1 ENS Live Breaking News

యువత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి..

యువత తమకు నచ్చిన ఆలోచన మేరకు ఆరంగాన్నే ఎంచుకుని  పట్టుదలతో ఎదగాలని,  సమాజంలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త అన్నారు. ప్రేరణ యూత్ టాలెంట్ ఫెస్టివల్ 2021 ఎస్.వి. ఇంజినీరింగ్ కళాశాల ఆతిద్యంతో నెహ్రూ యువ కేంద్రం, సెట్విన్ ఆద్వర్యం లో రెండు రోజులు   ఈ నెల 19,20 న నిర్వహించనున్న సంధర్భంగా జిల్లా కలెక్టర్  ముఖ్య అతిధిగా, ప్రత్యేక అతిధిగా ఎం.ఎల్.సి యండవల్లి శ్రీనివాసుల రెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభిచారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ యువజన వారోత్సవాల అనేది యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వివిధ రకాల పోటీలను నిర్వహించడంతో పాటు. ఆయా రంగాల్లో విజేతలైన వారిని ప్రస్తుత తరంతో అనుసంధానించడానికి మరియు స్ఫూర్తి పరచడానికి "ప్రేరణ" అనే కార్యక్రమాన్ని నేడు  19, రేపు 20 తారీకున శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల తిరుపతి నందు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా యూత్ పార్లమెంట్ ,సైన్స్ ఎక్స్పో ,ఆర్ట్ ఎగ్జిబిషన్ ,కల్చరల్ ఫెస్ట్ ,షార్ట్ ఫిలిం కాంటెస్ట్, సివిల్ సర్వీసెస్ అవేర్నెస్, యువ రచయితల సమ్మేళనం ,సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీట్ తదితర కార్యక్రమాలను నెహ్రూ యువ కేంద్ర మరియు సెట్విన్ వారి సౌజన్యంతో జరగనున్నదని అన్నారు. తన తండ్రి ఆశయం మేరకు డాక్టర్, ఆతరువాత  కలెక్టర్ అయ్యానని , మనకు ఏ రంగంలో ఆలోచన వస్తే వెంటనే దాన్ని ఎంచుకుని సాధించాలని అన్నారు. ఎం.బి.బి.ఎస్ రెండవ సంవత్సరం నుండే పది మంది పేదలకు సాయం చేయగలం అనే ఆశయంతో సివిల్స్ చదువుతూ రావడం జరిగిందని, మొదటి సారె 70 వ రాంకు, రాష్ట్రంలో మొదటి ర్యాంకు అందుకున్నానని తెలిపారు. యువతతో కలెక్టర్  ముఖాముఖీ నిర్వహించి సందేహాలను తీర్చారు. ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే మానవ వనరులు, 75 శాతం   యువత కలిగిన దేశం మన భారత దేశమని దేశ అభివృద్ధి అనేది యువతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కోవిడ్ తో 2020 దౌర్భాగ్య సంవత్సరంగా మిగిలిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు వైద్య, విద్య, వ్యవసాయం పై దృష్టి పెట్టారని శుభ పరిణామమని అన్నారు. గాంధీజీ , అంబేద్కర్ ఆశయాల మేరకు యువత కుల మతాలకు అతీతంగా ఉండాలని అన్నారు. దేశంలో 2022 నాటికి స్కిల్డ్ యువత 15 కోట్ల మంది అవసరం ఉందని ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతతో ముందడుగు వేయాలని ఈ లెక్కలన్నీ ఎకనామిక్ ఫోరం  చెపుతున్నదని తెలిపారు.నేడు 40 శాతం యువత గతం గురించి, మరో 40 శాతం భవిష్యత్ , 8 శాతం అనవసర విషయాలపై ఆలోచన, మిగిలిన 4 శాతం మంది మాత్రమే అవసరాలకనుగుణంగా సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. యువత రాజకీయాల్లో రాణిచడం, మేధావులు కావాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నోవేషన్స్ ఇన్ స్టంట్ ఐడి కార్డు స్టార్టప్  విధానం వివరించారు. సంవేదన పేరుతో రక్తదానం బ్రోచర్ ను రిలీజ్ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, నెహ్రూ యువ కేంద్ర కొఆర్డినేటర్ ప్రదీప్, సెట్విన్ సి.ఇ.ఓ మురళీకృష్ణా రెడ్డి, కళాశాల ప్రినిసిపాల్స్  సుధాకర్ రెడ్డి, కల్పలత, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 

