జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకులకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. సోమవారం స్పందన అనంతరం జిల్లా అధికారులతో గణతంత్ర వేడుకుల ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించే ఈ వేడుకులకు కవాతు, బందోబస్తు, బ్యాండ్ పార్టీ, ఓపెన్ టాప్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా రెవిన్యూ అధికారి ఆహ్వానాలు ప్రశంసా పత్రాలను తయారు చేయాలనీ అన్నారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది తో పాటు పచ్చదనాన్ని పెంపొందించిన వారికీ, రక్త దానం చేసిన వారికీ, పారిశుధ్యం, చెరువు శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారికీ కూడా ప్రశంసా పత్రాలను అందజేయాలని సూచించారు. ఈ సేవలను పరిష్కరించడం లో చొరవ చూపిన సచివాలయాల సిబ్బందిని కూడా ప్రశంసా పత్రాల కోసం ఎంపిక చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) ఆధ్వర్యం లో ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు జాబితాను సిద్ధం చేయాలన్నారు. గత ఏడాదిగా అన్ని శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పై ముఖ్య అతిధి ప్రసంగాన్ని తయారు చేయాలని సమాచార శాఖ సహాయ సంచాలకులకు ఆదేశించారు. అదే విధంగా గత ఏడాదిగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చే యాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా త్రాగు నీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలు చేయాలనీ, సమాహర శాఖ ఇంజినీర్ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయనగరం రెవిన్యూ డివిజినల్ అధికారి సీటింగ్ , ప్రోటోకాల్ ఏర్పాట్లను చేయాలనీ, తహసిల్దార్ స్నాక్స్ ఏర్పాటు చేయాలనీ అదేశించారు . దేశ భక్తి గీతాల ఆలాపన, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జిల్లా విద్య శాఖ అధికారి చూడాలన్నారు. ముఖ్యమైన శాఖలన్నీ స్టాళ్ళ ప్రదర్శన కు సిద్ధంగా ఉండాలని, అయితే సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ళ ప్రదర్శన కోవిడ్ దృష్ట్యా ఉన్నదీ లేనిదీ త్వరలో తెలియజేస్తామని అన్నారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు డా. ఆర్. మహేష్ కుమార్, జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, జిల్లా అధికారులు హాజరైనారు.
నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద 2, 3 సంవత్సరాల్లో జిల్లాలో 1045 కొత్త ఊర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతరలా, పండుగలా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, నిరుపేద లో గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోయేలా ఇంటి నిర్మాణాలు చేపడతామన్నారు. నిరుపేదలకు ఇంటి పట్టాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ఇస్తున్నామని, అదనంగా రూ.60 వేలతో రోడ్లు, కాలువలు, వాటర్ ట్యాంకులు, ఆసుపత్రులు, గుడి, బడి, నీటి సౌకర్యం తదితర అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణం కోసం వాలంటీర్ ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం కల్పించిన మూడు అంశాలలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని ఇల్లు కట్టుకోవచ్చని, ఇంటి నిర్మాణం కోసం ముడిసరకు కావాలంటే ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, లేదా మేము పెట్టుకోలేము ప్రభుత్వమే కట్టి ఇవ్వాలని అడిగినా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఇంటి పట్టాల తో పాటు 1.11 లక్షల మందికి ఇంటి నిర్మాణం కి సంబంధించి శాంక్షన్ ఇచ్చామని, మిగతా ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మంజూరు చేస్తామన్నారు. ప్రజలంతా ఒకే కులం, మతం, వర్గం అని, అందరూ కలిసి ఉండాలని లాటరీ తీసి ఇంటిగ్రేటెడ్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాన్యులకు మంచి జరగాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టా తో పాటు సరిహద్దులు తెలియజేసి, అధికారుల సంతకం, పూర్తి వివరాలు, డి ఫారం పట్టా ఇస్తున్నామని, త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు.
