1 ENS Live Breaking News

క్షేత్రస్థాయి సిబ్బందికి పిపిఈ కిట్లు..

శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయి కోవిడ్ నమూనాలు సేకరిస్తున్న ఆరోగ్య సిబ్బందికి పిపిఈ  కిట్లను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ నమూనాలు అధికంగా సేకరించాలని ఆదేశించారు.  నమూనాలు సేకరణలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. గత 14 రోజుల్లో ఆ వ్యక్తి నమూనాలు సేకరించి ఉండరాదని, కొత్త వారికి మాత్రమే సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సేకరించిన నమూనాలు తక్షణం ల్యాబ్ కు పంపించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులను సందర్శించి ఆ మేరకు యాప్ లో అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. కోటబొమ్మాలి, రెంటికోట తదితర పీహెచ్సీల పరిధిలో హోమ్ ఐసోలేషన్ వ్యక్తులను సందర్శించనట్లుగా నివేదికలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొంటూ వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ కిట్లు వెంటనే అందజేయాలని వాటి వివరాలను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో కోవిడ్ యాజమాన్య కమిటీల ఏర్పాటుపై సర్పంచుల సమావేశాలను నిర్వహించి గ్రామస్థాయిలో చేపట్టాల్సిన నమూనాల సేకరణ, పాజిటివ్ వ్యక్తులు ఉపాధి హామీ పనులకు రాకుండా చూడటం, పాజిటివ్ వ్యక్తుల సమాచారం అందించడం, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తదితర కార్యక్రమాలను చేపట్టడంతో పాటు  గ్రామాలను కోవిడ్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు కృషి చేయాల్సిన అవసరాన్ని తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-21 09:36:54

అప్పన్న ఆన్ లైన్ సేవలు మీకోసమే..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)ను నేరుగా దర్శించుకోలేని వారు స్వామి సేవలను ఆన్ లైన్ ద్వారా వీక్షించి స్వామి క్రుపకు పాత్రులు కావాలని దేవస్థాయం ఈఓ ఎంవీ సూర్యకళ అన్నారు. శుక్రవారం ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు రెండు,  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-21 09:18:05

నిజమైన వారధులు జర్నలిస్టులే..

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు శ్రమించే నిస్వార్థ సేవకులే జర్నలిస్టులని వైఎస్సార్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త తిప్పల.దేవన్ రెడ్డి, గాజువాక శాంతి భద్రతల విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.మల్లేశ్వరరావు లు అన్నారు. శుక్రవారం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  హైస్కూల్ రోడ్డులో ఏర్పాటు చేసిన మినీ కోవిడ్ కేర్ సెంటర్ ను  ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా సాటి జర్నలిస్టుల ప్రాణాలను కాపాడేందుకు అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చి మినీ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి  గాజువాక జర్నలిస్టులు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్  అసోసియేషన్ ప్రతినిధులు రాము, పితాని ప్రసాద్ ,కొయిలాడ పరశురాం ,గుప్తా,  మూల గిరిబాబు, కృష్ణ శ్రీ ,బాలు ,సురేష్, వసంత్ , మనోజ్ , దాస్,  రాజు, నాగేశ్వరరావు,  మరియు  స్థానిక వైసిపి నాయకులు దర్మాల.శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2021-05-21 08:49:29

ఈరోజు అరగదీత చందనం 30 కిలోలు..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కు శుక్రవారం 3 కిలోలు చందన అరగదీత ద్వారా సమకూరినట్టు దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా  దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి 26వ తేదీన రెండవ విడత చందనాన్ని సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వివరించారు. అరగదీసిన చందనంతోపాటు, సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశామన్నారు. స్వామికి ఎవరైనా భక్తులు చందనం సమర్పించాలనుకుంటే దేవస్థాన అధికారులను సందప్రదించాలన్నారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-21 08:44:26

జిల్లాను నెలరోజుల్లో సాధారణ స్థితికి తెస్తాం..

