ఆంగ్ల భాష అభ్యసనాన్ని అమెరికాదేశం ప్రోత్సహిస్తుందని అమెరికన్ కాన్సులేట్ జనరల్(హైదరాబాద్) పబ్లిక్ అఫైర్స్ అధికారి డేవిడ్ డబ్య్లూ మోయర్ అన్నారు. గురువారం ఏయూను సందర్శించిన ఆయన వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డేవిడ్ మోయర్ మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంతో విద్య, పరిశోధన సంబంధ భాగస్వామ్యం తాము కోరుకుంటున్నామన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన హర్షదాయకమన్నారు. మహిళా విద్యకు ఆంధ్రవిశ్వవిద్యాలయం అందిస్తున్న ప్రాధాన్యం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా వర్సిటీ పరిపాలనా పదవుల్లో సైతం మహిళా భాగస్వామ్యాన్ని స్వాగతించారు. అనంతరం వర్సిటీలో వివిధ విభాగాలలో జరుగుతున్న పరిశోధనలు, మౌళిక వసతులు, భాగస్వామ్యానికి అనువైన విధానాలను పరిశీలించారు.
ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డిఅంతర్జాతీయ విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని ఆంధప్రదేశ్‌లో కోరుకుంటున్నారన్నారు. దేశంలోని అత్యుత్తమ 10 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఏయూ నిలవాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, దీనిని సాకారం చేసే దిశగా తాము కృషిచేస్తున్నామన్నారు. విశాఖలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మశీ, డిగ్రీ కళాశాలల్లో లక్షలాది మంది విద్యను అభ్యశిస్తున్నారని వివరించారు. ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా ఇప్పటికే విశాఖపట్నం ఖ్యాతి గాంచిందని తెలిపారు.రాష్ట్రంలో ఐటి రంగానికి పరిశ్రమల ఏర్పాటుకు చిరునామాగా విశాఖ నగరం నిలుస్తోందన్నారు. ఈ రంగానికి అవసరమైన విలువైన మానవ వనరులను అందించే కేంద్రంగా ఏయూ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిన ఘనత ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డికి దక్కుతుందన్నారు. జ్ఞానాన్ని ప్రసరింపచేస్తూ, నిపుణులను తీర్చిదిద్దే వేదికగా ఏయూ నిలుస్తోందని తెలిపారు.
ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ ఏయూ ప్రగతిని, ప్రత్యేకతలను వివరించారు. ఏయూలో ప్రత్యేకంగా ఐపిఆర్ చెయిర్‌ను ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను డేవిడ్ మోయర్‌కు తెలియజేశారు. ఈ పథకాల ఫలితంగా గ్రామీణ విద్యార్థులు సైతం నాణ్యమైన ఉన్నత విద్యను పొందడం సాధ్యపడుతోందని వివరించారు.
కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, ప్రిన్సిపాల్స్ ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, పి.రాజేంద్ర కర్మార్కర్, ఎస్.సుమిత్ర, ఎస్.కె భట్టి, ఆచార్య భాస్కర రెడ్డి, ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, ఆచార్య చల్లా రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా డేవిడ్ మోయర్‌ను ఏయూ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి సత్కరించారు.
భారీ నిర్మాణాల సమయంలో నేల స్వభావాన్ని అధ్యయనం చేసి తదనుగుణంగా నిర్మాణాల ప్రణాళిక తీర్చిదిద్దాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సు ‘ఇండియన్ జియోటెక్నికల్ కాన్ఫరెన్స్ 2020’ని ఆయన ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేల స్వభావాన్ని అధ్యయనం చేసి నిర్మాణం చేపట్టడం వలన అనవసర వ్యయం, వృధాను నివారించడం సాధ్యపడుతుందన్నారు. సిమెంట్ గ్రౌటింగ్ చేసి ఏయూలో చేపట్టిన నిర్మాణం, దీని ద్వారా వనరులను, నిధులను, సమయాన్ని ఆదా చేసిన విధానాన్ని వీసీ ప్రసాద రెడ్డి ఉదహరించారు.
