1 ENS Live Breaking News

కరోనాలో దాతల సహాయం మరువరానిది..

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో కీలకమని, ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ కరోనా సోకిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం కరోనా నేపథ్యంలో 4 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను విజయవాడకు చెందిన డార్మెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ రత్నారెడ్డి జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. డార్మెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డార్విన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి రత్నారెడ్డి మాట్లాడుతూ కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న స్నేహితులు కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా నిధులను సేకరించి ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 4 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశామని, మరో వారం పది రోజుల్లోగా మరికొన్ని అందిస్తామన్నారు. ఒక్కో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్ ఒక లక్ష 5 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ ఆక్సిజన్ ప్లాంట్ అల్లాబక్ష, అమెరికా డాక్టర్లు వి.రవికుమార్, ఎన్. మురళీ లు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-20 15:19:03

ఎంఎన్ఓని విధుల నుంచి తప్పించండి..

అనంతపురం క్యాన్సర్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎమ్మెన్వోగా పనిచేస్తున్న సాంబ శివుడు అనే వ్యక్తిని విధుల నుంచి తొలగించాలని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంటును ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు అనుమతి లేకుండా  కరోనా పాజిటివ్ వ్యక్తులను  బలవంతంగా అడ్మిట్ చేసి, ఆసుపత్రి వైద్య సిబ్బంది మధ్య అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించారని ఎమ్మెన్వో మీద ఆరోపణలు రాగా, ఆరోపణలపై విచారణ చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్ అధికారి సదరు ఎమ్మెన్వోను తొలగించాలని సిఫార్సులు చేస్తూ నివేదిక ఇచ్చారు. నివేదిక ప్రకారం ఎమ్మెన్వో సాంబ శివుడుని  విధుల నుంచి తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంటును ఆదేశించారు. 

Anantapur

2021-05-20 14:43:24

జ‌గ‌న‌న్న కాల‌నీల‌పై ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ పెట్టండి..

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో ఏర్పాటు చేసిన జ‌గ‌న‌న్న కాల‌నీల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు త్వ‌రి త‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అభివృద్ధికి సంబంధించిన ప‌నుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధికారుల‌ను ఆదేశించారు. ఇళ్ల స్థ‌లాలకు సంబంధించిన‌ జియో-ట్యాగింగ్, రిజిస్ట్రేషన్లు, గ్రౌండింగ్‌ ప్ర‌క్రియ త్వ‌ర‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని చెప్పారు. జిల్లాలో ఇప్ప‌టి వర‌కు  జియో ట్యాగింగ్ 89 శాతం, రిజిస్ట్రేష‌న్లు 67 శాతం పూర్త‌య్యాయ‌ని ఈ నెల 25వ తేదీ లోగా 100 శాతం పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల్లో వ‌స‌తుల క‌ల్ప‌న‌, మౌలిక స‌దుపాయాల ఏర్పాటు, జియో ట్యాగింగ్ ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై గురువారం ఆన్‌లైన్‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ముందుగా మండ‌లాల వారీగా ప్ర‌త్యేక అధికారులో మాట్లాడారు. ఆయా లే అవుట్లలో జ‌రిగిన ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. నిర్ణీత గ‌డువులోగా సాంకేతిక ప్ర‌క్రియ‌లు అన్నీ పూర్తి చేయాల‌ని అధికారుల‌కు నిర్దేశించారు. జియో ట్యాగింగ్, రిజిస్ట్రేష‌న్లు, గ్రౌండింగ్‌, తాగునీటి స‌దుపాయం, విద్యుత్తు సౌక‌ర్యం త‌క్కువ‌గా జ‌రిగిన ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇళ్ల స్థలాల‌కు జ‌రిగిన జియో ట్యాగింగ్‌కు.. జిల్లా అధికారుల వ‌ద్ద ఉన్న జాబితాల‌కు వివ‌రాల్లో తేడా ఉండ‌టంతో స‌రి చేయాల‌ని హౌసింగ్ పీడీకి క‌లెక్ట‌ర్ సూచించారు. తాగునీటి వ‌స‌తికి సంబంధించి తీసుకున్న చ‌ర్య‌ల‌పై ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ రవికుమార్‌ను అడిగారు. విద్యుత్ సౌక‌ర్య ఏర్పాట్ల‌పై ఈపీడీసీఎల్ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు త్వ‌రిత‌గ‌తిన విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, సంబంధిత ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. ల‌బ్ధిదారుల‌కు కేటాయించిన ఇళ్ల స్థ‌లాల‌కు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను రెండు రోజుల్లో ముగించాల‌ని ఆదేశించారు. డిజిట‌ల్ అసిస్టెంట్ల సాయంతో గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని చెప్పారు. అలాగే జాబ్ కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోంద‌ని.. త‌గిన చ‌ర్య‌లు తీసుకొని సంబంధిత నివేదిక‌ను అంద‌జేయాల‌ని జేసీ వెంక‌ట‌రావుకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే ప‌ట్ట‌ణ ప్రాంతాల ప‌రిధిలోని లేఅవుట్ల‌లో సాంకేతిక ప్ర‌క్రియ‌లు త‌క్కువ‌గా అయ్యాయ‌ని.. వీటిపై దృష్టి సారించాల‌ని పేర్కొన్నారు. అలాగే మెటీరియ‌ల్‌కి సంబంధించి మైనింగ్ శాఖ అధికారుల‌తో సంప్ర‌దించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హౌసింగ్ పీడీకి సూచించారు. మ్యాపింగ్ ప్ర‌క్రియ స‌జావుగా.. త‌ప్పులు లేకుండా చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. 

