1 ENS Live Breaking News

వేక్సినేషన్ లో అనంత ముందుండాలి..

అనంతపురం  జిల్లాలోని వైద్య రంగానికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు.  శనివారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు కోవిడ్ స్ట్రాటెజిక్ ప్లానింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా నిర్వహించి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచేవిధంగా పనిచేయాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని, అదే సమయంలో వేగంగా ఫలితాలు వెల్లడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య రంగంలో ఉన్న పలు శాఖలకు చెందిన డీఎంహెచ్ఓ, సీసీజీహెచ్, సూపర్ స్పెషాలిటీ, సీసీహెచ్ వంటి అధికారులందరూ సమన్వయంతో పని చేసి కోవిడ్ ను కట్టడి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ  చెయ్యాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను సందర్శించాలన్నారు. కరోనా పరీక్షల నమూనాలను గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సేకరించాలని ఆదేశించారు. కోవిడ్ మూడో వేవ్ రూపంలో మరో సారి విజృంభించినా సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. 

వ్యాక్సినేషన్ విధానంలో చేసిన మార్పులకు అనుగుణంగా జిల్లాలో వయస్సుతో నిమిత్తం లేకుండా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేయాలన్నారు. ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకాలు వేసే ప్రక్రియ పకడ్బందీగా సాగాలన్నారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. రోగి హోమ్ ఐసోలేషన్ ఉన్న సమయంలో ఉదయం 8 గంటల నుండి ప్రతి 4 గంటలకు ఒకసారి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, జ్వరం, శ్వాస ప్రక్రియ, పల్స్ రేటు , బిపి, మరియు ఆక్సిజన్ స్థాయిలను గమనించి వాటి విలువలు చార్ట్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, తాత్కాలిక ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు-సరఫరా గురించి కలెక్టర్ ఆరా తీశారు. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్ కేసులు, మరణాలు , వ్యాక్సినేషన్, హోమ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఫీవర్ సర్వే లపై డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ ,సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, కోవిడ్ నోడల్ ఆఫీసర్ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-12 15:33:12

సింహాద్రి అప్పన్నకు అవంతి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అంతరాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకుని, ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఈఓ మంత్రికి ముత్తంశెట్టికి  ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

Simhachalam

2021-06-12 15:31:30

అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి నిత్యన్నదాన పథకానికి విశాఖ  సీతమ్మధారకు చెందిన  దంపతులు  ఎస్వీఎస్ఎల్ఎన్  శాస్త్రి - ప్రభావతి  శనివారం రూ.1,00,116 విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఈఓ సూర్యకళకి దాతలు అందించారు.  తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా  జూన్ 12న అన్నదానం చేయాలని కోరారు. ఆ చెక్కుని ఆలయ ఈఓ ఎంవీసూర్యకలకు సమర్పించారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని పూజలు చేసి అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి భక్తులు వస్తుంటారని అలాంటి వారికి ఒక్కపూటైనా తమవంతుగా భోజనం పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ మొత్తాన్ని నిత్యన్నాధాన పథకానికి సమర్పిస్తున్నామన్నారు. ఆలయ అధికారులకు దాతలకు ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-12 15:29:53

టీమ్ వర్క్ తో రాష్ట్రస్థాయి గుర్తింపు..

అనంతపురంలో జిల్లా అధికారులందరూ టీం వర్క్ తో పనిచేసి రాష్ట్ర స్థాయిలో అనంత జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను కోరారు.. శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డాక్టర్ ఏ. సిరి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ లతో కలిసి జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులందరూ టీం వర్క్ తో పని చేసి రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.అలాగే జిల్లా కలెక్టర్ చే నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. 
వివిధ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు, ఇతర అంశాలకు సంబంధించి కోర్టుల నుండి నోటీసులు అందిన మొదటి రోజు నుంచే దానిపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించాల్సి ఉందన్నారు. ప్రతి శాఖకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటారు కనుక ,వారి తరఫున ఆయా శాఖలకు సంబంధించిన కేసులో జిల్లా అధికారులే ఎప్పటికప్పుడు సకాలంలో కోర్టుకు పూర్తి వివరాలు సమర్పించాలన్నారు.అప్పుడే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టరేట్ లో ఒక సెట్ అప్ ను ఏర్పాటు చేసుకోవాలని  డిఆర్వో గాయత్రీ దేవి కి కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-11 16:58:37

అప్పన్నకు ఎమ్మెల్యే వాసుపల్లి పూజలు..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ  నరసింహస్వామిని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకే ఏఈఓ రాఘవకుమార్  స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై  కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. కరోనా తగ్గి జనజీవనం సాధారణ స్థితికి రావాలని స్వామిని వేడుకున్నట్టు ఎమ్మెల్యే వాసుపల్లి తెలియజేశారు. అనంతరం ఆలయ ఏఈఓ ఎమ్మెల్యే  ప్రసాదాలను అందించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-11 16:24:27

పేదలందిరికీ పథకాలు చేరాలి..

