1 ENS Live Breaking News

మెగా వాక్సినేషన్ విజయవంతం..

శ్రీకాకుళంజిల్లాలో మెగా వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయింది. ప్రభుత్వం ఇచ్చిన 81 వేల డోసుల లక్ష్యం కాగా దానిని అధిగమించి జిల్లాలో అందుబాటులో ఉన్న వాక్సిన్ నిల్వలను ఉపయోగించుకుంటూ సాయంత్రం 6.15 గంటలకు 88 వేల మందికి వాక్సిన్ ఇచ్చి లక్ష్యాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లాతో సమానంగా లక్ష్యాలు ఇచ్చిన ఇతర జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది. జిల్లాలో వాక్సినేషన్ విజయవంతం చేయుటకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మార్గదర్శకత్వంలో ప్రణాళికలను రూపొందించారు. ఎక్కడా వాక్సిన్ వృధా కాకుండా ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్ధాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో అధికారులు ఏర్పాట్లు చేసారు. మూడు వందల సచివాలయాల పరిధిలో కోవాక్సిన్, కోవీషీల్డ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం మూడు వందల మందికి వాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంటూ చర్యలు చేపట్టారు. దానిని దిగ్విజయంగా సాధించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శ్రీకాకుళం కంపోస్టు కాలనీ, నరసన్నపేట మండలం కోమర్తి, నరసన్నపేట, పోలాకి మండలం ఈదులవలస తదితర ప్రాంతాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. తన పర్యటనలో భాగంగా అధికారులు, సిబ్బంది, ప్రజలను కలిసి వాక్సినేషన్ పై అవగాహన కలిగించారు.  

జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం తదితర ప్రాంతాల్లో తనిఖీ చేయగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట, లావేరు మండలం బెజ్జిపురం తదితర గ్రామాల్లో పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి ఇచ్చిన లక్ష్యాలను సునాయాసంగా సాధించుటకు చర్యలు చేపట్టారు. వాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో రద్దీ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. వాక్సినేషన్ కు వచ్చిన వారికి ప్రత్యేకంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేసారు. వాక్సినేషన్ అనంతరం పరిశీలన గదిలో అర గంట సేపు వాక్సిన్ తీసుకున్న వారిని కూర్చోబెట్టి తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి అధికారులు వివరించారు. శ్రీకాకుళం పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి పి.వి.ఎస్.ప్రసాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

            జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా వాక్సినేషన కార్యక్రమం విజవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. సమష్టి కృషితో, టీమ్ స్పిరిట్ తో దీనిని సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమీషనర్ జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రత్యేక అధికారులు, సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.శ్రీనివాసులు శ్రమించారని పేర్కొంటూ అభిందించారు. వీరి సహకారంతో రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో వాక్సినేషన్ కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాలను చేపట్టి విజయ పథంలో నడుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. శ్రీకాకుళం జిల్లాతో సమానంగా లక్ష్యాలు నిర్ధేశించిన జిల్లాల కంటే ఎక్కువ టీకాలు వేసి ఆయా జిల్లాల కంటే మొదటి స్ధానంలో ఉండటం గమనార్హమన్నారు. ప్రజలు మంచి సహకారం అందించి వాక్సినేషన్ కు ముందుకు వచ్చారని అభిందించారు. వాక్సినేషన్ పై అపోహలు అవసరం లేదని, వాక్సినేషన్ తో కోవిడ్ ను పారద్రోలవచ్చని కలెక్టర్ శ్రీకేష్ సూచించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారుల తల్లులకు, హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతను ఇస్తూ రెండవ డోసు వేయడంతోపాటు అర్హులకు మొదటి డోసును వేయడం జరిగిందని ఆయన వివరించారు. వాక్సిన్ వేసుకొనుటకు అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

Srikakulam

2021-06-20 13:37:44

డ్రైవర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ల శిక్షణకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అర్.టి.సి డివిజనల్ మేనేజర్  జి.వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. అర్.టి.సి డ్రైవింగ్ స్కూల్ లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లుగా  ఇప్పటి వరకు రెండు బ్యాచ్ ల లో నైపుణ్యం తో కూడిన శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగిందన్నారు. మూడవ బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందని,  ఆసక్తి గల అభ్యర్థులు ఎల్.ఏం.వీ లైసెన్స్ ,హెవీ ఎల్.ఎల్.ఆర్, ఆధార్ కార్డుతో డివిజనల్ మేనేజర్ కార్యాలయం,ఎ.పి.యస్.ఆర్.టి.సి. కాంప్లెక్స్ శ్రీకాకుళంలో  ధరఖాస్తు  చేసుకోవాలని డివిజనల్ మేనేజర్ కోరారు. ఫీజు, ఇతర వివరాలకు 7382921920,  9441161051 నంబర్లకు సంప్రదించ వచ్చని ఆమె పేర్కన్నారు.