జియో టెక్నికల్ సొసైటీ ప్రాంతీయ కేంద్రం చైర్మన్ ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి సదస్సు కన్వీనర్‌గా వ్యవహరిస్తూ సదస్సుకు ప్రతినిధులను ఆహ్వానం పలికారు. సదస్సులో 26 ప్రత్యేక ప్రసంగాలు ఏర్పాటు చేసారన్నారు. 327 పరిశోధన పత్రాలను, 14 టెక్నికల్ సెషన్స్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సుకు ఆన్‌లైన్‌లో 600 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సాయిల్ మెకానిక్స్ అండ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్(ఐఎస్‌ఎస్‌ఎంజిఇ) అద్యక్షుడు ఆచార్య చార్లెస్ ఎన్‌జి సదస్సు ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఐఎస్‌ఎస్‌ఎంజిఇ ఉపాద్యక్షుడు(ఆసియా) ఆచార్య ఇ.సి షిన్, ఐఎస్‌జి అద్యక్షుడు ఆచార్య జి.ఎల్ శివ కుమార్ బాబు తదితరులు సదస్సు సావనీర్, సాంకేతిక సంచికలను విడుదల చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య టి.వి ప్రవీణ్ విభాగ ప్రత్యేకతను, పరిశోధనల ప్రగతిని వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య పి.వి.వి సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.
ఐఐటి గౌహతి సంచాలకులు ఆచ్యా టి.జి సీతారాం 42వ ఐజిఎస్ వార్సిక ప్రసంగాన్ని ‘ ది క్విటిసెన్స్ ఆఫ్ 25 ఇయర్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంశంపై ప్రసంగించారు. హాంకాంగ్ వర్సిటీ ఆచార్యులు ఆచార్య చార్లెస్, సౌత్ కొరియా ఇంచియాన్ వర్సిటీ ఆచార్యులు ఇ.సి షిన్, ఐఐఎస్‌సి బెంగళూరు ఆచార్యులు జి.ఎస్ శివ కుమార్ బాబు, యుకెలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆచార్యులు ఆచార్య గోపాల్ మాడభూషి, ఐఐటి ముంబాయి ఆచార్యులు దీపాంకర్ చౌదురిలు కీలకోపన్యాసాలను అందించారు.
షర్మిల ఎంతో ధైర్యవంతురాలని,డైనమిక్ నాయకురాలని విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. గురువారం ఆంధ్రుల అభిమాన నాయకుడు వై ఎస్ రాజశేఖర రెడ్డి గారాల తనయ,ఆంధ్రరాష్ట్రముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముద్దుల చెల్లెలు షర్మిల పుట్టినరోజు వేడుకలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అన్న తో పాటు ఎన్నో కష్ట నష్టాలను భరించి ఓపిగ్గా,ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొని పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారని కొనియాడారు.భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని బాధ్యతాయుతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.అనంతరం నియోజకవర్గ మహిళానాయకుల,అభిమానుల,కార్యకర్తల ఆనందోత్సహాల మధ్య వాసుపల్లి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సిటీ మహిళా ప్రెసిడెంట్ గరికిన గౌరి, సౌత్ మహిళా ప్రెసిడెంట్ నీలాపులక్ష్మీ,మరియు 14మంది వార్డ్ మహిళా అధ్యక్షురాళ్లకు శాలువాలతో సన్మానించి చీరలు అందచేశారు.ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలు,కార్యకర్తలు,అభిమానులు షర్మిల కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
జాతీయ ప్రజా సంబంధాల నిపుణుల సంస్ధ (పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా) విశాఖ విభాగం 2020-2022 నూతన చైర్మన్ గా పి.ఎల్.కె.మూర్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు విశాఖలో గురువారంలో కమిటీని ఎన్నికల విభాగం ప్రకటించింది. ఇందులో వైస్ చైర్మన్‌గా, స్టీల్ ప్లాంట్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ ఆర్.పి.శర్మ, కార్యదర్శిగా హెచ్ పి సి ఎల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్)ఎం.కె.వి.ఎల్. నరసింహం, సంయుక్త కార్యదర్శిగా విశాఖ డైరీ ప్రజా సంబంధాల అధికారి ఎ.గోవిందరావు, కోశాధికారిగా గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రజా సంబంధాల అధికారి ఎన్.వెంకట నరసింహం ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్టీపిసి, మేనేజర్, పబ్లిక్ రిలేషన్సు టి.మల్లయ్య, ఇకో రైల్వే సీనియర్ పి ర్ ఇన్స్పెక్టర్ బి.జయరామ్ ఎన్నిక అయయారని ఎన్నికల అధికారి కె.రామారావు తెలిపారు. నూతన కార్య వర్గాన్ని పిఆర్ఎస్ఐ దక్షణ భారత ఉపాధ్యక్షుడు యు.ఎస్. శర్మ, చాప్టర్ సలహదారు ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి ఓ కార్యక్రమంలో అభినందించారు.
