1 ENS Live Breaking News

సరుకుల పంపిణీకి ఇబ్బంది రాకూడదు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బుధ‌వారం నుంచి క‌ర్ఫ్యూ విధించిన నేప‌థ్యంలో నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశించారు.  ఎల్‌పిజి, పెట్రోలు బంకులు, రేష‌న్ షాపు డీల‌ర్లతో త‌న ఛాంబ‌ర్‌లో  మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా జెసి మాట్లాడుతూ నిత్యావ‌స‌రాల‌కు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌న్నారు. నిత్యావ‌స‌రాలు స‌ర‌ఫ‌రా చేసే వాహనాల‌కు ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయడం ద్వారా, పోలీసుల‌నుంచి ఎటువంటి ఇబ్బందులూ త‌లెత్త‌వ‌ని సూచించారు. వంట‌గ్యాస్‌, పెట్రోలు త‌గినంత స్టాకు ఉంచుకోవాల‌ని చెప్పారు. నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో గానీ, స‌రుకుల విక్ర‌యంలో గానీ త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జెసి కోరారు. ఈ స‌మావేశంలో డిఎస్ఓ పాపారావు, డిఎం సివిల్ స‌ప్ల‌యిస్ భాస్క‌ర్రావు, ఆయా సంఘాల ప్ర‌తినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-04 15:12:10

అనవసరంగా కోవిడ్ కేర్ సెంటర్లో తిరగొద్దు..

కోవిడ్ వైర‌స్ ఉద్ధృత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఆసుప‌త్రికి వ‌చ్చేవారు ఎక్కువ‌గా అటూ ఇటూ తిర‌గకుండా చూడాల‌ని.. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్లుగా ట్ర‌యాజింగ్ చేసి వారి ఆరోగ్య ప‌రిస్థితి ఆధారంగా ఇన్‌పేషెంట్/సీసీసీ/హోమ్ ఐసోలేష‌న్‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి వైద్యాధికారుల‌కు నిర్దేశించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం జేసీ (డీ) కీర్తి చేకూరి.. అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌తో క‌లిసి కాకినాడ జీజీహెచ్‌ను సంద‌ర్శించారు. అవుట్ పేషెంట్‌, ట్ర‌యాజింగ్‌, ఇన్‌పేషెంట్ రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్ల‌ను ప‌రిశీలించి.. రోగుల స‌హాయ‌కులు, ఆసుప‌త్రి వైద్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు సూచ‌న‌లిచ్చారు. అవ‌స‌రం మేర‌కు బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాల‌ని, ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అంబులెన్సుల ప్ర‌వేశం, నిర్గ‌మ‌నం సజావుగా జ‌రిగేలా మ‌రింత మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇన్‌పేషెంట్ బ్లాకుల్లో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, పూర్తిస్థాయిలో వైద్య‌, ఇత‌ర సౌక‌ర్యాలు అందేలా చూడాల‌ని జేసీ పేర్కొన్నారు. జేసీ వెంట ఆర్ఎంవో డా. ఇ.గిరిధ‌ర్‌, వైద్యాధికారులు ఉన్నారు.

కాకినాడ

2021-05-04 15:03:46

ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా డా.కె.రాజేష్

విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్  గా కొటకల రాజేష్ ను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అనుమతితో తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఐదేళ్లపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా మెరుగైన సేవలందించారు. గత రెండేళ్లుగా  పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా రాజేష్  వైద్య సేవలందిస్తున్నారు.
ఈ మేరకు రాజేష్ సీనియారిటీ, పని అనుభవాన్ని గుర్తించి తాజాగా విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఇతర అధికారులు, వైద్యులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ చెప్పారు.

విశాఖపట్నం

2021-05-04 14:29:31

సకాలంలో ఆసుపత్రులకు ఆక్సిజన్..

