1 ENS Live Breaking News

ఘనంగా ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి..

ద్రోణంరాజు సత్యనారాయణ 88వ జయంతి వేడుకలను ఆయన మనవడు ద్రోణంరాజు శ్రీవాస్తవ్ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరినాలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి జ్యోతి. ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాత, తండ్రిలాగే శ్రీవాస్తవ్ లో కూడా ప్రజలకు సేవచేసే గుణం కనిపిస్తుందన్నారు. ఈ సందర్భ ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణం రాజు శ్రీనివాస్ సేవలను కొనియాడా ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు అమర్నాథ్, ధర్మశ్రీ గొల్లబాబురావు, నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కోలాగురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, సినీ రచయిత కోనా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.  ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సందర్భంగా సిరిపురం కూడలిలో వున్న ఆయన విగ్రహానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సినీ రచయిత కోనా వెంకట్ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

Visakhapatnam

2020-12-19 20:21:17

దివీస్ ను ఆపేవరకూ పోరాటం ఆగదు..

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలోనీ దివీస్ పరిశ్రమ నిర్మాణం పనులు నిలిపి వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడలో స్థానిక సుందరయ్య భవన్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17 వ తేదీన దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్యర్యంలో ఆందోళన చేస్తున్న రైతులు, వామపక్ష నాయకులు, 160 మంది ప్రజలపైన పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని 36 మందిపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసి రిమాండ్ కు పంపారని, రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న వారిపై పోలీసు యంత్రాంగం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దివీస్ కి వ్యతిరేకంగా, రైతులకు అండగా ఉంటానని, దివీసను బంగాళాఖాతంలో కలిపేదాకా పోరాడతానని రైతులకు మాట ఇచ్చారని, కానీ నేడు దివీస్ యాజమాన్యానికి అండగా ఉంటూ దివీస్ ఫార్మా కంపెనీలో నిలిచి పోయిన నిర్మాణాలకు తానే అనుమతి ఇస్తూ, ముఖ్యమంత్రిగా తానే శంఖుస్థాపన చేయడానికి ప్రయత్నాలు చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు.  తక్షణం ఈ కేసులను ఉపసంహరించు కోవాలని, నాయకులను, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఎం.ఎల్.సి. ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మొన్నటి వరకు మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వమని చెప్పే ముఖ్యమంత్రి మాట తప్పి రైతులను మోసం చేసారని అన్నారు. గత నెల రోజుల నుండి దివీస్ మాకొద్దు అని 14 గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు నిరాహార దీక్షలు చేస్తున్నారని, 17 వ తేదీన జరిగిన దివీస్ వ్యతిరేక పోరాటంలో వామపక్ష నాయకులు కె.ఎస్. శ్రీనివాస్ (సిపిఎం జిల్లా కార్యదర్శి), సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దువ్వ శేషబాబ్ది , మోర్త రాజశేఖర్, సిపిఐ (ఎం.ఎల్ ) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రాజు, నాయకులు జనార్ధన్ , సిపిఎం కార్యకర్త ఎం.సూరిబాబు, దివీస్ ప్రాంత రైతులు 33 మందిపై కేసులను పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు.  సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు , సిపిఐ నాయకులు తోకల ప్రసాద్ , సిపిఐ ( ఎం.ఎల్ ) న్యూడెమోక్రసీ నాయకులు  జె.వెంకటేశ్వర్లు, పార్వర్డు బ్లాక్ నాయకులు ఎ.సూర్యనారాయణ, సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పి.ఆదినారాయణ మాట్లాడుతూ ఈ భూములన్నీ సముద్ర తీరంలో ఉన్నాయని , ఈ ప్రాంతంలో సుమారు 15 నుండి 20 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని , వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ వస్తే వాటి నుండి వచ్చే కాలుష్యం వల్ల మత్స్య సంపద నాశన మవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం , జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని , దివీస్ పనులను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు. ఎన్ని నిర్భందాలెదురైనా దివీస్ ఉద్యమం ఆగదని , దివీస్ ప్రాంత ప్రజలకు వామపక్ష పార్టీలు నిరంతరం అండగా ఉంటాయని తెలిపారు . తక్షణం ఈ కేసులను ఉపసంహరించుకోవాలని , నాయకులను , రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.  అనంతరం  ఎంఎల్.సి. వామపక్ష నాయకులు జిల్లా ఎస్.పి.ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా నాయకులు జి.బేబీరాణి , కారెం వెంకటేశ్వర రావు , ఎం . వీరలక్ష్మి , కె.సింహాచలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.వీరబాబు, తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2020-12-19 20:07:25

