1 ENS Live Breaking News

క్లాప్ తో క్లీన్ అనంతగా మారిపోవాలి..

క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో అనంత నగరపాలక సంస్థ కూడా క్లీన్ గా మారిపోవాలని నగర మేయర్ వసీం సలీమ్ అన్నారు. శుక్రవారం క్లీన్ ఆంధ్రప్రదేశ్  కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  నగర పాలక సంస్థ పరిది లో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ, మన ఇంటి పరిసరాలతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు సహకరించే విధంగా వారిని చైతన్య పరచాలన్నారు. పేరుకు పోయిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడంతోపాటు, నగరం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేలా అధికారులు, సిబ్బంది క్రుషి చేయాలన్నారు. శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  డిప్యుటీ మేయర్ వాసంతి సాహితీ, మునిసిపల్ కమిషనర్ .వి.వి యస్ మూర్తి, డిప్యుటీ కమిషనర్ రమణా రెడ్డి , అనిల్ 37 వ కార్పొరేటర్, టౌన్ ప్రాజెక్ట్ అధికారి  విశ్వజ్యోతి, సిటీ మిషన్ మేనేజర్ శ్రీనివాస రెడ్డీ,  కమ్యునిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:34:05

భక్తులందరికీ అప్పన్న లడ్డూ ప్రసాదం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ప్రసాదం కొరత లేకుండా చేసేందుకు దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్ తరువాత ప్రసాద అమ్మకాలను ప్రారభించిన దేవస్థానం. వాటి సంఖ్యను రోజు రోజుకీ పెరగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా పెంచుతున్నారు. శుక్రవారం ఈ మేరకు లడ్డూ తయారీ పోటు కేంద్రాన్ని ఈఓ ఎంవీ సూర్యకళ సందర్శించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు శని, ఆదివారాల్లో అధికంగా వస్తారని అందరికీ ప్రసాదం అందుబాటులో ఉండే విధంగా సరిపడినన్ని లడ్డూలు తయారు చేయాలని ఆదేశించారు.  అదే సమయంలో లడ్డూ రుచి, వాసన, బరువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని పోటు సిబ్బంది ఆదేశించారు. లడ్డు తయారీ విధానాన్ని స్వంయగా పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈఓ రాఘవ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరిబాబు, దినేష్ రాజు తదితరులుల పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:31:45

ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి..

కరోనా నేపథ్యంలో గ్రామాల్లో ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. గ్రామాల్లో కరోనా నేపథ్యంలో చేపడుతున్న ఫీవర్ సర్వే ని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి పరిశీలించాలన్నారు. ఫీవర్ సర్వేని జాగ్రత్తగా చేపట్టాలని, ఫీవర్ సర్వే లో జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వారి జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఆదేశించారు. గ్రామాల్లో శానిటేషన్ ప్రక్రియను నిరంతరం జరిగేలా చూడాలని శానిటేషన్ సెక్రటరీలకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, డిపిఓ పార్వతి, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కల్యాణి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:27:45

అప్పన్నకు రూ.లక్ష విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారికి విశాఖకు చెందిన బాపూజీ నగర్ దంపతులు ప్రభాకర్ రెడ్డి , విజయలక్ష్మి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయం వెలుపల  ఈఓ ఎంవీ సూర్యకళకు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఈ మొత్తాన్ని విరాళంగా సమర్పించినట్టు దాతలు తెలియజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలను తీసుకోవడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాన్ని కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:25:10

సింహాద్రి నాధునికి స్పీకర్ పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్పీకర్ కుటుంబం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ను రూపుమాసిపోయి ప్రజలు సాధారణ పరిస్థితి వచ్చేలా దీవించాలంటూ స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా స్వామివారి ఆలయ అభివ్రుద్ధికి తనవంతు క్రుషి చేస్తానని హామీఇచ్చారు. అంతకు ముందు దేవాలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాన్ని అందించారు.  ఈఓ స్పీకర్ కుటుంబానికి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టుబోర్టు సభ్యులు, సూరిబాబు, దినేష్ రాజులు పాల్గొన్నారు.

Simhachalam

2021-06-18 14:22:00

3వ విడత నాడు-నేడు పూర్తిచేయాలి..

