1 ENS Live Breaking News

కోవిడ్ నియంత్రణకు ఆక్వారైతుల విరాళం రూ.31.76లక్షలు..

 కోవిడ్ రెండో ద‌శ ఉద్ధృతి నేప‌థ్యంలో సామాజిక బాధ్య‌త‌గా తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్ కోవిడ్ స‌హాయ‌నిధికి రూ.31,76,000 విరాళంగా అందించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో సంఘం ప్ర‌తినిధులు కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రరెడ్డి స‌మ‌క్షంలో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విప‌త్తు స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు వైద్య‌, ఇత‌ర సేవ‌లు అందించ‌డంలో ప్ర‌భుత్వం చేస్తున్న కృషిలో భాగ‌స్వామ్యమ‌వుతూ విరాళం అందించిన తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రైతుల అసోసియేషన్‌కు అభినంద‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లా ప్ర‌జ‌ల త‌రఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అహర్నిశలూ కృషి చేస్తున్న గౌరవ  ముఖ్య‌మంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, కలెక్టర్, ఎస్‌పీ, ప్రభుత్వ యంత్రాంగానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు సంఘం ప్ర‌తినిధులు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఫిష‌రీస్ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ‌, ఆక్వా రైతు సంఘం ప్ర‌తినిధులు సీహెచ్‌వీ సూర్యారావు, కుర్రా రఘు, వి.రాంబాబు, ఎం.సతీస్‌రాజు, పేరా బత్తులరాజశేఖర్, బుల్లి రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 10:47:26

లోక కల్యాణార్ధం కనకమ్మవారికి గంట్ల పూజలు..

కరోనా మహమ్మారి పీడలు సమసిపోయేలా శ్రీశ్రీశ్రీ కనకమహా లక్ష్మి అమ్మవారు సమస్త జీవకోటిని కరుణించాలని తల్లిని వేడుకున్నట్టు సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు చెప్పారు. శుక్రవారం హనుత్ జయంతి, ఏకాదశిని పురస్కరించుకొని విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో దేవాదాయశాఖ  ఆలయాల్లో యజ్ఞయాగాదులు చేపట్టడం ప్రశంసనీయమని  కొనియాడారు. భక్తులకు ఎలాటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ లో దర్శనాలు ప్రత్యేక సేవలు కల్పిస్తుందన్నారు.కరోనా వైరస్ నియంత్రణ జరిగి ప్రజలు సాధారణ జీవితం గడపాలన్నదే తన అబిమతమన్నారు. అంతకుముంద జివిఎంసీదుర్గాదేవి, తాటిచెట్లపాలెం అభయాంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీనుబాబు ప్రత్యేకంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. సమాజాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని తాను అమ్మ వార్లు,
స్వామి ని కోరుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక చోట్ల ధన్వంతరి హోమాలు,
యజ్ఞాలలో పాల్గొని పూజలు కూడాచేపట్టినట్టు గంట్ల వివరించారు. 

విశాఖసిటీ

2021-06-04 10:10:32

అంతర్జాతీయ స్థాయిలో నగర పార్కులు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె శివాజీ పార్క్ లోని హార్టికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ పార్కుతో పాటు జివిఎంసి పరిధిలోని సుమారు 170 కోలనీ పార్కులను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేశారని వాటిని నూతన హంగులతో ఆకర్షణీయంగా మార్పులు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, వివిధ ప్రతిభావంతులకు  ఉపయోగపడే విధంగా పార్క్ లను ఒకటికి పది సార్లు సందర్శకులు వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దడానికి  అధ్యయనం చేసి ఒక ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. పార్కులో వినూత్న సౌకర్యాలు కలిగి ఆర్గానిక్ పార్కు, ట్రాఫిక్ రూల్స్ మొదలైనవి ఏర్పాటు చేయాలని, అవి పిల్లలు నేర్చుకొనే విధంగా ఉండాలని, పార్కుల అభివృద్ధి కొరకు ఇతర రాష్ట్రాలలోని కొన్ని పార్కులను అధ్యయనం చేసి రావాలని కమిషనర్ అధికారులకు సూచించారు.       
ఈ పర్యటనలో ప్రధాన ఇంజినీరు పి. రవికృష్ణ రాజు, పర్యవేక్షక ఇంజినీర్లు వేణుగోపాల్, రాజా రావు, శ్యామ్సన్ రాజు, శివప్రసాద రాజు, రాయల్ బాబు, కార్యనిర్వాహక ఇంజినీరు (పి.ఎల్.& సి) మెహెర్ బాబా, అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం. దామోదర రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-03 16:37:44

విశాఖనగరంలో వేక్సినేషన్ కేంద్రాలివే..