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వాక్సిన్ ఇచ్చేవారికి సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. వాక్సినేషన్ పాయింట్ లను పక్కాగా గుర్తించాలని ఆయన స్పష్టం చేసారు. వాక్సిన్ బాక్సులను పిహెచ్సిల నుండి గ్రామ సచివాలయం వరకు రవాణా చేయాలని, అందుకు తగిన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ మొదటి ప్రాధాన్యత హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 20 వేల మంది ఉంటారని అంచనా ఉందని చెప్పారు. రెండవ దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రభావిత వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 15 వేల మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 50 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఇతర రుగ్మతలతో ఉన్నవారు, 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని మూడవ దశలో తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలో 30 శాతం జనాభా, 5 లక్షల వరకు ఉంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆయా వర్గాల డేటా బేస్ పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే వాక్సిన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేసారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించిన విధంగా పకడ్బందీగా వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. జాబితాలోకి అనవసరపు పేర్లు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మూడవ గ్రామ స్థాయిలో వాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాక్సిన్ పంపిణీ సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలని, ఇపిడిసిఎల్ ఎస్ఇ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి వాక్సిన్ పాయింట్ వద్ద వేచి ఉండే గది, అబ్జర్వేషన్ రూమ్ ఉండాలని అక్కడ విధిగా ఒక ఆశా కార్యకర్త ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వాక్సిన్ దుష్ప్రభావాలు చూపిస్తే అందుకు తగిన చికిత్స అందించుటకు అవసరమైన వైద్యులతో ఒక కేంద్రం అందుబాటులో ఉండాలని సూచించారు. ఏరియా ఆసుపత్రిలో 10 బెడ్లు, బోధన ఆసుపత్రిలో 20 బెడ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని,ఐస్ బాక్స్ లు సరిపడినంత ఉండాలని, అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి, తదితర వర్గాల సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, డిఎంహెచ్ఓ కె.సి.నాయక్, ఏఎస్పీ పి.సోమశేఖర్, డిఎస్పీలు సి.హెచ్.జి.వి.కె.ప్రసాద్, మహేంద్ర, ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా. కె.అప్పారావు, డా. ఎన్. అనురాధ, డా.ఎల్. భారతి కుమారి దేవి, డా. కృష్ణ మోహన్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్ఎంఓ డా.ఆర్.అరవింద్, డిసిహెచ్ఎస్ డా.బి.సూర్యారావు, డిటిసి డా.వడ్డి సుందర్, ఎమ్. హెచ్.ఓ డా.ఎం.వెంకట రావు, డిఎంఓ జి.వీర్రాజు, డిఆర్డిఏ పిడి బి.శాంతి శ్రీ, ఇపిడిసిఎల్ ఎస్ఇ ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం మధురవాడ శిల్పారామంలో రాష్ట్ర శిల్పారామం సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 16నుండి 30 వరకూ అఖిల భారత హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళా-2020 నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాసరావు)వెల్లడించారు. విశాఖపట్నంలో 15రోజుల పాటు నిర్వహించే ఈఅఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శన (హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళాను) బుధవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకు నుండి ఆయన వర్ట్సువల్ విధానం ద్వారా మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ హేండ్లూమ్స్ డెవలప్మెంట్ కమీషనర్ సహకారంతో ఈనెల 16నుండి 30 వరకూ 15రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈఅఖిల భారత హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళా-2020లో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్,ఢిల్లీ, ఉత్తరాఖాండ్ తదితర ఏడు రాష్ట్రాలకు చెందిన సుమారు 70 చేనేత హస్తకాళాకారుల సంఘాలు పాల్గొంటున్నాయని ఆయన వివరించారు.
చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వివిధ వస్తువులు,వస్త్రాలకు పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ఇలాంటి ప్రదర్శన(మేళాలు)ఎంతగానో దోహదం చేస్తాయని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేనేత హస్తకళా ప్రదర్శన(ఎగ్జిబిషన్)లను ఏర్పాటు చేయడం ద్వారా చేనేత హస్తకళా వస్తువులకు వస్త్రాలకు మరిన్ని మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత హస్తకళాకారులను ఆదుకునేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బిసి కులాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి కోసమే 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వీటి ద్వారా వివిధ బిసి కులాలకు చెందిన వారంతా రానున్న రోజుల్లో ఆర్ధికంగా సామాజికంగా రాజకీయ పరంగా మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. చేనేత హస్తకళాకారులు తయారు చేసే ప్రతి వస్తువును,వస్త్రానికి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు.