మనబడి నాడు-నేడు కింద చేపట్టిన మొదటి దశ పనులను జూన్ మూడో వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్సు హాలు నందు మనబడి నాడు-నేడు పనులపై జిల్లా  విద్యా, అనుబంధ రంగాల శాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్వాంగసుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులు పై ఉన్నదని ఆమె తెలిపారు. పది రకాల సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం  పాఠశాలలలో ఉండే విధంగా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు. తొలిదశ పాఠశాలల్లో  వివిధ పనులు రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు, విద్యుత్తు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రక్షిత మంచి నీరు, విద్యార్థులకు, సిబ్బంది, ఫర్నిచర్, రిపేర్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు గదులు తదితర పలు పనులపై సంబంధిత ఎస్ఈ పి ఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, సంబంధిత ఇంజనీర్లతో ఆరా తీశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా    పది రకాల సౌకర్యాలను జిల్లాలోని మొదటి విడత  నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగాన్ని జిల్లాలో సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేసి ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని తెలిపారు.

జూలై నుంచి నాడు-నేడు రెండవ విడత పనులను చేపట్టాల్సి ఉంటుందని, అందువలన మొదటి దశలో అక్కడక్కడా మిగిలిపోయిన మైనర్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు క్రియాశీలకంగా పని చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతుల కల్పన చేయాలన్నారు. వాల్ పెయింటింగ్స్, డిజిటల్ తరగతులు, మంచి నీటి వసతి తదితర అంశాల్లో లోపాలు ఉండకూడదన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి, విద్యా శాఖపై డిఈవో శామ్యూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ, ఇంజనీర్లు శివరాం ప్రసాద్, శివ కుమార్, ఎస్ ఈ పంచాయతీ రాజ్ శాఖ భాగ్యరాజ్, ఆర్ఐఓ నాయక్,  పాలిటెక్నిక్, ప్రభుత్వ ఐ టి ఐ, ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-18 14:19:20

మత్తు పదార్ధాల నిర్మూలనే లక్ష్యం..

తిరుపతి నగరంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్ములించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రుపతిలో శుక్రవారం సాయంత్రం ఆయన భవాని నగర్, సప్తగిరి నగర్, అన్నారావు సర్కిల్, కేటీ రోడ్డు, గలివీధి, చిన్నబజారు వీధి, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, తాతయ్య గుంట ప్రాంతాల్లో ఆయన కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా , ఎన్ని శక్తులు అడ్డు తగిలినా ఉక్కుపాదంతో తొక్కేస్తామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్టు, లేదా బెదిరిస్తున్నట్టు తన సెల్ ఫోన్ కి కాల్ చేస్తే తగు విధంగా స్పందించి, చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.  తి
 కొంత మంది యువకులు మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన చెందారు. ఇలాంటి ఇప్పటికైనా ఇలాంటి యువకులు, చైతన్య వంతులు కావాలన్నారు.  మత్తు పదార్థాల నిర్ములన  కోసం పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని, పోలీసు యంత్రంగం  పనితీరును  ప్రశంసించారు. స్థానికులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలను విక్రయించే వారిపై నిఘా ఉంచి, విక్రయాల లింక్ ను తుంచి వేస్తామన్నారు. మత్తును అంతముందించే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.  గంజాయి స్థావరాలను గుర్తించి, వారి భరతం పట్టేందుకు భూమన నిత్యం నగరంలో కాలినడన .. పర్యటిస్తూ, మత్తు రాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.

Tirupati

2021-06-18 14:15:32

అలిపిరి వరకూ గరుడ వారధి..

తిరుపతిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మించాల్సి ఉందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగే బోర్డ్ మీటింగ్ లో ఈ విషయం పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుమల లో శుక్రవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుపతిలో  ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. ఈ మేరకు తాను పరిశీలన జరిపినట్లు చైర్మన్ తెలిపారు. గరుడ వారధి ఇప్పుడు ముగిసే చోటి నుంచి  అలిపిరి వరకు నిర్మించడానికి కొత్తగా అంచనాలు తయారు చేయించేలా శనివారం బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి  వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కళ్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పునః ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా, కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయామన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్టీ, ఎస్సీ,బీసీ, మత్స్యకార గ్రామాల్లో 500 ఆలయాలు నిర్మించాలనే నిర్ణయం కూడా  కోవిడ్ వల్ల అమలు చేయలేక పోయామని ఆయన తెలిపారు.

 రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసే అంశం మీద నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. గత ఏడాదిన్నరగా కోవిడ్ వల్ల జన జీవనం ఇబ్బందిగా తయారైనా, టీటీడీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రపంచ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేలా ఆశీస్సులు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాట పర్వం పారాయణం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు చైర్మన్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అంశం కూడా శనివారం నాటి సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.

