1 ENS Live Breaking News

సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు..

క‌రోనా బాధితులు సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అనేక ర‌కాలైన సందేశాల‌ను న‌మ్మి ఆందోళ‌న చెంద‌కుండా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎలాంటి ఒత్తిడుల‌కు లోనుకాకుండా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ విజ్ఞ‌ప్తి చేశారు. కోవిడ్ బాధితుల‌కు మెరుగైన వైద్య స‌హాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు వైద్య స‌హాయం అందించే నిమిత్తం మూడు ర‌కాలుగా వైద్య‌సేవ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇంటివ‌ద్దే ఉంటూ కోవిడ్ చికిత్స పొందే వారికి ఫోన్ ద్వారా, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల ద్వారా వారి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకుంటూ, హోం ఐసోలేష‌న్ కిట్లు అందించి త‌గిన వైద్య స‌హాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇంటివ‌ద్ద వుండేందుకు త‌గ‌ని వ‌స‌తులు లేనివారికి కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేశామ‌ని, అక్క‌డ ఐసోలేష‌న్‌లో వుంటూ కోవిడ్ నుంచి కోలుకొనేందుకు త‌గిన వైద్య సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కోవిడ్ కు గురై తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

కోవిడ్ ఆసుప‌త్రుల్లో క‌రోనా చికిత్స‌కు అవ‌స‌ర‌మైన రెమ్ డెసివ‌ర్ ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ త‌గినంత‌గా అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఆక్సిజ‌న్‌, కోవిడ్ ఔష‌ధాల స‌ర‌ఫ‌రాపై సోష‌ల్ మీడియాలో వ‌చ్చే సందేశాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కలెక్ట‌ర్ కోరారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు వ‌స్తున్న ఇటువంటి సందేశాల‌ను చ‌దివి ఆందోళ‌న‌కు గురికావ‌ద్ద‌ని సూచించారు. కేవ‌లం ప్ర‌భుత్వ యంత్రాంగం చేసిన అధికారికంగా చేసే ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే విశ్వ‌సించాల‌ని కోరారు.

Vizianagaram Collectorate

2021-05-08 11:37:38

500 పడకలతో తాడిపత్రిలో తాత్కాలిక ఆసుపత్రి..

