస్కరరెడ్డి, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, కోత పూర్ణచంద్రరావు, సర్పంచ్ లు, ఏంపిటిసి అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-27 16:45:41

త్వరగా జిల్లా ఆసుపత్రి సిద్ధంచేయాలి..

టెక్కలి జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ అధికానులను ఆదేశించారు. ఆదివారం  వంశధార కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న జిల్లా ఆస్పత్రి నూతన భవనాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎంత విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నది, పడకల సంఖ్య, తాగునీటి సౌకర్యం, నిధులు మంజూరు వంటి వివరాలను వైద్య విధాన పరిషత్ కార్యనిర్వాహక ఇంజనీర్ బి.ఎన్. ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అవసరాలకు వంశధార కాలువ పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఏర్పాటు చేసిన తాగునీటి బో ర్ నుండి నీటి వినియోగం, నిల్వ చేసేందుకు లక్ష లీటర్ల సామర్థ్యం గల సంపు ఏర్పాటు విషయాలనువివరించారు. 164 ఆక్సిజన్ సిలిండర్ల కనెక్షన్ లతో పడకలు ఏర్పాటు చేయడమైనద ని ఈ ఈ కలెక్టర్ కు తెలిపారు. 1000 ఎల్.పి.ఎం సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్ రావలసి ఉందని, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు మరో 15 రోజుల్లోగా పూర్తి కానుందని తెలిపారు. ఆస్పత్రి పనులు ఎప్పటిలోగా పూర్తి కావొచ్చన్న కలెక్టర్ ప్రశ్నికు జూలై 20 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని తెలిపారు. పోస్టుమార్టం గది నిర్మాణం కొరకు ప్రశ్నించగా ఇందుకు ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ దృష్టికి తేగా అప్పటివరకు పాత ఆసుపత్రి భవనం వద్ద సేవలు కొనసాగించాలని సూచించారు.

 త్వరితగతిన పనులు పూర్తి కి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత ఆసుపత్రి నూతన భవనం అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత ఆస్పత్రి కూడా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. కేశవ రావుకు సూచించారు. అనంతరం కోవిడ్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో కోవిడ్ కేసులు నమోదు, ఆస్పత్రిలో ఎంతమంది చికిత్స పొందుతుంది,  కోవిడ్ నుండి కోలుకున్నవారి సంఖ్య డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ డా, లీలా ను అడిగి  తెలుసుకున్నారు. మూడవ దశ కరోనా వ్యాప్తి రానున్న దృష్ట్యా చిన్నపిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల సూచన లు మేరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులను సూచించారు. కరోనా వంటి ప్రాణాంతక పరిస్థితుల్లో వైద్యులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. అనంతరం స్థానిక పట్టు మహాదేవ కోనేరు ను పరిశీలించారు. అభివృద్ధి ప్రణాళికను ఎమ్ ఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కలెక్టర్ కు వివరించారు.   కలెక్టర్ మాట్లాడుతూ చెరువు కట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కు దోహదపడుతుందన్నారు. అక్కడి నుండి వంశధార కాలువ పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఏర్పాటుచేసిన తాగునీటి బోర్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  ఇన్ ఛార్జ్ ఆర్ డి ఓ సీతారామమూర్తి, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఎస్ .సూర్య రావు,  మండల ప్రత్యేక అధికారి డా, మంచు కరుణాకర్ రావు, తాసిల్దార్ ఎస్. గణపతి, ఎంపీడీవో పి. నారాయణ మూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ .నీలయ్య, సర్వేయర్ సుభాష్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tekkali

2021-06-27 14:47:53

GVMCలో డయల్ యువర్ మేయర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం చేపడుతున్నట్టు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు.  సోమవారం ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల వరకు డయల్ యువర్ మేయర్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. నగర వాసులు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 కి ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి క్రుషిచేస్తామని, నగర వాసులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మేయర్ ఆ ప్రకటనలో కోరారు.

GVMC office

2021-06-27 13:54:34

29న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం..

గుంటూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం  మధ్యాహనం 2.30 గంటలకు కలక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వర్యులు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధ్యక్షతన జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.  సమీక్షా కమిటీ సమావేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్, పేదలందరికీ ఇళ్ల పధకం, ఇళ్ళ నిర్మాణ పురోగతి, ఖరీఫ్ వ్యవసాయ సన్నద్ధత, యంజిఎన్ఆర్ఇజియస్ పనులు, డా. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జల జీవన్ మిషన్ అజెండా అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.  

