1 ENS Live Breaking News

జూలై 10న జాతీయ లోక్ అదాలత్..

రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించు కోవడాని కి నేషనల్ లోక్ అదాలత్  చక్కటి పరిష్కార వేదికని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి వెంకట జ్యోతిర్మయి అన్నారు జూలై నెల 10వ తేదీ దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది అని ఈ సందర్భంగా రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు మరియు అన్ని రకాల సివిల్ కేసులు మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు వివాహ సంబంధం కేసులు మరియు  చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించ పడతాయని ఈ అవకాశాన్ని కక్షిదారులు ఇరువురూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Ongole

2021-06-23 12:58:27

25న అరసవెల్లిలో హుండీ లెక్కింపు..

శ్రీకాకుళం జిల్లాలోని ఈ నెల 25న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలు లెక్కింపు ఉంటుందని దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమీషనర్, కార్య నిర్వహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.  25వ తేదీన (శుక్రవారం) ఉదయం 9 గంటలకు 40 మంది సిబ్బందితో డిపార్టమెంటు వారి సమక్షములో అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలు తెరచుటకు నిర్ణయించడమైనదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Arasavilli

2021-06-23 12:38:38

కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రభుత్వం కోవిడ్ నిబంధనల సడలింపు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కర్ఫ్యూ వేళల్లో మాత్రమే సడలింపు ఉందని గుర్తించాలని ఆయన అన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకొనుటకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. అధికారులు కోవిడ్ నిబంధనలను అమలు చేయడంలో పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు పాటించి అనుమతి మేరకు మాత్రమే వేడుకలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. పరిమితికి మించి గుమిగూడరాదని ఆయన అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ తగ్గుముఖంలో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించక పోతే కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ అన్నారు. మొదటి దశ చివరలో జిల్లాలో కేసులు తగ్గు ముఖం పట్టాయని, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ నిబంధనల పట్ల అశ్రద్ద వలన వేల సంఖ్యలో కేసుల పెరుగుదల వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరూ మాస్క్ లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరం అయితేనే బయటకు రావాలని ఆయన సూచించారు. జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా చేయుటకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

 జిల్లాలో సామర్థ్యం మేరకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, నమూనాలు విస్తృతంగా సేకరించాలని ఆయన జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.  కనీసం పది రోజుల పాటు రోజుకు ఆరు నుంచి ఏడు వేల వరకు నమూనాలు సేకరించాలని అన్నారు.   ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-23 12:32:22

Simhachalam

2021-06-23 06:49:38

మాన్సాస్ ఆక్రమాలు ఆ విధంగా తెరపైకి ..

