రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంపుదల నేపథ్యంలో 3రోజులపాటు ఆందప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దూర దృశ్య సమావేశాల ద్వారా చేపట్టిందని ఏపీఈపిడిసిఎల్ ఎస్ఈ టివిఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. తొలిరోజైన సోమవారం విశాఖపట్నం సిఎండి కార్యాలయము నుంచి సిఎండి నాగలక్ష్మీ సెల్వారాజన్ నిర్వహించిన బహిరంగ ప్రజాబిప్రాయ సేకరణ దూర దృశ్య సమాశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 20 వరకు ఏ డిస్కమ్ పరిధిలోని వారైనా ఆన్‌లైన్ పాల్గొనవచ్చునన్నారు. రాష్ట్రంలో మూడు డిస్కమ్‌లైన తూర్పు, దక్షిణ కేంద్ర పంపిణిలు ఈ ధపా ప్రజాబిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 2020-21 వార్షిక సంవత్సరం ఆదాయం అవసర నివేదికలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయన్నారు. కోవిడ్-19 మూలంగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు పనిచేయనికారణంగా ఆదాయాలు తగ్గాయన్నారు. తదనుగుణంగా వార్షికా ఆదాయం కూడా బాగా తగ్గిందన్నారు. 2020-21 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు, ఇతర ఆదాయాలు రూపంలో డిస్కమ్‌లు ఆశించిన స్దాయిలో ఆదాయం సమకూరలేదన్నారు. కాని 2020-21 లో అనుభవాలు, పెరిగిన ఖర్చులు విద్యుత్ వినియోగం పెరిగిన అంచనా నేపధ్యంలో 2021-22లో కూడా ఆప్రబావం ఉంటుందన్నారు. 2021-22 ఆర్దిక సంవత్సరం వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై ఆంధప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి నాగార్జునరెడ్డి మరియు మండలి సభ్యులు పి. రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్, రాంసింగ్ నేతృత్వంలో వినియోగదారులను నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరిస్తున్నారని ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటిగంటవరకు మరలా మధ్యాహ్నాం రెండు గంటలనుంచి సాయాంత్రం 4.30 గంటలకు ప్రజాభిప్రాయాలను స్వీకరించడం జరుగుతోందన్నారు. విద్యుత్ చార్జీలకు సంబందించి డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ ఈ ధపా పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపట్టాలని ఎ.పి విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిందన్నారు. కోవిడ్-19 దృష్టిలోవుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే సమయంలో దీనివల్ల గతానికి భిన్నంగా విస్తృతస్దాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలవుతునందని మండలి చైర్మన్ జస్టిస్ సి.వి నాగార్జునరెడ్డి తెలిపారన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గోన దలచినవారు ముందుగా ఇప్పటికే తమ తమ పేరు నమోదు చేసుకున్నారని వీరికి ఈ మూడు రోజులలో స్లాట్ ఇవ్వడం జరిగిందన్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ద పరిధిలో సుమారు 52 మందికి స్లాట్లు ఇవ్వడం జరిగిందన్నారు. మన జిల్లా నుంచి ఆరు గురు ఉన్నారన్నారు. ఈ పక్రియను ఇంటోనే వుండి ప్రత్యక్షముగా తిలకించేందుకు ఒక ఇమెయిల్ Www.eliveevents.com./ apercpublichearing
లింకు రూపొందించడం జరిగిందన్నారు. విద్యుత్ టారీఫ్ రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరో కొద్దిమంది కాకుండా ఆసక్తి వున్న వారెవరైనా పాల్గొనేందుకు అవకాశం లబించిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక ఇంజనీరు కె తిలర్ కుమార్. సీనియరు ఎకౌంట్సు అధికారి వి.వి.ఎస్.ఎన్ వరప్రసాద్ ట్రాన్సుపార్మర్లు డివిజనల్ ఇంజనీరు పి వెంకటేశ్వర్లు ఉప కార్యనిర్వహక ఇంజనీరు నటరాజన్ , ( రెవిన్యూ) సహాయ అధికారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబరులో 32వ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టరును విడుదల చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకు ముఖ్యంగా యువతకు రహదారి భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. కాలేజీలు, విద్యాసంస్థలలో విద్యార్ధులకు సైతం అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ట్రక్ డ్రైవర్లను సైతం భాగస్వాములను చేయనున్నామన్నారు. జిల్లాలో 120 కి.మీ.ల హైవే వున్నదని, రహదారి ప్రమాదాలలో ప్రాణ నష్టం జరుగకూడదని, ఇందు నిమిత్తం ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి వుండడంతో పాటు నిబంధనలను పాటించాలని అన్నారు.