Guntur

2021-06-27 13:45:45

సింహాద్రినాథునికి రూ.50వేలు విరాళం..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారికి విశాఖ విశాలాక్షి నగర్ కు చెందిన భక్తుడు జి.సురేష్ రూ.50వేలు విరాళాన్ని అందించారు. ఈ మేరకు పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో నగదు అందించి రసీదు పొందారు. 05-05-2021న  కాలం చేసిన తమ మావయ్య మోటుపల్లి వీరభద్రుడు, సూర్యకాంతంల  పేరుతో అన్నదానం చేయాలని సురేష్ దేవస్థాన అధికారులను కోరారు. ఈ సందర్భంగా దాతలకు ఉచిత దర్శనం కల్పించి, తీర్ధ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. అటు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉపాలయాలైన పైడితల్లి, బంగారమ్మ ఆలయాలకు  సింహాచలంకు చెందిన భక్తుడు రాజగోపాలరావు రూ.30వేలను విరాళంగా ప్రకటించారు. వాటితో అమ్మవార్ల ఆలయాలను అభివ్రుద్ధి చేయాలని దాత కోరారు. ఆ మొత్తాన్ని ఉపాలయాల అర్చకుడు సంతోష్ కు చెక్ ను అందించారు.

Simhachalam

2021-06-27 07:11:08

అప్పన్నను దర్శించుకున్న 30వేల మంది..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని శనివారం ఒక్కరోజే 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు. జేష్టమాసం కావడం, ఆపై ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో భక్తులు స్వామివారిని చూడటానికి పోటెత్తారు. గాలిగోపురం దగ్గర నుంచి కొండపై బస్టాండ్ వరకు భక్తులతో రద్దీగా మారిపోయింది. దీనితో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ ఈఓ ఎంవీసూర్యకళ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ అనంతరం ఒకేసారి ఇన్నివేల మంది భక్తులు రావడం ఇదే తొలిసారి.  శుక్రవారంనాటికే 50వేల లడ్డూలు, 16వేల పురిహోర ప్యాకెట్లు స్టాక్ పెట్టిడంతో.. భక్తుల ప్రసాదానికి ఎలాంటి సమస్యా రాలేదు. ఇక నుంచి పర్వదినాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈఓ దేవస్థాన అధికారులను ఆదేశించారు.

Simhachalam

2021-06-26 15:37:09

హౌసింగ్ మెగా డ్రైవ్ విజయవంతం కావాలి..

విశాఖ జిల్లాలో గృహనిర్మాణ  కార్యక్రమాన్ని   అధికారులు, సిబ్బంది ప్రణాళికాయుతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  ఆదేశించారు.  శనివారం మధ్యాహ్నం  జిల్లా కలెక్టర్ “నవరత్నాలు –పేదలందరికి  ఇళ్లు” మెగా గ్రౌండింగ్  మేళా పై జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం, అవగాహనా కార్యక్రమాన్ని  నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు  మాట్లాడుతూ  అర్హులైన  పేదలందరికి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని  తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో హౌసింగ్ శాఖ సిబ్బందితో పాటు   అన్ని శాఖల అధికారులు  జిల్లా మరియు మండల స్థాయిలలో  పని చేసి విజయవంతం గావించాలన్నారు.  జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి విశాఖ డివిజన్, జాయింట్ కలెక్టర్  పి.అరుణ్ బాబు, అనకాపల్లి డివిజన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి నర్సీపట్నం డివిజన్, జి.వి.ఎం.సి కమిషనర్ డా.జి.సృజన  జి.వి.ఎం.సి పరిధిలో  పేదలందరికి  ఇళ్ల కార్యక్రమానికి  ఇన్ చార్జిలుగా  ఉంటారన్నారు. తదుపరి  ప్రతి నియోజక వర్గానికి   డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారిని, మండల స్థాయిలో  మండల ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందన్నారు.  అదే విధంగా మండలాల్లోని కొన్ని సచివాలయాలకు ఒక అధికారిని  నియమించడం జరుగుతుందని, చివరిగా లే-అవుట్ స్థాయిలో  సచివాలయ స్థాయి సిబ్బందిని  బాధ్యులుగా  నియమించడం జరుగుతుందన్నారు.  ఈ ఐదు అంచెల ఎడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లో ప్రతి ఒక్కరు అంకిత భావంతో  పని చేయాలన్నారు. ఈ మెగా గ్రౌండింగ్  మేళాకు తేదీల వారీగా  చేపట్టవలసిన పనులను  వివరించారు.  26వ తేదిన జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి  అధికారులకు  శిక్షణా కార్యక్రమం నిర్వహణ, 28వ తేదీన మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయిలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ, ప్రజా ప్రతినిధులతో  సమావేశాల నిర్వహణ,  యాక్షన్ ఫ్లాన్ తయారు గావించుట. 29వ తేదిన  సచివాలయాల స్థాయిలో  శిక్షణ , 30వ తేదీన వాలంటీర్లు లబ్దిదారులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్దిష్టంగా నిర్వహించాలని అన్నారు.   జూలై 1వ తేదీన  గ్రౌండింగ్ మేళాకు శత శాతం లబ్దిదారులు   హజరు కావాలని,  దీనికి గాను  ప్రతి ఒక్కరూ సూక్ష్మ స్థాయిలో ప్రణాళికతో  పని చేయాలని స్పష్టం చేశారు .
జాయింట్ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ  గృహ నిర్మాణాలకు ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. అందరికీ అందుబాటులో వీలును బట్టి లే అవుట్ దగ్గరలోనే ఇసుకను వుంచుతామని చెప్పారు.  ప్రతి మండలంలో ఒక ఇసుక డిపోను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి   జాయింట్ కలెక్టర్లు, ఎం .వేణుగోపాల రెడ్డి,  పి. అరుణ్ బాబు,  జి.వి.ఎం .సి కమిషనర్ డా. జి.సృజన,  జాయింట్ కలెక్టరు (హౌసింగ్)   కల్పనా కుమారి, హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసరావు,  జిల్లా స్థాయి అధికారులు హాజరైయ్యారు. 

