1 ENS Live Breaking News

గ్రానైట్ కూలీలకు కరోనాటీకా తప్పనిసరి..

గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలలో పనిచేస్తున్న వలస కూలీలకు కోవిడ్ పరీక్షలు చేసి,
టీకాలు వేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు, రవాణ రంగాలలో కోవిడ్ వ్యాప్తిని అరిక ట్టడం పై సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. కోవిడ్ మూడవ దశ, బ్లాక్ ఫంగస్, డెల్టాప్లస్ వేరియంట్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ మూడవదశ ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ముఖ్యంగా గ్రానైట్ క్వారీలు,
పరిశ్ర మలు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగ ప్రాంతాలు, రవాణ రంగ ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇలా జిల్లాలో 1,953 ప్రాంతాలలో పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలనుంచి వలస కార్మికులు అధికంగా వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాలలో ఒక వారంలో 26 వేలమందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరికి కరోనా నివారణ టీకా వేయించాలన్నారు. కోవి డ్ నిబంధనల పై అవగాహన కల్పిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్ర పరచుకోవడం, విధిగా పాటించేలా చూడాలన్నారు. పండ్లతోటల వద్ద కార్మికులకు కోవిడ్ పరీక్షలు చేసేలా ప్రత్యేక బ్రుందాలను నియమించాలని కలెక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా జిల్లా సరిహద్దులున్న మండలాలోను కోవిడ్ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, వివిధ జిల్లాలక ు వెళ్తున్న లారీ, కారు డ్రైవర్లకు పరీక్షలు చేసి టీకా వేయాలన్నారు. కోవిడ్ వ్యాప్తి అరికట్టడంలో అధికారులతో పాటు వివిధ రంగాలలోని యూనియన్లు, సంఘాల ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 5.5 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, కేసుల నమోదు శూన్యం కావాలన్నారు. కరోనా వైరస్ జిల్లాలో తగ్గిపోయిందని భావన విడిచి పెట్టాలని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించేలా ప్రచారం చేయాలన్నారు. కొత్త వైరస్ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్. చేతన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ పి. రత్నావళి, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎమ్. చంద్రశేఖర రెడ్డి,
భూగర్భ గనుల శాఖ డి.డి. నర్సింహారెడ్డి, ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాసరావు, కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జి డాక్టర్ తిరుమల రావు, గ్రానైట్ క్వారీల ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, కార్యదరి ్శ శుభాస్కర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-28 13:03:56

ప్రజాప్రతినిధులు సహకారం అవసరం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అన్ని స్థాయిల్లోని ప్ర‌జాప్ర‌తినిధులు పేద‌ల గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని త‌మ సొంత కార్య‌క్ర‌మంలా భావించి ఇందులో భాగ‌స్వాములు కావ‌డం ద్వారా విజయ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని వాక్సినేష‌న్ త‌ర‌హాలో పెద్ద ఎత్తున‌ చేప‌ట్టాల‌ని భావిస్తున్నార‌ని చెప్పారు. మ‌న జిల్లా నుంచి జూలై 1,3,4 తేదీల్లో నిర్వ‌హించే మెగా గ్రౌండింగ్ మేళాలో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేలా వారిని ప్రోత్స‌హించి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో జిల్లాలోని పార్ల‌మెంటు స‌భ్యులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స‌హ‌క‌రించాల‌ని కోరారు. మెగా గ్రౌండింగ్ మేళాల నిర్వ‌హ‌ణ‌పై జిల్లాకు చెందిన ఎంపి, ఎం.ఎల్‌.సి., ఎమ్మెల్యేల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఒక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ గ్రౌండింగ్ మేళా ఉద్ద్యేశ్యాల‌ను, ఈ మేళాల్లో గృహ‌నిర్మాణాల‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను గురించి వారికి క‌లెక్ట‌ర్ వివ‌రించారు. పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో జిల్లాలో 75వేల‌ ఇళ్ల‌ను నిర్మించాల్సి ఉంద‌ని, జూలై 1వ తేదీన మంచి ముహూర్తం ఉంద‌ని చెబుతున్నార‌ని మొద‌టి రోజే అధిక సంఖ్య‌లో ల‌బ్దిదారుల‌తో ఇళ్ల ప‌నులు ప్రారంభించేలా చొర‌వ చూపాల‌ని సూచించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని లే అవుట్ల‌లో ఇప్ప‌టికే నీటిస‌ర‌ఫ‌రా, విద్యుత్ త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని కలెక్ట‌ర్ తెలిపారు. ప‌ట్ట‌ణాల్లోనూ ఈనెల 30 నాటికి లే అవుట్ల‌లో నీటి వ‌స‌తి క‌ల్పిస్తామ‌న్నారు. ఇళ్ల నిర్మాణాల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని, దీనికోసం ఏడు లేదా ఎనిమిది మంది ల‌బ్దిదారులు ఒక గ్రూపుగా ఏర్ప‌డితే వారికి ఒకేసారి అవ‌స‌ర‌మైన ఇసుక స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సిమెంటు ఒక్కో ఇంటికి రూ.235 ధ‌ర‌తో 90 బ‌స్తాలు అందిస్తామ‌న్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేలా శాస‌న‌స‌భ్యులు వారిని ప్రోత్స‌హించాల‌ని కోరారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌ని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ స‌మ‌స్య వున్నా వారిని సంప్ర‌దించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

