1 ENS Live Breaking News

22న స్వామి వారి హుండీ లెక్కింపు..

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలను ఈ నెల 22న లెక్కించనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమీషనర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసారు. దేవస్థానం హుండీలను డిసెంబర్ 22 మంగళవారం ఉదయం 09.00గం.లకు 40 మంది సిబ్బందితో లెక్కించనున్నట్లు ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం, మాస్కు ధారణ, పరిశుభ్రతలకు ప్రాధాన్యత నిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఈఓ ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2020-12-18 21:03:21

20 న ఏపి సెట్-2020 పరీక్ష..

ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హత, పదోన్నతుల కోసం నిర్వహించే 'ఏపీసెట్-2020 ను రాష్ట్రవ్యాప్తముగా  ఈ నెల 20 వ తారీఖున  నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాలో  'ఏపీసెట్-2020' నిర్వహించే బాధ్యతలను జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి అప్పగించారు.  'ఏపీసెట్-2020' పరీక్ష రీజినల్ సమన్వయ అధికారిణి గా ఆచార్య సుజా ఎస్ నాయర్ నియమించారు.  జిల్లాలో మొత్తం నాల్గు సెంటర్లలో, మొత్తం 1753 మంది హాజరు కానున్నారు. నగర లోని  DKW కాలేజి, కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ , VR ఇన్స్టిట్యూట్ అఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ మరియు కాకుటూరులోని విశ్వవిద్యాలయ కళాశాలలో ఈ పరీక్ష  నిర్వహించించునట్లు సమన్వకర్త ఆచార్య సుజా ఎస్ నాయర్ తెలిపారు.  పేపర్-1లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి, పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారని  అన్నారు. పరీక్ష ఉదయం 9గం. 30 నిమిషాల ముంచి మధ్యాహ్నం 12 గం 30 నిమిషాల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు OMR పత్రములో సమాదానాలు గుర్తించాల్సివుంటుందని అన్నారు. అలాగే ఎటువంటి నెగటివేమార్కింగ్ లేదని తెలిపారు. అభ్యర్థులు తప్పక మాస్క్ ధరించి రావాలని అలాగే త్రాగు నీరు కూడా వారే తెచ్చుకోవాలని తెలియచేసారు. అభ్యర్థులను ఉదయం 8 గం నుంచి పరీక్షా ప్రాంగణములోనికి అనుమతిస్తారని 9 గం  30 నిమిషాల తర్వాత అనుమతి ఉండదని అన్నారు.   ఈ సందర్భముగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు  సమన్వయ అధికారిణి సుజా ఎస్ నాయర్ తో పరీక్షలు పకడ్బందీగా మరియు సురక్సితముగా నిర్హహించాలని సూచించారు.

Nellore

2020-12-18 20:45:57

సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలి..

వార్డు సచివాలయ కార్యదర్శులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువచేస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ సూచించారు. శుక్రవారం ఆయన నగరంలోని 45 వ వార్డు పరిధిలోని నరసింహారెడ్డి నగర్ 119వ వార్డు సచివాలయం,  అశోక్ నగర్ లోని 120వ వార్డు సచివాలయం, 43వ వార్డు పరిధి రామలింగేశ్వర్ నగర్ లోని 115 వ సచివాలయం, 39వ వార్డు పరిధి మమత నగర్ లోని 103వ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత సచివాలయాల్లో సిబ్బంది హాజరు పట్టిక, వినతుల పరిష్కారం, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్ నమోదులను ఆయన పరిశీలించారు. వార్డు సచివాలయ కార్యాలయంలో సంక్షేమ పథకాల క్యాలెండర్, సచివాలయ ఉద్యోగుల ఫోన్ నంబర్లతో కూడిన చార్ట్, సంక్షేమ క్యాలెండర్, కోవిడ్ నియంత్రణ సూచికల బోర్డ్ లు ఉన్నాయా లేదా అని అరా తీశారు. ఇప్పటివరకు ప్రజల నుంచి సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, వాటిలో ఎన్ని వినతులను పరిష్కరించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో ఎన్ని  నీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి..వాటికి సక్రమంగా నీటి పన్ను చెల్లిస్తున్నారని వార్డు ఏమినీటి కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. మొండి నీటి పన్న బకాయిదారులు ఎవరైనా ఉంటే వారికి వెంటనే నీటి కుళాయి కనెక్షన్ లను తొలగించాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఎన్ని అక్రమ కట్టడాలను గుర్తించారని వార్డు ప్లానింగ్ కార్యదర్శులను అరా తీశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రాకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో వార్డు వలింటీర్ల  కోవిడ్ జాగ్రత్తల గురించి ఇంటింటా అవగాహన కల్పించాలని చెప్పారు.