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

మహిళా సాధికారిత సాధన దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ మరియు పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు.  శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళలు, బాలికల సాధికారత -భద్రత, రక్షణపై  అవగాహనా సదస్సు, మహిళా మార్చ్ @100 రోజులు కార్యక్రమం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధ్యక్షతన జరిగింది.  కార్యక్రమానికి చైర్మన్ విశ్వాసరాయి కళావతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  మహిళల సాధికారతకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి  పాలనలో భగస్వామ్యం కావడం అదృష్టం అన్నారు. సి ఎం లక్ష్యాలు నెరవేర్చడానికి కలసి కట్టుగా పని చేయాలన్నారు.  దేశానికే ఆదర్శంగా దిశ చట్టాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు.  లైంగిక హింసకు గురైన మహిళలకు, బాలికలకు అత్యవసర సేవలను అందించు నిమిత్తం యాప్ లను రూపొందించడం జరిగిందని తెలిపారు.  మహిళా ఉద్యోగుల కోసం సఖి యాప్ ను,  ఆటోలలో ప్రయాణ రక్షణ కోసం అభయ యాప్ ను, రూపొందించడం జరిగిందని తెలిపారు.   అదే విధంగా అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు, పోలీసు – 100, చైల్డ్ లైన్ కోసం 1098, మహిళా హెల్ప్ లైన్ వన్ స్టాప్ సెంటర్ కోసం 181 నెంబరు, విదేశీ వ్యవహారాల ఫిర్యాదులు 18001022426 నెంబర్లకు ఫోన్ చేసి న్యాయం పొందే అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు.  మహిళలు మరియు బాలికల రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మారు మూల  ప్రాంతాల ప్రజలకు తెలియపరచవలసిన ఆవశ్యకత వుందన్నారు.  ఈ వంద రోజుల మహిళా మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించడం ముదావహమన్నారు.  ట్రైబల్ ప్రాంతాల్లో సైతం మహిళల ఇబ్బందులు తొలగించి వారికీ న్యాయం చేయాలని, కార్యాలయాలలో వివక్ష తొలగాలని. గ్రామ/వార్డు సచివాలయాలలో మహిళల సమస్యలను తొలగించే చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేరుతాయన్నారు.                        జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మెహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. ముఖ్య మంత్రి స్వయంగా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారని,  డిసెంబర్ 14 నుంచి మార్చి  8  వరకు వంద రోజుల నిర్వహణపై దిశ నిర్దేశం చేసారని తెలిపారు. విధుల నిర్వహణలో మహిళలు అత్యంత సమర్ధులని అన్నారు. ఆశా, ఎ ఎన్ ఎం., అంగన్వాడీ, స్టాఫ్ నర్స్ లు, డాక్టర్స్, వాలంటీర్స్, కరోనా నిరోధానికి అత్యంత కృషి చేసారని తెలిపారు. 70 శాతం మహిళలు మంచి సేవలను అందించడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు.   సి ఎం. గ్రామాలలో సైతం మహిళ రక్షణ కోసం మహిళా పోలీసులను  నియమించినట్లు చెప్పారు. వంద రోజుల కార్యక్రమం ద్వారా మహిళల హక్కులు, భద్రత, చట్టాలపై  ల పై మహిళలకు అవగాహన కలిగించాలని అన్నారు. మగవారు, ,గ్రామ పెద్దలు కూడా పాల్గొనాలని అన్నారు.  పోలీసులను సమన్వయ పరచుకుని మండల స్థాయి,  గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.  పాత పట్నం ఎం ఎల్ ఎ రెడ్డి శాంతి మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం, మహిళలను పూజించే తత్వం మన సి. ఎం. కి వున్నాయన్నారు. మహిళా సాధికారిత, హక్కుల కల్పన పై ముఖ్యమంత్రి అను నిత్యం శ్రామిస్తున్నారన్నారు. దిశ చట్టం, అమ్మ ఒడి, మహిళలకు సి ఎం ఇచ్చిన ధైర్యం అన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదుగా ఇవ్వడం హర్హణీయమన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. మహళా మార్చ్, దిశ చట్టం ఫాంప్లెట్లను విడుదల చేసారు.               ఈ  కార్యక్రమంలో  జె సి  కె.శ్రీనివాసులు, రాజాం ఎం ఎల్ ఎ  కంబాల జోగులు, డి ఎస్ పి మహేంద్ర, డి ఆర్ డి ఎ పి డి శాంతి శ్రీ, ఐ సి డి ఎస్   పి డి.జయదేవి,డి సి పి ఓ. రమణ, చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు జ్యోతి, సత్యవాణి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-19 19:54:00