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజలందరికీ  అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం కలక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సంయుక్త కలెక్టర్ ( రైతు బరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్.దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అబివద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( ఆసరా,సంక్షేమం) శ్రీధర్ రెడ్డి లతో కలసి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, గ్రామ సచివాలయాలు,  రైతు భరోసా, వైఎస్సార్ క్లీనిక్ భవనాల నిర్మాణం, ప్రాధమిక ఆరోగ్య వైద్య కేంద్రాలలో నాడు – నేడు, అర్బన్ హెల్త్ క్లీనిక్స్, ఇళ్ల పట్టాల పంపిణీ, వాహన మిత్ర, వాలంటీర్ల  నియామకం వంటి అంశాలపై జిల్లాలోని పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన పది వేల ఇళ్ళ  శంఖుస్థాపన  కార్యక్రమంపై  ఆరా తీశారు. దీనిపై స్పందించిన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణు గోపాల రావు 86 శాతం పూరైనట్లు  జిల్లా  కలెక్టర్ కు వివరించారు.  మరికొన్ని చోట్ల గృహ నిర్మాణాల శంఖుస్థాపన పనులకు ఎదురౌతున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  దీంతో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడారు.  త్వరితగతిన ఇళ్ళ శంఖుస్థాపన పూర్తి  చేయాలని అధికారులను ఆదేశించారు.  ఇళ్ళ పునాదుల కార్యక్రమం పూర్తి కాగానే లబ్దిదారుల ఖాతాల్లో తొలివిడత నగదు జమ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.  ప్రధానంగా పేదల కోసం నిర్మిస్తున్న కాలనీలలో సీసీ  రోడ్లు,  డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్, ఏ.పి ఫైబర్ నెట్ వంటి మౌళిక వసతుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.   

  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం వలన గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పనులు చేసుకునే వారికి త్వరితగతిన నగదు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని చోట్ల ఉపాధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. గ్రామ సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.  మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో నాడు – నేడు పధకం ద్వారా అమలు అవుతున్న పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలపై  తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  గ్రామీణ, అర్బన్ పరిధిలో ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన విచారణ నిర్వహించి అర్హత ఆధారంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్రా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపధ్యంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూడాలని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్  కమిషనర్  ను ఆదేశించారు.  ఈ మేరకు అన్ని  ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన జిల్లా కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో వాలంటీర్  పోస్టులు ఖాళీగా వున్న చోట్ల వెంటనే భర్తీ చేయాలన్నారు. 

  సంయుక్త కలెక్టర్ ( రైతు బరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్.దినేష్ కుమార్ జిల్లా వ్యాప్తంగా 67 వేల మంది ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ కు వివరించారు.  కొన్ని చోట్ల లబ్దిదారుల జాబితాలు పెండింగ్ లో వున్నాయని,  వాటిపై  త్వరితగతిన విచారణ నిర్వహించి అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.  ఇప్పటికే లబ్దిదారుల జాబితా ఆధారంగా ఇళ్ళ పట్టాలను  సిద్దం చేశామని, త్వరలో వాటిని లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.  ఖాళీగా  వున్న ఇళ్ళ స్థలాలలో లబ్దిదారులకు పట్టాలు కేటాయించే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు.  

  సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివద్ధి) పి ప్రశాంతి  కోవిడ్ థర్డ్ వేవ్ వుంటుందన్న  నేపధ్యంలో పటిష్టమైన ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రధానంగా పీ హెచ్ సీ లలో నాడు – నేడు  పధకం ద్వారా భారీ మార్పులు తీసుకువస్తున్నామన్నారు.  ఆసుపత్రులలో తగిన సిబ్బంది, మౌళిక వసతులతో పాటు, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.  పట్టణాలలో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ నెల 15 వ తేదిన ప్రారంభం కానున్న వాహన మిత్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు  చేస్తున్నట్లు వెల్లడించారు. 
 
