1 ENS Live Breaking News

అనంతను ప్రగతిపథంలో నడిపిస్తా..

అనంతపురం జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కు జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డి ఆర్ ఓ గాయత్రీ దేవి, కలెక్టరేట్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆమె వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. తదనంతరం బదిలీ అయిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నుంచి అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత జిల్లా కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాలనేది నా ఆకాంక్ష అన్నారు. జిల్లాలో విజయవంతంగా పనిచేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు. జిల్లాలో అభివృద్ధి బాటలో నడిపించేందుకు జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా మిత్రులు ప్రజలు అందరూ సహకారం అందించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ కొంచెం తగ్గినప్పటికీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెకానిజంను అనుసరిస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రాధాన్యత ప్రకారం ముందుకు తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతకుముందు నూతన జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నిషా0తి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్, డి ఆర్ ఓ, తదితరులు అభినందనలు తెలియజేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు, సిబ్బంది తదితరులు జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

Anantapur

2021-06-11 09:35:20

జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోండి..

 కోవిడ్ బారినపడి విశాఖ జిల్లాలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  వినయ్ చంద్ ను కలిసి ఇందుకు సంబంధించిన
వినతి పత్రం సమర్పించారు. కరోనా రెండవ దశలో నగరంలో  పది మంది, రూరల్ ప్రాంతంలో ఆరుగురు కలిపి మొత్తం 16 మంది జర్నలిస్టులు మృతి చెందారన్నారు. ఇందుకు సంబంధించి వారి వివరాలు సంబంధిత  వినతిపత్రంలో పొందుపరిచామని కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు రావాల్సిన నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను శ్రీను బాబు కోరారు. అయితే  ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో చాలా మంది కుటుంబాలు దీనస్థితిలో ఉన్నాయని కాబట్టి వారికి ఏడాది కి సరిపోయే నిత్యవసర వస్తువులు అందజేసే విధంగా చూడాలని అందుకు తగిన విధంగా అధికారులకు  ఆదేశాలు ఇవ్వాలని శ్రీనుబాబు కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు శ్రీను బాబు వినతి పై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా జర్నలిస్టుల  కుటుంబాలు కు సాయం చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనుబాబు కలెక్టర్ ను ఘనంగా సత్కరించి, సింహాద్రి నాథుడి జ్ఞాపికను, చందన ప్రసాదం, శేష వస్త్రం బహుకరించారు.

Visakhapatnam

2021-06-11 09:27:22

సలహామండలి రైతులకి అండగా నిలవాలి..

చిత్తూరు జిల్లాలోని అత్యధికంగా రైతులు వున్నారని వ్యవసాయం జీవనాధారంగా సాగిస్తున్న నేపథ్యంలో   వ్యవసాయ సలహా మండలి మంచి సలహాలతో రైతులకు అధికదిగుబడి పలసాయం,  కాలానుగుణంగా అవసరమయ్యే సలహాలను  అందించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా ఎంపికైన పాలేరు రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి కావాల్సిన సూచనలు ఎప్పటికప్పుడు చేస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ అభివృద్ధికి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.  ప్రధానంగా టమోటా మామిడి విషయంలో ప్రత్యేక చర్యలు చాలా అవసరమని ఎక్కువగా వాణిజ్య పంటల మీద ఆధారపడితే రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని  అందుకోసం  శ్రమించాలని   సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 మంది కమిటీ సభ్యులను నియమించడం జరిగిందని విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువుగా ఉంటాయో సభ్యుల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు ఇతర మార్గాల ద్వారా విలువైన సూచనలు అందించాలని  చైర్మన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో లో బంగారు పాలెం మండలానికి చెందిన రైతు ప్రతినిధులు శిరీష్ రెడ్డి,శరత్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి లు పాల్గొన్నారు.

Tirupati

2021-06-11 09:20:04

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..