క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు రెండు కోవిడ్ ప్ర‌చార ర‌థాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌ ప్రారంభించారు. సెట్విజ్ ఆధ్వ‌ర్యంలో, నేచ‌ర్, వ‌ర‌ల్డ్ విజ‌న్ స్వ‌చ్ఛంద సంస్థ‌లు జిల్లాలో ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నాయి. ప్ర‌చార ర‌థాల ద్వారా ఒక్కో సంస్థా 11 మండ‌లాల్లో క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌ల్లో జాగృతి క‌ల్గించేవిధంగా, ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని సెట్విజ్ రూపొందించింది. కోవిడ్‌పై పోరాటంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని, నెల రోజుల్లో వ్యాధిని గ‌ణ‌నీయంగా క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితిని తీసుకువ‌స్తామ‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ అన్నారు. క‌రోనా ప‌ట్ల మ‌రింత విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఇటువంటి ప్ర‌చార‌ ర‌థాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఇటువంటి కార్య‌క్రమాల‌కు ముందుకు వ‌చ్చినందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను అభినందించారు. ముఖ్యంగా ఎక్కువ‌గా కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదవుతున్న మండ‌లాల్లో ఈ ర‌థాల ద్వారా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని సూచించారు. గ్రామాల్లో క‌రోనా నియంత్ర‌ణ‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. గ్రామ‌స్థాయిలోనే ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు అప్ప‌గిస్తామ‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు కూడా బాధితుల‌ను ఆదుకొనేందుకు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు. బాల‌ల సంర‌క్ష‌ణ‌కోసం జిల్లాలో మ‌రో చైల్డ్ లైన్ ఏర్పాటు చేసేందుకు యునెసెఫ్ ముందుకు వ‌చ్చింద‌ని వెళ్ల‌డించారు.

               జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డికి మూడంచెల విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. నివార‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా, మాస్కుల ధార‌ణ‌, భౌతిక దూరం, శానిటైజేష‌న్‌పై విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే, మ‌రోవైపు వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బంధీగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఇంత‌వ‌ర‌కు క‌రోనా రాని గ్రామాల్లో భ‌విష్య‌త్తులో కూడా వ్యాధి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకోవ‌డం, వ‌చ్చిన గ్రామాల్లో పూర్తిగా నిర్మూలించ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యాలుగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు. దీనికి ప్ర‌భుత్వ ఉద్యోగులు, గ్రామ‌, వార్డు క‌మిటీలు, స‌చివాల‌య ఉద్యోగుల‌తోపాటు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారాన్ని కూడా తీసుకుంటామ‌ని అన్నారు. అంద‌రి స‌మిష్టి కృషితో, మ‌రికొద్ది రోజుల్లోనే జిల్లాలో సాధార‌ణ ప‌రిస్థితిని నెల‌కొల్పేందుకు కృషి చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

                ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు,  సెట్విజ్ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణాధికారి వి.విజ‌యకుమార్, నేచ‌ర్ డిస్ట్రిక్ట్ కౌన్సిల‌ర్ జి.కె.దుర్గ‌, కో-ఆర్డినేట‌ర్ మీనా, వ‌ర‌ల్డ్ విజ‌న్ కో-ఆర్డినేట‌ర్లు జి.అంబేద్క‌ర్‌, ఆర్‌.నాగేశ్వ‌ర్రావు, సెట్విజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-05-21 07:46:55

సమన్వయంతో విజయవంతంగా కోవిడ్ వేక్సినేషన్..

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, వాలంటీర్ వ్య‌వ‌స్థ క్రియాశీల భాగ‌స్వామ్యంతో జిల్లాలో టీకా పంపిణీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొనసాగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఉద‌యం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తి, వేస‌వి నేప‌థ్యంలో కేంద్రంలో చేసిన ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేశారు. ల‌బ్ధిదారుల అర్హ‌త వివ‌రాల త‌నిఖీ ప్ర‌క్రియ‌తో పాటు వ్యాక్సినేష‌న్‌, అబ్జ‌ర్వేష‌న్ గ‌దుల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి, స్లిప్‌లు ఎవ‌రు ఇచ్చారో తెలుసుకున్నారు. మొద‌టి డోసు వేయించుకున్న తేదీని ఆధారంగా చేసుకొని వాలంటీర్లే ఇంటికి వ‌చ్చి రెండో డోసు వేసేందుకు స్లిప్‌లు అందించిన‌ట్లు ల‌బ్ధిదారులు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో ల‌బ్ధిదారుల‌కు ముందే స్లిప్‌లు అందించే విధానం స‌త్ఫ‌లితాలు ఇస్తోంద‌ని, ఈ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళ్లాల‌ని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్ర‌స్తుతం రెండో డోసు పంపిణీ జ‌రుగుతోంద‌ని, వ‌చ్చే నెల మొద‌టి నుంచి ల‌బ్ధిదారుల‌కు మొద‌టి డోసు పంపిణీ జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, వ్యాక్సినేష‌న్ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-05-21 07:34:26

కరోనా నిబంధనలతో చందనం అరగదీత..