కోవిడ్ బాధితుల కోసం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ  సమీపంలో 500 ఆక్సిజన్ బెడ్ల తో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. శనివారం తాడిపత్రి వద్ద అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ  సమీపంలో కరోనా నేపథ్యంలో 500 ఆక్సిజన్ బెడ్ల తో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి కోసం స్థలాన్ని మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తదితరులు పరిశీలించారు. అనంతరం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతి రోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది, ఇతర వివరాలను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్ ను వారు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వారిని రక్షించుకునేందుకు, వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తూ ఎక్కడికక్కడ కోవిడ్ బారిన పడిన వారికి నాణ్యమైన చికిత్స అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరి ప్రాణం పోకూడదని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సోకిన వారికి ఖర్చుకు వెనకాడకుండా చికిత్స అందించాలని రాష్ట్ర యంత్రాంగానికి, జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తాడిపత్రి ప్రాంతంలో అత్యధికంగా ఆక్సిజన్ అందుబాటులో ఉన్న అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 పడకలతో వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తే కోవిడ్ సోకిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి గత రెండు రోజులుగా పడకల ఏర్పాటుకు నిమగ్నమయ్యారన్నారు. అందులో భాగంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఆక్సిజన్ పడకల కోసం అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాలని కోరడం జరిగిందన్నారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ తరలింపునకు ఇబ్బందులు ఉండడంతో ఫ్యాక్టరీకి దగ్గర్లోనే 500 పడకలతో తాత్కాలిక ఆస్పత్రి నిర్మించడం భావించి ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకొని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడే 5, 6 ఎకరాల్లో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఆక్సిజన్ పడకల కోసం అవసరమైన ఆక్సిజన్ ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటూ షెడ్ల నిర్మాణం చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ సోకిన వారికి సరైన వైద్యం అందించాలనే ఆలోచనతోనే తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు తామంతా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎంతో చొరవ తీసుకుని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందన్నారు. తాత్కాలిక ఆసుపత్రి పనులు ప్రారంభించేందుకు ఒకటి, రెండు రోజుల్లో అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తాడిపత్రి ప్రాంతంలో 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడంవల్ల అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరోనా సోకిన వారికి మంచి వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాలకు లక్ష్యాలను నిర్దేశించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటును ప్రతిఘటన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా సోకిన వారికి ఆక్సిజన్ అందించేందుకు ముందుకు వచ్చిన అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆక్సిజన్ పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల కరోనా బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆక్సిజన్ ను ఇతర ప్రాంతాలకు తీసుకుపోయే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇక్కడ ఆసుపత్రిని ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ కోవిడ్ సోకిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు వీలుగా తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం అవసరమైన భూమిని పరిశీలించేందుకు ఈరోజు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని చూసి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఫైనలైజ్ చేయడం జరిగిందని, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న చర్చికి సంబంధించిన స్థలంలో ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు చర్చికి సంబంధించిన వారు కూడా సహృదయంతో ముందుకు వచ్చారన్నారు. త్వరలోనే ఇక్కడ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని, కరోనా సోకిన వారికి మంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు చర్చికి సంబంధించిన ఫాస్టర్ ఫాదర్ డేవిడ్ అర్లప్ప, చర్చి స్కూల్ హెడ్ సెలీనా సిస్టర్ లతో మాట్లాడి తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని చర్చించారు. సందర్భంగా చర్చికి చెందిన ఫాస్టర్, చర్చి స్కూల్ హెడ్ లు తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుకు స్థలం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకు తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అజయ్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ వర కుమార్, తహసిల్దార్ నాగభూషణ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి ఈఈ రాజగోపాల్ రెడ్డి, ఐనొక్స్ గ్యాస్ ప్లాంట్ ఇంచార్జి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tadipatri

2021-05-08 11:36:25

కరోనా నియంత్రణలో సర్పంచ్ లు పాల్గొనాలి..

క‌రోనాను త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వ‌యంత్రాంగంతోపాటు ప్ర‌జాప్ర‌తినిధులంతా క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. కోవిడ్‌పై పోరులో స‌ర్పంచ్‌ల పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల స‌ర్పంచ్‌లు, పంచాయితీ అధికారుల‌తో ఆయ‌న శ‌నివారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, జిల్లానుంచి క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. టెలీకాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, క‌రోనాను నియంత్రించాలంటే, ఈ వ్యాధిప‌ట్ల ప్ర‌తీఒక్క‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించి, జాగ్ర‌త్త‌లు పాటించేలా స‌ర్పంచ్‌లు కృషి చేయాల‌న్నారు.   త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రింప‌జేయ‌డం, త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బు లేదా శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకోవ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, ఈ మూడు ముఖ్య‌మైన ప‌నులు చేస్తే క‌రోనా అంత‌మ‌వుతుంద‌న్నారు. పూర్తిగా అవ‌గాహ‌న లేకపోవ‌డం, నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఇటీవ‌ల మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. అలాగే ఎవ‌రికైనా కోవిడ్ సోకితే, వారిప‌ట్ల మాన‌వ‌తా దృక్ఫ‌థాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ల‌క్ష‌ణాలు లేనివారిని హోం ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స చేస్తున్నామ‌ని, ఇటువంటి వారికి కోవిడ్ కిట్ల‌ను ఇంటివ‌ద్ద‌కే పంపిస్తున్నామ‌ని చెప్పారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారు, హౌస్ క్వారంటైన్‌లో ఉన్న‌వారు ఇళ్ల‌నుంచి బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌ని స‌ర్పంచ్‌ల‌ను కోరారు.

