1 ENS Live Breaking News

రక్తదానం నిరంతర ప్రకియ కావాలి..

శ్రీకాకుళం జిల్లాలో రక్తదానం చేయడం నిరంతర ప్రక్రియ కావాలనికలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్  వైద్యులు, ఆర్గనైజర్లు, వాలంటీర్లను కోరారు. ప్రపంచ రక్తదాన వారోత్సవాల ముగింపు సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి   జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత రక్తదానం చేసేందుకు కృషిచేసిన వైద్యులు, వివిధ సంస్థలను, ఆర్గనైజర్లను, వాలంటీర్లకు జ్ఞాపికను అందజేస్తూ దుశ్శాలువ, పుష్పగుచ్చంతో కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అన్నిదానాల్లో కంటే రక్తదానం గొప్పదని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారందరూ రక్తదానం చేసేందుకు ముందుకురావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మానవత్వంతో రక్తదాతలు ముందుకురావాలని,  ఒకరు రక్తదానం చేయడం వలన ఇద్దరి ప్రాణాలను కాపాడినవారవుతారని అన్నారు. ముఖ్యంగా తలసేమియా, శస్త్రచికిత్సల సమయంలో, ప్రమాదాలకు గురికాబడిన వ్యక్తులకు ఈ రక్తం ఎంతో ఆవశ్యకమని, అటువంటి వారికి మీరిచ్చే రక్తం వలన వారితో రక్త సంబంధాలు ఏర్పడినట్లు అవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రక్తదానం చేసి వేరే ప్రాణాలను నిలిపినందుకు మీకు సంతృప్తి లభిస్తుందని, ఆ సంతృప్తి కోసమే మీరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

రక్తదానం చేసిన యువతకు, రక్తదానం చేయడానికి ప్రోత్సహించిన వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలిపిన కలెక్టర్ జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం రక్తదానం చేసేందుకు యువతను ప్రోత్సహించిన డా. భాస్కర్, డా.అవినాష్, డా.విశ్వనాథ్, ఆర్.సంతోష్ కుమార్, యస్.రాంబాబు, వై.శ్రీనివాసకుమార్, యస్.సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, ప్రసాద్, ఎ.గురుప్రసాద్, కె.విజయశంకర్, పి.కేదారేశ్వరీ, రాజశేఖర్, ఓ.సత్యనారాయణ, జె.లక్ష్ణణసాయి, ఎ.దుర్గారావు, జి.గోవింద్, వి.రాజు, ఎం.అసిరినాయుడు, ఎ.రాజేశ్, పి.లీలాకృష్ణ, బి.గోపిలకు కలెక్టర్ జ్ఞాపిక, దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

          ఈ కార్యక్రమంలో లయన్ డా.కృష్ణమోహన్, ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు సర్వేశ్వరరావు, డా.దేవభూషణరావు, ట్రెజరర్ లయన్ పి.రవికుమార్, వైద్యులు, వివిధ సంస్థల ఆర్గనైజర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-21 13:00:32

కలెక్టర్ కార్తికేయ మిశ్రా కీర్తిపతాక..

కార్తికేయ మిశ్రా ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అందరికీ అయితే ఒక ఐఏఎస్ అధికారి అనే..కానీ ఈయన కార్యదీక్ష, విధినిర్వహణ, లక్ష్యాలు చేరుకునే సంఖ్య మాత్రం ఎప్పుడూ మొదటి స్థానమనే విషయం కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలుసు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రకటించగానే పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే టీకా పంపిణీలో ముందుండాలని ఆదేశించడంతో పాటు అమలుచేసిన చూపిన డైనమిక్ కలెక్టర్ గా రాష్ట్రప్రభుత్వం సాధించిన ప్రగతిలో అగ్రభాగంలో నిలిచారు.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కోవిడ్ వేక్సినేషన్ ఉదయం 8గంటలకు ప్రారంభిస్తే రాత్రి తొమ్మిది గంటలకు తొలిస్థానంలో నిలిచి లక్షా 60 వేల 822 మందికి కోవిడ్ వేక్సిన్ అందించి టాప్ వన్  స్థానంలో నిలిచారు. దీనితో మరోసారి పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మరోసారి వార్తొల్లోకి ఎక్కారు. కాగా తూర్పుగోదావరి 154754 తో రెండో స్థానంలో ఉండగా, క్రిష్ణాజిల్లా 3వ స్థానంలో 139980, విశాఖపట్నం 111726 నాల్గవ స్థానం, 5వ స్థానంలో గుంటూరు 106435,  6వ స్థానంలో చిత్తూరు 101291లో ఉండగా, 7వ స్థానంలో ప్రకాశం 99898, 8వ స్థానంలో శ్రీకాకుళం 85816, 9వ స్థానంలో అనంతపురం 86008, 10వ స్థానంలో నెల్లూరు 79016, 11వ స్థానంలో కర్నూలు 78655, 12వ స్థానంలో డా.వైఎస్సార్ కడప 76743,13వ స్థానం మరియు ఆఖరి స్థానంలో విజయనగరం 61160లో నిలిచింది.

