1 ENS Live Breaking News

జిల్లా కలెక్టర్ నివాస్ కు ఘన సన్మానం..

కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళుతున్న జె నివాస్ కు సోమవారం వివిధ ఉద్యోగ సంఘాలు ఘనంగా సత్కరించాయి. జిల్లా రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జె నివాస్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీతి, న్యాయాన్ని నిలబెట్టాలన్నారు. బాధ్యతను అప్పగించారు అంటే మీ మీద నమ్మకంతో ఇచ్చారని భావించాలన్నారు. కోవిడ్ సమయంలో వలసల నుండి వచ్చిన వారిని క్వారంటీన్ లో విజయవంతంగా చేసారని చెప్పారు. ప్రతి ఉద్యోగిని నమ్మానని ఆయన తెలిపారు. బృందంగా పనిచేసామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అన్ని విషయాల్లో ముందుండాలని ఆలోచించానని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయడానికి, ఇళ్ల పట్టాల పంపిణీలో చక్కటి ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేశారన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి హృదయాలను టచ్ చేశారన్నారు. కోవిడ్ లో ప్రజలు ఇళ్లలో ఉన్నారు - మీరు రోడ్డు మీద ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. కోవిడ్ లో అనేక కొత్త విధానాలు జిల్లాలో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు ఎం. కాళీప్రసాద్ మాట్లాడుతూ విధులు నిర్వహణలో దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో శాయశక్తులా కృషి చేసి సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల పట్ల ప్రాణదాతగా నిలిచారని ప్రశంసించారు.

రెవెన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టివిఎస్ జి కుమార్, ఎస్డీసిలు బి.శాంతి, పి.అప్పారావు, సీతారామయ్య,టి. సవరమ్మ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎన్. నరేంద్ర బాబు, డీఎస్ ఓ డి.వి.రమణ, తహసీల్దార్లు మాట్లాడుతూ విధులు నిర్వహణలో వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. మహిళా అధికారులను ప్రోత్సహించి సమాజంలో మంచి గౌరవం పొందే విధంగా తోడ్పాటును అందించారని పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా మార్గదర్శకం వహించారని కొనియాడారు. మానవత్వానికి మారుపేరు నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-07 16:50:19

కోవిడ్ లో దాతల సహాయమే ముఖ్యం..

కోవిడ్ వంటి విపత్కరమైన తరుణంలో పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుంటూరు  జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య  పేర్కొన్నారు. సోమవారం గుంటూరు భారతీయ విద్యా భవన్ ఆవరణలో సుమారు 50 కుటుంబాల పేద కళాకారులు, అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటి ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వలన ఎంతోమందికి ఆరోగ్యం దెబ్బతిందని అన్నారు. పనులు లేక చాలామంది పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కష్ట కాలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నిర్వాహకులు  ఆపదలో ఉన్న ఒక్కో కుటుంబానికి  10 కేజిల బియ్యం, ఒక్కోకేజి చొప్పున కందిపప్పు, నూనె, చింతపండు,గోదుమ పిండి, గోదుమరవ్వ, పంచదారలను 50 కుటుంబాలకు పంపిణీ చేశారు. మొత్తం 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సన్నద్ధం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఉపాధ్యక్షులు రామచంద్ర రాజు, కోశాధికారి రవి శ్రీనివాస్, సినీ,నాటక రంగ నటులు, నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ మహ్మమారి త్వరిత గతిన తగ్గిపోవాలని కోరుకుంటున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. కోవిడ్ కారణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూను విధించిన నేపథ్యంలో పనులు లేక కళాకారులు,అర్చకులు పస్తులుంటున్నారు. దీంతో కళాకారులు, అర్చకులు జీవన విధానం కష్టతరమై పోతుందని గ్రహించిన దాతలు రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులు వెల్లడించారు. అర్చకులు, పేదకళాకారులకు ఎంతో కొంత సాయంచేసి ఆదుకోవాలన్న దృక్పదంతో ముందుకు వచ్చిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్రరాజు ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధులతో పాటుగా సినీ,నాటక రంగ నటులు, నంది అవార్డు గ్రహీత నాయుడు గోపి, సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీ నారాయణ లు పాల్గొని రెడ్ క్రాస్ సొసైటి సేవలను కొనియాడారు.