  సంయుక్త కలెక్టర్ ( ఆసరా,సంక్షేమం) శ్రీధర్ రెడ్డి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం అమలు అవుతున్న  తీరును  జిల్లా కలెక్టర్ కు వివరించారు. కొన్ని మండలాల్లో ఉపాధి హామీ పధకం వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులను సమన్వయ పరచుకుని పని చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ వైఎస్సార్ క్లినిక్స్  కేంద్రాల  నిర్మాణాలు  త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తామన్నారు.  కొన్ని చోట్ల సాంకేతిక కారణాల వలన ఈ భవనాల నిర్మాణాలు చేపట్టలేక పోయామని,  జూలై 2 వ తేది  నాటికి భవన నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయాన్ని సంబంధిత శాఖల అధికారులకు వివరించారు. 

  సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ,  మున్సిపల్ కమిషనర్లు,   ఆర్  డి ఓ లు, పంచాయితీ రాజ్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్, విద్యుత్, ఏ.పి ఫైబర్, తహసీల్దార్లు, యంపిడిఓ లు, తదితర శాఖల అధికారులు  పాల్గొన్నారు. 

Guntur

2021-06-11 15:57:52

తొలిరోజే ఈ-ఆఫీస్ తో హెచ్చరిక..

ఈ-ఆఫీస్ ద్వారానే అధికారులందరూ జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పంపే ఫైల్స్ అన్నింటినీ పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సూచించారు. మాన్యువల్ గా పంపే ఫైళ్లను తాను ఆమోదించనని తెగేసి చెప్పారు. ఈ ఆఫీసులో పంపే ఫైళ్లను జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి సంబంధిత స్పష్టమైన రిమార్కులతో తన అనుమతి కోసం పంపాలంటూ అధికారులను హెచ్చిరించారు. తొలిరోజు విధుల్లోకి చేరుతూనే తన దైన మార్కును ప్రదర్శించారు జిల్లా కలెక్టర్.. అధికారులు పంపిన ఫైళ్లు ఏ దశలో ఉన్నాయో ఆ శాఖ  ఫాలోఅప్ చేయాలన్నారు. తన అనుమతి కోసం చివరి నిమిషాల్లో ఫైళ్లను తన వద్దకు పంపరాదన్నారు. అలాపంపే ఫైళ్ళను తాను ఆమోదించేది లేదని. క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సందర్భాల్లో పంపే ఫైళ్లను అందుకు సంబంధించిన సస్పెన్షన్ ఆర్డర్ తో పాటు ఛార్జ్ మెమోలను కూడా రూపొందించి తన అనుమతి కోసం పంపాలన్నారు. తన దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై జిల్లా అధికారులు తనను మొబైల్ ద్వారా గాని,వాట్సాప్ ద్వారాకాని తెలియజేయవచ్చన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజెంటేషన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఒక షెడ్యూల్ ను రూపొందించడం జరుగుతుందని,ఆ మేరకు ఆయా శాఖల చేపడుతున్న పథకాల అమలుతీరు తదితర అంశాలపైతానుసమీక్షించడం జరుగుతుందన్నారు.  ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-11 15:23:05

కేసులు తగ్గాయని అజాగ్రత వద్దు..

అనంతపురం జిల్లాలో కేసులు తగ్గుతున్నాయని కోవిడ్ ను తేలిగ్గా తీసుకోవద్దని నోడల్ అధికారులను హెచ్చరించారు. జిల్లా నూతన కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మొట్టమొదటి సమీక్షను కోవిడ్ పై నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధికారులకు థర్డ్ వేవ్ కోవిడ్ పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను ఎదుర్కోడానికి కావాల్సిన మౌళిక వసతుల గురించి అధికారులు కలెక్టరుకు వివరించారు. కోవిడ్ ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, తాత్కాలిక ఆసుపత్రుల వివరాల గురించి ఆరా తీశారు. మెడికల్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపై జేసీ నిశాంత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్ కేసులు, మరణాలపై జేసీ సిరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైద్య రంగంలో అక్రమాలపై తీసుకున్న చర్యల గురించి ప్రత్యేక దృష్టి సారించారు. కోవిడ్ ఔషధాల బ్లాక్ మార్కెటింగ్, ఆరోగ్య శ్రీ సమస్యలపై తీసుకున్న వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్ మూడో వేవ్ రూపంలో మరో సారి విజృంభించినా సిద్ధంగా ఉండాలని నోడల్ అధికారులు, వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ మరణాలపై ఆడిట్ నిర్వహించుకుని భవిష్యత్తులో మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రణాళిక రచించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-11 15:05:21