విజయనగర రాజ వంశంలో కీలకంగా వున్న మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇపుడు మాన్సాస్ లో జరిగిన అక్రమాలు బయటకు తీస్తారా..వాటిలో ఎవరి హస్తం ఉందో ఆకోణంలో వాస్తవాలు బయటకొస్తాయని చెబుతున్నారు. దానికి విశాఖలో రాజ్యసభ్య సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ఆశక్తికర వ్యాఖ్యలు బలాన్ని చేకూరస్తున్నాయి. మొన్నటి వరకూ టిడిపి అధికారంలో ఉండటంతో ఆ ట్రస్టుకి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ వచ్చారు.  వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆ ట్రస్టు, సింహాచల దేవస్థాన చైర్మన్ పదవులు సంచయిత గజపతిరాజు చేతిలోకి వచ్చాయి.. చాలా ఏళ్ల తరువాత ట్రస్టు చేతులు మారిందని, దాని రూపు రేఖలు మారుతాయనుకున్న తరుణంలో మళ్లీ హైకోర్టులో అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాధి వాదలను వినిపించడంతో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఆ వెంటనే రాజకీయాలకు తెరలేపిన అశోక్ గజపతిరాజు ప్రభుత్వంపై చాలా వ్యాఖ్యలే చేశారు. వాటిని సుమోటాగా స్వీకరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వచ్చింది. అయితే గత వారం రోజుల నుంచి మాన్సాస్ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు కాస్త గట్టిగానే ద్రుష్టిపెట్టినట్టు వార్తలొస్తున్నాయి. మాన్సాస్ విషయంలో చేసిన అవినీతిని బయట పెడతామని విజయసాయిరెడ్డి ప్రకటించండంతో ఆ వేడి మరింత రాజుకుంది. ఉత్తరాంధ్రాలోని కీలకమైన అంశంగా మాన్సాస్ వ్యవహారం గజపతిరాజు వంశాన్ని ఓ కుదుపు కుదిపింది. మాన్సాస్ వ్యవహారంలో ఒకే కుటుంబంలో కూతురు, చిన్నాన్నలు కోర్టుకెళ్లి నువ్వా నేనా అని తలపడిన సమయంలో హైకోర్టు చిన్నాన్న వైపే తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజు మాన్సాస్ లో చేసిన అవినీతి ఆధారాలతో సహాయ బయట పెట్టిన తరువాత వాటితో సుప్రీం కోర్టుకి వెళ్లాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ట్రస్టు భూములు పక్కదారిపట్టాయని వాటి పరిరక్షిస్తామని చెప్పడంతో ఈ విషయంలో గట్టిగానే సమాధానం చెబుతామన్నా మంత్రులు ప్రకటనలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వాని వ్యతిరేకంగా వున్న మీడియా దీనినే ప్రధాన అంశంగా కూడా చూపిస్తూ ప్రజలను ఆలోచింపచేస్తున్నా..వాస్తవ అక్రమాలను బయటకు తీసినపుడు అదే స్థాయి ప్రచారం కల్పించి రాజు అవినీతి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో మాన్సాస్ మరో మలుపు తిరిగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారినా..వాస్తవాలను ప్రజలకు తెలియజేసి మళ్లీ సంచయిత గజపతిరాజుని ట్రస్టుకి చైర్మన్ ను చేయాలనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అంశం. అందుకే నేటికి కూడా గజపతిరాజు సంచయిత కోర్టు తీర్పు విషయంలో ఒక్క ప్రకటన కూడా చేయలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడటం, గజపతిరాజు, టిడిపి నేతల ఆరోపణలపై స్పందిస్తున్నారు తప్పితే సంచయిత మాత్రం నోరు విప్పడం లేదు. అటు ఈ విషయంలో విజయనగర రాజులకు ప్రతిష్టాత్మకంగా వున్న మాన్సాస్ ట్రస్టు విషయంలో కుటుంబ పరువు తీసుకోవద్ద చిన్నాన్న, కుటుంబ సభ్యులు సంచయితపై ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు మాన్సాస్ లోని ముఖ్యమైన వ్యవహారాలు చేధించినట్టుగానే కనిపిస్తుంది. ఆ కారణంతోనే వాస్తవాలతోనే ప్రజలముందుకి వస్తామనే మాటలకు బలం చేకూరుతుంది.  చాలా ఏళ్ల నుంచి మాన్సాస్ ట్రస్టును టిడిపి నాయకులు మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేసమయంలో సింహాచలం ట్రస్టుబోర్టులో కూడా ఈ కుటుంబం నుంచే అనువంశికంగా ధర్మకర్తలు కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన సంచయిత గజపతిరాజుని ప్రభుత్వం ప్రమోట్ చేయడం..ప్రత్యేక జీఓల అధికారం చేతిలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మాన్సాస్ లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం కూడా చాలా గట్టి పట్టే పట్టింది. ఈ రసవత్తర సమయంలో మాన్సాస్ విషయంలో సంచయిత గజపతిరాజుకి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా తిరిగి మళ్లీ మాన్సాస్ కి మహారాణి అవుతుందా..ఏ స్థాయిలో రాష్ట్రప్రభుత్వం మాన్సాస్ లో జరిగిన అవినీతిని బయటకు తీసి అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచుతుంది అనేది ఆశక్తికరంగా మారింది..! 

Visakhapatnam

2021-06-23 02:49:42

రూ. 737.72 లక్షలు కేటాయింపు..