Srikakulam

2021-06-07 16:44:14

విద్యుత్ బిల్లుకు ధృవపత్రాలు అందించాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధికంగా వెనుకబడిన కులవృత్తులు యస్.సి, యస్.టి విద్యుత్ బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 సం.కు రాయితీ ప్రకటించిందన్నారు. కావున సదరు విద్యుత్ వినియోగదారులు అవసరమైన ధృవపత్రాలను దగ్గరలోని విద్యుత్ శాఖ నందు సమర్పించి రాయితీలను పొందాలని ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీర్ యల్.మహేంద్రనాధ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాయితీ పొందగోరు వినియోగదారులు తమ విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు , కులధృవీకరణ, తెలుపురేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రం, మొబైల్ నెంబరు, అద్దెకు ఉన్నట్లయితే యజమాని ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ ప్రతులను సమర్పించాలని అన్నారు. షెడ్యూల్డు కులాలు మరియు తెగలు వారికి 200 యూనిట్లు, లాండ్రీ షాపు / రజక మరియు నాయీబ్రాహ్మణ కులం  వారికి 150 యూనిట్లు, బంగారు ఆభరణాలు తయారీ, చేనేత కార్మికులు, అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబిసి) వారికి 100 యూనిట్లు వరకు రాయితీ లభించనుందని ఆయన చెప్పారు. జి.ఓ.యం.యస్.నెం.17, తేది08.06.2016 ప్రకారం బలవంతు/బహురూపి, బండారు, బుడబుక్కలు, దాసరి, దొమ్మర, గంగిరెడ్డువారు, జంగం, జోగి, కాటిపాపల, కురచ, మొండివారు, బాండ, మొండిబండ, పిత్చిగుంట్ల, వంశరాజ్, పాముల, పార్థి(నిషికారి), పంబల, దమ్మలి, దమ్మల, దమ్ముల, దమల్, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, వీరముష్టి, నెత్తికొట్ల, వీరభద్రీయ, గుడాల, కంజర-భీభట్ట, కోపమరే, రెడ్డికే, మొండిపట్ట, నొక్కారు, పరికిముగ్గుల, యాత, చోప్మారి, కైకది, జోపినందివాలస్, మందుల, కూనపులి, పాత్ర, రాజన్నల, రాజన్నలు, కసికపడి, కసికపూడి కులాలకు చెందినవారు అత్యంత వెనుకబడిన తరగతులు(ఎంబిసి) క్రింద వస్తారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన సమస్యలున్న 1912 నెంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. 

Srikakulam

2021-06-07 16:30:28

పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటుచేయాలి..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ 5వ జోన్ 53వ వార్డు పరిధిలోని మర్రిపాలెంలో సాయినగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. పిన్ పాయింట్ వారీగా సిబ్బందిని సర్దుబాటు చేయనందున శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనికి నిర్దేశించిన పారిశుధ్య సిబ్బందిని అదే పనికి వినియోగించాలని ఒకరికి రెండు, మూడు పనులు చెప్పరాదని ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, రోడ్లను శుభ్రం చేసిన చిన్న చిన్న చెత్త కుప్పలను వెను వెంటనే తోలగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని ఆదేశించారు. 24x7 మంచినీటి కొరకు తవ్విన రోడ్లను పూడ్చలేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రోడ్లను రిపేరు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, డిసిపి శిల్పి, ఎఎంఒహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.     