సెంట్రల్ లైటింగ్ తో మరింత కాంతి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రాంతాలను అభివ్రుద్ధి చేసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రెండవవ జోన్ 6వ వార్డులోని దేవిమెట్ట జంక్షన్ నుండి అమరావతి జంక్షన్ వరకు సెంట్రల్ లైటింగు మంత్రితోపాటు నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే మన విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తున్నారని, కొన్ని అవరోధాలు తొలగిన వెంటనే విశాఖపట్నం నుండి పరిపాలన సాగిస్తామని దీనితో మన నగరం ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కార్పొరేటర్ వార్డులో కొన్ని సమస్యలను ప్రస్తావించగా, వాటిని పరిష్కరిస్తామని కార్పొరేటర్ మంత్రివర్యులు హామీ ఇచ్చారు. కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక కృషితో రూ.39.45లక్షల వ్యయంతో ఈ సెంట్రల్ లైటింగును ఏర్పాటుచేశారన్నారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, జివిఎంసి నిధుల నుండి కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక కృషితో ఈ సెంట్రల్ లైటింగ్ ను రూ.39.45 లక్షల వ్యయంతో దేవిమెట్ట జంక్షన్ నుండి అమరావతి జంక్షన్ వరకు 41 పోల్సును ఏర్పాటుచేయడమైనదని, ఈ 41 పోల్సుకు 81ఎల్.ఇ.డి. బల్బులను ఏర్పాటుచేయడమైనదని తెలిపారు. వార్డులో సమస్యలపై పర్యటించాలని కార్పొరేటర్ కోరగా మేయర్ త్వరలో పర్యటిస్తానని, వార్డులో కావలసిన మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మేయర్ తెలిపారు. అనంతరం వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మేయర్ కు శాలువా కప్పి అభినందించారు. ఈ పర్యటనలో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, పర్యవేక్షక ఇంజినీరు శ్యాంసన్ రాజు,  జోనల్ కమిషనర్ బి. రాము, కార్యనిర్వాహక ఇంజినీరు రాయల్ బాబు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు లక్ష్మోజి, సహాయక ఇంజినీరు స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-11 14:52:31

ఆక్రమణలు జరగకుండా చూడాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఫుట్ పాత్ లు, ఆక్రమణలు జరగకుండా చూడాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని నాలుగవ జోన్ 36వ వార్డు పరిధిలోని పూర్ణా మార్కెట్, రంగిరాజ వీధి తదితర ప్రాంతాలలో  కమిషనర్  పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్లను శుభ్రపరుస్తూ చెత్తను వెను వెంటనే డంపింగు యార్డుకు తరలించాలన్నారు. ప్రతీ ఇంటి నుంచి తడి-పొడి , ప్రమాదకర చెత్తను వేరు వేరుగా స్వీకరించాలన్నారు. తడి-పొడి చెత్త ఇచ్చేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలలోని చెత్తను తొలగించి నీరు సాఫీగా ప్రవహించే విధంగా చేయాలని శానిటరి అధికారులను ఆదేశించారు. పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య సిబ్బందిని నియమించాలని, ఎవ్వరికి కేటాయించిన పనిని వారిచే చేయించాలని, అన్ని పనులు ఒకే పారిశుధ్య కార్మికుడిని ఉపయోగించరాదన్నారు. లిట్టర్ బిన్స్ శుభ్రంగా ఉంచాలని, చెత్తను బిన్స్ చుట్టు ప్రక్కల పడవేయకుండా చూడాలని, బిన్స్ చుట్టూ బ్లీచింగు జల్లించాలని, బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డులో నిర్మాణంలో ఉన్న భవనముల యొక్క ప్లాన్ వివరాలను తెలపాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఇంటింటి సర్వే జరపాలని, కుండీలలో నీరు నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం “డ్రై” డే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని వెటర్నరి డాక్టరు కిషోర్ ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీధి దీపాలు నిర్వహణ, త్రాగు నీరు సమయానికి అందించడం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, వెటర్నరి డాక్టరు కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, గణేష్ బాబు, శానిటరి సూపర్వైజర్ శ్రీనివాస రాజ్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ సిటీ

2021-06-11 14:46:11

ఉపాధిహామీ పనులు వేగం పెంచాలి..

