కర్నూలు నగరంలో ప్రధాన రహదారులు, పార్కింగ్ స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఆక్రమణలపై కర్నూలు నగర పాలక అధికారులు(పట్టణ ప్రణాళిక అధికారులు) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందుకు సోమవారం నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన కూల్చివేతే ఇందుకు నిదర్శనం. కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస క్లాత్ మార్కెట్ కి సంబంధించిన పార్కింగ్ స్థలంలో నిర్మించిన 7 అక్రమ కట్టడాలను(దుకాణాలు) సోమవారం నగర పాలక పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు పూర్తి విచారణ అనంతరం పార్కింగ్ స్థలాలను అక్రమించారన్న కారణంతో రెండు నెలల కిందటే వీరితో పాటు షరాఫ్ బజార్ లోని పలు దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. సరైన ఆధారాలు కానీ అప్పటి ప్లాన్ పత్రాలు కానీ సదురు యజమానుల వద్ద ఉంటే తమకు చూయించాలని లేని పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసుల్లో ఇచ్చిన రెండు నెలల గడువు ముగిసినా మరో వారం రోజుల సమయం ఇచ్చినా వారి నుంచి ఎటువంటి ఆధారాలు, ప్లాన్ కు సంబంధించిన పత్రాలు కానీ, సమాధానం రాకపోగా కూల్చివేసినట్లు డీసీపీ(డిప్యూటీ సిటీ ప్లానర్) కోటయ్య పేర్కొన్నారు. 50 ఏళ్ల కిందట ప్రస్తుతం ఉన్న వేంకట చలపతి కల్యాణ మండపం ఉన్న స్థలాన్ని గ్రంధాలయానికి వినియోగించుకోవాలని నిబంధన ఉన్నా... ఆ పార్కింగ్ స్థలంలో అక్రమ నిర్మాణాలను నిర్మించుకున్న కొందరు యజమానులు కూల్చివేతలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 24 వ తేదీ వరకు కోర్టు స్టే విధించడం జరిగింది. తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు షరాఫ్ బజార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తెసుకుంటామని నగర పాలక అధికారులు తెలియజేస్తున్నారు. నగరంలో మొత్తం 1700 అక్రమ భవనాలు ఉన్నట్లు గుర్తించి వాటి యజమానులకు కూడా నోటీసులు అందజేశామని డిసిపి కోటయ్య చెబుతున్నారు.
దళితుల అణిచివేత చర్యలను ప్రభుత్వం మానుకోవాలని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం డిమాండ్ చేసారు. సామజిక న్యాయమే ధ్యేయంగా,దళితులపై జరుగుతున్న అకృత్యాలు,దాడులకు నిరసనగా విశాఖలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత మహిళలపైన జరుగుతున్న అకృత్యాలు,దాడులను ఆరికట్టేవిధంగా కఠిన చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేసారు. దళితులపైన జరుగుతున్న హత్యాయత్నాలు,శిరోముండనాలు అరికట్టాలని,దళిత ఉద్యోగులు,అధికారులపై వివక్షచూపరాదని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నూతన చట్టాన్ని రద్దుచేసి, పాతపద్ధతిలోనే నడిపించి,పేద ఎస్సీ విద్యార్థులను ఆదుకోవాలన్నారు. చట్టాల అమలులో అగ్రకులాల మహిళలకు ఒక న్యాయం,దళిత మహిళలకు ఒకన్యాయమా అని ప్రశ్నించారు. అలాగే ప్రవేటు యాజమాన్యంలో కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు.ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీలకు షూరిటీ లేకుండా స్వయం ఉపాధి లోన్లు ఇవ్వాలన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. అలాగే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదుచేసినవెంటనే నిందితులను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసారు. భూ కబ్జాదారులను,మతోన్మాద శక్తులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.తమ డిమాండ్లను ప్రభుత్వాలు వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే దళితులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చింతాడ సూర్యానికి మద్దతుగా అనేకమంది దళిత నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కృష్ణారావు,దమయంతి,చింతాడ ప్రదీప్,తాతాజీ,కొత్తపల్లి కటరమణ,తాతాజీ,ఎస్.సుధాకర్,గండి రాజేశ్వరి,ఫ్రాంక్లిన్ ఈశ్వరమ్మ,పూడి అంజు,ధనలక్ష్మి,కల్యాణరావు తదితరులు ఈ దీక్షలో సూర్యానికి మద్దతుగా పాల్గొన్నారు.
