1 ENS Live Breaking News

విద్యుత్ తక్కువ వినియోగంలో 2వ స్థానం..

ప్రకృతి వనరుల వినియోగం, విద్యుచ్ఛక్తి వినియోగంలో పొదుపు ఆవశ్యకత ఎంతో కీలకమని , విద్యుత్‌ వినియోగం తగ్గించడంలో కృషి చేసినందుకు ఈ ఏడాది స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అఫీషియల్ అవార్డుల బహుకరణలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు రెండవ స్థానమైన సిల్వర్ అవార్డుకు ఎంపికవ్వడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హర్షం ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఆయన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంకు హాజరయ్యేందుకు తాడేపల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ హడావిడి సమయంలో సైతం తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ , ఎలక్ట్రికల్ డి ఇ సాయి ప్రసాద్ తదితర అధికారులు మంత్రి పేర్ని నానిను కలిశారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ సిల్వర్ అవార్డు మచిలీపట్నం కార్పొరేషన్ దక్కిందని ఆ మేరకు వచ్చిన అధికార పత్రాన్ని మంత్రికి చూపించారు. మన రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలలో మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కు రెండవ స్థానం దక్కడం ఎంతో గర్వకారణమని మంత్రి పేర్ని నాని అధికారులను అభినందించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కు ప్రధమ స్థానం ( గోల్డ్ అవార్డు ) పొందిందని కమీషనర్ మంత్రికి తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ,థర్మల్ పవర్ ప్లాంట్లు, అర్బన్ లోకల్ బాడీస్ ఈ మూడు విభాగాలలో ఈ పురస్కారాలు ఇస్తున్నట్లు కమీషనర్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుచ్ఛక్తిని దుర్వినియోగం చేయడమంటే సమాజానికి , భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేసినట్లేనని, రాష్ట్రంలోనే విద్యుత్ పొదుపుగా వినియోగించుకున్న స్మార్ట్ సిటీ తిరుపతికు గోల్డ్ అవార్డు దక్కడం , ఆ తర్వాత స్థానం మన మచిలీపట్నం కార్పోరేషన్ కు సిల్వర్ అవార్డు చేజిక్కించుకోవడం ఎంతో సంతోషమన్నారు. గతంలో సంప్రదాయ ఫిలమెంట్ బల్బుల వాడకం వల్ల ఎక్కువగా విద్యుత్ ఖర్చు అవుతుండేదని దీనివల్ల వెలుగుకు అయ్యే ఖర్చుకన్నా ఆ బల్బు వేడెక్కడానికే ఎక్కువ వినియోగమవుతుందని అందుకే ఫ్లోరోసెంట్, ఎల్‌ఇడి బల్బుల వాడకం మన కార్పొరేషన్లలో మొదలైందని తెలిపారు. ఇళ్లలో వాడే విద్యుచ్ఛక్తి వినియోగంలో అత్యధికులు ఎయిర్ కండిషనింగ్ కే 40 శాతం ఖర్చుపెడుతున్నారని అన్నారు. .మనదేశంలో విద్యుచ్ఛక్తి పొదుపుగా వాడే విషయాన్ని ఉద్యమంగా చేపట్టే బాధ్యత ప్రజలందరూ స్వీకరించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. అనంతరం పలువురు ఉపాధ్యా నేతలు మంత్రిని కలిశారు. ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించాలని, పోస్టుల బ్లాకింగ్ ఎత్తివేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జీ.వి. నారాయణరెడ్డి, కె. నరహరి, తోట రఘుకాంత్ ( చిన్నా ), తదితరులు మంత్రి పేర్ని నానికు ఒక విజ్ఞాపనపత్రాన్ని అందచేశారు. మాధ్యమం మార్పు వలన పోస్టులు కోల్పోయిన పాఠశాలలకు పోస్టులను పునరుద్దరించాలని, రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ జీ.వి. నారాయణరెడ్డి, కార్యదర్శి కె. నరహరి లకు జారీ చేసిన ఆర్టికల్ అఫ్ చార్జెస్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని , బదిలీల్లో అన్ని స్థానాలను చూపించాలని, స్టేషన్‌ సీనియారిటీకి ఎనిమిదేళ్ల సీలింగ్‌ సరికాదని, మొత్తం సీనియారిటీని పరిగణనలోనికి తీసుకుని సర్వీస్‌ పాయింట్లు కేటాయించాలని కోరారు. స్థానిక లక్షణారావు పురానికి చెందిన తన్నేరు సుధారాణి మంత్రి పేర్ని నానిను కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. ఇటీవలే తాను వార్డు హెల్త్ సెక్రటరీ పోస్ట్ కు ఎంపికయ్యానని తనకు పోస్టింగ్ విజయవాడలో ఇచ్చారని , తనకు ఒక చిన్న పాప ఉందని తన తండ్రి హార్ట్ పేషంట్ అని తనకు మచిలీపట్నంలో అదే ఉద్యోగం దయచేసి ఇప్పించాలని అభ్యర్ధించింది. ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యూయెట్ అసోసియేషన్ సభ్యులు పలువురు మంత్రి పేర్ని నానిని కలుసుకున్నారు. ప్రభుత్వం 824 పోస్టులకు జాబ్ క్రియేషన్ అఫ్ పోస్ట్స్ ఫైల్ పెట్టారని ఆర్ధిక శాఖ వద్ద నుంచి క్లియరెన్స్ వచ్చేలా సహాయం చేయాలనీ కోరారు.

Machilipatnam

2020-12-18 23:19:57

ఏపీసెట్ 2020కి 35,862 మంది అభ్యర్ధులు..

రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్‌ 2020‌ని ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏపిసెట్‌ ‌మెంబర్‌ ‌సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు  శుక్రవారం  తెలిపారు. పరీక్ష హాల్‌ ‌టికెట్లను  వెబ్‌సైట్‌లో  ఉంచామని, అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ ‌చేసుకుని తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.ఏపిసెట్‌ ‌ప్రవేశ పరీక్షకు 35,862 మంది దరఖాస్తు చేసారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు.  పరీక్షను 30 సబ్జక్టులకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు పేపర్‌ 1, ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పేపర్‌ 2 ‌పరీక్ష జరుగుతుంది. పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు నగరాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తారు.  పూర్తి సమాచారం ఏపిసెట్‌ ‌వెబ్‌సైట్‌  నుంచి పొందవచ్చునని తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రాల లోనికి అనుమతిస్తామన్నారు. ప్రతీ విద్యార్థికి వారి వివరాలతో కూడిన ఓఎంఆర్‌ ‌షీట్‌ను అందిస్తామని, దీనిలో వివరాలు సరిచూసుకోవాలన్నారు. సమాధానాలను నీలం, నలుపు బాల్‌ ‌పాయింట్‌ ‌పెన్‌తో గుర్తించాలన్నారు. పరీక్షల్లో నెగెటివ్‌ ‌మార్కులు లేవు. పరీక్ష కేంద్రాల లోనికి సెల్‌పోన్‌, ‌కాలిక్యులేటర్లు అనుమతించరు. కోవిడ్‌ ‌నియమావళిని అనుసరిస్తూ విద్యార్థులు మాస్కులు ధరించి, శానిటైజర్‌లు ఉపయోగించాలని సూచించారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-18 23:07:53

జగనన్న తోడుకి సహకరించండి..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పధకానికి  సంబందించిన ఋణాలను త్వరితగతిన మంజూరు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబందిత బ్యాంకు అధికారులను కోరారు. శుక్రవారం ఈ పధకం క్రింద ఋణాల మంజూరు ప్రగతిని స్వయంగా తెలుసుకొనే నిమిత్తం ఆమె, ఎల్.డి.ఎం.తో కలసి పెద్ద వాల్తేరు ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకు బ్రాంచీలను సందర్శించారు. జగనన్న తోడు పధకం క్రింద ఈ రెండు బ్యాంకుల ఋణాల మంజూరును వాకబు చేయగా ఆంధ్రా బ్యాంకులో 353 టార్గెట్ నకు గాను 33 ఋణాలు మాత్రమే మంజూరు చేయగా, యూ.బి.ఐ. వారు 227 టార్గెట్ నకు గాను ఆరుగురికి మాత్రమే ఋణాలు మంజూరు చేయడం పై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సంబందిత బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ జగనన్న తోడు పధకంను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిరు వ్యాపారులను ఆదుకొనే నిమిత్తం ఋణాలను మంజూరు చేయుటకు గాను రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల సమావేశాలలో నిర్ణయం తీసుకోబడినదని, గానీ, దిగువ బ్రాంచి స్థాయిలో వీటి మంజూరుపై పురోగతి కనబడడం లేదని ఉన్నతాధికారులకు తెలిపారు. నిర్ణయించబడిన టార్గెట్లను రేపటిలోగా బ్రాంచి అధికారులు పూర్తీ చేసి ఋణాలను విడుదల చేసేలాగ క్రింద బ్రాంచి మేనేజర్లకు సూచించాలని తెలిపారు. బ్రాంచి అధికారులకు ఏమైనా సిబ్బంది సహకారం అవసరమైనచో, జివిఎంసి సిబ్బంది సహకారం అందిస్తారని బ్యాంకు మేనేజర్లకు సూచించారు.  ఈ బ్యాంకుల సందర్శనలలో, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనాద్, రెండవ జోన్ ఏ.పి.డి. మస్తాన్ బేబి, డి.ఎం.సి. నాగరాజు, సచివాలయ వార్డు సంక్షేమ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-12-18 23:00:08

అభివ్రుద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలి..

ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రుగుతున్న ప‌లు అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ త‌నిఖీ చేశారు. స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌తో క‌లిసి పార్వ‌తీపురంలో ఆయ‌న శుక్ర‌వారం సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ప‌లు కార్యాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయాల‌ని, సంక్షేమ ఫ‌లాల‌ను అర్హులంద‌రికీ అందించాల‌ని ఆదేశించారు. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.  పార్వ‌తీపురంలో ప్ర‌తిపాదిత‌ మ‌ల్టీసూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి స్థ‌లాన్ని ముందుగా క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ఈ ఆవ‌ర‌ణ‌లో సుమారు 8 ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన కార్యాల‌యాల‌ను, వాటి స్థితిగ‌తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఆయా శాఖ‌ల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంత‌రం స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. వారి అవ‌స‌రాల‌ను తెలుసుకున్నారు. ఆయా శాఖ‌ల రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు.           అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్నారు. గిరిజ‌న ప్రాంతంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి రావ‌డం ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని, దానికి అన్ని శాఖ‌లూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.  ప్ర‌తిపాదిత ఆసుప‌త్రి స్థ‌లంలో ప్ర‌స్తుతం నిరుప‌యోగంగా ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను త‌క్ష‌ణ‌మే స్వాధీనం చేసుకోవాల‌ని అన్నారు. వినియోగంలో ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ప్ర‌త్యామ్నాయ భ‌వనాల‌ను గుర్తించి ఇవ్వాల‌ని స‌బ్ క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. వారి అవ‌సరాల‌కు త‌గ్గట్టుగా, వారి అంగీకారం తోనే  త‌గిన భ‌వ‌నాల‌ను కేటాయించాల‌ని సూచించారు. డాక్ట‌ర్ల క్వార్ట‌ర్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేసి, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌కు అప్ప‌గించాల‌న్నారు.  శిధిల భ‌వ‌నాల‌ను ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు తొల‌గించాల‌ని, స్థ‌లాన్ని స్వాధీనం చేసుకొని ఎపిఎంఐడిసికి అప్ప‌గించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.          ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌శాఖ‌ జెడి ఎం.ఆశాదేవి, ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడి డాక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, ఇరిగేష‌న్ ఇఇ ఆర్‌.అప్ప‌ల‌నాయుడు, ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్ వాగ్దేవి, తాశీల్దార్ రామ‌స్వామి ఇంకా పోలీసు, ఆర్అండ్‌బి, ఆర్‌డ‌బ్ల్యూఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. ....................................... జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా అమ‌లు ప‌రిశీల‌న‌           ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త నిస్తున్న జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా కార్య‌క్ర‌మాల అమ‌లును ప‌రిశీలించారు. దీనిలో భాగంగా పార్వ‌తీపురం ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచ్‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ఆయా ప‌థ‌కాల ల‌క్ష్యాల‌పై బ్యాంకు మేనేజ‌ర్ పి.రామ‌కృష్ణ‌ను ప్ర‌శ్నించారు.  తోడు ప‌థ‌కానికి సంబంధించిన పార్వ‌తీపురం అర్బ‌న్‌లో కేవ‌లం 38శాతం మాత్ర‌మే గ్రౌండింగ్ అవ్వ‌డం ప‌ట్ల క‌లెక్ట‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆ ఒక్క బ్రాంచ్ లోనే 363 యూనిట్ల‌ను స్థాపించాల్సి ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 177 మాత్ర‌మే మంజూరు చేశార‌ని అన్నారు. రెండు రోజుల్లో శ‌త‌శాతం యూనిట్ల‌కు రుణాన్ని మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌ర్వ‌ర్‌కు సంబంధించిన సాంకేతిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి, దానిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ......................................... ధాన్యం కొనుగోలు కేంద్రం త‌నిఖీ           ప్రాధ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కారం సంఘం వ‌ద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డి ధాన్యం కొనుగోలుపై వాక‌బు చేశారు. కేవ‌లం మూడు రోజుల క్రిత‌మే కొనుగోలు కేంద్రం ప్రారంభ‌మైన‌ట్లు తెలుసుకున్నారు. స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. మిల్లుల‌తో కేంద్రం ట్యాగింగ్ జ‌ర‌గ‌లేద‌ని, అందువ‌ల్ల కేంద్రం నుంచి ధాన్యం మిల్లుల‌కు వెళ్ల‌టం లేద‌ని సిబ్బంది క‌లెక్ట‌ర్ దృష్టికి తెచ్చారు. వెంట‌నే జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్‌కుమార్‌తో  క‌లెక్ట‌ర్ ఫోన్‌లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల‌ను మిల్ల‌ల‌తో ట్యాగింగ్ చేయాల‌ని, రైతు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ఒక‌టిరెండు రోజుల్లో ఈ స‌మ‌స్య పూర్తిగా ప‌రిష్కారం చేస్తామ‌ని జెసి వివ‌రించారు.  వ్య‌వ‌సాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, తాశీల్దార్ రామ‌స్వామి, ఏఓ రేఖ త‌దిత‌రులు కూడా ఉన్నారు. ................................................ స‌చివాల‌య సంద‌ర్శ‌న‌            న‌ర్సిపురంలోని స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ సంద‌ర్శించారు. అక్క‌డి వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. వివిధ సేవ‌ల‌కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌పై ఎంపిడిఓ రామ‌కృష్ణ‌ను ప్ర‌శ్నించారు.  పౌర స‌ర‌ఫ‌రాలు, రెవెన్యూకు సంబంధించిన అంశాల‌పై ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తులు పెండింగ్ లో ఉంటున్నాయ‌ని అన్నారు. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత గ‌డువులోగానే ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం  చేశారు. జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ ఆర్ బీమా ప‌థ‌కాల‌ను శ‌త‌శాతం అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. త్వ‌ర‌లో చేయూత ప‌థ‌కం క్రింద ఆవులు, గేదెలు మంజూరు చేస్తామ‌ని, ఆ యూనిట్ల‌ను గ్రౌండింగ్ చేసి, పేద‌లకు ఆర్థికంగా భ‌రోసా క‌ల్పించాల‌ని కలెక్ట‌ర్ కోరారు. ......................................................... లేఅవుట్ ను  ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌          పేద‌ల కోసం న‌ర్సిపురంలో ప్ర‌భుత్వం రూపొందించిన ఇళ్ల స్థ‌లాల లేఅవుట్ ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. సుమారు 2.79 ఎక‌రాల్లో 105 ఇళ్ల స్థ‌లాల‌తో లేఅవుట్‌ను రూపొందించిన‌ట్లు తాశీల్దార్ రామ‌స్వామి క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. లేఅవుట్ ను పూర్తిగా చ‌దును చేసి, పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అలాగే అంత‌ర్గ‌తంగా గ్రావెల్ రోడ్ల‌ను వేయాల‌ని, లేఅవుట్ వ‌ద్ద బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అన్ని వ‌స‌తుల‌తో లేఅవుట్ల‌ను సంపూర్ణంగా సిద్దం చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు.

Vizianagaram

2020-12-18 22:57:40

నెలాఖరు నాటికి డేటా సేకరణ పూర్తికావాలి..

 భూ గర్భ జలాలను అంచనా వేయడం ద్వారా  నీటిని (రెగ్యులేట్)  స్తిరీకరింప జేయడానికి అవకాశం లభిస్తుందని సంయుక్త కలెక్టర్(ఆసరా) జే. వెంకట రావు తెలిపారు.   నీరు పునరుత్పాతక  వనరు అయినప్పటికీ పరిమితంగా వినియోగించడం వల్లనే భవిష్యత్తు లో  నీటి కొరత నుండి బయట పడగలమని అన్నారు.   శుక్రవారం భూ గర్భ జల వనరుల అంచనాల జిల్లా స్థాయి కమిటీ  మొట్టమొదటి సమావేశం   కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో జే.సి ఆధ్వర్యం లో జరిగింది.  ఈ సమావేశం లో భూ గర్భ జల శాఖ ఉప సంచాలకులు శాస్త్రి పవర్ పాయింట్ ద్వారా కమిటి వివరాలను, నీటి పరిరక్షణ,  నిర్వహణ ,  జిల్లాలోని భూ గర్భ జలాల పరిస్థితిని వివరించారు.  భూ గర్భ జలాలను అంచనా వేయడం వలన  ప్రభుత్వ పధకాలైన  వై.ఎస్.ఆర్ జల కళ, ఉపాధి హామీ పధకం తో చేపడుతున్న కార్యక్రమాలకు,  భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు,  ప్రపంచ బ్యాంకు ద్వారా  చేపడుతున్న జలవనరుల ప్రాజెక్టులకు , ఎ.పి వాల్టా చట్టాన్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.  మూడేళ్ళకోసారి జరిగే ఈ అంచనాలకోసం   100  మీటర్ల నుండి 300 మీటర్ల లోతు వరకు అధ్యనం చేస్తారని, నీటి లోనున్న  ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ,ఆమ్లాల శాతాన్ని కూడా పరిశీలించడం జరుగుతుందని అన్నారు.  వర్షపాతం, కాలవలు, చెరువులు, జలాశయాలు,  , ఇరిగేషన్,   తదితర అన్ని రకాల సోర్స్ ద్వారా   వచ్చే ఇన్ఫ్లో,  అవుట్ ఫ్లో ,స్టోరేజ్ స్థాయిలను  అంచనాలు వేయడం జరుగుతుందన్నారు.  గ్రామ స్థాయి నుండి జరిగే  ఈ అంచనాల కార్యక్రమానికి  వర్షపాతం , బావుల సంఖ్య, ప్రజా , పరిశ్రమల వినియోగానికి అవుతున్న నీటి వివరాలను చీఫ్ ప్లానింగ్ అధికారి, తహసిల్దార్లు,  విద్యుత్ అధికారులు అందజేయలన్నారు.  కాల్వల ద్వారా  రీ చార్జ్ అయ్యే నీరు,  వ్యవసాయానికి వినియోగించే నీటి వివరాలను  జల వనరుల శాఖ అందజేయలన్నారు.  నీటి పరిరక్షణ (కన్సర్వేషన్) వలన రీచార్జ్ అయ్యే నీటి వివరాలను గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి , మున్సిపల్ శాఖలు అందజేయలన్నారు.   ఈ అంచనాలను  మదింపు చేసిన తర్వాత భవిష్యత్ లో ప్రజలకు, పరిశ్రమలకు అవసరమయ్యే  నీటి ని  అంచనా వేయడానికి 2011 జనాభా వివరాలను అందజేయాలని చీఫ్ ప్లానింగ్ అధికారికి సూచించారు. ఈ డేటా సేకరణ ఈ నెల 31 నాటికీ పూర్తి చేయాలనీ,  జనవరి 25  లోపల వెరిఫికేషన్ పూర్తిచేసి  రాష్ట్ర స్థాయి కమిటీ కి  జనవరి 31 కి చేరేలా  పంప వలసి ఉందని అన్నారు.   ఈ సమావేశం లో డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర రావు,  మున్సిపల్ కమీషనర్ వర్మ,  అటవీ, వ్యవసాయ, ఉద్యాన, నీటి పారుదల,  తదితర శాఖల అధికారులు హాజరైనారు. 