Visakhapatnam

2021-06-26 12:58:36

కరోనా థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి..

శ్రీకాకుళంజిల్లాలో కోవిడ్ మూడవ దశ వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్స్, ఇతరత్రా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ మూడవ దశపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని,  అందుకు తగిన విధంగా ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతరత్రా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఆసుపత్రి , నర్సింగ్ హోమ్ మినిమమ్ స్టాండర్స్ ఎక్విప్ మెంట్ , ఫర్నిచర్ కలిగి ఉండాలని సూచించారు. యాభై నుండి వంద పడకల గల ఆసుపత్రులు మరియు  వంద పడకల గల ఆసుపత్రుల్లో 100 ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలని చెప్పారు.  50 కంటే తక్కువ పడకలు గల ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ లలో 40 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రతీ బెడ్ కు ఆక్సిజన్ మాస్కుతో పాటు రెగ్యులేటర్ కూడా ఉండాలని జె.సి వివరించారు. పి.ఎస్.ఎ ఆక్సిజన్ ప్లాంటులు ఉన్నఆసుపత్రులలో ప్రతీ 100 పడకలకు 1000ఎల్.పి.ఎం ( లీటర్ పర్ మినిట్ ), 50 నుండి 100 పడకలు కలిగిన వాటికి 500 ఎల్.పి.ఎం, 50 కంటే తక్కువ పడకలు గల ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. 50 పడకల కంటే ఎక్కువ గల అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతమున్న వెంటిలేటర్ల సంఖ్య కంటే 50 శాతం అదనంగా పెంచాలని అన్నారు. 100 పడకలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20 శాతం పడకలను ICU పడకలుగా మరియు 80 శాతం  పడకలను నాన్ ఐసియు పడకలుగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతి పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో దాదాపు పడకల సంఖ్యతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, లేని ఆసుపత్రుల్లో వాటిని ఏర్పాటుచేసుకోవాలని, వీటితో పాటు ప్రభుత్వం సూచించిన అన్ని వసతులు ఏర్పాటుచేసుకోవాలని జె.సి ఆదేశించారు.

          ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సమన్వయకర్త డా.ప్రకాశరావు, డా. కె.సునీల్ నాయక్, కిమ్స్, సింధూర, మెడికవర్, పి.వి.యస్.రామ్మోహన్ రావు, జెమ్స్, బగ్గు సరోజిని, గొలివి, అమృత, జిఎంఆర్ ఆసుపత్రుల యాజమాన్యాలు మరియు కమల, లైఫ్, సూర్యముఖి, ట్రస్ట్, యునిక్, ఎ-వన్, సన్ రైజ్, వాసంతి, నారాయణ మల్టిస్పెషాలిటీ, ద్వారకమాయి, ఎస్.పి.వి ఆసుపత్రుల అధినేతలు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-26 12:51:19

మహిళల రక్షణే సీఎం జగనన్న లక్ష్యం..