విశాఖ సిటీ

2021-06-07 16:19:05

పెండింగ్ అర్జీలు పరిష్కరించండి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె తమ ఛాంబరు నుంచి  జివిఎంసి ఉన్నతాధికారులతోను, అందరు జోనల్ కమిషనర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాస్త్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిపాలన, సంక్షేమం ప్రతీ పేదవాడికి అందాలనే ఉద్దేశ్యంతో వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారని, దీనిని బలోపేతం చేయాలన్నారు. ప్రజలు పెట్టుకునే అర్జీలను పెండింగు లేకుండా వెంట వెంటనే పరిష్కరించాలని, అర్జీలు ఎ స్థాయి అధికారి వద్ద పెండింగు ఉన్నాయో ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగులో ఉన్న జగనన్న చేయూత, వాహన మిత్ర, జగనన్న తోడు తోపాటు, పింఛను పధకం, రైసు కార్డులు, ఇళ్ళ స్థలాలు మొదలైన అర్జీలు సాయంత్రానికి పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.  స్పందనలో ట్విట్టర్ లాంటి సాంఘిక మాధ్యమాల ద్వారా వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని, పారిశుధ్యం, వీధి దీపాలు, మొక్కలు విభాగం, రెవెన్యూ మొదలైన విభాగాల అర్జీలు పెండింగులో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం పూర్తి అయిందని, ఇంకా వారి సర్వీసు రిజిస్టరు తెరవక పోవడంపై కమిషనర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రానికి అందరి సర్వీసు రిజిస్టర్లు తెరవాలని అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన ఇంజినీరు పి. రవి కృష్ణ రాజు, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, యుసిడి. (పి.డి.) వై.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు, అందరు జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.       

GVMC office

2021-06-07 16:14:31

పేదలకు తక్కువధరకే ఇంటి స్థలాలు..

మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు కేటాయించే ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా స ంయుక్త కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్.) జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి, రెవిన్యూ అధికారులతో సోమవారం ప్రకాశం భవనంలోని జె.సి. ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. మధ్యతరగతి కుటుంబాలకు చవకగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని జె.సి. మురళి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల పరిధిలో నివాసముంటున్న 20,509 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు పట్టణాల పరిధిలో ఈ పథకానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. పట్టణాలలో అవి లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అసైన్ఢ్‌మెంట్ భూములు గుర్తించాలన్నారు. ఆ భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారినుంచి భూసేకరణ చేయాలన్నారు. మధ్యతరగతి కుటుంబాల వారికి భారం లేకుండా చూడటమే పథకం ముఖ్య ఉద్థేశ్యమన్నారు. తక్కువ ధరకే భూమి కేటాయించేలా ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ప్రాంతాలలో గుర్తించిన భూముల లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఒంగోలు, మార్కాపురం ఆర్.డి.ఓ.లు ప్రభాకర రెడ్డి, ఎమ్.వి. శేషిరెడ్డి, ఉడా వైస్ ఛైర్మన్ పి. భవాని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-07 16:06:12

మ్రుతుల కుటుంబాలకు ఆర్ధికసాయం..

కరోనా వైరస్ , రోడ్డు  ప్రమాదాలకు గురై మ్రుతిచెందిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 2.50 లక్షల ఆర్ధిక సయాహాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందించారు.   సోమవారం కలక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్  లు  బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం క్రింద రూ. 2.50  లక్షల చెక్కులను అందించారు. ఏప్రిల్ 22 న గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కే. శ్రీనివాసరావు కోవిడ్ కు గురై  చికిత్స పొందుతూ మృతి చెందారు.  మాచవరం మండలం  రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న షేక్.బాజీ మే 8 న రోడ్డు  ప్రమాదంలో మృతి చెందారు.  మృతుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో గుంటూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఒక్కొక్క కుటుంబానికి రూ. 2.50 లక్షల చొప్పున  జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్  చేతుల మీదుగా ఆర్ధిక సాయం క్రింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి, నరసారావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, ట్రైనీ సహాయ కలెక్టర్  శుభం భన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య, కలక్టరేట్ ఏ.ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-07 15:49:01

ప్రణాళికాబద్దంగా కోవిడ్ వేక్సినేషన్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్దంగా చేపట్టాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.  సోమవారం ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు.) సెంటర్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, వ్యాక్సినేషణ్ వేసే సిబ్బందికి సహకరించాలని సూచించారు. అనంతరం డాక్టరు అనిత, సిబ్బందితో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయంచుకొనుటకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఎఫ్.ఆర్.యు. సెంటర్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు తోలాగించాలని, పరిసరాలను శానిటేషన్ చేయించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అనంతరం 11వార్డులను క్లాప్ (CLAP) పధకంలో భాగంగా కాలువలను, రోడ్డులను తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని, కాలువలలోను రోడ్డు ప్రక్కన బ్లీచింగు చల్లాలని శానిటరి ఇన్స్పెక్టర్ ని  ఆదేశించారు. ఈ పర్యటనలో అరిలోవ (ఎఫ్.ఆర్.యు.) ఆసుపత్రి సిబ్బంది, వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-06-07 15:27:39

ఆ 2180 ఎకరాల భూమి రైతులకే..

రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మ నిర్ణయాని కనుగుణంగా కాకినాడ ఎఈజడ్ లో సేకరించిన 2180 ఎకరాల భూములను తిరిగి రైతులకు వెనుకకు ఇచ్చి రిజిష్ట్రేషన్ చేసే ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం  ఆయన, రాష్ట్ర ప్రభుత్వ  పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వల్లవన్ తో కలిసి సంయుక్తంగా  జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, కెఎస్ఈజడ్ ప్రతినిధులు, రైతులతో కలెక్టరేట్ వివేకానంద హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించి  కాకినాడ ఎస్ఈజడ్ లో సేకరించిన 2180 ఎకరాల భూములను  రైతులకు తిరిగి ఇచ్చే ప్రక్రియ పురోగతిని సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి  కన్నబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్ఈజడ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చే బోల్డ్ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గైకొన్నారని, దేశంలో ఎస్ఈజడ్ భూములకు సంబంధించి ఎదురైయ్యే సమస్యల పరిష్కారానికి మిగిలిన రాష్ట్రాలు ఈ నిర్ణయాన్నే అనుసరణీంగా స్వీకరిస్తున్నాయన్నారు.    కెఎస్ఈజడ్ లో 2180 ఎకరాల భూములను రైతులకు తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జీఓ అంశాలను త్వరితగతిన అమలు పరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు.  ఈ మేరకు ఇప్పటికే యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి వెనుకకు తిరిగి ఇవ్వాల్సిన భూములను గుర్తించడం జరిగిందన్నారు.  మొత్తం 2180 ఎకరాల విస్తీర్ణానికి గాను 1357 ఎకరాలను ఎవరి భూములను వారికే ఇంచేందుకు గుర్తించగా,  కెఎస్ఈజడ్ లో పరిశ్రమల స్థాపనకు అనువుగా భూమి ఒకే చోట ఏక ఖండంగా ఉండేందుకు వీలుగా, మరో 823 ఎకరాల భూములకు ప్రత్యామ్నాయంగా మరోక చోట భూములను గుర్తించారన్నారు.  ఈ భూములను వచ్చే అవార్డు లిస్ట్ ల ప్రకారం సేకరించిన రైతులకు వెనుకకు ఇస్తూ రిజిష్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభించాలని మంత్రి అధికారులకు, కెఎస్ఈజడ్ ప్రతినిధులకు సూచించారు.  