West Godavari

2021-06-20 16:42:48

కోవిడ్ వేక్సినేషన్ డ్రైవ్ విజయవంతం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఆదివారం చేపట్టిన కోవిడ్ మెగా వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ఆశించిన దానికంటే మించి విజయవంతం అయ్యింది. రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి మించి వాక్సినేషన్ జరగడంతో జిల్లా అధికారుల నుంచి మండల, క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా సంతోషం వ్యక్తమవుతోంది. శుక్రవారం సాయంత్రం విడియో కాన్ఫరెన్స్ లో మెగా వాక్సినేషన్ డ్రైవ్ కోసం ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ లు కార్యాచరణకు దిగారు. అదే రోజున పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం, మండల పరిధిలోని ఎం.పి.డి.ఓ.లు, మునిసిపల్ కమిషనర్ లతో జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ సమావేశాలు నిర్వహించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేలా పర్యవేక్షణ చేశారు. మరో వైపు ఏ.ఎన్.ఎం.లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు తదితర  క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహణలో ఇప్పటికే తగిన అనుభవం కలిగి వుండటం వల్ల ప్రత్యేక డ్రైవ్ ను సులువుగా పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకే సిబ్బంది వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల కూడా ఎక్కువ మంది వాక్సిన్ వేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రోజంతా ప్రతి గంట కు నివేదికలు రప్పించుకొని తక్కువగా వాక్సినేషన్ జరిగిన మండలాల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేస్తూ జాయింట్ కలెక్టర్ డా. మహేష్ కుమార్ జిల్లా కేంద్రం నుండే పర్యవేక్షణ చేశారు. జిల్లా పరిషత్ సి ఇ ఓ టి. వేంకటేశ్వర రావు తన పరిధిలోని ఎం.పి.డి.ఓ.లతో రోజంతా మాట్లాడుతు వారిని ఉత్సాహ పరిచారు. వీరందరి కృషి ఫలించి రాత్రి 7 గంటల సమయానికి జిల్లాలో 58,005 మందికి వాక్సిన్ వేయగలిగారు. రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Vizianagaram

2021-06-20 14:36:09

ఆర్బీకేలు రైతన్నకు దిక్సూచి కావాలి..

రైతుకు సంబంధించి ప్రతి అవసరం స్థానిక రైతు భరోసా కేంద్రంలోనే లభించాలని, ఏ ఒక్క రైతు ఊరి పొలిమేర దాటకుండానే వ్యవసాయానికి సంబంధించిన ఏ విషయమైనా పరిష్కారం కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృఢ సంకల్పమని రాష్ట్ర  రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల  మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.  ఆదివారం జిల్లా పరిషత్  కన్వెన్షన్ సెంటర్ లో  ఖరీఫ్ సాగు సమాయత్తంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర  రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ), రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు  (నాని)లు హాజరయ్యారు.  ఈ  సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ  రైతుల కోసం ఇప్పటికే  ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని, అందులో భాగంగా రైతు భరోసా క్రింద ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని,ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.  అంతేకాక పంటలకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రం వద్దే నియమితులై  ఉంటారన్నారు. జిప్సం , జింకు తదితర పోషకాలు మొదలుకొని విత్తనాలు ,ఎరువులు పురుగు మందులే కాకుండా వరి ధాన్యం విక్రయించుకోవాలన్నా రైతుభరోసా కేంద్రమే  రైతన్నకు దిక్సూచి కావాలన్నారు. 