ఈఅఖిల భారత హేండ్లూమ్స్ క్రాప్ట్స్ మేళా-2020 వర్ట్సువల్ విధానంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక మరియి యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ,రాష్ట్ర పర్యాటక శాఖ ఎండి ప్రవీణ్ కుమార్,శిల్పారామం సిఇఓ జయరాజు,పర్యాటకశాఖ సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళ స్ధలాల కొరకు సిధ్ధం చేసిన లేఅవుట్లలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత తెలిపారు. బుధవారం కాకినాడ కుళాయి చెరువు వద్దనున్న కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో లబ్దిదారులకు ప్లాట్స్ కేటాయింపుకు సంబంధించి లాటరీ నిర్వహణకు కాకినాడ ఎం.పి. వంగా గీత, సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగ ఇళ్ళ స్ధలాల కొరకు ప్రభుత్వ భూములే కాకుండా ప్రైయివేటు భూములు సైతం కొనుగోలు చేసి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తం మీద పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పధకానికి సంబంధించి సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ స్ధలాల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం శుభపరిణామమని ఆమె తెలిపారు. కాకినాడ పట్టణ వాసులకు కొమరగిరిలో సిధ్దం చేసిన లేఅవుట్ రాష్ట్రంలోనే పెద్ద లేఅవుట్ అని అన్నారు.
గతంలో లబ్దిదారులకు ఇచ్చే ఇళ్ళ స్ధలాలు ఏ భూమి ఎక్కడ ఉందో వివరాలు ఉండేవి కాదని, కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని లేఅవుట్లు పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళు నిర్మించేంత వరకు పేదలందరికీ ప్రభుత్వం అండగా వుంటుందని ఎంపి తెలిపారు.
సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ పట్టణ వాసులకు త్వరలోనే స్వంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. పేదల ఇళ్ళ స్ధలాల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు వెచ్చించి లేఅవుట్లను సిధ్ధం చేయడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 650 ఎకరాల్లో 30,598 ఫ్లాట్స్ ను ఇళ్ళ స్ధలాల కొరకు లేఅవుట్స్ సిధ్ధం చేయడం జరిగిందన్నారు. పట్టణ వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, త్రాగు నీరు, తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేవిధంగా లేఅవుట్స్ సిధ్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే సిధ్ధం చేసిన లేఅవుట్స్ వద్దకు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో బస్సుల ద్వారా లబ్దిదారులను తీసుకువెళ్ళి తమకు కేటాయించిన ఇళ్ళ స్ధలాలను చూపించడం జరిగిందన్నారు. జాబితాలో లబ్దిదారులు ఎవరైనా తప్పిపోయిన దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను బట్టి 3 నెలల్లోనే ఇళ్ళ పట్టా ఇవ్వడం జరుగుతుందని ఎంఎల్ఏ తెలిపారు.
నగర పాలక సంస్ధ కమీషనర్ స్వప్నిల్ దిన్కర్ పుడ్కర్ మాట్లాడుతూ లబ్దిదారుల ప్లాట్లు కేటాయింపుకు సంబంధించి ఎటువంటి అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా లాటరీ నిర్వహించడం జరుగుతుందన్నారు. కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ పధ్ధతిలో లబ్దిదారులకు ఫ్లాట్స్ ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కాకినాడ పట్టణవాసులకు సంబంధించి గతంలో కొమరగిరి లేఅవుట్ కు లాటరీ నిర్వహణ పూర్తి కాగా, ఈ రోజు చొల్లంగి, పటవల, జీ.వేమవరం, కోమరగిరి, అచ్చుతాపురత్రయం లలో సిధ్ధం చేసిన సుమారు 287 ఎకరాల విస్తీర్ణంలో 11,668 లబ్దిదారులకు ప్లాట్లును లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కమీషనర్ తెలిపారు. అనంతరం ఎంపి, ఎంఎల్ఏ, కమీషనర్ చేతుల మీదుగా కంప్యూటరైజ్డ్ లాటరీ నిర్వహించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమీషనర్ సిహెచ్.నాగనర్శింహారావు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు, లబ్దిదారులు తదిరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపడుతున్న జగనన్న తోడు పథకం అమలులో బ్యాంకు అధికారులు సహాయ సహకారాలు అందజేయాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు కోరారు. జగనన్న తోడు పథకంలో భాగంగా వివిధ బ్యాంకులకు ఆర్థిక సహాయం నిమిత్తం పలువురు పెట్టుకున్న దరఖాస్తుల స్థితిని, అమలు ప్రక్రియను పరిశీలించేందుకు ఏపీజివిబి, ఐ.ఓ.బి. బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలను బుధవారం ఆయన సందర్శించారు. లబ్ధిదారులు పెట్టుకున్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరింపజేశారు. లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమీక్షించారు. జగనన్న తోడు పథకంలో ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని కోరారు. త్వరితగతిన మిగిలిన దరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు పథక ఫలాలు అందేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ అధికారుల నుంచి, సిబ్బంది నుంచి ఎలాంటి సహాయం అయినా అందిస్తామని ఈ సందర్భంగా జేసీ అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, మెప్మా పి.డి. సుగుణాఖర్ రావు, ఎంపిడివోలు, ఏసీలు, ఏపీ ఎంలు, సి.సి.లు, తదితరులు ఉన్నారు.