స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించండి..

జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 67 శాతం మాత్ర‌మే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేష‌న్లు అయ్యాయ‌ని వీటిని 100 శాతానికి చేర్చ‌డానికి చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. రెండు రోజుల పాటు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌టం ద్వారా రిజిస్ట్రేష‌న్ల సంఖ్య‌ను పెంచాల‌ని సూచించారు. ఈ నెల 23వ తేదీ నాటికి నిర్దేశించిన ల‌క్ష్యం మేర‌కు రిజిస్ట్రేష‌న్లు చేయించాల‌ని జేసీ వెంక‌ట‌రావును కలెక్ట‌ర్ ఆదేశించారు. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల‌ను అనుసరించి ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాల‌ని చెప్పారు. 

ప‌క్కాగా విద్యుదీక‌ర‌ణ ప‌నులు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర‌కు జ‌గ‌న‌న్న కాల‌నీల్లో విద్యుదీక‌ర‌ణకు సంబంధించి స‌ర్వేలు నిర్వ‌హించి ప‌నులు చేప‌ట్టాల‌ని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. 50 ప్లాట్స్ లోప‌ల ఉంటే స్థంబాల ద్వారా.. 1500 ప్లాట్స్ కంటే ఎక్కువ ఉన్న లేఅవుట్ల‌లో భూగ‌ర్భ విద్యుత్ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. త్వ‌రిత‌గ‌తిన డీపీఆర్ స‌మ‌ర్పించి సంబంధిత ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ప్రారంభించాల‌ని చెప్పారు. 

స‌మావేశంలో జేసీలు కిశోర్ కుమార్‌, వెంక‌ట‌రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ర‌మ‌ణ మూర్తి, ఆర్డీవో భ‌వానీ శంక‌ర్‌, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ రవికుమార్‌, ఈపీడీసీఎల్ ఎస్ఈ విష్ణు, ప్ర‌త్యేక అధికారులు వెంక‌టేశ్వ‌ర్లు, విజ‌య‌ల‌క్ష్మి, హౌసింగ్ ఈఈలు, డీఈఈలు, ఏఈలు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

కలెక్టర్

2021-05-20 14:34:26

కరోనా కట్టడికి వ్యూహాత్మక చర్యలు..