జగనన్న ఆలోచనా విధానం నిజమైన అభివృద్ధికి తార్కాణమని కే ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, 32వ వార్డ్ వైఎస్సార్సీపీ నాయకుడు కందుల నాగరాజు అన్నారు. సోమవారం ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మ దినం సందర్భంగా వార్డ్ లో జన్మదిన వేడుకలు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల,కార్యకర్తల కేరింతల మధ్య కేక్ ఎస్ కే సలీం తో కలిసి కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు మాట్లాడుతూ, జగన్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ జనాదరణ కలిగాయని,ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు చేరువ చేసిన ఘనత జగన్ కె దక్కుతుందన్నారు.జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని,జగన్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని,నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నాగరాజు ఆకాంక్షించారు.అనంతరం మహిళలకు,వృద్దులకు పేదలకు దుప్పట్లు,పండ్లు,మిఠాయిలు పంపిణీ చేసారు.ఈ వేడుకల్లో రమేష్,నీలబాబు,సూరి,అశోక్,లారా,మేరీ,చిన్నమ్మలు,విజయ,రసూల్ తదితరులు పాల్గొన్నారు.
మనసున్నమనిషి,నిండైన మనసుతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 35వ వార్డులో వైసీపీ యూత్ మాజీ అధ్యక్షుడు విల్లూరి భాస్కర రావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వాసుపల్లి ముఖ్య అతిధిగా హాజరై అభిమానులు,కార్యకర్తల ఆనందోత్సహాల మధ్య కేక్ ను కట్ చేసి వేడుకల్లో భాగమయ్యారు.వాసుపల్లి మాట్లాడుతూ, అంబేదర్క్ కు మరోరూపంగా జగన్ అనేక సంక్షేమ పధకాలు చేస్తున్నాడని కొనియాడారు.రానున్న ముప్పై ఏళ్ల వరకు ఆంధ్రకు జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అన్నారు.విల్లూరి భాస్కర రావు మాట్లాడుతూ వెన్నుచూపని పోరాట స్ఫూర్తి,కార్యదీక్ష ఆయుధాలు గా జగన్ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.మెండుగా ప్రజాభిమానం,తండ్రి దీవెనలు,భగవంతుని ఆశీస్సులే జగన్ బలమన్నారు.అందరూ బాగుండాలని,ప్రతి ఇంటా సంతోషాలు నింపాలనే సదుద్దేశంతో,నిండైన మనసుతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న జన హృదయ నేత జగన్ అని కొనియాడారు.అనంతరం వాహన మిత్ర పధకం ద్వారా లబ్ధిపొందిన ఆటో కార్మికుల ర్యాలీని వాసుపల్లి జెండా ఊపి ప్రారంభించారు.వృద్దులకు,పేదలకు,అభిమానులకు నాలుగు రకాల పండ్లు,చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి విల్లూరి అభిమానులు,కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. మందుగుండు సామాగ్రి వెలుగులు, వివిధరకాల కళాకారుల నృత్యాలతో జరిగిన వేడుకల్లో అభిమానులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భూసమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు సంకల్పించింది. దీనికోసం ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం’ ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి కృష్ణాజిల్లాలో ప్రారంభించారు. సర్వే ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం జిల్లాలో ఈనెల 23వ తేదీ బుధవారం బొండపల్లి మండలం తమటాడ గ్రామంలో ప్రారంభం కానుంది.