ప‌లువురు శాస‌న‌స‌భ్యులు మాట్లాడుతూ ల‌బ్దిదారులు గ్రూపులుగా ఏర్ప‌డి ఇళ్లు నిర్మించుకుంటేనే వారికి ఇళ్ల నిర్మాణ ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని, ఈ విష‌యంలో వారిలో అవ‌గాహ‌న క‌ల్పించాల్సి వుంద‌న్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టే ల‌బ్దిదారులకు స‌కాలంలో అవ‌స‌ర‌మైన మేర‌కు సిమెంటు స‌ర‌ఫ‌రా చేయాల‌ని గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య కోరారు. నెల్లిమ‌ర్ల‌, సాలూరు, పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో లేఅవుట్ల‌కు సంబంధించిన ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆయా శాస‌న‌స‌భ్యులు బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు, రాజ‌న్న‌దొర‌, అల‌జంగి జోగారావు వివ‌రించారు. స‌మావేశంలో ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తారో వివ‌రించాల‌ని కోరారు. 7 నుంచి 8 మంది క‌ల‌సి ఒక ఇండెంట్ పెట్టుకుంటే జెపి సంస్థ వారి స్థ‌లం వ‌ద్ద వారికి సంబంధించిన ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని హౌసింగ్ పి.డి. ర‌మ‌ణ‌మూర్తి తెలిపారు.
 
స‌మావేశంలో ఎం.ఎల్‌.సి. సురేష్‌బాబు,విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, చీపురుప‌ల్లి ఇన్‌చార్జి మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.మ‌హేష్ కుమార్‌, డా.కిషోర్ కుమార్‌, అశోక్ మ‌యూర్, వెంక‌ట‌రావు, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్‌.ఇ., గ‌నుల‌శాఖ ఏ.డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-28 12:59:06

స్పందనకు 87 వినతులు..

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన టెలి స్పందనకు 12 ఫోన్ కాల్స్ అందాయి. కోవిడ్  దృష్ట్యా  ప్రజల  నుండి వినతులను స్వీకరించడానికి నిర్వహిస్తున్న స్పందనకు బదులుగా టెలి స్పందన నిర్వహించి టెలిఫోన్ ద్వారా వినతులను  స్వీకరించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయినప్పటికి సోమవారం త్వరలో చేపట్టనున్న గృహ నిర్మాణాలకు సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ ను కలసి తమ వినతులను అందజేసారు.  స్పందనలో డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు కూడా వినతులను అందుకున్నారు. స్పందనలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఇదే వేదిక ద్వారా జిల్లా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Vizianagaram

2021-06-28 12:56:49

మెగామేళాలో జిల్లాలక్ష్యం 75 వేల ఇళ్లు..

 నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు క్రింద చేపడుతున్న గృహ  నిర్మాణాల మెగా మేళా లో వ్యవసాయ, ఆరోగ్య  శాఖలు తప్ప మిగిలిన శాఖలన్నిటిని భాగస్వామ్యం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  జిల్లా కు 75 వేల గృహాలను లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని,   అధికారులు  వారి లక్ష్యాలను సాధించి తమ సమర్ధతను చూపించుకోవాలని అన్నారు.  లక్ష్యాలను సాధించని వారి పై చర్యలు తప్పవని ఈ సందర్భంగా  హెచ్చరించారు. సోమవారం సంయుక్త కలెక్టర్లతో కలసి  కలెక్టర్ మండల బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇంకా రెండు రోజులే  గడువు ఉన్నందున కార్యక్రమ నిర్వహణకు అవసరమగు ఏర్పాట్లను , కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసుకొని సన్నద్ధంగా  ఉండాలని ఆదేశించారు.  జూలై 1 వ తేదీనే మొత్తం గ్రౌండ్ అయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని, వీలు కాని వారు మాత్రమే  మిగిలి ఉండాలని, వారివి  3, 4  తేదీలలో పూర్తి చేయాలనీ అన్నారు. లబ్ది దారులను వారికీ  కేటాయించిన ప్లాట్  వద్దకు తీసుకు రావడం, ప్లాట్ మార్కింగ్ చేయడం, భూమి పూజల కు కావలసిన సామగ్రిని  , ఇసుక, సిమెంట్, ఇటుక తదితర ఏర్పాటు చేయడం,  ఈ కార్యక్రమాన్ని ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయడం ముఖ్యమైన పని అన్నారు.  లబ్ది దారులు  100 మంది కంటే ఎక్కువ వున్న చోట షామియానా ఏర్పాటు చేయాలన్నారు.  ఈ ప్రరంభాలను  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గంట గంటకు పర్యవేక్షించే ఏర్పాటు చేసారని, అదే విధంగా జిల్లా నుండి సి.పి.ఓ కార్యాలయం నుండి ఒక బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు.  అనంతరం  సంయుక్త కలెక్టర్లు డా. కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, అశోక్ మయూర్  లు తమ సలహాలను, సూచనలను అందించారు. 
 జిల్లాకు ప్రత్యేకాధికారి నియామకం : 
జిల్లాకు ప్రత్యెక పర్యవేక్షణాధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను  ప్రభుత్వం నియమించిందని , వారు ఎక్కడైనా  ఎప్పుడైనా ఆకష్మికంగా తనిఖీ చేయవచ్చునని కలెక్టర్ అన్నారు.  అదే విధంగా జిల్లా నుండి జే.సి (రెవిన్యూ) గజపతి నగరం,  బొబ్బిలి  నియోజక వర్గాలకు, జే.సి అభివృద్ధి డా. మహేష్ కుమార్ ను నెల్లిమర్ల, చీపురుపల్లి, జే.సి ఆసరా జే. వెంకట రావు కు సాలూరు నియోజక వర్గానికి ఇంచార్జ్ లుగా నియమించామన్నారు. జే.సి హౌసింగ్ మయూర్ అశోక్ ను విజయనగర, ఎస్.కోట  నియోజకవర్గాలకు కేటాయించగా , ఐ టి డి ఎ ప్రోజ్ర్ట్ అధికారి కుర్మనాద్ ను పార్వతి పురం, కురుపాం నియమించడం జరిగిందన్నారు.  వీరితో పాటు  ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని ఇంచార్జ్ గా నియమించామన్నారు. మండల ప్రత్యేకాధి కారులు  ఆయా ఇంచార్జ్ లకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఏదైనా  సమస్య వస్తే సంబంధిత  ప్రత్యేకాధికారిని సంప్రదించాలని అన్నారు. 
ప్రజా ప్రతినిధులు సహకరించాలి:
 పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అని, ఈ మెగా ప్రారంభ  మేళా కు   అత్యంత ప్రాధాన్యత నిచ్చి విజయవంతం గావించాలని   జిల్లా  కలెక్టర్ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసారు. సర్పంచ్ లకు, మున్సిపల్ కౌన్సిలర్తో , కార్పొరేటర్లతో, శాసన సభ్యులు, ఎం.పి లతో  టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడి ప్రజా ప్రతినిధులంతా ఈ మేళా కు తప్పక హాజరు కావాలని కోరారు.   ప్రజలను చైతన్య పరచి పెద్ద సంఖ్యలో ప్రారంభాలు జరిగేలా తోడ్పడాలన్నారు.  లబ్ది దారులను వారికీ కేటాయించిన ప్లాట్ వద్దకు వచ్చేలా చేయడం లో వాలంటీర్ లకు సూచించాలని అన్నారు.   ఈ కార్యక్రమాన్ని ఎన్నికల నిర్వహణ లా, ఒక వాక్సినేషన్ కార్యక్రమం లా జరగాలన్నారు. 

Vizianagaram

2021-06-28 12:52:43

తల్లుల వేక్సిన్ లో విజయనగరమే ఫస్ట్..