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గల ఆక్సిజన్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. మంగళ వారం మధ్యాహ్నం ఆసుపత్రి ఆవరణలో ఉన్న 10 వేల లీటర్ల సామర్ధ్యం గల యూనిట్ ను పరిశీలించి నిర్వహణపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ద్రవ రూప ఆక్సిజన్ గడ్డకట్టుటకు అవకాశాలు ఉంటాయని అటువంటి సంఘటన జరగకుండా నిరంతరం నీటితో పైపులను తడి చేస్తుండాలని ఆయన ఆదేశించారు. పైపు లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు. ఆక్సిజన్ నిరంతర సరఫరా ఉండాలని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ యూనిట్ నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించిన తక్షణం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంత త్వరగా పరీక్షలు చేయించుకుంటే అంత సురక్షితంగా ఉంటారని గ్రహించాలని ఆయన అన్నారు. త్వరగా వైరస్ నిర్ధారణ జరిగితే సంబంధిత మందులను ఇంటి వద్ద ఉంటూనే తీసుకుని నయం చేసుకోవచ్చని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆలస్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. కరోనా ఎవరికైనా రావచ్చని, కరోనా గూర్చి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరగా నిర్ధారణ, త్వరగా మందులు తీసుకోవడం, భయం లేకుండా ఉండటంతో అతి త్వరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాలకు వెళ్ళరాదని, వేడుకలలో పాల్గొనరాదని ఆయన హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ , ఏపిఎస్ ఎంఐడిసి జెఇ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-05-04 13:51:11

ఈవీఎంలకు పటిష్ట భద్రత..

ఈవీఎంల భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు  
ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం), డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం, కాకినాడ అర్బ‌న్ డీటీ ర‌మేశ్‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-04 13:04:00

ముమ్మరంగా ఫీవర్ సర్వే..

శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా ఫీవర్ సర్వే ఇంటింటికీ తిరిని నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి ఫీవర్ సర్వేను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలు జారీ చేసారు. దీనితో మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే కార్యక్రమం జోరుగా సాగుతోంది.  జ్వరం, దగ్గు, జలుబుతో సహా ప్రస్తుతం కరోనా లక్షణాలుగా మారుతున్న కీళ్ళ నొప్పులు, నడుం నొప్పి, నీరసం, విరేచనాలు, తల నొప్పి, కళ్ళు ఎర్రగా మారడం (కళ్ళ కలక మాదిరిగా) వంటి లక్షణాలు కనిపిస్తే వారిని గుర్తించి నమూనాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు. కంటైన్మెంటు జోన్లలో జిల్లా కలెక్టర్ సందర్శిస్తున్న సమయంలో సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. మండలాల్లో ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఇంటిలో పరిస్ధితిని తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించిన పరీక్షలు చేయించుటకు సహకరిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ముందుగా సమాచారం అందించడం జరుగుతోంది. ఫీవర్ సర్వేలో మండల ప్రత్యేక అధికారులతోపాటు జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి మరియు జిల్లా నోడల్ అధికారి క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తున్నారు. ఫీవర్ సర్వే స్ధితిగతులను పరిశీలించడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫీవర్ సర్వే ఒక ప్రక్క చేపడుతుండగా మరో వైపు పారిశుధ్య కార్యక్రమాలను కూడా విస్తృతం చేపడుతున్నారు. వైరస్ నాశనానికి అవసరమైన బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి వంటి వివిధి పద్ధతులను ఆచరిస్తున్నారు. కంటైన్మైంట్ ప్రాంతాలపైనా దృష్టి సారించి కరోనా కేసులు నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతోపాటు మునిసిపల్ కమీషనర్లు ఈ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నారు.

శ్రీకాకుళం రూరల్

2021-05-03 15:31:00

రోజుకి 10వేల కోవిడ్ పరీక్షలు చేయాలి..

శ్రీకాకుళంజిల్లాలో  రోజుకు 10 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేసులు, పరీక్షలపై సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ కేసులు త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు నమూనాలు ఎక్కువగా సేకరించాలని ఆయన ఆదేశించారు. కేసులు త్వరితగతిన గుర్తించడం వలన నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. నమూనాలు సేకరణ, కంటైన్మెంట్ జోన్లపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఎక్కువ కేసులు నమోదు అవుతున్న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, మెలియాపుట్టి, పలాస, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, రణస్థలం, రాజాం, పాలకొండ, సోంపేట, పాతపట్నం తదితర ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో కనీసం 250 నమూనాలు సేకరించాలని ఆయన స్పష్టం చేసారు. సేకరించిన నమూనాలు తక్షణం లాబ్ కు పంపించాలని, ఫలితాలు త్వరగా అందించాలని ఆయన ఆదేశించారు. కూడళ్లలో ఎక్కువ రద్దీ ఉంటుందని అటువంటి కూడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. వైరస్ వ్యాప్తికి కూడళ్లు కొంత ఎక్కువ కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మత్స్యకార గ్రామాల్లో గుమిగూడి ఉంటారని అటువంటి గ్రామాలను పరిశీలించి అవగాహన క్షల్పించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే దుకాణాలు, ఇతర యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ కిట్లు విధిగా అందాలని  కలెక్టర్ నివాస్ స్పష్టం చేసారు. కిట్లు పంపిణీని పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా అవసరమగు కిట్ల నివేదికను అందించాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు.  ఈ టేలి కాన్ఫెరెన్సు లో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, నోడల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 15:27:45

