తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలను ఈ విషయమై భయాందోళనలు చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని వస్తున్న వార్తలు అవాస్తవమని, స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కు కొరత లేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ వినియోగం, ఎంత మేరకు ఇంకా అవసరం ఉన్నదనే విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి స్విమ్స్, రుయా ఆసుపత్రులతో పాటు చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వ, సరఫరాకు సంబంధించిన అంశాలను జిల్లా స్థాయిలో కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ రీఫిలింగ్ కేంద్రాల నుండి ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సకాలంలో చేరేలా పోలీసు శాఖ సహకారంతో గ్రీన్ చానల్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ విషయమై వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు ఈ విషయమై భయపడవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు.