1 ENS Live Breaking News

నిరు పేదలకి మెరుగైన వైద్యం..

రాష్ట్రంలో  పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, కడప , నెల్లూరు, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో సిటి స్కాన్, ఎన్ఆర్ఐ మెషిన్లను వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదవాడికి మెరుగైన వైద్యం అందాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 బోధన ఆసుపత్రులు ఉన్నాయని, మరో 16 బోధనా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధి క్రిందకు తీసుకొని రావడం జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కే. కృష్ణమూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.కృష్ణవేణి, సి ఎస్ ఆర్ఎమ్ఓ డాక్టర్ ఆర్ .అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-19 15:28:06

జిజిహెచ్ లో అందుబాటులో సిటి స్కాన్..

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ  సిటి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు. ఇది జిల్లా ప్రజలకు ప్రభుత్వం కల్పించిన వరంగా అభివర్ణించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ఏర్పాటు చేయడం వలన ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల రీత్యా సిటీ స్కాన్ అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొంటూ అత్యవసర సమయంలో దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏపీఎస్ఎమ్ఐడిసి నిర్వహణ బాధ్యతలు చూస్తుందని,  సంబంధిత కంపెనీ ఏడు సంవత్సరాలపాటు గ్యారంటీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

Srikakulam

2021-05-19 15:25:47

అప్పన్న భక్తులకు చందన ప్రసాదం..

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవానికి ... చందనం సమర్పించిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వామివారి చందన ప్రసాదాన్ని పోస్టు ద్వారా పంపిస్తున్నారు.  అర కేజీ అంటే రూ. 10,116 (పదివేల నూటపదహార్లు),కేజీఅంటే రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు) సమర్పించినవారికి ముందుగా చందనం పంపుతున్నారు.  పదివేల నూటపదహార్లు పంపినవారికి  చందనం ముక్క , 20వేల నూటపదహార్లు పంపినవారికి చందనం ముక్కతోపాటు శేషవస్త్రం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ ఆలయ ఏఈఓ రాఘవ కుమార్, కప్ప స్తంభం నాయుడు పర్యవేక్షణలో జరుగుతున్నాయి.  ఇప్పటికీ 20,116  అంటే కేజీ చందనం సమర్పించినవారి  రెండు అడ్రస్ లు పూర్తిగా తెలియరాలేదని, అందులో ఒకటి ఆఫ్రికాలోని గినియా దేశం నుంచి వచ్చిందని  గుర్తించినట్టు అధికారులు తెలియజేశారు. మరొకటి చెక్ రూపేణా అడ్రస్ లేకుండా పంపించారని పేర్కొన్నారు. వీరి అడ్రస్ లు కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు 3 కేజీల చందనం సమర్పించారు. పలువురు భక్తులు విదేశాల నుంచి విరాళాలు పంపినా... స్వదేశీ అడ్రస్ లనే ఇచ్చారు. కాగా స్వామివారి చందన సమర్పణకు ఏడాదిలో ఎప్పుడైనా విరాళాలు పంపించే అవకాశం భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇది ఏడాది పొడవునా జరిగే ప్రక్రియని అధికారులు పేర్కొన్నారు.

Simhachalam

2021-05-19 15:10:25

వైద్యసిబ్బందిని వెంటనే నియమించండి..