మహా విశాఖపట్నం నగర పరిధిలోని  శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తించిన ప్రాంతాల్లో  కొవీషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు (45 సంవత్సరాలు పైబడిన వారికి),  రెండవ డోసు 84రోజులు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేస్తున్నట్టు జివిఎంసి కమిషనర్  డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. కొవీషీల్డ్ వేయి ప్రాంతాలు అల్లిపురం, భీమునిపట్నం,  బుచ్చిరాజుపాలెం,  చెంగల్ రావు పేట,  చిన్న వాల్తేర్, జ్ఞానపురం, మద్దిలపాలెం, నరవ,  వన్ టౌన్,  ఆర్.పి.పేట, సాగర్ నగర్, స్వర్ణ భారతి, అనకాపల్లి, మల్కాపురం, విద్యుత్ నగర్ర్, ఆరిలోవ  ఎఫ్.ఆర్.యు సెంటర్, మధురవాడ పి.హెచ్.సి., శ్రీహరిపురం ఎఫ్.ఆర్.యు సెంటర్, గాజువాక పి.హెచ్.సి., కణితి,  శ్రీహరిపురం, పెద గంట్యాడ పి.హెచ్.సి., ఆర్.హెచ్..సి. సింహాచలం, ఆర్.టి.సి. ఎం, దువ్వాడ పి.హెచ్.సి., గోపాలపట్నం పి.హెచ్.సి., ఫిషర్ మేన్ కోలనీ, కప్పరాడ, లక్ష్మి నగర్, ప్రసాద్ గార్డెన్స్, తగరపు వలస, బర్మా క్యాంపు, ఓల్డ్ గాజువాక, పెద్ద గంట్యాడ, శ్రీహరిపురం, యు.ఎఫ్.డబ్ల్యూ.సి.(అనకాపల్లి). ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషన్ తెలిపారు.  

విశాఖ సిటీ

2021-06-03 16:24:02

జగనన్న కాలనీలతో మరో అనంతను నిర్మాస్తున్నాం..

జగనన్న ఇళ్ల నిర్మాణం ద్వారా జిల్లాలో మరో అనంతను నిర్మించనున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లాలో 1044 గ్రామ పంచాయితీలు ఉండగా 1045 జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని.. అంటే మరో ఆనంతను నిర్మిస్తున్నామని కలెక్టర్ వివరించారు. పట్టణ శివారు ప్రాంతంలోని ధోని ముక్కల లేఅవుట్ లో నిర్వహించిన జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవ వేడుకలలో జిల్లా గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తాయని జిల్లాలో మాత్రం సమస్యలు లేకుండా భూ సేకరణ చేపట్టామన్నారు. రెవెన్యూ యంత్రాంగం కృషితో వివాదాస్పదం కాని భూమిని సేకరించడం, భూ హక్కుదారులకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించి సమస్యలను నివారించామన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ద్వారా జిల్లాలో దాదాపు 25 శాతం మంది లబ్ది పొందనున్నారన్నారు. మరెంతో మందికి ఉపాధి దక్కనుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 15 శాతంతో సమానమైన మొత్తాన్ని మొదటి విడత ఇళ్ల నిర్మాణాలకు కేటాయించడం అంటే ఈ కార్యక్రమం యొక్క భారీ తనాన్ని అర్థం చేసుకోవలన్నారు. ఒకప్పుడు అమెరికాలో ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు పేదలతో ఏదో ఒక పని చేయించి వారికి డబ్బులు అందించారని, మళ్లీ నేడు కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉపయోగ పడే ఇళ్ల నిర్మాణాల పనుల ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. 

Guntakal

2021-06-03 14:18:49

వాహన మిత్ర దరఖాస్తులు సత్వరం అప్లోడ్ చేయాలి..

వాహన మిత్ర పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిశీలించి అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.గురువారం మధ్యాహ్నం వాహన మిత్ర దరఖాస్తుల పరిశీలన మరియు సకాలంలో అప్లోడ్ చేసే అంశంపై జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్ తో కలిసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,మున్సిపల్ ఆర్డీ,జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీ లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మూడో విడత వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు  గ్రామ,వార్డు సచివాలయం పరిధిలో అందే దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీ లకు రెండు రోజుల గడువు మాత్రమే ఉందన్నారు.ఆ గడువులోపు వారికి అందిన దరఖాస్తులు అన్నింటిని ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకు పరిశీలించి అప్లోడ్ చేయాలన్నారు.అలాగే ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లకు కూడా ఈనెల 10,11తేదీ లోపు వారి పరిధిలో ఉన్న దరఖాస్తులలో 2 శాతం దరఖాస్తులను భౌతికంగా తనిఖీ చేయాలన్నారు. వారు ఈనెల 11వ తేదీ లోపు దరఖాస్తులను పరిశీలించి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

 ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, దరఖాస్తులు పరిశీలనకు తక్కువ వ్యవధి ఉన్నందున ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు,వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రెటరీలు వారికి నిర్దేశించిన గడువులోపు దరఖాస్తులను పరిశీలించాలన్నారు.లబ్ధిదారుల జాబితాను వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఉంచడం జరిగిందన్నారు.సొంతంగా ఆటో, టాక్సీ ,క్యాబ్, లైట్ వెహికల్ గూడ్స్ నడిపేవారు, ఆధార్ కార్డు,తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగి ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వాళ్ళ కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందేందుకు వీలుందన్నారు.పైన పేర్కొన్న అధికారులనుండి అందిన అప్లికేషన్లకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ ఆమోదించి 13,14 తేదీలలో ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు.

డిటిసి శివరాంకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వాహన మిత్ర పథకం కింద లబ్ధి పొందేందుకు గతంలో ఉన్న నియమ నిబంధనలతోపాటు ప్రభుత్వం మరో ఆరు నిబంధనను చేర్చిందన్నారు.దరఖాస్తుదారుడురాష్ట్ర ప్రభుత్వం అందించే ఏ ఇతర ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొంది ఉండరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని,ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులని,300 యూనిట్లు పైబడి విద్యుత్ వాడేవారు, మూడెకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల మెట్ట భూమి లేదా పది ఎకరాల వ్యవసాయ మరియు మెట్ట భూమి కలిగిన వారు అనర్హులన్నారు. అలాగే మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి అడుగుల గృహ మరియు వాణిజ్య స్థలం కలిగి ఉన్నవారు కూడా అనర్హులన్నారు. అయితే శానిటరీ వర్కర్లు సంబంధించి వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నప్పటికీ వారికి మినహాయింపు ఇచ్చారన్నారు.ఏరోజుకారోజు అండే దరఖాస్తు లన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.జిల్లాలో మొదటి విడతలో11,301 మందికి,రెండవ విడతలో13,200 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలిగించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్డీ నాగరాజు పాల్గొన్నారు.

Anantapur

2021-06-03 14:12:30

అప్పన్న ఆలయ శిల్పసంపదకు కొత్తరూపం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని చారిత్రక శిల్ప సంపదను భక్తులకు తెలియజేసే వినూత్న కార్యక్రమానికి ఈఓ ఎంవీ సూర్యకళ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా స్వామివారి ఆలయంలోని కళ్యాణ మండపంలోని శిల్పాలను మరింతగా కనిపించేలా వాటిని శుభ్రపరిస్తున్నారు. ఇక్కడి రాతి స్థంబాలపై వున్న అపురూప, దైవ శిల్పాలు కనిపించేలా వాటిని చక్కగా తైలంతో శుభ్రం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని వినియోగించి భక్తులకు వాటిని బాగా కనిపించేలా చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఈఓ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సింహాచల ఆలయ ఈఓగా చేసిన ఏ ఒక్కరూ చేయని ఈపని చేసి స్వామివారి ఆలయంలో వున్న ఏళ్ల కాలం నాటి శిల్ప కళ భక్తులు తిలకించే విధంగా తీసుకున్న ఈఓ సూర్యకళ చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ రోజుచేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ఈఓతో పాటు ఏఈఓ రాఘవకుమార్, స్థానాచార్యులు పాల్గొన్నారు. అంతకు ముందు శుభ్రం చేసిన శిల్పాలను ఈఓ దగ్గరుంచి పరిశీలించారు.