Tirupati

2021-01-19 19:50:13

ఫిబ్రవరి 1 నుంచే ఇంటికే రేషన్ సరుకులు..

 బియ్యం కార్డుదారులందరికి  ఫిబ్రవరి 1 నుండి ఇంటివద్దకే వాహనాల ద్వారా రేషన్ అందించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరు కున్నాయని ,  ఈ నెల 21 న  పిటిసి లో లబ్దిదారులందరికి వాహనాలను కేటాయించనున్నట్లు తెలిపారు.   మంగళ వారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో  జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, అదనపు ఎస్.పి శ్రీ దేవి రావు  తో కలసి పాత్రికేయుల సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి   రేషన్ సరఫరా కోసం  జిల్లాకు 458 వాహనాలను కేటాయించడం జరిగిందన్నారు.   ఈ వాహనాల ద్వారా జిల్లాలోని  778 సచివాలయాల పరిధి లో నున్న 1407 రేషన్ దుకాణాల నుండి  ఇంటింటికి రేషన్ అందజేయడం జరుగుతుందని,  ప్రతి వాహనం ద్వారా  సుమారు 1500  కార్డు దారులకు సరఫరా చేస్తారన్నారు.           లబ్ది దారుల ఎంపిక రిజర్వేషన్ ప్రకారంగా  పారదర్శకంగా జరిగిందని, మండల స్థాయి స్క్రీనింగ్  కమిటి ఎంపిక చేసిన వారి జాబితాలను జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు ఆమోదించిన తర్వాత  లబ్ది దారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.           వాహనాలను నడిపే  ప్రతి ఆపరేటర్ కు  ఒక వి.ఆర్.ఓ ను నోడల్ అధికారిగా డిజిగ్నేట్ చేయడం జరిగిందని, వీరి పర్యవేక్షణ లో రేషన్  సరఫరా  జరుగుతుందని తెలిపారు. ఆపరేటర్లకు టి షర్టు లను ఏక రూప దుస్తులుగా ఇవ్వడం జరుగుతుందని,  ప్రతి వాహనం రిజిస్ట్రేషన్, ఇన్సురెన్సు , బ్యాంకు ఋణం,  తదితర అవసరాలను సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) వారు పర్యవేక్షిస్తారని అన్నారు.  పంపిణీ విధానం, ఈ పోస్, తూకం, ఇంటర్ నెట్ వినియోగం తదితర అంశాల పై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆపరేటర్ లు గ్రామాల్లో నున్న డీలర్ లు , వాలంటీర్ ల తోపరిచయాలు చేసుకొని రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారని,  పంపిణీ కి ఒక రోజు ముందే మెటీరియల్ అందజేయడం జరుగుతుందని  అన్నారు.   కోవిడ్ నిబంధనలతో శంబర జాతర: ఈ నెల 25, 26 తేదీలలో జరిగే శంబర పోలమాంబ జాతర కోవిడ్ నిబంధనలతో జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  ఇప్పటికి కోవిడ్ కేసు లు నమోదవుతున్నందున ప్రతి ఒక్కరు తప్ప కుండ మాస్క్ వాడాలని, భౌతిక దురాన్ని పాటించాలని అన్నారు.  దేవస్థానం సిబ్బంది క్యూ లైన్ లలో సనిటైసేర్లను  ఇవ్వాలని  అన్నారు.    భక్తులు పరిమిత సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తు ప్రచారం చెయ్యడం జరుగుతుందన్నారు.  మొక్కుబడులున్న వారు మాత్రమే దర్శనాలకు రావలని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నారు.  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి  బందోబస్త్, బారికేడింగ్  తదితర ఏర్పాట్లను పోలీస్ శాఖ చేస్తుందన్నారు.           ఈ పత్రికా  సమావేశం లో  జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, పౌర సంబంధాల  సహాయ సంచాలకులు డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-19 19:46:34

ఎన్నికల సంఘం అవార్డుకి కలెక్టర్ హరిజవహర్ లాల్..

 ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను, సామాజిక కార్య‌క్ర‌మాల‌ను స‌మర్ధ‌వంతంగా అమ‌లు చేస్తూ ప‌లు సంస్థ‌ల నుండి ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు అందుకున్న జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మ‌రో అవార్డుకు ఎంపిక‌య్యారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 25న జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా ఇచ్చే అవార్డుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ఎంపిక‌య్యారు. రాష్ట్రస్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం అవార్డుకు ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ సి.ఇ.ఓ. కార్యాల‌యం నుండి జిల్లా యంత్రాంగానికి స‌మాచార అందింది. త‌న నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లుచేసి ఓట‌ర్ల జాబితాలో స‌వ‌ర‌ణ‌ల‌కు సంబంధించిన వచ్చిన ద‌రఖాస్తుల‌న్నింటినీ ప‌రిష్క‌రించ‌డం, రాజ‌కీయ పార్టీల‌తో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మంపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించి వారికి తెలియ‌జేసి వారి స‌హ‌కారంతో జిల్లాలో ఎన్నిక‌ల జాబితా స‌వ‌ర‌ణ‌లు ప‌క‌డ్బందీగా చేప‌ట్ట‌డం, ప్ర‌తి నెల క్ర‌మం త‌ప్ప‌కుండా ఇ.వి.ఎం.ల గోదాముల్ని త‌నిఖీచేసి ఓటింగ్ యంత్రాల భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, బి.ఎల్‌.ఓ. నియామ‌కాలు చేప‌ట్టి ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించినందుకు ఎన్నిక‌ల సంఘం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇప్ప‌టికే ఈ ఏడాది కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ నుండి జ‌ల సంర‌క్ష‌ణ అవార్డు, స్కోచ్ అవార్డులు వంటి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు కైవ‌సం చేసుకున్న జిల్లా క‌లెక్ట‌ర్ ఈసారి రాజ్యాంగ బ‌ద్ద సంస్థ అయిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుండి ప్ర‌తిష్ట‌త్మ‌క  అవార్డు అందుకోనున్నారు. విజ‌య‌వాడ‌లో ఈనెల 25న ఈ అవార్డు అంద‌జేస్తారు. ఎన్నిక‌ల సంఘం అవార్డుకు ఎంపికైన జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ను జాయింట్ క‌లెక్ట‌ర్‌లు డా.కిషోర్ కుమార్‌, డా.మ‌హేష్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ జె.డి. ఎం.వి.ఏ.న‌ర్శింహులు, స‌మాచార శాఖ ఏ.డి. డి.ర‌మేష్‌, ఎన్‌.జి.ఓ. జ‌గ‌దీష్‌బాబు, క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఏ.ఓ. సూప‌రింటెండెంట్‌లు, ఉద్యోగులు అభినందించి పుష్ప‌గుచ్ఛాల‌తో స‌త్క‌రించారు. జిల్లా క‌లెక్ట‌ర్ నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిద‌ర్శనంగా ఈ అవార్డు నిలుస్తుంద‌ని జె.సి. డా.కిషోర్ కుమార్ అన్నారు.

Vizianagaram

2021-01-19 19:43:49

రక్త నిల్వలు వినియోగించుకోవాలి..