ఐదేళ్ల లోపు వ‌య‌స్సు గ‌ల పిల్ల‌ల త‌ల్లుల‌కు కోవిడ్ వాక్సిన్ ఇవ్వ‌డంలో రాష్ట్రంలోనే విజ‌య‌న‌గ‌రం అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. రాష్ట్రంలో స‌గ‌టున 66శాతం త‌ల్లుల వాక్సినేష‌న్ జ‌రుగ‌గా, మ‌న జిల్లాలో 94శాతం మంది ఐదేళ్ల‌లోపు వ‌య‌స్సు గ‌ల బాల‌ల త‌ల్లుల‌కు వ్యాక్సినేష‌న్ పూర్తిచేశామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. జిల్లాలో 88,517 మంది ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల త‌ల్లుల‌కు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుండ‌గా 83,174 మందికి ఆదివారం నాటికే వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు గ‌రిష్ట స్థాయిలో  వ్యాక్సినేష‌న్ సాధించ‌డంలో కృషిచేసిన ఏ.ఎన్‌.ఎం.లు, ఆశ కార్య‌క‌ర్త‌లు, వ‌లంటీర్ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ అభినందించారు.

Vizianagaram

2021-06-28 11:05:06

ఇళ్ల నిర్మాణంలో స‌హ‌క‌రించండి..

పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో ఇళ్లు మంజూరైన లబ్దిదారుల‌ ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందించ‌డం ద్వారా వారంతా మెగా గ్రౌండింగ్ మేళాలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వ‌చ్చేలా చొరవ చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల చైర్‌ప‌ర్స‌న్‌లు, మేయ‌ర్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌ను కోరారు. జిల్లాలోని మునిసిప‌ల్ పాల‌క‌వ‌ర్గ ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం టెలి కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్నఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. జిల్లాలో జూలై 1, 3, 4 తేదీల్లో మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వ‌హిస్తున్నామ‌ని మొద‌టి రోజునే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా త‌మ వార్డు ప‌రిధిలోని ల‌బ్దిదారుల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. ప‌ట్ట‌ణానికి దూరంగా లే అవుట్‌లు ఉన్న‌చోట అక్క‌డ‌కు ల‌బ్దిదారులు చేరుకునేలా బ‌స్సులు ఏర్పాటు చేస్తున్నామ‌ని, మంగ‌ళ‌, బుధవారాల్లో ఆయా ల‌బ్దిదారుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్ల‌ను, ఇళ్ల నిర్మాణానికి ప్ర‌భుత్వం ఏవిధంగా స‌హాయ‌ప‌డుతుందో వారికి వివ‌రించాల‌ని కోరారు. జూలై 1న ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన పూజా సామాగ్రి, టెంట్‌లు వంటి ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. లే అవుట్ల‌కు ల‌బ్దిదారుల‌ను తీసుకువెళ్లి వారికి సంబందించిన స్థ‌లంలో ఇంజ‌నీరింగ్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ల స‌హ‌కారంతో స్థలంలో మార్కింగ్ చేయించాల‌న్నారు. ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఇసుక‌, నీరు, ఇటుక వంటి ఇళ్ల నిర్మాణ సామాగ్రిని సిద్దం చేసుకోవాల‌ని సూచించారు.
జిల్లాలో 98 వేల మందికి ఇళ్ల‌స్థ‌లాలు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని, ఇందులో 75 వేల ఇళ్ల‌ను రెండు ద‌శ‌ల్లో నిర్మాణం చేసుకోవ‌ల‌సి వుంద‌న్నారు. జిల్లాలోని అన్ని శాఖ‌ల అధికారుల‌ను ఇందులో భాగ‌స్వామ్యం చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ చెప్పారు.
జిల్లాలోని ప‌ట్ట‌ణాల్లో నిర్మిస్తున్న ఇళ్ల‌లో 70శాతం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోనే నిర్మిస్తున్నామ‌ని, అతి పెద్ద లే అవుట్ అయిన  గుంక‌లాంలో ఇద్ద‌రు అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌న్నారు. డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ కె.సుబ్బారావుకు మూడు బ్లాకులు, ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్‌కు మూడు బ్లాకులు అప్ప‌గించామ‌న్నారు.
జిల్లాలో మెగా గ్రౌండింగ్‌మేళాల‌పై జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. సిపిఓ కార్యాల‌యంలో ఈ కంట్రోల్ రూం ఏర్పాట‌వుతుంద‌ని, ప్ర‌తి గంట‌కూ జ‌రిగిన గ్రౌండింగ్ వివ‌రాల‌తో రాష్ట్ర స్థాయికి స‌మాచారం అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
రాష్ట్రంలో న‌వ‌రత్నాల్లో భాగంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో జిల్లా మొద‌టి, రెండు స్థానాల్లో నిలుస్తోంద‌ని, అత్యంత ముఖ్య‌మైన ఈ కార్య‌క్ర‌మంలోనూ ప్రజాప్ర‌తినిధుల‌, అధికారుల స‌హ‌కారంతో మొద‌టిస్థానంలో నిలుస్తామ‌నే విశ్వాసాన్నివ్య‌క్తం చేశారు.