చందనం అరగదీసే వారు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ ఆదేశించారు. శుక్రవారం దేవస్థానంలో స్వామివారికి  రెండవ విడత సమర్పించ నున్న చందనం అరగదీత కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ, చందనం అరగదీసేవారంతా ఖచ్చితంగా మాస్కులను ముక్కూ, మూతీ మూసుకున్న తరువాతే చందనం అరగదీయాలన్నారు. అటు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను కూడా మాస్కులు పూర్తిగా ధరించి, శానిటైజేషన్ పూర్తి అయిన తరువాతమే లోనికి అనుమతించాలన్నారు. మాస్కులు సక్రమంగా వేసుకోని భక్తులను వెనక్కి పంపాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు.


Simhachalam

2021-05-21 05:30:34

కరోనాలో దాతల సహాయం మరువరానిది..

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో కీలకమని, ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ కరోనా సోకిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం కరోనా నేపథ్యంలో 4 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను విజయవాడకు చెందిన డార్మెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ రత్నారెడ్డి జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. డార్మెంట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డార్విన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి రత్నారెడ్డి మాట్లాడుతూ కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న స్నేహితులు కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా నిధులను సేకరించి ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 4 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశామని, మరో వారం పది రోజుల్లోగా మరికొన్ని అందిస్తామన్నారు. ఒక్కో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్ ఒక లక్ష 5 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ ఆక్సిజన్ ప్లాంట్ అల్లాబక్ష, అమెరికా డాక్టర్లు వి.రవికుమార్, ఎన్. మురళీ లు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-20 15:19:03

ఎంఎన్ఓని విధుల నుంచి తప్పించండి..

అనంతపురం క్యాన్సర్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎమ్మెన్వోగా పనిచేస్తున్న సాంబ శివుడు అనే వ్యక్తిని విధుల నుంచి తొలగించాలని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంటును ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు అనుమతి లేకుండా  కరోనా పాజిటివ్ వ్యక్తులను  బలవంతంగా అడ్మిట్ చేసి, ఆసుపత్రి వైద్య సిబ్బంది మధ్య అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించారని ఎమ్మెన్వో మీద ఆరోపణలు రాగా, ఆరోపణలపై విచారణ చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్ అధికారి సదరు ఎమ్మెన్వోను తొలగించాలని సిఫార్సులు చేస్తూ నివేదిక ఇచ్చారు. నివేదిక ప్రకారం ఎమ్మెన్వో సాంబ శివుడుని  విధుల నుంచి తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సర్వజనాస్పత్రి సూపరింటెండెంటును ఆదేశించారు. 

Anantapur

2021-05-20 14:43:24

జ‌గ‌న‌న్న కాల‌నీల‌పై ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ పెట్టండి..