సింహాద్రి అప్పన్న దర్శన వేళల్లో మార్పులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనాల్లో మార్పులు చేశారు. భక్తులను ఉదయం  6:30  గంటల నుంచి 11:30(AM)వరకు మాత్రమే దర్శనాలకి అనుమతిస్తారు.   స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు ఏకాంతంగానే జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు తెలియజేశారు. స్వామివారి దర్శనాల్లో మార్పులను  భక్తులు  గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

సింహాచలం

2021-05-03 15:22:08

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..

కోవిడ్ వైద్య సేవ‌లు అందుతున్న తీరును ప‌రిశీలించే నిమిత్తం క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ సోమ‌వారం చీపురుప‌ల్లిలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌ను ఆక‌స్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌ను సంద‌ర్శించి అక్క‌డ అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. బెడ్ల కేటాయింపు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, వైద్య సిబ్బంది త‌దిత‌ర అంశాల‌పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో, బెడ్ల కేటాయింపులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల‌ని సూచించారు. టెస్టింగ్ కిట్లు, ల్యాబ్ ప‌రిక‌రాలు, అద‌న‌పు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాల‌ని చెప్పారు. బొబ్బిలిలో ఆక్సిజ‌న్ ఫిల్లింగ్ సదుపాయం క‌ల్పించామ‌ని, అవ‌స‌ర‌మైన మేర‌కు అక్క‌డ నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను తెప్పించుకోవాల‌ని వైద్యాధికారుల‌కు సూచించారు. ఆసుప‌త్రి ప‌రిస‌రాల‌లో అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం ఉండ‌టంపై స్థానిక శానిటేష‌న్ అధికారుల‌ను మంద‌లించారు. శానిటేష‌న్ ఈవోని పిలిపించి మాట్లాడారు. ఆవ‌ర‌ణలో ఉన్న చెత్త‌ను, ఇత‌ర వ్య‌ర్థాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. రిసెప్ష‌న్ సెంట‌ర్లో నిత్యం సిబ్బంది అందుబాటులో ఉండాల‌ని, అలాగే కోవిడ్ వార్డు వ‌ద్ద పోలీసు సిబ్బంది 24 గంట‌లు సేవ‌లందించేలా చూసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

శ్రీ విజ‌య ఆసుప‌త్రి వైద్యుల‌పై ఆగ్ర‌హం

అనంత‌రం స్థానిక శ్రీ విజ‌య ఆసుప‌త్రిని క‌లెక్ట‌ర్‌ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ సేవ‌లు ప్రారంభించ‌క‌పోవ‌టంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రోగుల‌ను ఎందుకు చేర్చుకోలేద‌ని ఆసుప‌త్రి వైద్యుల‌ను ఆరా తీయ‌గా.. సిబ్బంది లేర‌ని.. రావ‌డానికి ఎవ‌రూ ఆశ‌క్తి చూప‌టం లేద‌ని స‌మాధానం ఇచ్చారు. దీనిపై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇంత నిర్ల‌క్ష్యంగా ఉండ‌టం ఏమాత్రం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. అద‌న‌పు సిబ్బందిని నియ‌మించుకొని 24 గంట‌ల్లో కోవిడ్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. లేక‌పోతే ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. అక్క‌డున్న నోడ‌ల్ అధికారి రామ‌కృష్ణ‌ను పిలిపించి డీసీహెచ్ఎస్‌తో మాట్లాడి రేప‌టిక‌ల్లా విజ‌య ఆసుప‌త్రిలో కోవిడ్ సేవ‌లు అందేలా చూడాల‌ని చెప్పారు.

విజయనగరం

2021-05-03 15:16:51

రేషన్ పంపిణీ వేగంగా జరగాలి..

 కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని రేషన్  బియ్యాన్ని వేగంగా పంపిణీ చేయాలనీ సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్  సూచించారు.   సోమవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులు, ఎం. డి. యు  ఆపరేటర్ల తో రేషన్ పంపిణీ పై  సమీక్షించారు.   ఎం. డి యు ఆపరేటర్లకు  కరోనా  సోకకుండా ఉండేలా సానిటైసర్ లు, మాస్క్ లు, గ్లౌస్ లను అందజేయడం  జరిగిందని తెలిపారు. కరోనా నివారణా పద్ధతులన్నీ వినియోగిస్తూ రేషన్ పంపిణీ చేయాలన్నారు.   రెగ్యులర్ గా ఇచ్చే 5 కేజీ లతో పాటు కోవిడ్ కారణంగా అందించే మరో 5 కేజీ లను కుడా కలుపుకొని 10 కేజీ లను  ఈ నెల అందజేయాలని   ఆదేశించారు.  జిల్లాలో నున్న 6 లక్షల 95 వేల 821  కార్డు దారులకు ఈ లబ్ది చేకూరనుందని తెలిపారు. 
ఈ సమావేశం లో  రెవిన్యూ డివిజినల్ అధికారి సి.హెచ్. భవాని శంకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి జగన్నాధ రావు,  ఎం.డి.యు ఆపరేటర్ ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2021-05-03 15:12:35

104 కాల్ సెంటర్ ఆకస్మిక తనిఖీ..

104 కాల్ సెంటర్ కు వచ్చే కాల్స్ కి పరిష్కారం చూపించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, ఎప్పటికప్పుడు కాల్స్ కి రెస్పాండై ఫిర్యాదులను పరిష్కరించేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ ఐసి భవనంలో కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను ఎటువంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది పని చేయాలన్నారు. 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులపై 30 నిమిషాల్లోపు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రయారిటీ ప్రకారం పరిష్కారం చూపించాలన్నారు. 104 కాల్ సెంటర్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి చేస్తున్న పని పై క్లారిటీ ఉండాలన్నారు. ఫిర్యాదులను ఎటువంటి పెండింగ్ లేకుండా పరిష్కరించేలా పని చేయాలన్నారు. 104 ఉద్యోగులు అంత బాగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పని చేసేలా చూడాలని, విజువల్స్ ను నిత్యం పరిశీలన చేయాలన్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా విజివల్స్ ని ఖచ్చితంగా పరిశీలించాలని, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలన చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా విజివల్స్ 104 కాల్ సెంటర్ లో కనిపించేలా చూడాలని సూచించారు. ఏజెన్సీ వారితో మాట్లాడి కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కోవిడ్ 19 హాస్పిటల్ యాప్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి అనేది పరిశీలించి, వెంటనే ఒక ఫిర్యాదు కూడా పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డి ఈ ఓ ప్రేమ్ కుమార్, సిసి టివి మానిటరింగ్ డిపిఎంఓ సురేష్, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి, 104 కాల్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 15:10:56

హిందూపురంలో వైద్య సిబ్బంది నియామకం..

 కరోనా బాధితులకు మెరుగైన చికిత్సను అందించే నిమిత్తం ప్రస్తుతం సేవలు అందిస్తున్న సిబ్బందికి అదనంగా వైద్య సిబ్బందిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 ఒక జనరల్ డ్యూటీ డాక్టర్, ఒక పీడియాట్రిషియన్,18 మంది స్టాఫ్ నర్సులు, 10 మంది ఎఫ్ఎన్ఓ-ఎంఎన్ఓలు, 5 మంది హౌస్ సర్జన్ లతో కూడిన 32 మంది వైద్య సిబ్బందిని కలెక్టర్ నియమించారు. తాజాగా నియమించిన సిబ్బంది నేటి సాయంత్రం లోపు హిందూపురం జిల్లా ఆసుపత్రిలో విధుల్లో చేరతారని కలెక్టర్ తెలిపారు. 

 హిందూపురం జిల్లా ఆసుపత్రిలో జెనరల్ డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డా. రాజ గోపాల్ కు సహాయకుడిగా మడకశిర సీహెచ్సీ పీడియాట్రిషియన్ డా. ప్రేమ్ కుమార్ వ్యవహరించనున్నారు. హిందూపురం జిల్లా ఆసుపత్రితో పాటు కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులలోను 10 మంది ఎమ్ఎన్వోలు, ఎఫ్ఎన్ఓ ల నియామకం చేపట్టారు. గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో నలుగురు ఎమ్ఎన్వోలు, ఒక ఎఫ్ఎన్ఓ.. కదిరి ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు ఎమ్ఎన్ఓలు, ఇద్దరు ఎఫ్ఎన్ఓలను నియమించడం జరిగిందన్నారు.