మూడు దశల్లో సర్వే పూర్తి
సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో , ‘వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం’ అమలు చేస్తున్నారు. మీ భూమి..మా హామీ నినాదంతో తొలి దశ సర్వే ఈనెల నుంచి వచ్చే ఏడాది (2021) జూలై వరకు, రెండో దశ సర్వే 2021 అక్టోబరు నుంచి 2022 ఏప్రిల్ వరకు, చివరిదైన మూడో దశ సర్వే జూలై 2022 నుంచి 2023 జనవరి వరకు కొనసాగనుంది. జిల్లాలో తొలుత తమటాడ గ్రామంలో నమూనా క్రింద సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వేలో సర్వేలో భాగస్వామ్యం కానున్న ప్రతీ ఒక్కరూ పాల్గొంటారు. రెండో విడతలో 34 మండలాల నుంచి 34 గ్రామాలను ఎంపిక చేస్తారు. మూడోదశలో జిల్లాలోని సగం ప్రాంతాన్ని సుమారుగా 499 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పూర్తి చేస్తారు. ముందుగా డ్రోన్‌ల ద్వారా గ్రౌండ్ సర్వే నిర్వహిస్తారు. తరువాత భూములపై మాన్యువల్‌గా సర్వే చేసి, రెండింటినీ అనుసంధానం చేస్తారు. దీనివల్ల ఖచ్చితమైన వివరాలు నమోదవుతాయి. ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేనివిధంగా కార్స్ సర్వే (కంటిన్యూస్ ఆపరేషన్ రిఫరెన్స్ స్టేషన్) విధానాన్ని రూపొందించింది ప్రభుత్వం. దీనికోసం జిల్లాలో ఎస్‌కోట, సాలూరు, జిఎల్‌పురం వద్ద బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
సర్వే జరిగే తీరు ఇదీ :
తొలుత గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు వివరిస్తారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్, కార్స్, రోవర్ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందిస్తారు. ప్రతి యజమానికి నోటీసు ద్వారా ఆ సమాచారం అందజేస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, గ్రామ సచివాలయంలోని గ్రామ సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకుంటే, అవి సత్వరం పరిష్కారం అయ్యేలా ప్రతి మండలంలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.
సర్వేవల్ల ప్రయోజనాలు :
– ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం
– ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్‌పీఎం)
– రెవెన్యూ విలేజ్ మ్యాప్
– భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు
– అభ్యంతరాల సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు
– ఉచిత వైయస్సార్ జగనన్న భూరక్ష హద్దు రాళ్లు
– గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు
వివిదాలకు శాశ్వత పరిష్కారం : జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న తాజా సర్వే ద్వారా దళారీ వ్యవస్థకు చెక్ పడుతుంది. అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య లభిస్తుంది. భూయజమానులకు తమ భూములపై వేరెవరూ సవాల్ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు లభించడం ద్వారా భూవివాదాలకు తావు ఉండదు. ముఖ్యంగా రికార్డుల స్వచ్ఛీకరణ జరిగి, వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం కొత్త రికార్డులు తయారవుతాయి. ఆ తర్వాత ఉచితంగా వైయస్సార్ జగనన్న భూరక్ష హద్దురాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్నిచోట్ల రికార్డుల్లో చోటుచేసుకున్న తప్పులన్నీ సరిజేయబడతాయి. ఇకపై ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం అవుతాయి. అంతే కాకుండా ఆయా ప్రక్రియలు సులభతరం అవుతాయి. రిజిస్ట్రేషన్ కూడా గ్రామంలోనే చేసుకునే వెసులుబాటు ఈ సర్వేద్వారా లభిస్తుంది.
