1 ENS Live Breaking News

ఓటమి భయంతో అధికారపార్టీ దిగజారుడు చర్యలు

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమి భయంతో దిగజారుడు పద్ధతులు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతు న్నదని  ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, ఎ.అజ శర్మ ఆరోపించారు. ఆదివారం విశాఖలోని ఆయన మీడియాతో మాట్లాడారు. 250 కు పైగా ప్రజా సంఘాల మద్దత్తుతో, పిడిఎఫ్ అభ్యర్ధిగా  డాక్టర్ కోరెడ్ల రమాప్రభ పోటీ చేస్తున్నారని.. అయితే అదే పేరు గల వేరే అభ్యర్ధితో వైసిపి ఆఖరి రోజున నామినేషన్  వేయించిందని అన్నారు. ఓటర్లను గందరగోళ పరచడానికే ఈ విధం చేయడం అధికారపార్టీ దిగజారుడు చర్యకు నిరదర్శనమన్నారు. ఇటీవలే ఏయూ వీసి అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో దశపల్లా హోటల్ లో సమావేశం నిర్వహిం చి ఓటర్లను ప్రలోభపెట్టారన్న..వీరి కుతంత్రాలను తిప్పికొట్టి, వివేకవంతులయిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు,  మన ప్రాంత  ప్రజల వాణిని చట్ట సభలో సమర్ధవంతంగా  వినిపించగలిగే డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలన్నారు.

Visakhapatnam

2023-02-26 06:04:03

విశ్వనాధ్, వాణీజయరాం సేవలు చిరస్మరణీయం

తెలుగునాట కళాతపస్వీ కె.విశ్వనాధ్, వాణిజయరాం అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. తెలుగు చలనచిత్ర రంగం ద్వారా ప్రజల గుండెల్లో వారు శాశ్వతంగా గుర్తిండిపోతారన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కె.విశ్వనాధ్, వాణిజయరామ్ ల పేరిట స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహించారు. పైడా విద్యాసం స్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాడి సత్యనారాయణ,  సినీనటుడు ప్రస న్నకుమార్, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, మహ్మద్ ఖాన్, యాద్ కుమార్, రవితేజ, సంఘం కార్యదర్శి కృష్ణ కిషోర్ తదితరులంతా విశ్వనాద్, వాణిజయరాంల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియే షన్ కార్యదర్శి కిషోర్, ఆర్గనైజర్ అప్పారావు, విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్ధన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివజ్యోతి, రాథో గణేష్ , రమేష్ తో పాటు పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-25 16:19:09

అవినీతి రికార్డు అసిస్టెంటు అనిల్ ను ఇంటికి పంపాం

అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం వ్రత టిక్కెట్ల అమ్మకాల్లో గోల్ మాల్ చేసిన అవినీతి రికార్డు అసిస్టెంట్ టి.అనిల్ కుమార్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు ఈఓ మూర్తి తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈఎన్ఎస్ ప్రతినిధితో చరవాణిలో మాట్లాడారు. వ్రతటిక్కె ట్లలో(రూ.800) జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి, ఆనివేదికను కమిషనర్ కు పంపామని చెప్పారు. దీనితో ఆయన ఆదేశాల మేరకు సదరు ఉద్యోగిపై వేటు వేసినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా దేవస్థానంలో ఏ విభాగంలో అవినీతి జరిగినా సహించేది లేదని, ఏ స్థాయి ఉద్యోగిపైనైనా అవినీతి ఆరోపణలు, లిఖిత పూర్వక ఫిర్యా దులు వస్తే తక్షణమే విచారణచేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానంలోని అన్ని విభాగాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మీడియా ద్రుష్టికి అవినీతి వ్యవహారాలు నేరుగా తనకు తెలియజేవచ్చునని స్పష్టం చేశారు.