విశాఖ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, వివిధ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ వెల్నెస్ క్లినిక్  నిర్మాణాలు, వైయస్సార్ జలకళ పథకాలపై ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 3 లక్షల 91 వేల మందికి పని కల్పిస్తున్నట్లు చెప్పారు. జూన్ నెలాఖరుకు కోటి 25 లక్షల పని దినాలను సాధించే దిశగా పనులను  వేగవంతం చేయాలన్నారు. వైయస్సార్ జలకళ పథకంలో రైతులకు  200  వ్యక్తిగత సాగు బోరుబావులను  త్రవ్వించాలని ఆదేశించారు.  ఈనెల 16 నుండి నిర్వహించే భవన నిర్మాణ పక్షోత్సవాలు సందర్భంగా  అవగాహన కార్యక్రమాలు విజయవంతం  చేయాలన్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గ్రామ సచివాలయాలు,  మొదటి విడత మిల్క్ కూలింగ్ సెంటర్లు   జూన్ 30వ తేదీకి రైతు భరోసా కేంద్రాలు జూలై 8 వ తేదీకి వైయస్సార్ వెల్నెస్ క్లినిక్ లు జూలై31 తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు.  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి లక్ష్యాలను సాధించే దిశగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం పి.డి. సందీప్,  ఆర్.డబ్ల్యూ.ఎస్.   ఎస్.ఇ. రవికుమార్,   భూగర్భ జలవనరుల శాఖ డి.ఈ.   తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-11 14:35:25

కరోనా థర్డ్ వేవ్ కి సమాయత్తం కావాలి..

కోవిడ్–19 3వ వేవ్ కు అధికారులు, వైద్యాధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం  కలెక్టరు ఈ విషయంపై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు జిల్లాలో ప్రభుత్వ ప్రవేటు ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, ఆక్సిజన్ స్టోరేజ్ పాయింట్లు, డ్రగ్స్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్థేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు అన్ని ఆసుపత్రులలో శతశాతం బెడ్స్ ను ఆక్సిజన్ బెడ్స్ క్రింద మార్చాలన్నారు. ఈ విషయమై జిల్లా వైద్యా ఆరోగ్యాశాఖాధికారి అన్ని నోటిఫైడ్ ఆసుపత్రులకు నోటీసులు జారీ గావించాలన్నారు. ప్రతీ  ఆసుపత్రిని పరిశీలన గావించాలన్నారు. ఆసుపత్రులన్నింటిలో మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ వినియోగించడం జరిగిందని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీనికి గాను టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులలో బెడ్స్ కు ఎంత ఆక్సిజన్ సరఫరా అవసరమో అంచనా సిద్థం గావించాలన్నారు. ఆక్సిజన్ తయారు గావించే  పి.ఎస్.ఎ. ప్లాంట్లను జిల్లాలో ఏర్పాటు గావించడానికి ప్రారిశ్రామిక వేత్తలతో చర్చించాలని పరిశ్రమల శాఖ జెనరల్ మేనేజర్ రామలింగరాజును ఆదేశించారు.  ఆక్సిజన్  సిలెండర్స్ స్టాకు పాయింట్ ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. సి.హెచ్.సిలు  అవసరమైన ఏర్పాట్లు గావించుకుని సమాయత్తం కావాలన్నారు. అందుకు అవసరమైన యాక్షన్  ప్లాన్ సిద్థం చేసుకోవాలన్నారు.  ఆక్సిజన్  సరఫరాకు అవసరమైన లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని పెంచుకోవాలో ప్రణళిక సిద్థం గావించాలన్నారు. ఆ మేరకు అన్ని ఆసుపత్రులకు బెడ్స్ సంఖ్య పెంచడంపై సూచనలు జారీ గావించాలన్నారు.  పెడియాట్రిక్ కోవిడ్ మేనేజ్మెంటు పై చర్చిస్తూ పిల్లలకు వైద్యసేవలు అందించడానికి గాను బెడ్స్ ఏర్పాటు, డ్రగ్స్ పెడియాట్రిక్ వెంటిలేటర్లు, అవసరమైన  ఎక్విప్ మెంట్ సిద్థం చేసుకోవాలన్నారు. అదే విధంగా (PICU) పెడియాట్రిక్ ఇన్ టెన్సివ్ కేర్  యూనిట్లను ఏర్పాటు మరియు 0-5 మరియు 5-10 సంవత్సరాల పిల్లల కోసం ఆసుపత్రులలో పడకలు ఏర్పాటుపై చర్చించారు.  సిఎస్ఆర్ బ్లాక్ లో అవసరమైన మార్పులు చేయించి సిద్దం కావాలన్నారు.  అన్ని ఆసుపత్రుల వైద్యాధికారులతో ఈ విషయంపై  సమావేశం నిర్వహించి తగు సూచనలు జారీచేసి సిద్దం గావించాలని జాయింట్ కలెక్టర్ 2 అరుణ్ బాబు ను ఆదేశించారు.  
కోవిడ్ పరీక్షల నిర్వహణ 
కోవిడ్19 పరీక్షల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వలదని సూచించారు.  ఇప్పటివరకు పరీక్షలు బాగా నిర్వహించారని, అదే కొనసాగించాలన్నారు. 
ఈ సమావేశంలో ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్  పి.వి.సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, జి.యం.,డి.ఐ.సి. రామలింగరాజు, డ్రగ్స్ కంట్రోల్ అధికారిణి రజిత, డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. 