కృష్ణాజిల్లాలో రైతు భరోసా కేంద్రాల నుంచి నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ అధీకృత పంపిణీ  విధానం ద్వారా రైతులకు అందచేస్తుందని మంత్రి పేర్ని నాని  చెబుతూ, ఒకవేళ ప్రభుత్వం పంపిణీ చేసిన ఒకవేళ సరిగా విత్తనం మొలకెత్తకపోయినా  ఆ నష్టాన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోని నాసి రకం విత్తనం కొనుగోలు చేసిన  ఏ ఒక్క రైతుని నష్టపర్చనీయదని తెలిపారు. ఒక నమ్మకమైన వ్యవస్థ ద్వారా రైతులు మేలైన విత్తనాలు పొందడం ఒక మంచి పద్దతని ఇదే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆకాంక్ష అని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు 11 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే పొందారని,  ఆ విషయాన్ని దృస్టలో ఉంచుకొని రైతులను చైతన్యపర్చి ఈ ఏడాది కనీసం 30 వేల క్వింటాళ్ల నుంచి 50 వేల క్వింటాళ్ల వరకు విత్తనాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో  వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేటి సమీక్షా సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేయని, ఖరీఫ్ లో సాగుచేయవద్దని సూచించే 10 రకాల వారి వంగడాలపై విస్తృతమైన ప్రచారం చేయాలనీ మంత్రి కృష్ణాజిల్లా సహకార బ్యాంకు అధికారులకు సూచించారు. ఈమేరకు గ్రామాలలో వివిధ కూడళ్లలో పెద్ద ఫ్లెక్సీ లను ఏర్పాటుచేయాలని కోరారు అలాగే ,  కరపత్రాలను ముద్రించి ప్రభుత్వం కొనుగోలు చేయని వర రకాల గురించి రైతులలో అవగాహన పెంపొందించాలన్నారు. 
    
          ఉచితంగా పంటల భీమా అమలు చేస్తున్న రాష్ట్రం మనదని, అలాగే రైతులకు వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించడమే కాకుండా  9 గంటల నాణ్యమైన విద్యుత్ ను  అందిస్తున్నామని అన్నారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా 99 శాతం రైతు  సమస్యలు అక్కడే తీరిపోతాయని చెప్పారు. కృష్ణాజిల్లాలో గత ఏడాది వారి పంటను  2 లక్షల 30  వేల 475 ఎకరాలు ఖరీఫ్ సాగు జరిగిందని హెక్టారుకు 5, 265 కిలోల ధాన్యం  దిగుబడి లభించిందన్నారు. ఈ ఏడాది వరిపంట తర్వాత పప్పు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగుకు పెద్ద పీట వేయనున్నట్లు పప్పు ధాన్యాలు, అపరాలు, నూనె గింజల సాగు పెంచడంపై కూడా అధికారులు ప్రత్యేక  దృష్టి పెట్టాలని ఈ మేరకు రైతుల్లో అవగాహన పెంచాలని మంత్రి సూచించారు. ప్రతి నెల పంటలకు వేసే ఎరువులను బట్టి ఆ నెల అవసరాలతో అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.  యూరియా డీఏపీ, ఎంఓపీ వంటి పలురకాల రసాయనిక ఎరువులు రైతులకు అవసరమవుతాయి. ప్రస్తుతం రైతుల అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి పేర్ని నాని కోరారు. 