 తిరుచానూరు అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మా వతి అమ్మవారి దర్శ నార్థం ఆలయ మహా ద్వారం వద్ద కు చేరు కున్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఎన్.వి.రమణ దంపతులకు తిరు పతి,తిరుమల దేవ స్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,గౌ.  చంద్రగిరి శాసన సభ్యు లు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జేఈఓ సదా భార్గవి, టిటిడి పాలక మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి,టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి,ఏఈఓప్రభాకర్ రెడ్డి లు పుష్ప గుచ్ఛా  లతో స్వాగతం పలకగా వేద పండితులు పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనా లతో తీర్థప్రసాదాలు  అంద జేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంట ఏపీ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కె. లలిత కుమారి,గౌ.జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు,గౌ. ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్ లతోతిరుపతి అర్బన్ అడిషనల్  ఎస్.పి సుప్రజ వీరి వెంట పాల్గొన్నారు.

Tirumala

2021-06-11 09:12:28

పార్టీలు చూడరు..రాజకీయం చేయరు..

 రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల న్నింటినిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూర్చాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఏ పథకంలోనైనా లబ్దిదారుల ఎంపికలో ముఖ్యమంత్రి పార్టీలు చూడరని, రాజకీయం చేయరని కితాబిచ్చారు. రైతు పక్షపాతిగా తాను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రైతులకు మేలు కలిగించే విధంగా తీసుకుంటున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న విధానంతో సీఎం పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కురుపాం నియోజకవర్గస్థాయి సబ్సిడీ వరివిత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తాను తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా రైతులకు మేలు కలిగేవిధంగా తీసుకుంటున్నారని, అనుక్షణం రైతుల మేలు గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తమ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రైతుభరోసా ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చినా, రైతులకు మరింత త్వరగా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే రైతు భరోసాను ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ప్రశంసించారు. రైతుభరోసా సాయాన్ని అందించడంలోనూ, పంటల భీమా పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయడంలోనూ ముఖ్యమంత్రి ఎక్కడా పార్టీలను చూడలేదని, రాజకీయం చేయలేదని స్పష్టం చేసారు. ఈ పథకాలు మాత్రమే కాకుండా ఏ సంక్షేమ పథకమైనా అర్హతకలిగిన ప్రతి ఒక్కరికీ చేరాలని, తమ పార్టీకి ఓటు వేయని వారికైనా అర్హత ఉంటే అన్ని పథకాల్లోనూ లబ్ది చేకూర్చాలన్నది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని అభిప్రాయపడ్డారు. రైతు భరోసా,పంటల భీమా మాత్రమే కాకుండా ఆర్బీకేల్లో విత్తనాలు పంపిణీ చేసే వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. గతంలో రైతులు  విత్తనాల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారని, మండలాల కార్యాలయాల చుట్టూ తిరిగేవారని గుర్తు చేసారు. ఇప్పుడు మండలాఫీసులకు వెళ్లనవసరం లేకుండా ప్రతి సచివాలయ పరిధిలో రైతుభరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామస్థాయిలోనే విత్తనాలను అందిస్తున్నారని, గ్రామ స్థాయిలోనే ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను నియమించారని పుష్ప శ్రీవాణి తెలిపారు.విత్తనాలతో పాటుగా నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులను కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇదికాకుండా రైతులకు ఉచిత విద్యుత్తు, వైయస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్ల కేటాయింపు, మార్కెట్లో వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు, గిరిజన రైతులకు 90 శాతం సబ్బిడీతో విత్తనాలను కూడా అందిస్తున్నారని వివరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధానంతో జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అమలు చేసే ఏ పథకంలోనైనా అర్హత ఉంటేచాలు ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందన్నారు. ఏ పథకంలోనైనా అర్హత ఉండి కూడా లబ్ది కలగకపోతే సంబంధిత అధికారులకు, లేదా తమకు ఫిర్యాదు చేయాలని పుష్ప శ్రీవాణి సూచించారు. వైసీపీ మండల కన్వీనర్  మూడడ్ల గౌరీశంకర్ రావు, సర్పంచ్ కోట రమేష్ తోపాటుగా వ్యవసాయశాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జియ్యమ్మవలస

2021-06-11 08:23:46

జగన్న కాలనీల్లో పూర్తిస్థాయి వసతులు..