Annavaram

2023-02-25 15:42:11

ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు పక్కగా ఉండాలి

విశాఖలో వచ్చే నెల 16వ తేదిన నిర్వహించబోయే ఎం .ఎల్.సి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లలో  ఎటువంటి  లోటు పాట్లు జరగకుండా చూడాలని  అధికారులను ఎం.ఎల్.సి. ఎన్నికల  పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం  స్థానిక స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ను ఎం.ఎల్.సి. ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్ట్రాంగ్ రూమ్ లను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని  తనిఖీ చేసారు. అదే విదంగా రిసెప్సన్  కౌంటర్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో  చేపడుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని,  పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో  రెవెన్యూ డివిజనల్ అధికారులు హుసేన్ సాహేబ్, భాస్కర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వెంకటేశ్వర్లు,  సీతమ్మ ధార్ తాహసిల్దార్ శ్యామ్ ప్రసాద్, జి.వి.ఎం.సి సిబ్బందిపాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-25 14:24:06

సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌తో ఎంఓయు

తిరుమలలో టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక, ఉన్నత పాఠశాల శనివారం సాయంత్రం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన  సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకుంది. తిరుమలలోని బంగ్లాలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి సమక్షంలో దేవస్థానం విద్యాసంస్థల తరఫున డిఇవో డా. భాస్కర్ రెడ్డి, సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి  అరుణ్ మహేష్ అగర్వాల్‌తో పాటు సింఘానియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్తి రేవతి శ్రీనివాసన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. 

       ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా విద్యా ప్రమాణాలు పెరిగి భారతదేశంలోని ఉన్నతమైన పాఠశాలగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ లెర్నింగ్, బోధనా పద్ధతులు, విశ్లేషణా సామర్థ్యం తదితర అంశాల్లో ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా విద్య నాణ్యతను మెరుగుపరచాలని సింఘానియా ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రతినిధులను ఆయన కోరారు. అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యా బోధనాంశాలపై దృష్టి పెట్టాలని, తద్వారా దేశంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

       శిక్షణ పొందిన అధ్యాపకులతో గుణాత్మక విద్యను అందించేందుకు తమవంతు కృషి చేస్తామని సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రేమాండ్ గ్రూప్ సిఎండి గౌతమ్ సింఘానియా జీవిత ఆశయమని, ఇందులో భాగంగా టిటిడితో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కృష్ణమూర్తి, విద్యా విభాగం ఏఈవో ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్  మమత పాల్గొన్నారు. 

Tirumala

2023-02-25 14:15:32

పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన

వినియోగ దారుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించని పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆ రంగంలోని నిపుణులతో  త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.  తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఆమె  అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, పంచగవ్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉపయోగించడం లేదన్నారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమనే విషయంపై అర నిముషం , నిముషం నిడివిగల కాన్సప్ట్ ప్రకటనలు తయారు చేయాలన్నారు. ప్రసార,ప్రచార సాధనాలు,సోషల్ మీడియా ద్వారా  ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.  రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల ,తిరుపతికి వస్తున్నందువల్ల టీటీడీ సత్రాలు , రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ , వివిధ ఆలయాల వద్ద హోర్డింగులు ఏర్పాటుచేసి పంచగవ్య ఉత్పత్తుల వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహనకల్పించాలన్నారు .
పంచగవ్య సోపులు,షాంపులు, పళ్ళపొడి, ముక్కులో వేసుకునే చుక్కలు తదితర ఉత్పత్తుల్లో డిమాండ్ ఉన్న వాటిని గుర్తించి వాటి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని  సదా భార్గవి అధికారులకు సూచించారు. ఎస్వీ బీసీ, టీటీడీ వెబ్సైట్ లో కూడా ఇందుకు సంబంధించి ప్రచారం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.  టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగరబత్తులకు విశేష స్పందన వస్తోందని ఆమె వివరించారు. త్వరలోనే రెండవ యూనిట్ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి అగరబత్తులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు  జరుగుతున్నాయన్నారు. ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న దేవతా మూర్తుల ఫొటోలు,కీచైన్లు, పేపర్ వెయిట్లు తదితర ఉత్పత్తుల గురించి కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలా ప్రచారం చేయాలన్నారు.

    ఎస్వీ ఆయర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో  గుణభూషణ రెడ్డి , అదనపు ఎఫ్ ఎసి ఎవో  శ్రీ రవిప్రసాద్,ఐటి  జనరల్ మేనేజర్  సందీప్ ,ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి  రామరాజు,పంచగవ్య ఉత్పత్తుల విభాగం ఎఈవో  శ్రీనివాస్ , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు.

