1 ENS Live Breaking News

ఉన్నత చదువులతో ప్రయోజకులు కావాలి..

కేంద్రీయ విద్యాలయానికి ఎంపికైన విద్యార్ధులంతా ఉన్నత చదువులు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని రాజమహేంద్రవరం ఎంపీ , వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఆకాంక్షించారు. శనివారం శనివారం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఇటీవల డ్రాలో ఎంపికై సీట్లు సాధించిన పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎంపీని కలిసి అభినందనలు తెలియజేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తమ కలను మీరు సాకారం చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ ఎంపి భరత్ రామ్ మిఠాయిలను పంచారు. విద్యార్థులందితో కలిపి సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయంలో అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారని,  అటువంటిది డ్రాలో అదృష్టం మీ చిన్నారులను వరించిందని అన్నారు. 
మీ పిల్లల అభిరుచులకు తగ్గట్టుగా వారిని చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినవారవుతారన్నారు. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విద్యావంతులుగా తీర్చి దిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి సాగర్ జిల్లా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ అన్నపూర్ణ రాజు,  నాయకులు బిల్డర్ చిన్నా, ఎం గణేష్ బాబు, బి చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-05-08 09:03:42

డిప్యూటీ లేబర్ కమిషనర్ గా పురుషోత్తం..

విజయనగరం  జిల్లా కార్మిక శాఖ ఉప కమీషనర్ గా సీహెచ్. పురుషోత్తం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉప కమీషనర్ గా విధులు నిర్వర్తించిన ప్రసాద రావు పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లా ఉప కమీషనర్ గా నియమితులు కావడంతో ఆయన స్థానంలో శ్రీకాకుళం లో సహాయ కమీషనర్ గా వున్న సిహెచ్. పురుషోత్తం కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన 9492555034 మొబైల్ నంబరులో అందుబాటులో ఉంటారు.

విజయనగరం

2021-05-08 08:21:58

లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ కి పంపండి..

ఎవ‌రిలోనైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వెంట‌నే కోవిడ్‌ కేర్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి, చికిత్స‌ను అందించాల‌ని రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ది, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. జ్వ‌రం వ‌చ్చిన వెంట‌నే కేర్‌సెంట‌ర్‌కు త‌ర‌లించ‌డం ద్వారా, వారికి స‌త్వ‌ర‌మే చికిత్సను అందించ‌డంతోపాటుగా, వ్యాధి వ్యాప్తిని అడ్డుకొనేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. జిల్లాలోని ప‌లువురు ఉన్న‌తాధికారులు, వైద్యారోగ్య‌శాఖాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు,  తాశీల్దార్లు, ఎంపిడిఓల‌తో  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ శ‌నివారం నిర్వ‌హించిన‌ టెలీ కాన్ఫ‌రెన్స్లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పాల్గొన్నారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ముందుగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, మంత్రికి వివ‌రించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాధి ప‌ట్ల స్థానికంగా విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లాలోని అన్ని కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. జ్వ‌రాల‌పై దృష్టిపెట్టి, వెంట‌నే వారికి చికిత్స‌ను అందించే ఏర్పాటు చేయాల‌న్నారు. రెమిడిసివిర్‌, ఇత‌ర మందుల కొర‌త రాకుండా చూడాల‌న్నారు. ముఖ్యంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాల‌న్నారు. మృత‌దేహాల‌ను త్వ‌ర‌గా త‌ర‌లించాల‌ని, అవ‌స‌ర‌మైతే అద‌నంగా అవుట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిలో సిబ్బందిని తీసుకోవాలని, ప్ర‌యివేటు అంబులెన్సుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో క‌లిసి రెండు మూడు రోజుల్లో కోవిడ్‌పై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తామ‌ని, దీనికి అధికారులంతా సిద్దంగా ఉండాల‌ని మంత్రి కోరారు.

