1 ENS Live Breaking News

మీకోసమే వస్తున్నాను ఆశీర్వదించండి..

విశాఖ ప్రజల సేవకోసమే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ అభ్యర్ధిగా మీ ముందుకు వస్తున్నానని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విశాఖలోని 21వార్డు పీతల వీధి పరిసర ప్రాంతాల్లో వంశీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు మేలు చేయడానికే ప్రభుత్వం నవతర్నాలు అమలు చేస్తుందన్నారు. ఉత్తరాంధ్రా అభివ్రుద్ధికోసం రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని ప్రజలకు వివరించారు. మీ కుటుంబంలోని అన్నగా, తమ్ముడిగా భావించి తనను దీవించి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. వంశీ ప్రచారానికి వెళ్లే ప్రాంతాల్లో మహిళలు బ్రహ్మరదం పడుతూ, హారతులు పట్టి ఆత్మీయంగా ఆహ్వానాలు పలికారు. ఎక్కడికి వెళ్లినా మీవెంట మేమున్నామంటూ ఆయను భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు, వార్డ్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున వంశీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-19 16:26:47

పైడితలమ్మకు పూజలు చేసిన కలెక్టర్..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ శుక్ర‌వారం పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యాన్ని ద‌ర్శించుకొని అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. త‌న‌కు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసిన నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం అమ్మ‌వారిని ద‌ర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అమ్మ‌వారి ఆశీస్సుల‌తోనే త‌న‌కు ప‌దోన్న‌తి ల‌భించింద‌న్నారు. గ‌త మూడేళ్లుగా జిల్లా అభివృద్ధికోసం చేప‌ట్టిన ప‌నుల‌న్నింటికీ అమ్మ‌వారి ఆశీస్సులే కార‌ణ‌మ‌న్నారు. జిల్లా ప్ర‌జ‌లంద‌రికీ అమ్మ‌వారి ఆశీస్సులు వుండాల‌ని తాను ప్రార్ధించిన‌ట్టు చెప్పారు. అమ్మ‌వారి ఆశీస్సుల‌తో తాను వృత్తిప‌రంగా కూడా ఎంతో విజ‌యం సాధించ‌గ‌లిగాన‌ని పేర్కొన్నారు. తనకు ఈ జిల్లాకి అవినాభావ సంబంధం ఏర్పడిపోయిందని, అదంతా అమ్మవారి దయతోనే జరిగిందని అభిప్రాయపడ్డారు. 

Vizianagaram

2021-02-19 16:26:19

నాడు-నేడు లో విజయనగరమే నెంబర్ 1 కావాలి..