Kurnool

2020-12-18 19:59:55

శిష్టకరణాలను గుర్తించిన దేవుడు సీఎం వైఎస్ జగన్..

బీసీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటిమహంతి అనూష పట్నాయక్ అన్నారు. గురువారం విజయవాడలో  శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె శుక్రవారం నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రామ్ నగర్ లోని ఆమె నివాసం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 73ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో శిష్టకరణాలను గుర్తించి వారికి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన దేవుడు సీఎం వైఎస్ జగన్ మాత్ర మేనన్నారు.  బీసీల అభివృద్ధి కోసం 56 బీసీ కార్పొరేషన్ లు  ఏర్పాటు చేయడం హర్షదాయకమని, ఆమె సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. శిష్ట కర్ణాల సంక్షేమానికి, బీసీల అభ్యున్నతికి తన వంతు పూర్తి కృషి చేస్తానని చెప్పారు. శిష్టకరణ సంఘం అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఎస్ ఎన్ కె మహంతి మాట్లాడుతూ,  మహానేత స్వర్గీయ వైయస్ఆర్ శిష్ట కర్ణాలను బీసీల్లో  చేరిస్తే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షదాయకం అన్నారు. బీసీలంతా వైసిపి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, ఎప్పటికీ తామంతా జగన్ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జయతి శశిధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎయిర్ పోర్టులో చైర్ పర్శన్ కు ఘన స్వాగతం లభించింది.

Visakhapatnam

2020-12-18 19:56:52

ఉత్తరాంధ్రా అభివ్రుద్ధి ద్రోహి చంద్రబాబు..

ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడని  విశాఖ వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఎంవిపి కాలనీ టీటీడీ కళ్యాణ మండపం నుంచి  ఇసుకతోట జంక్షన్ వరకు  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కరమాని మాట్లాడుతూ,  వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని రానివ్వకుండా అడ్డుపడుతు ఈ ప్రాంత అభివ్రుద్ధిని కాలరాయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తుంటే, చంద్రబాబు నాయుడు, విశాఖలోని ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఈ ర్యాలీలో అక్కరమాని  వెంకటరావు, 9 వార్డు వైసిపి నాయకులు ఉమ్మడి స్వాతి దాస్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్సార్సీపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-18 19:51:11

18న లబ్దిదారులు బ్యాంకుకి రావాలి..

ఫోర్ వీలర్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కొరకు కాకినాడ, పెద్దాపురం డివిజన్లకు సంబంధించిన లబ్దిదారులు ఈనెల 18వ తేదీ ఉదయం 9 గం.ల నుండి కాకినాడ, రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో  బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించే డాక్యుమెంటేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని జాయింట్ కలెక్టర్ (ఆభివృద్ది) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు.  అభ్యర్థులు తమతో పాటు లబ్దిదారు వాటా మొత్తం 65 వేల రూపాయలతో ఈ డాక్యుమెంటేషన్ కార్యక్రమానికి హాజరు కావలసి ఉంటుందని ఆమె తెలిపారు.  అలాగే రాజమండ్రి, రామచంద్రపురం డివిజన్ల లబ్దిదారులకు ఈనెల 19వ తేదీన, అమలాపురం డివిజన్ లబ్దిదారులకు 20వ తేదీన, రంపచోడవరం, ఎటపాక డివిజనల్ల లబ్దిదారులకు 21వ తేదీన ఈ డాక్యుమెంటేషన్ నిర్వహిస్తారని తెలియజేశారు. తమ పరిధిలోని లబ్దిదారులు అందరూ డాక్యుమెంటేషన్ ప్రక్రియకు విధిగా హాజరైయ్యేట్లు చూడాలని డివిజన్ డవలెప్మెంట్ అధికారులు, మున్సిపల్ అధికారులను జాయింట్ కలెక్టర్(డి) ఆదేశించారు.  మొత్తం 1,059 మంది లబ్దిదారులకు గాను, డివిజన్ల వారీగా కాకినాడ(139), పెద్దాపురం(181), రాజమండ్రి(140), రామచంద్రపురం(123), అమలాపురం(218), రంపచోడవరం(46), ఎటపాక (29), 12 మున్సిపల్ ఆర్భన్ ప్రాంతాల్లో (183) మంది లబ్దిదారులు ఈ కార్యక్రమాలకు హాజరు కావలసి ఉందన్నారు. 