                  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జ్వ‌రాల‌పై స‌ర్వేను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఎంత త్వ‌ర‌గా జ్వ‌రాల‌ను గుర్తిస్తే, అంత త్వ‌ర‌గా వ్యాధిని నయం చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. స‌ర్వేలో వాలంటీర్ల స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని సూచించారు. ఎంపిడిఓలు స‌ర్వేను ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. ఎన్ఎంలు జ్వ‌ర బాధితుల ఇళ్ల‌కు వెళ్లి, వారికి ప్రాధ‌మిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌న్నారు. అలాగే హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్ల‌ను పూర్తిచేసి, వారి వివ‌రాల‌ను త‌క్ష‌ణ‌మే ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌న్నారు. క‌ర్ఫ్యూ స‌మయంలో ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌ను పూర్తిగా క‌ట్ట‌డి చేయాల‌ని, వారు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యేట‌ట్టుగా చూడాల‌న్నారు. క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో నిర్వ‌హించే కార్య‌క‌లాపాల్లో త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరాన్ని పాటించాల‌ని, మాస్కుల‌ను ధ‌రించేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

                   ఈ టెలీ కాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పీవో ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, తాశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-08 07:36:52

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ 2వ డోసు..

విశాఖ జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, విశాఖ మహానగర పరిధిలో ఎంపిక చేసి ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, అర్భన్ పీహెచ్సీల్లో కోవిడ్ వేక్సిన్ 2వ డోసు పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్య నారాయణ తెలియజేశారు. మొదటి డోసు తీసుకున్నవారు 2వ డోసు టీకా వేయించుకోవడానికి ఈ క్రింది తెలియజేసిన పీహెచ్సీల్లో సంప్రదించి, కోవిడ్ నిబంధనలు పాటించి వేయించుకోవాలని ఆయన కోరుతున్నారు.1.గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ద్రోణంరాజు కళ్యాణమండపం,డ్రైవర్స్ కాలనీ), 2.పెందుర్తి సామజిక ఆరోగ్య కేంద్రం, 3.మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 4.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం(RTC M),5.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం.అనకాపల్లి., 6.చిన వాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం, 7.స్వర్ణ భారతి పట్టణ ఆరోగ్య కేంద్రం,  8.అరిలోవ ఆరోగ్య కేంద్రం, 9.శ్రీహరిపురం ఆరోగ్యకేంద్రం, 10.కింగ్ జార్జి ఆసుపత్రిలో ఈ వేక్సిన్ వేయించుకోవచ్చునని డిఎంహెచ్ఓ కోరుతున్నారు.

విశాఖపట్నం

2021-05-07 15:27:34

కోవిడ్ నోడలధికారి సస్పెండ్..

అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రి నోడల్ అధికారి, హిందూ పురం డివిజనల్ కోఆపరేటివ్ అధికారి వి.రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ ఆఫీసర్ల తో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రిలోని పేషేంట్ల రోజువారీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమైనందున చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులలో తెలిపారు. హిందూపురం డివిజనల్ కోఆపరేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వి.రాజేంద్ర ప్రసాద్ ను గతంలో హిందూపురం జిల్లా ఆసుపత్రికి నోడల్ అధికారిగా నియమించారు. వైద్యాధికారుల సమన్వయంతో కోవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమవడంతో నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్  తెలిపారు.. కో విడ్ విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం,అలసత్వం చూపిన కారణంగా నియమ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి నూతన నోడల్ అధికారిగా పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతిని నియమించారు. కోవిడ్ విధుల్లో  నిర్లక్ష్యాన్ని సహించేది లేదని  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.. 

అనంతపురం

2021-05-07 15:13:51

పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకి క్రుషి..

భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు సేనలపై మూడేళ్లు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించి, తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిచెప్పిన  ‘విప్లవజ్యోతి’అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టేందుకు కృషిచేస్తానని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు,  వైసిపి చీఫ్‌ విప్‌ మార్గని భరత్‌రామ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక గోదావరి గట్టున జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహంవద్ద జరిగిన అల్లూరి 97వ వర్థంతోత్సవ కార్యక్రమంలో ఎంపి భరత్‌రామ్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీతారామరాజు జీవించిన 27 సం॥రా కాలంలో 13 సంవత్సరాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు పరిసర ప్రాంతాల్లో జీవించడం రాజమహేంద్రవరం నగరానికే గర్వ కారణమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు, అలాగే రాజమహేంద్రవరంలో అల్లూరి చరిత్రను గుర్తుచేసే విధంగా ఒక భారీ అభివృద్ధికి అల్లూరి పేరు పెడతామన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, సీతారామరాజు కుటుంబం 13 సం॥రాకు పైగా గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి ఆయన స్థానిక ఉల్లితోట బంగారయ్య స్కూల్లో చదువుకొన్నాడని, గోదావరి పుష్కరాల రేవులో ఆయన, ఆయన తండ్రి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో స్నాన మాచరించే వారని గుర్తుచేశారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, పాత రైల్వే (హేవ్‌లాక్‌ బ్రిడ్జి) బ్రిడ్జికి, అల్లూరి పోరాటానికి ముఖ ద్వారమైన రాజమహంద్రవరం ఎయిర్‌ పోర్టుకు అల్లూరి పేరుపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. అలాగే పార్లమెంట్‌లో అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాన్ని మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రూపొందించి ఇవ్వడానికి సిద్దంగా వుందని, వీటిపై ఎంపి భరత్‌రామ్‌ కృషిచేయాలని పడాల కోరారు. దానిపై స్పందించిన ఎంపి భరత్‌ రామ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అవి జరిగేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సంఘం ఉపాధ్యక్షుడు, పూర్వ ఫారెస్ట్‌ అధికారి దంతులూరి సుబ్బరాజు, మాదేటి రవిప్రకాష్‌, జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌, కార్యదర్శి వెల్లా నాగార్జున, హర దీపక్‌, దల్లి శ్రీనివాసరెడ్డి, వైసిపి నాయకు మజ్జి అప్పారావు, గేడి అన్నపూర్ణరాజు, బ్డిర్‌ చిన్న, కె. ఓంకార్‌, మార్గాని బుజ్జి, ఉల్లూరి రాజు, పీతా రామకృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, గాడా తాతారావు, దూర్వాసు సత్యనారాయణ, రొక్కం వంశీ తదితరులు పాల్గొన్నారు.
గోరక్షణపేటలో పడాల రామారావు స్మారక స్థూపం వద్ద....
తొలుత  గోరక్షణపేట సెంటర్‌లో  స్వాతంత్య్ర సమరయోధుడు  పడాల రామారావు స్మారక మందిరం వద్ద వున్న ‘విప్లవజ్యోతి’అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. పడాల విగ్రహానికి దంతులూరి సుబ్బరాజు పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. అలాగే గోరక్షణపేటలోని జాతీయ అల్లూరి సీతారామరాజు కార్యాలయంలో వున్న అల్లూరి విగ్రహానికి యువజన సంఘం జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌, పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు.

రాజమండ్రి

2021-05-07 15:00:21

కలెక్టర్ కోలుకోవాలని అప్పన్నకు పూజలు..

విశాఖజిల్లాలో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ కోవిడ్ భారిన పడిన జిల్లా  కలెక్టర్  వి.వినయ్ చంద్ త్వరగా కోలుకోవాలంటూ సింహాచలంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం ఈ ప్రాంతానికి చెందిన  సామాజిక వేత్త బాలభానుమూర్తి  ఆధ్వర్యంలో ప్రేరణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జర్నలిస్ట్ జట్లీ స్థానికులు కలసి సింహాచలంలో అప్పన్న స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అహోరాత్రులు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించాలని శ్రమించిన కలెక్టర్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు చేయడానికి వచ్చేలా సింహాద్రి అప్పన్న ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే జీవియంసీ కమీషనర్ సృజన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని  సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద తులసి మాల వేసి స్వామిని వేడుకున్నామన్నారు. జిల్లా అధికారులతో పాటు కో విడ్ తో పోరాడుతున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కూడా పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.

సింహాచలం

2021-05-07 14:44:22

రైస్ మిల్లర్ల కోవిడ్ విరాళం రూ.50లక్షలు..

తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు కొవిడ్ సేవల నిమిత్తం జిల్లా రిలీఫ్ ఫండ్ కింద శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా. జి లక్ష్మీ శ  సమక్షంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి రూ.50 లక్షల చెక్కును కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విపత్తు సమయంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరుపున రూ.50లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం ఈ లక్ష్మీ రెడ్డి, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్ రామారెడ్డి, వీ.సూర్య ప్రకాష్ , ఎం బుల్లి మోహన్ రెడ్డి, ఎన్వివి సత్యనారాయణ రెడ్డి,సీ బాబ్జి ,తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-07 14:11:52

రెమిడెసివర్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు..