రైతులకు వెనుకకు ఇస్తున్న భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియకు స్టాంపు డ్యూటీ లేకుండా ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని ఆయన తెలిపారు.  స్థానిక ప్రజల కోరిక మేరకు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురంలోని కొంత భాగం ఆవాసాలను కెఎస్ఈ జడ్ పరిధిలో నుండి మినహాయించడం జరిగిందని, అలాగే ఆవాసాలకు దగ్గరగా ఉన్న స్మశాన వాటికలను కూడా యధతధంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు.  కెఎస్ఈజడ్ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణకు పోలీస్ సూపరింటెండెంట్ కు సూచించడం జరిగిందన్నారు.  స్థానికులకే కెఎస్ఈజడ్ పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలెప్ మెంట్ శిక్షణా కేంద్రాన్ని ములపేటలో నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కెఎస్ఈ జడ్ ను కోరామన్నారు.   అలాగే తొండంగి మండలం కోనలో సేకరించిన 657 ఎకరాల  అస్సైన్డ్ భూములకు పరిహారం తీసుకోని ఎస్తైనీలకు ఎకరాకు 5 లక్షల అదనపు పరిహారంతో వెరసి 10 లక్షల పరిహారం పంపిణీ ప్రక్రియను కూడా రెవెన్యూ అధికారుల సమన్వయంతో వచ్చే పక్షం రోజుల్లో పూర్తి చేయాలని  కెఎస్ఈజడ్ ప్రతినిధులను మంత్రి కన్నబాబు సూచించారు. 
  పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వల్లవెన్ సమావేశంలో మాట్లాడూతూ రైతులకు  తిరిగి ఇచ్చే 1357 ఎకరాల అవే భూములు, 823 ఎకరాల ప్రత్నామ్నాయ భూముల రిజిష్ట్రేషన్, కోన అసైన్డ్ భూములకు అదనపు పరిహారం చెల్లింపు ప్రక్రియలను రేపటి నుండే ముమ్మరంగా నిర్వహించాలని రెవెన్యూ, కెఎస్ఈజడ్ అధికారులను ఆదేశించారు.   ఈ ప్రక్రియలను 2007 నాటి అవార్డులను, ఒరిజినల్ అస్సైనీల సమాచారాన్ని ప్రాతిపదికగా చేపట్టి ముందుగా ఎటువంటి అభ్యంతరాలు లేని కేసులను వెంటనే పూర్తి చేయాలని, అభ్యంతరాలు వ్యక్తమైన వాటిపై మరో మారు క్షేత్ర పరిశీలన నిర్వహించి పరిష్కరిచాలని ఆయన సూచించారు.  రైతుల భూముల్లో ఫలసాయం ఇస్తున్న చెట్లకు కూడా ఉద్యానవన శాఖ నిర్ణయించిన విలువ ప్రకారం పరిహారం అందించడం జరుగుతుందన్నారు.    
సమావేశంలో రైతు ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలను  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి నివృత్తి చేస్తూ భూసేకరణలో అవార్డు పాసై, గజెట్ లో ప్రకటించిన భూములు ప్రభుత్వ భూములుగా పరిగణింప బడతాయని, వాటిని తిరిగి వెనుకకు రిజిష్టరు చేయడం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావవని స్పష్టం చేశారు. రేపటి నుండి నిర్వహించే రిజిష్ట్రేషన్ కార్యక్రమాలపై ఆయా గ్రామాల్లో టాంటాం, వలంటీర్లు, మాద్యమాల ద్వారా రైతులకు సమాచారం అందించాలని తహశిల్దారులను ఆదేశించారు.  
కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రైతు సంక్షేమ దృక్పధంతో రాష్ట్ర ప్రభుత్వం గైకొన్న ఈ నిర్ణయానికి పట్టువిడుపులను పాటిస్తూ భూములిచ్చిన రైతులందరూ సహకరిచాలని  కోరారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ,  డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, కాకినాడ ఆర్డిఓ ఎ.జి.చిన్నికృష్ణ, కెఎస్ఈజడ్ ఎస్డిసి కె.మనోరమ, కెఎస్ఈజడ్ ప్రోజెక్ట్ హెడ్ బి.హెచ్.ఎ.రామరాజు, జియం సి.ఆర్.ఎం.నాయుడు,  తొండంగి తహశిల్దారు చిన్నారావు, యు.కొత్తపల్లి తహశిల్దారు శివకుమార్, పరిశ్రమలు, ఎపిఐఐసి, కాలుష్యనియంత్రణ, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-07 15:17:41

ల్యాండ్ సెటిల్ మెంట్ వేగవంతం కావాలి..