Tirupati

2021-06-18 14:14:47

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం..

దేశ చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో, గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌ని విధంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల విప్ల‌వాన్ని సృష్టించామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అన్నారు. కేవ‌లం రెండేళ్ల‌లోనే రికార్డు స్థాయిలో 6ల‌క్ష‌ల‌, 3వేల‌, 756 మందికి త‌మ ప్ర‌భుత్వం, ఉద్యోగాలను క‌ల్పించింద‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో, 2021-2022 సంవ‌త్స‌రానికి సంబంధించిన జాబ్ కేలండ‌ర్‌ను శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ విధానంలో ముఖ్య‌మంత్రి విడుద‌ల చేశారు. ఈ ఏడాది సుమారుగా 10,143 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  విద్య‌, వైద్యం, పోలీసుశాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీకి ప్రాధాన్య‌త‌నిస్తూ, ఎపిపిఎస్‌సి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డిఎస్‌సీ త‌దిత‌ర నియామ‌క సంస్థ‌ల ద్వారా ప్ర‌తీ నెలా నోటిఫికేష‌న్ల‌తో పార‌ద‌ర్శ‌కంగా నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని అన్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డ‌మే కాకుండా, ఉద్యోగుల సంక్షేమానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను సిఎం వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, జిల్లా ఉపాదిక‌ల్ప‌నాధికారి వై.ర‌వీంద్ర‌కుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-18 14:08:14

ఆదివారం మెగా కోవిడ్ వేక్సిన్ డ్రైవ్..

విజయనగరం జిల్లాలో ఆదివారం మెగా వాక్సినేషన్ డ్రైవ్ జిల్లాలో చేపట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. 45 ఏళ్ల పైబడిన వారికి, 0-5 ఏళ్ల లోపు పిల్లలు గల తల్లులకు ఈ డ్రైవ్ లో వాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి రాత్రి వరకు జిల్లాలోని కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలన్నింటి లో వాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. కోవిషీల్డ్ వాక్సిన్ ను వేస్తారని తెలిపారు. ఈ డ్రైవ్ లో సుమారు 50 నుంచి 60 వేల మందికి ఒకే రోజున వాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయా వాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వాక్సిన్ వేయించుకోవాలని జె.సి. సూచించారు.

Vizianagaram

2021-06-18 14:07:21

పల్సస్ ఉద్యోగులకు ఉచితంగా కోవిడ్ టీకా..

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే కోవిడ్ టీకా తప్పక వేయించుకోవాలని పల్సస్ సిఈఓ డా. గేదెల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం విశాఖ క్యాంపప్ లో ఉద్యోగుల రక్షణార్ధం అందరికీ కోవిడ్ టీకాలు ఉచితంగా  వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంస్థలోని 2వేల మంది ఉద్యోగులకూ కోవిడ్ టీకా అందిస్తున్నామన్నారు. తొలివిడతగా 500 మందికి అందించామన్నారు. ఉదోగుల ఆరోగ్య భద్రతే సంస్థకు ప్రధానమని  చెన్నై, డిల్లీ , హైదరాబాద్ లోని తమ కంపెనీల్లో ఉద్యోగులందరికీ  ఉచితంగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని  ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాక్సినే శ్రీరామ రక్షగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-18 12:40:55

నిరుద్యోగ యువత ఆకాంక్షనెరవేరాలి..

నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగ నియమాకాల్లో నవశకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2021–22 సంవత్సరం జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ళ పాలనలో రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మొత్తం 6,03,756 భర్తీ చేయటం జరిగిందన్నారు. జాబ్ క్యాలెండర్ 2021–2022 ద్వారా జూలై నుంచి మార్చి 2022  వరకు వివిధ ప్రభుత్వ శాఖలలో 10,143 ఉద్యోగాలు నియమకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు జారీ చేసే నెల వివరాలు తెలియజేయటం జరిగిందన్నారు. అవినీతి, వివక్షతకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందని, ఇంటర్వూల విధానంకు పూర్తిగా స్వస్తి చెబుతూ అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయ్, పాల్గొన్నారు.

Guntur

2021-06-18 12:31:00

బుద్ధపార్క్ ను తక్షణమే శుభ్రపరచండి..