రెమిడెసివర్ ఇంజెక్షన్ పేరిట సోషల్ మీడి యా. సామాజిక మాధ్యమాలలో  అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యం.  హరి నారాయణన్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా  రెమిడిసివియర్ ఇంజక్షన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దొరుకుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారని. ఈ ఇంజక్షన్ జిల్లాలోని ఆసుపత్రుల్లో మాత్రమే దొరుకుతుందని వైద్యుల సూచన మేరకు అందించడం జరుగుతుందని, ప్రస్తు తం ఉన్న పరిస్థితుల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సామా జిక మాధ్యమాల్లో వస్తున్న  సమా చారం ను ప్రజలు నమ్మ వద్ద ని ఈ విషయం ను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ఈ లాంటి అసత్య వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై  విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

చిత్తూరు

2021-05-07 14:06:25

ఆరు రోజులు అప్పదర్శనాలకు సెలవు..

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేసినట్టు ఈఓ సూర్యకళ తెలియజేశారు. శుక్రవారం ఆమె సింహాచలంలో మీడియాలో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అర్చకుల విజ్ఞప్తి  మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో  ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాల నిర్ణయించామన్నారు. కాగా స్వామివారి చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నామని చెప్పారు. స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలూ ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు వరకు యథావిథిగానే ఏకాంతంగానే జరుగుతాయన్నారు. స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండబోదన్న ఈఓ 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. 

సింహాచలం

2021-05-07 13:57:56

జాతి గర్వించదగ్గ యోధుడు అల్లూరి..

అతి పిన్నవయస్సులోనే స్వాతంత్ర్యం కొరకు బ్రిటీషు వారిని ఎదరించిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులలో  అల్లూరి సీతారామరాజు ఒకరని ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి వర్థంతి సంధర్బంగా సీతమ్మధారలో గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ అతి చిన్నవయస్సులోనే 4 సంవత్సరాలపాటు బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడారని తెలిపారు.  పాండ్రంగిలో జన్మించిన ఆయన ఉద్యమబాట పట్టి  బ్రిటీషు వారి దోపిడీని ఎదిరించి పోరాటంలో అశువులు బాసారని, గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఆయన సమాధి అయ్యారని అన్నారు. కులమతాలకు అతీతంగా ధన, మాన, ప్రాణాలను దారపోసి ఎందరో మహానుభావులు త్యాగఫలం మనం అనుభవిస్తున్నామని, ప్రతి సంవత్సరం పాండ్రంగి, కృష్ణదేవిపేటలలో అల్లూరిని  స్మరించుకొంటూ కార్యక్రమాలను ఘణంగా జరుపుకొనేవారమని, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా సామాన్యంగా జరుపుకోవలసి వచ్చిందన్నారు.  
అదేవిధంగా కోవిడ్ సెకెండ్ వేవ్ ఉదృతంగా ఉన్నదని, మొదటి వేవ్ వైరస్ ఎక్కువ వయసు వారికే సంక్రమించేదని,  ప్రస్తుతం  సెకెండ్ వేవ్ వైరస్ ప్రమాదకరమని, ఇది అన్నివయస్సుల వారికి సోకుతుందని, ఆక్సిజన్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గిపోయి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.  ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్ సరఫరాలను ప్రభుత్వం పెంచిందని వివరించారు.  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో  కరోనాను ఎదుర్కొనుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.   అదేవిధంగా ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనుటకు ప్రజల సహకారం కూడా అవసరమని వ్యాధి చికిత్సకంటే నివారణ ముఖ్యమన్నారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, బౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో  జి.వి.యం .సి. కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, బాణాల శ్రీను, ఎస్.పద్మారెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి, గుడివాడ ఫృద్వి తదితరులు పాల్గొన్నారు. 

సీతమ్మధార

2021-05-07 13:48:28

రిజిస్ట్రేషన్ శాఖ పని వేళల్లో మార్పులు..

