1 ENS Live Breaking News

కలెక్టర్ ఆదేశం ఎక్స్ రే యూనిట్ ప్రత్యక్షం..

ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ కరోనా వైరస్ నియంత్రణలో అధికారులను అప్రమత్తం చేస్తూ..తాను స్వయంగా కోవిడ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ప్రజలకు సేవలందించడంలో ముందుంటున్నారు. బుధవారం ఒంగోలు కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ 500 పడకలు ఉన్న సమయంలో అత్యవసర సేవలకు ఎక్స్ రే మిషన్ లేని విషయాన్ని గుర్తించారు. అంతే ఆ విషయాన్ని  ఎస్సీ కార్పోరేషన్ ఈడి శ్రీనివాస విశ్వనాధ్ ను ఆదేశించడంతో ఆఘమేఘాలపై ఎక్స్ రే యూనిట్ ను కోవిడ్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు సర్వ శక్తులు ఒడ్డుతోందని, మనం కూడా ప్రజలను కాపాడటానికి అన్ని అవకాశాలను వినియోగించుకొని సేవలు అందించాలని సూచించారు. ఎక్కడా వైద్యసేవలు, ఆక్సిజన్, బెడ్లు లేవనే ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. పారామెడికల్ సిబ్బంది, వైద్యులు మానవతా ద్రుక్పదంతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకి రావాలి సూచించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

ఒంగోలు

2021-05-05 13:08:08

హోమ్ ఐసోలేషన్ వారికి కిట్లు ఇవ్వాల్సిందే..

కోవిడ్ వ‌చ్చిన‌వారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వ‌చ్చిన‌ట్టుగానే భావించి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ ఎంతో అప్రమ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని అన్నారు
. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌న‌స‌రిగా మాస్కును ధ‌రించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన మెడిక‌ల్ కిట్ల‌ను స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద బుధ‌వారం ఎఎన్ఎంల‌కు అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకిన‌వారికి, ఆక్సీజ‌న్ ప‌రిమాణం త‌క్కువ‌గా ఉన్న‌వారికి, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో ఉంచి చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీనికోసం 14 ప్ర‌భుత్వ‌, 16 ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల‌ను సిద్దం చేశామ‌ని, ప్ర‌స్తుతం 997 మంది వ‌ర‌కూ కోవిడ్ పేషెంట్లు ఆసుప‌త్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు.                  వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారినీ, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌టానికి అవ‌కాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, 24 గంట‌లూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపాటు, అవ‌స‌ర‌మైతే వినియోగించేందుకు ఆక్సీజ‌న్‌, మందులు, అంబులెన్సుల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారాన్ని అందించ‌డంతోపాటు, పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం 100 మంది వ‌ర‌కూ కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

                  హోం ఐసోలేష‌న్‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని, వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్ల‌లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ప్ర‌స్తుతం సుమారు 5వేల మంది వ‌ర‌కూ హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా వీరికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వ‌చ్చాయ‌ని, వీటిలో 45 వేల కిట్ల‌ను ఇప్ప‌టికే పిహెచ్‌సిల‌కు పంపించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇవి కాకుండా స‌బ్ సెంట‌ర్ల ప‌రిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల‌ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎంత త్వ‌ర‌గా కిట్ల‌ను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటార‌ని అన్నారు. అందువ‌ల్ల‌, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. జింకు, విట‌మిన్లు, సిట్రిజ‌న్‌, యాంటీ బ‌యాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్ల‌లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు. వ్యాధి సోకిన‌ప్ప‌టికీ, అధైర్య ప‌డ‌కుండా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.   ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-05 10:27:41

సింహాద్రి నాధుని చందోనోత్సవానికి ఏర్పాట్లు..

విశాఖలోని సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి  చందనోత్సవానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈనెల 14న స్వామివారి చందనోత్సవం ఏకాంతంగా జరగనుంది. దానికోసం గందపు చెక్కలు సిద్ధమయ్యాయి. చందనం సాన ముహూర్తి 7వ తేదీ నుంచి చందనం తీయడం ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించడానికి చందనాన్ని సిద్దం చేస్తారు. స్వామివారి చందనోత్సవం రోజు స్వామి వారి వేసుకున్న చందనం తొడుగును వెండి బొరియలతో తొలగిస్తారు. ఆపై స్వామి ఉగ్రరూపాన్ని నిజరూప దర్శనంగా భక్తులకు కల్పిస్తారు. అరోజు నుంచి స్వామివారి శాంత పరిచేందుకు చందనం దఫ దఫాలుగా స్వామికి సమర్పిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమ శాస్త్రం ఆధారం నిర్వహించడానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సింహాచలం

2021-05-05 10:22:13

వేక్సినేషన్ తోనే కరోనాను తరిమికొట్టాలి..