పేదలకు ఏంకావాలో, పిల్లా పాపలతో చల్లగా ఉండాలంటే ఏం కావాలో, పేదల జీవన విధానం మారడానికి ఏం కావాలో అలాంటి మహత్తరమైన సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందన్నారు. గత వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది తల్లులకు 15 వేల రూపాయలు చొప్పున జగనన్న అమ్మ ఒడి పథకం కింద వారి ఖాతాలలో జమ చేశామని, వారంతా ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారని, లెక్కపెట్టలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దారిద్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం వేల కోట్ల రూపాయల తో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతో వెనకబడిందని, జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి జిల్లాకు హంద్రీనీవా నీరు తీసుకురావాలని ఎంతో కృషి చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు త్వరలోనే అందబోతున్నాయన్నారు. జిల్లాకు ప్రధానమైన నీటి సమస్య కూడా తొలగిస్తామని, జిల్లాకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎక్కడైనా నా ప్రభుత్వ పథకాల అమలులో, అభివృద్ధి పనుల్లో ఎదురైన సమస్యలను చూసి పారిపోకుండా పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, గోపురాలపై కొందరు దాడులు చేస్తున్నారని, దానివల్ల గందరగోళ సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై బురద జిల్లాలను చూస్తున్నారని, ప్రజలకు లేనిపోని అపోహలు సృష్టిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా ఏదైనా సంఘటనలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఏడి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పి వి ఎన్ఎన్ మూర్తి, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మీ నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమాత్యులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండలం పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, పివి.సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స మాట్లాడుతూ ముందుగా ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ పెద్ద పండుగ అయిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో 1628 మందికి 38 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,549 మందికి ఇంటి స్థలాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1100 గ్రామాలు ఉంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద కొత్తగా 1045 నగరాలు, నగర పంచాయతీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ఎన్నికల మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతల భావిస్తూ, మేనిఫెస్టో లోని ప్రతి అంశాన్ని నెరవేర్చడమే మన ధ్యేయం అని సీఎం అన్నారని, చెప్పినట్లు గానే ఇళ్ల పట్టాలిస్తున్నామన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తున్నామని, స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఇచ్చిన మాటను నెరవేర్చి పేదల సొంతింటి కలను తీర్చిన ముఖ్యమంత్రి ఒక్క వైయస్ జగన్ తప్ప ఎవరు లేరన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూశామని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకున్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం అమలు చేస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయో అలాంటి కార్యక్రమాలను సీఎం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఏడి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పి వి ఎన్ఎన్ మూర్తి, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మీ నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలని తద్వారా రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు అందించిన సంక్రాంతి కానుకలను సోమవారం ఉదయం ఏయూ జిమ్నాజియం మైదానంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, మనసుతో ఆలోచిస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపే మంచి వ్యక్తిగా విజయసాయి రెడ్డి నిలుస్తారన్నారు. విశాఖ పాత్రికేయుల కుటుంబాలలో తాను ఒక సభ్యునిగా భావించి విజయ సాయి రెడ్డిగారు ఈ సంక్రాంతి కానుకలను అందించడం జరిగిందన్నారు. ఈ కానుకల రూపంలో ఆయన పాత్రికేయులపై తనకున్న ప్రేమను చాటారన్నారు. అందరికీ తల్లిలా నిలచే విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన సూచించిన విధంగా దీనిని ఏర్పాటు చేసామన్నారు.
విశాఖ నగరం అభివృద్ది చెందితే ప్రతీ వ్యక్తి అభివృద్ది చెందడం సాధ్యపడుతుందన్నారు. ఈ పక్రియలో పాత్రికేయులు భాగస్వాములు కావాలని సూచించారు. గతంలో విశాఖ అన్నివిధాలుగా అణగదొక్కబడిందని, నేడు విశాఖ అభివృద్ది చెందుతోందన్నారు. తూర్పు తీరానికి ఆర్ధిక రాజధానిగా విశాఖ నిలుస్తుందన్నారు. సమాజానికి అవసరమైన నిపుణతతో కూడిన విలువైన మానవ వనరులను ఆంధ్రవిశ్వవిద్యాలయం అందిస్తుందన్నారు. 98 వార్డుల పరిధిలోని ప్రతీ పాత్రికేయునికి ఈ సంక్రాంతి కానుకను అందించే విధంగా ఏర్పాట్లు చేసామన్నారు. ఇటీవల నిర్వహించిన వైఎస్‌ఆర్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం అయిందని, దీనికి సహకారం అందించిన పాత్రికేయులకు వీసీ కృతజ్ఞతలు తెలిపారు.
సీనియర్ పాత్రికేయులు లీడర్ పత్రిక సంపాదకులు వి.వి రమణ మూర్తి మాట్లాడుతూ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సైతం విజయసాయి రెడ్డిగారు పాత్రికేయులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై సత్వరం స్పందిస్తూ పరిష్కారానికి ఆయన చొరవ చూపడం జరుగుతోందన్నారు. ఏయూను మహోన్నత శిఖరాలకు తీసుకువెళ్లే దిశగా వీసీ ప్రసాద రెడ్డి కృషిచేస్తున్నారన్నారు.
విజెఎఫ్ అద్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరుకు విజయసాయి రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమానికి సైతం విజయసాయి రెడ్డి విచ్చేసి పాత్రికేయులపై తన అభిమానాన్ని చాటారన్నారు. కార్యక్రమంలో విజెఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఏయూ క్రీడా విభాగ సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్, ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్, ఏయూ గెస్ట్ హౌస్ డీన్ టి.షారోన్ రాజు, విజయసాయి రెడ్డి మీడియా సమన్వయ అధికారి జి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్ట్‌లకు సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు నాగరాజు పట్నాయకర్, దాడి రవికుమార్, గయాజ్, ఎం.ఎస్.ఆర్ ప్రసాద్, ఈశ్వర రావు,శేఖరమంత్రి తదితరులు సమన్వయం చేశారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్టస్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మానవాళిని ఏడాది కాలం పాటు భయబ్రాంతులకు గురి చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న covid 19 వ్యాధికి వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన నగరపాలక సంస్థ పరిధిలోని నారాయణపురం నగరపాలక సంస్థ యు పి హెచ్ స్కూల్ నందు కరోనా వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా 24 మంది వైద్య సిబ్బందికి టీకాలు వేయడం జరిగింది అన్నారు మొదటి దశ టీకాలు వేసే కార్యక్రమం నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 28 నాటికి పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. స్థానికంగా రిసెప్షన్ సెంటర్ అబ్జర్వేషన్ రూమ్ లను ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నిపుణులైన సీనియర్ జూనియర్ వైద్యులను అబ్జర్వేషన్ కొరకు నియమించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన సురక్షితమైన వ్యాధి నిరోధక టీకాలను మాత్రమే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మొదటి డోసు వేసుకున్నాక 28 రోజులలో మరల రెండో ఢొసు అదే కంపెనీకి చెందిన మందును వేయించుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. టీకా వేసుకున్నాక ప్రతి ఒక్కరూ 42 రోజుల పాటు ముఖానికి మాస్క్ ధరించడం చేతులు శుభ్రం చేసుకోవడం భౌతిక దూరాలు పాటించడం వంటివి తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ప్రస్తుతం గర్భిణీలు బాలింతలు క్యాన్సరు హెచ్ఐవి బాధితులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తో బాధపడుతున్నవారు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన పిదప 14 రోజులు తర్వాత టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. టీకా వేయించుకున్న తరువాత 14 రోజులకు ఇమ్యూనిటీ వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోమలి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కు 160 వినతులు అందాయి. వీటిలో ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల, ఆరోగ్య శ్రీ, ఆదరణ, రైతు భరోసా, అమ్మ ఒడి లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్ (ఆసరా) జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతిరావు, విపత్తుల శాఖ ప్రోజెక్ట్ అధికారి పద్మావతి వినతులను అందుకున్నారు. స్పందనలో అందిన వినతులను వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ-సేవలు పెండింగ్ పై సమీక్షిస్తూ పౌర సరఫరాలు, జిల్లా రెవిన్యూ అధికారి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, పోలీస్ శాఖల వద్ద ఎక్కువగా ఊనయని, వాటిని ఈ రోజే క్లియర్ అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయం పట్ల రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ టి.విజయకుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. ఐక్యరాజ్యసమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి తో కలిసి ఆయన మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి, ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. రైతులతో మమేకమై, వారి అభిప్రాయాలను, అనుభవాలను తెలుసుకున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా, స్వయంగా తన క్యాంపు ఆఫీసు ఆవరణలో సైతం ప్రకృతి సేద్యం చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌తో సోమవారం ఉదయం విజయ్‌కుమార్, త్రిపాఠి భేటీ అయ్యారు. క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రకృతి సేద్యాన్ని పరిశీలించి, అభినందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయకుమార్ వెళ్లడించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ విధానాన్ని రైతుకు చేరువ చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహించి, ప్రతీ రైతు బజార్‌లో ప్రత్యేకంగా కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, వారు కలెక్టర్ ను కోరారు. అనంతరం ఎల్‌కోట మండలం మార్లపల్లి వెళ్లి, ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాలను సాగు చేస్తున్న రైతులతో సమావేశమయ్యారు. వారికి పలు సలహాలు సూచనలు అందజేశారు.