రవాణా శాఖ ఉప కమీషనరు డా. వి.సుందర్ మాట్లాడుతూ, ప్రతీ ఏటా రహదారి ప్రమాదాల నివారణపై నెల రోజుల పాటు రహదారి మాసోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రమాదాలలో జీవితాలను కోల్పోయే పరిస్థితులు రాకూడదన్నారు. ప్రజలకు రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కలిగించవలసి వుందన్నారు. ఆటో డ్రైవర్లకు, కాలేజీ విద్యార్ధులకు రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తామని, డ్రైవర్లకు హెల్త్ చెక్ అప్ చేస్తామని తెలిపారు. బి.పి., షుగర్, కంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు నెల రోజుల పాటు రహదారి ప్రమాదాలపై రోజు వారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం, *సురక్షితమైన రహదారి మీ జీవితానికి రక్ష* అనే నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రహదారి భద్రతపై పోస్టర్లను, ఫాంఫెట్లను విడుదల చేసారు.
ఈ కార్యక్రమానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎం.వేణుగోపాల రావు, ప్రసాద రెడ్డి, సాయిరామ్, శశి, పి.శివరాం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక పోరాటం చేపడుతుందని అధ్యక్షులు బంగారు అశోక్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల మనుగడకే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టుల తరపున పోరాటం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతోపాటు, సమాచార శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని కమిటీలో నిర్ణయించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతోపాటు, వారి సమస్యలపైనా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టుల ప్రాధమిక హక్కు అయిన అక్రిడిటేషన్ విషయంలో దేశరాజధాని ఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో కూడా లేని నిబంధనలు రాష్ట్రప్రభుత్వంలోని సమాచార శాఖ అమలు చేయాడం వలన చాలా మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రిడిటేషన్లు మంజూరు అయ్యేంత వరకూ తమ పోరాటం ఆపేది లేదని అశోక్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రతీ జర్నలిస్టు నడుం బిగించాలని అశోక్ పిలుపునిచ్చారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని సీతారామ కోనేరు చెంతన జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హరిత విజయనగరం, చేయూత ఫౌండేషన్ సొసైటీ, ఎన్.వి.వి. సొసైటీ బృంద సభ్యులతో కలిసి 150 ఆక్సీజన్ (క్రోటాన్) మొక్కలు నాటి నీరు పోశారు. చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం చెంతన ఉన్న సీతారామ కొనేరును సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కోనేరు అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. త్వరలో చుట్టూ దేవతా వృక్షాలను పెంచాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని హరిత విజయనగరం బృంద సభ్యులకు, స్థానిక ఎంపిడిఓ కు సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మొక్కల పెంపకం వల్ల స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుందని తద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. గ్రామ పరిసరాలను, చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు. చెరువుల్లో వ్యర్థాలు వేసి కలుషితం చేయవద్దని చెప్పారు. ఈ సందర్భంగా మొక్కలు స్పాన్సెర్ చేసిన శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ ఎ.శ్రీ రామమూర్తిని కలెక్టర్ అభినందించారు.
