1 ENS Live Breaking News

అప్పన్నకు ఉపరాష్ట్రపతి కుమార్తె పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారిని శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ దర్శించుకున్నారు. ఆమె అత్త, మావయ్య ఇతర కుటుంబ సభ్యులుసింహాద్రినాథునికి పూజలు చేశారు. అందరికీ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు , వేద పండితులు ఆశీర్వదం అందించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను అధికారులు అందించారు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు ముందుగానే 4500 పెట్టి 15 అతిశీఘ్రదర్శనం టికెట్లు తీసుకోవడం విశేషం. 

Simhachalam

2021-07-03 12:49:31

సుందరంగా YSRజగనన్న కాలనీలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాయకరావుపేట మండలం  పి ఎల్ పురం గ్రామంలో మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళా కార్యక్రమం లో మంత్రి పాల్గొని గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.  పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ   ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం  కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పాయకరావుపేట నియోజక వర్గంలో  సుమారు 5218 మంది అర్హులైన లబ్ధిదారులకు 102 లేఅవుట్ లలో ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో 1233 మంది లబ్ధి దారులకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేశారు. మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో  నర్సీపట్నం ఇంచార్జ్ ఆర్ డి ఓ ,అనిత, పాయకరావుపేట ప్రత్యేకఅధికారి విశ్వేశ్వరరావు,హౌసింగ్ డి ఇ మల్లికార్జున, తాసిల్దర్ సత్యనారాయణ,ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

Payakaraopeta

2021-07-03 12:25:22

సేంద్రీయ ఎరువుల తయారీపై అవగాహన..

మహావిశాఖ నగర పరిధిలోని మహిళలకు సేంద్రీయ ఎరువు తయారీపై  అవగాహన పెంచాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులు ఆదేశించారు. శనివారం ఆమె రెండవ జోన్ ఐదవ వార్డు పరిధిలోని మడురవాడ, గణేష్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రీయ ఎరువు తయారు చేయు పద్దతులను మహిళా సంఘాల ద్వారా మహిళలకు అవగాహన పెంచాలని, ఇంటిలో వాడే కాయగూరల తొక్కలు, పండ్లు తొక్కలను ఉపయోగించి సేంద్రీయ ఎరువు తయారుచేయు విధానాన్ని తెలపాలని అన్నారు. గణేష్ నగర్ లో ఒక గృహిణి సేంద్రీయ ఎరువు తయారు చేయు పద్దతిని పరిశీలించి, ఆమెను అభినందించారు. ఈమెను ఆదర్శంగా చేసుకొని మరికొంత మందిని సేంద్రీయ ఎరువు తయారీకు ప్రోత్సహించాలని, డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. వార్డులో మంచి నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు శుద్ధి చేసిన త్రాగు నీరు అందించాలని, గడువులోపు కొళాయి కనక్షనులు ఇవ్వాలని, సహాయక ఇంజినీరు(వాటర్ సప్ప్లై)ను  ఆదేశించారు.  వార్డులో పందులు అధికంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని వెటర్నరి డాక్టరును ఆదేశించారు. రానున్న వర్శాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని, ఇళ్ళ పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎఎంఒహెచ్ కిషోర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి.రాము,   కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి (మెకానికల్), శంకర్(వర్క్స్), శ్రీనివాస్(వాటర్ సప్ప్లై), ఎఎంఒహెచ్ / వెటర్నరి డాక్టరు కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వంశీ, సహాయక ఇంజినీరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-07-03 12:21:39

నిరుపేదల ఇంటి కల నెరవేరుతుంది..

వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో పండుగ వాతవరణంలో అనందోత్సహాలతో పేదలందరికీ ఇళ్ళ పథకం లబ్ధిదారులు ముమ్మరంగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలోని పేదంలందరికీ ఇళ్ళు వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, తాడికొండ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవితో కలిసి పాల్గొన్నారు. కాలనీలోని పలు ఇళ్ళకు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ నవరత్నలు పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా జిల్లాలో మొదటి విడతలో దాదాపు 1,22,000 ఇళ్ళకు పైగా నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 1, 3, 4 తేదీలలో మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాలో 60,000 ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం ఒక్క రోజే దాదాపు 14,000 పైగా ఇళ్ళకు శంకుస్థాపన చేయాలని లక్ష్యాలు నిర్దేశించామన్నారు. మొదటి విడతలో మంజూరు చేసిన 95 శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తేనే కేంద్రం వెంటనే రెండవ విడత ఇళ్ళను మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, తహశీల్దారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారన్నారు.