వైఎస్.షర్మిల విశాఖలోని వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి ఎనలేని అభిమానమని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలోని బుధవారం పార్టీకార్యాలయంలో వైఎస్సార్సీపీ సౌత్ ఎలక్షన్ ఇన్చార్జి గొంపభాను ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ కేక్ ని కట్ చేసి షర్మికు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనో రాష్ట్రం శుభిక్షంగా ఉందని, షర్మిలమ్మ కూడా ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తే మరింతగా మహిళలకు దగ్గరగా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళల కోరిక మేరకు షర్మిలమ్మ రాజకీయాల్లోకి వచ్చి మహిళా సంక్షేమం కోసం మరింత చేదోడుగా ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు 11వ వార్డు కార్యకర్త బూసి వరలక్ష్మికి షర్మిల జన్మదిన కానుకను అందజేశారు. గొంపభాను మాట్లాడుతూ, రాష్ట్రంలో జగనన్న వదిలిన భాణంగా విశాఖలో షర్మిలమ్మ పాదయాత్ర చేసిన సమయంలో మహిళలకు ఆమె ఎంతగానో చేరువయ్యారన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ వస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు మహిళా కార్యకర్తలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు గాజులను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇసుక కొరత ఉండరాదని మైన్స్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. బుధవారం ఇసుక పై జిల్లా కలెక్టర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పాలసీనే కొనసాగించాలన్నారు. ప్రజలకు అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లు వద్ద నిలువ ఉంచుకోవాలని చెప్పారు. ఇసుక కావలసిన వారికి డోర్ వెలివరీ చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ కొత్త రీజ్ లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలన్నారు. రాబోయే రోజుల్లో గృహాలు నిర్మాణాలకు ఇసుక అవసరమౌతుందని, సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఏ సమస్యలు లేకుండా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఇసుక సరఫరాకు జిల్లాలో ఏ విధమైన సమస్య లేదన్నారు. బుకింగ్ లో ఏ విధమైన సమస్యలు లేవని తెలిపారు. ఇసుక కావలసిన వారికి డోర్ డెలివరి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన ఇసుకను శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల నుండి తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఏ విధమైన సమస్యలు లేవని చెప్పారు. ఈ సమావేశంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మైన్స్ శాఖ ఉప సంచాలకులు సత్తిబాబు, విశాఖపట్నం, అనకాపల్లి సహాయ సంచాలకులు డివిఎస్ఎన్ రాజు, ప్రకాష్ కుమార్ పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో 12 లక్షల బియ్యం కార్డులను పారదర్శకంగా పంపిణీ చేయడం జరిగిరిదని సంయుక్త కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశముల ననుసరించి రేషన్ కార్డులలోని యూనిట్లను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న పదిరోజులలోగా బియ్యం కార్డు జారీ చేస్తున్నట్లు చెప్పారు. జూన్ మాసం నుండి ఇప్పటి వరకు 36,509 మందికి కొత్త కార్డులు, 22,802 మందికి పాత కార్డు నుండి విభజించి కొత్త కార్డులు జారీ చేశామన్నారు. 1,27,987 మంది కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చగా 382 మందిని తొలగించామని చెప్పారు. సరకు లేక పోవడం, నాసిరకం సరకు, అధికరేట్లు, తూకంలో తేడాలు, అక్రమరవాణాల పై వచ్చిన ఫిర్యాదుల పై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