టెలికాన్ఫ‌రెన్సులో జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్‌లు, క‌మిష‌న‌ర్‌లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-28 11:03:06

స‌మిష్టిగా కోవిడ్‌పై విజ‌యం సాధించాం..

ప్రభుత్వ శాఖ‌ల‌న్నీ క‌లిసిక‌ట్టుగా, స‌మ‌ర్థ‌వంతంగా కృషి చేయ‌డం వ‌ల్లే, జిల్లాలో కోవిడ్‌పై విజ‌యం సాధించామ‌ని  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌హమ్మారిపై పోరులో క్రియాశీల‌కంగా ప‌నిచేసిన‌ ప్ర‌తీఒక్క‌రినీ ఆయ‌న కొనియాడారు. కోవిడ్ స‌మ‌యంలో ఆరోగ్య‌మిత్ర‌లు అందించిన సేవ‌ల‌ను ప్ర‌శంసించారు. డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ‌ అభినంద‌న స‌భ క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ను, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌ను, జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారిని, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావును ఘ‌నంగా స‌త్క‌రించారు. ఆరోగ్య మిత్ర‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ చేతుల‌మీదుగా జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్ర‌ణ‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లా ఇత‌ర జిల్లాల‌కు దిక్సూచిగా మారింద‌న్నారు. ప‌రిమిత వ‌న‌రులున్న‌ప్ప‌టికీ, ప్ర‌తీఒక్క‌రూ త‌మ శ‌క్తికి మించి ప‌నిచేశార‌ని ప్రశంసించారు. అందువ‌ల్లే కోవిడ్ చికిత్స‌లో గానీ, మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డంలో గానీ మ‌న జిల్లా, ఇత‌ర జిల్లాల‌కు ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోనే అతిత‌క్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాగా మారామ‌ని చెప్పారు. జిల్లాలో కోవిడ్ స‌మ‌యంలో ఆక్సీజ‌న్  కొర‌త రాకుండా  చేయ‌డంలో, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ మహేష్ కుమార్ విశేష‌మైన కృషి చేశార‌ని కొనియాడారు. ఆసుప‌త్రులు, ప‌డ‌క‌ల యాజ‌మాన్యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రావు స‌మ‌ర్థ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించార‌ని అభినందించారు. డిఎంఅండ్‌హెచ్ఓ, డిసిహెచ్ఎస్ త‌మ‌కు అప్ప‌గించిన విధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించార‌ని చెప్పారు. వేక్సినేష‌న్‌లో కూడా మ‌న జిల్లా రికార్డు సాధించింద‌ని, 5 ఏళ్లు లోపు పిల్ల‌లున్న త‌ల్లులు 94 శాతం మందికి వేక్సినేష‌న్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచామ‌ని తెలిపారు. కోవిడ్ మూడోద‌శ వ‌స్తే ఎదుర్కొన‌డానికి జిల్లా యంత్రాంగం స‌ర్వ‌స‌న్న‌ద్దంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

             జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్‌ను అదుపుచేయ‌డంలో ప్ర‌తీఒక్క‌రూ అంకిత‌భావంతో ప‌నిచేశార‌ని అభినందించారు. మ‌న‌ది పేద‌ల జిల్లా కావ‌డంతో, సుమారు 83 శాతం మందికి ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా కోవిడ్ వైద్యం అందించి, వారి ప్రాణాల‌ను కాపాడారని ప్ర‌శంసించారు. వైద్య సేవ‌లు అందించే క్ర‌మంలో ఆర్థికంగా ఎటువంటి ఆరోప‌ణ‌లు రాకుండా,  ఆరోగ్య‌మిత్ర‌లు చ‌క్క‌ని ప‌నితీరు క‌న‌బ‌రిచార‌ని కొనియాడారు.