జిల్లా పర్యటనలో భాగంగా విజయకుమార్, త్రిపాఠి ఈ నెల 16వ తేదీన వేపాడ మండలంలో బైలాజికల్ లేబ్‌ను, సేంద్రీయ వస్తువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన కురుపాం, జిఎల్‌పురం మండలాల్లోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలు గ్రామాలను వారు సందర్శించారు. 43 గ్రామాలను శతశాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా ప్రకటించారు. సాగు చేస్తున్న రైతులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ పర్యటనలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.ఆశాదేవి, నేచురల్ ఫార్మింగ్ ఏడి ప్రకాశరావు, ఏఓ హేమసుందర్, ఆయా మండలాల వ్యవసాయాధికారులు, ఏడిఏలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలపై ప్రజలను చైతన్యం చేయడం ద్వారా ప్రమాదాల సంఖ్యలను తగ్గించవచ్చునని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం 18 నుంచి ఫ్రబ్రవరి 17 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు సిద్ధం చేసిన వాల్ పోస్టర్ ను ఆయన జాయింట్ కలెక్టర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాసోత్సవాల సమయంలోనే కాకుండా నిత్యం రవాణా శాఖ ప్రమాదాల నియంత్రణంలో కీలక భూమిక వహించాలన్నారు. ముఖ్యంగా కళాశాలలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ట్రాన్స్ పోర్టు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డి ఆర్ వో సిహెచ్.సత్తిబాబు,జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, సీవిల్ సప్లైస్ డీఎం ఇ. లక్ష్మీ రెడ్డి, కాకినాడ ఆర్టీవో ఏజీ. చిన్నికృష్ణ, డిటిసి సిహెచ్.ప్రతాప్, ఆర్ టీవో ఆర్.సురేష్, బీసీ, ఎస్సీ,మైనారిటీ కార్పొరేషన్ ఈడీ లు, మొబైల్ వాహనాల కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీకి ఈ నెల 21న మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు ప్రారంభించనున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీ శ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి లతో కలిసి మొబైల్ డిస్పెన్సరీ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పంపిణీ లో భాగంగా ఇంటివద్దకే ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నదన్నారు.21 న రాష్ట్రస్థాయిలో వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అనంతరం జిల్లాలో కూడా ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దూర ప్రాంతంలో నుంచి వచ్చే వాహనాల లబ్ధిదారులు 20వ తేదీ మధ్యాహ్నం నాటికి కాకినాడ చేరుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గం, మండలాల వారిగా వరుసక్రమంలో వాహనాలు ఏర్పాటు,వాహనాలు మండలాలకు తరలింపులో అవసరమైన రూట్ మ్యాప్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సక్రమంగా అన్నీ ఏర్పాట్లు చేయాలన్నారు. మొబైల్ వాహనాలు మండలాలకు చేరి,లబ్ధిదారులకు ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాహన ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లు పర్యవేక్షణలో మండల హెడ్ కోటర్స్ కు వాహనాలు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈ నెల 20వ తేదీ నాటికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని 100 శాతం పూర్తిచేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజనల్, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్ననవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న పట్టాల పంపిణీపై మంగళవారం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వలంటీర్లు, వీఆర్‌వోలు, సంక్షేమ కార్యదర్శులు ఇలా ఈ కార్యక్రమంతో సంబంధమున్న సిబ్బందిలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన రేషన్ సరకుల పంపిణీ వాహనాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి వాహనానికి ప్రత్యేకంగా ఓ నోడల్ వీఆర్‌వోను అనుసంధానించినట్లు తెలిపారు. సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వం తొలుత 968 బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటికోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం కింద భూముల రీసర్వే ప్రక్రియ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశానికి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 37 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు చెందినవి 7 కాగా, పౌర సరఫరాల శాఖకు చెందినవి 7 వినతులు కాగా ఇతర శాఖలకు సంబంధించినవి 23 వినతులు ఉన్నాయని డిఆర్ఓ తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రజలు తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదలాయించి వాటికి వారంరోజుల్లో పరిష్కారం చూపించాల్సింది ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ నుండి చలమయ్య, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయం వద్ద 32వ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టరును విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి వారికి రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తామన్నారు. రహదారి ప్రమాదాలలో ప్రాణ నష్టం సంభవించడం దురదృష్టకరమని అన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి వుండాలని, నిబంధనలను తప్పని సరిగా పాటించాలని అన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని తెలిపారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఏఎస్పీ విఠలేశ్వర రావు, ఏఎస్పీ సోమశేఖర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, ట్రాఫిక్ ఎ.స్ఐ. లక్ష్మణ్ రావు, రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి. జగన్మోహన్ రావు, ప్రజా రావాణా శాఖ డిప్యూటీ సి.టి.ఎం. జి.వరలక్ష్మి, ఆటో డ్రైవర్లు, హీరో షో రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంపుదల నేపథ్యంలో 3రోజులపాటు ఆందప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దూర దృశ్య సమావేశాల ద్వారా చేపట్టిందని ఏపీఈపిడిసిఎల్ ఎస్ఈ టివిఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. తొలిరోజైన సోమవారం విశాఖపట్నం సిఎండి కార్యాలయము నుంచి సిఎండి నాగలక్ష్మీ సెల్వారాజన్ నిర్వహించిన బహిరంగ ప్రజాబిప్రాయ సేకరణ దూర దృశ్య సమాశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 20 వరకు ఏ డిస్కమ్ పరిధిలోని వారైనా ఆన్‌లైన్ పాల్గొనవచ్చునన్నారు. రాష్ట్రంలో మూడు డిస్కమ్‌లైన తూర్పు, దక్షిణ కేంద్ర పంపిణిలు ఈ ధపా ప్రజాబిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 2020-21 వార్షిక సంవత్సరం ఆదాయం అవసర నివేదికలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయన్నారు. కోవిడ్-19 మూలంగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు పనిచేయనికారణంగా ఆదాయాలు తగ్గాయన్నారు. తదనుగుణంగా వార్షికా ఆదాయం కూడా బాగా తగ్గిందన్నారు. 2020-21 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు, ఇతర ఆదాయాలు రూపంలో డిస్కమ్‌లు ఆశించిన స్దాయిలో ఆదాయం సమకూరలేదన్నారు. కాని 2020-21 లో అనుభవాలు, పెరిగిన ఖర్చులు విద్యుత్ వినియోగం పెరిగిన అంచనా నేపధ్యంలో 2021-22లో కూడా ఆప్రబావం ఉంటుందన్నారు. 2021-22 ఆర్దిక సంవత్సరం వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై ఆంధప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి నాగార్జునరెడ్డి మరియు మండలి సభ్యులు పి. రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్, రాంసింగ్ నేతృత్వంలో వినియోగదారులను నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరిస్తున్నారని ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటిగంటవరకు మరలా మధ్యాహ్నాం రెండు గంటలనుంచి సాయాంత్రం 4.30 గంటలకు ప్రజాభిప్రాయాలను స్వీకరించడం జరుగుతోందన్నారు. విద్యుత్ చార్జీలకు సంబందించి డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ ఈ ధపా పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపట్టాలని ఎ.పి విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిందన్నారు. కోవిడ్-19 దృష్టిలోవుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే సమయంలో దీనివల్ల గతానికి భిన్నంగా విస్తృతస్దాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలవుతునందని మండలి చైర్మన్ జస్టిస్ సి.