కరోనా కట్టడికి అధికారులు వ్యూహాత్మక చర్యలు చేపట్టి గిరిజన గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రాజెక్ట్ అధికారి తన ఛాంబర్లో జూమ్ ద్వారా సబ్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,ఉప వైద్య ఆరోగ్య అధికారి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, వివిధ ఆసుపత్రుల డాక్టర్స్, కోవిడ్ నియోజక వర్గ , మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, పంచాయతీ అధికారులతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్ నివారణా నిర్వహణ గిరిజన ప్రాంతాలలో నిర్వహణ, సుచనలపై  జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, అనంతరం ప్రాజెక్ట్ ఆదికారీ కోవిడ్ నియంత్రణకు అలాగే కరోనా పాజిటివ్ వచ్చినవారికి అందజేస్తున్న సేవలు తదితర పనుల నిర్వహణ పై అరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కరోనా రెండవ వేవ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా గ్రామీణ మరియు సెమీ అర్బన్ కమ్యూనిటీ ద్వారా ప్రజలలో మెరుగైన అవగహన కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్రస్థాయి ఆరికట్టడనికి  అన్ని స్థాయిలలో ప్రాథమిక స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయలని కల్పించి, ఇతర అవసరమైన ఆరోగ్య సేవలను అందించడం అవసరం అన్నారు. అలాగే గ్రామానికి చెందిన ఆశా, గ్రామ వోలెంటిర్ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలి, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వేరు చేయాలి. వారికి నిర్వహించిన పరీక్షా ఫలితాలు వచ్చేవరకు ఇతరుల నుండి వేరుగా ఉండేలా చూసుకోవాలి అని వారికి సలహా ఇవ్వాలన్నారు.

గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు

       గ్రామంలో కరోనా రోజు వారి పరిస్థితి పర్యవేక్షణ కోసం అన్ని సూచనలు అమలు అయ్యే విధంగా సర్పంచ్ ఛైర్మెన్ గా, ఎ. ఎన్. ఎం కన్వీనర్ గా ఆశా, వి.హెచ్. ఎస్.ఎన్.సి, గ్రామ వాలెంటిర్, పి.ఆర్.ఐ సభ్యులు - మెంబర్లు గా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐ సొలేషన్, క్వారెంటైన్ కేంద్రం లేదా ఆసుపత్రులలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందజేయాలన్నారు.  ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు అవగాహన కల్పించాలన్నారు.  అవగాహన లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుందన్నారు.  దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఆధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామాలలో  ఫీవర్ సర్వే వేగవంతం చేయాలని పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్ ఉంచి వారికి కిట్లు అందజేయాలన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలలో దైర్యం కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ప్రోజెక్ట్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు వందల సంఖ్యలో కరోనా నుంచి కొల్కొని డిస్చార్జ్ అవుతున్నారని వారిని ఆదర్శంగా చూపించి మిగిలిన వారిలో దైర్యం నింపాలని సూచించారు. అలాగే ఫీల్డులో ఉన్న మెడికల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.  పరిస్థితి మెరుగు పడడానికి ప్రతి ఒక్కరు భాద్యతగా విధులు నిర్వహించాలన్నారు. అలాగే ఆన్ని పి.హెచ్.సి, సి.హెచ్.సి, ఆసుపత్రులు, క్వారెంటైన్ కేంద్రాలలో ఆక్సీజన్, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

         ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ విదేహ ఖరె, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రమణ కుమారి,ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవి కుమార్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, వివిధ ఆసుపత్రుల డాక్టర్స్, కోవిడ్ నియోజక వర్గ , మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి. ఓ లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-05-20 13:33:43

జర్నలిస్టులకు కోవిడ్ వేక్సినేషన్..

ఒంగోలు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కోవిడ్ వేక్సినేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సమాచార పౌరసంబధాలశాఖ అధికారులను ఆదేశించారు. మీడియా సంస్థల వారీగా జర్నలిస్టుల వివరాలను సేకరించి ప్రతీ ఒక్కరికీ కోవిడ్ టీకా వేయాలన్నారు. గురువారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మేరకు 21, 22 తేదీల్లో ఆయా మీడియా సంస్థలు వారి సంస్థలో పనిచేసే జర్నలిస్టుల వివరాలను సమాచారశాఖ కార్యాలయానికి అందించాల్సి వుంటుంది. పాత్రికేయునిపేరు, వయస్సు, హోదా, పనిచేస్తున్న సంస్థ పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు వివరాలను తెలియజేస్తూ తెలియజేయాలన్నారు. కోవిడ్ టీకా ఎప్పుడు వేసేది సమాచారం అందిస్తామని కలెక్టర్ వివరించారు. కరోనా కేసులు అధికంగా వున్న నేపథ్యంలో జర్నలిస్టులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం ప్రకటించారు.

Prakasam

2021-05-20 13:19:42

గ్రామ కోవిడ్ కమిటీలు ఏర్పాటుచేయాలి..