హిందూపురం

2021-05-03 15:09:11

కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి..

కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆసుప‌త్రిని  రూ.100 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 100 పడకలతో నిర్మాణం చేపడుతున్నట్టు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వ‌నాథ్ తెలిపారు. సోమ‌వారం సాంబ‌మూర్తిన‌గ‌ర్‌లో కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ఎం.ప్ర‌సాద్‌రాజుతో క‌లిసి ఎంపీ ఈఎస్ఐ నూత‌న ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌ను పూజ‌లు చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ కార్మికుల ఇబ్బందులు ఈ ఆసుప‌త్రి నిర్మాణంతో తొల‌గిపోతాయ‌ని, వైద్య సేవ‌ల కోసం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వెళ్లాల్సిన బాధ త‌ప్పుతుంద‌న్నారు. కాకినాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎక్కువ‌గా ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయ‌ని, వీటిలో ప‌నిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబ స‌భ్యులను క‌లుపుకొని దాదాపు రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు ఈ ఆసుప‌త్రి ద్వారా సేవ‌లు అంద‌నున్న‌ట్లు వివ‌రించారు. కేంద్ర కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖా మంత్రి సురేష్‌కుమార్ గంగ్వార్ ఎంతో స‌హ‌కారం అందించార‌ని, గ‌తేడాది ఫిభ్ర‌వ‌రిలో శంకుస్థాప‌న జ‌రిగిన‌ప్ప‌టికీ టెండ‌ర్ ప్ర‌క్రియ‌, సాంకేతిక కార‌ణాల వ‌ల్ల నిర్మాణ ప‌నుల్లో జాప్యం జ‌రిగింద‌ని వివ‌రించారు. ఇప్పుడు అన్నీ సిద్ధ‌మ‌వ‌డంతో నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం వేస‌వి కాబ‌ట్టి ప‌నులు త్వ‌ర‌గా జ‌రుగుతాయ‌ని, దాదాపు 15 నెలల్లో ప‌నులు పూర్త‌య్యేలా ఇంజ‌నీర్లు ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు ఎంపీ వెల్ల‌డించారు. 
       కాకినాడ ప‌ట్ట‌ణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వంగా గీతా విశ్వ‌నాథ్ స‌హ‌కారంతో అధునాత‌న 
ఈఎస్ఐ ఆసుప‌త్రి కల సాకార‌మ‌వుతోంద‌ని, ఆమె ఎంతో ప‌ట్టుద‌ల‌తో కేంద్రంతో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రిపి ఆసుప‌త్రి కోసం కృషిచేశార‌ని పేర్కొన్నారు. కాకినాడతో పాటు జిల్లాలోని కార్మిక సోద‌రులంద‌రూ ఆమెకు రుణ‌ప‌డి ఉంటార‌ని, ఈ ఆసుప‌త్రి ద్వారా అధునాత‌న వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వివ‌రించారు. ఈ ఆసుప‌త్రి క‌ల సాకారమ‌వుతుండ‌టానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో పాటు ఎంపీ కృషి ఎంతో ఉంద‌ని ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ పీడ‌బ్ల్యూడీ అసిస్టెంట్ ఇంజ‌నీర్ ఎన్‌.సాల్మ‌న్‌రాజు, నిర్మాణ సంస్థ ఇంజ‌నీర్ ఆంజ‌నేయులు, సైట్ ఇంజ‌నీర్ భానుప్ర‌తాప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-03 15:02:50

తూ.గో.జిల్లాలో ఆలయాలన్నీ పూర్తిగా మూత..