ప్రధానమంత్రి మత్స్యశాఖ సంపద యోజన పథకం(2020-21) క్రింద  చేపల తలసరి వినియోగం పెంపొందించేందుకు వివిధ యూనిట్ల స్థాపనకై జిల్లాకు రూ.737.72 లక్షలు కేటాయించినట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు.  ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన  క్రింద లైవ్ ఫిష్ , ఫ్రెష్ ఫిష్, రొయ్యలు, మేరినేటేడ్ అండ్ కుక్డ్ ప్రోడక్ట్స్ రిటైల్ అమ్మకం,స్నాక్స్,ఇన్ స్టంట్ కుకింగ్ ఫుడ్స్ తయారీ, ఆన్ లైన్ ద్వారా విక్రయాలు, వివిధ రకాల రిటైల్ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కొరకు ఆసక్తి గల వ్యాపారవేత్తల నుంచి దరఖాస్తులను https://ematsyakar.com/efisher/retailunits ద్వారా కోరుతున్నట్లు ఆయన చెప్పారు.  2020-21 జిల్లాలో చేపల ఉత్పత్తి  1,68,870 టన్నులు కాగా, 2021-22 సం.నకు  1,70,896  టన్నులు లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో చేపల తలసరి వినియోగం పెంచి, వివిధ రకాల చేపల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేస్తుందని అన్నారు. శ్రీకాకుళం  నగర  కేంద్రంగా రూ.1.27 కోట్లతో ఒక ఆక్వా హబ్ యూనిట్ ను స్థాపించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని, క్రమేపీ ప్రతి నియోజకవర్గంలో ఒక హబ్ చొప్పున ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఒక్కొక్కటి  రూ.50 లక్షల వ్యయంతో జిల్లాలో ఒక వాల్యూ యాడెడ్  యూనిట్, రూ.20లక్షలతో  లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లను ఐదింటిని, రూ.10 లక్షల వ్యయంతో  10 ఫిష్ కియోస్క్ యూనిట్లను, రూ.4 లక్షల వ్యయంతో 10 ఈ-వెహికల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి  రూ. 1.25 లక్షలతో  మినీ ఫిష్ వెండింగ్ రిటైల్ యూనిట్లను ఏర్పాటుచేయుటకు ప్రతిపాదించగా ప్రస్తుతం 100 యూనిట్లు మంజూరుకాబడ్డాయని, 2022 నాటికి 300 యూనిట్లను ఏర్పాటు చేయుటకు  ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. పై యూనిట్ల స్థాపనకు బి.సి జనరల్ కేటగిరికి 40 శాతం, ఎస్.సి, ఎస్.టి, ఉమెన్ కేటగిరీలు 60 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు  9440814719 ఫోన్ నెంబరును సంప్రదించాలని , మినీ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ దరఖాస్తులు కొరకు మీ గ్రామ/వార్డు వాలంటీరును లేదా గ్రామ/వార్డు సచివాలయంలో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. పై యూనిట్లు ఏర్పాటు చేయు వ్యాపారస్తులు ప్రభుత్వ ప్రోత్సాహాకాలు, బ్యాంకు  రుణం పొందే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. 

శ్రీకాకుళం

2021-06-22 15:33:05

దివ్యాంగుల కోసం ఆధార్ నమోదు..

గుంటూరు జిల్లాలో దివ్యాంగులకు ఆధార్ కార్డు నమోదు, కోవిడ్–19 వ్యాక్సినేషన్  ఇంటి వద్దకే వెళ్ళి అందించేందుకు అవసరమైన ప్రణాళికలు వెంటనే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతితో కలసి దివ్యాంగులకు అధార్ కార్డు నమోదు, వ్యాక్సినేషన్పై రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి కావటం తో ఆధార్ కార్డు నమోదు చేసుకోలేని దివ్యాంగులుకు సంక్షేమ పథకాలు అందించటంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా మానసిక దివ్యాంగులు, నూరు శాతం వైకల్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగులను ఆధార్ నమోదు కేంద్రాలకు తీసుకువెళ్ళటానికి కుటుంబసభ్యులు చాలా కష్టాలు పడుతున్నారన్నారు. అటువంటి వారికి ఇంటి వద్దకే వెళ్ళి మొబైల్ టీంల ద్వారా ఆధార్ కార్డు నమోదుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించనున్నామన్నారు. 