              క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారిని, ఐసోలేష‌న్‌లో ఉండే అవ‌కాశం లేనివారినీ కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించాల‌న్నారు. జిల్లాలో ఏడు కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీటిలో సుమారు 3వేల ప‌డ‌క‌లు సిద్దంగా ఉన్నాయ‌ని చెప్పారు. ఆక్సీజ‌న్ స్థాయిలు ప‌డిపోయిన‌వారికి, ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌ను అందిస్తున్నామ‌న్నారు. జిల్లో ఇప్ప‌టికే 28 కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంద‌ని, దీనికి గ్రామ ప్ర‌థ‌మ పౌరులంతా త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ప్ర‌తీ షాపు మూసివేయాల‌ని, ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే ఉండేలా చూడాల‌న్నారు. క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో మాస్కును ధ‌రిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించాల‌ని కోరారు. నిబంధ‌న‌ల‌ను పాటించ‌ని వారి వివ‌రాల‌ను రెవెన్యూ, లేదా పోలీసు అధికారుల‌కు తెలియ‌జేయాల‌ని సూచించారు.

              ప్ర‌స్తుత స‌మయంలో స‌ర్పంచ్‌లంతా పారిశుధ్యంపైనా, త్రాగునీటి స‌ర‌ఫ‌రా పైనా దృష్టి పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. కాలువ‌ల్లో పూడిక‌ను తొల‌గించాల‌ని, గ్రామాల్లో హైపో క్లోరియం, బ్లీచింగ్ పౌడ‌ర్ పిచికారీ చేయాల‌న్నారు. వేస‌విలో గ్రామ ప్ర‌జ‌లు త్రాగునీటికి ఇబ్బంది ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ స‌మ‌యంలో వ‌డ‌గాడ్పులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అలాగే పాముకాట్లు, తేలు కాట్లు కూడా ఎక్కువ‌గా చోటు చేసుకొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. జిల్లాను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చడంలో స‌ర్పంచ్‌లు కూడా భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. మొక్క‌లు నాటేందుకు అవ‌కాశం ఉన్న స్థ‌లాల‌ను ఇప్ప‌టినుంచే గుర్తించి, జూన్ మొద‌టి వారంలో వ‌ర్షాలు ప‌డే స‌మ‌యానికి మొక్క‌లు నాటాల‌ని సూచించారు. ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్రం, ప‌రిపూర్ణ ఆరోగ్యం మ‌న ల‌క్ష్యాల‌ని, ఈ మ‌హాయ‌జ్ఞంలో స‌ర్పంచ్‌లంతా భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

               ఈ సంద‌ర్భంగా మెర‌క‌ముడిదాం మండ‌లం గ‌ర్భాం, కొమ‌రాడ మండ‌లం చోళ్ల‌ప‌థం స‌ర్పంచ్‌లు క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి, త‌మ గ్రామ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి, ప‌రిష్కారానికి క‌లెక్ట‌ర్ నుంచి హామీని పొందారు. కాన్ఫ‌రెన్స్‌లో స‌ర్పంచ్‌ల‌తోపాటు ఇఓపిఆర్‌డిలు, పంచాయితీ అధికారులు, సుమారు 500 మంది స‌ర్పంచ్‌లు పాల్గొన్నారు.

Vizianagaram Collectorate

2021-05-08 11:28:27

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రానివ్వకండి..

ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి చెప్పారు. శనివారం కాకినాడ జిజిహెచ్ లో పర్యటంటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  రెండు వారాల క్రితం 1.7 కేఎల్ పీయస్ఎ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో 10 కేయల్  సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  దీని ద్వారా జిల్లాలో ఎక్కడ ఆక్సిజన్ కొరతా లేకుండా ఉంటుందన్నారు. ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ఉన్న దానిని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.   అనంతరం జిజిహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణంలో ఏర్పాటు చేయనున్న 10 కేల్  సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటును కలెక్టర్, జెసి పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి వెంకట బుద్ధ, ఆర్ఎమ్ఓ డా.ఈ గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎమ్ .భాను ప్రకాష్ , ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-08 11:26:13

ఆసుపత్రుల సామర్ధ్యాన్ని పెంచండి..