గ్రామస్థాయి కోవిడ్ యాజమాన్య కమిటీ (కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణపై గురువారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ను  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో కోవిడ్ యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం మండల స్థాయిలో సర్పంచులు అందరితో యాజమాన్య కమిటీ ఏర్పాటుపై సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయి యాజమాన్య కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా ఉంటారని, ఏఎన్ఎం సమన్వయకర్తగా ఉంటారని, ఆశా, వాలంటీర్లు, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులు   సభ్యులుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయి యాజమాన్య కమిటీ గ్రామస్థాయిలో కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసు కలిగిన ఇంటివద్ద బారికేడింగ్ నిర్మించి ఆ ఇంటి నుండి పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తులు బయటకు రాకుండా చూడాలని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు లేదు అనే నెపంతో ప్రైమరి కాంటాక్ట్ లు అనేక మంది బయటకు తిరుగుతున్నారని, అటువంటి అవకాశాన్ని ఎవరికీ ఇవ్వరాదని ఆయన స్పష్టం చేసారు. ఒక ఇంటిలో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులకు పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రైమరి కాంట్రాక్టులు బయట తిరగడం వలన కరోనా వ్యాప్తి అధికం అవుతుందని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఉపాధి హామీ పథకానికి వస్తున్నట్లు సమాచారం ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అటువంటి వ్యక్తులు ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులకు పనులు కల్పించరాదని ఆయన పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తుల జాబితాలను గ్రామంలో గ్రామ ఐక్య సంఘం అధ్యక్షులకు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కు ప్రతి రోజూ అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో గ్రామ యాజమాన్య కమిటీ పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆయన పేర్కొంటూ గ్రామ పంచాయతీ పరిధిలో రద్దీగా ఉండే మార్కెట్లు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో మరింత ఎక్కువ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య పనులను నిర్లక్ష్యం చేయడానికి లేదని ఆయన చెప్పారు. గ్రామంలో కరోనా లక్షణాలు ఉన్నవారు, కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ గా ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించి వారి నమూనాలను తీయాలని అటువంటి సమాచారాన్ని సేకరించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో పంచాయతీ సర్పంచ్ విధిగా మాస్కులు ధరించి ఆదర్శవంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడం, వ్యక్తుల మధ్య దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచడం విధిగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ అంశాలను గ్రామాల్లో ఎక్కువగా తెలియజేయాలని సూచించారు.

 పాజిటివ్ లేని గ్రామాలకు ప్రోత్సాహకాలు :

పాజిటివ్ కేసులు లేని గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. గ్రామం నిర్దేశించిన సమయంలో జీరో పాజిటివ్ కేసులతో ఉంటే అటువంటి గ్రామాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించుటకు యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏ గ్రామం కరోనా రహిత గ్రామంగా ఆవిర్భావం చెందుతుందో పరిశీలించాలని అన్నారు. కరోనా రహిత గ్రామాలుగా ఆవిర్భావం చెందుటకు ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి వ్యక్తి ఆదర్శవంతంగా ఉంటూ మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని అన్నారు. గ్రామంలో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు లేదా అనుమానం ఉన్న వ్యక్తులు కూడా పరీక్షలు చేసుకోవాలని తద్వారా గ్రామం పూర్తిగా పాజిటివ్ కేసులు లేని గ్రామాలుగా ఉండాలని వివరించారు. ఏ గ్రామం మొదటి గ్రామంగా వస్తుందో వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.

        జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ , హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని వాలంటీర్లు, ఏఎన్ఎంలు  సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని అన్నారు. మెడికల్ కిట్లు అందజేయాలని, కంటైన్మెంట్ జోన్లను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-20 12:29:58

ప్రజలు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలి..