మనిషి ప్రకృతి పట్లా, సమాజం పట్లా బాధ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కోరారు. మానవుల పాపాలను కడగడానికి యేసుప్రభువు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఆయన ప్రేమసాగరుడని స్తుతించారు. జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ యేసు విశ్వరక్షకుడని కొనియాడారు. ఆయన్ను ఒక తండ్రిలా, కొడుకులా, మిత్రుడిలా, సేవకుడిలా ఎలా కొలిస్తే అలాగే మనలను కరుణిస్తాడని అన్నారు. నిరంతరం మనతో ఉండే దేవుడు యేసుప్రభువు అని అన్నారు. ప్రేమను పంచే దేవుడు యేసు అని, ప్రకృతిలో కూడా దైవత్వాన్ని చూడాలని కోరారు. భూమిని, ప్రకృతి వనరులను నాశనం చేయడం మహా పాపమన్నారు. మనిషి ప్రకృతికి దూరమైన కొలదీ, వ్యాధులకు దగ్గరవుతున్నాడని చెప్పారు. గత 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే, ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు, హృద్రోగం, కేన్సర్ లాంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతుండటానికి నేల, నీరు, గాలిని కలుషితం చేయడం, చెడు అలవాట్లే కారణమని స్పష్టం చేశారు. విజయనగరం గొప్ప చారిత్రక, సాంస్కృతిక నగరమని, దానిని మనమంతా కాపాడుకోవాలని, హరిత విజయనగరంగా మార్చడానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ యేసు ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఫాస్టర్లను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి రూ.5వేలు పారితోషకాన్ని అందజేశారని, ఆయనతోపాటు, మన రాష్ట్రం, మన దేశం క్షేమంగా ఉండాలని ప్రతీఒక్కరూ ప్రార్ధనలు చేయాలని కోరారు.
జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలకంఠ ప్రధానో ఆధ్వర్యంలో, సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆశా జాన్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆలపించిన యేసు కీర్తనలు అలరించాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ కూడా పలు కీర్తనలు పాడి పరవశింపజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, దేవానంద్, బిషప్ ప్రతాప్, డేనియల్ గాంధీ, రాజశేఖర్, జాన్ వెస్లీ, ఆనంద్ పాల్, టి.ఆనంద్, ఎంఏ నాయుడు, జోషురాజ్, డాక్టర్ కెజె ఫిలోమెన్, ఆర్ఏఎస్ కుమార్, ఎం.క్రిష్టోఫర్ తదితర క్రైస్తవ ప్రముఖులు, సాంఘిక సంక్షేమశాఖ డిడి కె.సునీల్‌రాజ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కు 205 వినతులు అందాయి. ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల, ఆరోగ్య శ్రీ , ఆదరణ, రైతు భరోసా, అమ్మ ఒడి లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్ , సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, జే. వెంకట రావు, విపత్తుల శాఖ ప్రోజెక్ట్ అధికారి పద్మావతి వినతులను అందుకున్నారు. స్పందనలో అందిన వినతులను వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్పందన అనంతరం పౌర సరఫరాల వాహనాల లబ్ది దారులు, ఇళ్ళ పట్టాలు, జగనన్న తోడు, కన్వర్జెన్స్ పనులు, నాడు- నేడు , బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, ధాన్యం సేకరణ, మనం- మన పరిశుభ్రత, ఓటర్ల నమోదు తదితర కార్యక్రమాల పై సమీక్షించారు.
జనవరి 1 నుండి పౌర సరఫరాల ద్వార రేషన్ సరుకులను పంపిణీ చేయుటకు అవసరమగు వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్నలబ్దిదారుల వివరాలను వెంటనే పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్.సి. ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ది దారులను ఎంపిక చేసి జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదానికి పంపాలని అన్నారు. జనవరి 1నాటికీ 18 ఏళ్ళు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించాలని, క్లెయిమ్స్, అభ్యంతరాలను కూడా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారికి సూచించారు. ఈ నెల 30 న రాష్ట్ర ముఖ్య మంత్రి జిల్లా పర్యటన విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఎవరికీ వేసిన డ్యూటీ లను వారు ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త గాచేయాలని అన్నారు.