విజ‌య‌న‌గ‌రం  జిల్లాలో ఏర్పాటు చేసిన జ‌గ‌న‌న్న కాల‌నీల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు త్వ‌రి త‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అభివృద్ధికి సంబంధించిన ప‌నుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధికారుల‌ను ఆదేశించారు. ఇళ్ల స్థ‌లాలకు సంబంధించిన‌ జియో-ట్యాగింగ్, రిజిస్ట్రేషన్లు, గ్రౌండింగ్‌ ప్ర‌క్రియ త్వ‌ర‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని చెప్పారు. జిల్లాలో ఇప్ప‌టి వర‌కు  జియో ట్యాగింగ్ 89 శాతం, రిజిస్ట్రేష‌న్లు 67 శాతం పూర్త‌య్యాయ‌ని ఈ నెల 25వ తేదీ లోగా 100 శాతం పూర్తి చేయాల‌ని ఆదేశించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల్లో వ‌స‌తుల క‌ల్ప‌న‌, మౌలిక స‌దుపాయాల ఏర్పాటు, జియో ట్యాగింగ్ ప్ర‌క్రియ త‌దిత‌ర అంశాల‌పై గురువారం ఆన్‌లైన్‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ముందుగా మండ‌లాల వారీగా ప్ర‌త్యేక అధికారులో మాట్లాడారు. ఆయా లే అవుట్లలో జ‌రిగిన ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. నిర్ణీత గ‌డువులోగా సాంకేతిక ప్ర‌క్రియ‌లు అన్నీ పూర్తి చేయాల‌ని అధికారుల‌కు నిర్దేశించారు. జియో ట్యాగింగ్, రిజిస్ట్రేష‌న్లు, గ్రౌండింగ్‌, తాగునీటి స‌దుపాయం, విద్యుత్తు సౌక‌ర్యం త‌క్కువ‌గా జ‌రిగిన ప్రాంతాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇళ్ల స్థలాల‌కు జ‌రిగిన జియో ట్యాగింగ్‌కు.. జిల్లా అధికారుల వ‌ద్ద ఉన్న జాబితాల‌కు వివ‌రాల్లో తేడా ఉండ‌టంతో స‌రి చేయాల‌ని హౌసింగ్ పీడీకి క‌లెక్ట‌ర్ సూచించారు. తాగునీటి వ‌స‌తికి సంబంధించి తీసుకున్న చ‌ర్య‌ల‌పై ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ రవికుమార్‌ను అడిగారు. విద్యుత్ సౌక‌ర్య ఏర్పాట్ల‌పై ఈపీడీసీఎల్ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు త్వ‌రిత‌గ‌తిన విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, సంబంధిత ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. ల‌బ్ధిదారుల‌కు కేటాయించిన ఇళ్ల స్థ‌లాల‌కు సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను రెండు రోజుల్లో ముగించాల‌ని ఆదేశించారు. డిజిట‌ల్ అసిస్టెంట్ల సాయంతో గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని చెప్పారు. అలాగే జాబ్ కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోంద‌ని.. త‌గిన చ‌ర్య‌లు తీసుకొని సంబంధిత నివేదిక‌ను అంద‌జేయాల‌ని జేసీ వెంక‌ట‌రావుకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే ప‌ట్ట‌ణ ప్రాంతాల ప‌రిధిలోని లేఅవుట్ల‌లో సాంకేతిక ప్ర‌క్రియ‌లు త‌క్కువ‌గా అయ్యాయ‌ని.. వీటిపై దృష్టి సారించాల‌ని పేర్కొన్నారు. అలాగే మెటీరియ‌ల్‌కి సంబంధించి మైనింగ్ శాఖ అధికారుల‌తో సంప్ర‌దించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హౌసింగ్ పీడీకి సూచించారు. మ్యాపింగ్ ప్ర‌క్రియ స‌జావుగా.. త‌ప్పులు లేకుండా చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. 

స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించండి..

జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 67 శాతం మాత్ర‌మే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేష‌న్లు అయ్యాయ‌ని వీటిని 100 శాతానికి చేర్చ‌డానికి చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. రెండు రోజుల పాటు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌టం ద్వారా రిజిస్ట్రేష‌న్ల సంఖ్య‌ను పెంచాల‌ని సూచించారు. ఈ నెల 23వ తేదీ నాటికి నిర్దేశించిన ల‌క్ష్యం మేర‌కు రిజిస్ట్రేష‌న్లు చేయించాల‌ని జేసీ వెంక‌ట‌రావును కలెక్ట‌ర్ ఆదేశించారు. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల‌ను అనుసరించి ఆశాజ‌న‌క ఫ‌లితాలు సాధించాల‌ని చెప్పారు. 

ప‌క్కాగా విద్యుదీక‌ర‌ణ ప‌నులు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర‌కు జ‌గ‌న‌న్న కాల‌నీల్లో విద్యుదీక‌ర‌ణకు సంబంధించి స‌ర్వేలు నిర్వ‌హించి ప‌నులు చేప‌ట్టాల‌ని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. 50 ప్లాట్స్ లోప‌ల ఉంటే స్థంబాల ద్వారా.. 1500 ప్లాట్స్ కంటే ఎక్కువ ఉన్న లేఅవుట్ల‌లో భూగ‌ర్భ విద్యుత్ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. త్వ‌రిత‌గ‌తిన డీపీఆర్ స‌మ‌ర్పించి సంబంధిత ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ప్రారంభించాల‌ని చెప్పారు. 