కరోనా రెండవ దశ పట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.   గురువారం ఉదయం 6 గంటల సమయంలో మంత్రి కార్యాలయంకు స్వల్ప సంఖ్యలో మాత్రమే ప్రజలు వచ్చారు. ఒక గ్రామానికి చెందిన వృద్ధురాలు తమ గ్రామంలో పలువురు కరోనా బారిన పడుతున్నారని మంత్రి పేర్ని నానికి తెలిపింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ఫ్యూ సడలించిన వేళ ప్రజలు విచ్చలవిడిగా సంచరించడం ఏమాత్రం తగదని హెచ్చరిస్తూ, కరోనా వైరస్  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో విజృంభిస్తుందనీ, నెల కిందట వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకుతున్నాయని ఎంతో విచారమన్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయిని తెలిపారు. పల్లెల నుంచి రైతులు ప్రతిరోజు కూరగాయలు రైతుబజార్లకు తీసుకొస్తున్నారని, మరోవైపు పండ్లు అమ్మడానికి పట్టణాలకు వచ్చి వెళ్తున్నారన్నారు. పట్టణాలకు వచ్చే ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో అందులో ఒక్కరికి ఉన్నా మిగతా వారికి వ్యాపిస్తుందని వివరించారు. గ్రామాల్లో అమ్మవారి జాతరలు, పండుగ పేరుతో సామూహిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఇటువంటి చర్యల కారణంగా వేగంగా కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు.   తన కార్యాలయంకు వచ్చిన  దళిత నాయకులు చాట్రగడ్డ ప్రసాద్ (గడ్డం ప్రసాద్)కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం మంత్రి పేర్ని నాని వెలుపలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాడేపల్లి హడావిడిగా ప్రయాణమయ్యారు.  

Machilipatnam

2021-05-20 12:12:43

రూ.25 లక్షల ఆక్సిజన్ పరికరాల వితరణ..

కరోనా నియంత్రణ, బాధితుల సహాయంలో దాతల సహకారం మరువలేనిదని జిల్లా కలెక్ట్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు.  కోవిడ్-19 నివారణలో భాగంగా హోమి బాబా కేన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ సెంటర్, 20 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు జిల్లా కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో గురువారం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మరింత మంది దాతలు ముందుకి రావడం ద్వారా కోవిడ్ రోగులకు సహాయం సత్వరం అందుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు ఉన్నారు.  ఇందులో 10 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్స్, 10 పోర్టబుల్ ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు ఉన్నట్లు డా. మల్లేశ్వరరావు తెలిపారు.  ఇవి సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 

Collector Office

2021-05-20 12:06:03

ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ..

కోవిడ్ తో పోరాటానికి  కొత్త వ్యూహాలు, పరిష్కారాలు అవసరమని  ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ  పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేసు లు తగ్గుతున్నప్పటికి  గ్రామాలను కరోనా రహితంగా ఉంచడం కోసం కోవిడ్ నిర్దిష్ట ప్రవర్తనను అనుసరించేలా అవగాహన కల్పించాలన్నారు.   గురువారం ఉదయం న్యూ ఢిల్లీ నుండి కోవిడ్ కట్టడి చర్యల పై  రాష్త్రాల ముఖ్యమంత్రులు , జిల్లా కలెక్టర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జిల్లా  కలెక్టర్లతో మాట్లాడి కోవిడ్ పరీక్షలు, వాక్సినేషన్, కోవిడ్ కేర్  కేంద్రాల పై  ఆరా తీసారు.  కేసులను తగ్గించడానికి ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు మాట్లాడే  అవకాశం రాగా అక్కడ చేపడుతున్న చర్యల పై ఆయన వివరించారు.  అనంతరం ప్రధాని  మాట్లాడుతూ  కోవిడ్ కట్టడికి నూతన విధానాలను కనిపెట్టి  అమలు చేసేలా చూడాలన్నారు.  స్థానిక పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని  అక్కడి సవాళ్ళకు తగ్గట్టుగా కార్యాచరణ చేపట్టాలన్నారు.  ప్రజల నుండి కూడా అభి ప్రాయాన్ని సేకరించి వారి ఆలోచనలను కూడా ఆచరణ లో పెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు.  నిరంతరం నూతన పద్ధతులను అన్వేషిస్తూ,  ఎప్పటికప్పుడు  అప్ డేట్ కావాలని,  ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపాలని అన్నారు.  వాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ, వాక్సిన్ వృధా ను అరికట్టాలని, వాక్సినేషన్ వద్ద గుంపులుగా ఉండకుండా నియమానుసారం జరిగేలా చూడాలన్నారు.
          అంతకు ముందు కేంద్ర కుటుంభ సంక్షేమ శాఖ కార్యదర్శి దేశంలోని కోవిడ్ పరిస్థితుల ను  పవర్ పాయింట్  ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దేశం లో జరుపుతున్న పరీక్షలు,  పోజిటివిటి  శాతం, మరణాలు, ఆసుపత్రులు, పడకలు, ఆక్సిజన్ నిల్వలు, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాల పై వివరించారు.  పలు  రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడి లో   అమలు చేస్తున్న ఉత్తమ అభ్యాసాలను వివరించారు. దేశం లో పోజిటివిటి  రేట్ 16.9 శాతం గా ఉందని పేర్కొన్నారు.  రెండు డోస్ లలో కలిపి  మొత్తంగా ఇంతవరకు 18.70 కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిరోధం పై విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  24/7 పని చేసేలా ప్రతి జిల్లాలోను కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గ్రామ స్థాయి లో విశ్లేషించాలి:   జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  
            వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ గ్రామ, వార్డ్ స్థాయి లో పోజిటివ్ కేసు లను, మరణాలను విశ్లేషించాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రమణ కుమారికి సూచించారు.  గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలనీ, వాటిని సమీక్షించి, భవిష్యత్ ప్రణాళికలను వేయడం జరుగుతుందని అన్నారు.  గ్రామాల్లో అవగాహన కల్పించడానికి  గ్రామ స్థాయి బృందాలను కూడా ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.  వెంటనే డేటా ను తాయారు చేసి సమర్పించాలన్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త వ్యూహాలను తాయారు చేస్తామన్నారు.