 కోవిడ్ రెండోద‌శలో ప్ర‌స్తుతం 30 శాతం పాజిటివిటీ ఉన్న నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తి ఉద్ధృతిని క‌ట్ట‌డిచేసే చ‌ర్య‌ల్లో భాగంగా అన్ని దేవాల‌యాలు, ప్రార్థ‌నా మందిరాల‌ను పూర్తిగా మూసివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, ఈ ఆదేశాలు మే 3వ తేదీ సోమ‌వారం నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీతో క‌లిసి క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి వివిధ మ‌తాల పెద్ద‌ల‌తో కోవిడ్ వైర‌స్ ఉద్ధృతి నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం జిల్లాలోని ప‌రిస్థితిని వివ‌రించడంతో పాటు బాధ్య‌తాయుత వ్య‌క్తులుగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేవాల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చిలు త‌దిత‌ర ప్రార్థ‌నా స్థ‌లాలను పూర్తిగా మూసేయాల‌ని, భ‌క్తులకు అనుమ‌తి ఉండ‌ద‌ని ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు పూర్తి కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌తో పూజారి, ఇమామ్‌, పాస్ట‌ర్ వంటి మ‌త పెద్ద‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. జ‌న‌ర‌ల్ ప‌బ్లిక్‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని తెలుపుతూ దేవాల‌యాలు, ప్రార్థ‌నా స్థ‌లాల ప్ర‌వేశ‌ద్వారాల వ‌ద్ద సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. మ‌తప‌ర సంస్థ‌ల‌కు సంబంధించి ప‌బ్లిక్ వేలం నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌ను కూడా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామాల్లో జాత‌ర‌లు, ఊరేగింపులు వంటివి నిర్వ‌హించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. తాజా ఆదేశాలు త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని, ఉల్లంఘించిన వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం-2005లోని సెక్ష‌న్ 51-60, ఐపీసీ సెక్ష‌న్ 188తో పాటు ఇత‌ర వ‌ర్తించే చ‌ట్టాల మేర‌కు క‌ఠిన క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోబ‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్‌పీలు, సంబంధిత ఇత‌ర అధికారులు ఆదేశాల అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ వైర‌స్ ఏదో ఒక వైపు నుంచి దాడిచేస్తున్న ప్ర‌స్తుత విప‌త్తు స‌మ‌యంలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌ద‌ని, ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసేందుకు స‌హ‌క‌రించాల‌ని కోర‌గా.. అందుకు మ‌త పెద్ద‌లు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తూ అంగీకారం తెలిపారు. స‌మావేశంలో ఇన్‌ఛార్జ్ జేసీ (సంక్షేమం), డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, మైనారిటీ సంక్షేమ అధికారి పీఎస్ ప్ర‌భాక‌ర‌రావు, హిందూమత పెద్దలు సీహెచ్ వేణుగోపాల్‌, సీహెచ్ క‌న‌క‌దుర్గా ప్ర‌సాద్‌; ముస్లిం మతపెద్ద రజాక్; క్రైస్తవ మత పెద్దలు రెవరెండ్ విలియం, రెవరెండ్ జోయల్, రెవరెండ్ మిస్పా విజ‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-03 14:18:54

ప్రతీరోజూ ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ..

ప్రతీ రోజు ప్రైవేటు ఆసుపత్రులను ఇన్స్పెక్ట్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ లను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు.  సోమవారం ఆసుపత్రుల్లోని ఖాళీ పడకలు, ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు గూర్చి జిల్లా జాయింట్ కలెక్టర్ - 2 పి.అరుణ్ బాబు, ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ లతో ఆయన కలసి సమీక్షించారు.     104 కాల్ సెంటర్ రియల్ టైంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని పడకలు ఉన్నది, తదితర వివరాలు అప్ డేట్ గావించాలని సర్వే శాఖ ఎ. డి., మనిషా త్రిపాఠీ లను ఆదేశించారు. ఆసుపత్రుల్లో పడకలు కాలీ అయితే ఖాళీ అని చూపిస్తే అడ్మిషన్ టోకెన్లు డిఆర్డిఎ పిడి, 104 నోడల్ అధికారి విశ్వేశ్వరరావు జారీ చేస్తారని వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల జాబితాను నోటిఫై చేయాలని, అందులో కేటగిరి-ఎ శత శాతం కోవిడ్ ఆసుపత్రులని, కేటగిరి - బి 50 శాతం కోవిడ్ ఆసుపత్రులని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న పడకల సంఖ్య పక్కాగా తెలియాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయమే ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి ఏ ఆసుపత్రిలో, ఏ ఫ్లోర్ లో ఎన్ని పడకలు, ఎంత మంది పేషెంట్లు ఉన్నదీ తెలియజేయాలని డిఎంహెచ్ఓ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ లను ఆదేశించారు. విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా మరింత పేంచేందుకు, పడకలపై చర్చించారు.   ఈ సమావేశంలో డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 14:02:38