1 ENS Live Breaking News

కరోనా నుంచి రక్షణగా ఆనందయ్య మందు..

కరోనా సమయంలో ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లు ఆనందయ్య మందును వేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చునని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అన్నారు. మంగళవారం రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి జివిఎంసి కి అందజేసిన మందును ఆయన అల్లిపురం పి.హెచ్.సి. సెంటర్లో ఫ్రంట్ లైన్ వారియర్సుకు ఆనందయ్య మందును అందించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొత్తం 1275 డబ్బాల మందుని అందించినందుకు రాజ్యసభ సభ్యులు  వి. విజయసాయి రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీటిని అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలోను, ఎఫ్.అర.యు. సెంటర్లో ఉన్న ఎ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, సిబ్బందికి అందించమన్నారు. ఒక డబ్బా మందును 5 మందికి చింత గింజంత పరిమాణంలో ఉదయం ఒక్కటి, సాయంత్రం ఒకటి చొప్పున ఒక్క రోజు మాత్రమే అన్ని వయసులు వారు వాడవచ్చన్నారు. ఈ మందు సేవించినచో మాంసం, మద్యం, ధూమపానం చేయరాదని, గర్భిణీలు, బహిష్ట సమయంలో వాడరాదని, ఏ ఇతర మందులు వాడుతుంటే వాటిని యధావిధంగా వాడుకోవచ్చని, మందు తిన్న రోజు 5 నుండి 6 లీటర్లు నీరు త్రాగాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నవారు కూడా ఈ మందును తీసుకోవచ్చని అదనపు కమిషనర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ శశిభూషణ్, జోనల్ మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-22 12:55:39

అనాద చిన్నారులకు రక్షణగా ప్రభుత్వం..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. కోవిడ్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన 7 గురు చిన్నారులకు మంగళ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూ.10 లక్షల విలువగల బాండ్లను శాసన సభాపతి సీతారం, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సమక్షంలో పంపిణీ చేసారు. బాలల విద్యాభ్యాసం, సంరక్షణకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం రూ.10 లక్షల బాండ్లను అందిస్తామని తెలిపారు.  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రూ.10 లక్షల బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం చిన్నారులు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి ఎంతో మంచి ఆలోచనతో అందించారని, దీనిని సక్రమంగా వినియోగించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాలని ఆయనకోరారు.  బాండ్లను పొందిన వారిలో రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన వాకముల్ల కామేశ్వరరావు, వాకముల్ల పార్థసారథి, ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన చింతపల్లి గీత,  చింతపల్లి మూర్తి, ఎల్.ఎన్.పేట మండలం బొట్టాడసింగి గ్రామానికి చెందిన వాడాడ కిషోర్ కుమార్, మందస మండలం బేతాళ పురం గ్రామానికి చెందిన బత్తిన గణేష్,  జలుమూరు మండలం కేఎల్ఎన్ పేట గ్రామానికి చెందిన కూన తిరుమల తేజలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి., తూర్పుకాపు, కళింగకోమటి కార్పొరేషన్ల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి, డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.బి.డి. హరిప్రసాద్, ఐసిడిఎస్ పథక సంచాలకులు డా.జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-22 12:51:18

మళాభివ్రుద్ధికి ప్రభుత్వం పెద్దపీట..

 మహిళలకు చేయుత ద్వారా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో  75,000  రూపాయల ఆర్ధిక సహాయం చేస్తూ వారి కాళ్ళ మీద వారు  బ్రతికేలా చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని  నింపిన ముఖ్యమంత్రి  పాలిట మహిళలంతా కృతజ్ఞతా పూర్వకంగా ఉన్నారని ఎమ్మెల్యే   కోలగట్ల వీరభద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడారు. ఎంత ఆర్ధిక భారం పడినా ఇచ్చిన మాట ప్రకారంగా  అక్క చెల్లెళ్ళ కు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు.  మహిళలు కిరాణా, డైరీ వంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంభం లో గౌరవాన్ని పొందేలా చేసిన ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటామనే భావన  వ్యక్తం చేస్తున్నారన్నారు.  అర్హత కలిగి  లబ్ది పొందని మహిళలు  దరఖాస్తు చేసుకోవాలని, ఎంత మందికైన అర్హులకు ఆర్ధిక సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రయంలో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్,  పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు  బడ్డుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య,, కడుబండి శ్రీనివాస రావు, రాజన్న దొర , విజయనగరం  కార్పోరేటర్ కోలగట్ల శ్రావణి సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, డి.ఆర్.డి.ఎ, మెప్మా  పి.డి లు సుబ్బా రావు, సుధాకర రావు, మహిళా సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-22 12:35:36

జిల్లాలో మహిళలకు రూ. 283.77 కోట్లు..