             ఈ సంద‌ర్భంగా ఆరోగ్య‌శ్రీ జిల్లా కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్‌ యు.అప్ప‌ల‌రాజును క‌లెక్ట‌ర్ చేతుల‌మీదుగా స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో టీమ్ లీడ‌ర్లు బి.సురేష్‌, టి.జ‌నార్థ‌న్‌, ఏ. భాను, నారంనాయుడు, ఉమా, దేవి, ఆరోగ్య‌మిత్ర‌లు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-28 11:00:59

సీఎస్ఆర్ పనులు సత్వరమే జరగాలి..

అమలాపురం నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్ ఎస్ వి బి వసంతరాయుడు అధ్యక్షతన  జరిగిన సమీక్ష సమావేశంలో కెయిర్న్ ఎనర్జీ, వేదాంత , పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్&బి అధికారులతో ప్రతీ సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్న సిఎస్ఆర్ నిధుల వినియోగం, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై మంత్రి విశ్వరూప్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను నివారించడానికి సిఎస్ఆర్ నిధుల వినియోగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. నియోజకవర్గంలోని తీర ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజా ఉపయోగకరమైన త్రాగునీరు, రోడ్లు, కల్వర్టులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై మంత్రి సమీక్షించారు. ఇందులో కొన్ని పనులు పూర్తవగా, కొన్ని పనులు ప్రగతిలో ఉండగా, కొన్ని పూర్తి కాలేదు. అలాగే ప్రారంభం కాని పనులపై సమీక్షించి అందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఆర్ ఇ జి ఎస్ తో ముడిపడి ఉన్నాయని నిధులు నిలిచిపోవడం వలన ఆ పనులు నిలిచిపోయాయని పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు మంత్రి విశ్వరూప్ కు వివరించారు. అనంతరం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిఎస్ఆర్ నిధులు రూ.10 కోట్ల 93 లక్షలతో చేపట్టనున్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి, తక్షణమే పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతీ మూడు నెలలకొకసారి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించి, సంబంధిత పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని రావాలని మంత్రి విశ్వరూప్ కోరారు.
                 ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ కె. చంటిబాబు, డిఈఈ రాజ్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ డిఇఇ ఎన్. పార్థసారధి, సిపివో బాలాజీ, వేదాంత,  కెయిర్న్ ఎనర్జీ అధికారులు కె.శ్రీహరి,సతీష్, పాషా, ఆర్&బి అధికారులు, ఉప్పలగుప్తం తహశీల్దార్ ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2021-06-28 09:18:38

శివారు భూములకు నీరు అందిస్తాం..

 రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక ప్రభుత్వం  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం వజ్రపుకొత్తూరు మండలం పిఎసిఎస్ నూతన అధ్యక్షులుగా దువ్వాడ హేంబాబు చౌదరి ప్రమాణస్వీకారం  చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత పిఎసిఎస్ కమిటీలు తీసుకోవాలని అన్నారు. నూతనంగా పదవి చేపడుతున్న దువ్వాడ హేంబాబు చౌదరి సర్ధవంతంగా పనిచేస్తాడని నమ్ముతున్నాను అని అన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో ఉద్దాన, పల్లపు ప్రాంత రైతులు ఉన్నారని వారి అభివృద్దికి తోడ్పడుతూ ముందుకు పోవాలని అన్నారు.ఇటీవల ప్రభుత్వం నష్టపోయిన రైతులకు 10.50  కోట్లు రూపాయలు అందించిన విషయం గుర్తు చేశారు. ఉద్దాన ప్రాంతంలో జీడి రైతులకు మేలు జరిగేలా ఫార్మర్ ప్రొడక్ట్స్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులు సంఘాలుగా ఉన్నారని తెలిపారు. ఏఫ్.పి.ఒ, పిఎసిఎస్, మార్కెట్ కమిటీలు సమన్వయంతో రైతుల సమస్యలు తెలుసుకుని మరింత ప్రభుత్వ సంక్షేమం అందించాలని కోరారు.రైతుకు విత్తనాలు, ఎరువులు, నీరు సకాలంలో అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతు విత్తనం వేసే దశ నుండి పంట చేతికి వచ్చే  వరకు ఆర్.బి.కె ల ద్వారా రైతుకు భరోరాసా కల్పిస్తున్నమని అన్నారు.