Vizianagaram

2020-12-18 22:55:57

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

మహిళ చేతిలో డబ్బు, అధికారం వుంటే  మహిళా సాధికారిత  సాధించగలరనే అభిప్రాయం తో  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు  పథకాలను  మహిళలకే ప్రాధాన్యత నిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్  చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.  శుక్రవారం  మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న ఆర్. సి పురం మండలం, సి. రామాపురం గ్రామంలో  చైర్ పర్సన్ కు చిత్తూరు ఆర్డీఓ రేణుక,  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, స్థానిక నాయకులు, మహిళలు, ఘన స్వాగతం పలుకగా ధర్మరాజుల గుడి ఆలయ అర్చకులు ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు.   గుడి  వద్ద ఏర్పాటు చేసిన  మహిళా మార్చ్ 100 రోజుల కార్యక్రమంలో చైర్ పర్సన్  ముఖ్య అతిధిగా పాల్గొనగా  మండల అభివృద్ది అధికారి అధ్యక్షత  వహించగా  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.                ఐ.సి.డి.ఎస్. ఏర్పాటు  చేసిన  స్టాల్స్ సందర్శించి  బాలల అన్న ప్రాసన కార్యక్రమం, గర్భిణీల  శ్రీమంతం కార్యక్రమం లో పాల్గొని,  అనంతరం  జ్యోతిని వెలిగించి  మహిళామణులతో ముఖాముఖీ కార్యక్రమం సాగించారు.  చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపిల్లలు పుట్టినప్పటి నుండి  వాళ్ళకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని  మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు  మరింత పటిష్టంగా  అమలు  కావడానికి  నేడు మహిళా లబ్దిదారులతో ముఖాముఖి  ఏర్పాటు చేసి  మీతో  స్వయంగా  పాలు పంచుకునే అదృష్టం కలిగిందని  అన్నారు.   మహిళలకు కష్టపడే మనస్తత్వం, కుటుంబం,  సమాజం  కోసం పాటు  పడతారని అందుకే అమ్మ ఒడి  పథకం నుండి   ఇంటి పట్టాలు , ఇల్లు  నిర్మాణాల   వరకు మహిళలకే అమలు చేస్తున్నారన్నారు.   వార్డు/ గ్రామ సచివాలయాలతో  పరిపాలన  మీ గ్రామనికే  వచ్చిందని, మహిళా రక్షణ   కార్యదర్శి మీకు అందుబాటులో  వున్నారని, ప్రతి గ్రామాన్ని  ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని ఆశిస్తున్నానని  తెలిపారు.  మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క జరుపుకుని ఆ తరువాత సాధికారిత మర్చిపోతున్నారని, అందుకే ముఖ్యమంత్రి మహిళా మార్చ్ - 100 రోజులు అవగాహనా కార్యక్రమాల ఏర్పాటుతో 2021 మార్చి 8 నాటికి పూర్తి అయ్యేలా నిర్వహణ జరపాలనే  ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. బాల్యవివాహాలకు స్వస్థి పలకాలని కోరారు. దిశ 112, నిర్బయ 9833312222 ఫోన్ నెంబర్లతో పాటు ఈ  చట్టాల మీద మహిళలు చైతన్యవంతులు కావాలని కోరారు.             చిత్తూరు  ఆర్ డి ఓ  రేణుకా మాట్లాడుతూ బాల్య వివాహాలు తల్లిదండ్రులు  ప్రోత్సహించరాదని,  ప్రభుత్వ పథకాలు అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ముఖాముఖీ కార్యాక్రమంలో  మహిళలు  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని,  స్థానిక శాసన సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్  రెడ్డి ని కరోనా కష్ట కాలం లో ఆదుకున్న  దేవుళ్లుగా   అభివర్ణించారు.  జగనన్న తోడు,  అమ్మ ఒడి, విద్యా దీవెన , రేషన్ కార్డు,   ఆరోగ్య శ్రీ  లబ్దిదారులు లబ్ది పొందిన విధానం ,  సచివాలయాల వల్ల  ఇంటి వద్దకే  పథకాలు  అందడం వంటివి  వివరించారు.   జగనన్న తోడు  లబ్దిదారులకు  రూ. 49.90 వేల చెక్కును చైర్ పర్సన్ చేతుల మీదుగా అందజేశారు.            సమావేశానంతరం మహిళలు మానవ హారంగా ఏర్పడి  మహిళల  సాధికారతకు  నినాదాలు చేశారు.         ఈ కార్యక్రమంలో  ఎం పి డి ఓ    రాజశేఖర్ రెడ్డి ,  తహసిల్దార్ మధుసూధన రావు, డైరెక్టర్  సూయజ్,  పి డి ఉమా మహేశ్వరి ,  సి డి పి ఓ పద్మజ, స్థానిక నాయకులు భాను, మోహన్,  ఢిల్లీ రాణి,  దామోదర్ రెడ్డి,  బ్రహ్మానంద రెడ్డి , యశోధ,  చంద్ర శేఖర్  తదితరులు పాల్గొన్నారు.  

Tirupati

2020-12-18 22:52:55

సచివాలయాల ద్వారానే సేవలందాలి..

గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజలకూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్  కె వి ఎన్  చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం  కోవూరు మండలం లోని  , వేగూరు గ్రామం రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసారు. ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర్  రోజుకు ఎంత మంది  రైతులు రైతు భరోసా కేంద్రాలకు వస్తున్నారు ? రైతులు  ఎం ఎం అడుగుతున్నారు తదితర వివరాలను జిల్లా వ్యవసాయ అధికారిని అడిగి తెలుసు కున్నారు. రైతు భరోసా కేoద్రం లోని విత్తనాల స్టాక్ ను పరిశీలించారు.  ఎకరానికి ఎంత విత్తనం అవసరమౌతుంది ,  ఏ ఏ రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నారు? ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయి? ఎంత పంపిణి జరిగింది ? మొదలైన వివరాలు అడిగి తెలుసుకున్నారు . అనంతరం రైతులతో సమావేశమైన జిల్లా కలెక్టర్  వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరూ విత్తనాలు తీసుకున్నారా అధికారులందరూ మీకు బాగా సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ రైతులకు విత్తనాలు పంపిణి చేశారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడుతూ నివర్ తుఫాను ప్రభావం వలన జిల్లాలో నవంబర్ 24 నుండి వారం రోజుల పాటు ఏడ తెరిపి లేకుండా వర్షాలు కురిశాయని జిల్లా వ్యాప్తంగా  27,000 హెక్టర్లలో వ్యవసాయం దెబ్బతిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు ఈ నెలాఖరుకు ఇన్పుట్ సబ్సీడీ చెల్లిస్తుందన్నారు . తుఫాన్  ప్రభావిత గ్రామాలలో 80 శాతం సబ్సీడీ తో నాణ్యమైన విత్తనాలను అందిస్తుందన్నారు. 665 రైతు భరోసా కేంద్రాలు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా  15,840 క్వింటాల్స్ విత్తనాలను రైతులకు పంపిణి చేస్తుందన్నారు. కౌలు రైతులు, ప్రభుత్వ  భూములలో వ్యవసాయం చేసుకునే వారికి కూడా సబ్సీడీ తో విత్తనాలు సరఫరా చేయబడతాయి అన్నారు . రైతులందరు వారికి దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి విత్తనాలు తీసుకోవచ్చన్నారు . రైతు భరోసా కేంద్రాల ద్వారా రసాయన  ఎరువులు, పురుగు మందులు కూడా సరఫరా చేయబడతాయి అన్నారు. పంటలు అమ్మ దలచిన రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవటానికి   తగిన ఏర్పాట్లు చేశామన్నారు.  ఎక్కువ ధాన్యం నిల్వ చేసుకోవటానికి గొడౌన్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండ వారి ధాన్యాన్ని రైతు భరోసా కేoద్రాల ద్వారా అమ్ముకోవాలని, రైతులందరు రైతు భరోసా కేంద్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం  చేపట్టిన   సమగ్ర భూ సర్వే మొదటి విడతగా   జిల్లాలో 400 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు. భూ సమస్యలన్నింటిని పరిష్కరించటానికి చెర్యలు తీసుకుంటున్నామని రైతాంగం వారి భూములను సర్వే చేయించుకోవాలన్నారు . రైతులకు ఏ విధమైన ఇబ్బంది జరిగిన ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందన్నారు. రైతులకు సబ్సీడీ పై విత్తనాలు ఇవ్వటం జరిగిందని, వేలి ముద్ర పడకపోతే వి. ఏ . వొలు వేలి ముద్ర వేసి రైతులకు విత్తనాలు అందిస్తారన్నారు .                      ఈ కార్యక్రమంలో  అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీ నిరంజన్ బాబు రెడ్డి , వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు  ఆనంద కుమారి , ఎం పి డీవొ . శ్రీ హరి, సచివాలయ సిబ్బంది  పాల్గొన్నారు . 

Kovur

2020-12-18 22:45:52

ఇందనాన్ని అత్యంత పొదుపుగా వినియోగించాలి..

విద్యుత్ పొదుపుగా వాడుకుంటే భావితరాల భవిష్యత్తు  బావుంటుందని జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్  చక్రధర్ బాబు అన్నారు.  శుక్రవారం సాయంత్రం వేదాయపాలెం లోని కరెంట్ ఆఫీస్ వద్ద   జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు( 14 డిసెంబర్ నుండి 20 డిసెంబర్ వరకు)  సందర్బంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ ధైనందిక జీవితంలో  తిండి , నీరు , బట్టలు  లాగ, విద్యుత్  కూడా ఒక   అవసరమని , పరిశ్రమల నుండి  మిక్సీ  వరకు ఏది నడవాలన్న   విద్యుత్ అవసరం  అయినందున  ప్రతి ఒక్కరు విద్యుత్ ను పొదుపుగా వాడాలన్నారు . విద్యుత్  ప్రతి ఒక్కరికి అవసరం అయినందున పొదుపుగా వాడుకుంటే భావి తరాల వారి భవిష్యత్ బావుంటుందన్నారు . ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలన్నారు . అదేవిదంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాటించాలన్నారు. విద్యుత్   వస్తువులు కొనేటప్పుడు 3 స్టార్స్  ఉన్న పరికరాలు    కొనుగోలు చేస్తే తక్కువ విద్యుత్ వాడటం జరుగుతుందన్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్ వివియోగాన్ని తగ్గించుకొని   విద్యుత్ ను   పొదుపు చేయాలన్నారు . రాష్ట్ర ప్రభుత్వం    వ్యవసాయ రంగానికి     పగటి పూట  9 గంటలు  నాణ్యమైన విద్యుత్ ను అందిస్తుoదన్నారు . దీని వలన విద్యుత్ విభాగం పై కొంత భారం పడిందన్నారు. అందు వలన అన్ని రంగాల వారు విద్యుత్ పొదుపును పాటించాలన్నారు .  అన్ని రంగాలకు ఎలక్ట్రిక్ కన్సర్వేషన్  ముఖ్యమైన అంశమన్నారు.  ప్రతి ఒక్కరు విద్యుత్   వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం  చేయాలన్నారు .  అనంతరం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా హరేందిర  ప్రసాద్ , విద్యుత్ శాఖ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. 

Nellore

2020-12-18 22:39:13

రూ.4కోట్లతో మార్కెట్ సుందరీకరణ..