విశాఖ మహానగరంలో ప్రభుత్వం నిర్ధేశించిన వారంతా ఖచ్చితంగా కోవిడ్ వేక్సిన్ వేసుకొని కరోనాను తరమికొట్టాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షలు వంశీక్రిష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చినవాల్తేర్ చిన్న హాస్పిటల్(ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం) వద్ద గల కోవిడ్ వ్యాక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. కోవిడ్ వ్యాక్షన్ తీరుపై స్థానిక వైద్య సిబ్బందిని మరియు స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కరోనా ఉధృతి, కేసులు ఎక్కువగా వున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలన్నారు.  ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు , సానీటైజర్లు వినియోగిస్తూ వ్యక్తిగత దూరం పాటించాలని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సినేషన్ లో ప్రాధన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వార్డు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

చినవాల్తేరు

2021-05-05 10:13:19

వేడుకలకు 20 మందికే అనుమతి..

కోవిడ్ వ్యాప్తి కారణంగా వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు, మండల అధికారులతో బుధ వారం కోవిడ్ నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. వివాహ వేడుకలకు హాజరయ్యేవారి పేర్లను తహశీల్దార్ కు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేసారు. వివాహ వేడుకలు జరిగే ప్రదేశాలను తహశీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్ధలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర సంస్ధలు ఉంటాయని, 12 గంటల తరువాత అత్యవసర సేవలు – మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వారాలపాటు ఇది అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దుకాణాలు 12 గంటలకు మూసివేయాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. ఎక్కడా నలుగురు కంటే ఎక్కువగా ఉండరాదని ఆయన పేర్కొంటూ 144 సెక్షన్ అమలులో ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. దుకాణాల వద్ద క్యూ లైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు నిలిచి ఉండవచ్చని, గుమిగూడి ఉండరాదని ఆయన పేర్కొన్నారు. గుమిగూడి రద్దీ ఉంటే 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు అవుతాయని కలెక్టర్ అన్నారు.

శ్రీకాకుళం

2021-05-05 09:48:11

500 పడకలతో అతిపెద్ద ఆసుపత్రి..

కరోనా నేపథ్యంలో తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతి రోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది అనే వివరాలను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్, ఐనొక్స్ గ్యాస్ ప్లాంట్ ఇంచార్జి శివప్రసాద్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతిరోజు 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని వారు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఎక్కడెక్కడ ఏ ఏ విభాగాలను ఏర్పాటు చేశారు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడవుంది, ఖాళీ స్థలం ఎక్కడ ఉంది తదితర వివరాలను మ్యాప్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తదనంతరం జిల్లా కలెక్టర్ అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూమిని పరిశీలించారు. ఖాళీ భూమికి సంబంధించి సర్వే పనులు బుధవారం లాగా పూర్తిచేయాలని సర్వేయర్ రామ్మోహన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో తాడపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ పక్కనున్న ఖాళీ స్థలంలో మరో 25 నుంచి 30 రోజుల్లోపు 500 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసేలా తాత్కాలిక ఆసుపత్రి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 1వ తేదీన ఆస్పత్రి ప్రారంభించేలా అత్యంత వేగవంతంగా అవసరమైన అన్ని రకాల పనులు చేపట్టాలన్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలంలో త్వరగా సర్వే చేపట్టి చేసి జంగిల్ క్లియరెన్స్ చేసేలా చూడాలన్నారు. డాక్టర్లకు, మెడికల్ సిబ్బంది ఉండేలా క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తాత్కాలిక ఆస్పత్రి వద్ద ఎన్ని అంబులెన్సులు సిద్ధంగా ఉంచేలా చూడాలన్నారు. తాగునీటి సరఫరా, శానిటేషన్, మరుగుదొడ్లకు అవసరమైన నీటి ఏర్పాటు, విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, రోడ్లు వేయడం తదితర అంశాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొద్దినెలల పాటు ఉపయోగించుకునేలా తాత్కాలిక ఆసుపత్రిని వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ, డిపిసి, డిఎంఅండ్హెచ్ఓ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పని చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అజయ్ కుమార్, తహసిల్దార్ నాగభూషణ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి ఈఈ రాజగోపాల్ రెడ్డి, ఏ ఈ లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-05-04 15:20:31