కాకినాడ

2020-12-17 22:24:51

ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి పక్కా ఏర్పాట్లు..

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు పధకంలో భాగంగా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి చే ప్రారంభించే ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు సిధ్ధం చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కొఆర్డినేటర్ తలసరి రఘురామ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే డి.చంద్రశేఖరెడ్డిలతో కలిసి యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో నిర్మించనున్న నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. 25వ తేదీన మధ్యహ్నం ముఖ్యమంత్రి మధురపుడి విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా నేరుగా కొమరగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. హెలిప్యాడ్ నుండి బయలుదేరి అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫైలాన్ ను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం లబ్దిదారులకు ఇచ్చే ఇంటి మోడల్ గా నిర్మించిన ఒక గృహాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారన్నారు. అనంతరం అక్కడ లబ్దిదారులతో ఏర్పాటు చేసిన వారితో ముఖ్యమంత్రి మాట్లాడతారని కలక్టర్ తెలిపారు.  అంతకు ముందు కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా స్ధాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి ప్రారంభించే ఇళ్ళ పట్టాల కార్యక్రమం కొరకు సన్నాహక ఏర్పాట్లపై కలక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి హాజరైయ్యే లబ్దిదారులకు ఆహారం,త్రాగునీరు,రవాణా సదుపాయాలలు కల్పించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకురావలని కాకినాడ నగర పాలక సంస్ధ  కమీషనర్ కు సూచించారు.  పంచాయతీ అధికారులు మంచి నీరు సరఫరా, పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వివిధ శాఖలకు కేటాయించిన పనులు సజావుగా జరిగే విధంగా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కలక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ  సమావేశంలో  పోలీస్ సూపరింటెండెంట్లు షీమోషి బాజ్ పాయి, అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలక్టర్లు జి.లక్ష్మిశ, జి.రాజకుమారి, సబ్ కలక్టర్లు అనుపమా అంజలి, హిమాన్షు కౌశిక్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, అడిషనల్ ఎస్.పి., సుమిత్ గార్గ్, జిల్లాలోని ఆర్.డి.ఓ.లు , జిల్లా స్ధాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Kothapalli(Haveli)

2020-12-17 22:16:47

మొక్కతోనే జీవకోటికి ప్రాణవాయువు..

మొక్క పచ్చదనాన్ని పెంపొందిండచంతోపాటు మనిషి ప్రాణవాయువుకి జీవనాధారమని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆర్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయన  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హరిజ‌వ‌హ‌ర్ లాల్ తో క‌లిసి స్థానిక జిల్లాప‌రిష‌త్ అతిధిగృహం వ‌ద్ద గురువారం మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  హ‌రిత విజ‌య‌న‌గ‌రం స్థాప‌న‌కోసం జిల్లాలో జ‌రుగుతున్న కృషిని క‌మిష‌న‌ర్ అభినందించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క ఉద్యోగి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా వాళ్లే తీసుకోవాలని తద్వారా ఆ మొక్క పెద్దదై పెద్ద చెట్టుగా మారిన తరువాత అది మరో పది మందికి ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నీడనివ్వాలని అన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, డిఎఫ్ఓ ఎస్‌.జాన‌కిరావు, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, క‌లెక్ట‌రేట్ ఏఓ దేవ్ ప్ర‌సాద్, మున్సిప‌ల్ ప్లాంటేష‌న్ అవ‌నాపు ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-17 21:56:52

కోవిడ్ వేక్సినేష‌న్‌కు ప‌‌టిష్ట ప్ర‌ణాళిక..