మహిళల ఆత్మరక్షణకు కవచంగా దిశా యాప్ పనిచేస్తుందని.. యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామ మహిళా పోలీసులు, సంఘ మిత్రలు, మహిళా సంఘ లీడర్లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మేరకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో దిశ యాప్ వినియోగానికి చెవిరెడ్డి సంకల్పించారు. శనివారం శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ ఆడిటోరియం వేదికగా దిశా చట్టం, యాప్ పై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు శ్రీ పద్మావతీ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జమున, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు విచ్చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా రక్షణ గురించి సిఎం జగనన్నకు బాగా తెలుసన్నారు. అద్భుతమైన ఆలోచన, ఆశయంతో దిశచట్టానికి రూపకల్పన చేశారన్నారు. దేశంలోనే మొట్టమొదటి గా మహిళా రక్షణ కోసం చట్టం చేశారన్నారు. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ ఫోన్ లో డౌన్ లోడ్ చేయించాలన్నారు. కేంద్రం అమలు చేసిన నిర్భయ, ఫోక్సో చట్టాల కన్నా బలమైన చట్టంగా దిశా అవతరించిందన్నారు. జగనన్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళా అఘాయిత్యాలకు గురికాకూడదని సీఎం సంకల్పించారన్నారు. మహిళల మాన, ప్రాణాలకు భంగం కలిగించాలన్న ఆలోచన రాకుండా దిశా చట్టం పరిధిలో శిక్షలు రూపొందించారని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం రూపొందిన దిశా యాప్ ను ఆపదలో ఉన్న మహిళలు ఉపయోగించుకునేలా అవగాహన కలిగివుండాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో సంఘ మిత్రలు దిశా యాప్ డౌన్ లోడ్ చేయించి ఎక్కువ మందికి అవగాహన  కల్పించాలన్నారు. అలా ఎక్కువ మందికి చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం అందించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనం కోసం నడిచిన వాడు.. కష్టం విలువ తెలిసిన వ్యక్తి.. సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.  అందరికి మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. పథకాలతో ప్రతి నిరుపేదను ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రైతును రాజుగా మార్చే ప్రణాళిలతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ జగన్ పాలనను ఆశక్తిగా గమనిస్తున్నారన్నారు. 

అనంతరం శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ఆచార్య జమున మాట్లాడుతూ.. దిశా చట్టం సిఎం మానసపుత్రిక అన్నారు. మహిళా భద్రతకు సిఎం పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దిశా చట్టాన్ని ఏపిలో పకడ్బందీగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి మహిళ మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లల పట్ల అనునిత్యం జరుగుతున్న దారుణాలను ఉదహరించారు. మహిళలందరికీ రక్షణ కల్పించే కవచం దిశ చట్టం ఒక్కటే అని అన్నారు.  దిశ యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేయాలని కోరారు. అత్యవసరమైన పరిస్థితుల్లో దిశ యాప్ మహిళకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం ఏపీలో దిశ యాప్ ను తీసుకొచ్చారన్నారు. మహిళలపై దాడులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రార్ ఆచార్య మమత, రెక్టార్ ఆచార్య శారద, అడిషనల్ ఎస్పీ సుప్రజ ప్రసంగించారు. ప్రతి మహిళా స్పృహతో పాటు ఎంతో అప్రమత్తంగా మనల్ని మనం రక్షించుకోవాలని విశ్లేషించారు. స్త్రీకి కావాల్సిన భద్రత, గౌరవాన్ని  కాపాడటానికి ఏర్పాటు చేసిన దిశా యాప్ ను కొనియాడారు. ముందు ఇంటి నుంచే స్త్రీకి భద్రత పెరగాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దిశా యాప్ ద్వారా ఎవరు.. ఎవరికీ మేసేజ్ చేయాలి.. మహిళా పోలీస్, సంఘ మిత్రలు, మహిళా సంఘాల లీడర్లకు వీడియో ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేయించారు. సదస్సులో మహిళలు తాము దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నామని తమ మొబైల్స్ ను చూపారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి మహిళ డౌన్ లోడ్ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సుకు చంద్రగిరి నియోజకవర్గ మహిళా సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య లీడర్లు, గ్రామ  మహిళా పోలీస్ లు పాల్గొన్నారు.

Tirupati

2021-06-26 12:42:49

మా సమస్యలు పరిష్కరించండి సారూ..

విశాఖ ఫిష్ లాండింగ్ సెంటర్ లో బోట్లు నిలిపివేత, ఉత్పత్తుల అమ్మకాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాకినాడ అర్బన్ మండలం దుమ్ములపేట, పర్లోపేట గ్రామ టూనా ఫిష్టింగ్ ఫైబర్ బోట్ ఓనర్స్ శనివారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.  కాకినాడ రేవుకు తిన్నగా సుదూర జలాల్లో వేట సాగిస్తున్నపుడు నీటి వడిని బట్టి తమ బోట్ లు ఇటు తమిళనాడు లేదా అటు ఓడిస్సా వైపు వెళ్లిపోతాయని అక్కడి నుండి తిరిగి కాకినాడ వచ్చేలోపు ఆయిల్ అయిపోవడం, చేపలు కుళ్లిపోవడం జరుగుతోందన్నారు.  అందువల్ల ఒడిస్సా తీర జలాల ఉన్నపుడు సమీపంలోని విశాఖపట్నం ఫిష్షింగ్ హార్బర్ లో బోట్లు పెట్టుకుని, వేట చేపలు అమ్ముకుని  గత 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, అయితే ఇటీవల కాలంలో స్థానికంగా కొంత మంది దౌర్జన్యకారులు తమను చంపుతామని బెదిరిస్తూ, విశాఖపట్నం ఫిష్షింగ్  హార్బర్ లోకి తమ బోట్లను రానీయ కుండా తరిమేస్తున్నారని జిల్లా మత్స్యకారులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందువల్ల జీవనోపాధి కోల్పోయి బోట్లు అమ్ముకునే స్థితిలో ఉన్నామని, దౌర్జన్యకారులపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని జిల్లా మత్స్యకారులు ఆయనను వేడుకున్నారు. వారి విజ్ఞాపనపై మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ, పొరుగు జిల్లాల్లోని ఫిష్ లాండింగ్ హార్బర్లలో జిల్లా మత్స్యకారులకు ఎదురౌతున్న సమస్యలపై ఆయా జిల్లాల అధికారులు, రాష్ట్ర అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలియజేశారు.  అలాగే కెఎస్ఈ జడ్ లో సేకరించిన భూముల తిరిగి అప్పగింత ప్రక్రియలో తమ సమస్యలను, విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకోవలని ఎస్ఈజడ్ రైతులు కోరుతూ శనివారం మంత్రి కన్నబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నపం సమర్పించారు.  రైతుల సమస్యలను, వినతులను పరిశీలించి తగు పరిష్కారం అందించాలని ఎస్ఈజడ్ అధికారులు, ఆర్డిఓలకు సూచిస్తామని మంత్రి కన్నబాబు  తెలిపారు. 

Kakinada

2021-06-26 12:38:54

ఫస్ట్ ఎయిడ్ లేకపోవడం దారుణమే..

ఫస్ట్ ఎయిడ్ కు అవసరమైన వాటిని కూడా అందుబాటులో ఉంచుకోకుంటే ఎలా అంటూ అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందిని నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు. అనంతలోని  నాయక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను నగర మేయర్ శనివారం  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్  సెంటర్ కు వచ్చే ప్రజలకు ఏమి వసతులు లేవని స్థానికులు  మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం చేయడానికి అవసరమైన మందులు కాటన్ ఇతర మెడిసిన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది తీరుపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  స్థానికంగా వైద్యం అందుబాటులో ఉందని ఇక్కడికి బాధతో, రోగంతో వస్తే మందులు లేవు,ఫస్ట్ ఎయిడ్ లేదు అని వెనక్కు పంపిస్తే ఎలా అని సిబ్బందిని మేయర్ ప్రశ్నించారు. ముందస్తుగా అవసరమైన మెడిసిన్ ను తెప్పించుకోవాలని మందులు సరఫరా చేసే అపోలో వారు చేయకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో తెచ్చుకోవాలి కానీ తమ వద్ద లేవని రోగులకు వైద్య సేవలు అందించక పోవడం సరి కాదన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.  అవసరమైన మందులు ఇతరత్రా వాటిని  సప్లై చేసే అపోలో వాళ్ళతో మాట్లాడి వెంటనే వాటిని  ఏర్పాటు చేయాలని  డిప్యూటీ కమిషనర్ తో పాటు  హెల్త్ ఆఫీసర్ ని మేయర్ ఆదేశించారు. అంతేకాకుండా అర్బన్ హెల్త్ సెంటర్ లో  శానిటేషన్ గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేసి శుభ్రం చేయించాలని సూచించారు. ఆసుపత్రి గేటు వద్ద చాలా మంది ప్రజలు పడుతున్నారని వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగ వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని సిబ్బందికి మేయర్  సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు సాకే చంద్ర శేఖర్ ,అనిల్ కుమార్ రెడ్డి, కమల భూషణ్ వైఎస్ఆర్ సీపీ నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-26 12:35:23