Tirupati

2023-02-25 14:11:59

శ్రీనివాససేతు 3వదశ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 6 స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు  అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో శనివారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వైపు, తిరుచానూరు మార్కెటింగ్ యార్డ్ వరకు ఉన్న శ్రీనివాస సేతు పనులను మార్చి 15వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. 

     శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 89 శాతం  పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా  మే 15వ తేదీ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.   అదేవిధంగా పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద  పచ్చదనం పెంపొందించాలని,  అవసరమైన చోట్ల పెయింటింగు, తదితర పనులపై ఈవో సమీక్షించారు.   ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి,  వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ సీ ఏవో  బాలాజీ, సిఇ  నాగేశ్వరరావు,  మున్సిపల్ ఎస్ఇ   మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-02-25 14:00:22

కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు పక్కగా ఏర్పాట్లు చేయాలి

కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న పలు  పోటీ పరీక్షలకు  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు  కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈనెల 25, 26  తేదీలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  SWAYAM జులై -2022 సెమిస్టరు పరీక్షలు, తేది . 26.02.2023 న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించు జూనియర్ ఇంజనీర్ , తేది. 02.03.2023 నుండి 07.03.2023 వరకు జరుగు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. అభ్యర్థులు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు గైడ్ లైన్స్ తు.చా తప్పకుండా పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. 

ప్రశ్నాపత్రాలు చేరవేత మొదలుకొని పరీక్ష పూర్తయ్యాక బండిల్స్ ను చేరవేసే వరకు నిబంధనలను అనుసరించి పనిచేయాలని లైజనింగ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ లకు ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు,  క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచెస్, ఇతర స్మార్ట్ పరికరాలను తీసుకురాకూడదని ఆయన చెప్పారు.  విద్యార్థులు వారి పరీక్ష సమయం కంటే అరగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.పరీక్ష నిర్వహించబడు రోజున  విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని , త్రాగు నీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.  ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు . ఈ పరీక్షకు ఎలాంటి లోపాలు తలెత్తకుండా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ ఎస్ సి అధికారులు, జీవిఎంసి, పోలీస్, మెడికల్, ఈపిడిసిఎల్ వివిధ కాలేజీ ల లైజనింగ్ ఆఫీసర్లు, రెవెన్యూ సంబంధిత  శాఖల అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-23 16:25:41

జి-20 సదస్సు పనులు వేగవంతం చేయాలి

విశాఖలో మార్చి 3, 4 తేదీలలో జిల్లాలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వస్ట్మెంట్ సదస్సుకు సంబందించి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  గురువారం ఉదయం గ్లోబల్ ఇన్వస్ట్మెంట్ సదస్సు నిర్వహించే ఆంధ్రాయూనివర్సిటి గ్రౌండును నగర పోలీసు కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ పి.రాజాబాబులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పరిశీలించారు.  అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై  అధికారులను అడిగి తెలుసుకున్నారు.  వివిద దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరౌతారని, వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం స్థానిక ఉడా పార్కు ప్రక్కన గల ఎం .జి.ఎం పార్కును అక్కడ జరుగుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ  కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, జి.వి.ఎం .సి, అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-02-23 15:59:52

తూర్పు డెల్టాలో రబీకి సాగునీరు అందించండి

తూర్పు సెంట్రల్ డెల్టాలో రబీ సాగుకు సంబంధించి సాగునీటి  ఎద్దడి సమస్యలు పరిష్కారం కొరకు సీలేరు నుండి అదనపు జలాలను విడుదల చేయాలని, డెల్టా ప్రాంతం లో కాలువలలో పూడికతీతకు  నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డిని కోరారు. గురువారం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ 26 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు తీరు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం స్త్రీ శిశు సంక్షే మం, పాఠశాల విద్య, గ్రామ వార్డు సచివాలయాల స్పందన గ్రీవెన్స్ పరిష్కారం ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో రబీ సాగుకు సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా అదనంగా సీలేరు నుండి జలాలను విడుదల చేయాలని కాలువల్లో పూడుకు పోయిన తూడును తొలగించేందుకు నిధులు కేటాయించాలని కోరామ న్నారు.