పౌర సరఫరాల అధికారి కె.శివప్రసాద్ నివేదికను సమర్పిస్తూ గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను చదివి వినిపించారు. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల లభ్యత, ప్రజాపంపిణీ వ్యవస్థ, నిత్యావసర సరుకుల రవాణా, రేషన్ షాపుల వివరాలు తదితర వివరాలను తెలియజేశారు. కమిటీ సభ్యులు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు కె.వెంకటరమణ మాట్లాడుతూ నిల్వ వుండిపోయిన కిరోసిన్ పై తగిన చర్యలు తీసుకోవాలని, కొన్ని చోట్ల సరుకును డబ్బాల ద్వారా కొలిచి ఇస్తున్నారని, తూనిక ద్వారానే ఇచ్చేట్టు, తూనికలు కొలతల శాఖ తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వినియోగదారుల సంక్షేమ సంఘాల భవన నిర్మాణానికి నిధులు మంజూరై వున్నందున స్థలాల కేటాయింపుకు చర్యలు తీసుకోవలసినదిగా అభ్యర్ధించారు. సభ్యులు మాట్లాడుతూ రైతు బజార్లలో పారిశుధ్యం మెరుగు పరచాలని, ధరల పట్టికలను ఉదయాన్నే సరిచేయించాలని కోరారు. ఏజెన్సీలోరోడ్లపై దుకాణాలను తీయించాలని, కల్తీని అరికట్టేందుకు తరచూ తనిఖీలు నిర్వహించాలని, కేసులు పెట్టాలని, రేషన్ షాపులకు మంగళవారం శలవు పునరుద్దరించాలని, వినియోగ దారుల క్లబ్బులను చైతన్యవంతం చేయాలని, వినియోగ దారుల హక్కులు, పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. సభ్యుల సలహాలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని జె.సి. చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సంఫరాల అధికారి (సిటీ) నిర్మలాబాయి, పౌర సరఫరాల సంస్థ డివిజనల్ మేనేజరు వెంకటరమణ, కమిటీ సభ్యులు జగదీశ్వరరావు, రామారావు, కె.శ్రీనివాసరావు, ఆర్.సత్యనారాయణ, సంతోష్ కుమార్, ఎస్.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాల్లో అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక సరఫరాను సులభతరం చేయాలని, ఇందుకు అవసరమైన ఇసుక నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మరియు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాల్మన్ ఆరోక్య రాజ్ లు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరాను సులభతరం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడంలో భాగంగా, బుధవారం సచివాలయం నుండి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర సీఎం కార్యదర్శి సాల్మాన్ ఆరోక్యరాజ్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసిలతో సమీక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు ఎలాంటి కొరత లేకుండా ఆయా జిల్లాల్లో ఇసుక నిల్వలను పెంచుకునేందుకు కలెక్టర్లు, సంబంధిత జేసీలు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇసుక బుకింగ్ శాతం పెంచాల్సి ఉందని,ప్రజా అవసరాలకు ఎలాంటి కొరత లేకుండా ఇసుక నిల్వలను పెంచుకోవాలన్నారు.
అందుబాటులో ఉన్న ఇసుక రీచులతోపాటు అవకాశం ఉన్న చోట్ల కొత్త ఇసుక రీచులను గుర్తించి స్టాకు పాయింట్లలో ఇసుక నిల్వలను పెంచాలన్నారు. భూగర్భ జల శాఖ అధికారులు సమన్వయంతో, రీ సర్వేలు నిర్వహించి అనుకూలమైన చోట్ల కొత్త రీచులను గుర్తించి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాల కట్టడాలకు, ప్రభుత్వం చేపట్టబోయే గృహ నిర్మాణాలకు భారీ స్థాయిలో ఇసుక అవసరం అవుతుందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక నిల్వలను పెంచుకునేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డోర్ డెలివరీ నిర్వహణను నిరంతరాయంగా సాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్న స్థానిక రీచ్ లను గుర్తించి ఇసుక డిపోలను నెలకొల్పాలన్నారు. అనంతరం ఆయా జిల్లాలోని ఇసుక డిపోలలో స్టాకు వివరాలు, క్షేత్ర స్థాయిలో ఆపరేషన్ లో ఉన్న ఇసుక రీచుల పరిస్థితిపై కలెక్టర్లతో సమీక్షించారు.