విశాఖ జిల్లాలోని ఆసుపత్రులలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలను  ప్రభుత్వ ఉతర్వులను అనుసరించి తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లాలోని కోవిడ్ నియంత్రణ, వైద్య సిబ్బంది నియామకాలు, ఆక్సిజన్  ప్రొక్యుర్ మెంట్, ఆసుపత్రులకు సరఫరా, తదితర విషయాలపై సంబంధిత అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 79 ఆసుపత్రులు వున్నాయని, వీటిలో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరాల నిమిత్తం, ఎటువంటి సమస్య తలెత్తకుండా ఆక్సిజన్ ప్రొక్యూర్ మెంట్ మరియు సరఫరా గావించాలన్నారు. ఇందుకు గాను ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీలు,  వారిచే సరఫరా చేయబడుతున్న ఆక్సిజన్ వివరాలపై ఆయన చర్చించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రక్క దారి పట్టకుండా వాటికి సెక్యూరిటీ వాహనాలు ఏర్పాటు గావించాలని ఉప రవాణా కమీషనర్.రాజరత్నంను ఆదేశించారు ఇందుకుగాను అవసరమైన రెవెన్యూ సిబ్బందిని విధులలో నియమించాలని ఆర్.డి.ఒ. పెంచల కిషోర్ ను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా విషయంలో ఆర్.డి.ఒ. సహకారం తీసుకోవాలని ఔషధ నియంత్రణ  సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు.  హెల్త్ సిటీలో 48 వరకూ ఆసుపత్రులు వున్నాయని వాటికి ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళికతో తగు చర్యలు చేపట్టాలన్నారు.    పడకల విషయమై మాట్లాడుతూ కొన్ని ఆసుపత్రులలో పడకల పెంపుదలను పరిశీలించాలన్నారు. జర్మన్ హాంగర్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని  ఆర్.ఎండ్.బి ఎస్.ఇ. సుధాకర్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.ఆరుణ్ బాబు, ఎ.ఎం.సి ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, ఆర్.డి.ఒ. పెంచల కిషోర్, జి.యం.డి.ఐ.సి. రామలింగరాజు, ఔషధ నియంత్రణ శాఖ ఎ.డి.రజిత, ఎ.పి.ఎం .ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Collector Office

2021-05-19 13:52:47

బ్లాక్ ఫంగస్ కోసం 20 పడకలు..

విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్(మ్యూకార్ మైకోసిస్) పేషెంట్లకు చికిత్స నిమిత్తము కె.జి.హెచ్.లోని డెర్మటాలజీ విభాగంలో 20 పడకలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ నేతృత్వంలో సీనియర్ వైద్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఛాతీ, ENT, ప్రాంతీయ కంటి ఆసుపత్రి  సూపరింటెడెంటట్లు, న్యూరో సర్జరీ,  జనరల్ మెడిసిన్, డెర్మటాలజి మరియు మైక్రోబయాలజీల  విభాగాధిపతులు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఆసుపత్రులకు వచ్చిన  పేషెంట్లను చేర్చుకొని చికిత్స విధి విధానాలను పరిశీలిస్తారన్నారు.

Collector Office

2021-05-19 13:50:06

పింఛనుదారుల సమాచారం తెలియజేయండి..

కోవిడ్ బారిన  ప్రాణాలు కోల్పోయిన పింఛనుదారుల వారసులు,   కుటుంబ సభ్యులు  సదరు వివరాలను సంబంధిత ఖజానా కార్యాలయంలో సత్వరమే తెలియ వలసినదిగా జిల్లా ట్రజరీ ఉప సంచాలకులు టి.శివరాం ప్రసాద్ ఒక ప్రకటన లో కోరారు. అలాగే పింఛనుబకాయిలు, దహనఖర్చుల కొరకు బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు సమర్పించినట్లైతే సంబంధిత ఖాతాల్లో సదరు మొత్తం జమచేయడం జరుగుతుందన్నారు. పింఛనుదారుల వారసులు ఎన్నారైలు అయినట్లైతే  పింఛనుదారుల మృతి సమాచారం తెలియక వారికి సంబంధించిన ఖాతాలలోకి పించను సొమ్ము జమయ్యే అవకాశం వున్నందున  కుటుంబ సభ్యులు, వారసులు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా సత్వరమే పింఛనుదారు మరణించిన తేదీని సూచిస్తూ బాధ్యతాయుత పౌరులుగా సంబంధిత ఖజానా కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. ఈవిషయాన్ని జిల్లాలో గల ఉప ఖజానా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Collector Office

2021-05-19 13:48:05

కోవిడ్ రోగుల ఆక్సిజన్ కోసం రూ.35 విరాళం..

విశాఖలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ  రిఫైనరీ,  జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు  ఆక్సిజన్ సరఫరా నిమిత్తము రూ. 35 లక్షలు విరాళంగా అందజేసింది. బుధవారం నాడు స్థానిక కలెక్టరేట్ లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. రత్నరాజ్ చెక్కు ను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, హెచ్ పిసిఎల్ జనరల్ మేనేజర్ రాజు, పిఆర్ ఓ ఎం. కాళీ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉదారంగా స్పందించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు.

Collector Office

2021-05-19 13:42:41

కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టండి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, ప్ర‌జ‌ల నుంచి చిన్న విమ‌ర్శ కూడా రాకుండా సేవ‌లందించాల‌ని మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసు అధికారుల‌ను ఆదేశించారు. ఆసుప‌త్రుల‌పై మ‌రింత ప‌ర్య‌వేక్ష‌ణ పెంచి సేవ‌లు స‌త్వ‌ర‌మే అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆసుత్రుల్లో అందుతున్న సేవ‌ల‌పై నిరంత‌రం స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో అవ‌స‌ర‌మైన మేర‌కు అద‌న‌పు వైద్య సిబ్బందిని త్వ‌ర‌త‌గ‌తిన నియ‌మించుకోవాల‌ని సూచించారు. 


జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఆధ్వ‌ర్యంలో, జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, రోగుల‌కు అందిస్తున్న వైద్యం త‌దిత‌ర అంశాల‌పై జిల్లా అధికారుల‌తో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బుధ‌వారం జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ జిల్లాలోని గ‌త స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌ను, చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను, జిల్లాలోని తాజా ప‌రిస్థితిని మంత్రుల‌కు వివ‌రించారు. కోవిడ్ మొద‌టి వేవ్‌తో పోలిస్తే, ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని, రిక‌వ‌రీ రేటు కొంత త‌గ్గింద‌ని చెప్పారు. జిల్లాలోని 27 ఆసుప‌త్రుల్లో ప్ర‌స్తుతం కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నామ‌ని, పాజిటివ్ వ‌చ్చిన వారిని హౌం ఐసోలేష‌న్‌లో ఉంచి కోవిడ్ కిట్ల అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. గ‌త స‌మావేశంలో మంత్రులు, శాస‌న స‌భ్యులు ప్రస్తావించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కె.ఎల్‌. సామ‌ర్థ్యం గ‌ల ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు. దీనికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్ష‌ల కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. బొబ్బిలిలో గ‌తంలో నాలుగు ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ ఉండేద‌ని.. ప్ర‌స్తుతం ప‌ది ప‌డ‌క‌ల‌కు ఆక్సిజ‌న్ స‌దుపాయం క‌ల్పించామ‌ని చెప్పారు. పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో ఉన్న 100 ప‌డ‌క‌ల‌ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివ‌రించారు. జిల్లాకు కావాల్సిన అద‌న‌పు అంబులెన్స్‌ల‌ను, ఒక మ‌హాప్ర‌స్థానం వాహ‌నాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణ‌యించామ‌న్నారు. బ‌యో మెడిక‌ల్ ఇంజినీర్ నియామ‌కానికి, మిమ్స్ ఆసుప‌త్రిలో 6 కె.ఎల్‌. స‌మార్థ్యం గ‌ల ట్యాంకర్‌ను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని క‌లెక్ట‌ర్‌ వివ‌రించారు. ప‌రీక్ష‌లు, టీకా ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫస్ట్ డోస్ 2.54 ల‌క్ష‌ల మందికి, రెండో డోస్ 1.05 ల‌క్ష‌ల మందికి వేశామ‌ని తెలిపారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ బాగుంద‌ని అన్ని వ‌స‌తులు స‌మ‌కూర్చామ‌ని, సేవ‌లు బాగా అందుతున్నాయ‌ని వివ‌రించారు. 

జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, వెంక‌ట‌రావు పాల్గొని ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా, వైద్యుల నియామ‌కం, మందుల స‌ర‌ఫ‌రా, ఆరోగ్య శ్రీ సేవ‌లు, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో అందుతున్న‌ సేవ‌ల గురించి వివ‌రించారు. మిమ్స్‌లో 6 కె.ఎల్. ఆక్సీజ‌న్ ట్యాంక‌ర్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని జేసీ మ‌హేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల‌కు, సీహెచ్‌సీల‌కు, ఏరియా ఆసుప‌త్రుల‌కు అవ‌స‌ర‌మైన మందులు ప‌క్కా అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. ఎల్‌.కోట‌లో మ‌రో కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సూచించ‌గా జేసీ కిశోర్ కుమార్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఒక సారి ప‌ర్య‌టించి కేంద్ర ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. 

జిల్లా నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు మాట్లాడిన త‌ర్వాత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ప‌థ‌కం ద్వారా అందుతున్న కోవిడ్ సేవ‌ల‌పై నిఘా పెంచాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాల‌ని సూచించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో సేవ‌లు స‌వ్యంగా అందుతున్నాయో లేదో స‌రిచూసుకోవాల‌ని చెప్పారు. అలాగే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సజావుగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అధికారులు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉంటూ కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు కృషి చేయాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపేలా త‌గిన విధంగా సేవ‌లందించాల‌ని చెప్పారు. ఆక్సీజ‌న్, మందులు స‌వ్యంగా అందేలా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని పేర్కొన్నారు. 

రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ మాట్లాడుతూ క‌రోనాను నియంత్రించేందుకు పటిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ జిల్లాలో కోవిడ్‌ను క‌ట్ట‌డి చేయాల‌ని తెలిపారు. సేవ‌లు స‌వ్యంగా అందేలా త‌గినంత మంది వైద్య సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని జిల్లా అధికారుల‌కు సూచించారు. సంబంధిత ప్ర‌క‌ట‌ను జారీ చేయాల‌ని ఆదేశించారు. బెడ్స్‌, రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్లు, ఆక్సీజ‌న్‌ను అవ‌స‌ర‌మైన మేర అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు. జిల్లాలోని ఎల్‌.కోట‌, ఎస్‌.కోట‌, వేపాడ‌, జామి ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నందున అక్క‌డ పరిస్థితిని స‌మీక్షించాల‌ని చెప్పారు. అవ‌సర‌మైతే ఎల్‌.కోట హైస్కూల్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో సేవ‌లు బాగా అందేలా చ‌ర్య‌లు చేపట్టాల‌ని చెప్పారు. మంచి భోజ‌నం, స‌మ‌యానికి మందులు అంద‌జేయాల‌ని ఆదేశించారు.  పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో 6 కె.ఎల్. సామ‌ర్థ్యం గ‌ల ఆక్సీజ‌న్ ట్యాంక‌ర్‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. ఫీవ‌ర్ స‌ర్వే స‌రిగా జ‌రిగేలా చూసుకోవాల‌ని, హోం ఐసోలేష‌న్ కిట్ల పంపిణీ స‌రిగా జ‌రుగుతుందా లేదా అనే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు పరిశీలించుకోవాల‌ని చెప్పారు. ప్ర‌జ‌ల నుంచి చిన్న విమ‌ర్శ కూడా రాకుండా కోవిడ్ సేవ‌లందాల‌ని మంత్రి జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో సేవ‌ల‌ను స‌మీక్షించుకోవాల‌ని సూచించారు. జిల్లాలో ప్ర‌స్తుతం అధికారులు చేప‌డుత‌న్న చ‌ర్య‌లు బాగున్నాయని.. మ‌రింత విస్తృత పరిచి కోవిడ్‌ను నియంత్రించాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్కొన్నారు.


స‌మావేశంలో భాగంగా ముందుగా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ప‌లు అంశాల‌పై మాట్లాడారు. త‌మ ప‌రిధిలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ కోవిడ్ ఆసుప‌త్రుల్లో నియ‌మించే అద‌న‌పు సిబ్బందిలో ఎంబీబీఎస్ వాళ్ల‌తో పాటు, బీడీఎస్ వాళ్ల‌ను కూడా తీసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ ఎస్‌.కోట ప‌రిధిలో ఇప్ప‌టికే మూడు ఆక్సీజ‌న్ కాన్స‌లేట‌ర్స్ ఏర్పాటు చేశామ‌ని, మ‌రో మూడు కాన్స‌లేట‌ర్స్ కావాల‌ని కోరారు. అలాగే స్థానిక ఆసుప‌త్రులకు స్టెరాయిడ్స్ అంద‌జేయాల‌ని చెప్పారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌సయ్య మాట్లాడుతూ గత వారం స‌మావేశం నిర్వ‌హించి చ‌ర్చించిన చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయ‌ని, జిల్లాలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని పేర్కొన్నారు. జిల్లా అధికారులు చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని అన్నారు. పార్వ‌తీపురం ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు మాట్లాడుతూ పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రికి సంబంధించి గ‌త మీటింగ్‌లో ప్ర‌స్తావించిన స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఆర్‌.టి.పి.సి.ఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశార‌ని, అద‌నంగా అంబులెన్స్‌ను కేటాయించార‌ని పేర్కొన్నారు. 