నవరత్నాల్లో బాగంగా  వున్న  పధకాలలో  ఒకటైన  వై.ఎస్.ఆర్. చేయూత  పధకం రెండవ విడత  క్రింద జిల్లా కు చెందిన 1,51,344  మంది మహిళలకు  రూ. 283.77 కోట్లు లబ్ది   చేకూరింది.   మంగళ వారం వెలగపూడి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లో జమ చేసారు.   జిల్లాకు మొదటి  విడత లో గత ఆగష్టు లో  1,56,035 మందికి 292.55 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది.  45 నుండి 60 ఏళ్ళ మద్ద్య వయసు గల  ఎస్.సి., బి.సి. స్.టి. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు చిరు వ్యాపారాలు చేసుకొనుటకు సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున నాలుగేళ్ళలో 75,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతోంది. జిల్లాలో  మొదటి విడత క్రింద అందజేసిన  మహిళా లబ్ది దారులు కిరాణా, డైరీ  వ్యాపారాలు  చేస్తూ ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్నారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మెగా చెక్కును లబ్ది దారులకు అందించారు. ఈ కార్యక్రయంలో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్,  పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు  బడ్డుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య,, కడుబండి శ్రీనివాస రావు, రాజన్న దొర , విజయనగరం  కార్పోరేటర్ కోలగట్ల శ్రావణి సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, డి.ఆర్.డి.ఎ, మెప్మా  పి.డి లు సుబ్బా రావు, సుధాకర రావు, మహిళా సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-22 12:32:58

మత్స్యకార భరోసా పై విచారణ..

మత్స్యకార భరోసా మంజూరులో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపలపై విచారణకు ఆదేశించామని మంత్రి అప్పల రాజు తెలిపారు. మంగళవారం మత్స్యకార భరోసా ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సోంపేటతోపాటు కొన్ని మండలాల్లో వస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడవ విడత మత్స్యకార భరోసాగా 1.19 లక్షల మందికి రూ.10 వేలు చొప్పున విడుదల చేసామని అందులో సాంకేతిక కారణాల వలన దాదాపు 23 వేల మంది ఖాతాల్లో జమ కాలేదని వివరించారు. అవగాహన లేకుండా పలువురు ఆరోపణలు చేయడం జరుగుతుందని మంత్ర పేర్కొంటూ జగన్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాగా ఇప్పటికే మూడు సార్లు రైతు భరోసా అందించిన ఘనత దక్కిందన్నారు. వేట నిషేధ కాలం తరువాత నిర్ధేశిత కాలంలో భరోసా మొత్తాన్ని అందిస్తున్నామని మంత్రి అన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఎవరూ తప్పు పట్టే పరిస్ధితి లేదని ఆయన పేర్కొన్నారు.

Srikakulam

2021-06-22 12:22:05

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు..

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రెండో ఏడాది వై.యస్.ఆర్.చేయూత కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్న శాసన సభాపతి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి 45 నుండి 60 సంవత్సరాల వయస్సుగల మహిళలకు వై.యస్.ఆర్ చేయూతను అమలు చేయడం ముదావహమన్నారు. చేయూత కార్యక్రమం వలన వివిధ జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతూ కుటుంబం ఆర్ధికంగా ముందంజ వేయుటకు సహాయం చేస్తున్నారని చెప్పారు. పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో రూ.19వేల కోట్ల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండవ ఏడాది 23,14,342 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. వరుసగా నాలుగేళ్లు ప్రతీ ఏటా రూ.18,750/-లు చొప్పున మొత్తం రూ.75 వేలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 2,15,668 మంది లబ్ధిదారులు నమోదుచేసుకోగా, 1,91,417 మందికి వై.యస్.ఆర్.చేయూత పథకం అందించడం జరిగిందన్నారు. రెండో విడతలో 1,88,572 మంది నమోదుచేసుకోగా 1,85,475 మందికి అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో యస్.సి లబ్ధిదారులు 18,482 మంది, యస్.టి లబ్ధిదారులు 10,227 మంది , బి.సి లబ్ధిదారులు 1,56,272 మంది కాగా మైనారిటీ వర్గాలకు చెందిన వారు 494 మంది వెరశి 1,85,475 మంది ఉన్నారని ఆయన తెలిపారు. లబ్దిదారులకు రూ.347.76 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని శాసన సభాపతి తెలిపారు.