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి  సంబంధించి ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు వస్తున్నందున పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి  ఈఎన్టీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను, కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిజిహెచ్ కు వస్తున్న కోవిడ్ కేసుల సంఖ్యకు అనుగుణంగా పడకల సామర్ధ్యాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కోవిడ్ సోకి, జిజిహెచ్ లో వైద్యం పొందిన 5 రోజుల తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా డిశ్చార్జి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పి వెంకట బుద్ధ, ఆర్ఎమ్ఓ డా.ఈ గిరిధర్, జిజిహెచ్ నోడల్ అధికారి ఎమ్ .భాను ప్రకాష్ , ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-08 11:23:16

కరోనా సేవకు పాహనోక్ ముందడుగు..

విశాఖ మహానగరంలో కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా తమవంతు సహకారం అందించేందుకు జీవీఎంసీ 45 వ వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపాహనోక్  ముందుకొచ్చారు. విశాఖలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు  విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భారతి ఫౌండేషన్  ద్వారా కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న 200 పడకల ఆక్సిజన్ సెంటర్ కు రూ. 5 లక్షల అందజేశారు. 
ఈ సందర్భంగా సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాముల అయ్యేందుకు ఎవరైనా ముందుకు రావచ్చన్నారు. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యం కావాలని కోరిన ఆయన కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.  జీవీఎంసీ డిప్యూటీ  ఫ్లోర్ లీడర్ హనోకు మాట్లాడుతూ తన తల్లి, తన సోదరుడు కరోనా వలనే మరణించారని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరం ఐక్యంగా పోరాటం చేయాలనే సదుద్దేశంతోనే తాను ఈసేవకు ముందుకు వచ్చానన్నారు. 

Siripuram

2021-05-08 09:35:11

అప్పన్న చందన సమర్పణకు విరాళం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 14న చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఏడాది పొడవునా సుగంధభరిత చందనము లో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు. కరోనా  నేపథ్యంలో ఈ ఏడాది  ఏకాంతంగానే స్వామికి సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సింహాద్రి నాధుడు చందన ప్రసాదం సమర్పణకు భక్తుల నుంచి  ఆలయ వర్గాలు విరాళాలు కోరుతున్నాయి. ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు స్వామిని దర్శించుకుని మూడు కేజీలు చందన సమర్పణకు విరాళం అందజేశారు. రూ.60.348 వేల చెక్ రూపములో ఆలయ  ఏ ఈఓ రాఘవ కుమార్ కు అందజేశారు. అందరి సహకారముతో ఉత్సవాలు మరింత  విజయవంతం అవుతాయని శ్రీను బాబు ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఆలయ పురోహితులు అలంకారి కరి సీతారామాచార్యులు,  అర్చకులు రాజీవ్ లోచన, సూపరెండెంట్ దాసరి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2021-05-08 09:27:57

ఉన్నత చదువులతో ప్రయోజకులు కావాలి..

కేంద్రీయ విద్యాలయానికి ఎంపికైన విద్యార్ధులంతా ఉన్నత చదువులు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని రాజమహేంద్రవరం ఎంపీ , వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఆకాంక్షించారు. శనివారం శనివారం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఇటీవల డ్రాలో ఎంపికై సీట్లు సాధించిన పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎంపీని కలిసి అభినందనలు తెలియజేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తమ కలను మీరు సాకారం చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ ఎంపి భరత్ రామ్ మిఠాయిలను పంచారు. విద్యార్థులందితో కలిపి సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయంలో అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారని,  అటువంటిది డ్రాలో అదృష్టం మీ చిన్నారులను వరించిందని అన్నారు. 
మీ పిల్లల అభిరుచులకు తగ్గట్టుగా వారిని చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినవారవుతారన్నారు. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విద్యావంతులుగా తీర్చి దిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి సాగర్ జిల్లా అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ అన్నపూర్ణ రాజు,  నాయకులు బిల్డర్ చిన్నా, ఎం గణేష్ బాబు, బి చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2021-05-08 09:03:42

డిప్యూటీ లేబర్ కమిషనర్ గా పురుషోత్తం..