వజ్రపుకొత్తూరు శివారు భూములకు ఈ ఏడు సాగు నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాము అని అన్నారు. ఈ ఏడాది రైతు రుణాలు పిఎసిఎస్ ల ద్వారా అధిక శాతం లబ్ధిదారులకు అందించి రైతు పంట ఉత్పత్తిని పెంచే దిశగా పిఎసిఎస్ లు పనిచేయాలని కోరారు. ప్రతి పిఎసిఎస్ పరిధిలో 5 వందల మెట్రిక్ టన్నుల గొడాములు నిర్మిస్తున్నామని వాటికి త్వరలో టెండర్లు కూడా వేస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు సబ్సిడి, రైతు భీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి రైతుకు మేలు జరిగేలా సర్పంచ్ లు ,ఎంపిటిసి అభ్యర్ధులు కలిసి రైతుకు చేయూత కావాలని అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఉండకుండా వంశధార చానల్స్ అన్ని మరమ్మత్తులు చేయించుకున్నామని అన్నారు.  అంతే కాకుండా గ్రామాల్లో మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావడానికి అముల్ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో సొసైటీలు పెడతాం అని అన్నారు. వారికి కూడా డిసిసిబి, పిఎసిఎస్ ద్వారా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీలో  కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అందరం కలిసి పని చేయాలని అన్నారు.

వజ్రపుకొత్తూరు పిఎసిఎస్ అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన దువ్వాడ హేంబాబు చౌదరి మాట్లాడుతూ  రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు తనపై నమ్మకం ఉంచి పిఎసిఎస్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి అందిస్తాను అని అన్నారు.  ఈ కార్యక్రమంలో   గురయ్యనాయుడు, పలాస నియోజకవర్గం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పివి సతీష్, స్థానిక నాయకులు హనుమంతు వెంకటరావు దొర, భాస్కరరెడ్డి, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, కోత పూర్ణచంద్రరావు, సర్పంచ్ లు, ఏంపిటిసి అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-27 16:45:41

త్వరగా జిల్లా ఆసుపత్రి సిద్ధంచేయాలి..

టెక్కలి జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ అధికానులను ఆదేశించారు. ఆదివారం  వంశధార కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న జిల్లా ఆస్పత్రి నూతన భవనాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎంత విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నది, పడకల సంఖ్య, తాగునీటి సౌకర్యం, నిధులు మంజూరు వంటి వివరాలను వైద్య విధాన పరిషత్ కార్యనిర్వాహక ఇంజనీర్ బి.ఎన్. ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అవసరాలకు వంశధార కాలువ పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఏర్పాటు చేసిన తాగునీటి బో ర్ నుండి నీటి వినియోగం, నిల్వ చేసేందుకు లక్ష లీటర్ల సామర్థ్యం గల సంపు ఏర్పాటు విషయాలనువివరించారు. 164 ఆక్సిజన్ సిలిండర్ల కనెక్షన్ లతో పడకలు ఏర్పాటు చేయడమైనద ని ఈ ఈ కలెక్టర్ కు తెలిపారు. 1000 ఎల్.పి.ఎం సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్ రావలసి ఉందని, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు మరో 15 రోజుల్లోగా పూర్తి కానుందని తెలిపారు. ఆస్పత్రి పనులు ఎప్పటిలోగా పూర్తి కావొచ్చన్న కలెక్టర్ ప్రశ్నికు జూలై 20 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని తెలిపారు. పోస్టుమార్టం గది నిర్మాణం కొరకు ప్రశ్నించగా ఇందుకు ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ దృష్టికి తేగా అప్పటివరకు పాత ఆసుపత్రి భవనం వద్ద సేవలు కొనసాగించాలని సూచించారు.