స‌మావేశంలో జేసీలు కిశోర్ కుమార్‌, వెంక‌ట‌రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ర‌మ‌ణ మూర్తి, ఆర్డీవో భ‌వానీ శంక‌ర్‌, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌. ఎస్ఈ రవికుమార్‌, ఈపీడీసీఎల్ ఎస్ఈ విష్ణు, ప్ర‌త్యేక అధికారులు వెంక‌టేశ్వ‌ర్లు, విజ‌య‌ల‌క్ష్మి, హౌసింగ్ ఈఈలు, డీఈఈలు, ఏఈలు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

కలెక్టర్

2021-05-20 14:34:26

కరోనా కట్టడికి వ్యూహాత్మక చర్యలు..

కరోనా కట్టడికి అధికారులు వ్యూహాత్మక చర్యలు చేపట్టి గిరిజన గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రాజెక్ట్ అధికారి తన ఛాంబర్లో జూమ్ ద్వారా సబ్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,ఉప వైద్య ఆరోగ్య అధికారి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, వివిధ ఆసుపత్రుల డాక్టర్స్, కోవిడ్ నియోజక వర్గ , మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, పంచాయతీ అధికారులతో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్ నివారణా నిర్వహణ గిరిజన ప్రాంతాలలో నిర్వహణ, సుచనలపై  జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, అనంతరం ప్రాజెక్ట్ ఆదికారీ కోవిడ్ నియంత్రణకు అలాగే కరోనా పాజిటివ్ వచ్చినవారికి అందజేస్తున్న సేవలు తదితర పనుల నిర్వహణ పై అరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కరోనా రెండవ వేవ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా గ్రామీణ మరియు సెమీ అర్బన్ కమ్యూనిటీ ద్వారా ప్రజలలో మెరుగైన అవగహన కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్రస్థాయి ఆరికట్టడనికి  అన్ని స్థాయిలలో ప్రాథమిక స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయలని కల్పించి, ఇతర అవసరమైన ఆరోగ్య సేవలను అందించడం అవసరం అన్నారు. అలాగే గ్రామానికి చెందిన ఆశా, గ్రామ వోలెంటిర్ ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలి, కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వేరు చేయాలి. వారికి నిర్వహించిన పరీక్షా ఫలితాలు వచ్చేవరకు ఇతరుల నుండి వేరుగా ఉండేలా చూసుకోవాలి అని వారికి సలహా ఇవ్వాలన్నారు.

గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు

       గ్రామంలో కరోనా రోజు వారి పరిస్థితి పర్యవేక్షణ కోసం అన్ని సూచనలు అమలు అయ్యే విధంగా సర్పంచ్ ఛైర్మెన్ గా, ఎ. ఎన్. ఎం కన్వీనర్ గా ఆశా, వి.హెచ్. ఎస్.ఎన్.సి, గ్రామ వాలెంటిర్, పి.ఆర్.ఐ సభ్యులు - మెంబర్లు గా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   పాజిటివ్ వచ్చిన వారికి హోం ఐ సొలేషన్, క్వారెంటైన్ కేంద్రం లేదా ఆసుపత్రులలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందజేయాలన్నారు.  ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకు అవగాహన కల్పించాలన్నారు.  అవగాహన లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుందన్నారు.  దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఆధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామాలలో  ఫీవర్ సర్వే వేగవంతం చేయాలని పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్ ఉంచి వారికి కిట్లు అందజేయాలన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలలో దైర్యం కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ప్రోజెక్ట్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు వందల సంఖ్యలో కరోనా నుంచి కొల్కొని డిస్చార్జ్ అవుతున్నారని వారిని ఆదర్శంగా చూపించి మిగిలిన వారిలో దైర్యం నింపాలని సూచించారు. అలాగే ఫీల్డులో ఉన్న మెడికల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.  పరిస్థితి మెరుగు పడడానికి ప్రతి ఒక్కరు భాద్యతగా విధులు నిర్వహించాలన్నారు. అలాగే ఆన్ని పి.హెచ్.సి, సి.హెచ్.సి, ఆసుపత్రులు, క్వారెంటైన్ కేంద్రాలలో ఆక్సీజన్, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

         ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ విదేహ ఖరె, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రమణ కుమారి,ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవి కుమార్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, వివిధ ఆసుపత్రుల డాక్టర్స్, కోవిడ్ నియోజక వర్గ , మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి. ఓ లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-05-20 13:33:43

జర్నలిస్టులకు కోవిడ్ వేక్సినేషన్..