విద్యారంగ‌లో ఎలాంటి మార్పు అయినా మ‌న జిల్లా నుంచే మొద‌ల‌వ్వాల‌ని.. నూత‌న విధ‌నాల‌ను స్వాగతించ‌డం ద్వారా అద్భుత ఫ‌లితాల‌ను చ‌విచూడాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌‌పెట్టిన నాడు-నేడు ప‌థ‌కం అమ‌ల్లో జిల్లా నెం.1 స్థానంలో నిల‌వాల‌ని పేర్కొన్నారు. ఆరోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో విద్యార్థుల‌కు విద్య‌నందించాల‌ని సూచించారు. జిల్లాలోని ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపా‌ధ్యాయుల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. జిల్లాలో అమ‌లు చేస్తున్న ప‌లు విద్యా ప‌థ‌కాల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో విద్య‌ను అందించాల‌ని దానికి త‌గిన ఏర్పాట్లు చేసుకోవాల‌ని ప్ర‌ధానోపాధ్యాయుల‌ను ఉద్దేశించి క‌లెక్ట‌ర్ అన్నారు. ప్ర‌తి పాఠ‌శాల‌లో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం-ప‌రిర‌క్ష‌ణ‌, ప‌రిపూర్ణ ఆరోగ్య సూత్రాల‌ను పాటించాల‌ని సూచించారు. విధిగా ప్ర‌తి పాఠశాల‌లో మొక్క‌ల‌ను నాటి సంర‌క్షించాల‌ని ఆదేశించారు. విద్యార్థుల‌కు అందిస్తున్న మ‌ధ్యాహ్నం భోజ‌నంలో నాణ్య‌త ఉండాల‌ని, మంచి ఆహారం అందించాల‌ని చెప్పారు. మెనూ త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. అలాగే ప్ర‌తి ఉపాధ్యాయుడూ బాధ్య‌త‌గా మెల‌గాల‌ని విద్యార్థుల‌ను సొంత పిల్ల‌ల్లా చూసుకోవాల‌ని ఉప‌దేశించారు. ఉపాధ్యాయుల మేథ‌స్సు స‌మాజ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డాల‌ని, స్థానికంగా ఉండే చెరువుల‌ను సంర‌క్షించుకోవాల‌ని సూచించారు. పిల్ల‌ల చేత వారి త‌ల్లిదండ్రుల‌ను ప్రోత్స‌హించటం ద్వారా పాఠశాల‌ల్లో, గ్రామాల్లో మొక్క‌లు నాటాల‌ని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కువ చెరువులు క‌లిగిన జిల్లా మ‌న‌ద‌ని, వాటిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రి పైనా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ప‌రీక్ష‌ల‌కు ఇప్ప‌టి నుంచే త‌ర్ఫీదు ఇవ్వండి మారిన నూతన ప‌రీక్ష విధానాల‌కు అనుగుణంగా ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాల‌ని సూచించారు. కొత్త విధానాలు అమ‌లు చేయ‌టం ద్వారా విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌ని చెప్పారు. ఈ ఏడాది జూన్ మొద‌టి వారంలో మొద‌ల‌య్యే ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌కు ఇప్ప‌టి నుంచే విద్యార్థులకు త‌గిన త‌ర్ఫీదు ఇవ్వాల‌ని ఆదేశించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించాల‌ని నిర్దేశించారు.  దీనికి మెరుగైన ప్ర‌ణాళిక‌లు రచించి ఆచ‌రించాల‌ని, ఆశాజ‌న‌క ఫ‌లితాల‌ను సాధించాల‌ని చెప్పారు. విద్యారంగంలో ఎలాంటి మార్పుకైనా విజ‌య‌న‌గరం జిల్లాయే నాంది ప‌ల‌కాల‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. కోవిడ్‌-19పై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, నివార‌ణ మార్గాల‌ను సూచించాల‌ని ఆదేశించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తి ఉపాధ్యాయుడూ బాధ్య‌త‌గా మెల‌గాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూచించారు. అనంత‌రం సంయ‌క్త క‌లెక్ట‌ర్ ఆర్‌. మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ ఇంకా పూర్తికాని నాడు-నేడు ప‌నుల‌ను రెండు వారాల్లోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మ‌రుగుదొడ్ల ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన ముగించాల‌ని చెప్పారు. ఎలాంటి కొత్త ప‌నులూ ప్రారంభించ‌వ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. పాత ప‌నుల‌నే నిర్ణీత గ‌డువులోగా పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఉపాధ్యాయుడూ విధిగా ఈ-హాజ‌రు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని, అందులో హాజ‌రు న‌మోదు చేయాల‌ని సూచించారు. సమావేశంలో డీఈవో జి.నాగ‌మ‌ణి, ప‌లు ఉన్న‌త పాఠ‌శాల‌ల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. క‌లెక్ట‌ర్‌కు స‌త్కారం ప‌దోన్న‌తి పొందిన క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌కు ఈ సంద‌ర్భంగా డీఈవో, డిప్యూడీ డీఈవో, ఎంఈవోలు, ప్ర‌ధానోపాధ్యాయులు శుభాకాంక్ష‌లు తెలిపారు. క‌ర‌తాల ధ్వ‌నుల‌తో అభినంద‌న‌లు తెలియ‌జేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పూల‌మాల‌లు, శాలువాలు వేసి స‌త్క‌రించారు. ప‌లువురు ఉపాధ్యాయులు, క‌లెక్ట‌రేట్ ఉద్యోగులు పుష్ప‌గుచ్ఛాలు అంద‌జేశారు.