అక్రమ మైనింగ్ పై చర్యలకు సిఫార్సు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని  మెంటాడ మండ‌లం కొండలింగాల వ‌ల‌స పంచాయ‌తీ ప‌రిధిలోని తాడిపూడి వ‌ల‌సలో కొండ‌కు ఆనుకొని ఉన్న స‌ర్వే నెంబ‌ర్ 141 ప్ర‌భుత్వ పోరంబోకు స్థ‌లంలో జ‌రిగిన అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించామ‌ని జిల్లా మైనింగ్ శాఖ స‌హాయ సంచాల‌కులు బి. విజ‌య‌ల‌క్ష్మి తెలిపారు. త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న‌మాంగ‌నీస్ ఖ‌నిజాన్ని కొంత‌మంది అక్ర‌మంగా త‌వ్వి త‌రలిస్తున్నార‌ని పేర్కొంటూ ఇటీవ‌ల వివిధ ప‌త్రిక‌లు వార్త‌లు ప్ర‌చురించాయి. ఈ మేర‌కు ఆమె స్పందిస్తూ చ‌ర్‌ ల‌కు ఉప‌క్ర‌మించారు. మైనింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సంబంధిత ప్రాంతంలో ప‌ర్య‌టించి విచారించార‌ని, గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అక్ర‌మంగా త‌వ్వి ఉంచిన మాంగ‌నీస్ ఖ‌నిజ నిల్వ‌ల‌ను గుర్తించార‌ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అక్క‌డున్న స్థానికుల‌ను, కూలీల‌ను విచారించ‌గా కొంత‌మంది జేసీబీ స‌హాయంతో త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నార‌ని తేలింద‌న్నారు. రోడ్డు ర‌వాణా శాఖ అధికారుల స‌హాయంతో జేసీబీని, దాని య‌జ‌మాని వివ‌రాలు సేక‌రించామ‌ని తెలిపారు. అక్క‌డున్న ఖ‌నిజ నిల్వ‌ల‌ను భ‌ద్ర‌త‌ప‌రంగా స్థానిక రెవెన్యూ అధికారులకు అప్ప‌గించామ‌ని చెప్పారు. అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డిన వారిపై నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా మైనింగ్ శాఖ స‌హాయ సంచాల‌కులు పేర్కొన్నారు.

విజయనగరం

2021-05-04 15:16:28

సరుకుల పంపిణీకి ఇబ్బంది రాకూడదు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బుధ‌వారం నుంచి క‌ర్ఫ్యూ విధించిన నేప‌థ్యంలో నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశించారు.  ఎల్‌పిజి, పెట్రోలు బంకులు, రేష‌న్ షాపు డీల‌ర్లతో త‌న ఛాంబ‌ర్‌లో  మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా జెసి మాట్లాడుతూ నిత్యావ‌స‌రాల‌కు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌న్నారు. నిత్యావ‌స‌రాలు స‌ర‌ఫ‌రా చేసే వాహనాల‌కు ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయడం ద్వారా, పోలీసుల‌నుంచి ఎటువంటి ఇబ్బందులూ త‌లెత్త‌వ‌ని సూచించారు. వంట‌గ్యాస్‌, పెట్రోలు త‌గినంత స్టాకు ఉంచుకోవాల‌ని చెప్పారు. నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో గానీ, స‌రుకుల విక్ర‌యంలో గానీ త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జెసి కోరారు. ఈ స‌మావేశంలో డిఎస్ఓ పాపారావు, డిఎం సివిల్ స‌ప్ల‌యిస్ భాస్క‌ర్రావు, ఆయా సంఘాల ప్ర‌తినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-04 15:12:10

అనవసరంగా కోవిడ్ కేర్ సెంటర్లో తిరగొద్దు..