Srikakulam

2021-06-22 12:19:56

త్వరలో నేరేడు బ్యారేజ్ కు శంకుస్థాపన..

నేరేడు బ్యారేజి నిర్మాణానికి అతి త్వరలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర  పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. వైయస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్న డాక్టర్ అప్పలరాజు కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశధార రెండవ దశ పూర్తి చేసే గొప్ప అవకాశం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు రావడం ఎంతో సంతోషించదగిన విషయం అని ఆయన అన్నారు. ఒడిశా రాష్ట్రానికి ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అనుమతించడమే కాకుండా ఏపీ అవసరాలకోసం బ్యారేజీకి కుడివైపున హెడ్‌ స్లూయిస్‌ నిర్మాణానికి అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు. 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం హర్షించదగిన పరిణామమని ఆయన తెలిపారు. ఒడిశా అవసరాల కోసం ఎడమ వైపున స్లూయిస్‌ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అంగీకారం తెలియజేస్తూ ఎంత సామర్థ్యంతో ఎడమ స్లూయిస్‌ కావాలో గెజిట్‌ విడుదల చేసిన 6 నెలల లోపు రాష్ట్రానికి ఒడిశా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసిందని మంత్రి వివరించారు. ఎడమ స్లూయిస్‌ కోసం అయ్యే ఖర్చును ఒడిశా భరించాలని  ట్రైబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నీటిని తరలించుటకు రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ అనుమతి ఇవవడం వలన శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం కానుందని అన్నారు. నేరడి బ్యారేజీ కోసం ఒడిశాలో ముంపునకు గురవుతున్న 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఇవ్వాలని, దాని కోసం అయ్యే ఖర్చును రాష్ట్రం భరించాలని తీర్పు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేయగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆ కలను సాకారం చేశారని మంత్రి అన్నారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి తో సంప్రదించుటకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. నేరేడు బ్యారేజి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు.

Srikakulam

2021-06-22 12:19:00

పథకాలపై అవగాహన కల్పించాలి..

ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా, అర్హులంద‌రికీ వాటిని అందేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. ప్ర‌భుత్వ అత్యంత ప్రాధాన్య‌తా కార్య‌క్ర‌మాలైన‌ న‌వ‌ర‌త్నాలుపై, వ‌ర‌ల్డ్ విజ‌న్ ఏర్పాటు చేసిన రెండు ప్ర‌చార వాహ‌నాల‌ను, స్థానిక యూత్ హాస్ట‌ల్ వ‌ద్ద  జాయింట్ క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జెసి వెంక‌ట‌రావు మాట్లాడుతూ, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారానికి ముందుకు వ‌చ్చిన వ‌ర‌ల్డ్ విజ‌న్‌ను, ఆ సంస్థ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు. ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని కేవ‌లం ఒక‌టిరెండు మండ‌లాల‌కే ప‌రిమితం చేయ‌కుండా, జిల్లా అంత‌టా నిర్వ‌హించాల‌ని కోరారు. పేద‌ల‌ను ఆదుకొనేందుకు సంస్థ చేసిన కార్య‌క్ర‌మాల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ విజ‌న్ ఆధ్వ‌ర్యంలో ఒక్కో యూనిట్ ప‌దివేల రూపాయ‌ల చొప్పున‌ ముగ్గురికి తోపుడు బ‌ళ్ల‌ను, ఐదుగురికి కిరాణా యూనిట్ల‌ను, ఇద్ద‌రికి కుట్టు మిష‌న్ల‌ను, ఒక‌రికి ఎంబ్రాయిడ‌రీ మిష‌న్ ను అంద‌జేశారు. అలాగే సుమారు వంద‌మందికి శానిటైజ‌ర్లు, మాస్కులు, గ్లౌజుల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సెట్విజ్ సిఇఓ విజ‌యకుమార్‌, వ‌ర‌ల్డ్ విజ‌న్ ప్ర‌తినిధులు అంబేద్క‌ర్‌, ల‌క్ష్మ‌ణ్‌, నాగేశ్వ‌ర్రావు, గోపాల్‌, గ్రేస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-22 12:07:58