తనకల్లు తహసీల్దార్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలు, ఇటీవల నివార్ తుఫాను ప్రభావంతో నదీ పరివాహ ప్రాంతాల్లో నీరు చేరడంతో.జిల్లాలోని 130 థర్డ్ ఆర్డర్ ఇసుక రీచుల్లో నీరు చేరిందన్నారు. తద్వారా ఇసుక నిల్వలను పెంచుకోలేకపోవడం జరిగిందన్నారు. వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇసుకను అందించడంపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. కొత్తగా11 ఇసుక రీచ్ లను గుర్తించామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని వివరించారు.ఇసుక రీచులు నీటితో నిండి ఉండటంతో ప్రస్తుతం ఇసుక నిల్వల కొరత ఏర్పడిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ చేస్తున్నామన్నారు. వీలయినంత త్వరలో ఇసుక నిల్వలను పెంచి ప్రజల అవసరాలకు సరిపడా డిపోల్లో నిల్వలను పెంచేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కదిరి ఆర్డీఓ వెంకట శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఎఫ్ -1ఏ గ్రేడ్ -3 మోటార్ రేస్ ట్రాక్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. బుధవారం కదిరి ఆర్డీఓ వెంకట శివారెడ్డి,టూరిజం రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య లతో కలిసి 150 కోట్ల రూపాయలతో తనకల్లు మండలం కోటపల్లి వద్ద 219 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎఫ్ -1ఏ గ్రేడ్ -3 మోటార్ రేస్ ట్రాక్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిధి మార్క్1డైరెక్టర్ అనుష్ చక్రవర్తి అక్కడ ఏర్పాటు చేస్తున్న రేస్ ట్రాక్, గోల్ఫ్ కోర్స్,హాస్పిటల్ తదితర వివరాలను,ప్రస్తుతం చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం రేస్ ట్రాక్ కోసం భూములు ఇచ్చిన రైతులలో పరిహారం అందని కొందరు రైతులు తమకు పరిహారం అందని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని పరిశీలించమని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. రైతుల పేరుపై పట్టాలు ఉంటేనే నష్టపరిహారం అందించేందుకు వీలవుతుందన్నారు అంతేకాకుండా ఆ భూమిలో ఆ రైతులు అనుభవంలో ఉంటేనే ఇవ్వడం జరుగుతుందని వారికి జిల్లా కలెక్టర్ తెలిపారు.అనంతరం ఇళ్ల పట్టాలు కావాలని అక్కడికి విచ్చేసిన కోటపల్లి గ్రామస్తులు అర్జీలు జిల్లా కలెక్టర్ కు సమర్పించగా, స్థానిక తాసిల్దార్ ను వెంటనే అర్జీలను పరిశీలించి ఇళ్ల పట్టాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి,లేని వారికి ఇళ్ల పట్టాలుమంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ సుబ్బలక్ష్మమ్మ, జిల్లా టూరిజం అధికారి దీపక్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు తమ తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి రైతు బజార్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని, ఇది ప్రభుత్వం తీసుకొన్న ఒక సామాజిక చొరవ ఇదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి స్వయంగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత మచిలీపట్నం రైతుబజారు లో కూరగాయలు విక్రయించుకొనే కొందరు వ్యాపారులు మంత్రి పేర్ని నానిని కలిశారు. తాము రైతుబాజారులో గుర్తింపు కార్డులు తీసుకోలేదని వాటి గూర్చి అధికారులు పదే పదే తమను అడుగుతున్నారని అవేమీ లేకుండా తమ తమ కూరగాయలను రైతుబజారు లోనే నేరుగా విక్రయించుకొనేందుకు అవకాశం తమరే కల్పించాలని కోరారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, రైతుబజారు లో కూరగాయలను విక్రయించుకొనేవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగివుండాలన్నారు. ఏయే ఉత్పత్తులను,ఏ ప్రాంతం నుంచి రైతుబజారుకు తీసుకువస్తున్నారో తదితర వివరాలను తప్పనిసరిగా వీఆర్వో , తహశీల్ధార్లతో కార్డులపై రాయించుకోవాలని ప్రస్తుతం హార్టీకల్చరిస్ట్ సంతకం సైతం ఆ గుర్తింపుకార్డు జారీలో ఉండాలని కొన్ని నియమ నిబంధనలను రూపొందించారన్నారు. ఇవి పాటించడం ఒక మంచి విధానమేనని వారికి నచ్చచెప్పారు. రైతుబజార్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా, ఆర్థికంగా అందుబాటులో లభించగలవన్నారు. రైతులు కూరగాయలను తమ పొలంలో స్వయంగా పండించి విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం లేకపోవటం వలన ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారు మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండేందుకు సహాయపడిందన్నారు.