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీకాకుళం శాఖ బ్లడ్ బ్యాంకులో ఉన్న రక్త నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్  పి. జగన్మోహన రావు  తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బ్లడ్ బ్యాంకులోని రక్తనిల్వల  వివరాలను తెలియజేశారు. ఓ పాజిటివ్ : 122, ఏ పాజిటివ్ :  123,  బి పాజిటివ్ : 92,     ఏబి పాజిటివ్ : 27,  ఓ నెగిటివ్ : 05, ఏ నెగిటివ్: 04, బి నెగిటివ్: 05, ఏబి నెగిటివ్ : 03,  ప్లేట్లెట్స్:24  రక్త గ్రూపులు అందుబాటులో ఉన్నాయని తలసేమియా, సికిలిసెల్ అనీమియా, గ్రాస్ అనీమియా, డయాలసిస్, కాన్సర్, గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తం అవసరమగు  రోగులకు ఉచితంగా పైన తెలిపిన బ్లడ్ యూనిట్స్ ఉన్నంతవరకు ఇస్తున్నామని మరియు ఇతర ప్రైవేటు హాస్పిటల్లలో ఉన్న రక్తం అవసరమగు రోగులకు డోనార్ ని అడగకుండా వారికి కావలసిన రక్త యూనిట్ లను  అందచేస్తున్నామని ఆయన వివరించారు.

Srikakulam

2021-01-19 19:40:14

మత్య్సకారులు సంయనం పాటించాలి..

సాంకేతిక నివేదిక వచ్చేంత వరకు ఇరు వర్గాల మత్య్సకారులు సంయనం పాటించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  మంగళవారం  సర్క్యూట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హ లతో కలసి రింగు వలలు, గిల్ నెట్ (సాంప్రదాయ మత్య్సకారుల మధ్య వివాద పరిష్కారంపై సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివాద పరిష్కారం కోసం టెక్నికల్ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత తగు నిర్ణయం ఉంటుందని, అంత వరకు ఇరు వర్గాల మత్య్సకారులు సంవయంనం పాటించాలని, ప్రభుత్వ ఉత్తరవులనల గౌరవించాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో దక్షిణ నియోజక వర్గం శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్-1 ఎం. వేణుగోపాల్ రెడ్డి, మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు డా. ఫణి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-19 19:27:37

ప్రభుత్వ శాఖల్లో మంచిసేవలు అందించాలి..

ఆయా శాఖలలో నియమించిన వారంతా మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సూచించారు.  మంగళవారం సర్క్యూట్ హౌస్ లో విభిన్న ప్రతిభా వంతులకు ఆయన 14 మందికి నియామక పత్రాలు అందజేశారు.  ఆయా శాఖలలో నియమించిన వారంతా  మంచి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇందులో జూనియర్ సహాయకులుగా ఐదు (5), టైపిస్టులుగా రెండు (2), ఆఫీసు సబార్డినేట్ లుగా రెండు (2), స్వీపర్ ఒకటి (1), వాచ్మెన్ ఒకటి (1), క్లీనర్ కమ్ స్వీపర్ ఒకటి (1), మజ్దూర్ ఒకటి (1), పిహెచ్ వర్కర్ ఒకటి (1) ఆయా ప్రభుత్వ శాఖలలో నియమించినట్లు ఆయన తెలిపారు. ఇందులో డి.ఎస్.సి. గ్రూప్ - 4 క్రింద 7 పోస్టులు, ఒ.డి.ఎస్సి. క్లాస్ - 4 క్రింద 7 పోస్టులు నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జివిఆర్ శర్మ పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-19 19:21:34

విద్యార్ధుల్లో మార్పు కోసమే నాడు-నేడు..