కోవిడ్ మూడవ దశకు ప్రణాళికలు..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. స్వచ్చంధ సంస్ధ ఆర్ట్స్ గివ్ ఇండియా అండ్ ఏక్షన్ ఎయిడ్ సంస్ధ సహకారంతో 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జాయింట్ కలెక్టర్ కు మంగళ వారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అందజేసింది. 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లలో 10 లీటర్ల సామర్ధ్యం గలవి 15, 5 లీటర్ల సామర్ధ్యం గలవి 15 ఉన్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మూడవ దశ కోవిడ్ వ్యాప్తి చెందితే ఎదుర్కొనుటకు ఇప్పటి నుండే అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఆర్ట్స్ సంస్ధ సమకూర్చిన 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కూడా ఉపయోగించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీటిని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు, సామాజిక ఆసుపత్రులు తదితర గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో పెడతామని ఆయన పేర్కొన్నారు. తద్వారా అవసరం ఉన్నవారికి తక్షణం వైద్య సహాయం అందుతుందని చెప్పారు. జిల్లాలో మూడవ దశ వ్యాపించకుండా ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని శ్రీనివాసుల కోరారు. మొదటి, రెండవ దశ కరోనా ప్రభావాన్ని ప్రత్యంగా చూసామని వాటి అనుభవం దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించడం మరిచిపోరాదని అన్నారు. భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచడం అవసరమని ఆయన సూచించారు. 

మూడవ దశలో పిల్లలపై ప్రభావం ఉంటుందని పలువురు తెలియజేస్తున్న వార్తలను సైతం చూస్తున్నామని పేర్కొంటూ కోవిడ్ పై అవగాహన కలిగి దాని ప్రభావం లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కోవిడ్ నివారణకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన సంగతి గుర్తు చేసారు. మూడవ దశను కూడా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నామని అయినప్పటికి ప్రజలు సహకరిస్తే జిల్లాలో వ్యాప్తి లేకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఆయన తెలియజేసారు. 45 సంవత్సరాలు పైబడినవారికి, 5 సంవత్సరాల లోపు చిన్నారుల తల్లలకు, హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతతో వాక్సినేషన్ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ఆర్ట్స్ సంస్ధ అధ్యక్షులు నూక సన్యాసి రావు మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణలో భాగంగా తమ సంస్ధ సహకరిస్తుందన్నారు. రూ.24 లక్షల విలువగల 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గివ్ ఇండియా అండ్ ఏక్షన్ ఎయిడ్ సంస్ధ సహకారంతో అందిస్తున్నామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్ధ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-06-22 12:00:05

ప్రజల సహకారంతో క్లాప్ విజయవంతం..

ప్రజలందరూ కలసికట్టుగా క్లాప్ ను విజయవంతం చేద్దామని నగర మేయర్ వసీం పిలుపునిచ్చారు.  మున్సిపల్ ఆర్ డి కార్యాలయంలో క్లాప్ కార్యక్రమంపై కార్పొరేటర్లు, రిసోర్స్ పర్సన్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్లుకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ, ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్లాప్ గొప్ప కార్యక్రమమన్నారు.పారిశుధ్యం ను మెరుగు పరిచేందుకు క్లాప్ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. క్లాప్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో మనమంతా భాగస్వామ్యం కావాలన్నారు. క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో అనంతపురం నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుదామని పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా క్లాప్ కార్యక్రమంపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి, నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా పిడి రమణా రెడ్డి,ఎన్విరాల్మెంట్ డి ఈ రాంప్రసాద్ రెడ్డి,మెప్మా, సాహిత్య,రీజినల్ డైరెక్టర్ నాగరాజు, రోజా తదితరులు పాల్గొన్నారు.  

Anantapur

2021-06-21 15:11:43

యోగాతో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం..

కరోనా సమయంలో ప్రతీ ఒక్కరూ యోగా ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొదించుకొని కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని ఈఓ ఎంవీ సూర్యకళ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు యోగాపై అవగాహన, శిక్షణ శిబిరం నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ, యోగా ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవచ్చన్నారు. దేవస్థానం తరుపున వివేకానంద యోగా కేంద్రం ఉందని.. దీన్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. యోగా వలన పదిమందికీ ఉపయోగం కలగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతీ ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడే కాదు ప్రతిరోజూ యోగా చేయాలని కోరారు. తనకు వీలుచిక్కినప్పుడల్లా దేవస్థానం యోగా సెంటర్లో యోగా ప్రాక్టీస్ చేస్తానన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఓతోపాటు ఉద్యోగులు కూడా ఉత్సాహంగా యోగసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు నరసింహరావు నాయుడు,సూరిబాబు, DEO సుజాత, ఏఈఓ ఆనందకుమార్, ఏఈ హరి తదితరులు పాల్గొన్నారు. 