మంచానికే పరిమితమైన దివ్యాంగులకు కోవిడ్–19 వ్యాక్సిన్ను ఇంటి వద్దకే వెళ్ళి అందించనున్నామన్నారు.  సచివాలయంలోని వాలంటీర్లు తమ పరిధిలోని దివ్యాంగుల వివరాలను సేకరించి సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ల సెక్రటరీలకు అందించాలన్నారు. గ్రామ సచివాలయాలకు అందిన వివరాలను ఎంపీడీవోలు జిల్లా పరిషత్ సీఈవోకు, వార్డు సచివాలయాలకు అందిన వివరాలను మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఎంఏకు పంపించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వారీగా అందిన వివరాలకు అనుగుణంగా దివ్యాంగులకు  ఇంటి వద్దకే వెళ్ళి ఆధార్ నమోదు కోసం రూట్ ప్లాన్ను తయారు చేయాలన్నారు.  ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు నమోదు కోసం ఐరీష్, బయెమెట్రీక్ డివైజ్లతో పాటు కంప్యూటర్, ప్రింటర్ ఇద్దరు టెక్నిషీయన్లు ఒక వాహనంలో  మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రూట్ ప్లాన్ రూపొందించిన వెంటనే సచివాలయాలు వారీగా ముందుగా సమాచారం అందించి మొబైల్ టీంలు దివ్యాంగుల ఇళ్ళకు వెళ్ళి ఆధార్ కార్డు నమోదు చేస్తారని తెలిపారు. కోవిడ్ –19 వ్యాక్సినేషన్ను 108 వాహనాల ద్వారా దివ్యాంగుల ఇంటికే వెళ్ళి అందిస్తారన్నారు.

టెలికాన్ఫరెన్సులో సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో చైతన్య, మున్సిపల్ ఆర్డీ శ్రీనివాసులు, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదనరావు, పాల్గొన్నారు.

గుంటూరు

2021-06-22 15:31:55

అనంత ఆక్రమణలపై కఠిన చర్యలు..

అనంతపురం నగర పరిధిలో ఆక్రమణలు తొలగించుకోకుంటే మేమే చర్యలు తీసుకుం టామని నగర మేయర్ మహమ్మద్ వసీం హెచ్చరించారు. నగరంలోని సాయి నగర్ 1,2,3 ,4 వ క్రాస్ ల పరిధిలో రోడ్ ఆక్రమించి భవనాల మెట్లు,పార్కింగ్ ,హొర్డింగ్ లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు  ఎదుర్కొంటున్నారని మేయర్ వసీం దృష్టికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన మేయర్ వసీం మంగళశారం సాయంత్రం సాయి నగర్ పరిధిలో అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా అనేక మంది భవనాల యజమానులు రోడ్ ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తుడంతో వారితో మేయర్ మాట్లాడుతూ, మీ ఆక్రమణలు మూలంగా ప్రజలు ఇబ్బందులు పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిర్ధిష్ట గడువులోగా వాటిని తొలగించుకోకుంటే మా సిబ్బంది తొలగిస్తారని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం వీటిపై దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వారం లోపు ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో రోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు బాలాంజినేయులు,సోని రమణ, అనిల్ కుమార్ రెడ్డి, కమల్ భూషణ్,డిప్యూటీ కమిషనర్ రమణా రెడ్డి,ఏసిపి సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Anantapur

2021-06-22 14:37:03

తూ.గో.జిల్లాకి రూ. రూ.423.35 కోట్లు లబ్ది..