 త్వరితగతిన పనులు పూర్తి కి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుత ఆసుపత్రి నూతన భవనం అందుబాటులోకి వచ్చినప్పటికీ పాత ఆస్పత్రి కూడా వినియోగించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. కేశవ రావుకు సూచించారు. అనంతరం కోవిడ్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో కోవిడ్ కేసులు నమోదు, ఆస్పత్రిలో ఎంతమంది చికిత్స పొందుతుంది,  కోవిడ్ నుండి కోలుకున్నవారి సంఖ్య డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ డా, లీలా ను అడిగి  తెలుసుకున్నారు. మూడవ దశ కరోనా వ్యాప్తి రానున్న దృష్ట్యా చిన్నపిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల సూచన లు మేరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్యులను సూచించారు. కరోనా వంటి ప్రాణాంతక పరిస్థితుల్లో వైద్యులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. అనంతరం స్థానిక పట్టు మహాదేవ కోనేరు ను పరిశీలించారు. అభివృద్ధి ప్రణాళికను ఎమ్ ఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ కలెక్టర్ కు వివరించారు.   కలెక్టర్ మాట్లాడుతూ చెరువు కట్టలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కు దోహదపడుతుందన్నారు. అక్కడి నుండి వంశధార కాలువ పక్కన ఆర్డబ్ల్యూఎస్ ఏర్పాటుచేసిన తాగునీటి బోర్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  ఇన్ ఛార్జ్ ఆర్ డి ఓ సీతారామమూర్తి, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ఎస్ .సూర్య రావు,  మండల ప్రత్యేక అధికారి డా, మంచు కరుణాకర్ రావు, తాసిల్దార్ ఎస్. గణపతి, ఎంపీడీవో పి. నారాయణ మూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ .నీలయ్య, సర్వేయర్ సుభాష్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tekkali

2021-06-27 14:47:53

GVMCలో డయల్ యువర్ మేయర్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం చేపడుతున్నట్టు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు.  సోమవారం ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల వరకు డయల్ యువర్ మేయర్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. నగర వాసులు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 కి ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి క్రుషిచేస్తామని, నగర వాసులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మేయర్ ఆ ప్రకటనలో కోరారు.

GVMC office

2021-06-27 13:54:34

29న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం..

గుంటూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం  మధ్యాహనం 2.30 గంటలకు కలక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వర్యులు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధ్యక్షతన జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.  సమీక్షా కమిటీ సమావేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్, పేదలందరికీ ఇళ్ల పధకం, ఇళ్ళ నిర్మాణ పురోగతి, ఖరీఫ్ వ్యవసాయ సన్నద్ధత, యంజిఎన్ఆర్ఇజియస్ పనులు, డా. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జల జీవన్ మిషన్ అజెండా అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.  

Guntur

2021-06-27 13:45:45

సింహాద్రినాథునికి రూ.50వేలు విరాళం..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారికి విశాఖ విశాలాక్షి నగర్ కు చెందిన భక్తుడు జి.సురేష్ రూ.50వేలు విరాళాన్ని అందించారు. ఈ మేరకు పీఆర్వో కార్యాలయ కౌంటర్ లో నగదు అందించి రసీదు పొందారు. 05-05-2021న  కాలం చేసిన తమ మావయ్య మోటుపల్లి వీరభద్రుడు, సూర్యకాంతంల  పేరుతో అన్నదానం చేయాలని సురేష్ దేవస్థాన అధికారులను కోరారు. ఈ సందర్భంగా దాతలకు ఉచిత దర్శనం కల్పించి, తీర్ధ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. అటు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉపాలయాలైన పైడితల్లి, బంగారమ్మ ఆలయాలకు  సింహాచలంకు చెందిన భక్తుడు రాజగోపాలరావు రూ.30వేలను విరాళంగా ప్రకటించారు. వాటితో అమ్మవార్ల ఆలయాలను అభివ్రుద్ధి చేయాలని దాత కోరారు. ఆ మొత్తాన్ని ఉపాలయాల అర్చకుడు సంతోష్ కు చెక్ ను అందించారు.

Simhachalam

2021-06-27 07:11:08

అప్పన్నను దర్శించుకున్న 30వేల మంది..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని శనివారం ఒక్కరోజే 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు. జేష్టమాసం కావడం, ఆపై ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో భక్తులు స్వామివారిని చూడటానికి పోటెత్తారు. గాలిగోపురం దగ్గర నుంచి కొండపై బస్టాండ్ వరకు భక్తులతో రద్దీగా మారిపోయింది. దీనితో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ ఈఓ ఎంవీసూర్యకళ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ అనంతరం ఒకేసారి ఇన్నివేల మంది భక్తులు రావడం ఇదే తొలిసారి.  శుక్రవారంనాటికే 50వేల లడ్డూలు, 16వేల పురిహోర ప్యాకెట్లు స్టాక్ పెట్టిడంతో.. భక్తుల ప్రసాదానికి ఎలాంటి సమస్యా రాలేదు. ఇక నుంచి పర్వదినాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈఓ దేవస్థాన అధికారులను ఆదేశించారు.

Simhachalam

2021-06-26 15:37:09