Simhachalam

2021-06-03 14:05:20

వచ్చే జూన్ నాటికి ఇళ్లు పూర్తిచేస్తాం..

 రాష్ట్రంలో మొదటి దశ గృహ నిర్మాణాలు 2022-జూన్ నాటికి యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  గురువారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి గృహ నిర్మాణాలకు వర్చ్యువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు.  జిల్లాలో ఈ కార్యక్రమం భీమిలి నియోజక వర్గం వెల్లంకి గ్రామంలో ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయన్నారు.  ప్రణాళికా బద్దమైన కాలనీలు నిర్మాణం జరుగుతుందని, ప్రతి ఇంటికి తాగునీరు, భూగర్భ డ్రైనేజి, భూ గర్భ విద్యుత్ లైన్లు, భూ గర్భ ఇంటర్ నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్థి ఉంటుందని చెప్పారు. లబ్దిదారులు స్వయానా నిర్మించుకొంటామంటే వారికి నాణ్యమైన సిమెంటు, ఇనుములను సరసమైన ధరలకు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, ఇందుకు గ్రామ స్థాయిలో గోడౌన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  ప్రతి జిల్లాకు గృహ నిర్మాణాలు చూసుకొనేందుకు ఒక జాయింట్ కలెక్టర్ ను నియమించనున్నట్లు వెల్లడించారు.  అర్హత గల ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టాలు జారీ చేసి గృహ నిర్మాణాలు చేస్తామన్నారు. ఎవరైనా తప్పిపోతే అలాంటి వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొంటే పరిశీలన చేసి అర్హత గల లబ్దిదారులైతే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు జారీ చేస్తారని తెలిపారు.  
  అనంతరం భీమిలి నియోజక వర్గం  ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 303 గృహాలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, ఆర్డిఓ పెంచల కిషోర్, గృహ నిర్మాణ శాఖ పిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో మొదటి దశలో 5 వేల గృహాలకు, 90 కోట్లు రూపాయలు అంచనా విలువతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.  వారం రోజుల పాటు గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని, భీమిలి నియోజక వర్గం ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో 303 గృహాలకు శంఖుస్థాపన చేయడమైనదని, 5.45 కోట్ల రూపాయల అంచనా విలువతో నిర్మించడం జరుగుతుదరన్నారు. ప్రైవేటు లే అఔట్ లలో ఉన్నట్లుగానే గృహాల నిర్మాణాలు, భూ గర్భ డ్రైనేజి, విద్యుత్, ఇంటర్ నెట్ ఇతర మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపారు.  ఒక్కొక్కరికి ఇంటి స్థలం, గృహం నిర్మాణం కలిపి 5 లక్షలు నుండి 15 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్లు  ఉంటుందని చెప్పారు.  పాదయాత్రంలో ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని తెలిపారు.  జిల్లాకు అత్యధిక గృహాలు మంజూరుకు అధికారుల కృషి చేశారని, ఇళ్ల స్థలాలు మంజూరు పారదర్శకంగా జరిగిందన్నారు.  
  జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్య్చువల్ విధానంలో ప్రారంభించినట్లు చెప్పారు.  జిల్లాలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.  జిల్లాలో గృహాలు నిర్మాణాలకు లబ్దిదారులు ఎవరైనా ముందుకు వస్తే అలాంటి వారికి నాణ్యమైన మెటీయల్ సరసమైన ధరలకు ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు.   హౌసింగ్ పై  ఒక జాయింట్ కలెక్టర్ ను ప్రభుత్వం నియమిస్తుందని వెల్లడించారు.  కోర్టు కేసులు ఉన్న ఇంటి స్థలాలు కోవిడ్ కారణంగా కోర్టులు జరుగుటలేదని, కోర్టు కేసులు పూర్తి చేసుకొని త్వరితగతిన  ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

Bheemili

2021-06-03 13:46:07

బ్లాక్ ఫంగస్ రాకుండా ముందుగా సూచించండి..

శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కాకుండా ముందస్తు సూచనలు చేయాలని వైద్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కోరారు. పలువురు బ్లాక్ ఫంగస్ భారీన పడటం జరుగుతోందని దానిని నివారించుటకు గల అవకాశాలు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులతో కరోనా, బ్లాక్ ఫంగస్ తదితర అంశాలపై గురు వారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. వైద్యుడు దేవునితో సమానంగా అందరూ భావిస్తారని ఇదే క్రమంలో కోవిడ్ లో వైద్యులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైద్యులు అందిస్తున్న సేవలు వలన ప్రభుత్వానికి గౌరవం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో జిల్లా కలెక్టర్, వైద్యులు మంచి సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రతి అంశాన్ని విజయవంతంగా పరిష్కరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర పురోగతిలో కరోనా మహమ్మారి పెద్ద ఆటంకంగా మారిందని దానిని కూడా అధిగమించే విధంగా వైద్యులు పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని, ఎంత ఖర్చు అయినా భరించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. స్ఫూర్తివంతమైన సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.

      రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన వారికి పడకల ఏర్పాటులో పక్కాగా ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ క్రింద చేరే వారికి పడకలు కేటాయించే అంశంపై తగు అవగాహన కలిగించాలని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య శ్రీ క్రింద కరోనా చికిత్స అందించుటకు చిత్తశుద్ధితో ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద రెండవ దఫా కరోనాలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో అద్భుతంగా పనిచేసిందని, ఎక్కడా ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించారని అభినందించారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

        జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కోవిడ్ చికిత్స అనంతరం బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తుతుందన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేకంగా పడకలు కేటాయించామని పేర్కొన్నారు. అవసరమగు మందులను ప్రభుత్వం సరఫరా చేసిందని చెప్పారు. చిన్నపిల్లల్లో కరోనా కేసులు వస్తున్నాయని, వాటికి మంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పిల్లలు త్వరగా వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో చిన్నారులకు సంబంధించిన వెంటిలేటర్లు ఇతర సామగ్రి కొంత మేర అవసరం ఉందని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఆక్సిజన్ లో స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తున్నామని, పి.ఎస్.ఏ ప్లాంట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు చేస్తున్నామని వివరించారు. రిమ్స్ లో ఆక్సిజన్ పడకలకు ఆక్సిజన్ పూర్తి స్ధాయిలో అందించగలమని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, వైద్యులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-03 13:41:20

గర్భిణీలకు, పిల్లలకు పోషకాల ఆహారం..