Collector Office

2021-06-11 14:31:28

ఇళ్ల నిర్మాణాలు సత్వరమే ప్రారంభించాలి..

నవరత్నాలు – పేదలం దరికీ ఇళ్లు కార్యక్రమం తొలిదశ క్రింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం మద్యాహ్నం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి హౌసింగ్, రెవెన్యూ, పంచాయితీరాజ్, ఆర్ డబ్యూ ఎస్, ట్రాన్స్కో, డిఆర్డిఏ, మున్సిపల్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గృహనిర్మాణ కార్యక్రమాల కార్యచరణపై సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 10 వ తేదీ వరకూ జగనన్న కాలనీలలో నిర్వహించిన శంకుస్థాపనల ద్వారా 10 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.  గృహనిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందకు ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ అధికారిని సూపర్ వైజరీ అధికారిగా నియమించామని, ప్రతి శుక్రవారం ఈ అంశపై జిల్లా స్థాయి నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే డివిజనల్ అధికారులు, సూపర్ వైజరీ అధికారులు ప్రతి శనివారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన బోర్లు, విద్యుత్, అప్రోచ్ రోడ్ వంటి సదుపాయాలను జగనన్న కాలనీలలో ఆయా శాఖల సమన్వయంతో అభివృద్ది చేయాలన్నారు. లబ్దిదారులతో ఆన్ సైట్ సమావేశాలు నిర్వహించి తొలిదశ క్రింద మంజూరైన వారందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా మోటివేట్ చేయాలని, పనులు ప్రారంభించేందుకు కనీసం 50 వేల రూపాయలు రుణం స్వయం సహాయ బృందాల ద్వారా కల్పించాలని తెలిపారు.   లబ్దిదారులకు జాబ్ కార్డుల జారీ సత్వరం పూర్తి చేయాలని, ఇసుక ఉచితంగా సరఫరా చేయడంతోపాటు, పర్చేజ్ కమిటీల ద్వారా బిల్డింగ్ మెటీరియల్ సాధ్యమైనంత తక్కువ ధరలో అందేలా చూడాలని సూచించారు.  వెయ్యి ఆపై ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న పెద్ద కాలనీలలో వర్కుషెడ్లు, మెటిరియల్ డిపోలను తాత్కాలిక స్ట్రక్చర్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమలాపురం, రామచంద్రపురం డివిజనల్లలో ఇంకా పూర్తి కావలసిన లే అవుట్ లెవెలింగ్ పనులను వెంటనే నిర్వహించాలని, పెద్దాపురం, సామర్లకోట లేఅవట్ లలో ఇళ్ల నిర్మాణానికి అవరోధంగా ఉన్న పవర్ లైన్ల ప్రక్కకు తరలించాలని ఆదేశించారు.  లే అవుట్లలో వర్షపు నీరు నిలిచి పనులకు అటంకం కాకుండా పైప్ లైన్ డ్రైన్ లను ఏర్పాటు చేయాలన్నారు. లే అవుట్లలో ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ సరఫరా కల్పించాలని ట్రాన్స్ కో ఎస్ఈ ని కోరారు.  ఉపాధి హామీ పధకం క్రింద లే అవుటల్లో  అంతర్గత సిసి రోడ్లు, డ్రెయిన్ల పనులకు అంచనాలు, ప్రతిపాదనలు సిద్దం చేయాలని పంచాయితీ రాజ్ శాఖను కోరారు.     ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి, హౌసింగ్ పిడి జి.వీరేశ్వరప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్, ట్రాన్స్ కో, పిఆర్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-11 12:35:45