కన్వర్జెన్స్ పనులు వేగవంతం కావాలి :
ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులను సత్వరమే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలు , సచివాలయాల నిర్మాణాలకు ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలన్నారు. ఈ పనులకు అవసరమగు భూమి వెంటనే హ్యాండ్ ఓవర్ కావాలన్నారు. వై.ఎస్.ఆర్ బీమా, జగనన్న తోడు పధకాలలో పురోగతి కనపడాలన్నారు. ఇ – సేవలు పెండింగ్ పై సమీక్షిస్తూ పౌర సరఫరాలు, జిల్లా రెవిన్యూ అధికారి, మున్సిపల్, పంచాయతి రాజ్, జిల్లా పరిషత్, పంచాయతి అధికారి వద్ద ఎక్కువగా ఊనయని, వాటిని ఈ రోజే క్లియర్ అయ్యేలా చూడాలని సూచించారు.
స్పందన భోజనం కొనసాగింపు:
స్పందన అర్జీ దారులకు ఉచితంగానూ, 10/- రూపాయలకు పెట్టె భోజనం ఉద్యోగులు సహకరిస్తే వచ్చే ఏడాది కూడా కొనసాగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బయట వ్యక్తులు అనేక మంది ఆర్ధిక సహాయం చేస్తామని అడుగుతున్నారని, అయితే వారికీ అవకాసం ఇవ్వడం లేదని, ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వస్తే కొనసాగిస్తామని అన్నారు. ఉద్యోగుల కుటుంభ సభ్యుల ఉత్సవాల గుర్తుగా పుట్టిన రోజులకు, రిటైర్మెంట్లకు, వివాహ మహోత్సవాలకు, మరణించిన వారి జ్ఞాపకార్ధంగా, లేదా ఇతర పండగల సందర్భంగా ఉద్యోగులు స్వచ్చందంగా స్పాన్సర్ చేయడానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపు నివ్వగా వెంటనే అధికారులు వారానికి ఒకరం చొప్పున సమకూర్చడానికి ముందుకు వచ్చారు. జనవరిలో వచ్చే మొదటి సోమవారం సంయుక్త కలెక్టర్ (ఆసరా) వెంకట రావు ప్రకటించగా వెంటనే సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్, పద్మావతి, డి.ఈ.ఓ తదితరులు మిగిలిన వారాల కోసం ముందుకు వచ్చారు. ఇది మంచి కార్యక్రమమని, వికలాంగులకు, గర్భిణీలకు, వృద్ధులకు భోజనం పెట్టడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ అన్నారు.
మంగళ వారం కార్యాలయాల పరిశుభ్రత :
మనం- మన పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా మంగళ వరం ఉదయం 7 గంటలకు కల్లెక్టరేట్ తో పాటు కార్యాలయాలన్నిటిని పరిశుభ్రం చేయాలనీ కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయాలు, ఆవరణలు పరిశుభ్రంగా ఉండక పోతే సంబంధిత అధ్దికారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ మేరకు అధికారులందరికీ సర్కులర్ జారి చేసారు. ఈ కార్యక్రమం లో అధికారులు, సిబ్బంది అందరు పాల్గొనాలని అన్నారు. కల్లెక్టరేట్ లో పై అంతస్తు లో నున్న కార్యాలయాల నుండి కిందకు చెత్త వేయకూడదని, అలాగే ఎక్కడ బడితే అక్కడ ఉమ్మి వేయకూడదని సూచించారు. కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా చెత్త వేసినట్లయితే ఆ కార్యాలయ సిబ్బంది తో మొత్తం కల్లెక్టరేట్ ను శుభ్రం చేయించడమే శిక్షగా వేస్తానని హెచ్చరించారు. సచివాలయాలు కూడా సేవలు సంతృప్తిగా ఉంటున్నాయి కాని, పరిశుభ్రత, పచ్చదనం అంతగా పట్టించుకోవడం లేదని, సచివాలయాల ఉద్యోగులు కూడా దీని పై శ్రద్ధ పెట్టేలా చూడాలని అన్నారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 22న జిల్లాకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఈనెల 22 నుండి 25వరకు మంత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ 22న మధ్యాహ్నం 1-00 గంటలకు విశాఖ చేరుకొని అక్కడి నుండి రాత్రి 7.30 గంటలకు విజయనగరం చేరుకుంటారని తెలిపారు. 23న ఉదయం 9-00 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించే నిమిత్తం గుంకలాంలో సభాస్థలిని పరిశీలించి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సి.ఎం. పర్యటన ఏర్పాట్లపై సమీక్షిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11-00 గంటలకు గజపతినగరంలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతారని, 11-30 గంటలకు గజపతినగరంలో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.మధ్యాహ్నం 3-00 గంటలకు బొండపల్లి మండలం తమటాడలో వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష ప్రాజెక్టును ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
24న ఉదయం 11 గంటలకు సాలూరు చేరుకొని అక్కడ నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సాయంత్రం లీ పారడైజ్ ఫంక్షన్ హాలులో జరిగే ప్రైవేటు కార్యక్రమానికి హాజరవుతారు.