 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు శాఖల వారీగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యాప్ లో నమోదు చేసి పోషకాహార లోపాలు, రక్తహీనత తదితర అంశాలలో లక్షిత వర్గాల వారికి పోషకాహార పథకాలను వర్తింపజేస్తూ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. 8 పారామీటర్లను రక్తహీనత, పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. బాలా మృతం వైయస్సార్ సంపూర్ణ పోష ణ, గోరుముద్ద ,పోషకాహార కిట్లు టేకు హోం రేషన్ ప్రక్రియల ద్వారా పోషకాహార లోపాలను శాఖల సమ న్వయంతో సరిదిద్దేందుకు పటిష్ట మైన చర్యలు గైకొని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఏఎన్ఎం, వసతి గృహ సంక్షేమ అధికారులు, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు పోషకాహారం లోపా లను గుర్తించి ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లేదా పీహెచ్సీ వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సహకారంతో  తక్కువ బరువు ,వయసుకు తగ్గ ఎత్తు తదితర అంశాలలో వృద్ధిరే టును మానిటరింగ్ చేస్తూ ఆరోగ్య కర సమాజ స్థాపన దిశగా ముంద డుగు వేయాలన్నారు.

 కిషోర బాలి కల పోషకార లోపాలు, టీనేజ్ ప్రె గ్నెన్సీ నివారణ అంశాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. ఆయు ష్మాన్ భారత్  హెల్త్ కార్డులు ఇకేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాల ద్వారా బాలల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. కమ్యూన కబుల్ వ్యాధులు, నాన్ కమ్యూనక బుల్  వ్యాధులు నియం త్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నా రు కంటి వెలుగు కార్య క్రమాన్ని జూలైలోపు పూర్తి చేయాలన్నారు గర్భిణీల ప్రసవ ప్రణాళిక ,కాన్పు ప్రమాదకరమని భావించిన గర్భిణీల ప్రసవాల పట్ల అప్రమత్తంగా వ్యవ హరించాలన్నారు. బడిబయటి పిల్లలు లేకుండా విద్యాశాఖ అధి కారులు ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. సచివాలయాలలో స్పందన గ్రీవెన్స్ ను సకాలంలో పరిష్కరించి సచివాల వ్యవస్థ పనితీరు పట్ల విశ్వసనీయతను అర్జీదారులలో పెంపొందించాలన్నారు. సచివాల యాల్లో ఖాళీలు భర్తీకి ఆదాయ ధ్రువపత్రాలు జారికి వివిధ సంక్షేమ పథకాల అమలుకు వివక్షతకు తావు లేకుండా  అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.. 

సాగునీటి ఎద్దటి సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే వివిధ డ్రైనేజీలపై 42 క్రాస్ బండ్లు నిర్మించి మోటార్లు, ఆయిల్ ఇంజన్ ద్వారా నీటి ఎద్దడి ఉన్న సాగు క్షేత్రాలకు సాగు నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. అర్బన్ హెల్త్ మిషన్ గ్రామీణ హెల్త్ మిషన్ ద్వారా ఇంటింటిని  ఏఎన్ఎంలు సంద ర్శించి రోగాల బారిన పడిన వారి ఆరోగ్య పరిరక్షణకై దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామా జిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ  త్వరగా కోలుకునే విధంగా పాటుపడాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర బాబు సిపిఓ వెంకటేశ్వర్లు డిఎంహె చ్వో ఎం దుర్గారావు దొర, ఐసిడిఎస్ పిడి జీవి సత్య వాణి ,గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి భీమేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఇ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నా రు.