పోషణ పథకం పక్కాగా అమలు జరగాలి..

మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం సంపూర్ణ పోషణ పథకం సద్వినియోగం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.  శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఐసీడీఎ స్ సి డి పి ఓ లు,  సూపర్ వైజర్లతో సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంపూర్ణ పోషణ పధకం  కార్యక్రమం జిల్లాలో 19 మండలాల్లో అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇది బృహత్తర కార్యక్రమం అని,  జిల్లాకు ఇది ఒక వరమని  అన్నారు.  అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీ ల కు పోషకహారం అందచేయడంలో అలసత్వం వహించ రాదన్నారు. పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు.  ఎగ్స్, బియ్యం, రేషన్ నాణ్యతతో కూడినవే వుండాలన్నారు. 2021సం.లో మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. మహిళలకు  రక్త హీనత వుండరాదన్నారు. తక్కువ బరువున్న పిల్లలు పుట్టే పరిస్థితి వుండరాదన్నారు.  సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందరూ ఆరోగ్యకరంగా వుండాలని, అంగన్వాడీ కేంద్రాలు బాగా పని చేయాలని తెలిపారు. పధకాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ,  ఐసీడీస్ పీడీ జయ దేవి, సి డి పి ఓ. లు, సూపర్ వైజర్లు తదితరులు హాజరయ్యారు.

Srikakulam

2020-12-19 19:49:51

ఇళ్ల స్థలాల లేఅవుట్లు సత్వరం పూర్తిచేయాలి..