కార్యక్రమంలో డి.ఎఫ్.వో. బి.జానకీ రావు, హరిత విజయనగరం కో - ఆర్డినేటర్ ఎం. రామ్మోహన్ రావు, నెల్లిమర్ల ఎంపిడిఓ కె. రాజ్ కుమార్, తహశీల్దార్ జి. రాము, చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.రాము, ఉపాధ్యక్షురాలు ఎల్.సంధ్య, ఎన్.వి.వి. సొసైటీ అధ్యక్షురాలు జి.విశాలాక్షి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యక్షులు ఎస్.అచ్చిరెడ్డి, డా.వెంకటేశ్వరరావు, రామతీర్థం ఆలయ ఈవో, ఎన్.ఆర్.జి.ఎస్., వెలుగు, సచివాలయ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో సులభతర వాణిజ్య విధానాల్లో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల మంజూరులో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జనవరి 19న పారిశ్రామిక వేత్తలతో ఒక సదస్సు నిర్వహిస్తున్నట్టు పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కోట ప్రసాదరావు తెలిపారు.ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సు(out reach programme)లో రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ వినియోగించే పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొనే నిర్ధుష్టమైన సమస్యలపై చర్చించి వాటిపై తగిన వివరణలు, పరిష్కారాలు తెలియజేస్తారని జిల్లా మేనేజర్ పేర్కొన్నారు. ఈ సదస్సులో పరిశ్రమల శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ సదస్సుకు జిల్లాలోని భారీ, మెగా పరిశ్రమదారులు, సింగిల్ డెస్క్ పోర్టల్ వినియోగదారులు, స్థానిక పారిశ్రామిక అసోసియేషన్‌లు, ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్లు, స్థానిక ఆర్కిటెక్ట్ ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు హాజరు కావాలని కోరారు.
విశాఖజిల్లాలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆసుపత్రిలో కరోనా టీకాలు వేసే కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ అన్నది రాష్ట్రంలోనే కాక మొత్తం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని అనవసర ఆర్భాటాలకు పోకుండా వేక్సినేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ముందుగా వైద్య సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తరువాత పారిశుధ్య, పోలీస్ సిబ్బందికి వేక్సిన్ వేస్తారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అనుమానాలకు తావివ్వరాదన్నారు. అంతకు ముందు మంత్రి ఆసుపత్రిలో వేక్సిన్ ఎంత వచ్చినది, ఎంతమందికి టీకాలు వేస్తున్నదీ, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి వైద్యులను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గూర్చి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్య వరప్రసాద్ మంత్రికి వివరించారు. ఇంకా వేక్సిన్ ఏ విధంగా వేస్తున్నది మంత్రి పరిశీలించారు. వేక్సిన్ వేసిన తర్వాత ఎలావుందన్న విషయాన్ని వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్.ఎన్.వో. ఎమ్. రాజబాబు, ఎఫ్.ఎన్.వో. సిరిపురపు గౌరిలను అడుగగా ఎటువంటి ఇబ్బందులు కలుగ లేదని, ఉత్సాహంగానే వుందని వారు మంత్రికి చెప్పారు. కరోనా మహమ్మారి ఎంతో భయంకరంగా ప్రారంభమైందని, ఏమి చేయాలో పాలుపోని స్థితి నుండి వైద్యనిపుణుల సలహాల ప్రకారం లాక్ డౌన్ లు విధించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో వివేకంతో ముందస్తు చర్యలను తీసుకొని కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగారన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం పరిచారన్నారు. కరోనా టెస్టులు చేయడం, ప్రజలందరికీ అవగాహన కల్పించడం అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావడం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్ కుమార్, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, ఆర్డీవో కె.పెంచల కిషోర్, కె.కె.రాజు, కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి నియోజకవర్గం టి.నగరపాలెం, దాకమర్రి, మూలకుద్దు గ్రామంలలో ఇంటిస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మూలకుద్దు గ్రామంలో జరిగిన ఇంటిస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమ్మఒడి, వాహనమిత్ర వంటి 22 పధకాల ద్వారా ఈ గ్రామానికి రూ.5కోట్ల 60 లక్షల రూపాయలు అందించటం జరిగిందని అన్నారు. వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందిస్తున్నామని తెలిపారు. ఇంటిస్థల పట్టా కూడా మహిళల పేరునే అందించి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఈ గ్రామంలో అందిస్తున్న ఇంటి స్థలం 15 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు. త్వరలోనే విశాఖపట్నం పరిపాలనారాజధానిగా వస్తున్నదని కావున మీకు యిస్తున్న ఇంటి స్థలాలు, భూములు అమ్ముకోవద్దని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి డబ్బులతో పిల్లలను చక్కగా చదివించుకోవాలని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ ప్రభుత్వం సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులకు సచివాలయ ఉద్యోగులుగా, వలంటీర్లుగా నియామకాలు చేపట్టిందని తెలిపారు.