Vizianagaram

2021-05-20 11:59:44

గ్రామాల్లోనే ఐసోలేష‌న్ కేంద్రాలు..

గ్రామ‌స్థాయిలో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేశామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ చెప్పారు. వీటి నిర్వ‌హ‌ణ‌కు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని కోరారు.  వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌హేష్ కుమార్ త‌న ఛాంబ‌ర్‌లో గురువారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. కొన్నిచోట్ల గ్రామ‌స్తులు, తాము కోవిడ్ తో బాధ ప‌డుతున్న‌ప్ప‌టికీ, వివిధ కార‌ణాల‌తో కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌డానికి విముఖ‌త చూపిస్తున్నార‌ని చెప్పారు. ఇలాంటి చోట వారు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ప్ప‌టికీ, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, వారినుంచి ఇత‌రుల‌కు వ్యాధి వ్యాపిస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అందువ‌ల్ల‌  25 శాతం పాజిటివిటీ ఉన్నగ్రామాల్లో, స్థానికంగానే ఐసోలేష‌న్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. త‌మ గ్రామంలోనే ఉండటానికి గ్రామ‌స్తులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌, వారిని స్థానిక ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లిస్తామ‌న్నారు.  గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల లేదా ఇత‌ర ప్ర‌భుత్వ భ‌వ‌నంలో 20 నుంచి 40 ప‌డ‌క‌ల‌తో ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్ని వ‌స‌తుల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తుంద‌ని, నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ల‌ను మాత్రం ఎన్‌జిఓలు చూడాల్సి ఉంటుంద‌న్నారు. దీనికోసం ఒక్కో మండ‌లానికీ ఒక్కో స్వ‌చ్చంద సంస్థ‌ను నోడ‌ల్ ఎన్‌జిఓగా ఎంపిక చేస్తామ‌న్నారు.
                    ప‌డ‌క‌లు, మందులు, వైద్య స‌హాయాన్ని తామే అందిస్తామ‌ని, భోజ‌నం, పారిశుధ్యం, నిర్వ‌హ‌ణ మాత్ర‌మే ఎన్‌జిఓలు చూడాల్సి ఉంటుంద‌న్నారు.  అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఆక్సీజ‌న్‌, అంబులెన్సుల‌ను కూడా పంపిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. మండ‌ల స్థాయి అధికారులైన తాశీల్దార్లు, ఎంపిడిఓలు, వైద్యాధికారులు, స్థానికంగా గ్రామ స‌ర్పంచ్‌లు, ఇత‌ర ప్ర‌భుత్వ‌సిబ్బందిని స‌మ‌న్వయం చేసుకొని, ఈ కేంద్రాల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు. స్వ‌చ్ఛంద సంస్థ‌లు త‌మ‌కు అనుకూల‌మైన మండ‌లాల‌ను, ఎంపిక చేసుకొని, శుక్ర‌వారం నాటికి జాబితాల‌ను అంద‌జేయాల‌ని జెసి మ‌హేష్‌ కోరారు. ఈ స‌మావేశంలో జిల్లా యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌, బొబ్బిలి రోట‌రీ క్ల‌బ్‌, నా ఊరు-విజ‌య‌న‌గ‌రం, స్పార్క్ సొసైటీ, మార్వాడీ యువ మంచ్‌, ఐఆర్‌పిడ‌బ్ల్యూఎఫ్‌, క్యాంప‌స్ ఛాలెంజ్ త‌దిత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-20 11:57:41