స‌మావేశంలో జిల్లా కోవిడ్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ స‌త్య‌నారాయ‌ణ‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, పార్వ‌తీపురం ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు, ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీలు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, వెంక‌ట‌రావు, డీఎం&హెచ్‌వో ర‌మ‌ణ‌కుమారి, డీసీహెచ్ఎస్ నాగ‌భూష‌ణ‌రావు, మ‌హారాజ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మిమ్స్ డైరెక్ట‌ర్ డా. భాస్క‌ర‌రాజు, జడ్పీ సీఈవో వెంక‌టేశ్వ‌రరావు, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, పార్వ‌తీపురం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Vizianagaram

2021-05-19 13:39:56

అప్పన్న 2వ విడత చందనం అరగదీత ప్రారంభం..

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు ఈనెల26న రెవండో విడత చందనం సమర్పణ జరుగుతుందని దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైశాఖి పౌర్ణమి రోజున చందనం సమర్పిస్తారని చెప్పారు. స్వామివారికి సమర్పించే చందనం అగరదిత కార్యక్రమంలో దేవస్థాన ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు పాల్గొని చందనం అరగదీశారని వివరించారు. స్వామివారికి కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116) శేష వస్త్రం ఇస్తున్నామని చెప్పారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.

Simhachalam

2021-05-19 13:37:55

నిర్ణీత సమయంలోనే వైద్యసేవలు అందాలి..

కరోనా సమయంలో ఆసుపత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం భీమిలీ ఆసుపత్రిలో మంత్రి ఆకస్మికంగా పర్యటించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ, ప్రజలకు కరోనా కష్ట కాలంలో  మెరుగైన సేవలు అందించాలని, ప్రజలకు అవసరమైన బెడ్ల విషయంలో గానీ, ఆక్సిజన్ విషయంలో గానీ, అంబులెన్స్ విషయంలో గానీ వైద్యులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భీమిలి ఐఎన్ఎస్ కళింగ లో 60 బెడ్లు, ప్రభుత్వ ఆసుపత్రి లో 10 బెడ్లు, అదేవిధంగా పద్మనాభం మండలంలో 50 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు  ధరించవలసిందిగా మంత్రి కోరారు. అదేవిధంగా మందులు, సిబ్బంది వివరాలను కూడా మంత్రి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

Bheemili

2021-05-18 14:38:23

అక్షయ పాత్రలు సేవలు స్లాఘనీయం..

కరోనా వికృత రూపంతో విలయ తాండవం చేస్తున్న గడ్డు కాలంలో నగరం లోని పేదలు, వలస కూలీల ఆకలి తీర్చెందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ తో జివియంసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నగరం లోని వేలాది మంది అన్నార్తులకు  నిత్యం  ఆహారం అందించే ప్రక్రియను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి యదు దాస ప్రభు మంగళవారం ఆరిలోవలో ప్రారంభించారు. దాతల సహకారంతో అక్షయ పాత్ర చేస్తున్న ఆహార పంపిణీ యజ్ఞానికి జివియంసి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. పనులు లేక, పరిస్థితులు బాగాలేక, ఆస్పత్రుల అవసరార్థం నగరానికి వచ్చి భోజనం కోసం ఇక్కట్లు పడే వారికి ఊరట కల్పించటానికి ఆహార పంపిణీ ఎంత గానో ప్రయోజనంగా వుంటుందని మేయర్ హరి వెంకట కుమారి అన్నారు. సుమారు 5వేల మందికి నగర నలుమూలలకు వెళ్లి భోజనం ప్యాకెట్లు పంపిణీ వేగవంతం చేస్తున్నామని ఆమె తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులైన    కెజిహెచ్, ఛాతీ, ఇయన్ టి, రైల్వే ఆసుపత్రి, జివియంసి నైట్ షెల్టర్లతో పాటు నగరం లోని పేదలు, కూలీలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో  నిత్యం భోజనం ప్యాకెట్లు సరఫరా జరుగుతుందని మేయర్ అన్నారు. అక్షయ పాత్ర సేవలు నగరానికి ఎంతగానో అత్సవసరంగా ఉపయోగపడుతున్నాయి అని మేయర్ ప్రశంసించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఇంత పెద్ద యెత్తున ఆహార పంపిణీ కార్యక్రమానికి రూప కల్పన చేసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ భక్తదాస్ మరియు సభ్యులుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతుందని అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ వలె మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని నగర మేయర్ పిలుపునిచ్చారు. జివిఎంసి సంపూర్ణ సహకారంతో నిత్యం 5వేల మందికి ఆహార పొట్లాలు అందిస్తున్నామని ప్రెసిడెంట్ డాక్టర్  భక్తదాస్  అన్నారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-18 14:31:40