ఒంగోలు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కోవిడ్ వేక్సినేషన్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ సమాచార పౌరసంబధాలశాఖ అధికారులను ఆదేశించారు. మీడియా సంస్థల వారీగా జర్నలిస్టుల వివరాలను సేకరించి ప్రతీ ఒక్కరికీ కోవిడ్ టీకా వేయాలన్నారు. గురువారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మేరకు 21, 22 తేదీల్లో ఆయా మీడియా సంస్థలు వారి సంస్థలో పనిచేసే జర్నలిస్టుల వివరాలను సమాచారశాఖ కార్యాలయానికి అందించాల్సి వుంటుంది. పాత్రికేయునిపేరు, వయస్సు, హోదా, పనిచేస్తున్న సంస్థ పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు వివరాలను తెలియజేస్తూ తెలియజేయాలన్నారు. కోవిడ్ టీకా ఎప్పుడు వేసేది సమాచారం అందిస్తామని కలెక్టర్ వివరించారు. కరోనా కేసులు అధికంగా వున్న నేపథ్యంలో జర్నలిస్టులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం ప్రకటించారు.

Prakasam

2021-05-20 13:19:42

గ్రామ కోవిడ్ కమిటీలు ఏర్పాటుచేయాలి..

గ్రామస్థాయి కోవిడ్ యాజమాన్య కమిటీ (కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణపై గురువారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ను  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయిలో కోవిడ్ యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. శుక్రవారం మండల స్థాయిలో సర్పంచులు అందరితో యాజమాన్య కమిటీ ఏర్పాటుపై సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయి యాజమాన్య కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా ఉంటారని, ఏఎన్ఎం సమన్వయకర్తగా ఉంటారని, ఆశా, వాలంటీర్లు, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులు   సభ్యులుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థాయి యాజమాన్య కమిటీ గ్రామస్థాయిలో కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని ఆయన తెలిపారు. పాజిటివ్ కేసు కలిగిన ఇంటివద్ద బారికేడింగ్ నిర్మించి ఆ ఇంటి నుండి పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తులు బయటకు రాకుండా చూడాలని ఆయన అన్నారు. కరోనా లక్షణాలు లేదు అనే నెపంతో ప్రైమరి కాంటాక్ట్ లు అనేక మంది బయటకు తిరుగుతున్నారని, అటువంటి అవకాశాన్ని ఎవరికీ ఇవ్వరాదని ఆయన స్పష్టం చేసారు. ఒక ఇంటిలో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగిలిన కుటుంబ సభ్యులకు పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రైమరి కాంట్రాక్టులు బయట తిరగడం వలన కరోనా వ్యాప్తి అధికం అవుతుందని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఉపాధి హామీ పథకానికి వస్తున్నట్లు సమాచారం ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అటువంటి వ్యక్తులు ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులకు పనులు కల్పించరాదని ఆయన పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తుల జాబితాలను గ్రామంలో గ్రామ ఐక్య సంఘం అధ్యక్షులకు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కు ప్రతి రోజూ అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో గ్రామ యాజమాన్య కమిటీ పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆయన పేర్కొంటూ గ్రామ పంచాయతీ పరిధిలో రద్దీగా ఉండే మార్కెట్లు, దుకాణాలు తదితర ప్రాంతాల్లో మరింత ఎక్కువ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య పనులను నిర్లక్ష్యం చేయడానికి లేదని ఆయన చెప్పారు. గ్రామంలో కరోనా లక్షణాలు ఉన్నవారు, కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ గా ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించి వారి నమూనాలను తీయాలని అటువంటి సమాచారాన్ని సేకరించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో పంచాయతీ సర్పంచ్ విధిగా మాస్కులు ధరించి ఆదర్శవంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించడం, వ్యక్తుల మధ్య దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రపరచడం విధిగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ అంశాలను గ్రామాల్లో ఎక్కువగా తెలియజేయాలని సూచించారు.

