నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలను అన్ని విధాలా ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని నూతన హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో హౌసింగ్ నూతన జాయింట్ కలెక్టర్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హౌసింగ్ అధికారులు, సిబ్బంది జేసీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.*
*2017 ఐఏఎస్ బ్యాచ్ కు సంబంధించిన హౌసింగ్ జెసి నిశాంతి గారిని రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. అనంతరం పెనుగొండ సబ్ డివిజన్ నందు సబ్ కలెక్టర్ గా 25.9.2019 రోజున పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదోన్నతి పొంది జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా సోమవారం రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హౌసింగ్ జెసి మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ కింద మొత్తం 1,11,099 మంజూరైన ఇళ్ల నిర్మాణపు పనులను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆప్షన్ 1, 2 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆప్షన్ 3 సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు వెలువడగానే ఇళ్ల నిర్మాణపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నవరత్నాలులో భాగంగా అర్హులందరికీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఈ నేపథ్యంలో రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్ తదితర శాఖల సమన్వయంతో జగనన్న కాలనీలలో అంగన్వాడిలు, సచివాలయాలు, పీహెచ్ సిలు, పార్కులు తదితర వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకొని నిర్మాణపు పనులు పూర్తి చేస్తామన్నారు.
అనంతరం హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి జగనన్న కాలనీ పనుల పురోగతిపై సమీక్షించి జాయింట్ కలెక్టర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వెంకటేశ్వర రెడ్డి, ఈఈలు చంద్రమౌళి రెడ్డి, కృష్ణయ్య, నారాయణమ్మ , శైలజ, పలువురు డిఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.