Vizianagaram

2021-02-19 14:21:43

సీఎం వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన రధం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి శనివారం ఘన స్వాగతం లిభించింది. హెలీప్యాడ్ వద్ద  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ చింతా అనురాధ, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ఎమ్మెల్యేలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్వామివారి రథం దుండగులు కాల్చేసిన తరువాత ప్రభుత్వం మళ్లీ అదే కొలతలతో కొత్త రథాన్ని నిర్మించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ దానిని ప్రారంభించారు. 

Antervedi Pallipalem

2021-02-19 12:10:07

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్ర జరుగుతుందిలా..

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మన జాతి సందైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను నిరశిస్తూ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి శనివారం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర యొక్క రూట్ మేప్ ను వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ విడుదల చేశారు. పాదయ యాత్ర విశాఖ జివిఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ప్రారంభమై స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద ముగుస్తుంది. ఈ మేరకు పాదయాత్ర ➡️ మహాత్మా గాంధీ విగ్రహం ➡️ ఆసిల్ మెట్ట జంక్షన్ ➡️సంగం శరత్ ➡️కాళీ టెంపుల్ ➡️తాటి చెట్ల పాలెం ➡️ఊర్వశి జంక్షన్  ➡️104 ఏరియా ➡️ మర్రిపాలెం ➡️ ఎన్ఏడి జంక్షన్ ➡️ ఎయిర్ పోర్ట్  ➡️ షీలా నగర్  ➡️ B.H.P.V ➡️ పాత గాజువాక ➡️ శ్రీనగర్ ➡️ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ (కూర్మం పాలెం జంక్షన్) వరకూ సాగుతందని చెప్పారు. ప్రాంతాల వారీగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమాను, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పాటుపడేవారంతా ఈ పాద యాత్ర పాల్గొన వచ్చునని వంశీ వివరించారు.

Maddilapalem

2021-02-19 11:54:57

స్వామిని దర్శించుకున్న ప్రముఖులు..

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతిని పురష్కరించుకొని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణ, కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు,  గొర్లె కిరణ్ కుమార్, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్, డి.ఐ.జి యల్.వి.రంగారావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ జె.నివాస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్, యస్.బి.ఐ డి.జి.ఎం రంగరాజన్ తదితరులు కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.

Srikakulam

2021-02-19 11:39:04

అంగరంగ వైభవంగా సూర్యజయంతి..

 రథసప్తమి సందర్భంగా అరసవల్లిలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం అర్ధరాత్రి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి తొలి క్షీరాభిషేకాన్ని చేసి స్వామి వారి జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్ కు పంచామృతాలు, క్షీరంతో అభిషేకాలు చేసారు. ఆలయ సంప్రదాయంలో భాగంగా  దేవాదాయ శాఖ డెప్యూటీ కమీషనర్ ఎన్.సుజాత, ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి ఛైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసిరావు, పాలకమండలి సభ్యులు ఉత్సవ అధికారికి తొలుత స్వాగతం పలికారు.  ఆలయ నియమాల మేరకు దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు భ్రమరాంబ, ఆలయ కార్యనిర్వహణ అధికారి  రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామి వారు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు వదిలి నిజరూపంలో భక్తులకు దర్మనమిచ్చారు. ఈ వేడుకలతో  అరసవల్లి ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామి వారి నిజరూప దర్శనం కొరకు భక్తులు వేల సంఖ్యలో పోటేత్తారు.

Arasavilli

2021-02-19 11:37:01

రూ.12.65 లక్షల ఊరగాయ విరాళం..

 గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన విజయ ఫుడ్ ప్రాడక్ట్స్ అధినేత కె.రాము టిటిడికి రూ.12.65 లక్షలు విలువైన ఊరగాయలు విరాళంగా అందించారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఈ ఊరగాయలను టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు. వీటిలో 7 రకాల 4,500 కిలోల ఊరగాయలు, 300 కిలోల పసుపు పొడి, 200 కిలోల కారం పొడి, 300 కిలోల పులిహోర పేస్ట్ ఉన్నాయి.  అన్నదానం డెప్యూటీ ఈవో  నాగ‌రాజ‌, క్యాటరింగ్‌ అధికారి  జిఎల్‌ఎన్‌.శాస్త్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-02-18 20:54:55

మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వర్తించాలి..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థకు మార్చి నెలలో జరుగబోయే ఎన్నికలను నిర్వర్తించుటకు అధికారులు సమిష్టి కృషితో పని చేయాలని జి.వి.యం.సి. కమిషనరు నాగలక్ష్మి. ఎస్. ఆదేశించారు.  గురువారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో పాత సమావేశ మందిరం నందు కమిషనరు సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ, గత సంవత్సరంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడినందున, తదుపరి మార్చి నెలలో జరుపవలసిన ఎన్నికల ప్రక్రియలపై అధికారులతో చర్చించారు.  ఎన్నికలకు సంబందించిన స్ట్రాంగ్ రూమ్ లు, బ్యాలట్ బాక్షులు, పోలింగు సామగ్రి, వాహనాలు, మౌళిక సదుపాయాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, స్టేషనరీ సామగ్రి మొదలగు విషయాలపై జోన్ల వారీగా అధికారులతో చర్చించారు.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని సూచించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పనులపై వివరణ కోరగా ప్రధాన ఇంజనీరు ఎం. వెంకటేశ్వర రావు  మాట్లాడుతూ జరుగనున్న ఎన్నికలకు సంబంధించి జోన్ల వారీగా స్ట్రాంగు రూములు ఏర్పాటు చేస్తున్నామని, 1712 పోలింగ్ స్టేషన్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ, 204 రూట్లకు సంబంధించి కావలసిన వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ పోలింగు స్టేషన్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రక్రియలో పోటీ చేస్తూ మరణించిన అభ్యర్ధుల వివరాలపై నివేదిక సమర్పించాలని అదనపు కమిషనరు ఎ.వి.రమణి ని ఆదేశించారు. అలాగే ఈ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా విధులు నిర్వహించాలని, అందుకు కావలసిన టైం షెడ్యూల్ ను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధాన ఇంజనీరు ఎం. ఎం. వెంకటేశ్వర రావు, అదనపు కమిషనర్లు పి. ఆశాజ్యోతి, ఎ. వి. రమణి, డా. వి. సన్యాసిరావు, వ్యయ పరిశీలకులు మంగపతిరావు, జె. డి. (అమృత్) – విజయభారతి, సి.సి.పి. విద్యుల్లత, పి.డి. యు.సి.డి. వై. శ్రీనివాస రావు, సి.యం.ఒ.హెచ్. డా. కె.ఎస్. ఎల్. జి. శాస్త్రి, పర్యవేక్షక ఇంజనీర్లు వినయకుమార్, శాంసన్ రాజు, కె.వి.యెన్.రవి, అందరు జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-02-18 20:51:13

ఆమె రాకతో జివిఎంసీ ఇక గాడిలో పడినట్టే..

ఆంధ్రప్రదేశ్ లోనే ప్రముఖ నగరంగా ఉన్న మహావిశాఖనగర పాలక సంస్థను గాడిలో పెట్టాలని ప్రభుత్వం భావించింది..అలాంటి మున్సిపల్ కార్పోరేషన్ ను దైర్యంగా ముందుకి నడపాలంటే అంతే స్థాయి తెగువ వున్న ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఇక్కడికి ఎంత మంది అధికారులు వచ్చినా ఏదో పనిచేశామన్నట్టుగా వ్యవహరించేవారు తప్పతే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలనే తపన తక్కువగానే ఉండేది. ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వం ఒక మంచి ఐఏఎస్ అధికారిణిని నియమిస్తే జీవిఎంసీ స్వరూపం మొత్తం మారుతుందని భావించి యువ ఐఏఎస్ అధికారిణి ఎస్.నాగలక్ష్మిని జివిఎంసీ కమిషనర్ గా నియమించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రతిష్టాత్మక పోస్టుకి అంతే స్థాయి అధికారిణి నాగలక్ష్మి ఐఏఎస్ అని చెప్పొచ్చు. ఆమె డ్యూటీ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. పరిపాలనను ఒక సిస్టమేటిక్ గా చేసే ఐఏఎస్ అధికారుల్లో ఈమె కూడా ఒకరు. అలాంటి అధికారి తప్పితే మరెవరూ విశాఖనగరపాలక సంస్థకు సూట్ కారనుకున్న ప్రభుత్వం ఏరి కోరి ఈమెను కమిషనర్ గా నియమించింది. మొన్నటి వరకూ ఏపీఈపీడిసిఎల్ కి సీఎండీగా వ్యవహరించిన ఈమెను ప్రభుత్వం మళ్లీ విశాఖలోనే నియమించిందంటేనే ఈమె యొక్క పరిపాలనా దక్షత ఏస్థాయిదో ఇప్పటికే చాలా మందికి అర్ధమైపోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో గానీ, ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో గానీ ఈ అధికారిణి చేసే విధినిర్వహణ ఎంతో చక్కగా వుంటుంది. చాలా కాలం తరువాత జివిఎంసీకి మంచి ఐఏఎస్ అధికారిణి కమిషనర్ గా రావడంతో ఇక ప్రభుత్వం కూడా విశాఖను దేశంలోనే మంచి స్మార్ట్ సిటీల్లో నెంబర్ వన్ గా నిలబెట్టే బాధ్యతను ఈమెకు అప్పగించింది. దానికి తోడు ఈ అధికారిణి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే జివిఎంసీ అదనపు కమిషనర్ డా.సన్యాసిరావు లాంటి అధికారులు కూడా ప్రభుత్వ పాలనకు ఎంతో ఉపయోగ పడనుంది. జివిఎంసీ కమిషనర్ గా నాగలక్ష్మి ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రతీ ఒక్కరినోట నుంచి వెలువడిన మాట ఒక్కటే ఇక జీవిఎంసీ గాడిలో పడినట్టేనని..మంచి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో ఉంటే అనుకున్న లక్ష్యాలను అదిగమించడం పెద్ద కష్టమేమీ కాదనడంలో సందేహమేలేదు. ఇక మహావిశాఖ నగరపాలక సంస్థలో ప్రజలతోపాటు ప్రభుత్వం కూడా మంచి ఫలితాల కోసమే ఎదురుచూడాలి..!

Visakhapatnam

2021-02-18 20:47:22

అన్నివార్డుల్లో ఒకేసారి లెక్కింపు జరగాలి..

అనంతపురం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల కౌంటింగ్ ఒకేసారి మొదలు కావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. గురవారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు  కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని ఎన్ఐసీ భవనం నుంచి నాలుగో దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే పూర్తయిన మూడు దశల గ్రామ పంచాయితీ ఎన్నికలలో అక్కడక్కడా నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పెనుకొండ డివిజన్ లో జరగనున్న ఆఖరి దశ ఎన్నికలలో పునరావృతం కాకుండా ఉండాలంటే అనుసరించాల్సిన కార్యాచరణపై మాట్లాడారు. ముందుగా పోలింగ్ సమాచారం ప్రతి గంటకోసారి ఆలస్యం కాకుండా అందించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని తెలిపారు. ఉదయం 6:30 గంటలకు పోలింగ్ మొదలయినప్పటి నుంచి ప్రతి గంటకూ సంబంధించిన పోలింగ్ రిపోర్టు పది నిమిషాల తేడాతో తనకు చేరాలని ఆదేశించారు. పోలింగ్ రిపోర్టు అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఎంపీడీవోలు నియమించుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు తొందరగా పూర్తిచేయాలని ఆదేశిస్తూ పోలింగ్ అధికారులకు టైమ్ లైన్ ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పోలింగ్ పూర్తయితే పది నిమిషాలలో వార్డుల కౌంటింగ్ మొదలవ్వాలన్నారు. సాయంత్రం 8:00 గంటలకు వార్డు మెంబర్లు, సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ పూర్తవ్వాలన్నారు.  కౌంటింగ్ చేసేటప్పుడు ఒక వార్డు తర్వాత మరో వార్డు లెక్కపెట్టడం సరికాదన్నారు. అన్ని వార్డుల ఓట్లు ఒకేసారి లెక్కపెట్టాలన్నారు. అన్ని వార్డు ఓట్లను ఒకేసారి కౌంటింగ్ చేసేందుకు అనుగుణంగా ఉండేలా పెద్ద హాలు, సరిపడినన్ని బెంచీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వార్డుల ఓట్లతో పాటూ సర్పంచు ఓట్లను కూడా ఏకకాలంలో కౌంటింగ్ చేయాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడి చేసి, అప్పటికప్పుడు ఉప సర్పంచు ఎన్నిక కార్యక్రమం నిర్వహించి, గెలిచిన వారికి ధ్రువ పత్రాలు కూడా అక్కడే జారీ చేయాలన్నారు. రీకౌంటింగ్ నిబంధనల గురించి ఆర్వోలు క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి రీకౌంటింగ్ నిర్వహించకూడదన్నారు.. ఈ అంశంలో ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. కౌంటింగ్ హాలులో పోలింగ్ అధికారులు, నిబంధనల ప్రకారం అనుమతించదగిన వ్యక్తులు తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నారు. పోలీసులు కూడా ఆర్వోలు కోరితేనే కౌంటింగ్ హాలులోకి ప్రవేశించాలన్నారు. అనుమతించని వ్యక్తులు ఎవరైనా కౌంటింగ్ హాలులో వుండకూడదన్నారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్లు ఏ.సిరి & గంగాధర్ గౌడ్, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, ఎన్నికల సలహాదారులు గోవిందరాజులు, డీపీవో పార్వతి, జడ్పీ సిఈవో శోభా స్వరూపా రాణి పాల్గొన్నారు. పెనుగొండ నుంచి సబ్ కలెక్టర్ నిశాంతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Anantapur

2021-02-18 20:07:52

మున్సిపల్ ఎన్నికలు బాగా నిర్వహించాలి..

అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, అంతకన్నా బాగా మున్సిపల్ ,అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను  నిర్వహించాలని, ఇందుకోసం అన్ని విధాలుగా సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, మున్సిపల్ ఆర్ డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ మరియు అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలను సజావుగా, సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళిక రూపొందించుకొని మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని, పొరపాటున కూడా ఎలాంటి తప్పులు జరగడానికి వీలు లేదన్నారు. సమయం వృధా చేయకుండా ఎన్నికల పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలి :  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీలోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కంట్రోల్ రూమ్ లోనూ అవసరమైన సిబ్బందిని నియమించాలని, అందుకు సంబంధించి సిబ్బంది నియామకం వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు.  మున్సిపల్ ఎన్నికల కోసం స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించడం, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్, రిటర్నింగ్ అధికారుల జాబితా, మోడల్ కోడ్ కండెక్ట్ టీం ఏర్పాటు, నోడల్ అధికారుల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాల వివరాలను 19వ తేదీ లోపు సిద్ధం చేయాలన్నారు. అనంతరం 20వ తేదీ నుంచి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించడం 20 నుంచి 28వతేదీలోపు చేయాలని, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు.  బ్యాలెట్ బాక్స్ ల తరలింపు, మొదటి, రెండో విడత పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల మెటీరియల్ అందజేయడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా, బ్యాలెట్ పేపర్ ప్రొక్యూర్ మెంట్, పోలింగ్ కౌంటింగ్ ఏర్పాట్లు అన్ని నిర్దేశిత సమయం లోపు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.  మున్సిపల్ ఎన్నికల కోసం ఇంతకుముందు గుర్తించిన పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల వసతులు ఉన్నాయా లేదా అని మున్సిపల్ కమిషనర్లు పరిశీలించాలని, అవసరమైన పోలింగ్ స్టేషన్లలో తగిన వసతులు కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని, ఒక్కో టీం కు ఎన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలో నిర్ణయించాలని, రెండు రోజుల్లో అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి వాటిలో సౌకర్యాల కల్పన కోసం చర్యలు తీసుకోవాలన్నారు.  అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి, రెండవ, మూడవ విడత ఎన్నికలను సజావుగా నిర్వహించడం పట్ల నోడల్ అధికారులకు, ఆర్డీవోలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు జరగడం ఇంతకుముందు ఎప్పుడూ లేదని, ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల మెటీరియల్ ను ఎన్నికల సిబ్బంది కూర్చున్న దగ్గరికి అందించడం, ఎన్నికల సిబ్బందికి పారితోషికాన్ని వారి అకౌంట్ లోకి జమ చేయడం, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలను రప్పించి వారు పోలింగ్లో పాల్గొనేలా చేయడం, ఓటర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ, క్యాండిడేట్ ఫ్రెండ్లీ, ఎలక్షన్ అఫీషియల్ ఫ్రెండ్లీ గా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేశామన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికలను కూడా విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య సాయిబాబా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని, పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా ఎన్నికల సిబ్బంది, పోలీసులు సమన్వయం చేసుకొని తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం దగ్గర సమస్యలు రాకుండా చూసుకోవాలని, రౌడీ షీటర్ లను పోలింగ్ ఏజెంట్ గా నియమించకుండా చూడాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను వివరించారు.  ఈ సమీక్ష సమావేశంలో సి పి ఓ ప్రేమ చంద్ర, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ  సుబ్బరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, పరిశ్రమల శాఖ జిఎం సుదర్శన్ బాబు, ఆర్ డి వో లు గుణభూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్, రామ్మోహన్, నగర పాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-02-18 19:13:36