పేద‌ల కోసం  ప్ర‌భుత్వం రూపొందించిన  నూతనఇళ్ల స్థ‌లాల  లేఔట్లను సత్వరం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని  జిల్లా కలెక్టర్  గంధం చంద్రుడు  అధికారులను ఆదేశించారు.   శనివారం మున్సిపాలిటీ పరిధిలోని  కురుగుంట  గ్రామం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో   62 ఎకరాల లో  ఇళ్ల స్థలాలు   లేఔట్లను, తాటిచర్ల లోని, ,13 ఎకరాలు  లేఔట్లను,పొడరాళ్ల  నందు  ఇంటి స్థలాలకు సంబంధించిన 5 ఎకరాల , లేఔట్లను, బుక్కరాయసముద్రం మండలంలోని   సిద్ధరాంపురం, పసలూరు నందు  ఇంటి స్థలాలకు సంబంధించిన 34. ఎకరాల 18  సెంట్లకు కు  సంబంధించిన  నూతన లే  ఔట్లు  ఇంటి స్థలాలు  సంబంధించిన  పనులను  ఎలా జరుగుతున్నాయో  పరిశీలించి  సంబంధిత అధికారులకు   సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో  స్థానిక శాసనసభ్యులు  అనంత వెంకట్రామిరెడ్డి,  జాయింట్ కలెక్టర్( రెవెన్యూ  మరియు అభివృద్ధి) నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థ‌లాల‌తో లేఅవుట్‌ను రూపొందించిన‌ట్లు   మున్సిపల్ కమిషనర్   వి వి ఎస్ ఎన్  మూర్తి    వివిధ లేఔట్ల కు సంబంధించిన ప్లాను,క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. ఇళ్ల స్థలాల సంబంధించిన  లేఔట్లను పూర్తిగా చ‌దును చేసి, సరిహద్దులకు సంబంధించిన రాళ్లను  నాటాలి.పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించాల‌ని  అలాగే అంత‌ర్గ‌తంగా గ్రావెల్ రోడ్ల‌ను వేయాల‌ని,  లేఔట్లను బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అన్ని వ‌స‌తుల‌తో  లేఔట్లను  పూర్తి హంగులతో సిద్దం చేయాల‌ని  ఈ నెల 23వ తేదీ లోపల  పనులు వేగవంతం  గా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను   జిల్లాక‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్  వరప్రసాద్,   అనంతపురం  ఇన్చార్జి తాసిల్దార్సిల్దార్ లు , లక్ష్మీ నారాయణ రెడ్డి, బుక్కరాయసముద్రం  తాసిల్దార్ మహబూబ్ బాషా సర్వేలు ప్రతాప్. మున్సిపల్ శాఖ ప్లానింగ్ అధికారులు , సర్వే శాఖ అధికారులు,  రెవెన్యూ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-12-19 19:39:14

పర్యాటక ప్రారంతంగా మరింత అభివ్రుద్ధి..

కర్నూలు నగరంతోపాటు శివారు ప్రాంతాలను పర్యటకంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఏ. హాఫిజ్ ఖాన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నగర నడిబొడ్డున చరిత్రాత్మక కేసి కెనాల్  వినాయక్ ఘాట్ నుంచి జోహారాపురం వరకు బోటు షికారును ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు సన్నాహాలు ప్రారంభించారన్నారు. వాటర్ రెసింగ్ వంటి పోటీలు పెట్టి ఇంకా అభివృద్ధి పరచవొచ్చన్న ఆయన వెంటనే జిల్లా అధికారులు నాకన్నా ముందుగానే  ఆలోచన అమలు చేసేవిధంగా ట్రయిల్ రన్ చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం పర్యటక శాఖ సదుపాయలు  ప్రణాళికలను రూపొందించిందన్నారు.  ఈ మేరకు గత వారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ, జిల్లా జలవనరుల శాఖ సీఈ మురళినాథ్ రెడ్డి గారు బోటింగ్ విహారానికి ట్రయల్ రన్ చేశారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో  మరోసారి వినాయక ఘాట్ వద్ద కర్నూలు, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎం.ఏ.హాఫిజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి , నగర పాలక డిఈ రాజశేఖర్ లు వినాయక ఘాట్ నుంచి జోహారాపురం వరకు బోటింగ్ లో ప్రయాణించి నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఇలాంటి బోటింగ్ విహారం ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని వ్యాఖ్యానించారు.

కర్నూలు

2020-12-19 19:34:17

యుపిఎస్సీ పరీక్షకు 1452 మంది..