దసపల్లా బుద్ధపార్క్ కళాహీనంగా ఉందని, వెంటనే పార్కును శుభ్రం చేయించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. శుక్రవారం  నాలుగవ జోన్ 28 వ వార్డు పరిధిలోని జివిఎంసి సివిక్ ఎక్ష్నొరా దసపల్లా హిల్స్ బుద్ధ పార్క్, దసపల్లా హిల్స్ పరిసర ప్రాంతాలలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పార్క్  అనంతరం దసపల్లా హిల్స్ తదితర ప్రాంతాలలో నివాసిత ఇళ్ల నుండి డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, పారిశుద్ధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. చెత్త సేకరించిన వెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించాలని, దసపల్లా హిల్స్ పరిసర ప్రాంతాలలో భవన నిర్మాణ వ్యర్ధాలను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి వార్డు శానిటరి  కార్యదర్శి వీధులలో పర్యటించి, పారిశుద్ధ్య కార్మికులచే రోడ్లు, కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ యాప్రాన్ బ్లౌజులు, చేతి గ్లౌజులు, మాస్కులు ధరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్స్పెక్టర్ మరియు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-18 12:27:17

ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వితరణ..

కరోనాతో పోరాడే రోగుల ఆరోగ్య పరిరక్షణకు ‘గమన’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఉచింతగా అందజేయడం అభినందనీయమని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ ఛాంబర్ లో తుళ్ళూరు మండలం, అనంతవరం గ్రామానికి చెందిన ‘గమన’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 9 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అప్పారావు, పుష్పరాజు, మధుబాబు, రమేష్ లను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ వారి దాతృత్వాన్ని అభినందించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కరోనాకు గురై  ఇబ్బందులు పడుతున్న బాధితుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో వస్తున్న వైద్యపరికరాలను ఉపయోగించి రోగులకు అత్యవసర చికిత్సను అందించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ‘గమన’ సంస్ధ ప్రతినిధులు ఇచ్చిన 9 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కోవిడ్ బారినపడి వైద్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న రోగులకు వినియోగించాలని కోరారు.  ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను 29 గ్రామాల పరిధిలోని పిహెచ్ సి లకు అందించాలని వైద్యాదికారులకు ఆదేశిస్తామన్నారు.  ‘గమన’ సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ కోవిడ్ నిర్మూలనకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్ దినేష్ కుమార్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు, ‘గమన’ స్వచ్ఛంద సంస్థ  అధ్యక్షులు అప్పారావు, ఉపాధ్యక్షులు పుష్పరాజు, సెక్రటరీ మధుబాబు, కో- ఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-18 12:22:51

జిజిహెచ్ కి ఎస్బీఐ పిపిఈ కిట్ల వితరణ..

కోవిడ్ నివారణకు  భారతీయ స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువ లేనిదని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం గుంటూరు నగరం పాలెం భారతీయ స్టేట్ బ్యాంక్ జిల్లా రీజనల్ బ్యాంక్  ఆవరణలో కరోనా నియంత్రణ కోసం గుంటూరు సమగ్ర వైద్యశాలకు రూ.7 లక్షల విలువైన 1500 పిపిఈ కిట్లను  జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా,రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా మహ్మమారిని ఎదుర్కొనేందుకు దాతల సహరం అవసరమని అన్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఎన్.జి.వొ, అధికారులు, స్వచ్చంద సంస్థలను కలిపి నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సామాజిక సేవలలో  భాగంగా గుంటూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి కి నోడల్ ఏజన్సీ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సాంఘీక సంక్షేశాఖ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు నేతృత్వంలో దాతలు అందించిన సాయాన్ని ప్రణాళికా బద్ధంగా అవసరమైన వారికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతనెల 20 న ఎస్.బి.ఐ ఫౌండేషన్ ద్వారా గతంలో రెడ్ క్రాస్ సొసైటి కి రూ.8 లక్షల వైద్య పరికరాలను అందించినట్లు  భారతీయ స్టేట్ బ్యాంక్ గుంటూరు రీజనల్ మేనేజర్ తారకేశ్వరరావు వెల్లడించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులంతా బ్యాంక్ లావాదేవిలను ఎస్.బి.ఐ  యోనో డిజిటల్  అప్లికేషన్ ద్వారా సేవలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మధుసూదనరావు, గుంటూరు సమగ్ర ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రభావతి, గుంటూరు ఎస్.బి.ఐ అమరావతి సర్కిల్ పరిపాలన కార్యాలయ ఛీప్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్.బి.ఐ ప్రధాన శాఖ మేనేజర్ సుబ్రహ్మణ్యం, యూనియన్ సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస చారి, ఫణి తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-18 12:19:10