గుంటూరు జిల్లాలోని వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తీసుకునే భూములకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములు  అందించే ప్రక్రియ  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వరికపూడి సెల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ అంశంపై వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్. దినేష్ కుమార్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరికపూడి సెల ప్రాజెక్ట్  నిర్మాణానికి రూ.340 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరిత గతిన వరికపూడి సెల నీటిప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ నుంచి సుమారు 50 ఎకరాల భూములను తీసుకోవాల్సి ఉందన్నారు. దీనికి ప్రత్యాన్మాయంగా ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి అటవీశాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని  రెవెన్యూశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల  గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి బొల్లాపల్లి, వెల్ధుర్తి రెవెన్యూ  అధికారులతో మాట్లాడారు. 
కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్( రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో భూముల గుర్తింపు కార్యక్రమాలను చేపట్టామన్నారు. త్వరితగతిన గుర్తించిన  రెవెన్యూ భూములను అటవీశాఖ అధికారులకు చూపించి, అధికారులు సమ్మతిస్తే సర్వే చేయిస్తామన్నారు. అవసరమైతే అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయ పరుచుకొని త్వరతిగతిన భూములను అటవీశాఖ అధికారులకు అప్పగించే  ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. వచ్చే వారంలో మరోసారి సమావేశం నిర్వహించి పనుల వేగాన్ని పెంచి భూములను అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్.ఇ  బాబురావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, మార్కాపురం డి.ఎఫ్.వొ బబిత, గుంటూరు డి.ఎఫ్.వొ రామచంద్రరావు, గురజాల ఆర్.డి.వొ. పార్ధ సారధి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, బొల్లాపల్లి,వెల్దుర్తి తహాశీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-07 15:14:41

థర్డ్ వేవ్ ని సమర్ధవంతంగా అడ్డకోవాలి..

కోవిడ్–19 మూడవ వేవ్ లో ఎక్కువుగా పిల్లలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున చిన్నపిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కోవిడ్–19 మూడవ వేవ్  ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతితో కలిసి వైద్యారోగ్యశాఖ అధికారులు, పిల్లల వైద్య నిపుణులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ సోకిన పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించటానికి పిడియాట్రిక్ వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులలో పిల్లలకు వైద్యసేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పిల్లల చికిత్సకు సంబంధించి సీహెచ్సీ, పీహెచ్సీతో పాటు అన్ని వైద్యశాలలోని  నర్సింగ్ సిబ్బందికి, వైద్యులకు చిన్నపిల్లల వైద్యనిపుణులతో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలకు వైద్యచికిత్సకు వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్మెంట్ పై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు అందిస్తే వైద్యనిపుణుల కమిటీలో చర్చించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. 
  రాష్ట్ర పిడియాట్రిక్స్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు డా. చంద్రశేఖర్ రెడ్డి ధర్డ్ వేవ్లో కరోనా వైరస్ బారిన పడే పిల్లలకు అందించాల్సిన వైద్యచికిత్సలు, నివారణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డా. యాస్మిన్, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూరింటెండెంట్ డా. ప్రభావతి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డా. కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల పీడియాట్రిక్స్ విభాగం హెచ్వోడీలు పాల్గొన్నారు.

Guntur

2021-06-07 14:16:58

బలవర్థక ఆహారంతో రోగనిరోధక శక్తి పెంపు..