యూనియన్ పబ్లిక్  సర్వీస్  కమీషన్ ద్వారా ఈనెల 20న  నిర్వహించనున్న సెంట్రల్ అర్మడ్ పోలీసు  ఫోర్స్(అసిస్టెంట్  కమాండెంట్ )  పరీక్ష – 2020 కు 1452 అభ్యర్థులు హాజరు కానున్నారని  యు.పి.పి.ఎస్.సి. పర్యవేక్షణ అధికారి ఎ.కె మిశ్రా  తెలిపారు. శనివారం  స్థానిక  ఆర్ డి ఓ కార్యాలయం లో  సి ఎ పి ఎఫ్ నిర్వహణ పై  పరీక్షల  నిర్వహణ  లైజన్ అధికారులు,   ఇన్స్ పెక్టింగ్   అధికారులతో తిరుపతి ఆర్ డి ఓ కనకనరసారెడ్డి  , యు పి పి ఎస్ సి అధికారి మిశ్రా పలు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా సమీక్షిస్తూ కోవిడ్  నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహణ జరగాలని, ఈ  పరీక్షలు  రెండు  సెషన్స్ లో ఉదయం 10 నుండి 12 వరకు , మధ్యాహ్నం   2 నుండి 5 గంటల వరకు  జరుగుతుందని  మొత్తం  అభ్యర్థులు 1452 మంది  అభ్యర్థులు 5 సెంటర్లలో  పరీక్షలు వ్రాయ నున్నారని తెలిపారు.  పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా , సెంటర్ల వద్ద అవసరమైన పోలీస్ భద్రత, కోవిడ్ నిబంధనలు పాటించేలా సంబంధిత శాఖలు వ్యవహరించాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు, లైజన్ ఆఫీసర్లు , రూట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటముందే చేరుకోవాలని 10 నిముషాల ముందుగా మైన్ గేట్లు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాలు – అభ్యర్థులు (1) శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కళాశాల వింగ్ – ఎ నందు  :384 మంది అభ్యర్థులు ,(2) వింగ్ బి లో -288 మంది , (3)శ్రీపద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల వింగ్ - బి నందు : 288 మంది ,(4) శ్రీపద్మావతి గర్ల్స్ హైస్కూల్ (బాలాజీకాలని ఎదురుగా) 288 మంది, (5) ఎ.వి.యూనివర్సిటీ కాంపస్ స్కూల్ లో 204 మంది అభ్యర్థులు ఈ సి.ఎ.పి.ఎఫ్.(అసిస్టెంట్ కమాండెంట్) పరీక్షలు -2020 కు హాజరు కానున్నారు.

తిరుపతి

2020-12-19 19:27:52

ప్రజలకే సేవచేయడమే నిజమైన సంత్రుప్తి..

విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం  వీర మహిళ తెలుగు లక్ష్మి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ బొడ్డేపల్లి రఘు పాల్గొన్నారు. వృద్ధులకు మహిళలకు పళ్ళు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ, జనసేన సిద్ధాంతాల్ని పాటించే మొట్టమొదటి మహిళ తెలుగు లక్ష్మి అన్నారు. దక్షిణ నియోజకవర్గం లో మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి అనికొనియాడారు. జనసేన వీరమహిళ తెలుగు లక్ష్మి మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. ప్రజలకు తమవంతుగా అన్ని రకాల సేవలు అందిస్తామన్నారు. జన్మదిన వేడుకలకయ్యే ఖర్చును మొత్తం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు అర్జున్. మూగి  శ్రీనివాస్, జీకే, సురేష్, గణేష్, బాలు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-19 19:10:03

విశాఖలో సేంద్రియ చర్మ రక్షణ ఉత్పత్తులు..

విశాఖలో మొదటిసారిగా అందరికీ అందుబాటులో సేంద్రీయ స్కిన్ కేర్ ఉత్పత్తులను అందచేయడం ఆహ్వానించదగ్గదని విశాఖ దక్షిణ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. శనివారం నగరంలోని రాంనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన సోఫియా స్కిన్ లేయర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో వ్యాపారాభివృద్ధి సాధించి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. నిజాయతీతో వ్యాపారంచేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని వాసుపల్లి సూచించారు. సంస్థ నిర్వహాకులు సోఫియా సుని మాట్లాడుతూ, విశాఖలో మొదటిసారిగా సీరం ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మధ్య తరగతి వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా తమ ఉత్పత్తులు ఉంటాయన్నారు. స్కిన్ కేర్,హెయిర్ కేర్ బాడీ కేర్ ఉత్పత్తులు పూర్తి సేంద్రీయ ఉత్పత్తులని వివరించారు. వాసుపల్లికి పుష్పగుచ్ఛమిచ్చి ఆహ్వానించిన సంస్థ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ శాంతకుమారి,వినీ,కృపామణి,జోసెఫ్,జయలక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-19 19:07:57

లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలి..