     కృష్ణాజిల్లాలో  4, 826 మంది లబ్ధిదారులకు సంబంధించిన  జగనన్న తోడు పథకం తాలూకా నగదు కేడీసీసీ బ్యాంకు ద్వారా 4 కోట్ల 82 లక్షల 60 వేలు రూపాయలను లబ్ధిదారులకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జాయింట్ కలెక్టర్ మాధవీలత చేతుల మీదుగా ఆ చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.  ఈ సమీక్షా సమావేశంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత, మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి , జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టి. మోహనరావు,  కె డి సి సి  బ్యాంకు సి ఇ  ఓ  ఎ . శ్యామ్ మనోహర్ ,  సివిల్ సప్లైస్ డి ఎం కె. రాజ్యలక్ష్మి , జెడ్పి సి ఇ  ఓ  పి ఎస్ సూర్యప్రకాశరావు, మచిలీపట్నం తహసిల్దార్ సునీల్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.      

Machilipatnam

2021-06-20 13:56:32

స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి..

కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు, కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పని సరిగా వేయించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. ఆదివారం మద్యాహ్నం మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్ నియోజక వర్గం పండూరు పిహెచ్సి పరిధిలో వాకలపూడి జడ్పి హైస్కూల్లోని వాక్సినేషన్ కేంద్రంలో నిర్వహించిన టీకామహోత్సవ కార్యక్రమానికి హాజరైయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 10 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.  ఇంతటి భారీ స్థాయిలో టీకాల పంపిణీ చేసే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని, రాష్ట్రంలో ఆదర్శవంతమైన రీతిలో పటిష్టంగా పనిచేస్తున్న గ్రామసచివాలయాలు, వలంటీరు  వల్లే ఇది సాధ్యమైందన్నారు.  వీటి రూప శిల్పి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ముందు చూపుకు, పాలనా దక్షతలకు ఈ సంస్కరణలు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్లు, గ్రామ సచివాలయాలు ప్రభుత్వపరమైన ఏ సమాచారమైన, సంక్షేమ లబ్దినైనా కొన్ని గంటలల్లోపే లక్ష్యిత ప్రజలు సమగ్రంగా అందిస్తున్నారని తెలిపారు.

  45 ఏళ్లు దాటిన ప్రజలు, 5 ఏళ్లలోపు బిడ్డలున్న తల్లులకు ఆదివారం కాకినాడ రూరల్ నియోజక వర్గం పరిధిలోని కాకినాడ రూరల్ మండలంలో 3500, కరప మండలంలో 1500, నగర డివిజన్లలో 1000  వెరసి 6000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోందన్నారు.  కోవిడ్ నివాణకు మాస్కులు ధరించడం, చేతుల శుభ్రత, వ్యక్తుల మద్య భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ రక్షణ జాగ్రతలను ప్రతి ఒక్కరూ విధిగా పాటిస్తూ, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పని సరిగా వేయించుకోవాలని మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా కోరారు.  అలాగే కాకినాడ రూరల్ నియోజక వర్గంలో ఆదివారం టీకా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న యండిఓ, పిహెచ్సి వైద్యాధికారులు, సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, టీకా వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు  అందరినీ మంత్రి ప్రత్యేకం అభినందించారు. ఈ కార్యక్రమంలో  కాకినాడ యంపిడిఓ పి.నారాయణమూర్తి, పండూరు పిహెచ్సి వైద్యాధికారి డా.నారాయణరావు, ఎఎంసి చైర్మన్ గీసాల శ్రీనివాసరావు, జమ్మలమడక నాగమణి, నులుకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-20 13:49:26

మెగా వాక్సినేషన్ విజయవంతం..

శ్రీకాకుళంజిల్లాలో మెగా వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయింది. ప్రభుత్వం ఇచ్చిన 81 వేల డోసుల లక్ష్యం కాగా దానిని అధిగమించి జిల్లాలో అందుబాటులో ఉన్న వాక్సిన్ నిల్వలను ఉపయోగించుకుంటూ సాయంత్రం 6.15 గంటలకు 88 వేల మందికి వాక్సిన్ ఇచ్చి లక్ష్యాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లాతో సమానంగా లక్ష్యాలు ఇచ్చిన ఇతర జిల్లాలతో పోల్చుకుంటే శ్రీకాకుళం జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది. జిల్లాలో వాక్సినేషన్ విజయవంతం చేయుటకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మార్గదర్శకత్వంలో ప్రణాళికలను రూపొందించారు. ఎక్కడా వాక్సిన్ వృధా కాకుండా ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్ధాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో అధికారులు ఏర్పాట్లు చేసారు. మూడు వందల సచివాలయాల పరిధిలో కోవాక్సిన్, కోవీషీల్డ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం మూడు వందల మందికి వాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంటూ చర్యలు చేపట్టారు. దానిని దిగ్విజయంగా సాధించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శ్రీకాకుళం కంపోస్టు కాలనీ, నరసన్నపేట మండలం కోమర్తి, నరసన్నపేట, పోలాకి మండలం ఈదులవలస తదితర ప్రాంతాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. తన పర్యటనలో భాగంగా అధికారులు, సిబ్బంది, ప్రజలను కలిసి వాక్సినేషన్ పై అవగాహన కలిగించారు.  

జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం తదితర ప్రాంతాల్లో తనిఖీ చేయగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట, లావేరు మండలం బెజ్జిపురం తదితర గ్రామాల్లో పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి ఇచ్చిన లక్ష్యాలను సునాయాసంగా సాధించుటకు చర్యలు చేపట్టారు. వాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో రద్దీ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసారు. వాక్సినేషన్ కు వచ్చిన వారికి ప్రత్యేకంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేసారు. వాక్సినేషన్ అనంతరం పరిశీలన గదిలో అర గంట సేపు వాక్సిన్ తీసుకున్న వారిని కూర్చోబెట్టి తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి అధికారులు వివరించారు. శ్రీకాకుళం పట్టణ కోవిడ్ ప్రత్యేక అధికారి పి.వి.ఎస్.ప్రసాద్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

            జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో మెగా వాక్సినేషన కార్యక్రమం విజవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. సమష్టి కృషితో, టీమ్ స్పిరిట్ తో దీనిని సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమీషనర్ జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రత్యేక అధికారులు, సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.శ్రీనివాసులు శ్రమించారని పేర్కొంటూ అభిందించారు. వీరి సహకారంతో రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో వాక్సినేషన్ కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాలను చేపట్టి విజయ పథంలో నడుస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. శ్రీకాకుళం జిల్లాతో సమానంగా లక్ష్యాలు నిర్ధేశించిన జిల్లాల కంటే ఎక్కువ టీకాలు వేసి ఆయా జిల్లాల కంటే మొదటి స్ధానంలో ఉండటం గమనార్హమన్నారు. ప్రజలు మంచి సహకారం అందించి వాక్సినేషన్ కు ముందుకు వచ్చారని అభిందించారు. వాక్సినేషన్ పై అపోహలు అవసరం లేదని, వాక్సినేషన్ తో కోవిడ్ ను పారద్రోలవచ్చని కలెక్టర్ శ్రీకేష్ సూచించారు. 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారుల తల్లులకు, హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యతను ఇస్తూ రెండవ డోసు వేయడంతోపాటు అర్హులకు మొదటి డోసును వేయడం జరిగిందని ఆయన వివరించారు. వాక్సిన్ వేసుకొనుటకు అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

Srikakulam

2021-06-20 13:37:44

డ్రైవర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ల శిక్షణకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అర్.టి.సి డివిజనల్ మేనేజర్  జి.వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. అర్.టి.సి డ్రైవింగ్ స్కూల్ లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లుగా  ఇప్పటి వరకు రెండు బ్యాచ్ ల లో నైపుణ్యం తో కూడిన శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగిందన్నారు. మూడవ బ్యాచ్ శిక్షణ ప్రారంభం కానుందని,  ఆసక్తి గల అభ్యర్థులు ఎల్.ఏం.వీ లైసెన్స్ ,హెవీ ఎల్.ఎల్.ఆర్, ఆధార్ కార్డుతో డివిజనల్ మేనేజర్ కార్యాలయం,ఎ.పి.యస్.ఆర్.టి.సి. కాంప్లెక్స్ శ్రీకాకుళంలో  ధరఖాస్తు  చేసుకోవాలని డివిజనల్ మేనేజర్ కోరారు. ఫీజు, ఇతర వివరాలకు 7382921920,  9441161051 నంబర్లకు సంప్రదించ వచ్చని ఆమె పేర్కన్నారు.