కార్యక్రమంలో ఇంటి స్థలం పొందలేనివారైవరైనా ఉన్నారా అని మంత్రి అడుగగా ముగ్గరు మహిళలు రేషనుకార్డు సమస్యలతో స్థలం మంజూరు కాలేదని తెలుపగా వెంటనే వారి సమస్యలను పరిష్కరించి వారి ఇంటిస్థలం కేటాయించవలసినదిగా గ్రామరెవిన్యూ అధికారి, గ్రామ వలంటీరు ను అదేశించి, వెంటనే సమస్యను పరిష్కరించవలసినదిగా తహశీల్దారుకు సభాముఖంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎం .పి.డి.ఒ. ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
విశాఖలో జర్నలిస్టు దివాకర్ తనయుడు పైల శివతేజ వర్ధంతి శనివారం ఘనంగాా నిర్వహించారు. ప్రతీఏటా శివతేజ వర్ధంతి సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో నిరుపేదలకి అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు దివాకర్ దంపతులు నగరంలోని రైల్వే న్యూకాలనీలోని పలువురు అనాధలకు అల్పాహారం అందించారు. అనంతరం షిర్డీసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ, ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలికి మంచి డ్రైవింగ్ నేర్పించిన తరువాత మాత్రమే వాహనాలు అందించటం అలవాటు చేసుకోవాలన్నారు. డ్రైవింగ్ ను ప్రోత్సహించవద్దని కోరారు. పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే వారికిచ్చే వాననాలు, డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తన కొడుకులా మరో కుటింబానికి పిల్లలు వాహన ప్రమాదంలో దూరం కాకుండా ఉండాలని దేవాది దేవతలను కోరుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆయన భార్య పాల్గొన్నారు.
యాంకరేజ్ పోర్టుకు వచ్చే అదనపు సరుకును కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండ డీప్ వాటర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరగనుందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీ శ తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జెసి లక్ష్మీ శ,ఏపీ మారి టైం బోర్డు సీఈవో రామకృష్ణ రెడ్డి తో కలిసి రైస్ ఎక్స్ పోర్టర్స అసోసియేషన్ ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కాకినాడ యాంకర్ ఏజ్ పోర్ట్ నుంచి బియ్యం దేశ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఎగుమతి సామర్థ్యాన్ని పెంచే విధంగా యాంకరేజ్ పోర్టుకు వచ్చే అదనపు సరుకును కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా డీప్ వాటర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను, సూచనలు సోమవారం నాటికి తెలియపరచాలని జెసి సూచించారు. ఈ సమావేశంలో పోర్టు అధికారి కెప్టెన్ ధర్నా, రైస్ ఎక్స్ పొర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.వి కృష్ణారావు, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వి.వి.రాఘవులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం బుల్లి రాణి,కార్మిక సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు శనివారం మొత్తం 2211 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 33 టీకా కేంద్రాల ద్వారా తొలిరోజు 3300 మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వివిధ కేంద్రాల్లో జరిగిన టీకా పంపిణీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు వెల్లడించారు. కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రాం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలు టీకా పంపిణీ కార్యక్రమాలకు హాజరైనట్లు వెల్లడించారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగం గా పులిచర్ల మండలం సువ్వారపు వారి పల్లిలో ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద చేపట్టిన హార్టికల్చర్ ప్లానిటేషన్(మామిడి తోట) ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులతో గల కమిటీ పరిశీలించింది.. అనంతరం మతుకు వారిపల్లి లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కమిటీ పరిశీలిం చింది. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న 16 రకాల సేవలైన పిఎం- కిసాన్ -వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఈ-క్రాప్ బుకింగ్, డి-కృషి (సీడ్-డిస్ట్రిబ్యూషన్), సిఎం యాప్, వై.ఎస్.ఆర్ యాప్, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలం బడి, క్రాప్ ఇన్సూరెన్స్ , జె.ఎల్.జి గ్రూప్స్, అగ్రో అడ్వైజరి బోర్డ్ ల గురించి మరియు రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సలహాలు, సూచనలకు సంబందించిన అంశాలన్నింటిపై రాజంపేట, చిత్తూరు ఎం.పి లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప కమిటీకి వివరించగా.. ఉ. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు అందిస్తున్న సేవల గురించి అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆదునిక పద్దతిలో వ్యవసాయ సాగు అంశాలన్నింటిపై సమగ్రంగా వ్యవసాయ అధికారి కమిటీకి సవివరంగా వివరించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలను సులభతరం చేసేందుకు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ కు సంబందించి మతుకు వారి పల్లె లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంధర్భంగా సచివాలయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన అర్హుల జాబితాను పరిశీలించిగా సచివాలయ వ్యవస్థ ద్వారా 545 పౌర సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు సచివాలయ సిబ్బంధి కమిటీకి వివరించారు.
తదుపరి కల్లూరు వద్ద ఎస్‌డబ్ల్యూపిసి కింద నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించగా చెత్త సేకరణ దాన్ని ఎరువుగా తయారు చేసే విధానం గురించి అధికారులు కమిటీకి వివరించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ జేడి విజయ కుమార్, డి.పి.ఓ దశరామిరెడ్డి, ఎస్.ఈ పంచాయతీ రాజ్ అమర నాధ్ రెడ్డి,ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపిడిఓ దేవేంద్ర బాబు, ఎంఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికా రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగం గా పులిచర్ల మండలం సువ్వారపు వారి పల్లిలో ఎన్‌ఆర్‌ఈజి్‌ఎస్ కింద చేపట్టిన హార్టికల్చర్ ప్లానిటేషన్(మామిడి తోట) ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, గౌ.షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులతో గల కమిటీ పరిశీలించింది..అనంతరం మతుకు వారి పల్లి లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కమిటీ పరిశీలిం చింది. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న 16 రకాల సేవలైన పిఎం- కిసాన్ -వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఈ-క్రాప్ బుకింగ్, డి-కృషి (సీడ్-డిస్ట్రిబ్యూషన్), సిఎం యాప్, వై.ఎస్.ఆర్ యాప్, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలం బడి, క్రాప్ ఇన్సూరెన్స్ , జె.ఎల్.జి గ్రూప్స్, అగ్రో అడ్వైజరి బోర్డ్ ల గురించి మరియు రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సలహాలు, సూచనలకు సంబందించిన అంశాలన్నింటిపై రాజంపేట, చిత్తూరు ఎం.పి లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప కమిటీకి వివరించగా..
ఉ. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు అందిస్తున్న సేవల గురించి అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆదునిక పద్దతిలో వ్యవసాయ సాగు అంశాలన్నింటిపై సమగ్రంగా వ్యవసాయ అధికారి కమిటీకి సవివరంగా వివరించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలను సులభతరం చేసేందుకు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ కు సంబందించి మతుకు వారి పల్లె లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంధర్భంగా సచివాలయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన అర్హుల జాబితాను పరిశీలించిగా సచివాలయ వ్యవస్థ ద్వారా 545 పౌర సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు సచివాలయ సిబ్బంధి కమిటీకి వివరించారు.