భావిత‌రాల బంగారు భ‌విష్య‌త్ ల‌క్ష్యంగా.. ఆరోగ్య‌క‌ర స‌మాజాన్ని సాకారం చేసే దిశ‌గా.. త‌ల్లిగ‌ర్భం నుంచే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది వేయాల‌నే సంక‌ల్పంతో పోష‌క బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్‌) ఈ నెల నుంచి అంగ‌న్‌వాడీ కేంద్రాలు, పాఠ‌శాల‌ల‌కు పంపిణీకి శ్రీకారం చుట్టిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. గురువారం కాకినాడ‌లోని క్యాంపు కార్యాల‌యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, అధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఫోర్టిఫైడ్ బియ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూపొందించిన  పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ‌ర్భిణులు, బాలింత‌ల‌తో పాటు అంగ‌న్‌వాడీలు, పాఠ‌శాలల్లోని చిన్నారుల్లో పోష‌కాల లేమిని నివారించేందుకు ఈ పోష‌క బియ్యం ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. సాధార‌ణ బియ్యానికి అద‌నంగా ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, ఖ‌నిజ‌ల‌వ‌ణాలను చేర్చ‌డం ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం త‌యార‌వుతాయ‌ని, వంద గ్రాముల ఫోర్టిఫైడ్ బియ్యంలో ఐర‌న్ 4.25 మిల్లీ గ్రాములు, ఫోలిక్ యాసిడ్ 12.5 మైక్రో గ్రాములు, విట‌మిన్ (బీ12) 0.125 మైక్రోగ్రాములు ఉంటాయ‌ని వివ‌రించారు. ర‌క్త‌హీన‌త నివార‌ణ‌కు ఐర‌న్‌, గ‌ర్భ‌స్థ శిశు వికాసానికి ఫోలిక్ ఆమ్లం, నాడీ వ్య‌వ‌స్థ అభివృద్ధికి విట‌మిన్ బీ12 ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌హిళ‌లు, చిన్నారుల‌కు స‌మ‌తుల పోష‌కాహారం అందించేందుకు 5,546 అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు, 3,542 పాఠ‌శాల‌ల‌కు మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కానికి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి నెలా అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు 3,595 క్వింటాళ్లు, పాఠ‌శాల‌ల‌కు 5,438 క్వింటాళ్ల పోష‌క బియ్యాన్ని పంపిణీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 100 కిలోల సాధార‌ణ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని క‌లిపి పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 
    జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలోని 21 పౌర స‌ర‌ఫ‌రా మండ‌ల‌స్థాయి గోదాముల నుంచి 2,659 చౌక ధ‌ర‌ల దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌లో 76,350 ట‌న్నుల ఫోర్టిఫైడ్ బియ్యాన్ని త‌యారుచేయించి 38 వేల ట‌న్నుల‌ను విజ‌య‌న‌గ‌రం జిల్లాకు, 30 వేల ట‌న్నుల‌ను ఎనిమిది ఇత‌ర జిల్లాల‌కు పంపిన‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో సివిల్‌సప్ల‌య్స్ డీఎం ఇ.ల‌క్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్ర‌సాద‌రావు, ఐసీడీఎస్ పీడీ జీవీ స‌త్య‌వాణి, ఏడీ (మిడ్ డే మీల్స్‌) పి.నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-03 13:24:34

కరోనాలో రక్షణగా జ్నానవేణి నిశ్వార్ధసేవ..

ఆమె ఆదేశించే అధికారిణికాదు..ఆపదసమయంలో రక్షణగా నిలిచే అధికారిణి.. నా అనేవారు లేనివారికి సేవలందించడమే కాదు..తన వద్ద పనిచేసే సిబ్బందికి సరైన సమయంలో చేయూత నిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు..ఆమె ఎవరోకాదు విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి.. అవును మీరు చదువుతున్నది నిజమే.. కరోనా సమయంలో సిబ్బంది కరోనా వైరస్ భారిన పడకుండా ఈ అధికారిణి చేస్తున్న నిశ్వార్ధ సేవ ఇపుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.. ఇంటింటీకి రేషన్ సరుకులు పంపిణీ చేసే సమయంలో సంచార బియ్యం పంపిణీ సిబ్బంది కరోనా భారిన పడకుండా వారికి తన సొంత నిధులతో సేఫ్టీ కిట్ లను వితరణ చేశారు..అంతేకాదు ప్రభుత్వం వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించడంతో జాయింట్ కలెక్టర్ సహాయంతో వారందరికీ  పంపిణీ కార్యక్రమానికి రెండు రోజులు ముందుగానే దగ్గరుండి కరోనా టీకాలు వేయించారు..ఆపై ప్రజల్లో తిరిగే సమయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలంటూ సిబ్బంది మొత్తానికి జాగ్రత్తలు చెప్పి బియ్యం పంపిణీకి వెళ్లే సమయంలో అందరికీ హేండ్ గ్లౌజ్ లు, శానిటైజర్లు, ఫేస్ మాస్కు కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా వైరస్ కేసులు అధికంగా వున్నసమయంలో ప్రజలకు నిరంతరం సేవలందించాలంటే అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఎందరో దాతలు ముందుకు వచ్చి చేస్తున్న సేవలు తనను ఎంతగానో ఆలోచింపచేశాయని, దీనితో రెండు దఫాలుగా మొబైల్ డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది తన వంతుగా సహాయం చేశానన్నారు. ఎల్లప్పుడూ తనదైన రీతిలో సేవలు అందించే విశాఖలోని అర్భన్ తహశీల్దార్ సేవలను ఇటు అధికారులు, అటు సామాజిక వేత్తలు ఎంతగానో అభినందిస్తున్నారు..మంచి అధికారులు ఈ విధంగా సేవలు చేయడానికి ముందుకొస్తే కరోనా సమయంలో ఎంతో మేలు జరుగుతుందంటూ కితాబునిస్తున్నారు.. ప్రార్ధించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పదాలను అమలు చేస్తున్న ఈ అధికారిణి సేవలు మరింతగా ఆపన్నులకు అందాలని ఆశిద్ధాం..!