Srikakulam

2021-06-20 13:31:09

అర్. టి.సి. బస్సు ట్రిప్పులు పెంపు..

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపు వలన ఆర్.టి.సి బస్సుల రవాణా పెంచుతున్నట్లు డివిజనల్ మేనేజరు జి. వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచడం వలన ప్రజా రవాణా పెంచుతున్నామని,   శ్రీకాకుళం -1 డిపో నుండి 42 బస్సులు, శ్రీకాకుళం-2 డిపో నుండి 44 బస్సులు, పాలకొండ డిపో నుండి 42 బస్సులు, పలాస డిపో నుండి 46 బస్సులు, టెక్కలి  డిపో నుండి 35 బస్సులు మొత్తం 209 బస్సులు తిప్పుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు గమనించి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Srikakulam

2021-06-20 13:25:42

వేక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కి విశేష స్పందన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 572 సచివాలయాల పరిధిలో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు మంచి స్పందన వచ్చిందని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారు,  5 సంవత్సరాలు లోపు పిల్లల ఉన్న తల్లులు వ్యాక్సినేషన్ వేయించుకునేందు కోవిడ్ నిబంధనలు పాటించి ముందుకు వచ్చారని పేర్కొన్నారు.  స్పెషల్ డ్రైవ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జివిఎంసి ఏరియాలో ఒక లక్ష వ్యాక్సినేషన్ వేయాలని టార్గెట్ ఇచ్చిందని, దానిని అధిగమించి అన్ని సచివాలయాల పరిధిలో ఒక లక్షా పదివేల మందికి వ్యాక్సినేషన్ వేయించామన్నారు. ఇందుకు జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, డాక్టర్లు, నర్సులు, వార్డు ప్రత్యేక అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఎంతో కృషిచేసి స్పెషల్ డ్రైవ్ ను విజయవంతం చేశారని వారందరికీ కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

విశాఖ సిటీ

2021-06-20 13:19:34

అప్పన్న ఆలయంలో ప్రత్యక్ష సేవలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి ప్రత్యక్షసేవలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు సడలించడంతో స్వామిని నేరుగా దర్శించుకుని సేవల్లో పాల్గొనే వారికి అవకాశం కల్పించినట్టు ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. కళ్యాణోత్సవం, గరుడసేవ, అష్టోత్తర పూజలు ప్రత్యక్షంగా నిర్వహించామన్నారు. వీటితో పాటు నేరుగా సేవల్లో పాల్గొనలేనివారు ఆన్ లైన్ ద్వారా కూడా పాల్గొన్నారని చెప్పారు. టిఎంఎస్ వెబ్ సైట్ ద్వారాగానీ దేవస్థానం ఈఓ కార్యాలయ అకౌంట్ కు గానీ ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లించి కూడా  పరోక్ష సేవల్లో పాల్గొనవచ్చునని ఈఓ వివరించారు. 

Simhachalam

2021-06-20 12:35:54

Simhachalam

2021-06-20 12:27:03

రేపటి నుంచి అప్పన్న అన్నప్రసాదం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి దర్శనార్ధం వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఆలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఈ ప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో అందించనున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి స్వామివారి దర్శనాలు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భక్తులందరూ కోవిడ్ ప్రొటోకాల్ విధిగా పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈఓ కోరారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలను ఇప్పటికే ప్రారంభించి భక్తులకు అందిస్తున్నట్టు ఈఓ చెప్పారు.

Simhachalam

2021-06-20 12:26:23

Simhachalam

2021-06-20 12:25:04

సింహాద్రి అప్పన్నకు రూ.లక్ష విరాళం..

సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి ఆదివారం విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన సింహాద్రి హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని స్వామివారికి రూ.1,00,000 విరాళం అందించారు. నిత్యన్నదాన పథకానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు.  తనకొచ్చే లాభాల్లో ఒకశాతం స్వామివారికి విరాళమివ్వడం  ఆనవాయితీగా పాటిస్తున్నానని దాత తెలియజేశారు. ఈ మొత్తం యొక్క చెక్ ను పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్ లో అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-20 12:18:55

Simhachalam

2021-06-20 12:14:03