కరోనా సోకిన సమయంలో మంచి ఆహారం తీసుకుంటూ, కోవిడ్ తగ్గిన తరువాత కూడా బలమైన పోషక ఆహార పదార్ధాలను మరియు చిన్న పిల్లలు, చిన్న పిల్లల తల్లితండ్రులు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు తగిన జాగ్రత్తలు  తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రెవిన్యూ కళ్యాణ మండపం నందు  జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన పోషక ఆహార ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ  కోవిడ్ నుండి కోలుకున్న వారు  ఆహారం మంచిగా తీసుకోవాలని మరియు చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఆకుకూరలు, పండ్లు, కోడి గ్రుడ్డు, అనేక రకాలైన పోషక విలువలు కలిగిన పదార్ధాలను అందివ్వడం వలన నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పోషకాహార ఆవశ్యకత గురించి మండలాల్లో, గ్రామాల్లో ఇదే విధమైన పోషకాహార ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రజలు అవగాహన కల్పించాలన్నారు.  థర్డ్ వేవ్ వస్తుందన్న ఉహాగానాల నేపధ్యంలో చిన్న పిల్లల తల్లి తండ్రులు తగిన శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలందరూ మంచి ఆహార అలవాట్లను అలవరచుకోవాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వుండాలని ఆయన సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. 
 
  సంయుక్త కలెక్టర్ పి. ప్రశాంతి ( సచివాలయాలు, అభివృద్ధి )  మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ కోవిడ్ సమయంలో   గర్భవతులు, బాలింతలు, పసి పిల్లలు, చిన్న పిల్లలు కోవిడ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ చిన్న పిల్లల ఇమ్యునిటి పెరిగేందుకు తీసుకోవలసిన ఆహార పదార్ధాలతో ప్రదర్శన పెట్టడం చాలా బాగుందన్నారు.  సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి  మాట్లాడుతూ కోవిడ్ రెండవ  వేవ్ తగ్గుతున్న దశలో థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం ఉన్నందున చిన్న పిల్లల తల్లి తండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.  ట్రైనీ సహాయ కలెక్టర్ శుభం భన్సాల్ మాట్లాడుతూ అంగన్ వాడీ సెంటర్లు, సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు చిన్న పిల్లల తల్లితండ్రులకు కరోనా మహమ్మారీ పై ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు.  
  గుంటూరు ఆర్డిఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పిల్లల కొరకు కోవిడ్  కేర్ కేంద్రం అడవి తక్కెళ్ళపాడు లో ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. జే. యాస్మిన్ మాట్లాడుతూ  ఈ కోవిడ్ సమయంలో సమతుల్య ఆహార విటమిన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కరోనా సోకిన వ్యక్తులు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. న్యూట్రిషియన్ అనేది అన్ని రకాల ఆహార పదార్ధాలలో ఉంటుందని గమనించాలన్నారు. గర్బవతులు, బాలింతలు, చిన్న పిల్లలు ఏ సమయంలో ఎలా తినాలి అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పిల్లలకు ఇష్టమైన రీతిలో  మంచి బలమైన ఆహారాన్ని పెట్టాలన్నారు. 

  అనంతరం కోవిడ్ కు సంబంధించి చైల్డ్ రైట్స్ అడ్వేజరీ  ఫౌండేషన్  సంస్థ స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రాన్సిస్ తంబి చిన్న పిల్లల ఆహార పదార్దాలపై రూపొందించిన  బ్రోచర్ రిలీజ్ చేసారు.  ఈ కార్యక్రమంలో  ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ                        బి. మనోరంజని, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి,  సిపిడిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 