జగనన్న కాలనీలు సదుపాయాలకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లాఠకర్ అన్నారు. ఆదేశించారు. 2022 మార్చి నాటికి మొదటి దశ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయుటకు కృషి చేయాలన్నారు. దసరా నాటికి సిద్ధం చేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. జిల్లాలో జగనన్న కాలనీలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై రెవెన్యూ జాయింట్ కలెక్టర్ తో సంప్రదించాలని ఆయన ఆదేశించారు. సమయం వృధా కాకుండా పనులు కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే వాటిపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. కాలనీల్లో ప్రతి సౌకర్యం పూర్తి స్థాయిలో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని లే అవుట్లలో విద్యుత్తు స్తంభాలు, ఇతర పరికరాల వివరాలు అంచనా వేయాలని ఇపిడిసీల్ ఎస్.ఇ ని ఆదేశించారు. లే అవుట్లలో సరఫరా చేసిన సామగ్రి వివరాలు ప్రతి రోజు జాయింట్ కలెక్టర్ కు సమర్పించాలని ఆయన అన్నారు.

లే అవుట్ లో మౌళిక సదుపాయాలు కల్పించలేదు అంటే కనీసం వంద నుండి రెండు వందల కుటుంబాలకు సౌకర్యాలు లేదని గ్రహించాలని ఆయన సూచించారు. అన్ని లే అవుట్లలో సౌకర్యాలు కల్పించుటకు డిపిఆర్ లు తయారు చేయాలని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 24 లే అవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పించుటకు తయారు చేసిన డిపిఆర్ ల కాపీలను గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్ కు ఆయన ఆదేశించారు. జియో టాగింగ్ అన్ని ప్లాటులకు పూర్తి కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యం వహించేవారిని, పనులు సకాలంలో పూర్తి చేయని వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ అన్నారు. లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలని చెప్పారు. పాలకొండ, పలాస లలో కొంత వరకు బాగా జరిగిందని ఇంకా మెరుగుపడాలని ఆయన పేర్కొన్నారు. లే అవుట్లలో మోడల్ గృహాలు నిర్మించాలని ఆయన ఆదేశించారు. శాఖలకు అవసరమైన సామగ్రి ఆయా శాఖలు సమకూర్చుకొని పనులు వేగవంతం కావడానికి శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. లే అవుట్ల వారీగా అవసరమైన సిమెంట్, ఇనుము, ఇసుక తదితర సామగ్రి వివరాలు అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి లే అవుట్ వారిగా ఇసుక రేవులను మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సూచించారు. టెక్కలి లే అవుట్ లో ఇసుక లేదని తెలిపారని దానిని పరిష్కరించాలని గనుల శాఖ డిడిని ఆదేశించారు. వివిధ పథకాల క్రింద నిర్మిస్తున్న ఇళ్ల పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఉపకార్యనిర్వాహక ఇంజినీర్లు పూర్తి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

 

గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో 752 జగనన్న కాలనీల లే అవుట్లు ఉన్నాయని వాటిలో 729 లే అవుట్లలో చదును చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 663 లే అవుట్లు పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పారు.  41,243 ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు.

ఆర్.డబ్ల్యు.ఎస్ ఎస్.ఇ వి.వి.ఈశ్వర రావు మాట్లాడుతూ 520 లే అవుట్లలో నీటి సౌకర్యం కల్పించుటకు

ఇపిడిసీల్ లో విద్యుత్తుకు రిజిస్ట్రేషన్ చేసామని, 55 లే అవుట్లకు ఇప్పటికే విద్యుత్తు సరఫరా జరిగిందని తెలిపారు.