విద్యార్ధుల అలవాట్లలో మంచి మార్పు కోసమే నాడు-నేడు కార్యక్రమమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో  మండల అభివృధ్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులతో నాడు-నేడు పనుల పురోగతిపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  పాఠశాలలలో పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, మేజర్, మైనర్ రిపేర్లు, యూరినల్ బౌల్స్ అమరికి తదతర అంశాలపై సమీక్షించారు. వెస్టర్న్ టాయిలెట్స్,  వాడకం ద్వారా పిల్లలలో మంచి ఆరోగ్యకరమైన మార్పు వస్తుందన్నారు.  టాయ్ లెట్లను పరిశుభ్రంగా నిర్వహించాలన్నారు.  అమ్మ ఒడి  మొత్తం నుంచి వెయ్యేసి  రూపాయలను టాయ్ లెట్ మెయింటినెన్స్ కోసం ఖర్చు చేయాలన్నారు. మేజరు, మైనర్ మరమ్మత్తులను పూర్తి చేయాలని పూర్తయిన వాటి ఫోటోలను పంపించాలని చెప్పారు.  పాఠశాలలలో ఎలక్ర్టిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.   పాఠశాల లోపల, బయట పెయింటింగ్  జాగ్రత్తగా  వేయాలన్నారు. పెయింటర్లకు శిక్షణ నివ్వాలన్నారు. బయట మెషిన్ తోను, లోపల రోలర్ తోను పెయింట్ వేయాలన్నారు. కె.జి.బి.వి. పాఠశాలలలో ఆర్.ఓ. ప్లాంట్లను అమర్చాలన్నారు. కాంపౌండ్ వాల్స్ ఈ నెలాఖరునాటికి పనులను పూర్తి చేయాలని తెలిపారు.  ఎం.ఇ.ఓ.లు, ఎ.ఇ.లు శ్రధ్ధ వహించాలన్నారు. ఉపాధిహామీ పనుల పురోగతిపై సమీక్షిస్తూ, బి.టి.రోడ్లు, సి.సి.రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల నిర్మాణం  తదితర ఇంజనీరింగు పనులపై మండలవారీగా లక్ష్యాలతో ప్రగతి సాధించాలన్నారు. మండలంలో వారానికి ఒక కిలో మీటరు చొప్పున రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. శత శాతం పురోగతి కనిపించాలన్నారు. నిర్మాణాలలో పురోగతి కనపడాలన్నారు.  నిర్ధుష్ట ప్రణాళికతో పనులను పూర్తి చేయాలని తెలిపారు.                  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. కె.భాస్కర్, ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి.రామారావు, బి.సి.కార్పోరేషన్ ఇ.డి.రాజారావు, ఫిషరీస్ జె.డి.శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఇ.ఇ. మురళి, డిప్లూటీ డి.ఇ.ఓ.లు పగడాలమ్మ, విజయకుమారి,  ఆర్.డబ్ల్యు.ఎస్.  ఎస్.ఇ. శ్రీనివాసరావు, డి.ఇ.లు, ఎ.ఇ.లు తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-19 19:15:53

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి..

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్లు సరుకులను సకాలంలో కార్డుదారులకు అందజేయాలని, అలాగే డీలర్లు లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి వీలైనంత వరకు పరిష్కరించేందుకు కృషిచేస్తామని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జె.సి అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా రేషన్ డీలర్ల సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ  జిల్లాలోని రేషన్ డీలర్లు లేవనెత్తిన స్టాక్ బ్యాలెన్స్ కు, ఇ-పాస్ లోని బ్యాలెన్స్ కు వ్యత్సాసానికి గల కారణాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే వాలంటీర్ల పొరపాట్ల వలన డీలర్లకు అన్యాయం జరుగుతుందనే విషయమై పరిశీలిస్తామని అన్నారు. జిల్లాలో నిజాయితీగా పనిచేసే డీలర్లను అభినందిస్తూనే , తప్పుడు లెక్కలు చూపే డీలర్లపై చర్యలు తప్పవని స్పష్టం చేసారు. రేషన్ డీలర్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టాలని,  డీలర్ల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వ నిర్ణయం మేరకు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని చెప్పారు.          ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు,  జిల్లా పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ , శ్రీకాకుళం జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్.సూర్యారావు, ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి వి.భాస్కరరావు, కోశాధికారి కె.సత్యనారాయణ, డీలర్లు గంగు శిమ్మయ్య, వై.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-19 18:59:04

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం..