విజయనగరం  జిల్లా కార్మిక శాఖ ఉప కమీషనర్ గా సీహెచ్. పురుషోత్తం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉప కమీషనర్ గా విధులు నిర్వర్తించిన ప్రసాద రావు పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లా ఉప కమీషనర్ గా నియమితులు కావడంతో ఆయన స్థానంలో శ్రీకాకుళం లో సహాయ కమీషనర్ గా వున్న సిహెచ్. పురుషోత్తం కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన 9492555034 మొబైల్ నంబరులో అందుబాటులో ఉంటారు.

విజయనగరం

2021-05-08 08:21:58

లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ కి పంపండి..

ఎవ‌రిలోనైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వెంట‌నే కోవిడ్‌ కేర్ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి, చికిత్స‌ను అందించాల‌ని రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ది, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆదేశించారు. జ్వ‌రం వ‌చ్చిన వెంట‌నే కేర్‌సెంట‌ర్‌కు త‌ర‌లించ‌డం ద్వారా, వారికి స‌త్వ‌ర‌మే చికిత్సను అందించ‌డంతోపాటుగా, వ్యాధి వ్యాప్తిని అడ్డుకొనేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. జిల్లాలోని ప‌లువురు ఉన్న‌తాధికారులు, వైద్యారోగ్య‌శాఖాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు,  తాశీల్దార్లు, ఎంపిడిఓల‌తో  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ శ‌నివారం నిర్వ‌హించిన‌ టెలీ కాన్ఫ‌రెన్స్లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పాల్గొన్నారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ముందుగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, మంత్రికి వివ‌రించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాధి ప‌ట్ల స్థానికంగా విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లాలోని అన్ని కోవిడ్ ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. జ్వ‌రాల‌పై దృష్టిపెట్టి, వెంట‌నే వారికి చికిత్స‌ను అందించే ఏర్పాటు చేయాల‌న్నారు. రెమిడిసివిర్‌, ఇత‌ర మందుల కొర‌త రాకుండా చూడాల‌న్నారు. ముఖ్యంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాల‌న్నారు. మృత‌దేహాల‌ను త్వ‌ర‌గా త‌ర‌లించాల‌ని, అవ‌స‌ర‌మైతే అద‌నంగా అవుట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిలో సిబ్బందిని తీసుకోవాలని, ప్ర‌యివేటు అంబులెన్సుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో క‌లిసి రెండు మూడు రోజుల్లో కోవిడ్‌పై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తామ‌ని, దీనికి అధికారులంతా సిద్దంగా ఉండాల‌ని మంత్రి కోరారు.

                  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, జ్వ‌రాల‌పై స‌ర్వేను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఎంత త్వ‌ర‌గా జ్వ‌రాల‌ను గుర్తిస్తే, అంత త్వ‌ర‌గా వ్యాధిని నయం చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. స‌ర్వేలో వాలంటీర్ల స‌హ‌కారాన్ని తీసుకోవాల‌ని సూచించారు. ఎంపిడిఓలు స‌ర్వేను ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు. ఎన్ఎంలు జ్వ‌ర బాధితుల ఇళ్ల‌కు వెళ్లి, వారికి ప్రాధ‌మిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌న్నారు. అలాగే హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌వారికి కోవిడ్ కిట్ల‌ను పూర్తిచేసి, వారి వివ‌రాల‌ను త‌క్ష‌ణ‌మే ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాల‌న్నారు. క‌ర్ఫ్యూ స‌మయంలో ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌ను పూర్తిగా క‌ట్ట‌డి చేయాల‌ని, వారు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యేట‌ట్టుగా చూడాల‌న్నారు. క‌ర్ఫ్యూ స‌డ‌లింపు స‌మ‌యంలో నిర్వ‌హించే కార్య‌క‌లాపాల్లో త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరాన్ని పాటించాల‌ని, మాస్కుల‌ను ధ‌రించేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

                   ఈ టెలీ కాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పీవో ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, తాశీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-08 07:36:52

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ 2వ డోసు..