అప్పన్నకు సమకూరిన చందనం 31 కిలోలు..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కు గురువారం 31 కిలోలు చందన అరగదీత ద్వారా సమకూరినట్టు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి 26వ తేదీన రెండవ విడత చందనాన్ని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-20 11:55:31

ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని  కమిషనర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం సర్వేను ఆమె స్వయంగా 28వ వార్డులో రాం నగర్ లో  పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  కోవిడ్-19 నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జివిఎంసి పరిధిలో అన్ని వార్డులలో ఫీవర్ సర్వే జరుగుతుందన్నారు.రు. నాలుగవ జోన్ పరిధిలో 28వ వార్డు నందు జరుగుచున్న ఫీవర్ సర్వేలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా కరోనా లక్షణాలు గల వ్యక్తులను తొందరగా గుర్తించి వారి ఆరోగ్యం కాపాడటంతో పాటు వైరస్ ఇతరులకు సోకకుండా అరికట్టవచ్చునని తెలిపారు. ఆశా వర్కరులు, వాలంటీర్లు, ఎఎన్ఎం లు కలసి ఈ సర్వే లో పాల్గొంటారని, కోవిడ్ లక్షణాలు కల్గిన వ్యక్తిని గుర్తించి మెడికల్ ఆఫీసర్లు సిఫార్సు చేస్తామని, వారు వెంటనే రోగిని పరీక్షించి హోమ్ ఐసోలేషణ్ కిట్స్ ఇస్తారని, వారిని పరిస్థితులను బట్టి హోమ్ ఐసోలేశాన్లో ఉంచాలా లేదా క్వారంటైన్ కు పంపించాలా లేదా ఆసుపత్రికి రిఫర్ చేయాలా నిర్ణయంచడం జరుగుతుందని తెలిపారు. కావున, జివిఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు మీ ఇంటికి వచ్చే వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లకు సహకరించాలని మీ కుటుంబ సభ్యులలో ఎవ్వరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా ఫీవర్ సర్వే బృందానికి సహకరించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ పర్యటనలో నాలుగవ జోనల్ కమిషనర్ ఫణిరాం, 28వ వార్డు ఇంచార్జ్ పల్లా దుర్గా రావు, శానిటరి ఇన్స్పెక్టరు, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.       

28th ward

2021-05-19 16:01:49

ఆదాయ వనురులపై ద్రుష్టిపెట్టండి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఆదాయ వనరులను పెంపొందించడానికి  దృష్టి చారించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబంధిత అధికారులను “జూమ్” యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఆమె ఛాంబరు నుండి జివిఎంసి ఉన్నతాధికారులతొను, జోనల్ కమిషనర్లతోను, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, కార్పోరేషన్ ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు మొదలైన్ వాటి నుండి రావలసిన బకాయిలను వెంటనే వసూలుకు కృషి చేయాలని, ఇంకా మదించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, త్వరితగతిన చేపట్టాలన్నారు. యజమనుదారులు తమ ఆస్తులను నివాస యోగ్యము నుండి వాణిజ్య వినియోగానికి మార్చి వినియోగిస్తున్న వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.  నీటి చార్జీలు పై మరింత దృష్టి సారించాలని బల్క్, సెమి బల్క్ వినియోగదారు నుండి రావలసిన బకాయిలను రాబట్ట్టాలని, అనుమతి లేకుండా గృహాలకు వాడు చున్న కుళాయిలను గుర్తించి వాటిని క్రమబద్దీకరించాలని, గృహ, వాణిజ్య భవనములు, అపార్ట్మెంట్లు మొదలైన వాటిని సర్వే చేసి వాటికి నూతనంగా కొళాయి కనక్షన్లు మంజూరు చేసి చార్జీలు సూలు చేయాలన్నారు. పట్టణ ప్రణాళికా విభాగపు ఆదాయ వనరులు మరింతగా పెంచాలని, మొత్తం పాత భవనములు ఎన్ని ఉన్నాయి, కన్స్ట్రక్షన్ భవనములు ఎన్ని ఉన్నాయి, కొత్త భవనములు ఎన్ని ఉన్నాయి, ఖాళీ జాగాలు ఎన్ని ఉన్నాయో సర్వే చేయాలని ప్రతీ సచివాలయ పరిధిలో వీటిని క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వాటి వివరాలను నమోదు చేయాలని, వాటిపై రీ- సర్వే జరపాలని అధికారులను ఆదేశించారు. జూన్ 30వ తేది నాటికి వార్డు ప్లానింగు కార్యదర్శులచే వీటిని సిద్ధం చేయాలని సూచించారు. 
సచివాలయ హాజరు పట్టి సరిగా నిర్వహించడం లేదని వార్డు అడ్మిన్ కార్యదర్శులు ఈ బాధ్యతా తీసుకొని హాజరు వేయాలని, మూమెంట్ రిజిస్టర్, డైరీ విధిగా వ్రాయాలని సూచించారు. వీటిపై జోనల్ కమిషనర్ల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా ప్రతీ సచివాలయంలో ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేసి ఆర్జీలను అందులో వేయించాలన్నారు. ఆర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇ.ఆర్.పి.లు పెండింగు ఉండకూడదని ఎవ్వరి వద్ద పెండింగు కనిపిస్తున్నాయో వారికి చార్జి మెమో ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్రజలకు సేవ చేసే అవకాసం మనకు కలిగిందని, ప్రతి ఒక్కరూ, కోవిడ్ నిబంధనలు పాటించి విధులు నిర్వహించాలని సూచించారు.    
 వీడియో కాన్ఫరెన్స్ లో జివిఎంసి అదనపు కమిషనర్ ఆశాజ్యోతి, పర్యవేక్షక ఇంజినీరు(వాటర్ సప్ప్లై) కె.వి.ఎన్.రవి, డి.సి.ఆర్. ఎ.రమేష్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.      