శ్రీకాకుళం జిల్లాలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భారీ వాక్తాన్ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి  అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) వి.పి.విఠలేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వాక్తాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ప్రస్తుతం 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సావాలను నిర్వహించుకుంటున్నామని, జిల్లాలో  ఏ ఒక్కరూ  వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పొకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు.  ద్విచక్ర , త్రిచక్ర,  కార్లు మరియు బారీ వాహనాలు నడిపే డ్రైవర్లు  మధ్యం సేవించి  వాహనాలను నడపరాదని పేర్కొన్నారు. తద్వారా ప్రమాదాలు జరిగి వారితో పాటు వారి కుటుంబాలు కూడా రోడ్డున పడతాయనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వలన ఎటువంటి ప్రమాదాలు జరగవని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,   హెల్మెట్ ధరించడం వలన  తమతో పాటు తమ కుటుంబానికి మంచి రక్షణ కవచంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వారికి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, అంతేకాకుండా భారీమొత్తంలో అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండబోదని తెలిపారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం 2019 సం.లో జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ పొందిన అప్పల రాజు,  కబాడ్డీ పోటీలలో గోల్డ్ మెడల్ పొందిన  హేమ మరియు  ఈశ్వరరావు తదితరులకు  జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డి.ఎస్.పి ప్రసాదరావు, నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య,  వన్ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సి.అంబేద్కర్, టు టౌన్  సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి.వి.రమణ, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, సీనియర్ పాత్రికేయులు యస్.జోగినాయుడు, పోలీసు సిబ్బంది, విద్యార్థి విద్యార్థినులు  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-19 18:56:40

21న రేషన్ రవాణా ట్రక్కుల పంపిణీ..

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ సరుకుల రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 21న జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. రవాణా ట్రక్కుల పంపిణీ జరగనున్న కోడి రామమూర్తి స్టేడియంను మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పారు. ఉదయం11 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో 530 ట్రక్కులను పంపిణీ జరుగుతుందని, వాహనాలు ఆర్.టి.సి కాంప్లెక్స్, బలగ, రిమ్స్ రహదారి గుండా వాహనాలు ఊరేగింపుగా వెళ్ళి అర్ట్స్ కళాశాల మీదుగా మరల కోడి రామమూర్తి స్టేడియం చేరుకుంటాయని ఆయన వివరించారు. రవాణా ట్రక్కులతో ఫిబ్రవరి 1వ తేదీ నుండి రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ జరుగుతుందని తెలిపారు. 21వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 22, 23 తేదీల్లో సంబంధింత మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓల పర్యవేక్షణలో మండలాలకు చేరుకుంటుంది చెప్పారు. 27 నుండి 30వ తేదీ వరకు మండలాల్లో రూట్లను పరిశీలించి అవగాహన పొందుతారని తెలిపారు. ఇప్పటికే ట్రయల్ రన్ జరుగుతుందని అన్నారు. 20వ తేదీన వాహన లబ్ధిదారులకు ఉదయం 9 గంటల నుండి జిల్లా పరిషత్ లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 530 వాహనాలకు గాను 4 వందల మంది బిసి, 14 మంది ఓబీసీ లబ్ధిదారులు, 72 మంది ఎస్సీ, 43 మంది ఎస్టీ, ఒక మైనారిటీ లబ్దిదారు ఉన్నారని వివరించారు.       జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఒక రవాణా వాహనం రోజుకు 90 గృహాలకు రేషన్ సరఫరా చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒక వాహనాన్ని 2 చౌక దుకాణాలు, ఒక గ్రామ సచివాలయానికి అనుసంధానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒక వాహనం సరాసరిన 18 రోజుల పాటు పనిచేయనుందని చెప్పారు.                ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ కిషోర్, డిఎస్పీ సి హెచ్ జీవికె ప్రసాద్, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి కె.రామారావు, డిఎస్ఓ డి.వి.రమణ, పౌర సరఫరాల సంస్థ డిఎం ఏ.కృష్ణారావు, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, ఉద్యాన సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-19 18:54:33

కరోనా వేక్సిన్ పై లేని అపోహలొద్దు..