తూర్పుగోదావ‌రి జిల్లాలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన 45-60 ఏళ్ల మ‌ధ్య‌గ‌ల 2,25,789 మంది మ‌హిళ‌లు వైఎస్సార్ చేయూత ప‌థ‌కం ద్వారా రూ.423.35 కోట్ల మేర ల‌బ్ధిపొందుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. వైఎస్సార్ చేయూత ప‌థ‌కం ద్వారా రెండో ఏడాది మ‌హిళ‌ల ఖాతాల్లో దాదాపు రూ.4,339 కోట్ల‌ను బ‌ట‌న్ నొక్కి నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ‌లోని క‌లెక్ట‌రేట్ వివేకానంద హాల్ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత‌, ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, వివిధ ప్రాంతాల‌కు చెందిన ల‌బ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అర్హులైన 45-60 ఏళ్ల మ‌ధ్య‌గ‌ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని తెలిపారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌థ‌కం కింద 60,858 మంది ఎస్సీ ల‌బ్ధిదారుల‌కు, 12,129 మంది ఎస్టీ ల‌బ్ధిదారుల‌కు, 1,49,095 మంది బీసీ ల‌బ్ధిదారుల‌కు, 3,707 మంది మైనారిటీ ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతోంద‌ని వివ‌రించారు. మ‌హిళ‌ల ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క వైఎస్సార్ చేయూత ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని లబ్ధిదారుల‌కు సూచించారు. ఆస‌క్తి ఉన్న‌వారు కిరాణాషాపులు ఏర్పాటుచేసుకునేందుకు అదే విధంగా గేదెలు, ఆవులు, మేక‌లు వంటి యూనిట్లను పంపిణీ చేసి కుటుంబాల ఆర్థిక ప్ర‌గ‌తికి బాట‌లు వేసేందుకు ప్ర‌భుత్వం తోడ్పాటునందిస్తోంద‌ని పేర్కొన్నారు. మ‌హిళ‌ల వ్యాపార అభివృద్ధికి సాయ‌ప‌డేందుకు వీలుగా అముల్‌, రిల‌యెన్స్‌, పీ అండ్ జీ త‌దిత‌ర పెద్ద సంస్థ‌ల‌తో ప్ర‌భుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, బీసీ, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీలు ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మి, జీఎస్ సునీత,  మైనారిటీ సంక్షేమ అధికారి పీఎస్ ప్ర‌భాక‌ర‌రావు, వివిధ ప్రాంతాల‌కు చెందిన ల‌బ్ధిదారులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-22 14:34:00

థర్డ్ వేవ్ ను సమిష్టిగా ఎదుర్కోవాలి..

 కోవిడ్ 3వ దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేదుకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాలని  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైద్య అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో కోవిడ్ మూడో దశ ప్రభావం, మూడోదశకు అనుగుణంగా జిజిహెచ్ లో ఏర్పాటు చేయవలసిన సదుపాయాలపై  జిజిహెచ్ కోవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి జి.సూర్య ప్రవీణ్ చాంద్ తో కలిసి జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ మూడవ దశను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు  ఇప్పటినుంచే మూడవ దశ పై అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. జిజిహెచ్  ఈఎన్ టి బ్లాక్ వద్ద పీడియాట్రిక్ విభాగానికి సంబంధించి 20 పడకలతో కూడిన ట్రాయాజ్, 200 పడకలతో ప్రత్యేకమైన పీడియాట్రిక్ వార్డు, ఐసియు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, పీడియాట్రిక్ వెంటిలేటర్స్ , ఈసీజీ పరికరాలు కొనుగోలు చేయాలన్నారు.  ఈ సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు ఆరోగ్యశ్రీ, ఆసుపత్రి సీఎస్ఆర్, కోవిడ్ నిధుల నుంచి  కేటాయించాలన్నారు. జిల్లాలో కోవిడ్ రెండవ దశ  తగ్గుముఖం పట్టినప్పటికీ అలక్ష్యం వహించకుండా వైద్య సేవలు అందించారన్నారు.  జీజీహెచ్ లో 369 కోవిడ్ యాక్టివ్ కేసులు,126 బ్లాక్ ఫంగస్ కేసులు  ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ  సమావేశంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి,ఆర్ఎమ్ వో లు డా. గిరిధర్, డా. అనిత,సిఎస్ఆర్ఎమ్ వో డా. పద్మ శశిధర్,  పీడియాట్రిక్ విభాగ అధిపతులు, ఇతర వైద్య అధికారులు  హాజరయ్యారు.

Kakinada

2021-06-22 14:22:02

గుంటూరు జిల్లాకి రూ.394.74 కోట్లు లబ్ది..

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు 2,10,529 మంది అక్కచెల్లమ్మలకు రూ.394.74 కోట్ల చెక్కును రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ లబ్ధిదారులకు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 45 నుంచి 60 సంవత్సరాలు  మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లమ్మలకు ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.75,000 ఆర్ధిక సహాయం అందించేందుకు వైఎస్సార్ చేయుత పథకంకు శ్రీకారం చుట్టారన్నారు. చేయూత పథకం ద్వారా ఆదాయం పెంచుకొని మహిళలు ఆర్ధికంగా స్థిరపడటం కోసం పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నారన్నారు. 