పారిశుధ్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని  కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగలశారం శానిటేషన్ పై అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్. లతో   వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని రోడ్లు, కాలువలు శుభ్రంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. డోర్ టు డోర్ వెళ్లి చెత్తను ఏ విధంగా నిర్వహిస్తున్నది, తడి-పొడి చెత్త సేకరణ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్త వేరు వేరుగా ఇవ్వాలని ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, దుకాణాల వద్ద మూడు చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని, అలా లేని దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. క్లాప్ (CLAP) పధకం విజయవంతం అయ్యేందుకు సచివాలయాల  స్థాయిలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటుకు ప్రణాళికా బద్ధంగా నిర్వహించేలా శానిటరి ఇన్స్పెక్టర్లకు, వార్డు శానిటరి కార్యదర్శులకు సూచించాలని ఆదేశించారు. పెద్ద పెద్ద కాలువలలో పూడిక తీత పనులపై కమిషనర్ ఆరా తీసారు. డంపర్ బిన్ల తొలగింపు వంటి కార్యక్రమం, పారిశుధ్య కార్మికులకు పనులు కేటాయింపు చేసి ప్రణాళిక వివరాలను ఎ.ఎం.ఒ.హెచ్. లను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షన్ ఐ.ఇ.సి. కార్యకలాపాలు మొదలైన పనులను అదనపు కమిషనర్లు అడిగితెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రధాన వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రతీ వార్డులో రద్దీ ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని, బ్లీచింగు ను చల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి    డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఎ.ఎం.ఒ.హెచ్. లు తదితరులు పాల్గొన్నారు.  

GVMC office

2021-05-18 14:29:00

రూ.8.5 లక్షల ఆక్సిజన్ ఎక్విప్ మెంట్ వితరణ..

విశాఖజిల్లాలోని అచ్చుతాపురంలోని ఏసియన్ పేయింట్స్ ప్రభుత్వానికి రూ.8.5లక్షల విలువైన ఆక్సిజన్ ఎక్సిప్ మెంట్ వితరణ చేశారు. వీటిని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.సుధాకర్ కి అందజేశారు. వీటిలో ఆక్సిజన్ మాస్కులు, సర్క్యూట్ లు, రీఏజెంట్లు తదితర ఎక్విప్ మెంట్ ను అందించారు. కరోనా సమయంలో దాతలు ముందుకి వచ్చి ఇతోదికంగా సహాయం చేయడం శుభపరిణామని ఏఎంసీ ప్రిన్సిపల్ కొనియాడారు. ఇదే స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వస్తే కరోనా రోగుల ప్రాణాలు కాపాడిన వారవుతారని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసియన్ పేయింట్స్ జనరల్ మేనేజర్, ఏఎంసీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు..

ఆంధ్రామెడికల్ కాలేజి

2021-05-18 13:36:18

500 పడకల ఆసుపత్రికి కార్యాచరణ..

శ్రీకాళహస్తి సమీపంలో ఆక్సిజన్ తో ఐదు వందలు పడకలు గల ఆసుపత్రి ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్  అధికారులను ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో  వివిధ శాఖల అధికారులతో ఆసుపత్రి నిర్మాణం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ ప్లాంట్ సమీపంలో ఆసుపత్రి నిర్మాణం చేపడితే బాధితులకు వేగంగా ఆక్సిజన్ ఇవ్వడానికి వీలవుతుందని అదే విధంగా వారు తొందరగా కూడా కోలుకుంటారని అందుకోసం ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులు ఆక్సిజన్ ను ఎంత వేగంగా 500 పడకలకు వీలయ్యే విధంగా ఎన్ని రోజులలో అమర్చ గలరని అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని వారిని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి జర్మన్ షెడ్ లను ఏర్పాటు చేయాలని ఎన్ని రోజులు ఈ షెడ్యూల్ అను పూర్తి చేయగలరని ఈ ప్రాంగణంలో ఎటువంటి ఏర్పాట్లు ఉండాలని డాక్టర్లు వారి సిబ్బంది ఉండడానికి ఏర్పాట్లు చేయాలని అందుకోసం టాయిలెట్లు తదితర ఏర్పాట్లను నీటి తో సహా ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు. తాత్కాలికంగా అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలని మంచి వాతావరణం ఉండేలా చూడాలని ఆయన అన్నారు. బాధితులు ఎవరైతే చికిత్స పొందడానికి రావడం జరుగుతుందో వారికి అన్ని ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం చేయాలని భావించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అయితే ఏ ఏ శాఖ తరపున ఎంత ఖర్చవుతుందో ప్రణాళికలు రెండు రోజుల్లో సిద్ధం చేస్తామని కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) వీరబ్రహ్మం, తిరుపతి ఆర్ డి ఓ కనక నర్సారెడ్డి,జి ఎం డి ఐ సి ప్రతాప రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, మెడికల్ హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. 