Srikakulam

2021-06-20 13:31:09

అర్. టి.సి. బస్సు ట్రిప్పులు పెంపు..

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వలన ఆర్.టి.సి బస్సుల రవాణా పెంచుతున్నట్లు డివిజనల్ మేనేజరు జి. వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచడం వలన ప్రజా రవాణా పెంచుతున్నామని,   శ్రీకాకుళం -1 డిపో నుండి 42 బస్సులు, శ్రీకాకుళం-2 డిపో నుండి 44 బస్సులు, పాలకొండ డిపో నుండి 42 బస్సులు, పలాస డిపో నుండి 46 బస్సులు, టెక్కలి  డిపో నుండి 35 బస్సులు మొత్తం 209 బస్సులు తిప్పుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు గమనించి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Srikakulam

2021-06-20 13:25:42

వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కి విశేష స్పందన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 572 సచివాలయాల పరిధిలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు మంచి స్పందన వచ్చిందని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారు,  5 సంవత్సరాలు లోపు పిల్లల ఉన్న తల్లులు వ్యాక్సినేషన్ వేయించుకునేందు కోవిడ్ నిబంధనలు పాటించి ముందుకు వచ్చారని పేర్కొన్నారు.  స్పెషల్ డ్రైవ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జివిఎంసి ఏరియాలో ఒక లక్ష వ్యాక్సినేషన్ వేయాలని టార్గెట్ ఇచ్చిందని, దానిని అధిగమించి అన్ని సచివాలయాల పరిధిలో ఒక లక్షా పదివేల మందికి వ్యాక్సినేషన్ వేయించామన్నారు. ఇందుకు జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు ప్రత్యేక అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఎంతో కృషిచేసి స్పెషల్ డ్రైవ్ ను విజయవంతం చేశారని వారందరికీ కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

విశాఖ సిటీ

2021-06-20 13:19:34

అప్పన్న ఆలయంలో ప్రత్యక్ష సేవలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి ప్రత్యక్షసేవలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు సడలించడంతో స్వామిని నేరుగా దర్శించుకుని సేవల్లో పాల్గొనే వారికి అవకాశం కల్పించినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. కళ్యాణోత్సవం, గరుడసేవ, అష్టోత్తర పూజలు ప్రత్యక్షంగా నిర్వహించామన్నారు. వీటితో పాటు నేరుగా సేవల్లో పాల్గొనలేనివారు ఆన్ లైన్ ద్వారా కూడా పాల్గొన్నారని చెప్పారు. టిఎంఎస్ వెబ్ సైట్ ద్వారాగానీ దేవస్థానం ఈఓ కార్యాలయ అకౌంట్ కు గానీ ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లించి కూడా  పరోక్ష సేవల్లో పాల్గొనవచ్చునని ఈఓ వివరించారు. 

Simhachalam

2021-06-20 12:35:54

Simhachalam

2021-06-20 12:27:03

రేపటి నుంచి అప్పన్న అన్నప్రసాదం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి దర్శనార్ధం వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఆలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఈ ప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో అందించనున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి స్వామివారి దర్శనాలు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భక్తులందరూ కోవిడ్ ప్రొటోకాల్ విధిగా పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈఓ కోరారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలను ఇప్పటికే ప్రారంభించి భక్తులకు అందిస్తున్నట్టు ఈఓ చెప్పారు.

Simhachalam

2021-06-20 12:26:23

Simhachalam

2021-06-20 12:25:04

సింహాద్రి అప్పన్నకు రూ.లక్ష విరాళం..

సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి ఆదివారం విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన సింహాద్రి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని స్వామివారికి రూ.1,00,000 విరాళం అందించారు. నిత్యన్నదాన పథకానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు.  తనకొచ్చే లాభాల్లో ఒకశాతం స్వామివారికి విరాళమివ్వడం  ఆనవాయితీగా పాటిస్తున్నానని దాత తెలియజేశారు. ఈ మొత్తం యొక్క చెక్ ను పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్ లో అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-20 12:18:55

Simhachalam

2021-06-20 12:14:03

ఆదివారం చందన లభ్యత30 కేజీలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి సమర్పించే  మూడో విడత చందనం అరగదీత ప్రక్రియ లో భాగంగా ఆదివారం మొత్తం 30 కిలోల చందనం లభ్యమైనట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ రోజు నుంచి మరో ఒక్కరోజు మాత్రమే చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించి ఈ నెల 24వ తేదీ జ్యేష్ట పూర్ణిమ సందర్బంగా స్వామివారికి మూడో విడత చందన సమర్పణ సమర్పిస్తారు. అదే రోజు స్వర్ణ పుష్పార్చన, శ్రీమణవాళ మహామునుల మాస తిరునక్షత్రం ఉంటుందన్న ఈఓ స్వామివారికి చందనం సమర్పించాలనుకునే భక్తులు అరకిలోకి రూ.10,116 ,  కిలోకి 20,116 సమర్పించుకోవచ్చునన్నారు. అరకిలో చందన సమర్పణ చేసినవారికి 200 గ్రాముల చందనం చెక్క, కేజీ సమర్పించినవారికి 300 గ్రాముల చందనం ముక్కతోపాటు శేష వస్త్రం  ప్రసాదంగా ఇస్తారని వివరించారు. చందన సమర్పణకు ఆన్ లైన్లో సొమ్ము చెల్లించాక చిరునామా, గోత్రనామాలతో పాటు వివరాలను స్క్రీన్ షాట్ తీసి  6303800736 వాట్సప్ నంబర్ కు పంపించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అప్పన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.

Simhachalam

2021-06-20 12:13:08

అజ్ఞాత భక్తుడి విరాళం రూ.2.8లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి  అజ్ఞాత భక్తుడు(వ్యాపారవేత్త) ఆదివారం రూ.2,08,116( రెండు లక్షల ఎనిమిమిదివేల నూట పదహారు రూపాయలు) విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని ఈఓ పేరుతో చెక్కును పీఆర్వో కౌంటర్ లో అందజేశారు. దాత మాట్లాడుతూ, ఎంతో దూరం నుంచి స్వామి చూసేందుకు భక్తులు వస్తారని అలాంటి వారికి స్వామివారి ప్రసాదం అందించే  శ్రీ సింహాద్రినాథుని నిత్యాన్నదానం పథకానికి ఈ మొత్తం  వెచ్చించాలని ఆ భక్తుడు కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ భక్తుడికి ఈఓ ఎంవీ సూర్యకళ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Simhachalam

2021-06-20 12:08:10

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మర్గం..

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ శాశ్వత పరిష్కారమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న 64వ వార్డు సచివాలయంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, నగర మేయర్ మహమ్మద్ వసీం సలీంలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 22 లక్షలమందికిపైగా వ్యాక్సినేషన్ వేసినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జిల్లాలో 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు 8 నుంచి 10 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 90 వేల మందికి వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా కరోనా కూడా తగ్గుముఖం పట్టిందని, సోమవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు కూడా సడలిస్తోందన్నారు. అయితే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని సూచించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆదివారం ఉదయం నుంచి చేపట్టినట్లు, జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాకు కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 90 వేల మందికి వాక్సినేషన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇందుకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ముఖ్యంగా తల్లులకు, ఐదు సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు వ్యాక్సినేషన్ వేసేలా లక్ష్యం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే 45 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టాలని తెలియజేయడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు, వాలంటీర్లను భాగస్వామ్యం చేసి వ్యాక్సినేషన్ పట్ల ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం మాట్లాడుతూ చిన్న పిల్లలు ఉన్న తల్లులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం గొప్ప కార్యక్రమమన్నారు. తమ పిల్లల ఆరోగ్యం కోసం తల్లులు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ వేయాలన్నదే సిఎం జగనన్న సంకల్పమన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే మూడో వేవ్ వచ్చినా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేయడం జగనన్న ముందు చూపుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  పివివిఎస్ మూర్తి, కార్పొరేటర్లు శాంతి సుధా, చంద్రమోహన్ రెడ్డి, దాదా ఖలందర్, రాధాకృష్ణ, హెల్త్ సెక్రెటరీ మహేశ్వరి, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-20 11:03:52

RMCANA ఆక్సిజన్ పరికరాల వితరణ..