జిల్లాలో 2,10,529 మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రూ.394.74 కోట్లు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేయటం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న మహిళలపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుందని,  పిల్లల పెళ్ళిళ్ళులకు ఇతర ఆర్ధిక అవసరాలు తీర్చాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు. ఆర్ధిక అవసరాల కోసం  అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా ఉండేందుకు వారికి వైఎస్సార్ చేయుత పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నామన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలతో పాటు సాధికారికత కోసం నామినేటడ్ పదవులలో 50 శాతంకు మించి రిజర్వేషన్లు కల్పించి నిజమైన మహిళా సాధికారితను ముఖ్యమంత్రి చేసి చూపించారన్నారు. వితంతువులు, ఒంటరి  మహిళలు, వికలాంగులైన మహిళలకు పెన్షను ఇస్తునే వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. 

రాష్ట్రంలో ఆసరా, సున్నావడ్డీ, చేయూత తదితర సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి కుటుంబంలోని మహిళకు రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోను అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న  ప్రభుత్వం  మహిళలకు అండగా ఉంటుందన్నారు. కుటుంబంలో భార్యలనే భర్తలు నగదు అడిగే పరిస్థితిని తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి మహిళా లోకం మొత్తం ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర జరిగిన ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారని, బాదితురాలికి రూ.5 లక్షల నగదును ప్రకటించి  జిల్లా కలెక్టర్ ద్వారా వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమంతో పాటు రక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. మహిళ ఆనందంగా ఉంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం ఆనందంగా ఉంటుందని, మహిళలకు అవసరమైన సంక్షేమ, రక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి మహిళల తరుపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

Guntur

2021-06-22 13:42:35

మహిళల ఆర్ధిక స్వావలంబన లక్ష్యం..

అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి  చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత పథకం లో అర్హులైన మహిళల  ఖాతాలలోనికి రెండవ సంవత్సరం ఒక్కొక్కరికి  రూ.18,750 చొప్పున నగదు జమ  చేసే కార్యక్రమం ముఖ్య మంత్రి మంగళ వారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, పేదలందరికీ ఇళ్లు పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  45-60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్.సి, ఎస్.టి, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా మంజూరు చేసిన రెండవ విడత నగదు లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేశారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వరసగా రెండో ఏడాది వైయస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన దాదాపు 23,14,342 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 4,339.39 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వై.ఎస్.ఆర్  చేయూత వివరాలు తెలియజేస్తూ జిల్లాలో 1,99,695 మంది లబ్దిదారులకు రూ.374,42,81,250 లు వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు.  జివియంసి పరిధిలో రూ.118,37,62,500లు నమోదవుతుందని చెప్పారు.  ఎస్.సి. కార్పొరేషన్ ద్వారా 18,583 మంది లబ్దిదార్లకు, ఎస్.టి. కార్పొరేషన్ ద్వారా 28,811 బి.సి. కార్పొరేషన్ ద్వారా 1,48,810 మందికి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 3,491 మందికి  చేయూత పథకంలో లబ్ది చేకూరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు జి.వి.హరికుమారి, డిప్యూటి మేయరు బియ్యాని శ్రీధర్, జివియంసి కమిషనర్ డా.జి.సృజన, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, మత్స్యకార అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డి.ఆర్.డి.ఎ. పి.డి. వి.విశ్వేశ్వరరావు, యు.సి.డి. పి.డి. శ్రీనివాస్, మెప్మా పి.డి. తదితరులు పాల్గొన్నారు.  

Collector Office

2021-06-22 13:27:48

యోగా విజేతలకు కలెక్టర్ అభినందన..

రాష్ట్ర స్థాయి ఆయుష్ యోగా పోటీలలోవిజేతలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మంగళవారం తన కార్యాలయంలో అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా 18 సంవత్సరముల లోపు పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్చువల్ యోగా పోటీలలో ప్రథమ బహుమతి పొందిన ఎలమంచిలి జిల్లా పరిషత్ హైస్కూలులో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి జి.లయవర్ధన్, కన్సోలేషన్ బహుమతి పొందిన చోడవరం రవి కాన్వెంట్ లో ఆరవ తరగతి విద్యార్థిని పి.వెన్నెలశ్రీ లకు మంగళవారం తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, ఆయుష్ శాఖ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వెంకటరావు, డాక్టర్ హరికృష్ణ, యోగా గురువులు సతీష్, కిరణ్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-22 13:23:41

జిల్లాలో 1,99,370 మందికి చేయూత..