విశాఖ జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, విశాఖ మహానగర పరిధిలో ఎంపిక చేసి ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, అర్భన్ పీహెచ్సీల్లో కోవిడ్ వేక్సిన్ 2వ డోసు పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్య నారాయణ తెలియజేశారు. మొదటి డోసు తీసుకున్నవారు 2వ డోసు టీకా వేయించుకోవడానికి ఈ క్రింది తెలియజేసిన పీహెచ్సీల్లో సంప్రదించి, కోవిడ్ నిబంధనలు పాటించి వేయించుకోవాలని ఆయన కోరుతున్నారు.1.గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ద్రోణంరాజు కళ్యాణమండపం,డ్రైవర్స్ కాలనీ), 2.పెందుర్తి సామజిక ఆరోగ్య కేంద్రం, 3.మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 4.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం(RTC M),5.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం.అనకాపల్లి., 6.చిన వాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం, 7.స్వర్ణ భారతి పట్టణ ఆరోగ్య కేంద్రం,  8.అరిలోవ ఆరోగ్య కేంద్రం, 9.శ్రీహరిపురం ఆరోగ్యకేంద్రం, 10.కింగ్ జార్జి ఆసుపత్రిలో ఈ వేక్సిన్ వేయించుకోవచ్చునని డిఎంహెచ్ఓ కోరుతున్నారు.

విశాఖపట్నం

2021-05-07 15:27:34

కోవిడ్ నోడలధికారి సస్పెండ్..

అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రి నోడల్ అధికారి, హిందూ పురం డివిజనల్ కోఆపరేటివ్ అధికారి వి.రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ ఆఫీసర్ల తో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రిలోని పేషేంట్ల రోజువారీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమైనందున చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వులలో తెలిపారు. హిందూపురం డివిజనల్ కోఆపరేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వి.రాజేంద్ర ప్రసాద్ ను గతంలో హిందూపురం జిల్లా ఆసుపత్రికి నోడల్ అధికారిగా నియమించారు. వైద్యాధికారుల సమన్వయంతో కోవిడ్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమవడంతో నోడల్ అధికారిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్  తెలిపారు.. కో విడ్ విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం,అలసత్వం చూపిన కారణంగా నియమ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి నూతన నోడల్ అధికారిగా పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతిని నియమించారు. కోవిడ్ విధుల్లో  నిర్లక్ష్యాన్ని సహించేది లేదని  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.. 

అనంతపురం

2021-05-07 15:13:51

పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకి క్రుషి..

భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీషు సేనలపై మూడేళ్లు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించి, తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిచెప్పిన  ‘విప్లవజ్యోతి’అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్‌లో పెట్టేందుకు కృషిచేస్తానని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు,  వైసిపి చీఫ్‌ విప్‌ మార్గని భరత్‌రామ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక గోదావరి గట్టున జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహంవద్ద జరిగిన అల్లూరి 97వ వర్థంతోత్సవ కార్యక్రమంలో ఎంపి భరత్‌రామ్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీతారామరాజు జీవించిన 27 సం॥రా కాలంలో 13 సంవత్సరాలు రాజమహేంద్రవరం గోదావరి గట్టు పరిసర ప్రాంతాల్లో జీవించడం రాజమహేంద్రవరం నగరానికే గర్వ కారణమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు, అలాగే రాజమహేంద్రవరంలో అల్లూరి చరిత్రను గుర్తుచేసే విధంగా ఒక భారీ అభివృద్ధికి అల్లూరి పేరు పెడతామన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, సీతారామరాజు కుటుంబం 13 సం॥రాకు పైగా గోదావరి గట్టు ప్రాంతంలో నివశించి ఆయన స్థానిక ఉల్లితోట బంగారయ్య స్కూల్లో చదువుకొన్నాడని, గోదావరి పుష్కరాల రేవులో ఆయన, ఆయన తండ్రి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో స్నాన మాచరించే వారని గుర్తుచేశారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, పాత రైల్వే (హేవ్‌లాక్‌ బ్రిడ్జి) బ్రిడ్జికి, అల్లూరి పోరాటానికి ముఖ ద్వారమైన రాజమహంద్రవరం ఎయిర్‌ పోర్టుకు అల్లూరి పేరుపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. అలాగే పార్లమెంట్‌లో అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాన్ని మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రూపొందించి ఇవ్వడానికి సిద్దంగా వుందని, వీటిపై ఎంపి భరత్‌రామ్‌ కృషిచేయాలని పడాల కోరారు. దానిపై స్పందించిన ఎంపి భరత్‌ రామ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అవి జరిగేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సంఘం ఉపాధ్యక్షుడు, పూర్వ ఫారెస్ట్‌ అధికారి దంతులూరి సుబ్బరాజు, మాదేటి రవిప్రకాష్‌, జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌, కార్యదర్శి వెల్లా నాగార్జున, హర దీపక్‌, దల్లి శ్రీనివాసరెడ్డి, వైసిపి నాయకు మజ్జి అప్పారావు, గేడి అన్నపూర్ణరాజు, బ్డిర్‌ చిన్న, కె. ఓంకార్‌, మార్గాని బుజ్జి, ఉల్లూరి రాజు, పీతా రామకృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, గాడా తాతారావు, దూర్వాసు సత్యనారాయణ, రొక్కం వంశీ తదితరులు పాల్గొన్నారు.
గోరక్షణపేటలో పడాల రామారావు స్మారక స్థూపం వద్ద....
తొలుత  గోరక్షణపేట సెంటర్‌లో  స్వాతంత్య్ర సమరయోధుడు  పడాల రామారావు స్మారక మందిరం వద్ద వున్న ‘విప్లవజ్యోతి’అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. పడాల విగ్రహానికి దంతులూరి సుబ్బరాజు పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు. అలాగే గోరక్షణపేటలోని జాతీయ అల్లూరి సీతారామరాజు కార్యాలయంలో వున్న అల్లూరి విగ్రహానికి యువజన సంఘం జాతీయ కోశాధికారి బళ్ళా శ్రీనివాస్‌, పూలమావేసి ఘనంగా నివాళి అర్పించారు.

రాజమండ్రి

2021-05-07 15:00:21

కలెక్టర్ కోలుకోవాలని అప్పన్నకు పూజలు..

విశాఖజిల్లాలో నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ కోవిడ్ భారిన పడిన జిల్లా  కలెక్టర్  వి.వినయ్ చంద్ త్వరగా కోలుకోవాలంటూ సింహాచలంలో పూజలు నిర్వహించారు. శుక్రవారం ఈ ప్రాంతానికి చెందిన  సామాజిక వేత్త బాలభానుమూర్తి  ఆధ్వర్యంలో ప్రేరణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జర్నలిస్ట్ జట్లీ స్థానికులు కలసి సింహాచలంలో అప్పన్న స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అహోరాత్రులు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించాలని శ్రమించిన కలెక్టర్ త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు చేయడానికి వచ్చేలా సింహాద్రి అప్పన్న ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్టు చెప్పారు. అలాగే జీవియంసీ కమీషనర్ సృజన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని  సింహాద్రి అప్పన్న తొలి పావంచా వద్ద తులసి మాల వేసి స్వామిని వేడుకున్నామన్నారు. జిల్లా అధికారులతో పాటు కో విడ్ తో పోరాడుతున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు కూడా పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.

సింహాచలం

2021-05-07 14:44:22

రైస్ మిల్లర్ల కోవిడ్ విరాళం రూ.50లక్షలు..

తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు కొవిడ్ సేవల నిమిత్తం జిల్లా రిలీఫ్ ఫండ్ కింద శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా. జి లక్ష్మీ శ  సమక్షంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి రూ.50 లక్షల చెక్కును కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విపత్తు సమయంలో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరుపున రూ.50లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు.  ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం ఈ లక్ష్మీ రెడ్డి, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్ రామారెడ్డి, వీ.సూర్య ప్రకాష్ , ఎం బుల్లి మోహన్ రెడ్డి, ఎన్వివి సత్యనారాయణ రెడ్డి,సీ బాబ్జి ,తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-07 14:11:52