వి నాగార్జునరెడ్డి తెలిపారన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గోన దలచినవారు ముందుగా ఇప్పటికే తమ తమ పేరు నమోదు చేసుకున్నారని వీరికి ఈ మూడు రోజులలో స్లాట్ ఇవ్వడం జరిగిందన్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ద పరిధిలో సుమారు 52 మందికి స్లాట్లు ఇవ్వడం జరిగిందన్నారు. మన జిల్లా నుంచి ఆరు గురు ఉన్నారన్నారు. ఈ పక్రియను ఇంటోనే వుండి ప్రత్యక్షముగా తిలకించేందుకు ఒక ఇమెయిల్ Www.eliveevents.com./ apercpublichearing
లింకు రూపొందించడం జరిగిందన్నారు. విద్యుత్ టారీఫ్ రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరో కొద్దిమంది కాకుండా ఆసక్తి వున్న వారెవరైనా పాల్గొనేందుకు అవకాశం లబించిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక ఇంజనీరు కె తిలర్ కుమార్. సీనియరు ఎకౌంట్సు అధికారి వి.వి.ఎస్.ఎన్ వరప్రసాద్ ట్రాన్సుపార్మర్లు డివిజనల్ ఇంజనీరు పి వెంకటేశ్వర్లు ఉప కార్యనిర్వహక ఇంజనీరు నటరాజన్ , ( రెవిన్యూ) సహాయ అధికారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబరులో 32వ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టరును విడుదల చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకు ముఖ్యంగా యువతకు రహదారి భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. కాలేజీలు, విద్యాసంస్థలలో విద్యార్ధులకు సైతం అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ట్రక్ డ్రైవర్లను సైతం భాగస్వాములను చేయనున్నామన్నారు. జిల్లాలో 120 కి.మీ.ల హైవే వున్నదని, రహదారి ప్రమాదాలలో ప్రాణ నష్టం జరుగకూడదని, ఇందు నిమిత్తం ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి వుండడంతో పాటు నిబంధనలను పాటించాలని అన్నారు.
రవాణా శాఖ ఉప కమీషనరు డా. వి.సుందర్ మాట్లాడుతూ, ప్రతీ ఏటా రహదారి ప్రమాదాల నివారణపై నెల రోజుల పాటు రహదారి మాసోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రమాదాలలో జీవితాలను కోల్పోయే పరిస్థితులు రాకూడదన్నారు. ప్రజలకు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కలిగించవలసి వుందన్నారు. ఆటో డ్రైవర్లకు, కాలేజీ విద్యార్ధులకు రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తామని, డ్రైవర్లకు హెల్త్ చెక్ అప్ చేస్తామని తెలిపారు. బి.పి., షుగర్, కంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు రహదారి ప్రమాదాలపై రోజు వారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం, *సురక్షితమైన రహదారి మీ జీవితానికి రక్ష* అనే నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రహదారి భద్రతపై పోస్టర్లను, ఫాంఫెట్లను విడుదల చేసారు.
ఈ కార్యక్రమానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎం.వేణుగోపాల రావు, ప్రసాద రెడ్డి, సాయిరామ్, శశి, పి.శివరాం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక పోరాటం చేపడుతుందని అధ్యక్షులు బంగారు అశోక్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల మనుగడకే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టుల తరపున పోరాటం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతోపాటు, సమాచార శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని కమిటీలో నిర్ణయించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతోపాటు, వారి సమస్యలపైనా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టుల ప్రాధమిక హక్కు అయిన అక్రిడిటేషన్ విషయంలో దేశరాజధాని ఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో కూడా లేని నిబంధనలు రాష్ట్రప్రభుత్వంలోని సమాచార శాఖ అమలు చేయాడం వలన చాలా మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రిడిటేషన్లు మంజూరు అయ్యేంత వరకూ తమ పోరాటం ఆపేది లేదని అశోక్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రతీ జర్నలిస్టు నడుం బిగించాలని అశోక్ పిలుపునిచ్చారు.