శ్రీకాకుళంలో రూ. 4 కోట్లతో పొట్టి శ్రీరాములు మార్కెట్ సుందరీకరణ చేయడం జరిగిందని శాసన సభ్యులు మరియు  మాజీ మంత్రి వర్యులు ధర్మాన ప్రసాద రావు పేర్కొన్నారు.  శుక్రవారం స్ధానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎం.ఎల్.ఎ. మరియు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద రావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ తో తనకు అవినాభావ సంబంధం వుందన్నారు.  ఒక్కప్పటి మార్కెట్ దుస్థితి చూసి మార్కెట్ ను సుందరంగా తీర్చి దిద్దాలనే ఆలోచన కలిగిందని, ఆలోచన కార్యరూపం దాల్చడానికి అందరూ సహకారం అందించారని తెలిపారు. రూ. 4 కోట్లతో మార్కెట్ ను పునర్నిర్మించడం జరిగిందన్నారు.   ముఖ్యంగా జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనరు, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు బాగా సహకరించారని తెలిపారు.  ఈ నెలలోనే అందరికీ దుకాణాలను అప్పగించడం జరుగుతుందని తెలిపారు.   హోల్ సేల్ మార్కెట్ నిర్మిస్తామన్నారు.   పట్టణంలో రహదారులు విస్తరణ కార్యక్రమం చేపడతామన్నారు.  మెరుగైన పరిస్థితులకు నిజాయితీగా విధులను నిర్వహించాలని అధికారులకు సూచించారు.  మార్కెట్ అనేది వ్యాపారులతో పాటు పౌరులందరిదీ అని, సుమారు రెండు లక్షల మంది కొనుగోలు నిమిత్తం మార్కెట్టుకు వస్తారని తెలిపారు.  వారందరికీ మంచి పరిశుభ్రమైన వాతావరణంలో కొనుగోలు చేసే అవకాశం కలిగిందన్నారు. ప్రభుత్వం  సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని, అవినీతికి తావు లేని విధంగా పాలన అందించనున్నామని తెలిపారు.  కార్పోరేషన్ నిధులు, కేంద్ర నిధులతో పట్టణాన్ని అభివృధ్ధి చేస్తామన్నారు.  కళింగపట్నం బీచ్ ని విశాఖపట్నం బీచ్ మాదిరిగా అభివృధ్ధి చేయాలని, మంచి రోడ్లు నిర్మించి, ఫుడ్ కోర్టులు, హోటల్స్ ఏర్పాటు చేసి మంచి పర్యాటకంగా అభివృధ్ధి చేయాల్సిన అవసరం వుందన్నారు.  జిల్లా ప్రజలకు సర్వాంగ సుందరమైన శ్రీకాకుళాన్ని అందించాలన్నారు.   ఇందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని తెలిపారు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ, మార్కెట్ లో వున్న ఇబ్బందులను తెలుసుకుని మన శాసన సభ్యులు మార్కెట్ ను పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు.  జిల్లా కలెక్టర్ వారి సహకారంతో మార్కెట్ ప్రారంభించడం జరిగిందని అన్నారు.  రెండు రోజులలో షాపులను అప్పగించడం జరుగుతుందని సంతోషంగా, స్వేఛ్ఛగాను వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అందించిన విధంగానే వ్యాపారస్తులు పరిశుభ్రత పాటించాలన్నారు.   నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య మాట్లాడుతూ, మార్కెట్ పునరుధ్ధరణకు తమ సిబ్బంది చాలా కృషి చేసారని తెలిపారు.  అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన మార్కెట్ లో  అంతే పరిశుభ్రతను పాటించాలన్నారు.  ప్రతీ దుకాణం వద్ద డస్ట్ బిన్ లు పెట్టుకోవాలన్నారు.  రోజుకు మూడు సార్లు చెత్తడంపింగ్ కు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎం.ఎల్.ఎ. ధర్మాన ప్రసాదరావును గజమాలతో సన్మానం చేసారు.                            ఈ కార్యక్రమానికి నగరపాలక సిబ్బంది సత్యన్నారాయణ, వెంకట రావు, దక్షిణామూర్తి, సానిటరీ విభాగపు గణేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్లా అలివేలు మంగ, చల్లా శ్రీనివాస రావు,  కోణార్క్ శ్రీను, అంధవరపు రామ, డా. పైడి మహేశ్వర రావు, అంధవరపు సంతోష్,  మండవిల్లి రవి,  మత్స్యకార కార్పోరేషన్ డైరక్టర్ మహాలక్ష్మి, పి.రుషి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.కేశవ రావు, అర్జున్, ముకుంద్, అంధవరపు రఘు, మెంటాడ స్వరూప్ తదితరులు హాజరైనారు.

Srikakulam

2020-12-18 22:35:26

స్మార్ట్ సిటీ పనులు సత్వరమే పూర్తిచేయాలి..

స్మార్ట్ సిటీ అభివ్రుద్ధి పనులు నిర్ధేశించిన సమయానికి పూర్తిచేయాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెండవ జోన్ పరిధిలో 18వ వార్డు పాండురంగా పురం ప్రాంతంలోని స్మార్ట్ సిటీ పధకం కింద మంజూరైన రోడ్లు ఆధునీకరణలో భాగంగా ఆ ప్రాంతాలలో జరుగుచున్న ఫుట్ పాత్ ఏర్పాటు పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంలో పాండురంగాపురం పరిసర ప్రాంతంనకు సంబందించి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు ఫుట్ పాత్ నిర్మాణ విషయమై ఇచ్చిన పలు సూచనలను పరిశీలించి తగు చర్యలు చేపట్టమని స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్ ను ఆదేశించారు. డిశంబర్ నెల ఆఖరు నాటికి పనులు పూర్తీ అవ్వాలని సూచించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు పాండురంగాపురం ప్రాంతాలలో నీటిసరఫరా గత కొద్ది రోజులనుండి సరిగా జరగడం లేదని చెప్పగా, రెండు రోజులలో సమస్యను పరిష్కరించాలని నీటి సరఫరా విభాగపు అసిస్టెంట్ ఇంజినీరుని ఆదేశించారు.  ఆ ప్రాంతాలలో గల పెద్ద కాలువపై స్లాబ్ లు ఏర్పాటు చేయమని సభ్యులు కోరగా, వాటిని పరిసీలించి అంచనాలను తయారు చేయాలని రెండవ జోన్ కార్యనిర్వాహక ఇంజినీరుని ఆదేశించారు. పాండురంగాపురం ప్రాంతంలో గృహాల నుండి చెత్తను వేరుచేసి ఇవ్వమని, శానిటరీ సిబ్బంది ప్రజలకు చెప్పుచున్నది లేనిదీ అని సభ్యులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. సభ్యులు ఈ విషయంపై సంతృప్తి వ్యక్తపరిచారు. పాండురంగాపురంలో అభివృద్ధి చేసిన పార్కు అవసరాలకు శుద్ధి చేసిన భూగర్భ డ్రైనేజీ నీటిని సరఫరా చేయమని సభ్యులు కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. బీచ్ లోనికి వెళ్ళడానికి పాండురంగాపురం రోడ్డు ఒక్కటే ప్రజలు వాడుచున్నందున ట్రాఫిక్ సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుచున్నారని, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ రోడ్డు నుండి బీచ్ రోడ్ నకు వేరొక మార్గాన్ని అభివృద్ధి చేయాలని సభ్యులు కమిషనరును కోరారు.  ఈ క్షేత్ర పరిశీలనలో రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఏ.ఎం.ఓ.హెచ్. జయరాం, ఏ.సి.పి. భాస్కర బాబు, మెకానికల్ కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, స్మార్ట్ సిటీ కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, రెండవ జోన్ కార్యనిర్వాహక ఇంజినీరు కె. శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.శ్రీనివాస్, నీటి సరఫరా విభాగపు అసిస్టెంట్ ఇంజినీరు, శానిటరీ ఇన్స్ స్పెక్టర్, వార్డు కార్యదర్శులు,   రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-18 22:28:35