ఈ విధానం పండించే రైతుకు, వినియోగ దారుడికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రైతుబజార్లలో సేవా ఛార్జీలు గాని ఎటువంటి మార్కెట్ ఫీజులు విధించబడవని కూరగాయల పెంపకందారులు, రైతుల కమిటీ రైతు బజార్లలో అమ్మకపు ధరను నిర్ణయిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ జిల్లాలోని రైతు బజార్ల కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైతు బజార్స్ రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు, నియంత్రిస్తారు మరియు సమన్వయం చేస్తారు.రైతు బజార్ యొక్క ప్రధాన లక్ష్యం రైతులకు గిట్ట్టుబాటు ధరను నిర్ధారించడం, నాణ్యమైన తాజా కూరగాయలను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడమే ప్రధానమన్నారు.
స్థానిక రాజుపేటకు చెందిన వేముల స్వప్న లీల అనే మహిళ మంత్రి వద్ద తన కష్టాన్ని చెప్పుకొంది. గత నవంబర్ నెల 15 వ తేదీన వ్యసనపరుడైన తన భర్త అకస్మాత్తుగా చనిపోయారని ఇద్దరు ఆడపిల్లలతో ఎంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాను బి ఏ , బిఈడి చదివి ఒక ప్రయివేట్ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తుండగా కరోనా లాక్ డౌన్ కారణంగా జాబ్ పోయిందని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించి తన కుటుంబాన్ని రక్షించాలని వేడుకొంది.
స్థానిక ఈడేపల్లి కు చెందిన అత్తలూరి లక్ష్మి అనే వృద్ధురాలు మంత్రి పేర్ని నానిని కలిసింది. తనకు జి ప్లస్ 3 ఇల్లు మంజూరైందని , తాను బోదకాలు వ్యాధిగ్రస్తురాలినని సరిగా నడవలేని పరిస్థితితో ప్రస్తుతం బాధపడుతున్నానని తనకు జి ప్లస్ 3 ఇళ్ల మంజూరులో రెండవ ఫ్లోర్ ను అధికారులు కేటాయించడంతో తన ఆరోగ్య దృష్ట్యా తన ఫ్లాట్ ను కింది అంతస్తుకు దయచేసి మార్చాలని మంత్రిని అభ్యర్ధించింది.
మచిలీపట్నం మాచవరానికి చెందిన పుల్లేటి అపర్ణ అనే మహిళ మంత్రికి తన గోడు వినిపించింది. తాను సచివాలయంలో ఏ ఎన్ ఎం ఉద్యోగానికి రాతపరీక్ష రాస్తే l200 ర్యాంక్ వచ్చినప్పటికీ, ఓ సి కేటగిరిలో ఉండటం వలన ఆ ఉద్యోగం పొందలేకపోయానని, తనకు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయని దయతో తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకొంది.
పోర్టురోడ్డులో నివాసముండే కాడి అచ్చెమ్మ అనే వృద్ధురాలు మంత్రి వద్ద తన ఆరోగ్య పరిస్థితిని మంత్రికి వివరించింది. తన గొంతులో చేపముల్లు చిక్కుకొందని దీంతో గొంతు పెగలక తన అవస్థ వర్ణనాతీతంగా ఉందని కన్నీరు పెట్టుకొంది. ఆమె సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తన వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు ను పిలిపించి ఆమెను కారులో గుంటూరు తీసుకెళ్లి అక్కడ తాను సూచించే వైద్యుని వద్దకు తీసుకెళ్లి ఆమెకు మెరుగైన వైద్య సహాయం చేయించాలని ఆదేశించారు.
వైఎస్.షర్మిల ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి మహిళలకు చేదోడుగా ఉండాలని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలోని బుధవారం పార్టీకార్యాలయంలో వైఎస్సార్సీపీ సౌత్ ఎలక్షన్ ఇన్చార్జి గొంపభాను ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ కేక్ ని కట్ చేసి షర్మికు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనో రాష్ట్రం శుభిక్షంగా ఉందని, షర్మిలమ్మ కూడా ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తే మరింతగా మహిళలకు దగ్గరగా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గొంపభాను మాట్లాడుతూ, రాష్ట్రంలో జగనన్న వదిలిన భాణంగా విశాఖలో షర్మిలమ్మ పాదయాత్ర చేసిన సమయంలో మహిళలకు ఆమె ఎంతగానో చేరువయ్యారన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆమె పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ వస్తున్నామని అన్నారు. అనంతరం పలువురు మహిళా కార్యకర్తలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు గాజులను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.