Collectorate Complex

2021-05-18 13:23:04

మత్స్యకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం..

చేపలవేట ప్రధాన జీవనోపాధిగా వున్న మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా వుంటుం దని రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం కింద అర్హుల బ్యాంకు ఖాతాల్లో వరుసగా మూడవ ఏడాది రూ. 10 వేల చొప్పున నగదు జమచేస్తున్న సందర్భంగా మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేట నిషేధం వల న ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా సాధారణ ప్రజల పరిస్థితిని దృష్టిలో
పెట్టుకొని మాట ఇచ్చిన మేరకు సకాలంలో వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ దిశగా ఎనిమిది జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో నిర్మించబోయే హార్బర్ కు ఈ ఏడాదే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం జిల్లానుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి మత్స్యకారులను ఉద్థేశించి వ ూట్లాడుతూ కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం భూమి సిద్ధంగా వుందని చెప్పారు. ఈ హార్బర్ అందుబాటులోకి వస్తే మత్స్యకారుల జీవనోపాధి మరింత మెరుగు పడుతుందన్నారు. తమ కోసం ఒక భవనం కావాలని మత్స్యకారులు కోరారని, ఈ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ భవనం కోసం 16 సెంట్లు భూమిని వారం రోజుల్లోనే సమకూర్చి పెడతామని కలెక్టరు చెప్పినట్లు బాలినేని ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  ఆది మూలపు సురేష్ మాట్లాడుతూ పేద లు, చేతివృత్తులపై ఆధారపడ్డ
వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్థితో పనిచేస్తోందని చెప్పారు. సముద్ర వేట నిషేధ కాల భృతిని గత ప్రభుత్వంలో వున్న రూ. 4 వేల నుంచి 10 వేలకు పెంచడం, మత్స్యకారుల బోట్లకు వాడే డీజిల్‌పై రాయితీని రూ. 6.03 నుంచి రూ. 9 లకు పెంచడం, ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఆక్వా రైతులు వినియోగించే విద్యుత్ ఛార్జీల
యూనిట్ రేటును రూ. 3.86 నుంచి రూ. 1.50 లకు తగ్గించడం, వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద మత్సకారుల అర్హత వయస్సును 50 ఏళ్లకు తగ్గించడం, మత్సకారులకు, ఆక్వారైతులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచే సేలా జిల్లాలో 84 మంది గ్రామ మత్స్య సహాయకులను, 65 మంది సాగరమిత్రలను నియమించడం ప్రభుత్వ చిత్తశుద్థికి నిదర్శనమని వివరించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా కింద జిల్లాలో ప్రస్తుతం 12 వేల 284 మంది రూ. 12.284 కోట్ల మేరకు లబ్దిపొందుతున్నట్లు చెప్పారు. సముద్ర వేట నిషేధకాల భృతి రూ. 36.334
కోట్లు, మత్సకారులకు డీజిల్‌పై సబ్సిడి రూ. 20.40 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడి రూ. 210 కోట్లు, వేట చేస్తూ మరణించే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహా యం రూ. 1.20 కోట్లు, రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచితముగా చేప పిల్లల విడుదలకు రూ. 30 లక్షలు కలిపి 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మత్సకారులకు మొత్తం రూ. 268.234 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం మత్స్యకార
భరోసాకు సంబంధి ంచిన నిధుల చెక్కును మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా మత్స్యకారులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత, చీరాల శాసన సభ్యులు కరణం బలరామక్రిష్ణమూర్తి, జాయింట్ కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్) జె. వెంకట మురళి, పి.డి.సి.సి. బ్యాంకు ఛైర్మన్ మాదాసు వెంకయ్య, మత్స్యశాఖ జె.డి. చంద్రశేఖర రెడ్డి, పశు సంవర్థక శాఖ జె.డి. బేబీరాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

PRAKASAM DISTRICT

2021-05-18 12:55:30