25న ఉదయం 11 గంటలకు చీపురుపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 12 గంటలకు కెజిబివి స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
పరిశుభ్రత అనే పవిత్రమైన బాధ్యతను జిల్లాలోని ప్రతిఒక్కరూ శాశ్వతంగా పాటించడం ద్వారా మన జిల్లాను పరిశుభ్రతలో ఆదర్శంగా నిలపాల్సి వుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. పరిశుభ్రత ఏర్పరచడం ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మన కుటుంబంలోని వృద్ధులు, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమన్నారు. పరిశుభ్రత కేవలం వ్యక్తులకు, కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా గ్రామానికి, జిల్లా అంతటికీ విస్తరింపచేయాల్సి వుందన్నారు. పరిశుభ్రత ఏర్పరచడం, పచ్చదనం పెంచడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని నెలకొల్పగలమనే ఆశయంతో గత రెండేళ్లుగా జిల్లాలో పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పక్షంరోజులపాటు నిర్వహించిన వ్యర్ధాలపై యుద్ధం ప్రచారోద్యమం ముగింపు వేడుకలు, ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ జన్మదిన వేడుకలను సోమవారం విజయనగరం రూరల్ మండలం జమ్ము నారాయణపురం పంచాయతీలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం వల్లే కరోనా మహమ్మారి ఏభై రోజులపాటు జిల్లాలో ప్రవేశించకుండా నిలువరించగలిగామన్నారు. కరోనాను కట్టడి చేసి జిల్లాను మళ్లీ గ్రీన్ జోన్‌గా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, రాష్ట్రంలో కరోనా రహితంగా వున్న మొట్టమొదటి జిల్లాగా రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ గ్రామాన్ని, తమ ప్రాంతాన్ని, జిల్లాను పరిశుభ్రంగా వుంచడంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొంటూ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో కేకు కట్ చేయించారు.