Simhachalam

2021-06-21 15:04:59

ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి లక్షమాస్కులు..

గుంటూరు జిల్లాలో కోవిడ్–19 ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం హైదరాబాదులోని మెస్సర్స్ ఎఫ్సీఎన్ ఇమ్పెక్స్ ఇండియా ఎల్ఎల్పి సంస్థ లక్ష మాస్కులు వితరణ చేసినట్టు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భగా సంస్థ  పంపిన లక్ష మాస్క్లను సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు ఏవీ పటేల్, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు వి గోపి క్రిష్ణ స్వయంగా వాటిని కలెక్టర్ కి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా సమయంలో దాతలు ఎంతో ఉదారంగా స్పందిస్తున్నారన్నారు. మరింత మంది దాతలు ముందుకి రావడం ద్వారా కరోనా సోకిన నిరుపేద ప్రజలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లుకు మరింత సాయం అందించడానికి వీలుపడుతుందని చెప్పారు. 

Guntur

2021-06-21 14:55:24

ట్రిబ్యునల్ తీర్పుపై డిప్యూటీ సీఎం హర్షం..

బి.అర్.అర్. వంశధార ప్రాజెక్టుకు ఆయువు పట్టైన నేరడి బ్యారేజి నిర్మాణానికి వంశధార ట్రిబ్యునల్ సానుకూలంగా తీర్పును వెల్లడించడం పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సోమవారం మీడియాతో మాట్లాడారు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే  ట్రైబ్యునల్‌ అనుమతి ఇచ్చినప్పటికీ గత పాలకులు నిర్లక్ష్యం కారణంగానే సమస్య జఠిలం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. గత ఏప్రిల్ 16వ తేదీన ఈ విషయమై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని, సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమని పేర్కొన్నారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగు నీటి అవసరాల కోసం వంశధార ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ దశలో కేవలం 106 ఎకరాల తమ భూమి ముంపునకు గురవుతోందని ఒడిస్సా అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఏపీ ప్రభుత్వం సదరు భూసేకరణకు అవసరమైన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వంశధార నదికి ఎడమవైపున   ఒడిస్సా భూభాగంలో బ్యారేజీకి స్లూయిస్ నిర్మించాలన్న ట్రిబ్యునల్ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి నలుగుతున్న నేరడి బ్యారేజి సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్  సూచించిన విధంగా 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేసి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి కలలు కన్న వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీకాకుళం రైతాంగానికి అంకితం ఇస్తామని కృష్ణ దాస్ పేర్కొన్నారు.

Srikakulam

2021-06-21 14:51:10

1,93,231 మందికి చేయూత లబ్ధి..

వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,93,231 మంది లబ్దిదారులకు రూ.4234.05కోట్లు పంపిణి చేయనున్నట్లు  జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45–60 సంవత్సరాల మధ్య గల ఎస్.సి, ఎస్.టి, బి.సి, మరియు మైనారిటీ సామాజిక వర్గాలలో ఉన్న మహిళలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్ చేయూత పధకంను ప్రారంబించడం జరిగిందన్నారు. ఈ పధకం కింద అర్హులైన లబ్దిదారురాలుకు సంవత్సరానికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్ధిక సాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ సంవత్సరం అందించే ఆర్ధిక సాయాన్ని ఈ నెల 22 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానం ద్వారా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి  జమచేస్తారన్నారు.  వై.ఎస్.ఆర్ చేయూత పధకం కింద రెండవ సంవత్సరం 1,93,231మంది లబ్దిదారులకు రూ.4234.05 కోట్లు లబ్ది ..  గిరిజన కార్పొరేషన్ ద్వారా 8,485 మంచి లబ్ధిదారులు, బీసీ కార్పొరేషన్ ద్వారా 1,24,782 మంది లబ్ధిదారులు.  క్రిస్టియన్  మరియు మైనార్టీ కార్పొరేషన్ 179 మంది లబ్ధిదారులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా  23,462  లబ్ధిదారులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 36,323  మంది లబ్ధిదారులు  ఎంపిక చేయడం జరిగిందని  పైప్రకటనలో తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు  స్థానిక కలెక్టరేట్లోని  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి  శంకర్ నారాయణ,  ప్రభుత్వ విప్, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Anantapur

2021-06-21 14:46:34