Amalapuram

2023-02-23 15:46:47

48 గ్రామాల్లో భూమి రీసర్వే సత్వరం పూర్తిచేయాలి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2వ దశ లో కేటాయించిన 48 గ్రామాలలో భూముల రీ సర్వేకి సంబందించి గ్రౌండ్ ట్రుతింగ్ ప్రక్రియ మార్చి 15 నాటికి పూర్తి పూర్తిచే యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులు ఆదేశించారు.  గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ లు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లు ,జాయింట్ కలెక్టర్లతో నిర్వహించి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష రీ సర్వే లోని పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  రీసర్వేకి సంబంధించి గ్రౌండ్ ట్రు తింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్,13 నోటిఫికేషన్, 9(2) నోటిఫికేషన్ జారీ, రెవిన్యూ రికార్డుల స్వచ్ఛీ కరణ, డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్, వెక్టర్లెజేషన్, గ్రామ సర్వేయర్ విఆర్వో లాగిన్ లలో డేటా ఎంట్రీ, రోజువారీగా రోవర్స్ వినియోగం, సరిహద్దు పాయింట్లు గుర్తింపు, సరిహద్దు రాళ్లు ఏర్పా టు ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు.

 ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సర్వేటీంలను, సర్వే మరియు రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ రీ సర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ప్రక్రియలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జరిగేలా అదికారులు, సిబ్బంది నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. భూ యజమానుల రికార్డుల తయారీ తప్పులు లేకుండా సిద్ధం చేయా లన్నారు. స్వామిత్ర పథకం ద్వారా జరుగుతున్న గ్రామ కంఠాల సర్వేని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశ రి సర్వేలో 66 గ్రామా లలో 43 గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాలు పంపిణీ చేయ డం జరిగిందన్నారు. మిగిలిన గ్రామా లు పురోగతిలో ఉన్నాయన్నారు. రెండోదశకి సంబంధించి 49 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని వీటిలో 48 గ్రామాలలో సర్వే ప్రారంభమైందని  తెలిపారు. ఒక గ్రామానికి సంబంధించి రికా ర్డులు అందుబాటులో లేనందున జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మొత్తం రెండు దశల లో 115 గ్రామాలు ఎంపిక చేయగా కోనసీమ జిల్లాలో ఉన్న మొత్తం 315 గ్రామాల్లో ఇంకా 200 గ్రామాలకు ఆర్థోరేక్టిఫై మ్యాపులు రావాల్సిందని ఆయన తెలిపారు. 

సర్వే పూర్తయిన గ్రామాలలో ఏ క్లాస్ బి క్లాస్ సరిహద్దురాళ్లు ఏర్పాటుకు సంబంధించి 1,19,742 రాళ్లు అవసరం ఉండగా 69,180 సరిహద్దు రాళ్లు సరఫరా చేయడం జరిగిందన్నారు. రోజువారీగా 7,865 సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతోoదని ఆయన తెలిపారు. సరిహద్దురాళ్లు అంతర్గత రవాణా ఏర్పాట్లు స్థానికం గా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచిం చారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రోజువారీగా రోవర్స్ ద్వారా పాయిం ట్లు గుర్తించాలని సూచిం చారు. సరిహద్దు రాళ్లు ఏర్పాటుకు సంబం ధించి మార్కింగ్, ఫిట్టింగ్ ప్రక్రియ లలో రైతుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేప ట్టాలన్నారు. రెవెన్యూ సిబ్బంది ముటేషన్లు, క్లాసిఫికేషన్లు చేపట్టాల ని సూచించారు. ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ సహాయ సంచాలకులు సర్వే బృందాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచిం చారు.  ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు  గోపాలకృష్ణ లంక భూములు సర్వేయర్ ప్రసాదు, సెక్షన్ సూపరింటెండెంట్, రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2023-02-23 15:37:41

ఎస్వీబీసీ ఛానల్ దేశమంతటా ప్రసారంచేయాలి

ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి గురువారం సమీక్ష  నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కైంకర్యాలు, పండుగలు, ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తుని చెంతకు తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైందన్నారు.  ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ ఛానళ్లు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ కు కూడా ప్రాచుర్యం కల్పించేందుకు హిందీ మాట్లాడే ప్రాంతాలలో జియో వంటి వేదిక అవసరమన్నారు. జియో ఫైబర్ నెట్ ప్లాట్‌ఫారమ్‌లో ఎస్వీబీసీ  హిందీ ఛానల్ ను ప్రసారం చేయడం, ఎస్వీబీసీ ఆన్‌లైన్ రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించడంపై జియో అధికారులతో చర్చించాలని ఎస్వీబీసీ సిఈఓను  షణ్ముఖ్‌కుమార్,  ఆదేశించారు. జియో వైస్ ప్రెసిడెంట్(ముంబై),  ఐటి జిఎం సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-02-23 13:27:11

ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత చాలా కీలకం

ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత అత్యంత కీలకమైనదని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు గురువారం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలన్నారు. పి.ఓ.ల విధులు, పోలింగ్ సామగ్రి, ఎన్నికలముందు నిర్వహించాల్సిన ప్రక్రియ, బ్యాలెట్ బాక్సులు సీజ్ చేసే విధానంపై అధికారులు అవగాహన పొందాలన్నారు. బ్యాలెట్ పత్రాల వినియోగం, డిక్లరేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికలలో పి.ఓ.లు బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరుపై ఆయన అవగాహన కల్పించారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

 బాపట్ల జిల్లా పరిధిలోని 13 మండలాలలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలననుసరించి పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సామగ్రి తరలించడంలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వినియోగం, ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల వినియోగం, డిక్లరేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. టెండర్ బ్యాలెట్ వంటి అంశాలపై అధికారులు అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల సామాగ్రి తరలింపు, ఎన్నికల తదుపరి బ్యాలెట్ బాక్సులు అత్యంత భద్రతల మధ్య తరలించాల్సివుందన్నారు. ఎన్నికల విధి విధానాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్.డి.ఓ. పి. సరోజిని, బాపట్ల ఆర్.డి.ఓ. జి. రవీందర్, పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.

Bapatla

2023-02-23 10:52:42

నగర సుందరీకరణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యత

జి-20 సదస్సుకు ఇరవై దేశాల ప్రథినిధులు రానున్న నేపథ్యంలో సదస్సులు జరిగే సమయంలో పారిశుధ్య కార్మికులను ఆయా ప్రాంతాలలో వుంచి రోడ్డును నిరంతరం శుభ్రంగా వుంచే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పి రాజాబాబు పేర్కొన్నారు.  గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖ ఎన్ఏడి జంక్షన్ నుండి మురళి నగర్ జంక్షన్ జాతీయ రహదారి వరకు పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతాలను తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి సుందరీకరణ పనులు క్షున్నంగా పరిశీలించేందుకు నడక మార్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టామన్నారు. రహదారికి  ఇరువైపులా, సెంట్రల్ మీడియంలోను పారిశుధ్య కార్మీకులచే శుభ్రం చేయించాలని, చెట్లు, ఎలెక్ట్రికల్ పోల్సు, గోడలకు ఉన్న ప్రకటనల బోర్డులు, కేబుల్ వైర్లు, పోస్టర్లను తొలగించి శుభ్రం చేయాలన్నారు.అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-23 09:39:51

28 న వి.జె.ఎఫ్ కళారంగ ప్రోత్సాహక పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కళారంగంలో మార్చి7న ప్రోత్సాహక పోటీలను నిర్వహిస్తున్నట్లు విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు పేర్కొన్నారు. గురువాం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన ఓంశాంతి ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు.  గీతాలాపన రంగవల్లులు విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. పాటల పోటీలు ఎంట్రీలను మహిళా ప్రభుత్వ కళాశాల టీచర్ నంబర్ డాక్టర్ కె వి.వేణి ఫోన్ నంబర్  939 3114901... రంగవల్లులు ఎంట్రీ లకు సంబంధించి విజేఎఫ్ కార్యవర్గ సభ్యురాలు పి. వరలక్ష్మీ నంబర్ 9059308958 లలో సంప్ర దించాలి ఆని కోరారు. ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటలులోగా పంపాలన్నారు.  గీతాలాపన పోటీలో 10 నుంచి 15 సంవత్సరాలు లోపు వారిని జూనియర్స్ గాను పదహారేళ్లు పైబడిన వారిని సీనియర్స్ గానూ పరిగణిస్తామన్నారు.  ఈ కార్య క్రమంలో విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-23 09:05:15