శ్రీకాకుళం జిల్లాలో శాశ్వత లోక్ అదాలత్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని శాశ్వత లోక్ అదాలత్ ఇన్ ఛార్జ్ న్యాయమూర్తి మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి.రామకృష్ణ అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ కోర్టులో ప్రజోపయోగ అంశాలకు సంబంధించిన వ్యాజ్యాలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజోపయోగ సంబంధిత అంశాలైన బ్యాంకింగు, మునిసిపాల్ తదితర విభాగల అధికారులతో శని వారం శాశ్వత లోక్ అదాలత్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజోపయోగ సేవల వ్యాజ్యాల పరిష్కారానికి శాశ్వత లోక్ అదాలత్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా బ్యాంకింగు, ఆర్ధిక సంస్ధలు, పోస్టల్, టెలీగ్రాఫి, నీరు, విద్యుత్, పారిశుధ్యం, ఆసుపత్రుల సేవలు, బీమా సేవలు, జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా సంస్ధలు, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన వ్యాజ్యాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.  దేశంలోనే ప్రప్రధమంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2006 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కోటి రూపాయల ఆస్తుల విలువ గల అంశాల వరకు శాశ్వత లోక్ అదాలత్ లో పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని రామకృష్ణ తెలిపారు. చట్ట ప్రకారం రాజీ చేయదగ్గ సేవలను శాశ్వత లోక్ అదాలత్ లో పరిష్కారం చేయవచ్చని ఆయన చెప్పారు. శాశ్వత లోక్ అదాలత్ లో ఫారం -3 లో పిర్యాధులను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. వ్యాజ్యం పరిష్కారం సమయంలో ఇరు పార్టీలు విధిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేసారు.           ఈ సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు సగ్గు మధు రెడ్డి, రమేష్ చంద్ర సాహూ, ఎం.సి.హెచ్.అప్పల నాయుడు, జి.అప్పలనాయుడు, పి.చంద్రపతి రావు, పి.పాపారావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-12-19 18:59:21

అర్హులకు పరిశ్రమ ప్రోత్సాహకాలు అందించాలి..

పరిశ్రమల ప్రోత్సాహకాలు అర్హులకు ఖచ్చితంగా అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.. శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షత న జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు పరిశ్రమల ప్రోత్సాహకాలు అందించేలా కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు..   చేనేత పరిశ్రమను రక్షించేందుకు ధర్మవరం పరిసర ప్రాంతాల్లో పవర్లూమ్ యూనిట్ల స్థాపన కు అనుమతి ఇవ్వకూడదని కలెక్టర్ తెలిపారు.. జిల్లాలోని ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సహించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  జిల్లాలో మాత్రమే ప్రత్యేకంగా ఉన్న  నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఓళిగ లు, నన్నారి, మేక  పాలు తదితర ఉత్పత్తుల ను ఎగుమతి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ పరిశ్రమల పాలసీ కి సంబంధించిన వైఎస్సార్-జగనన్న బడుగు వికాసం 2020-23 పథకంపై సంబంధించిన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల స్థితిగతుల గురించిన సమగ్ర సర్వే ను 15 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. స్టాండప్ ఇండియా పథకం కి సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను ఎల్డీఎం, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. 5.37 కోట్ల రూపాయల సబ్సిడీ మంజూరుకు ఆమోదం 141 క్లెయిమ్స్ కు గాను ప్రోత్సాహకంగా  రూ.5.37 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ మొత్తం అందించేందుకు  కమిటీ ఆమోదం తెలిపింది..44 క్లెయిమ్స్ కు సంబంధించి సరైన ధ్రువ పత్రాలు సమర్పించకపోవడంతో తిరస్కరించారు.. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్ బాబు,బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ డిడి రాహుల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు..