ఇపిడిసీల్ ఎస్.ఇ ఎల్.మహేంద్రనాథ్ మాట్లాడుతూ లే అవుట్లలో అవసరమగు సౌకర్యాలను అంచనా వేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు,  గృహ నిర్మాణ సంస్థ ఇఇ పి.కూర్మి నాయుడు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇఇ ఎస్.వీరభద్రరావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ జి.బ్రహ్మయ్య, భూగర్భ జలాలు, ఆడిటింగ్ శాఖ డిడి సి.సి.ఎస్ రావు, ప్రజారోగ్య శాఖ ఇఇ పి.సుగుణాకర రావు, డిపిఓ వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-11 08:17:10

బాల కార్మిక నిర్మూలన అందరి బాధ్యత..

అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం  జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె. వెంకట రావు కలెక్టర్ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జె. వెంకట రావు మాట్లాడుతూ బాల కార్మికులను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, యునిసెఫ్ లెక్కల ప్రకారం బాలకార్మికులు 160 మిలియన్ పెరిగినట్లు నివేదికలు ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.కరోనా సమయంలో తల్లిదండ్రులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలలు కార్మికులుగా మారిపోయే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. పిల్లలను పనిలో పెట్టినా, వారి చేత పని చేయించినా చట్టరీత్యా నేరం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భద్రత కల్పించాలి తప్ప, పిల్లలను పనికి పంపికూడదని తెలిపారు. బాల కార్మికులు ఎక్కడ, ఎవరికి కనిపించినా 1098,100,181 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ బాలలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు భారత రాజ్యాంగం కల్పించినప్పటికీ, ఈ బాలకార్మిక వ్యవస్థ ద్వారా బాలల హక్కుల ఉల్లంఘనలు జరుగుతుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరు వారి భద్రతకు భరోసా కల్పించాలని భాధ్యత ప్రతి ఒక్కరిదీ అని తెలిపారు. పేదరికం వలన ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను పెంచ లేని పరిస్థితుల్లో ఉంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారిని నేరుగా సంప్రదించాలని తెలిపారు. అటువoటివారికి విద్యా వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం  అధికారి సురగాల చిట్టిబాబు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సిబ్బంది బి.సాయి కుమార్, డిస్ట్రిక్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ సివికి కాలిబాబు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె వరలక్ష్మి, బవిరెడ్డి శంకర రావు తో పాటు వివిధ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ,తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-11 07:13:09

Simhachalam

2021-06-11 05:30:20

0-5 పిల్లల తల్లులకు కోవిడ్క్సి వేక్సినేషన్..

శ్రీకాకుళం జిల్లాలో  0 -5 ఏళ్ల వయస్సులోపు గల పిల్లల తల్లులకు కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.  ఇపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు  వయస్సు గల పిల్లల తల్లులకు వేక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన సందర్భంగా భాగంగా 0-5 ఏళ్ల వయస్సులోపు గల పిల్లల తల్లులకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డా. యస్.కె.చాందిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వేక్సినేషన్ తీసుకున్న తల్లులు వారం రోజుల పాటు తగు జాగ్రత్తలు పాటించాలని, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే బలవర్ధకమైన ఆహారం, తాజా కాయగూరలు, పండ్లు తీసుకోవాలని చెప్పారు. వారంలోగా తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే పారసిటామాల్ మాత్రను మాత్రమే తీసుకోవాలని, ఇతర మందులు ఏమీ తీసుకోరాదని ఆమె సూచించారు. ఇంటివద్ద నున్న తల్లులు బరువైన పనులు మాని, తేలికపాటి పనులను మాత్రమే చేసుకోవాలని అన్నారు. ఇతర సమస్యలు ఏమైనా తలెత్తితే దగ్గరలోని వైద్యుని సంప్రదించాలని ఆమె తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ బి.విశ్వేశ్వరరావు, సూపర్ వైజర్ ఆర్.జె.నాయుడు, యన్.అప్పలరాజు, యస్.సంపత్ మరియు ఇతర సచివాలయ సిబ్బంది కలిసి ఇపుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్ల లోపు గల పిల్లల తల్లులకు వేక్సినేషన్ చేశారు.