 పాజిటివ్ లేని గ్రామాలకు ప్రోత్సాహకాలు :

పాజిటివ్ కేసులు లేని గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించుటకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. గ్రామం నిర్దేశించిన సమయంలో జీరో పాజిటివ్ కేసులతో ఉంటే అటువంటి గ్రామాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించుటకు యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏ గ్రామం కరోనా రహిత గ్రామంగా ఆవిర్భావం చెందుతుందో పరిశీలించాలని అన్నారు. కరోనా రహిత గ్రామాలుగా ఆవిర్భావం చెందుటకు ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి వ్యక్తి ఆదర్శవంతంగా ఉంటూ మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని అన్నారు. గ్రామంలో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు లేదా అనుమానం ఉన్న వ్యక్తులు కూడా పరీక్షలు చేసుకోవాలని తద్వారా గ్రామం పూర్తిగా పాజిటివ్ కేసులు లేని గ్రామాలుగా ఉండాలని వివరించారు. ఏ గ్రామం మొదటి గ్రామంగా వస్తుందో వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.

        జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ , హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని వాలంటీర్లు, ఏఎన్ఎంలు  సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని అన్నారు. మెడికల్ కిట్లు అందజేయాలని, కంటైన్మెంట్ జోన్లను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సిహెచ్. శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-20 12:29:58

ప్రజలు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలి..

కరోనా రెండవ దశ పట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.   గురువారం ఉదయం 6 గంటల సమయంలో మంత్రి కార్యాలయంకు స్వల్ప సంఖ్యలో మాత్రమే ప్రజలు వచ్చారు. ఒక గ్రామానికి చెందిన వృద్ధురాలు తమ గ్రామంలో పలువురు కరోనా బారిన పడుతున్నారని మంత్రి పేర్ని నానికి తెలిపింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ఫ్యూ సడలించిన వేళ ప్రజలు విచ్చలవిడిగా సంచరించడం ఏమాత్రం తగదని హెచ్చరిస్తూ, కరోనా వైరస్  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో విజృంభిస్తుందనీ, నెల కిందట వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకుతున్నాయని ఎంతో విచారమన్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయిని తెలిపారు. పల్లెల నుంచి రైతులు ప్రతిరోజు కూరగాయలు రైతుబజార్లకు తీసుకొస్తున్నారని, మరోవైపు పండ్లు అమ్మడానికి పట్టణాలకు వచ్చి వెళ్తున్నారన్నారు. పట్టణాలకు వచ్చే ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో అందులో ఒక్కరికి ఉన్నా మిగతా వారికి వ్యాపిస్తుందని వివరించారు. గ్రామాల్లో అమ్మవారి జాతరలు, పండుగ పేరుతో సామూహిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఇటువంటి చర్యల కారణంగా వేగంగా కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు.   తన కార్యాలయంకు వచ్చిన  దళిత నాయకులు చాట్రగడ్డ ప్రసాద్ (గడ్డం ప్రసాద్)కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం మంత్రి పేర్ని నాని వెలుపలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాడేపల్లి హడావిడిగా ప్రయాణమయ్యారు.  

Machilipatnam

2021-05-20 12:12:43

రూ.25 లక్షల ఆక్సిజన్ పరికరాల వితరణ..

కరోనా నియంత్రణ, బాధితుల సహాయంలో దాతల సహకారం మరువలేనిదని జిల్లా కలెక్ట్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు.  కోవిడ్-19 నివారణలో భాగంగా హోమి బాబా కేన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ సెంటర్, 20 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు జిల్లా కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో గురువారం అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మరింత మంది దాతలు ముందుకి రావడం ద్వారా కోవిడ్ రోగులకు సహాయం సత్వరం అందుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు ఉన్నారు.  ఇందులో 10 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్స్, 10 పోర్టబుల్ ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు ఉన్నట్లు డా. మల్లేశ్వరరావు తెలిపారు.  ఇవి సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 

Collector Office

2021-05-20 12:06:03