వైఎస్సార్ చేయూత రెండవ విడత ద్వారా జిల్లాలో 1,99,370 మందికి లబ్ది చేకూరింది. ఒకొక్కరికి రూ.18,750 చొప్పున మొత్తం రూ.373.82 కోట్లు జిల్లాకు దక్కాయి. వీటిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.70.05 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.16.81 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.241.54 కోట్లు, ముస్లిం మైనారిటీలకు రూ.45.09 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ 0.33 కోట్లు దక్కాయి.  డీఆర్డీఏ ద్వారా 1,55,172 మంది గ్రామీణ మహిళలు రూ.290.95 కోట్లు, మెప్మా ద్వారా 44,198 మంది పట్టణ ప్రాంత మహిళలు రూ. 82.87 కోట్లు పొందారు. ఎవరైనా అర్హుల పేర్లు వైఎస్సార్ చేయూత రెండవ విడత జాబితాలో లేనట్టయితే లబ్ధిదారుల గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులందరికీ న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  వీడియో కాన్ఫరెన్సులో అనంతపురం కలెక్టరేట్ నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకట్రామి రెడ్డి, దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ రమణా రెడ్డి మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-22 13:11:01

పథకాల అమలులో వెనుకడుగే లేదు..

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల విషయంలో వెనకడుగు వేయకుండా అమలు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాలునందు వైఎస్సార్ చేయూత రెండవ విడత నగదు బదిలీ కార్యక్రమంలో మంత్రి శంకర నారాయణ పాల్గొన్నారు. తాడేపల్లి గూడెం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 23,14,342 మంది మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల రూపాయలు జమ చేశారు. జిల్లాలో 1,99,370 మందికి రూ.373.82 కోట్ల లబ్ది చేకూరింది. ముఖ్యమంత్రి నగదు బదిలీ చేసిన అనంతరం మంత్రి శంకరనారాయణ స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. లక్షల మంది మహిళలకు ఆర్థిక భరోసానిస్తున్న వైఎస్సార్ చేయూత రెండవ విడత కార్యక్రమం నిర్వహించుకోవడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెలలో ఇప్పటికే జగనన్న ఇళ్ల నిర్మాణ పనులకు శంకు స్థాపన, జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, వాహన మిత్ర ద్వారా డ్రైవర్లకు నగదు బదిలీ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని.. అదే కోవలో నేడు వైఎస్సార్ చేయూత రెండవ విడత అందించామన్నారు.  చేయూత సొమ్ము వృథా కాకుండా ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళలకు మల్టీ నేషనల్ కంపెనీల ద్వారా హోల్ సేల్ ధరలకే ఉత్పత్తులు అందించి లాభసాటి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కుగోలదనే ఆలోచనతో జగనన్న సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. 

జిల్లా మహిళలు చేయూత మరియు ఇతర పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న సొమ్మును ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వినియోగిస్తున్నారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తెలిపారు. ఎక్కువ మంది మహిళలు పశువుల పెంపకం, పాడి పరిశ్రమ, కిరాణా షాపులు, గార్మెంట్స్ షాపుల నిర్వహణ వంటి పనులు చేపడుతున్నారన్నారు. ఇవేగాక మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు వస్తే బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నామన్నారు. 

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఇంట్లో మగవారి ఆదాయానికి మహిళల ఆదాయం కూడా తోడైతే ఆ ఇంటికి ఆర్థిక ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. మహిళలు సంతోషంగా ఉన్నపుడే కుటుంబాలు సంతోషంగా, రాష్ట్రం సుభిక్షంగా ఉండగలదన్నారు. కరోనా ఆర్థిక కష్టాలలోనూ అద్భుతమైన పథకాలను అందిస్తున్న ఆదర్శ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కదిరి ఎమ్మెల్యే డా.సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటల మనిషి కాదని చేతల మనిషని ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు.
 
వీడియో కాన్ఫరెన్సులో అనంతపురం కలెక్టరేట్ నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకట్రామి రెడ్డి, దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, మెప్మా పీడీ రమణా రెడ్డి మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-22 13:10:04