Srikakulam

2021-06-10 17:18:35

ఆపదలో ఆదుకున్నవారే నిజమైన దేవుళ్లు..

కరోనా లాంటి ఆపద  సమయంలో సహాయం చేయడానికి ముందుకి వచ్చిన దాతలు పేదల పాలిట నిజమైన దేవుళ్లని, అలాంటి వారి మేలు మరువరాదని ద్రోణంరాజు శ్రీవాత్సవ పేర్కొన్నారు. గురువారం విశాఖలోని  1 టౌన్ జగన్నాధస్వామి ఆలయంలో దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు జ్ఞాపకార్ధం వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద అర్చకులకు నిత్యవసర సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ,  సంఘం గౌరవాధ్యక్షులు టిఎస్సార్ పర్యవేక్షణలో ఇలాంటి మంచి కార్యక్రమం నాల్గవ దఫా చేయడం ఆనందంగా వుందన్నారు. కరోనా సమయంలో నిరుపేద అర్చకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకి వచ్చిన సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావురు చరణ్ కుమార్ , లక్ష్మీ కన్నతల్లి, కె. రాంభద్రుడు ,శంకర్ నీల్, విప్పాని మురళీకృష్ణ , ఆలయ ప్రధాన అర్చకులు  జగన్నాదాచార్యులు , ఆనంతాచార్యులు, అరుణ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-10 17:14:03

రైతుల జాబితా అందజేయండి..

శ్రీకాకుళం జిల్లాలో ఏ ఏ రైతుకు ఏ ఏ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కావాలో మండలాల వారీగా తెలియజేయాలని వ్యవసాయ శాఖ జెడి ని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన  వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలపై కంపెనీ డీలర్లుతో కమిటీ తో ఆయన సమావేశం నిర్వహించారు.  పరికరాలకు సంబంధించిన  40 శాతం సబ్సిడీ రైతులకు వస్తుందని ఆయన చెప్పారు.  పరికరాల తయారీ దారులతో ధరలపై మాట్లాడాలన్నారు. డీలర్లు ఫైనల్ ధరలను తెలియజేశారు.  డిసిసిబి బ్యాంకు నుండి బుణం ఆలశ్యం లేకుండా చూడాలని సిఇఓ కు చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్ ఎడి, రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, డిడి రాబర్ట్ పాల్, ఆయా కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-10 15:52:57

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు..

గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్థ పూర్వ,  గర్భస్థ దశలో పరీక్ష నిర్దారణ నిరోధక చట్టం -1994 సంవత్సరం మరియు దీనికి సంబంధించిన నిబంధనలు 1996 సంవత్సరం  నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె. యాస్మిన్ పేర్కొన్నారు.   గురువారం స్థానిక జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని  డియం అండ్ హెచ్ ఓ  ఛాంబర్ లో పీసీ అండ్ పీఎన్డిటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె.యాస్మిన్ అధ్యక్షతన  జరిగింది.  ఈ సమావేశంలో డా. జె. యాస్మిన్ మాట్లాడుతూ క్రొత్త స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ పై డియం అండ్ హెచ్ ఓ కు సమాచారం ఇవ్వవలసి వుంటుందన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ను 5 సంవత్సరాలకొకసారి రెన్యూవల్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్స్ ను రద్దు చేయడం జరుగుతుందన్నారు.  స్కానింగ్ సెంటర్లలో సిబ్బంది మార్పు జరిగినప్పుడు, క్రొత్త స్కానింగ్ మిషన్స్  కొనుగోలు అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లాలో 23 హోస్పిటల్స్ క్రొత్త రిజిస్ట్రేషన్స్ కొరకు, రెన్యూవల్ కొరకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు.  మిషన్స్  మార్పులు చేర్పుల రిజిస్ట్రేషన్స్ కొరకు 22 దరఖాస్తుల అందగా,  అనుమతి  కొరకు జిల్లా అప్రాప్రియేట్ ఆధారీటీ వారికి పంపడం జరిగింద న్నారు.  జిల్లాలో స్కానింగ్ సెంటర్స్ 372  ఉన్నట్లు తెలిపారు. ఏవైనా రిజిస్ట్రేషన్స్ లేని  స్కానింగ్ సెంటర్స్  వెనువెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. లేని పక్షంలో అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో పరీక్షలు చేసేటప్పుడు  పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయ అనే విషయం తల్లితండ్రులకు తెలియజేస్తున్నట్లు వైద్యాధికారి  దృష్టికి వస్తే  స్నానింగ్ సెంటర్స్ ను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కానింగ్ సెంటర్స్ లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసినా   టోల్ ఫ్రీ నెంబర్ 102, 104 కి ఫోన్ చేసి సమాచారం అందించ వచ్చాన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్ల పై సెక్షన్ల వారీగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.  
  ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారి టీ. జయసింహా, గైనకాలజిస్ట్ హెచ్ ఓడి డా. పి.చంద్ర శేఖర్, పిల్లల డాక్టర్ జిజిహెచ్ డా. ఆర్. గిరీష్, అసిస్టెంట్ ప్రోపిసర్ మెడికల్ కళాశాల డా. సిహెచ్. సుధాకర్,  ఐద్వా తరపున ఎల్. అరుణ,  సీడ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. 