జిఇఆర్ పెంపునకు ప్రభుత్వ చర్యలు..

విద్యా రంగంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ‌రేషియో(జిఇఆర్‌) ‌పెంపుకు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు దోహదకారిగా నిలుస్తాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఉన్నత విద్యా మండలి శుక్రవారం ఉదయం ‘ఎన్‌హేన్స్‌మెంట్‌ ఆఫ్‌ ‌జిఇఆర్‌ ఇన్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఏపి-ఎప్రోచెస్‌ అం‌డ్‌ ‌స్ట్రాటజీస్‌’ ‌ప్యానల్‌ ‌డిస్కషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థూల నమోదు నిష్పత్తి కంటే రాష్ట్ర స్థూల నమోదు నిష్పత్తి అధికంగా ఉండే దిశగా కృషి జరగాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రోత్సాహం కల్పిస్తున్నారన్నారు. జగనన్న విద్యా దీవెతనకు అదనంగా జగనన్న వసతి దీవెన పథకం అమలు చేయడంతో పేద విద్యార్థులు పూర్తిస్థాయిలో విద్యలో రాణించడం సాధ్యపడుతోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్‌ ‌కాలంలో రాష్ట్రంలో ఉన్నత విద్యావంతుల సంఖ్యను గణనీయంగా పెంపుదల చేసే దిశగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలోఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య వి.బాలమోహన్‌ ‌దాస్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ‌కె. హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-18 22:21:20

నష్ట పరిహారాలు సత్వరమే అందజేయాలి..

ప్రభుత్వ పరంగా అందవలసిన పరిహారాన్ని షెడ్యూల్ కులాల, తెగల వారికి  సత్వరమే అందేలా చూడాలని  సంయుక్త కలెక్టర్(ఆసరా) జే. వెంకట రావు తెలిపారు. శుక్రవారం కల్లెక్టరేట్ ఆడిటోరియం లో ఎస్.సి., ఎస్.టి కులాల పై జరిగే దాడుల నిరోధ మానిటరింగ్ కమిటీ  3వ త్రై మాసపు సమావేశం జే.సి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జే.సి మాట్లాడుతూ  అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 14 మధ్య ఎస్.సి , ఎస్.టి కులాలకు  చెందిన 16 కేసులకు గానూ 8 కేసులకు పరిహారం అందించారని,  మిగిలిన 8 కేసులకు పరిహారాన్ని వెంటనే అందజేయాలని జిల్లా రెవిన్యూ అధికారికి తెలిపారు.  డి.ఆర్.ఓ  గణపతి రావు మాట్లాడుతూ  8 కేసులు ఇంకా ట్రైల్ లో ఉన్నాయని,  తీర్పు వెలువడిన వెంటనే పరిహారం అందిస్తామని తెలిపారు.  అక్టోబర్ 1  నుండి నవంబర్ 30 వరకు  వివిధ పోలీస్ స్టేషన్లలో 13 కేసులు దర్యాప్తు లో నున్నాయని,  అందులో 8 కేసులు సాక్ష్యాల పరిశీలనలో ఉన్నాయని, నాలుగు కేసులు కుల ధృవీకరణ, ఒకటి మెడికల్ సర్టిఫికెట్స్   కోసం పెండింగ్ ఉన్నాయని తెలిపారు.   కుల ధృవీకరణ పత్రాలను త్వరగా అందజేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించవచ్చని అన్నారు.  గత సమావేశపు అంశాలను, వాటి పరిష్కారాలను ముందుగా చర్చించారు. సభ్యల వినతులను రాసి సాంఘిక సంక్షేమ శాఖ  కు అందజేయాలని,  వాటిని పరిశీలించి తదుపరి సమవేశానికి   వాటి పై చర్యలను తెలియజెస్తామని జే.సి తెలిపారు. ఈ సమావేశం లో శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు,  విజయనగరం ఆర్. డి. ఓ భవాని శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సునీల్ రాజ్ కుమార్, డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర రావు,  మున్సిపల్ కమీషనర్ వర్మ,  పోలీస్,  పలు శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Vizianagaram

2020-12-18 21:55:28

గిరిజన విద్యార్ధులకు బి.ఇ.డి అవకాశం..

ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం భద్రాచలం ఐ.టి.డి.ఎ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ప్రత్యేక గిరిజన బి. ఇ.డి కళాశాలలో 2020 - 2022 విద్యాసంవత్సరం నకు గాను (22 వ బ్యాచ్) 2 సంవత్సరాల రెగ్యులర్ బి.ఎడ్ కోర్సులో ప్రవేశం నిమిత్తం ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుండి నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్టు పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాధ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గిరిజన అభ్యర్ధులు బిఈడిలోకి ప్రవేశాల కోసం తెలంగాణా , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాలకు చెందిన గిరిజన పట్టభద్రులై ఉండాలని,  40 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలని,  డిగ్రీ పరీక్షలో సాధించిన మెరిట్ ని బట్టి ఎంపిక జరుగుతుందని చెప్పారు. కాగా  మహిళలకు, ప్రత్యేక కేటగిరీ వారికి సీట్లు రిజర్వు చేసినట్టు వివరించారు.  ప్రభుత్వ ఉతర్వు లు నంబర్ 13, తేదీ 27-5-2017 నంబర్ : 53, తేదీ 19-5-2009 ప్రకారం మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుందన్నారు.   పార్వతీపురం ఐటిడిఎ సబ్ ప్లాన్ మండలాలలో ఉన్న విద్యార్థులకు పార్వతీపురం ఐ టి డి ఎ కార్యాలయంలో ప్రాస్పెక్ట్ , దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చు, అలాగే పోస్ట్ ద్వారా దరఖాస్తులు పొందగోరి అభ్యర్థులు తమ సొంత చిరునామా గల కవర్(రూ.10/- స్టాంప్ ఆతికించి) ను ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలం కు పంపి దరఖాస్తు పొందవచ్చు. దరఖాస్తు పూర్తిగా చదివి సక్రమంగా పూర్తిచేసి జనవరి8, 2021 నాటికి కార్యాలయానికి అందేవిధంగా పంపించాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి  ఆర్ కూర్మనాథ్  తెలిపారు.

Parvathipuram

2020-12-18 21:53:17

30న విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ఈ నెల 30న విజయనగరం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆరోజు పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ చేసి, ఇంటి నిర్మాణాల‌ను ప్రారంభించ‌నున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప్రారంభించింది.  దీనిలో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌, ఎస్‌పి బి.రాజ‌కుమారి, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, ఇతర అధికారులు శుక్ర‌వారం సాయంత్రం గుంక‌లాం లేఅవుట్‌ను ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న కోసం ప‌రిశీలించారు. ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి గుర్తుగా ఏర్పాటు చేయ‌నున్న పైలాన్‌, హెలీపేడ్‌, స‌భ కోసం స్థ‌లాల‌ను ప్రాధ‌మికంగా ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి స‌భ కోసం భారీగా త‌ర‌లివ‌చ్చే ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు, అదేవిధంగా ముఖ్య అతిధుల‌కోసం వేర్వేరుగా మార్గాల‌ను గుర్తించాల‌ని సూచించారు. స‌భా స్థ‌లాన్ని పూర్తిగా చ‌దును చేయాల‌న్నారు. లేఅవుట్ వ‌ద్ద ఉన్న చెరువును సుంద‌రంగా తీర్చిదిద్దే ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌న్నారు.  చెరువుకు స‌మీపంలో పైలాన్‌ను నిర్మించాల‌న్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు, ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళికాబ‌ద్దంగా, ప‌టిష్టంగా ఏర్పాట్లు చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, డుమా పిడి ఏ.నాగేశ్వ‌ర్రావు, తాశీల్దార్ ప్ర‌భాక‌ర‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-18 21:48:21

పెదపాడు చెరువు సుందరీకరణ..

శ్రీకాకుళంలోని పెదపాడు చెరువు సుందరీకరణకు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు  సమావేశ మందిరంలో పెదపాడు చెరువు సుందరీకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో  ప్రజలకు కేవలం సినిమా ఒక్కటే వినోదం కలిగించే సాధనం మన్నారు. అదే విధంగా వాకింగ్ కి కూడా కేవలం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ మాత్రమే అవకాశం వుందన్నారు. కావున  పెదపాడు చెరువును రూ.7.50 కోట్లతో మంచి రిక్రియేషన్ పార్కుగాను,   అధునాతనంగాను   సుందరీకరణతోను రూపొందించే చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.  తద్వారా జిల్లా ప్రజలు  కుటుంబంతో సెలవు రోజులలో సంతోషంగా గడిపే అవకాశం వుంటుందన్నారు. కావున పరిశ్రమలు, స్వఛ్ఛంద సంస్ధలు, సామాజిక బాధ్యతగా చెరువు అభివృధ్ధికి తమ వంతు సహకారం  అందించాలని అన్నారు. అనంతరం మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ, శ్రీకాకుళం అతి చిన్న పట్టణమని, తర తరాలుగా వెనుక బడి వున్నదని అన్నారు.  జిల్లా  కలెక్టర్ గారి ఆలోచన చాలా మంచిదన్నారు. జిల్లాలో  మంచి ఆహ్లాదకర వాతావరణం వుందని, వంశధార, నాగావళి నదులు, సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం వున్నాయన్నారు.   ఇప్పటి వరకు నిరుపేదలకు 70 లక్షల ఎకరాల వరకు భూములను పంచడం జరిగిందన్నారు.   జిల్లాలోని ప్రజలకు రిక్రియేషన్ కలిగించడానికి పెదపాడు చెరువును అభివృధ్ధి చేసి సుందరీకరణకు ముందడుగు వేయడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు.  పెదపాడు చెరువు పట్టణానికి చేరువలో వుందని, ఇరువైపుల నది  వుందని, త్వరలోనే  కార్పొరేషన్ గా రూపొందనున్నదని తెలిపారు.  పరిశ్రమలు సామజిక బాధ్యతగా  తమ వుంతు సాయమందించాలన్నారు. మంచి పార్క్, వాకింగ్ ట్రాక్, పిల్లలకు రిక్రియేషన్ కలిగించే విధంగా సుందరీకరణ చేయాలని, భావి తరాలకు, పిల్లలకు మంచి పట్టణాన్ని అందించాలని అన్నారు.  ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కావాలి. ప్రజలకు ఆహ్లాదం అందించాలని పరిశ్రమలు, స్వఛ్ఛంద సంస్థలు  ఈ కార్యక్రమంలో సాయమందించాలన్నారు.                         ఈ కార్యక్రమంలోఅడిషనల్ ఎస్.పి. సోమశేఖర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పి. డి. హెచ్. వి. కూర్మారావు, జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఆర్ డి ఓ కిషోర్,ఎం డి ఓ,ప్రకాష్,  పరిశ్రమల జిల్లా మేనేజర్ గోపాల కృష్ణ, డా. దానేటి శ్రీధర్, అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్  తులసీ రావు,అరబిందో పరిశ్రమల యాజమాన్యం, ఎన్ ఎ సి ఎల్. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి వి. రాజులు, డి జి ఎం   పి ఎస్ వి ఎస్ ఎన్. వర్మ,  ఎ.పి. గ్రీన్ కార్పోరేషన్ జోనల్ మేనేజరు జి.మంగమ్మ, గీతా శ్రీకాంత్, సురంగి మెహన్ రావు,,రోటరీ క్లబ్, బ్రెడ్స్, తదితర స్వచ్చంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-18 21:27:32