GVMC office

2021-05-19 15:59:59

పరిశ్రమల్లో వేక్సినేషన్ కి అనుమతులివ్వండి..

విశాఖ జిల్లాలోని పరిశ్రమలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటుకు తగు చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.జీవన్ రాణిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో ఆసుపత్రులు వుంటే వాటికి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ క్రింద  కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్, ఆసుపత్రి లేని పరిశ్రమలలో ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్ వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటరు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు. సదరు పరిశ్రమల యాజమాన్యాలు వ్యాక్సిన్ ను మాన్యూఫ్యాక్చరర్స్ నుండి పొందవలసి వుందన్నారు. సదరు కేంద్రాలలో ఆడ్వర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు వుండాలన్నారు.

కలెక్టర్ ఆఫీస్

2021-05-19 15:39:31

ఫీవర్ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో ఫీవర్ సర్వే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆమదాలవలస, పోలాకి, పాతపట్నం, రేగిడి ఆమదాలవలస, రాజాం, నరసన్నపేట, సరుబుజ్జిలి, రణస్థలం తదితర 18 మండలాలు ఫీవర్ సర్వే పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నాయని తక్షణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఫీవర్ సర్వే లో కరోనా లక్షణాలు కనిపించిన వారి నమూనాలు వెంటనే సేకరించాలని ఆయన అన్నారు. కొంత మంది వాలంటీర్లు వ్యక్తుల నమూనా సేకరించి మరల 14 రోజుల లోపు అదే వ్యక్తుల నమూనాలు సేకరిస్తున్నారని ఆయన అన్నారు. 14 రోజుల లోపు నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేస్తూ అటువంటి వాలంటీర్లను తొలగించాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారిని మాత్రమే గుర్తించి నమూనాలు సేకరించాలని ఆయన అన్నారు. కొత్తగా గుర్తించిన వ్యక్తులకు మాత్రమే నమూనాలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. సేకరించిన నమూనాలను వెంటనే పరీక్ష కేంద్రాలు పంపించాలని ఆయన ఆదేశించారు. మండలాలకు అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిపిఇ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఇప్పటికే సరఫరా చేసామని ఆయన చెప్పారు. మండలాల్లో అవసరమగు సదుపాయాల కోసం నివేదికలు సమర్పించాలని తదనుగుణంగా సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో పరిస్థితులను మండల తహశీల్దార్ లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. మండల సర్వేలియన్స్ అధికారులు పాజిటివ్ కేసులను గుర్తిస్తున్న తీరును పరిశీలించాలని, అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పాజిటివ్ గా నిర్ధారణ చెందిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, వారితో పాటు ప్రాథమిక కాంట్రాక్టులు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-19 15:34:19