Seethammadara

2021-06-03 13:15:12

సచివాలయాల్లో సత్వరమే సేవలందాలి..

మహావిశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె రెండవ జోన్ 6వ వార్డులోని మదురవాడలో బక్కన్నపాలెం  ఎస్.సి. కోలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్నారు. 42వ సచివాలయ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణ. తడి-పొడి చెత్త సేకరణ, రోడ్లు, కాలువలు శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు నూరు శాతం అమలు చేస్తున్నారని స్థానిక ప్రజలు తెలపగా ఆ వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ సంతోష్,  శానిటరి కార్యదర్శి టి. జానకీ కుమారిను కమిషనర్ అభినందించారు. ఇదే స్ఫూర్తి తో జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని సచివాలయాల కార్యదర్శులు నిబద్దతతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని కమిషనర్ తెలిపారు. ప్రతి రోజు సేకరించిన చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ప్రతీ దుకాణాల ముందు మూడు రంగుల చెత్త బుట్టలు ఉండాలని, నిషేదిత ప్లాస్టిక్, క్యారీ బ్యాగులు అమ్మరాదని, అమ్మిన యడల వారికి జరిమానా విధించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రతీ రోజు త్రాగు నీరు వస్తున్నదీ లేనిదీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని స్థానిక ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అన్ని లైట్స్ వెలిగేలా చూడాలని ఎలక్ట్రికల్ విభాగపు సహాయక ఇంజినీరును ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీజనల్ వ్యాదులపై ఇంటింట సర్వే జరపాలని వెటర్నరి డాక్టరు కిషోర్ ను ఆదేశించారు. ఇంటి ఆవరణలోను, కుండీలలోను నీరు నిల్వ ఉంచకుండా ప్రతి శుక్రవారం “డ్రై” డే పాటించాలని సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ బి. రాము, వెటర్నరి డాక్టరు కిషోర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, సుధాకర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు వంశీ, సహాయక ఇంజినీర్లు, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-03 12:53:09

నెలాఖరులోగా నాడు-నేడు పూర్తికావాలి..

నాడు - నేడు పాఠశాలల అభివృద్థి పనులు ఈ నెల 25వ తేదీలోగా నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాడు - నేడు పాఠశాలల అభివృద్థి పనులపై సంబంధి త అధి కారులతో గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశం ఆయన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పాఠశాలల అభివృద్థి కార్యక్రమాలలో ఎదురైన సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మాణ పనులు అధికశాతం పూర్తయినప్పటికి సాంకేతిక సమస్యలతో బిల్లుల చెల్లింపులు నిలిచాయన్నారు. వాటిని తక్షణమే అందజేయాలన్నారు. పాఠశాలల అభివృద్థి కమిటి, తల్లిదండ్రుల కమిటీల ఆధ్వర్యంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. మొదటిదశలో 1,348 పాఠశాలల్లో అభివృద్థి కార్యక్రమాలు జరిగాయన్నారు. అదనంగా మరో 40పాఠశాలలను అభివృద్థి చేసినట్లు వివరించారు. జిల్లాలో రూ. 329 కోట్ల నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, విద్యుద్దీకరణ, త్రాగునీటి వసతి, ఆధునీక ఉపకరణాల ఏర్పాటు, మరమ్మతు పనులు చేపట్టారని ఆయన వివరించారు. ఏ.పి.ఇ.డబ్ల్యు.ఐ.డి.సి., ఇంజినీరింగ్ విభాగం ద్వారా 157 పాఠశాలల్లో రూ.90.06 కోట్ల నిధ ులతో 80.3
శాతం పనులు చేపట్టారని ఆయన తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా 45 పాఠశాలలో
రూ. 11.01 కోట్లతో 95.4 శాతం పనులు జరిగాయన్నారు. పంచాయతీ రాజ్ ద్వారా 648 పాఠశాలల్లో
రూ.55.8 కోట్లతో 55.9 శాతం పనులు జరిగాయన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా 498 పాఠశాలల్లో
రూ. 66.8 కోట్ల నిధులతో 64.4 శాతం పనులు జరిగాయన్నారు. ఆయా పాఠశాలల్లో 19,482 కంప్యూటర్లు
జిల్లాకు వచ్చాయన్నారు. 1,627 మేజర్ , మైనర్ పనులు పూర్తి చెయ్యాల్సి ఉండగా ప్రస్తుతం 1,310
పనులు పూర్తయ్యాయన్నారు.

పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం
కల్పించాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి అవసరమైన
పరిస్థితులు కల్పించాలని ఆయన పలు సూచనలు చేశారు. నాడు - నేడు పాఠశాలల అభివృద్థిలో
భాగంగా రెండవ విడతలో జిల్లాలో 1,309 పాఠశాలలను ఎంపికి చేసి ప్రభుత్వం జాబితా విడుదల
చేసిందన్నారు. 805 ప్రాధమిక పాఠశాలలు, 51 ప్రాధమికోన్నత పాఠశాలలు, 194 ఉన్నత పాఠశాలలు,
31 జూనియర్ కాలేజీలు, 135 ప్రభుత్వ వసతి గృహాలు, ఒక డైట్ కళాశాల, 56 ఎం.ఆర్.సి.ఎస్.
భవనాలు, 36 భవిత సెంటర్లను ఎంపిక చేసిందన్నారు. మొదటివిడతలో అభివృద్థి పనులు చేపట్టిన
ఇంజినీరింగ్ అధికారులు రెండవ విడతలోనూ ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇంజినీర్లు ముందస్తు
పరిశీలన చేసి అంచనాలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఇంజినీర్లు క్షేత్రస్థాయి పరిశీలన
తప్పనిసరిగా చెయ్యాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్థి) టి.ఎస్.చేతన్, డి.ఇ.ఓ.
వి.ఎస్.సుబ్బారావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏ.పి.సి. శ్రీనివాసరెడ్డి, పి.ఆర్. ఎస్.ఇ. కొండయ్య,
ప్రజారోగ్య విభాగం జిల్లా కో ఆర్డినేటర్ సుంద రరామి రెడ్డి, ఏ.పి.ఇ.డబ్ల్యు.ఐ.డి.సి. డి.ఇ. పి.భాస్కరబాబు
తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-03 12:49:43

పిల్లలు, గర్భిణీలకు బలవర్ధక బియ్యం..

మెరుగైన పోష‌కాహారాన్ని అందించే ల‌క్ష్యంతో, ఈ నెల నుంచి ప్ర‌స్తుతం ఉన్న సార్టెక్స్ బియ్యానికి బ‌దులు, అన్ని పోష‌కాల‌తో కూడిన బ‌ల‌వ‌ర్థ‌క బియ్యాన్ని పిల్ల‌ల‌కు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నామని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క బియ్యం పంపిణీ ద్వారా 50,675 మంది 3-6 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సుగ‌ల పిల్ల‌లు, 32,493 మంది గ‌ర్భిణీస్త్రీలు, బాలింత‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్ ద్వారా ఈ నెల నుంచే బ‌ల‌వ‌ర్థ‌క బియ్యాన్ని అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు జిల్లా మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింద‌ని తెలిపారు. ఈ బియ్యంలో విట‌మిన్లు, ఖ‌నిజాలు త‌దిత‌ర పోష‌కాలు మిళిత‌మై ఉంటాయ‌న్నారు. ముఖ్యంగా ఈ బ‌ల‌వ‌ర్థ‌క బియ్యంలో ఐర‌న్‌, ఫోలిక్ యాసిడ్‌, ఎదుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డే బి12 విట‌మిన్లు, నాడీ వ్య‌వ‌స్థ అభివృద్దికి దోహ‌ద‌డ‌పే సూక్ష్మ పోష‌కాలు ఉంటాయ‌ని తెలిపారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా పోష‌కాహార లోపాలు తొల‌గి, వారి ఆరోగ్యం మ‌రింత మెరుగుప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2021-06-03 12:42:42