యావత్ ప్రపంచాన్ని ఏడాది కాలం పాటు భయబ్రాంతులకు గురి చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న covid 19 వైరస్ కి వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని ప్రముఖ సంఘ సేవకులు, ధానకర్త సానారాధ పేర్కొన్నారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖజిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ద్వారా వేస్తున్న కరోనా వేక్సిన్ ను ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా వేక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించుకోవాలని సూచించారు. పూర్తిగా ఆరోగ్యదాయమని రుజువైన తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని ప్రజలకు అందిస్తుందని గమనించాలన్నారు. నిపుణులైన సీనియర్, జూనియర్ వైద్యుల పర్యవేక్షణలో ప్రభుత్వం నియమించి ప్రత్యేకంగా వీటిని ప్రజలకు ఈ వేక్సిన్ ను అందిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన సురక్షితమైన వ్యాధి నిరోధక టీకాలను మాత్రమే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని ఆమె వివరించారు. మొదటి డోసు వేసుకున్నాక 28 రోజులలో మరల రెండో ఢొసు అదే కంపెనీకి చెందిన మందును వేయించుకోవాలి ఆమె స్పష్టం చేశారు. టీకా వేసుకున్నాక ప్రతి ఒక్కరూ 42 రోజుల పాటు ముఖానికి మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాలు  పాటించడం వంటివి తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ప్రస్తుతం గర్భిణీలు బాలింతలు క్యాన్సరు హెచ్ఐవి బాధితులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తో  బాధపడుతున్నవారు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన పిదప 14 రోజులు తర్వాత టీకా తీసుకోవాలని ఆమె కోరారు. టీకా వేయించుకున్న తరువాత 14 రోజులకు ఇమ్యూనిటీ వస్తుందని ఆమె చెప్పారు. ఈ వేక్సిన్ ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కరోనా రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని సానారాధ పిలుపునిచ్చారు.

Visakhapatnam

2021-01-19 12:42:16

కొత్తకాలనీల్లో సచివాలయ సిబ్బంది కీలకం..

జగనన్న కాలనీల నిర్మాణంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీల పాత్ర కీలకమైనదని నగరపాలక సంస్థ కమీషనకు పి.నల్లనయ్య పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పేదలందరికీ ఇళ్ళు-వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీలకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయీ శిక్షణా కార్యక్రమం జరిగింది.  గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయిలో రెండురోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య విచ్చేసారు. ఈ సందర్భంగా కమీషనరు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యాక్రమం జగనన్న కాలనీల నిర్మాణ కార్యక్రమమని అన్నారు.   ఇళ్ళ నిర్మాణంలో వీరి పాత్ర  కీలకమైనదన్నారు.  నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ఇండెంట్, మెటీరియల్ పంపిణీ, ఎం.బుక్ రికార్డింగ్, పేమెంట్స్, తదితర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. హౌస్ నిర్మాణంలో ఉన్న అంగీకార పత్రాలు తీసుకోవటంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ శిక్షణ పొందినవారు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేయాలి అన్నారు.  ఈ శిక్షణ కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్, ఇ.ఇ. కూర్మి నాయుడు, డి.ఎల్.డి.ఓ.  అలివేలు మంగమ్మ, డిప్యూటీ ఇ.ఇ. కె.వి.డి.నాగేశ్వర రావు, ఎ.ఇ.లు, గార ఎం.పి.డి.ఓ.  రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీస్, తదితరులు హాజరైనారు.

Srikakulam

2021-01-18 21:14:03

గణతంత్ర దినోత్సవానికి పక్కాఏర్పాట్లు..

భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సోమ వారం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 26వ తేదీ ఉదయం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భారత గణతంత్ర దినోత్సంను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ నిర్వహణకు మైదానాన్ని సిద్దం చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. మైదానంలో తాగు తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని నగరపాలక సంస్ధ కమీషనర్ ను ఆయన ఆదేశించారు.  అభివృద్ధి సంక్షేమ శాఖలు తమ శాఖల ప్రగతిని తెలియజేసే ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ, అటవీ శాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమం, ఎస్.సి, బి.సి సంక్షేమం, రహదారి భద్రత –పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్యా, వైద్య శాఖలు ప్రదర్శన శకటాలను సిద్ధం చేయాలని, శాఖల ప్రగతిని తెలియజేసే ప్రదర్శన శాలలను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవం నిర్వహించే మైదానంలో ఉదయం నిర్వహించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. 22 నాటికి ప్రశంసా పత్రాలకు జాబితాలు సమర్పించాలి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలకు జాబితాను ఈ నెల 22వ తేదీలోగా సమర్పించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిభ ప్రశంసా పత్రాలు అందుకునే వారు ఉత్తమ ఉద్యోగులుగా ఉండాలని, ఇతర ఉద్యోగులకు ప్రేరణ కలగాలని అన్నారు. ఉద్యోగుల పేర్లతోపాటు వారు ఏ విధంగా ప్రశంసా పత్రానికి అర్హులో తెలియజేస్తూ వివరణ విధిగా సమర్పించాలని ఆదేశించారు. ప్రశంసా పత్రం పొందినవారికి సార్ధకత ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, డిప్యూటి పోలీసు సూపరింటిండెంట్ ఎన్.ఎస్.ఎస్.శేఖర్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాస రావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.గోపాల కృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు, క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.ఏ.ఈశ్వర రావు, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కే.రామారావు, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎల్.వేణుగోపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ వి.లక్ష్మి, సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ అధికారి వై.యశోదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-18 20:57:40

విఆర్వో సంఘం కేలండర్ ఆవిష్కరణ..

గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డైరీని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ను జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆవిష్కరించగా, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు టేబుల్ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఏ.ప్రసాద్, పరిపాలనాధికారి జే.వి.ఎస్.ఎస్.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఇంకా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్లె శ్రీరామ్మూర్తి, జిల్లా అధ్యక్షులు  ఎస్.జె. రామకాసు, ప్రధాన కార్యదర్శి గాలి పేతూరు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దేవరాజు, రాష్ట్ర కోశాధికారి అనంతరామయ్య, జిల్లా మీడియా సెక్రటరీ ఎ.వి.సుబ్బారావు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆదిత్యవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారికి గ్రామ విఆర్వోల సమస్యల పట్ల మెమోరాండం సమర్పించడం జరిగిందని దానిపై సానుకూలంగా స్పందించారని రామ రామకాసు తెలియజేస్తూ కలెక్టర్ వారికి జిల్లాసంఘం తరపున ధన్యవాదములు తెలియజేశారు.

Visakhapatnam

2021-01-18 18:28:22

రెవిన్యూ అసోసియేషన్ కేలండర్ ఆవిష్కరణ..

 విజయనగరం జిల్లాలో రెవిన్యూ అసోసియేషన్  ముద్రించిన  డైరీ-2021, క్యాలెండరు ను  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్  సోమవారం కల్లెక్టరేట్ ఆడిటోరియం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేలండర్ రూపకల్పన బాగుందన్నారు. అదే సమయంలో రెవిన్యూ అధికారులు సేవలు కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అందించడంలోనూ ద్రుష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  విపత్తుల శాఖ ప్రాజెక్ట్ అధికారి పద్మావతి పాల్గొన్నారు. అనంతరం  జిల్లా రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు తాడ్డి గోవిందు, కార్యదర్శి జి. శ్రీరామ మూర్తి,  ట్రెజరర్  రమణ రాజు, కలక్టరేట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, తహసిల్దార్ ప్రభాకర్, కలక్టరేట్  పాలనాధికారి  దేవ్ ప్రసాద్ తదితరులు రెవిన్యూ అసోసియేషన్ తరపున కలెక్టర్, ఇతర అధికారులకు  డైరీ లను అందజేసి  దుశ్శాలువ తో సత్కరించారు.  

Vizianagaram

2021-01-18 17:46:02