కోవిడ్ నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లో రోగులకు ప్రాణవాయువును అందించేందుకు ఉపయోగపడే 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రంగరాయ మెడికల్ కాలేజ్ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్ఎంసీఏఎన్ఏ) సమకూర్చింది. అదే విధంగా ఆక్సిజన్‌పై ఉన్న రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు చేర్చేందుకు, వివిధ పరీక్షల కోసం ఆసుపత్రిలో ల్యాబ్‌ల‌కు పంపించేందుకు ఉపయోగపడే 10 ఆక్సిజన్ సిలిండర్ హోల్డింగ్ కేజ్ ట్రాలీలను రూ.1,08,500 ఖర్చుతో డాక్టర్ ఎం.భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్టు సమకూర్చింది. జీజీహెచ్‌లో రోగులకు సేవలందిస్తున్నకోవిడ్ వారియర్లు అయిన హౌస్ సర్జన్లకు అందించేందుకు వీలుగా రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ.66 వేల ఖర్చుతో 200 నాణ్యమైన ఫేస్ షీల్డ్‌ల‌ను సమకూర్చారు. వీటిని ఆదివారం జీజీహెచ్‌లో ఆర్ఎంసీఏఎన్ఏ, డాక్టర్ ఎం.భానుప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధి డా. ఎస్వీ లక్ష్మీనారాయణ.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరుల చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అందించారు. కార్యక్రమంలో జీజీహెచ్ కోవిడ్ ప్రత్యేక నోడల్ అధికారి సూర్య ప్రవీణ్‌చంద్‌, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-20 10:13:41

జిల్లాలో ఆక్సిజన్ నిల్వకు లోటు లేదు..

కోవిడ్ నేపథ్యంలో జిల్లాలో ప్రజలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం మేరకు పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఆక్సిజన్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం  కాకినాడ జీజీహెచ్‌లో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ రూ.52 లక్షలతో ఏర్పాటుచేసిన 20 కిలో లీటర్ల సామర్థ్యంగల ఆక్సిజన్ ట్యాంకును కలెక్టర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, సంస్థ యాజమాన్యంతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు ఉపయోగపడే ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటుకు సహకరించిన, రూ.14 లక్షల విలువైన వెంటిలేటర్లను కూడా అందించిన అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్ ఛైర్మన్ కరటూరి సత్యనారాయణమూర్తిని మంత్రి, కలెక్టర్, జేసీలు అభినందించి, శాలువాతో సత్కరించారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా యుద్ధప్రాతిపదికన ట్యాంకు ఏర్పాటు పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్‌ను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ పిలుపు మేరకు సరైన సమయంలో స్పందించి ఎందరో దాతలు సరైన సహకారాన్ని అందించారని, వారందరినీ అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ కట్టడికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని, అత్యధిక జనాభా కలిగిన జిల్లాలో మరణాల రేటును తగ్గించేందుకు, ఉభయ గోదావరి జిల్లాలకు కీలకమైన కాకినాడ జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం 50 కిలో లీటర్ల సామర్ధ్యం ఆస్పత్రి కి సమకూరిందన్నారు. కోవిడ్ కట్టడికి కృషిచేస్తున్న గ్రామ వాలంటీర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది 24X7 పనిచేస్తూ రోగులకు సేవలందిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు కూడా స్వీయ క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ అధికార యంత్రాంగానికి సహకరిస్తూ కోవిడ్ కట్టడికి కృషిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో వ్యాక్సిన్‌కు కొరత లేదని.. 45 ఏళ్లకు పైబడిన వారు, అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీకా వేయించుకోవాలని మంత్రి వేణుగోపాలకృష్ణ సూచించారు. 

జిల్లాలో డోసుల అందుబాటును బట్టి దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో  అందరికీ టీకా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం 1,50,000 డోసుల పంపిణీ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్ కార్యక్రమం సజావుగా సాగుతోందని, ప్రజలు అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి కోవిడ్ కట్టడికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. 

Kakinada

2021-06-20 10:10:55