కర్నూలు కార్పొరేషన్ లో హెల్ప్ లైన్..

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారం కోసం నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ సెంటర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నగర ప్రజలు, రాజకీయ పక్షాలకు అవసరమైన సమాచారంతో పాటు వారి సందేహాల నివృతికి 7422992299 ఫోన్ నంబర్ కు ఫోన్ కాల్ ద్వారా కానీ లేక ఇమెయిల్ ఐడి::mc. kurnool@cdma.gov.in కు మెయిల్ సందేశం ద్వారా కానీ తెలియజేయాలని హెల్ప్ లైన్ డెస్క్ నోడల్ అధికారి క్రిస్టోఫర్ తెలియజేశారు.

Kurnool

2021-02-18 19:09:17

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం..

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కర్నూలు నగర పాలక అధికారులు, సిబ్బంది చురుగ్గా సమన్వయంతో అన్ని ముందస్తు ఏర్పాట్ల పనిలో నిమగ్నమయ్యారు.  ఈమేరకు గురువారం స్థానిక పాత పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దామోదరం సంజీవయ్య నగర పాలక పాఠశాలలో మునిసిపల్ అధికారులు నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ తో పాటు ఎన్నికల ఆర్వోలు, ఏఆర్వోలకు అవసరమైయే సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ పర్యవేక్షణలో అధికారులు నగరంలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఒక్కొక్కటి సంచుల్లో భద్రపరుస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలాజీ ఎన్నికల సామగ్రిని పరిశీలించి పంపిణీ కేంద్రానికి చేరే ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు. అప్పగించిన ఎన్నికల విధులను ముందస్తుగా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నగర పాలక ఎన్నికల్లో బాద్యులైన ఎన్నికల అధికారులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళిని అనుసరించి మాత్రమే విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ స్వయంగా విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని తిని గమనించారు. ప్రతి రోజూ నిర్ధేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు శుచి, శుభ్రంగా, రుచిగా భోజనాన్ని అందించాలని ప్రధానోపాధ్యాయుడు ఎస్.రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, నగర పాలక మేనేజర్ చిన్నారాముడు, సుపరింటెండెంట్ ఇశ్రాయేల్, సీనియర్ అసిస్టెంట్లు రామకృష్ణ, శ్రీదేవి, అధికారులు నాగరాజు, రాజు, ఇంతియాజ్ ఉన్నారు.

Kurnool

2021-02-18 19:06:27

విశాఖను నెంబర్1 స్మార్ట్ సిటీ చేయడమే నా లక్ష్యం..

మహావిశాఖనగరపాలక సంస్థను దేశంలోనే నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా అభివ్రుద్ధిచేయడమే తనముందున్న లక్ష్యమని జివిఎంసీకి నూతనంగా నియమితులై కమిషనర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచి జివిఎంసీకి కమిషనర్ గా పంపిందని ప్రజాప్రతినిధులు, మీడియా, ప్రజల సహకారంతో విశాఖ నగరాన్ని మరింత అభివ్రుద్ధి చేస్తామన్నారు. నిరుపేదల సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డా.సన్యాసిరావు, ఇతర విభాగాల అధికారులు కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులను పరిచియం చేశారు.

Visakhapatnam

2021-02-18 19:03:31