అంతకు ముందు పడాలపేట జంక్షన్ నుండి నారాయణపురం గ్రామ సచివాలయం వరకు మనం- మన పరిశుభ్రతపై ఒక ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్‌తో పాటు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నడిపేన శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్, గ్రామీణ నీటిసరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పప్పు రవి, భూగర్భ జలశాఖ డి.డి. కె.ఎస్.శాస్త్రి, ఏ.డి. రమణమూర్తి, మత్స్యశాఖ డి.డి. నిర్మలా కుమారి, రూరల్ ఎం.పి.డి.ఓ. చయనులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా వుంచడం, బహిరంగ మలవిసర్జన ను విడనాడటం, ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవడం తదితర అంశాలపై నినాదాలు, ప్లే కార్డులతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో సేవలందిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు జిల్లా కలెక్టర్, ఏ.ఎం.సి. ఛైర్మన్, జె.సి. వెంకటరావు తదితరులు సత్కరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి సీట్లను భర్తీ చేయడం జరిగిందని సాంఘీక సంక్షేమ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ వై. యశోద లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర సాంఘీక సం క్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు 2020-21 వ విద్యా సంవత్సరం లో 5వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా లాటరీ పద్ధతిని సాంఘీక సంక్షేమ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించామన్నారు. జిల్లాలో 11 గురుకులాలు ఉండగా అందులో 880 సీట్లు ఉండగా 770 సీట్లు భర్తీ చేయడం జరిగిందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బి.ఏ.ఎస్) లకు గాను మిగిలిన సీట్లను ఉంచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆన్ లైన్ లాటరీ ప్రక్రియ సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.వెంకటరత్నం, జిల్లాలో గల సాంఘీక సంక్షేమ గురుకులాల ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల పేరెంట్స్ కమిటీ చైర్మెన్లు, సెక్రెటిరీలు, జిల్లా విజిలెన్సు మోనిటరింగ్ కమిటీ సభ్యులు కంట వేణు సమక్షంలో జరిగిందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలల వారిగా సీట్లు కేటాయింపు పత్రాలను జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోనూ, ప్రతి పాఠశాల నోటీసు బోర్డుపైన పొందుపరిచామని ఆమె చెప్పారు. సీట్ ఖరారు అయిన విద్యార్థిని, విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఆయా పాఠశాలలకు హాజరు అయి ఈ నెల 28వ తేదీ లోగా సీటును ఖరారు చేసుకోవాలని ఆమె స్పష్టం చేసారు. ఫలితాల కొరకు అభ్యర్ధి ఆధార్ నెంబర్ తో http://apgpcet.apcfss.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని యశోద లక్ష్మి తెలిపారు.
నిరుపేదల ఆశాజ్యోతి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా 21 వార్డ్ లో చినవాల్తేర్ చిన్న హాస్పిటల్ వద్ద వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ , చీరలు పంపిణి జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేసి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో 1000 మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. ఎంపీ ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్వహకులు శరన్ కుమార్ రెడ్డి, ప్రేమ్ కుమార్,మదుపాడ రవి, పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం తమకు చేరాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉద్యోగుల చిరకాల వాంఛ హెల్త్‌కార్డులు మంజూరుతో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్య భరోసా లభిస్తుందన్నారు. ఉన్నత విద్యలో ప్రవేశించే వారి శాతం పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ దిశగా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు జగనన్న అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీనెన పథకాలను అందిస్తున్నారన్నారు. పేదల అభివృద్దితోనే నిజమైన ప్రగతి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి విశ్వశిస్తున్నారన్నారు.
సంక్షేమానిక నిలువెత్తు సంతకంగా వై.ఎస్ జగన్ మోహన రెడ్డి నిలుస్తారన్నారు. ఇప్పటికే వందకుపైగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతను స్వీకరించిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులు మెచ్చే బిడ్డలుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీకి విద్యార్థులే ప్రధానమని, వారికి ఉపయుక్తంగా ప్రతీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో స్పందన కార్యక్రమానికి 25 వినతులు వచ్చాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు సంబంధించి 8 వినతులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 5 వినతులు, ఇతర శాఖలకు సంబంధించి 12 వినతులు వచ్చాయని తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన మేరకు నేరుగా కాకుండా ఆలన్ లైన్, ఫోన్ లైన్ ద్వారా స్పందన నిర్వహించినట్టు చెప్పారు. ప్రజలు చేసుకున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్టు డిఆర్వో వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ నుండి జె.చలమయ్య, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియకు వైద్య సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ ఆదేశించారు. కోవిడ్ వాక్సినేషన్ పై కోల్డ్ చైన్ బృందాలలో గల ఫార్మసిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమ వారం శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్ర నాయక్ మాట్లాడుతూ కోవిడ్ వాక్సిన్ పూర్తిగా కొత్త విధానంలో పంపిణీ జరుగుతుందన్నారు. వాక్సిన్ విధి విధానాలు ప్రభుత్వం నుండి ఇంకా రావలసి ఉందని, దీనిపై అనుసరించాల్సిన అంశాలపై ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం నుండి అందిన వాక్సిన్ మానిటరింగ్ విధానానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన ఇచ్చే ప్రతి కేంద్రంలో వాక్సిన్ ఇచ్చే గదితో పాటు వేచి ఉండు గది, అబ్జర్వేషన్ గది ఉండాలని ఆయన తెలిపారు. వాక్సిన్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు విధిగా ఉండాలని పేర్కొన్నారు. వాక్సిన్ గది లోకి ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు వేరుగా ఉండాలని సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా తప్పులు దొర్లరాదని ఆయన స్పష్టం చేసారు.
కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నందున నిరంతరం ఇచ్చే ఇతర వాక్సినేషన్ నిలుపుదల చేయరాదని చెప్పారు. మొదటి దశలో వైద్య సిబ్బందికి, రెండవ దశలో ఫ్రంట్ లైన్ పనివారలకు, మూడవ దశలో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి, 50 సంవత్సరాలు పైబడిన వారికి, అనంతరం 10 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన వారు, అటుపిమ్మట సాధారణ పౌరులకు వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసించారు. రెండవ దశ వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి గుర్తించాలని, ఐరోపా దేశాల్లో మరల లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమేనని ఆయన అన్నారు. కరోనా అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, మానవ సంబంధాలను కూడా దెబ్బతీసిందని పేర్కొ లేకుండా దీనిని పూర్తిగా నివారించి సాధారణ సమాజం నెలకొనే వరకు ఆరోగ్య సిబ్బంది సేవలు విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. వాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని, పూర్తి జాగ్రత్తలు పాటించి వాక్సినేషన్ ఇవ్వాలని ఆయన అన్నారు. వాక్సినేషన్ పై చక్కటి అవగాహన పొందాలని సూచించారు. ముందుగా నమోదు చేసుకున్న వ్యక్తికి మాత్రమే వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు.
వాక్సిన్ ఇచ్చిన వ్యక్తిని నిర్దేశిత 30 నిమిషాల సమయం అబ్జర్వేషన్ గదిలో విధిగా ఉంచాలని, వెంటనే ఇంటికి వెళ్లరాదని స్పష్టం చేసారు. వాక్సిన్ ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎంత ఉష్ణోగ్రతలో ఉంచాలి, వాక్సిన్ భద్రపరచే విధానం తదితర విషయాల పట్ల అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్య రీత్యా చేపడుతున్న కార్యక్రమం అని గుర్తుపెట్టుకోవాలని, ఏ చిన్న పొరపాటు అయినా అనర్ధాలకు దారితీస్తుందని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ కు వినియోగించిన పరికరాలను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని, సురక్షిత చర్యలు చేపట్టక పోతే అనర్ధాలు, దుష్ప్రభావాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, వాక్సిన్ ఇచ్చే చోట స్పిరిట్ తో శుభ్రం చేయరాదని, స్టెరైడ్ వాటర్ తో శుభ్రం చేయాలని సూచించారు. వాక్సిన్ ఇచ్చిన చోట రుద్ద రాదని చెప్పారు.
జిల్లా టిబి నివారణ అధికారి డా.ఎన్. అనూరాధ మాట్లాడుతూ వాక్సినేషన్ బృందంలో నలుగురు సిబ్బంది ఉంటారన్నారు. వాక్సిన్ గదిలోకి ఒక వ్యక్తిని మాత్రమే అనుమతించాలని చెప్పారు. వాక్సినేషన్ కు వచ్చే వారికి నిర్ణీత సమయాన్ని ముందుగా తెలియజేసి ఆ సమయంలో మాత్రమే రావలసినదిగా సూచించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని కోరారు. వాక్సిన్ కార్యక్రమంపై మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతి కుమారి దేవి, ఆర్బిఎస్కె జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.