చిత్తూరు జిల్లాలోని కౌండిన్య వైల్డ్ లైఫ్ విభాగం ఉన్న ప్రాంతాలలో బారీగా ఏనుగులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి ప్రజలను కాపాడేందుకు స్వల్ప వ్యవధిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తే ప్రభుత్వానికి పంపుతామని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు.. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అటవీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై జిల్లాలో ఏనుగుల మరణాలు , రైతులకు జరిగిన నష్టం పై సమీక్షించారు. ఈ సంధర్భంగా వెస్ట్ డి.ఎఫ్.ఓ రవి శంకర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతలైన పలమనేరు,పుంగనూరు, కుప్పం, చిత్తూరు అటవీ ప్రాంతాలను కలుపుకుంటూ సుమారు ఆరు వేల హెక్టార్ లలో కౌండిన్య ఎలీఫేంట్ జోన్ ఉందని ఈ ప్రాంతంలో 2012 లో ఎనిమిది ఏనుగులు సంచరించేవని, ప్రస్తుతం 70 నుంచి 90 ఏనుగులు ఉన్నాయని, 2013 నుండి ఇప్పటి వరకు 9 ఏనుగులు వివిధ కారణాలతో మరణించడం జరిగిందని, ఏనుగుల దాడులలో 10 మంది వ్యక్తులు మరణించారని, 37 ఆవులు మరణించగా, 9 మంది మనుషులను గాయ పడ్డారని తెలిపారు . పలమనేరు ప్రాంతంలో 4,610 హెక్టార్లకు గాను 3,426.8 హెక్టర్లు ఫెన్సింగ్ వేయడం జరిగిందని, మిగతా ప్రాంతంలో ఫెన్సింగ్ లేక పోవడం వల్ల ఈ ప్రాంతాలలో ఏనుగులు ఎక్కువగా సంచరించడం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవల కాలంలో గ్రూపులుగా ఉన్న ఏనుగులు విడిపోవడం వల్ల అవి భయంకరంగా మారి స్వభావం మార్చుకొని దాడులకు పాల్పడుతున్నాయన్నారు. అటవీ ప్రాంతoలో అనేక చెరువులు మరియు మేతగా కొన్ని రకాల వృక్షాలు ఉన్నాయని, అయితే అప్పుడప్పుడు అటవీ ప్రాంతం సమీపంలో గల చెరుకు, వరి, అరటి, మామిడి, బీన్స్ వంటి పంటల రుచులు చూడడం వల్ల ఎక్కువగా పంటల పై దాడులు చేస్తూ అడ్డం వచ్చినప్పుడు వ్యక్తుల పై దాడులకు పాల్పడుతున్నాయన్నారు.
ఇప్పటికే జిల్లాలో ఫెన్సింగ్ మరియు కందకాలు తవ్వడం జరిగిందని అయితే ఫెన్సింగ్ గ్యాప్ ఉన్న చోట బయటకు వస్తున్నాయని అదే విధంగా కందకాలలో కొన్ని చోట్ల రాళ్ళు రావడం వల్ల ఆపివేయడం జరిగిందని అటువంటి ప్రదేశాలలో జనావాసాల వైపు దూసుకొస్తున్నాయన్నారు. ఇటీ వల కరోనా పరిస్థితుల వల్ల జాతీయ రహదారుల పైన ట్రాఫిక్ లేక పోవడంతో రోడ్ల పైకి కూడా వస్తున్నాయన్నారు. ఈస్ట్ డి.ఎఫ్.ఓ నరేంధిర న్ మాట్లాడుతూ కౌండిన్య ఎలిఫాంట్ జోన్ లో తిరుమల కొండలు ఉన్న శ్రీ వేంకటేశ్వర అభయా అరణ్యం, శేషాచల కొండలు కలసి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జాతీయ రహదార్లు ఉండడం వల్ల తరచూ రోడ్ల పైకి వస్తున్నాయని, ఈ ప్రాంతంలో సంచరిస్తూ మంచి ఆహారం దొరుకుతుండడo వల్ల వ్యవసాయ పొలాల పైన దాడులు చేస్తున్నాయన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఏనుగులు ఎక్కువగా ఉండడం మన అటవీ ప్రాంతాలు ఈ ప్రాంతాలతో కలిసి ఉండడం వల్ల అక్కడ్నుంచి మన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ఏనుగులు నుండి తమ పంటలను కాపాడుకోవాలని రైతులు భావించడం వల్ల ఏనుగుల పై దాడులకు వెళ్తున్నారని పలితంగా మరణిస్తున్నారని, వీరికి నష్ట పరిహారం ఎప్పటికప్పుడు చెల్లిస్తూ న్నామన్నారు. అయితె రైతులు నష్ట పరిహారం సరిపోదని తెలుపుతున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఏనుగులు సంచరించే ప్రాంతాలలో ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానికి సంబందించి నివేధిక తయారు చేయాలని, అదే విధంగా వ్యవసాయ పంటలను కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం గురించి, ఫెన్సింగ్, కాంద కాలతో పాటు శాశ్వతమైన చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు వ్వ్యవసాయ అనుబంధ శాఖాధికారుల తో సమావేశమై ఒక వారం లోపు ప్రణాళికలు సిద్దం చేయాలని ,వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ కింద అటవీ శాఖ సమన్వయం తో పనులు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.