రేణిగుంటలో చీఫ్ జస్టిస్ కి సాదర వీడ్కోలు

 తిరుమలలోని శ్రీవారు, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ వారికి రేణిగుంట విమానాశ్రయంలో  సాదర వీడ్కోలు లభించింది.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి రవీంద్ర బాబు, టిటిడి చైర్మన్  వై.వి. సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె. ఎస్. జవహర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్, ప్రభుత్వ విప్  చెవిరెడ్డి భాస్కర రెడ్డి , గూడూరు ఎం. ఎల్.ఏ.వరప్రసాద్,  జిల్లా కలెక్టర్ఎం .హరినారాయనన్ 
తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్  పవన్ కుమార్,   తిరుపతి అర్బన్ ఎస్.పి  వెంకట అప్పల నాయుడు , ఆర్డీవో కనకనరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్.సురేష్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, టర్మీనల్ మేనేజర్ గోపాల్, డి.ఎస్.పి.కాటమరాజు,  తహసీల్దార్ శివప్రసాద్, సి.ఐ.అంజుయాదవ్, కోర్టు ఎంప్లాయస్ యూనియన్ లీడర్లు గోపీనాథ్ రెడ్డి, మస్తాన్ వలి, లక్ష్మీపతి, రవీంద్ర రెడ్డి తదితరులు వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు.

Renigunta

2021-06-11 12:28:10

ఈ-క్రాప్ లో పంటలను నమోదు చేసుకోవాలి..

విశాఖజిల్లాలో ఖరీఫ్ 2021 లో జిల్లాలోని  రైతులందరూ తప్పని సరిగా     ఇ -  క్రాప్ లో పంటలను నమోదు చేసుకొనే విధంగా   గ్రామ స్థాయిలో   అవగాహన కల్పించాలని  జాయింట్  కలెక్టర్  ఎం .వేణు గోపాల రెడ్డి  అధికారులను  ఆదేశించారు.  శుక్రవారం నాడు  స్థానిక  కలెక్టరేట్ లో  వై ఎస్ ఆర్  ఉచిత  పంటల  బీమా పథకం  అమలుపై   జిల్లా స్థాయి  వర్క్ షాపును  నిర్వహించారు.  ఈ వర్క్ షాపు లో  వ్యవసాయ, అనుబంధరంగాల  అధికారులు, జిల్లా  వ్యవసాయ సలహామండలి సభ్యులు పాల్గొన్నారు. వర్క్ షాపు అనంతరం   జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో  ఇప్పటి వరకు  వరి, సజ్జలు, వేరుశెనగ, మినుములు, రాగులు,  కంది, మొక్క జొన్న, చెరకు (మొక్క),  చెరకు (కార్సి) మొదలైన   9 పంటలు మాత్రమే  ఉచిత పంటల బీమా పథకం పరిధిలో ఉన్నాయని  తెలిపారు.  ఇపుడు అదనంగా  రాజ్ మా , పసుపు,  ప్రత్తి,  అరటి పంటలను కూడా  బీమా పథకం పరిధిలోకి తీసుకు రావాలని  సిఫారసు  చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.   పంటల బీమాలో  చెరకు పంటకు  మండలం యూనిట్ గా  ఉందని,  ఇక ముందు  గ్రామం  యూనిట్ గా  పరిగణించాలని  ప్రతి పాదించినట్టు తెలిపారు.   ప్రతి రైతు  భరోసా కేంద్రంలోను వర్షపాతం నమోదు చేయడానికి  రెయిన్  గేజ్  స్టేషను  ఏర్పాటు చేస్తే  రైతులకు  మేలు చేకూరుతుందని  వర్క్ షాపు లో  ప్రతి పాదించినట్టు  ఆయన తెలిపారు. 
ఈ సమావేశంలో   వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి. మోహన్ రావు,   జిల్లా  వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు  చిక్కాల రామారావు, సి పి ఓ  ఎం .శ్రీనివాసరావు,  ఇరిగేషన్ ఎస్. ఇ ., సూర్యకుమార్,  ఎల్ . డి .ఎం . సాయినాధ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు ,  వ్యవసాయ , ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-06-11 12:16:03