తదుపరి కల్లూరు వద్ద ఎస్‌డబ్ల్యూపిసి కింద నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించగా చెత్త సేకరణ దాన్ని ఎరువుగా తయారు చేసే విధానం గురించి అధికారులు కమిటీకి వివరించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ జేడి విజయ కుమార్, డి.పి.ఓ దశరామిరెడ్డి, ఎస్.ఈ పంచాయతీ రాజ్ అమర నాధ్ రెడ్డి,ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపిడిఓ దేవేంద్ర బాబు, ఎంఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికా రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత కనిపిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ప్రతాప్ రావు జాధవ్ పేర్కొన్నారు. శనివారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా పులిచెర్ల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం కల్లూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటైన సమావేశంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గౌ.ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, గౌ.సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, గౌ.షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులు సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళలను ఉద్దేశించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గౌ.చైర్ పర్సన్ మాట్లాడుతూ ఒక్కప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితమయ్యే వారని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని పేదరిక నిర్మూలన కొరకు అమలుచేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటున్నారని మహిళా సాధికారత కనిపిస్తున్నదని తెలిపారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మరియు జమ్మూ కాశ్మీర్ ఎం.పి గౌ.నజీర్ అహ్మద్ లవాయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పధకాలైన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ బాగున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాల పై ప్రత్యేక దృష్టి సారించి అమలు చేస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలుగా ముస్లిం మహిళలు కూడా ఉంటూ ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు తోడ్పడుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
రాజంపేట ఎం.పి.మిధున్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు రావడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేస్తుందని పధకాలన్నింటిని మహిళల పేరు మీదనే అందిస్తూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నదని, మధ్యపాన నిషేదాన్ని దశల వారిగా అమలు చేస్తూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన కావేటి గారి పల్లికి చెందిన రెడ్డమ్మ సంఘం ద్వారా తాను ఆర్ధికంగా అభివృద్ది చెందిన విధానం గురించి కమిటీ కి వివరిస్తూ తాను 2007 లో సంఘంలో సభ్యురాలిగా చేరడం జరిగిందని, సంఘం పేరు రాఘవేంద్ర సంఘం అని సంఘంలో చేరక మునుపు కూలీ పనులకు వెళ్ళే వారమని సంఘంలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు విడతల వారీగా దాదాపు 20 లక్షల రూపాయలు రుణం తీసుకొని ఆర్ధికంగా తన కుటుంబాన్ని అభివృద్ది చేసుకునేందుకు వినియోగించుకోవడం జరిగిందని, ఉన్న ఒక ఎకరా పొలంలో వరి, వేరు శెనగ పంటలు పండించడం జరిగిందని, సంఘం అండదండలతో మరియు లోన్ సహాయంతో ట్రాక్టర్ ను కొనుగోలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే పధకాలైన అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్ ఆసరా, సున్నా వడ్డీల కింద తాను లబ్ది పొందానని తాను సంఘంలో సభ్యురాలిగా ఉండడం వలనే ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు అవకాశం ఏర్పడిందని సంతోషంతో హింది బాషలో అనర్హళoగా కమిటీ సభ్యులకు వివరించింది.
కల్లూరు కు చెందిన మరో సభ్యురాలైన షహీన ప్రభుత్వ పధకాల ద్వారా పొందిన లబ్దిని వివరిస్తూ తనకు గల ఎకరా భూమిలో ఉపాధి హామీ పధకం కింద మామిడి చెట్లను పెంచుతున్నామని తన పొలంలో తాను పని చేస్తూ ఉపాధి పొందుతున్నానని అందుకు వేతనంగా రోజుకు రూ.200 అందుతుందని రైతు భరోసా పధకం, కిసాన్ యోజన పధకాల కింద అందిన ఆర్ధిక సాయంను మామిడి తోట అభివృద్దికి వినియోగించుకోవడం జరిగిందని, ఈ వచ్చే ఆదాయంతో నా కొడుకును బి.టెక్ చదివిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులందరికి చేరుతున్నాయన్నారు.