Guntur

2021-06-10 15:33:12

కోవిడ్ లో విద్యాకార్యదర్శిల సేవలు అమోఘం..

కోవిడ్-19 కాలంలో విద్యా కార్యదర్శుల సేవలు మరువరానివని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ డి.ఇ.ఒ. శ్రీనివాస్,   వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తీవ్రస్థాయిలో ఉన్న కాలంలో ధైర్యంతో విద్యా కార్యదర్శులు 104కాల్స్ ను తీసుకోవడం, మొబైల్ వ్యానుల ద్వారా సచివాలయ పరిధిలో కరోనా సోకిన వారికి   సేవ చేయడం, ప్రతి పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ టెస్టులుకు ఐ.డి. క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్ సెంటర్లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం వంటి పనులు చాల బాగా నిర్వహించారని కొనియాడారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పై స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని అందరు సర్వీసు రిజిస్టర్లు తెరవాలని, ఇంకా సర్వీసు రిజిస్టర్లు తెరవని వారు వెంటనే అధికారులకు తెలియాజేయాలని తెలిపారు. కార్యదర్శులు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజల నుంచి మన్ననలు పొందాలని తెలిపారు.
అనంతరం డి.ఇ.ఒ. శ్రీనివాస్ మాట్లాడుతూ కోవిడ్ లాంటి కష్టకాలంలో విద్యా కార్యదర్శులు నిబద్దతతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేశారని తెలిపారు. సచివాలయాలలో కార్యదర్శులకు అవసరమైన మౌళిక  సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, త్వరలోనే మీ ద్వారా నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడతామని తెలిపారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డి.ఇ.ఒ. శ్రీనివాస్, వార్డు సచివాలయ విద్యా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-10 14:31:56

జలక్రీడలపై నివేదిక సమర్పించండి..

విజయనగరం జిల్లాలో జల క్రీడల్లో శిక్షణ పునరుద్ధరించే విషయమై తనకు నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె. వెంకటరావు సెట్ విజ్ సి ఇ ఓ ను ఆదేశించారు. జామి మండలం తాటిపూడి జలాశయం వద్ద నిర్మాణంలో ఉన్న జల క్రీడల అకాడమీ భవనాన్ని జె.సి. వెంకటరావు గురువారం సందర్శించి ఈ అకాడమీ ప్రస్తుత పరిస్థితి పై సిఇఓ విజయ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. యువతకు కయాకింగ్, కన్నోయింగ్ తదితర జల క్రీడల్లో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు గతంలో మంజూరు చేశారని వివరించారు. ఈ అకాడమీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని జె.సి. పేర్కొన్నారు. ఏ.పి. సంక్షేమ మౌళిక సదుపాయాల సంస్థ ఈ.ఈ. కూడా పర్యటనలో పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-10 14:02:27