కోవిడ్ వైర‌స్ ఉద్ధృత వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఆసుప‌త్రికి వ‌చ్చేవారు ఎక్కువ‌గా అటూ ఇటూ తిర‌గకుండా చూడాల‌ని.. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్లుగా ట్ర‌యాజింగ్ చేసి వారి ఆరోగ్య ప‌రిస్థితి ఆధారంగా ఇన్‌పేషెంట్/సీసీసీ/హోమ్ ఐసోలేష‌న్‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని జేసీ (డీ) కీర్తి చేకూరి వైద్యాధికారుల‌కు నిర్దేశించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం జేసీ (డీ) కీర్తి చేకూరి.. అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌తో క‌లిసి కాకినాడ జీజీహెచ్‌ను సంద‌ర్శించారు. అవుట్ పేషెంట్‌, ట్ర‌యాజింగ్‌, ఇన్‌పేషెంట్ రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్ల‌ను ప‌రిశీలించి.. రోగుల స‌హాయ‌కులు, ఆసుప‌త్రి వైద్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారికి వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు సూచ‌న‌లిచ్చారు. అవ‌స‌రం మేర‌కు బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాల‌ని, ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అంబులెన్సుల ప్ర‌వేశం, నిర్గ‌మ‌నం సజావుగా జ‌రిగేలా మ‌రింత మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇన్‌పేషెంట్ బ్లాకుల్లో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, పూర్తిస్థాయిలో వైద్య‌, ఇత‌ర సౌక‌ర్యాలు అందేలా చూడాల‌ని జేసీ పేర్కొన్నారు. జేసీ వెంట ఆర్ఎంవో డా. ఇ.గిరిధ‌ర్‌, వైద్యాధికారులు ఉన్నారు.

కాకినాడ

2021-05-04 15:03:46

ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా డా.కె.రాజేష్

విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్  గా కొటకల రాజేష్ ను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అనుమతితో తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఐదేళ్లపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా మెరుగైన సేవలందించారు. గత రెండేళ్లుగా  పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా రాజేష్  వైద్య సేవలందిస్తున్నారు.
ఈ మేరకు రాజేష్ సీనియారిటీ, పని అనుభవాన్ని గుర్తించి తాజాగా విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఇతర అధికారులు, వైద్యులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ చెప్పారు.

విశాఖపట్నం

2021-05-04 14:29:31

సకాలంలో ఆసుపత్రులకు ఆక్సిజన్..

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గల ఆక్సిజన్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పరిశీలించారు. మంగళ వారం మధ్యాహ్నం ఆసుపత్రి ఆవరణలో ఉన్న 10 వేల లీటర్ల సామర్ధ్యం గల యూనిట్ ను పరిశీలించి నిర్వహణపై కచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని ఆయన పేర్కొన్నారు. ద్రవ రూప ఆక్సిజన్ గడ్డకట్టుటకు అవకాశాలు ఉంటాయని అటువంటి సంఘటన జరగకుండా నిరంతరం నీటితో పైపులను తడి చేస్తుండాలని ఆయన ఆదేశించారు. పైపు లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు. ఆక్సిజన్ నిరంతర సరఫరా ఉండాలని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా ఆక్సిజన్ యూనిట్ నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని కోరారు. కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించిన తక్షణం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంత త్వరగా పరీక్షలు చేయించుకుంటే అంత సురక్షితంగా ఉంటారని గ్రహించాలని ఆయన అన్నారు. త్వరగా వైరస్ నిర్ధారణ జరిగితే సంబంధిత మందులను ఇంటి వద్ద ఉంటూనే తీసుకుని నయం చేసుకోవచ్చని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆలస్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. కరోనా ఎవరికైనా రావచ్చని, కరోనా గూర్చి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరగా నిర్ధారణ, త్వరగా మందులు తీసుకోవడం, భయం లేకుండా ఉండటంతో అతి త్వరగా కోలుకోవచ్చని పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాలకు వెళ్ళరాదని, వేడుకలలో పాల్గొనరాదని ఆయన హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ , ఏపిఎస్ ఎంఐడిసి జెఇ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-05-04 13:51:11

ఈవీఎంలకు పటిష్ట భద్రత..

ఈవీఎంల భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు  
ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం), డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం, కాకినాడ అర్బ‌న్ డీటీ ర‌మేశ్‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాకినాడ

2021-05-04 13:04:00

ముమ్మరంగా ఫీవర్ సర్వే..

శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా ఫీవర్ సర్వే ఇంటింటికీ తిరిని నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి ఫీవర్ సర్వేను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలు జారీ చేసారు. దీనితో మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే కార్యక్రమం జోరుగా సాగుతోంది.  జ్వరం, దగ్గు, జలుబుతో సహా ప్రస్తుతం కరోనా లక్షణాలుగా మారుతున్న కీళ్ళ నొప్పులు, నడుం నొప్పి, నీరసం, విరేచనాలు, తల నొప్పి, కళ్ళు ఎర్రగా మారడం (కళ్ళ కలక మాదిరిగా) వంటి లక్షణాలు కనిపిస్తే వారిని గుర్తించి నమూనాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు. కంటైన్మెంటు జోన్లలో జిల్లా కలెక్టర్ సందర్శిస్తున్న సమయంలో సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. మండలాల్లో ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఇంటిలో పరిస్ధితిని తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించిన పరీక్షలు చేయించుటకు సహకరిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ముందుగా సమాచారం అందించడం జరుగుతోంది. ఫీవర్ సర్వేలో మండల ప్రత్యేక అధికారులతోపాటు జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి మరియు జిల్లా నోడల్ అధికారి క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తున్నారు. ఫీవర్ సర్వే స్ధితిగతులను పరిశీలించడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫీవర్ సర్వే ఒక ప్రక్క చేపడుతుండగా మరో వైపు పారిశుధ్య కార్యక్రమాలను కూడా విస్తృతం చేపడుతున్నారు. వైరస్ నాశనానికి అవసరమైన బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి వంటి వివిధి పద్ధతులను ఆచరిస్తున్నారు. కంటైన్మైంట్ ప్రాంతాలపైనా దృష్టి సారించి కరోనా కేసులు నివారణకు గట్టి చర్యలు చేపడుతున్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతోపాటు మునిసిపల్ కమీషనర్లు ఈ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నారు.

శ్రీకాకుళం రూరల్

2021-05-03 15:31:00

రోజుకి 10వేల కోవిడ్ పరీక్షలు చేయాలి..

శ్రీకాకుళంజిల్లాలో  రోజుకు 10 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేసులు, పరీక్షలపై సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ టేలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ కేసులు త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు నమూనాలు ఎక్కువగా సేకరించాలని ఆయన ఆదేశించారు. కేసులు త్వరితగతిన గుర్తించడం వలన నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. నమూనాలు సేకరణ, కంటైన్మెంట్ జోన్లపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఎక్కువ కేసులు నమోదు అవుతున్న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, మెలియాపుట్టి, పలాస, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, రణస్థలం, రాజాం, పాలకొండ, సోంపేట, పాతపట్నం తదితర ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో కనీసం 250 నమూనాలు సేకరించాలని ఆయన స్పష్టం చేసారు. సేకరించిన నమూనాలు తక్షణం లాబ్ కు పంపించాలని, ఫలితాలు త్వరగా అందించాలని ఆయన ఆదేశించారు. కూడళ్లలో ఎక్కువ రద్దీ ఉంటుందని అటువంటి కూడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. వైరస్ వ్యాప్తికి కూడళ్లు కొంత ఎక్కువ కారణం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మత్స్యకార గ్రామాల్లో గుమిగూడి ఉంటారని అటువంటి గ్రామాలను పరిశీలించి అవగాహన క్షల్పించాలని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే దుకాణాలు, ఇతర యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ కిట్లు విధిగా అందాలని  కలెక్టర్ నివాస్ స్పష్టం చేసారు. కిట్లు పంపిణీని పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా అవసరమగు కిట్ల నివేదికను అందించాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు.  ఈ టేలి కాన్ఫెరెన్సు లో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, నోడల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2021-05-03 15:27:45

సింహాద్రి అప్పన్న దర్శన వేళల్లో మార్పులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనాల్లో మార్పులు చేశారు. భక్తులను ఉదయం  6:30  గంటల నుంచి 11:30(AM)వరకు మాత్రమే దర్శనాలకి అనుమతిస్తారు.   స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు ఏకాంతంగానే జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు తెలియజేశారు. స్వామివారి దర్శనాల్లో మార్పులను  భక్తులు  గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

సింహాచలం

2021-05-03 15:22:08