కల్లూరు జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన విధ్యార్ధి భవ్య గత 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పధకాలైన నవరత్నాలు, వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఉచిత విధ్యుత్, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ, దశల వారీగా మధ్యపాన నిషేధం, అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న తోడు, జగనన్న విధ్య దీవెన, వసతి దీవెన పధకాల గురించి సవివరంగా వివరించి అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, డ్వామా, డి.ఆర్.డి.ఏ పి.డి లు చంద్రశేఖర్, తులసి, డి.పి.ఓ దశదరామిరెడ్డి, ఇండియన్ బ్యాంక్ జెనరల్ మేనేజర్ ఏ.కె మహాపాత్రా, యూనియన్ బ్యాంక్ జి.ఎం.లాల్ సింగ్, ఎల్.డి.ఎం గణపతి, ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపిడిఓ దేవేంద్ర బాబు, ఎంఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ లో భాగంగా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి. లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి లక్ష్మీశ, జేసి (అభివృద్ధి) కీర్తి చేకూరి తో కలిసి సివిల్ సప్లయి, ఎస్సీ ,బీసీ ,మైనార్టీ కార్పొరేషన్ల అధికారులతో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లకు లబ్ధిదారులు ఎంపిక, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. దీనికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ తక్షణమే పూర్తిచేయాలని ఆయన తెలిపారు. మొత్తం 1076 మంది లబ్ధిదారులకు మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరలోనే రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అన్నారు.లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు,బ్యాంకు ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జేసి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ డీయం ఇ.లక్ష్మీ రెడ్డి,బిసి, మైనారిటీ కార్పొరేషన్ అధికారులు ఎస్ వి ఎస్.సుబ్బలక్ష్మీ, పి ఎస్.ప్రభాకర్ రావు, టాటా, సుజుకి వాహనాల కంపెనీ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు జిల్లాకు వరించింది. అనంతపురం నుంచి న్యూఢిల్లీకి దేశంలోనే 2వ కిసాన్ రైల్ గా వినూత్నంగా ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ ప్రాజెక్ట్ కు స్కోచ్ అవార్డు లభించిందని ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం 70వ స్కోచ్ అవార్డుల ఎంపిక కోసం స్కోచ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ గురుశరన్ దంజాల్, రాజ్యసభ మెంబర్ సురేష్ ప్రభు, స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ లు జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అనంతపురం నుంచి జూమ్ కాన్ఫరెన్స్లో హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. అనంతపురం నుంచి న్యూఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులు తరలించేందుకు కోసం వినూత్నంగా కిసాన్ రైల్ ప్రాజెక్ట్ రావడానికి ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులు ఎంతో కృషి చేశారన్నారు. కిసాన్ రైల్ కు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కిందని, ఇందుకోసం కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీఎంఐపీ పీడీ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 161 మంది స్కోచ్ అవార్డు కోసం సెమీఫైనల్లో పోటీపడగా, ఫైనల్లో మిగిలిన 20 మందిలో మన జిల్లా నుంచి కిసాన్ రైలు ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా మాత్రమే స్కోచ్ అవార్డు జాబితాలో ప్రథమంగా ముందంజలో నిలిచామని తెలిపారు. స్కోచ్ అవార్డు ఎంపిక కోసం ఆన్లైన్ ఓటింగ్ లో పెనుగొండ హార్టికల్చర్ ఏ డి చంద్రశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొని సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కేందుకు ఎంతో కృషి చేశారన్నారు. స్కోచ్ అవార్డు వచ్చేలా రైతులు, టమోటా మండి మార్కెట్ యజమానులు, హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది ఎంతగానో కష్టపడి పని చేశారని, వారికి అభినందనలు తెలియజేశారు. జూమ్ కాన్ఫరెన్స్లో ఏపీ డి లు నరసింహరాజు ఫిరోజ్, సూపరింటెండెంట్ ప్రసాద్ లు పాల్గొన్నారు.