 తాడికొండ శాసనసభ్యులు డా. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రూ. 10 లక్షల విలువగల స్ధిరాస్తిని పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా ఇంటి స్థలం, పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తున్నారని అక్కా, చెల్లమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 15 లక్షలకు ఇళ్ళ నిర్మాణాలకు  శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇంత భారీ ఎత్తున ఇళ్ళ నిర్మాణం దేశంలో ఎక్కడ జరగటం లేదన్నారు. తాడికొండ నియోజకవర్గంలో 68 వైఎస్సార్ జగనన్న కాలనీలలో 6000 మందికి పైగానే ఇంటి పట్టాలు అందించామన్నారు. పెదపరిమి గ్రామంలో తొమ్మిదిన్నర ఎకరాలలో వైఎస్సార్ జగనన్న కాలనీని ఏర్పాటు చేశారన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించటం జరిగిందని, ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్ధిక సహాయంతో పాటు, ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందని, రాయితీ పై సిమెంట్, ఇనుము ఇతర నిర్మాణ సామగ్రి రాయితీపై అందిస్తుందన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీలను   రహదారులు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలతో   పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు.  ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు.

    అనంతరం మందడం గ్రామంలో గ్రామ సచివాలయం –2 భవనంను, గ్రామంలో సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తాడికొండ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి భాస్కరరెడ్డి, తాడికొండ నియోజకవర్గం ప్రత్యేక అధికారి భాస్కర నాయుడు, తుళ్ళూరు తహశీల్దారు సంజీవకుమారి, యంపీడీఓ ఏ. శ్రీనివాస్, హౌసింగ్, సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Thullur

2021-07-03 12:18:39

వారంలో 3రోజులు కోవిడ్‌పై ప్ర‌చారం..

కోవిడ్ ముప్పు పూర్తిగా తొల‌గిపోలేద‌ని, ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌తీఒక్క‌రూ వ్యాధి సోక‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, చేతుల‌ను త‌ర‌చూ శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్‌పై అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని, దీనిలో భాగంగా వారంలో మూడు రోజుల‌పాటు వినూత్నంగా, ప్ర‌త్యేక‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నామ‌మ‌ని తెలిపారు. ప్ర‌తీ సోమ‌వారం నో మాస్క్‌-నో ఎంట్రీ నినాదంతో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లోకి మాస్కులు లేకుండా అనుమ‌తించ‌కూడ‌ద‌ని,  మంగ‌ళ‌వారం నో మాస్క్‌- నో రైడ్‌ నినాదంతో, వాహ‌న ఛోద‌కులు, ప్ర‌యాణీకులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని,  బుధ‌వారంనాడు మాస్క్ లేదు-అమ్మ‌కం లేదు అన్న నినాదంతో, మాస్కులు ధ‌రించ‌ని కొనుగోలు దారుల‌కు దుఖాణ‌దారులు స‌రుకులు, వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌న్న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి కేంద్రీక‌రించి, ఈ  ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్న‌ట్లు వెళ్ల‌డించారు. దీనిలో భాగంగా బ్యాన‌ర్లు, ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తామ‌ని, క‌ర‌ప‌త్రాలు, వాల్‌పోస్ట‌ర్లును పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. జాత‌ర్లు, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌వ‌ద్ద మైకుల‌ద్వారా ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపారు. క‌రోనా ర‌హిత జిల్లాగా తీర్చిదిద్ద‌డానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ప్ర‌తీఒక్క‌రూ త‌మ స‌హాకారాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

Vizianagaram

2021-07-03 11:23:54

జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు..

జగనన్న కాలనీలలో మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరేరుతుందని చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం బురిడి వలస, పెద్దపాలెం గ్రామాల్లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో  శాసన సభాపతి తమ్మినేని సీతారాం శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఉద్యమం మాదిరిగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పేదవాడికి సొంత ఇల్లు అనేది కల - ఆ కల  ఎప్పుడు నిజం అవుతుందా అని పేదవాడు ఎదురు చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్లను నిరుపేదలకు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వము ఇంత గొప్ప విషయాన్ని చేపట్టలేదని ఆయన అన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో  అమలవుతున్న సంస్కరణల దిశగా ప్రక్క రాష్ట్రాలు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మనసు, మానవత్వం ఉంటే మార్గం ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి నిరూపించారని ఆయన అన్నారు.  రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రతి గ్రామంలో పాల శీతల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగతుందన్నారు. తద్వారా మహిళలు పాల సరఫరాతో వారి ఆర్థిక స్వావలంబన సాధిస్తారని ఆయన చెప్పారు. జగనన్న  కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లలో లోటుపాట్లను గమనించి అధికారులతో సమీక్షించి దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసన సభాపతి అన్నారు. జగనన్న  కాలనీలకు అధునాతన మౌళిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. పనిచేసే ముఖ్యమంత్రికి ఎల్లవేళలా తోడుగా  ఉండాలని, ఆయనకు భరోసా ఇవ్వాలి అని సభాపతి తమ్మినేని అన్నారు.

    ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి  బొడ్డేపల్లి శాంతి,ఎమ్మార్వో కిరణ్, ఎంపీడీవో మురళీమోహన్,  స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ కే వి జి సత్యనారాయణ, సురవరపు నాగేశ్వరరావు,  బెవర మల్లేశ్వరరావు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-03 11:19:20

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు..

రాబోయే సీజన్ లో వ్యాధులు ప్రబలకుండా నివారణకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర రావు వైద్యాధికారులు ఆదేశించారు.    వచ్చేది వర్షా కాలం సందర్భంగా వ్యాధుల నివారణ కార్యక్రమంపై జిల్లా జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు, వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  వ్యాక్సినేషన్ శత శాతం చేయాలన్నారు. డయోరియా, మలేరియా, డెంగ్యూ, తదితర వ్యాధులు రాకుండా నివారించేందుకు చర్యలు, వ్యాధులు వచ్చినా వాటిని కట్టడి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలులో ఎనీమియా లేకుండా చూడాలని, వారికి బలమైన ఆహారం సరఫరా చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు.  కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా మొదట డెలివరీకి రెండవ డెలివరీలకు మద్య ౩ సంవత్సరాలు గ్యాప్ ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతీ నెల డెలివరీలకు సంబంధించిన రిపోర్టులు సబ్ సెంటర్లు నుంచి శత శాతం అప్ లోడ్ చేయించాలని ఆదేశించారు. వై.యస్.ఆర్. క్లినిక్స్ లో భవనాలు నిర్మాణాలు పూర్తి అయితే 14 రకాలు పరీక్షలు, 24 వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. PHC లకు వారానికి ఒకసారి ఒక స్పెషలిస్టు వెళ్లాలని సూచించారు. టుబాకో ప్రోగ్రాం, టిబి కంట్రోల్ ప్రోగ్రామ్, తదితర కార్యక్రమాలు, వ్యాదులపై ఆయన వివరించారు.

కోవిడ్ - 19 మూడవ దశకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, ప్రైవేటు ఆసుపత్రులను ఇప్పటి నుండే సందర్శించి సమన్వయం చేసుకోవాలన్నారు. ఆక్సిజన్ నిల్వ, సరఫరాలపై ఎపిఎంఐడితో సమన్వయం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో పడకలు, సిబ్బంది, ఆక్సిజన్, తదితర వాటిని చూసుకోవాలని పేర్కొన్నారు.  నోడల్ అధికారులు ఆసుపత్రులకు రోజూ వెళ్లే విధంగా చూడాలని చెప్పారు. ఫీవర్ సర్వే పక్కాగా ఇంటింటికి వెళ్ళి చేయాలన్నారు. నిర్లక్ష్యం చేయకూడదని ఆయన అన్నారు. కోవిడ్ కేర్ కేంద్రాలు, ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు లను గుర్తించాలని తెలిపారు. ఇప్పటి నుండే సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను డిశంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ఒక్కటీ పెండింగ్ లో ఉండరాదని ఆయన స్పష్టం. జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, అదనపు డిఎంహెచ్ఓ బి. జగన్నాధరావు, టిబి కంట్రోల్ అధికారి ఎన్. అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-03 11:17:32

కోవిడ్ సామగ్రిని అందించిన సిఐఐ..

శ్రీకాకుళం జిల్లాకు కోటి రూపాయల విలువగల కోవిడ్ సామగ్రిని భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) జిల్లా యంత్రాంగానికి అందజేసింది.  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దాట్ల తిరుపతి రాజు సామాగ్రిని జిల్లా యంత్రాంగంకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంతో బాధ్యతతో కోవిడ్ సామగ్రిని అందించిన భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర శాఖను అభినందించారు. మానవతా దృక్పథంతో ముందుకు రావడం ముదావహం అని ఆయన పేర్కొన్నారు. సేవా దృక్పథం గొప్పదని, దాత గొప్పవాడని అయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచనలు చేస్తున్నారని, ఆ దిశగా అందరూ ఆలోచన చేసి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు కోటి రూపాయల విలువ గల సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మూడవ దశను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నామని అందుకు ఈ సామాగ్రి మరింత ఉపకరిస్తుందని పేర్కొన్నారు. మొదటి, రెండవ దశలో అప్పటి కప్పుడు సామగ్రిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అటువంటి సమస్య మూడవ దశలో ఉండబోదని తెలిపారు. జిల్లాలో కోవిడ్ పర్యవేక్షణ జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కే.శ్రీనివాసులు చక్కగా చేస్తున్నారని ఆయన తెలిపారు.

 భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దాట్ల తిరుపతి రాజు మాట్లాడుతూ కోవిడ్ ను ఎదుర్కొనుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి, సహకారానికి తమ వంతు కొంత విరాళంగా సామగ్రిని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  డాక్టర్ అలోక్ మిశ్రా రూ. 63 లక్షల విలువగల పరికరాలు అందించారని ఆయన అభినందించారు.  అందించిన సామగ్రిలో ఆక్సిజన్ సరఫరా పరికరాలు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు, ఇతర కోవిడ్ సంబంధిత పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కే.శ్రీనివాసులు, కేంద్ర మాజీ మంత్రి ఇ డాక్టర్ కిల్లి కృపారాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం.వి.పద్మావతి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్. అరవింద్, ఎన్.పి. సి.ఎల్ ప్రతినిధులు బంగారయ్య శెట్టి, రవి కుమార్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎక్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ బుడుమూరు రాజేష్  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-03 11:15:29

మాన్సాస్ విషయంలో రాజు జైలుకే పక్కా..

పరిపాలన రాజధానిగా ఎదుగుతున్న విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవాకులు చెవాకులు పేలుతున్నరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 39వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆరోపించారు. శనివారం మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  కొంతమంది టిడిపి నేతలు తమ స్థాయిని మరిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి పై ప్రేలాపనలు పేలుతున్నరన్నారు. ఇప్పటికైనా వారి స్థాయిని గుర్తించుకొని మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయొద్దని సూచించారు. విశాఖలో భూములను దోచుకున్న తెలుగుదేశం నాయకుల చరిత్రను ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విజయనగరం మాన్సాస్  భూముల కుంభకోణంలో అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆడవారికి ఇస్తున్న సముచిత స్థానాన్ని కించపరుస్తూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విశాఖ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలుగుదేశం నేతలు మేల్కొని స్థాయిని బట్టి స్పందించాలని హితవుపలికారు. టీడీపీ మైనార్టీ నేత నజీర్ మరో బికాం లో ఫిజిక్స్ అన్నా ఒక నేత మాదిరిగా అవగాహన లేని నేతలా మాట్లాడుతున్నారని 2ప్లస్2 ఎంత అంటే 22 అనే రకం అని ఈయన మరో బికాం లో ఫిజిక్స్ నేత మారారు హాస్యాస్పదం గా వర్ణించారు.  ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్  మహమ్మద్ ఇమ్రాన్ , కో ఆప్షన్ సభ్యులు  షరీఫ్  తో పాటు నగరానికి చెందిన ముస్లిం నేతలు హాజరయ్యారు.

వైఎస్సార్సీపీ ఆఫీస్

2021-07-03 10:00:53

చంద్రబాబు వలనే జలవివాదాలు..

నదీజలాల విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదాలకు కారకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. శనివారం స్థానిక జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అధోగతి పాలు చేసిన వ్యక్తిగా చంద్రబాబు అన్నారు   ఆనాడు పాదయాత్రలో ప్రజలు సమస్యలు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలులో, మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలలో 95శాతం అమలు చేసి సూపర్ సీఎం గా పేరు తెచ్చుకున్నారన్నరు 
 ఈ విషయం చంద్రబాబు నాయుడు వారి కుమారుడు నారా లోకేష్లు గుర్తెరగాలన్నారు. ఆయన పై లేనిపోని ఆరోపణలు సరికాదన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మాజీ రెవెన్యూ మంత్రి, పస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నేరడి బ్యారేజీ రెండవ దశ కు కృషి చేశారని, నేడు అన్ని ప్రాజెక్టులతోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్ని నీటి వనరులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. తమ పార్టీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేరడి బ్యారేజీని సందర్శించారని, రెండో దశ ను త్వరలోనే పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆద్వర్యంలో తోటపల్లి, బహుదా ప్రాజెక్టులతోపాటు ఆఫ్షోర్ రిజర్వాయర్ను కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణదాస్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత జిల్లా అయినందున రైతులకు నీటి వనరులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధిని చేద్దామని జగన్మోహన్రెడ్డి తెలియజేశారన్నారు. ప్రజలకు చేరువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, తన కుమారుడు లోకేష్ విమర్శలు చేయడం సరికాదన్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హతలేదన్నారు. వైపీపీపై టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజలు గమనిస్తున్నారని, ఇదివరకే ప్రజలు బుద్ధిచెప్పారని టీడీపీ నాయకులు గుర్తెరగాలన్నారు. టీడీపీ నాయకులు చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ తప్పులన్నారు. మీడియా ప్రతినిధులు కూడా వాస్తవికతను పరిశీలించి వార్తలు రాయలన్నారు. తాను తప్పుచేస్తే పెద్ద హెడ్లైన్స్లో రాయాలని, ఎవరి మెప్పుకోసమో వాస్తవికతను దాచి తప్పుడు రాతలు రాయొద్దని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి నాడు ఇచ్చిన హామీలు, తాను నెరవేర్చేందుకు జగన్ కృషిచేస్తున్నట్లు తెలియజేశారు. దిశ యాప్్వరా మహిళలకు రక్షణ, మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, మహిళలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన హామీని 30లక్షలకు పెంచి ఆదుకుంటున్నారన్నారు. కరోనా మహమ్మారి వలన ఆసుపత్రుల నిర్మాణం, 14వైద్య కళాశాలల నిర్మాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన అభివృద్ధి అన్నారు. తామంతా ఒకేపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీఅని, తమలో ఎటువంటి విభేధాలు లేవని, తమ నాయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలియజేశారు. తమలో విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయడం లో నిజం లేదన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు రూ.45కోట్లు ఖర్చుచేసి జిల్లాలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ధర్మాన కృష్ణదాస్ కృషి వల్లే ఎంపిక చేశారని, త్వరలో చెరువుల గట్లపై మొక్కలు పెంపకం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం  చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదాలకు కారణం చంద్రబాబునాయుడు అనే విషయం అందరికీ తెలుసన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ పిరియా సాయిరాజ్, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ఎంవీ.పద్మావతి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ l శిమ్మ రాజశేఖర్, కామేశ్వరి, టి. నాగేశ్వరరావు, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-03 09:56:08