Srikakulam

2020-12-19 18:52:40

శ్రీకాకుళం జిల్లాను పరిశుభ్రంగా ఉంచాలి..

శ్రీకాకుళం పరిశుభ్రమైన జిల్లాగా అవతరించాలని  కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మనం - మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంపై జిల్లా పరిషత్ వద్ద శనివారం పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతితో కలసి జిల్లా కలెక్టర్ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ఫ్రీ) జిల్లాగా ప్రకటించడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ అనేక చోట్ల బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని పేర్కొన్నారు. మలవిసర్జన సామాజిక దురాచారమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని, ప్రతి గ్రామం పరిశుభ్రమైన గ్రామంగా ఫరిడవిల్లాలని కోరారు. ప్రజలు సహాయ సహకారాలు అందించి స్వచ్చ శ్రీకాకుళం జిల్లాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన గ్రామాలలో కరోనా వంటి వైరస్ లతో సహా అన్ని రకాల వ్యాధులను పారద్రోలగలమని అన్నారు.  ప్రతి వాలంటీరు స్థాయిలో మలవిసర్జన జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. రెండు వందల ఇళ్ళకు ఒక గ్రామ సచివాలయ సిబ్బందిని పర్యవేక్షణకు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మంచి ప్రణాళికలతో అమలు చేస్తున్నామని, మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంను మొదటి దశలో 76 పంచాయతీలలో చేపట్టామని అన్నారు. రెండవ దశలో 353 పంచాయతీలలో అమలు చేస్తున్నామని చెప్పారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయుటకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉందని నిర్ధారించుకోవాలని అన్నారు. కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని ఉపయోగించేలా చైతన్య పరచాలన్నారు. స్నానానికి ఉపయోగించే నీరు, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం వంటి వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంటలకు మళ్ళించడం ద్వారా మురుగునీరు రోడ్ల పై ప్రవహించకుండా చూడాలని ఆయన కోరారు.  గ్రామంలో అన్ని విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మరుగుదొడ్లు కలిగి ఉండి వాటిని విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ప్రజలలో చైతన్యం రావాలని అన్నారు. ఓడిఎఫ్, తడి చెత్త - పొడి చెత్త, కాలువలు నిర్వహణ, తాగునీరు కల్పన ప్రధానమైనదని అన్నారు. సచివాలయ సిబ్బంది ఉదయాన్నే గ్రామంలో సందర్శించడం అవసరమని అన్నారు. ఆహారం భుజించే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలని ఆమె అన్నారు. గ్రామంలోని అన్ని గృహాలకు సురక్షిత త్రాగునీటి సరఫరా లభ్యత ఉండేలా చూడాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ,  రవాణా, ఘన వ్యర్ధ పదార్ధాలను వేరుచేయడం, రీసైక్లింగ్, వర్మి కంపోస్ట్ ప్రాసెసింగ్ మొదలైనవి జరగాలని ఆమె అన్నారు. జిల్లాను ఆదర్శవంతంగా నిలబెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్దబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, డిఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-19 18:48:55

2వ దశ కరోనాతో ప్రజలు జరభద్రం..