కోవిడ్ - 19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిన దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల  పని వేళల్లో మార్పులు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ కె. మన్మధరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   తేది  5.5.2021 నుండి  18.5.2021 వ తేది వరకు కర్ఫ్యూ సందర్భంగా ఉదయం గంటలు 7.30 ని. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటలు వరకు పని దినాలలో మాత్రమే కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఒక ప్రకటనలో వివరించారు.  ఉదయం గం.లు 11.30 ని. ల నుండి మధ్యాహ్నం 2.00 గంటలు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకొనే వారు తప్ప,   సాధారణ ప్రజలు ఎవరూ కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించకూడదని తెలిపారు. కోవిడ్ - 19 దృష్ట్యా కర్ఫ్యూ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనివేళల్లో మార్పులు చేయడం జరిగిందని  ప్రజలు గమనించి సహకరించవలసినదిగా ఆయన కోరారు.

విశాఖపట్నం

2021-05-07 13:44:04

ప్రభుత్వ కార్యాలయాలు 11.30 వరకే..

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించ‌డంలో భాగంగా మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న దృష్ట్యా ప్ర‌భుత్వ కార్యాల‌యాల ప‌నివేళ‌ల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. దీనిప్ర‌కారం జిల్లాలోని జిల్లా, మండ‌ల, గ్రామ‌స్థాయిలో వుండే అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఈనెల 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తాయ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. 12 గంట‌ల త‌ర్వాత కూడా ఎవ‌రైనా ఉద్యోగుల సేవ‌లు అవ‌స‌రం ఉన్న‌ట్ల‌యితే వారికి ప్ర‌త్యేక పాస్‌లు జారీ చేస్తార‌ని పేర్కొన్నారు. కోవిడ్ నిర్వ‌హ‌ణ‌లో అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించాల్సిన వైద్య ఆరోగ్య‌శాఖ‌, విద్యుత్‌, మునిసిపల్ ప‌రిపాల‌న‌,  పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌కు ఈ ప‌నివేళ‌లు వ‌ర్తించ‌వ‌ని పేర్కొన్నారు. ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ మార్పు చేసిన ప‌నివేళ‌ల ప్ర‌కారం ప‌నిచేయాల్సి వుంటుంద‌ని తెలిపారు.

విశాఖపట్నం

2021-05-07 13:39:43

కంగారొద్దు.. గంట‌లోనే ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా..

 ఆక్సీజ‌న్‌కు ఎటువంటి కొర‌తా లేద‌ని, కేవ‌లం గంట‌లోనే ఆయా ఆసుప‌త్రుల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. జిల్లా అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని, ప్లాంట్లు నుంచి నేరుగా ఆక్సీజ‌న్‌ను కొనేందుకు కూడా ఆసుప‌త్రుల‌కు అనుమ‌తినిచ్చిన‌ట్లు తెలిపారు. బొబ్బిలి గ్రోత్ సెంట‌ర్‌లో సోనీ ఎంట‌ర్ ప్రైజెస్‌, శ్రీ సాయి శ్రీ‌నివాస గ్యాసెస్ మొద‌ల‌గు రెండు ప్ర‌యివేటు ఆక్సీజ‌న్ ఫిల్లింగ్ కంపెనీల‌ను, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే తో క‌లిసి  శుక్ర‌వారం జెసి ప‌రిశీలించారు. ఆక్సీజ‌న్ ల‌భ్య‌త‌, ఫిల్లింగ్ సామ‌ర్థ్యాల‌ను తెలుసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల ఉత్ప‌త్తి ఆగ‌కుండా చూడాల‌ని యాజ‌మాన్యాల‌ను ఆదేశించారు.