వివక్షతను కూకటి వేళ్లతో పీకేయాలి..

వివక్షతకు కారణమైన అంశాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు ఎస్.సి., ఎస్.సి. అత్యాచార నిరోధక చట్టం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎస్.సి.,ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం నిఘా, పర్యవేక్షణ నూతన కమిటీ తొలి సమావేశం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా మంత్రివర్యులు పాల్గొన్నారు.  సమాజంలో అన్యాయం జరిగిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సురేష్ చెప్పారు. సమానత్వం, సామ్యవాదం, సౌభాతృత్వం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించిన విషయాలను ఆయన వర్ణించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అందరికీ సమాన హక్కులు కల్పించడమే ముఖ్య
ఉద్దేశమన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కులాలు సమాజంపై ప్రభావాన్ని చూపడం బాధాకరమన్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్థి చెందినప్పటికీ, పోలీసుల నిఘా వ్యవస్థ పెరిగినప్పటికీ ఎస్.సి., ఎస్.టి. లపై నేటికీ వివక్ష, దాడులు ఆగడంలేదన్నారు. ఎస్.సి., ఎస్.టి. లకు తగిన ప్రాధాన్యత కల్పించడానికి ఈ ప్రత్యేక చట్టం ఉపకరిస్తుందన్నారు. మేధావుల్లో ఆలోచనా సరళి మారాలని, ప్రభుత్వం
సమానత్వాన్ని పరిరక్షిస్తుందన్నారు. సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భరోసా, విశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. దీంతో గడిచిన రెండేళ్లలో అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. విచారణ పేరుతో అట్రాసిటీ కేసులను పెండింగ్‌లో పెట్టడం మంచి పద్థతి కాదని అధికారులకు మంత్రి
సూచించారు. చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో 1,816 కేసులు నమోదు కాగా, నిరాధారమైన తప్పుడు కేసులుగా 802 నమోదు కావడంపై ఆయన ఆరా తీశారు. 50 శాతం కేసులు ఇలా నమోదు కావడం ఏమిటని పోలీసు అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. 198 కేసులు విచారణ స్థాయిలోనే పెండింగ్‌లో
ఉండడంపై ఆయన సమీక్షించారు. మిగిలిన 496 కేసులు కోర్టు పరిధిలోనే పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. చట్టం క్రింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాగానే బాధితులకు పరిహారం వెంటనే అందించాలన్నారు. కులధృవీకరణ పత్రాల జారీ, కేసుల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా
పనిచేయాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష విధించే వరకు చట్టం తనపని తాను చేసుకునేలా అధికారులంతా  సమన్వయంతో సహకరించాలన్నారు. ప్రతి మూడునెలలకొకసారి సమావేశం నిర్వహించాలని, ప్రతి నెల
ఆర్.డి.ఓ.లు, పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తమ స్థాయిలో సమీక్షలు చేయాలన్నారు. గడిచిన రెండు సంవత్సరాలలో చట్టం క్రింద బాధిత కుటుంబాలకు రూ.4 కోట్లు పరిహారం అందించామని మంత్రి తెలిపారు. అలాగే బాధిత కుటుంబాల నుంచి 11 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. చట్టం ద్వారా ఏర్పడిన కమిటీ బాధితులకు తప్పనిసరిగా అండగా ఉంటుందని, అన్యాయం జరగకుండా చర్యలు
తీసుకుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ , ఎస్.పి.లు సమన్వయంతో బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో తుదితీర్పు వేగంగా వెలువడాలన్నారు. అన్యాయానికి గురై క్షోభిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టు పనిచేయాలన్నారు. ఎస్.సి. లు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఈ చట్టం క్రింద నమోదైన కేసులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే క్షేత్రస్థాయి పరిశీలన ఉండాలని, ఎఫ్.ఐ.ఆర్. కాగానే పరిహారం అందివ్వాలన్నారు. అట్రాసిటీ కేసులపై ప్రతి సోమవారం ఆర్.డి.ఓ.లు సమీక్షించుకోవాలన్నారు. విచారణ సమయంలో పోలీసులకు రెవిన్యూ
అధికారులు సహకరించాలన్నారు. కులధృవీకరణ పత్రాల జారీలో రెవిన్యూ అధికారులు, ఛార్జిషీటు నమోదులో పోలీసుల అలసత్వం ఉండరాదన్నారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు. విచారణ పేరుతో కేసుల పరిష్కారంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం కేసుల పరిష్కారంపై పోలీసు యంత్రాంగం నిరంతరం
పనిచేస్తుందని జిల్లా ఎస్.పి. సిద్థార్థ్ కౌశల్ చెప్పారు. కేసుల విచారణపై ప్రతిరోజు డి.ఎస్.పి.లకు సూచనలు చేస్తున్నామన్నారు. కేసులపై మరింత నిఘా పెంచామని, వేగంగా విచారిస్తున్నామని ఆయన వివరించారు. కుల ధృవీకరణ పత్రాల జారీలో కొంత జాప్యం జరుగుతోందని, దీంతో విచారణ ముందుకు సాగడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాలు, సూచనలు, చట్టం మార్గదర్శకాల మేరకు నిరంతరం చిత్తశుద్థితో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కొన్ని కేసులలో కొందరి ఆచూకీ లభించక జాప్యం జరిగిన అంశాలను మంత్రికి వివరించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నామని, అధునాతన
సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.
పౌరహక్కుల దినోత్సవాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా నిర్వహించాలని చట్టం జిల్లా కమిటీ సభ్యులు పి.నాగరాజు, పి.లక్ష్మయ్య మంత్రిని కోరారు. కుల ధృవీకరణ పత్రాలు వేగంగా జారీ చేయాలని, సకాలంలో ఛార్జీ షీటు వెయ్యాలని, ఎఫ్.ఐ.ఆర్. నమోదులో జాప్యం ఉండరాదన్నారు. కోవిడ్ తో మృతి చెందిన గిరిజనులకు స్మైల్ పధకం వర్తింప చెయ్యాలని, సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రికి  విన్నవించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) కె.కృష్ణవేణి, ఏ.ఎస్.పి. డి.రవిచంద్ర, డి.ఆర్.ఓ. డి.తిప్పే నాయక్, ఎస్.సి.సెల్ డి.ఎస్.పి. ఎన్.సురేష్ బాబు, సాంఘిక సంక్షేమ
శాఖ డి.డి. లక్ష్మా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి టి.లలితా బాయి, ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ఆర్.డి.ఓ.లు, కమిటి సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు

2021-07-02 15:44:45

సుపరిపాలనకు కొత్త విధానాలు అవసరం..

కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాలు, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్ల మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో సుప‌రిపాల‌న‌కు స‌రికొత్త విధానాల రూప‌క‌ల్ప‌న అంశంపై శ్రీన‌గ‌ర్‌లో శుక్ర‌వారం జ‌రిగిన ప్రాంతీయ స‌ద‌స్సుకు తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి క‌లెక్ట‌రేట్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో హాజ‌ర‌య్యారు. జిల్లాలోని 62 గ్రామీణ మండ‌లాల్లో స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ (గ్రామీణ్‌) కింద చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మాలు, వాటిద్వారా సాధించిన ఫ‌లితాల‌ను క‌లెక్ట‌ర్ వివ‌రించారు. జిల్లాలో స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ (గ్రామీణ్‌) కింద 3,19,183 వ్య‌క్తిగ‌త కుటుంబ మ‌రుగుదొడ్ల నిర్మాణం జ‌ర‌గ‌డంతో 2017, డిసెంబ‌ర్ 15న తూర్పుగోదావ‌రి జిల్లా బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత జిల్లాగా మారిన తీరుతో పాటు క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్సులు, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, చెత్త‌తో సంప‌ద సృష్టి విధానాలు, మ‌నం మ‌న ప‌రిశుభ్ర‌త పేరుతో అమ‌లు చేసిన వినూత్న కార్య‌క్ర‌మాలను క‌లెక్ట‌ర్ వివ‌రించారు.  జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెమీ వ‌ర్చువ‌ల్ స‌ద‌స్సుకు దేశ ఉత్త‌ర‌ప్రాంతంలోని ప‌ది రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచి ఉన్న‌తాధికారులు, సిబ్బంది హాజ‌ర‌య్యారు. దేశంలో పాల‌న ప‌రంగా వివిధ విభాగాల్లో అత్యుత్త‌మ ప‌నితీరుతో ప్ర‌గ‌తిని న‌మోదు చేసిన ఉన్న‌తాధికారులు పాల‌న‌లో కొత్త ఒర‌వ‌డి, సాధించిన ఫ‌లితాలు, స‌మ‌స్యా ప‌రిష్కార సామ‌ర్థ్యం త‌దిత‌రాల‌పై ప్రాంతీయ స‌ద‌స్సులో వివ‌రించేందుకు నిర్వాహ‌కులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ (గ్రామీణ్‌) అమ‌ల్లో తూర్పుగోదావ‌రి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డిని కేంద్రం స‌ద‌స్సులో పాల్గొని, విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చేందుకు రిసోర్స్ ప‌ర్స‌న్‌గా ఎంపిక చేసింది.  శుక్ర‌వారం జ‌రిగిన స‌దస్సుకు క‌లెక్ట‌ర్ వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రై, స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ (గ్రామీణ్‌)పై వివ‌రించారు.

Kakinada

2021-07-02 15:04:46

లింగ నిర్ధారణపై పరిశీలన చేయాలి..

భారతీయ సమాజంలో బాలబాలికల లింగ నిష్పత్తి ఎంతో నిస్పృహకు గురి చేస్తుందని, దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి.సి అండ్ పియన్ డిటి చట్టం అమలుపై జిల్లా స్థాయి బహుళ సభ్యుల సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా సంఘంలో ఆడపిల్లల పట్ల వివక్షత, మూఢనమ్మకాలు పెరుగుతున్నాయని, వీటిని గట్టిగా అరికట్టాలని సూచించారు. గర్భస్థ శిశు లింగనిర్ధారణపై వైద్యాధికారులు దృష్టి సారించాలని, లింగ నిర్ధారణ కేంద్రాలపై నిరంతర పరిశీలన అవసరమని, ప్రతిరోజూ లింగ నిర్ధారణ కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు సేకరించాలని చెప్పారు. ప్రభుత్వం 0-6 సంవత్సరాల బాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి పిసి అండ్ పియన్ డిటి 1994 లింగ నిర్ధారిత పరీక్షల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. దీన్ని  కఠినంగా అమలు చేయడం ద్వారా లింగ నిర్ధారిత పరీక్షలు, ఆడ శిశు భ్రూణహత్యలు తగ్గి కొంతమేర ఫలితాలు సాధించవచ్చని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలను జరిపి వివరాలు వెల్లడించమని కోరిన వారికి మరియు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు వెల్లడించిన వైద్యులకు సెక్షన్ 22 ప్రకారం మొదటి తప్పుకు 3 సం.లు జైలుశిక్ష మరియు రూ॥॥ 50,000/- జరిమానా, రెండవసారి తప్పు చేస్తే 5 సం॥.లు జైలుశిక్ష మరియు లక్షరూపాయల జరిమానాతో పాటు వైద్యులకు వైద్య ధృవీకరణ పత్రము భారత వైద్యమండలి నందు రద్దు చేయబడుతుందని చెప్పారు. ఈ చట్టం అతిక్రమణకు పాల్పడిన వ్యక్తికి సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం కూడా ఈ చట్టానికి ఉన్నట్లు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసారు. ఇప్పటికే  మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా భ్రూణహత్యలు, శిశు లింగనిర్ధారణ అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని, వీటిపై జిల్లా, మండల, గ్రామస్థాయిలో  సమావేశాలను నిర్వహించి మరింత ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

          జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ కేంద్రాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయని, ముఖ్యంగా లింగ నిర్ధారణ కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఆర్ధిక స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. తద్వారా దీన్ని కొంతమేర అరికట్టేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే పిసి అండ్ పియన్ డిటి చట్టం అమలు చేయని కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు ఎప్పటికపుడు సేకరించి లింగ నిర్ధారణ వివరాలు తెలియచేయకుండా  వైద్య ఆరోగ్య శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడ శిశువుల రక్షణకై ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమలుచేస్తోందని, వీటి గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం ద్వారా ఆడపిల్లల పట్ల వివక్షత తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలకు వెళ్లవద్దని ఆడపిల్లలను మగ పిల్లలను సమానంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అందరూ  కలిసికట్టుగా పనిచేసి లింగ వివక్షతకు చరమగీతం పాడాలని,  ఆడపిల్లల రక్షణ బాధ్యత మనదేనని యస్.పి వివరించారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు, సంయుక్త కలెక్టర్  డా. కె.శ్రీనివాసులు, అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కె.అప్పారావు, కమిటీ సభ్యులు  డా. కె.అనూష ( గైనకాలజిస్ట్ ),డా. ఆర్.కిరణ్మయి ( రేడియాలజిస్ట్ ), డా.గిరిదొర (పిడియాట్రిషియన్), ప్రముఖ వైద్యులు డా. కె.అమ్మన్నాయుడు, న్యాయవాది ఆర్.సత్యవాణి, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు యం.ప్రసాదరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-07-02 14:57:18

తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి..

సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి  దేవస్థానం ప్రతిష్ట పెంచి తిరుమల స్థాయిలో అభివ్రుద్ధి చేసుకునేందుకు అటెండర్ నుంచి ఈఓ వరకు అందరూ క్రమశిక్షణతో  కష్టపడి పనిచేయాలని ఈఓ ఎంవీ సూర్యకళ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు దేవాలయంలో సిబ్బంద, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిబ్బంది నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సింహాచలం దేవస్థానం, తిరుపతి శ్రీవేంకటేశ్వారస్వామి ఆలయం స్థాయిలో  అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఉద్యోగులు ఎంతో ఆదర్శంగా ఉండాలని  ఆమె సూచించారు. దేవస్థానం ఉద్యోగులు ఎవరినైనా దర్శనాలకు పింపిస్తే కచ్చితంగా టికెట్ తీసుకోమని చెప్పాలన్నారు.  తిరుపతిలాగే  అందరిటీ టికెట్ నిబంధనను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆదాయ వనరులను పెంపొందించి అభివృద్ధికి పాటుపడాలని ఈఓ హితవు పలికారు. భక్తులకు సౌకర్యాలు కల్పించివారు సంతృప్తి చెందితే ఖచ్చితంగా దేవస్థానం అభివృద్ధిచెందుతుందన్నారు. శనివారాలు, పర్వ దినాల్లో  ట్రాఫిక్ నియంత్రణ నుంచి ప్రసాదాల పంపిణీ వరకు అన్ని అంశాలపైనా ద్రుష్టిసారించినట్టు ఆమె చెప్పారు. భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలన్నారు.  దాతలను ప్రోత్సహించి దేవస్థానం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్జిత సేవల గురించి ఉద్యోగులు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-02 14:20:40

పక్కాగా కాపు నేస్తం లబ్దిదారుల ఎంపిక..

విజయనగరం జిల్లాలో జూలై 1 నుంచి వారం రోజుల పాటు కాపు నేస్తం పధకానికి సంబంధించి నిర్వహించే లబ్దిదారుల గుర్తింపు కార్యక్రమం  జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 24న కాపు నేస్తం పధకం క్రింద కాపు, బలిజ, ఒంటిరి, తెలగ కులాలకు చెందిన అర్హులయిన లబ్దిదారులకు రెండవ విడతగా రూ. 15 వేలును ముఖ్యమంత్రి విడుదల చేస్తారన్నారు.  ఇందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక జూలై 1 నుండి 7 వరకు జరపాల్సివుందన్న కలెక్టర్ హరిజవహర్ లాల్ 45 నుండి 60 సంవత్సరాలలో వున్న అర్హులయిన మహిళా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.  గ్రామ వాలంటీర్లు మొబైల్ అప్లికేషన్స్ లో లబ్దిదారుల వివరాలు సేకరించాలన్నారు.  గత సంవత్సరం ఎంపికై లబ్దిదారులలో 60 సంవత్సరాలు పూర్తైన లబ్దిదారులను తొలగించాలని,  కొత్తవారికి నమోదు జూన్ 24 నాటికి 45 సంవత్సరాలు నిండివుండాలని తెలిపారు.  ఎంపిక చేసిన లబ్దిదారుల పరిశీలన జూలై 8 నుండి 13 వరకు చేయాలని 14న అర్హుల తుదిజాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించాలని, అభ్యంతరాల స్వీకరణ, విచారణ అనంతరం అర్హుల తుదిజాబితాను నిర్థారించి ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషర్ల ద్వారా తనకు పంపాలన్న కలెక్టర్ తన ఆమోదం అనంతరం ఆయా ప్రతిపానలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సివుందన్నారు.   జిల్లాలో కాపునేస్తం పధకంలో భాగంగా మొదటి విడతలో 5464 మంది లబ్దిదారులుకు  రూ. 8.19 కోట్లు విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Vizianagaram

2021-07-02 14:08:39