శ్రీకాకుళం జిల్లాలో కరోనా రెండవ దశ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వార్డు, గ్రామ సచివాలయాలు, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అన్నారు. వివిధ మత పెద్దలతో ప్రార్ధనా స్థలాల వద్ద చేపట్టవలసిన చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. రాబోయే రెండు నెలల కాలంలో అత్యంత కీలకమని అన్నారు. ప్రార్ధనా మందిరాల్లో వ్యాప్తి కాకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మత విశ్వాసాలు ముఖ్యమేనని, అదే సమయంలో ప్రాణాలు అతి ముఖ్యమని గుర్తించాలని ఆయన కోరారు. ప్రాణాలు ఉంటేనే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టగలమని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా వాసులు బాగా సహకరించారని, రెండవ దశ ప్రబలకుండా మరింత సహకారాన్ని అందించాలని కోరారు. కొన్ని ఆలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరు అవుతున్నారని అన్నారు. దానిని నివారించాలని ఆయన స్పష్టం చేసారు.  కరోనా మార్గదర్శకాలు విధిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. శానిటైజర్లు ఉండాలని ఆయన స్పష్టం చేసారు. రెండవ దశ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న సంగతి గుర్తించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్, సంక్రాంతి తదితర పండగ సందర్భాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తి జిల్లాలో జరగకుండా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో వాక్సిన్ వస్తుందని, మొదటగా ఆరోగ్య సిబ్బందికి, తరువాత కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లు - పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులకు, అనంతరం 50 సంవత్సరాలు పైబడిన వారికి, ఇతర వ్యాధులతో బాధపడేవారికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు చేపడతామని మత పెద్దలు తెలిపారు. ఈ సమావేశంలో దేవదాయ శాఖ సహాయ కమీషనర్ వి.హరి సూర్య ప్రకాష్, 15 సూత్రాల కార్యక్రమం సభ్యులు మహిబుల్లా ఖాన్, ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ వహాబ్, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ షాహీద్ షేక్., మహమ్మద్ షానవాజ్, పి.కృపానందం తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-19 18:42:40

కరోనా నుంచి కోలుకున్న 29 మంది డిశ్చార్జ్

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో  ప్రత్యేక కేంద్రాల నుంచి 29మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో  కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు శనివారం  29 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.

Anantapur

2020-12-19 18:37:47

ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..

జివిఎంసీ పరిధిలో పేదలకు ఇచ్చే ఇళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి) అధికారులను ఆదేశించారు. శనివారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తో కలసి జివిఎంసి సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగర పరిధిలో టిడ్కో గృహాలు, ఎల్.పి.సి.ల పంపిణీ స్థలాలు కేటాయించబోయే లబ్దిదారులకు లేఖలు పంపిణీకు సంబందించిన అన్ని చర్యలు చేపట్టమని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రభుత్వ ఇళ్ల పట్టాలు పంపిణీ జరగాలన్నారు. టిడ్కో గృహాలుకు లాటరీ పద్దతి ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి డాక్యుమెంటు కార్యక్రమాలు పూర్తిచేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం వారీగా చేపట్టాలని మంత్రి సూచించగా, ఈ నెల 27వ తేది నుండి వచ్చే నెల 5వ తేది వరకు కేటాయించిన తేదిలలో నగరపరిధిలో అన్ని నియోజిక వర్గాల వారీగా లబ్దిదారులకు కేటాయింపు ఉత్తర్వులు అందించేందుకు జోనల్ కమిషనర్ల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు. టిడ్కో గృహాల నిమిత్తం లబ్ది దారులు ఇదివరకే అధిక మొత్తంలో చెల్లించిన లబ్దిదారుల వాటా సొమ్మును తిరిగి వారికి చెల్లించడానికి తగుచర్యలు తీసుకోమని, ప్రభుత్వం ఇప్పుడు సూచించిన విధంగా లబ్దిదారుల వాటా మొత్తాన్ని వసూలు చేయాలని మంత్రివర్యులు కమిషనర్ కు సూచించారు. ఆయా జోనల్ వారిగా లబ్దిదారుల వివరాలను, ఇండ్ల కేటాయింపు వివరాలను జోనల్   కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. శనివారం సాయంత్రంలోగా లాటరీ నిర్వహించి టిడ్కో గృహాల కేటాయింపులను లబ్దిదారులకు చేపట్టాలని సంబందిత జాబితాలను ఆయా జోనల్ కమిషనర్లకు డాక్యుమెంటేషన్ మరియు తదుపరి చర్యల తీసుకొనే నిమిత్తం అందించాలని కమిషనర్ పి.డి. (యు.సి.డి.) వై. శ్రీనివాసరావును ఆదేశించారు.  

విశాఖపట్నం

2020-12-19 18:31:22