Guntur

2021-06-07 14:13:12

పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటుచేయండి..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ 5వ జోన్ 53వ వార్డు పరిధిలోని మర్రిపాలెంలో సాయినగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. పిన్ పాయింట్ వారీగా సిబ్బందిని సర్దుబాటు చేయనందున శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనికి నిర్దేశించిన పారిశుధ్య సిబ్బందిని అదే పనికి వినియోగించాలని ఒకరికి రెండు, మూడు పనులు చెప్పరాదని ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, రోడ్లను శుభ్రం చేసిన చిన్న చిన్న చెత్త కుప్పలను వెను వెంటనే తోలగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని ఆదేశించారు. 24x7 మంచినీటి కొరకు తవ్విన రోడ్లను పూడ్చలేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రోడ్లను రిపేరు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, డిసిపి శిల్పి, ఎఎంఒహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-06-07 13:56:49

రిమ్స్ కు పూర్తిస్థాయి ఆక్సిజన్..

శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో ఎన్.ఏ.సి.యల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత అక్సిజన్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజుతో కలిసి స్విచ్ ఆన్ చేసి ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించారు. సుమారు రూ.75 లక్షల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటును టాటా కన్సల్టెన్సీ ఇంజినీరింగ్ విభాగం కేవలం 20రోజుల్లోనే పూర్తిచేయడం గమనార్హం. ఈ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభంతో రిమ్స్ ఖాతాలోకి మరో ఆక్సిజన్ ప్లాంట్ అదనంగా చేరింది. దీంతో నేటినుండి రిమ్స్ లో మరింత మంది రోగులకు ఆక్సిజన్ అందించే అవకాశం కలగనుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిమిషానికి సుమారు 800 లీటర్ల వరకు ఆక్సిజన్ అందించనుందని, అలాగే 94 శాతం వరకు ప్యూరిటీ కలిగిఉంటుందని   రాష్ట్ర మంత్రులకు ఎన్.ఏ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.వరదరాజులు వివరించారు. సుమారు రూ. 75 లక్షల పెట్టుబడితో నిర్మించిన  ఈ ప్లాంటులో కొద్దిపాటి మార్పుల కొరకు దాదాపు రూ.30 లక్షలు వెచ్చించడం జరిగిందని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, రిమ్స్ సూపరింటెండెంట్   డా. ఎ.కృష్ణమూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.జె.కిశోర్, ఎన్.ఎ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంజినీరింగ్ సిబ్బంది , బృందం తదితరులు పేర్కొన్నారు.

Srikakulam

2021-06-07 13:48:20

రూ.1.30 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లింపు..

విశాఖ  జిల్లాలో కోవిడ్-19 వలన మరణించిన వారి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాన్ని విశాఖ జిల్లాలో 13 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ. ఒక కోటి  30 లక్షలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.  జిల్లాలో మొత్తం 13 మంది అనాధ పిల్లలను గుర్తించి వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరిగిందన్నారు వీరు, (1) మీసాల శ్రావణి (గాజువాక); (2) రెడ్డి భాగ్యశ్రీ, (సబ్బవరం); (3) పాంగి విష్ణు,(4) పాంగి జగన్ (పాడేరు), (5) పెర్ల మనోహర్ (విశాఖ మహరాణిపేట), (6) మీసాల ప్రసీద(కంచరపాలెం, గోపాలపట్నం), (7) చదరం బాల సాయి లక్ష్మీ(పెందుర్తి); (8) బుద్ధ ఉషశ్రీ, (9)బుద్ధ ప్రజ్వల్ కుమార్ (సీతమ్మధార, విశాఖపట్నం), (10) జెర్సింగి సందీప్  (పెదబయలు); (11) మంత్రి కౌషిక్ సూర్యప్రకాష్ (అనకాపల్లి), (12) కాండ్రకోట శ్రీచందన (13)కాండ్రకోట శ్రీమిధున్(అనకాపల్లి), పిల్లలకు రూ.10 లక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందన్నారు.  సదరు మొత్తాన్ని ఈ పిల్లలకు 25 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత వారికి ఇస్తారని,  అంత వరకూ ఈ సొమ్ము పై వచ్చే వడ్డీ వీరి పోషణకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. 

Collector Office

2021-06-07 13:26:05