                 ఈ సంద‌ర్భంగా జెసి మ‌హేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా అవ‌స‌రాల‌కు స‌రిప‌డినంత‌గా ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల‌కు దాదాపు స‌మాన దూరంలో ఉన్న బొబ్బిలి నుంచి కేవ‌లం గంట‌లోనే ఎక్క‌డికైనా ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌గ‌ల‌మ‌ని చెప్పారు. రోజువిడిచి రోజు జిల్లాకు 10 కిలోలీట‌ర్ల ఆక్సీజ‌న్ ట్యాంక్ వ‌స్తోంద‌ని, దీనితో రోజుకు సుమారు 500 సిలండ‌ర్ల ఫిల్లింగ్ జ‌రుగుతోంద‌ని చెప్పారు. జిల్లాలో ప్ర‌స్తుతం రోజుకు సుమారుగా 450 వ‌ర‌కూ సిలండ‌ర్లు అవ‌స‌రం అవుతున్నాయ‌ని, ఆ మేర‌కు నిరాటంకంగా ఉత్ప‌త్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.  ఉత్పత్తి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ముగ్గురు నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించామ‌ని, ఆయా ఆసుప‌త్రులు ముందుగా నోడ‌ల్ అధికారుల‌ను సంప్ర‌దించి, త‌మ‌కు కావాల్సిన ఆక్సీజ‌న్ సిలండ‌ర్ల‌ను తీసుకువెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పించామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఇక్క‌డినుంచి పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రికి నేరుగా ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతోంద‌న్నారు.

                 అన్ని ప్ర‌యివేటు కార్పొరేట్ ఆసుప‌త్రులు, పిహెచ్‌సిలు, సిహెచ్‌సిల‌కు బొబ్బిలి నుంచి ఆక్సీజ‌న్ సిలండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్లు చెప్పారు. మిమ్స్ ఆసుప‌త్రికి శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం నుంచి ఆక్సీజ‌న్ వ‌స్తోంద‌న్నారు. వంద ప‌డ‌క‌లు, దానికంటే ఎక్కువ‌గా ఉన్న జిల్లా కేంద్రాసుప‌త్రి, మిమ్స్ ఆసుప‌త్రి, పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ నిల్వ కోసం జెర్మ‌న్ హేంగ‌ర్స్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఈ ప్ర‌క్రియ రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతోంద‌ని చెప్పారు. అందువ‌ల్ల కోవిడ్ పేషెంట్లు ఆక్సీజ‌న్ కోసం  ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని జెసి సూచించారు.

                  ఈ ప‌ర్య‌ట‌న‌లో బొబ్బిలి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎం.మ‌ల్ల‌య్య‌నాయుడు,  తాశీల్దార్ ఆర్‌. సాయికృష్ణ‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల జిల్లా కో-ఆర్డినేట‌ర్ జి.అశోక్ కుమార్‌, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా నోడ‌ల్ అధికారులు ః -
జి.అశోక్ కుమార్, జిల్లా కో-ఆర్డినేట‌ర్‌, స‌చివాల‌యాలు ః 9030546667
ఆర్‌.సాయికృష్ణ‌, తాశీల్దార్‌, బొబ్బిలి ః 9618006488
ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, ఎస్‌డిసి, ః 8106378646

విశాఖపట్నం

2021-05-07 13:36:57

కోవిడ్ బాధిత చిన్నారులకు రక్షణ గృహం..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్-19 దృష్ట్యా సమస్య ఎదుర్కొంటునన్న చిన్నారులకు బాలల రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మరియు బాలల సంరక్షణ కమిటి ఛైర్మన్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన జారీ చేస్తూ కోవిడ్ భారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో చేరిగాని లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉండిగాని కోలుకుంటున్నారని ఆయన అన్నారు. కోలుకున్న తరువాత పరీక్షలలో నెగిటివ్ వచ్చినప్పటికి చిన్నారుల సంరక్షణకు బంధువులు, సంరక్షకులు గాని ముందుకు రాకపోతే అటువంటి పిల్లలకు రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా కోవిడ్-19తో తల్లిదండ్రులు మరణించి, సంరక్షకులు ఎవ్వరూ లేక అనాథలుగా మిగిలిన పిల్లలకు కూడా రక్షణ గృహంలో వసతి కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ మరియు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గల బాలల రక్షణ గృహాలలో వసతి కల్పించి, సంరక్షించడం జరుగుతుందని ఆయన వివరించారు. కోవిడ్-19 బాధిత 18 సంవత్సరం లోపు వయస్సు గల  బాలబాలికల సంరక్షణకు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెం. 1098,  మహిళా హెల్ప్ లైన్ నెం. 181 కు సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.  తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకున్న తరువాత వారి పిల్లలను నిబంధనలను అనుసరించి అప్పగించటం జరుగుతుందని ఆయన వివరించారు. తల్లిదండ్రులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శ్రీకాకుళం

2021-05-07 13:34:11