కోవిడ్‌-19 వేక్సినేష‌న్ పంపిణీకి ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు. కోవిడ్ వేక్సినేష‌న్ టాస్క్‌ఫోర్సు క‌మిటీ స‌మావేశం గురువారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జ‌రిగింది. జిల్లాలో వేక్సినేష‌న్ స‌న్న‌ద్ద‌త‌పై ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ నిర్వ‌హించారు.          క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ తొలివిడ‌త‌లో 14,278 మంది వైద్యారోగ్య‌ సిబ్బందికి వేక్సిన్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రెండో ద‌శ‌లో పోలీసులు, మున్సిప‌ల్ శానిటేష‌న్ సిబ్బంది, హోంగార్డులు త‌దిత‌ర‌ ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు, 50ఏళ్లు పైబడిన‌వారికి, వివిధ దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తుల‌కు వేక్సినేష‌న్ జ‌రుగుతుంద‌న్నారు. అత్యంత కీల‌క‌మైన మూడో ద‌శ‌లో సామాన్య ప్ర‌జ‌ల‌కు వేక్సిన్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. తొలివిడ‌త‌ వేక్సిన్ వేసేందుకు ముందుగా అన్ని వ‌స‌తులు క‌లిగిన పిహెచ్‌సిల‌ను ఎంపిక చేయాల‌ని సూచించారు. ఈ కేంద్రాల్లో వెయిటింగ్ హాలు, వేక్సినేష‌న్ రూము, అబ్జ‌ర్వేష‌న్ రూములు ఉండాల‌న్నారు. ఈ కేంద్రాల‌కు నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు అనుగుణంగా ర‌హ‌దారి సౌక‌ర్యం కూడా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైన సిబ్బందిని గుర్తించి, వారి ఉద్యోగ స్థాయికి అనుగుణంగా విధుల‌ను కేటాయించి, శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. ముఖ్యంగా వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు గాను ట్రాన్స్‌పోర్టేష‌న్‌, అవేర్‌నెస్‌, రిస్క్‌మేనేజ్‌మెంట్ క‌మిటీల‌ను వేసి, వారికి కూడా అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వాల‌ని అన్నారు. ఈ ప్ర‌క్రియ‌ను 24 గంట‌లూ ప‌ర్య‌వేక్షించే యంత్రాంగాన్నికూడా ఏర్పాటు చేయాల‌న్నారు. శిక్ష‌ణ‌కోసం ఒక కేలండ‌ర్‌ను రూపొందించుకోవాల‌ని, అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాకు స‌మాచారాన్ని కూడా అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.           జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ వేక్సినేష‌న్ కోసం ఈ నెల 15 నుంచి 24 వ‌ర‌కూ వివిధ స్థాయిల్లో శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఎటువంటి పొర‌పాట్లు  చోటు చేసుకోకుండా, అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తో, అంద‌రి స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లూ స‌హ‌క‌రించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. వేక్సినేష‌న్ కార్యాచ‌ర‌ణ‌ను యుఎన్‌డిపి ప్రాజెక్ట్‌ ఆఫీస‌ర్ క‌మ‌లాక‌ర్ ప‌వ‌ర్ పాయింట్ ద్వారా వివ‌రించారు. ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, యునెసెఫ్ క‌న్స‌ల్టెంట్ శుభ‌కిషోర్‌, డ‌బ్ల్యూహెచ్ఓ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ భ‌వానీ,  వైద్యారోగ్య‌శాఖ‌తోపాటు వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-17 21:51:19

కర్నూలులో మంచినీటి సరఫరాలో అంతరాయం..

కర్నూలు నగరంలో శుక్రవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కిసాన్ ఘాట్ మార్గంలో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమింగ్ పూల్(ఈత కొలను) వద్ద మంచినీటి సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ మార్పుతో పాటు కొంత మరమ్మతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలోని బుధువారపేట, హాబీ ముబారక్ నగర్, సంజయ్ గాంధీ నగర్, స్వామిరెడ్డి నగర్, లక్ష్మీ గార్డెన్స్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మారుతీ హోమ్స్, జోహారాపురం తదితర ప్రాంతాలకు మునిసిపల్ మంచినీటి సరఫరా కు అంతరాయం కలగనుందని తెలియజేశారు. నగర పాలక ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి తిరిగి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు.

Kurnool

2020-12-17 21:45:19

ఎస్సీల సంక్షేమానికి సమిష్టిగా పాటుపడాలి..

ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో జిల్లా స్థాయి అధికారులు అందరూ సేవా దృక్పథంతో పనిచేసి వారి అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర  షెడ్యూల్డు కులములు  శాసనసభా కమిటీ అధ్యక్షులు  గొల్ల బాబూరావు   పేర్కొన్నారు.  గురువారం   జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని  సమావేశ మందిరంలో  అంబేద్కర్ చిత్రపటానికి  పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాలను ప్రారంభించారు . కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షతన  జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలు    అమలులో  ఎస్సీ కులాల లబ్ధిదారుల ప్రగతి పై  సమీక్షించారు.  ఎస్ సి అట్రాసిటీ కేసుల పై  సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్తి ఏసుబాబు,  పాల్గొన్నారు  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ( కమిటీ సభ్యులు) ఎమ్మెల్యే. కొండేటి చిట్టిబాబు  ఎమ్మెల్యే .ఉన్న మట్ల ఎలిజ ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి,జిల్లా సంయుక్త కలెక్టర్ (  రెవెన్యూ  మరియు  అభివృద్ధి)   నిశాంత్ కుమార, సంయుక్త  కలెక్టర్ ( సంక్షేమ  మరియు  అభివృద్ధి)   సిరి పెనుగొండ సబ్ కలెక్టర్  నీ శాంతి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఈ కమిషన్  క్షేత్ర స్థాయిలో వివిధ జిల్లాల్లో పర్యటించి ఎస్సీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మా కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు.  జిల్లా పర్యటనలో నేను ఎంతో నేర్చుకున్నానని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ సి ల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వాటిని సక్రమైన మార్గంలో  అర్హులైన లబ్ధిదారులకు చేరవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని పేర్కొన్నారు. జిల్లాలో పేదరికంలో ఎక్కువమంది అనగారిన వర్గాల ప్రజలు ఉన్నారని వారిని  ఆర్థికంగా ,సామాజికంగా, అభివృద్ధికి మీరు కృషి చేయాలని అధికారులను కోరారు. సాధ్యమైనంతవరకు  ఎస్సీ ప్రజలను  సమస్యలను పరిష్కరించాలని కోరారు ఉద్యోగాల కల్పనలో, ఆర్థిక భరోసా, ఆత్మ గౌరవం గా వారి జీవన ప్రమాణ స్థాయి ల ను మెరుగుపరచడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. మంచి  కష్టపడే  తత్వము కలిగిన జిల్లా కలెక్టర్  మీకు ఉన్నాడని, అతని ఆధ్వర్యంలో  మీరందరూ కలిసికట్టుగా కృషి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో పయనించాలని ఆయన పేర్కొన్నారు.   పేదరికం ఎక్కడ అయితే ఎక్కువగా ఉంటుందో   అక్కడకూడా చైతన్య ఉంటుందని అని స్పష్టం చేశారు.  జనవరి మాసం లోపు  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  నాలుగో తరగతి  ఎస్సి ఉద్యోగాల భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు. వివిధ ఎస్సీ ప్రజల నుంచి, దళిత సంఘాల నుంచి . రెవెన్యూ,  పోలీసు, సంక్షేమం, ఎస్సీ  అట్రాసిటీ కేసులు పై  సమస్యలపై 80% వినతులు స్వీకరించడం జరిగింది ని.  వాటినన్నిటిని  కలెక్టర్ కి అందజేయడం జరిగితుందని.  కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మీ మీ శాఖలకు  ఆ వినతులు అందజేయడం జరుగుతుందని వాటిని డిసెంబర్ మాసం లోపు పరిష్కరించి మా కమిటీకి నివేదిక అందజేయాలని కోరారు. అలసత్వం వీడండి, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేకూరేలా చూడండి. అసైన్మెంట్ భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు దాటిన  అనగారిన వర్గాల ప్రజలు ఇంకా దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన చెందారు.  ఉప్పర్ పల్లి లో సంఘటన నా మనసు కలచివేసింది అని ఆవేదన చెందారు.   ఎస్సీ వర్గాల ప్రజలకు   వివిధ చట్టాలపై  అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని  ఎస్పీని కోరారు.  ప్రతి పైసా కూడా ప్రతి లబ్ధిదారులు చేరాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పథకాలు అమలు లో22 పథకాలు  ఎస్సీ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలో1274 పాఠశాలలను డిసెంబర్ మాసం 31 తేదీ లోపల పూర్తి చేయడం జరుగుతుందని ఇందులో ఆరు లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఎస్ సి విద్యార్థులు 45 వేలమంది  ఉన్నారని  తెలిపారు. మొదటి విడత పంతొమ్మిది వేల ఐదు వందలు ఎస్సీ ప్రజలకు ఇంటి నిర్మాణం పనులు శ్రీకారం చుడుతున్న మని పేర్కొన్నారు.1026 లేఅవుట్లు  ఇంటిగ్రేటెడ్ కాలనీలను  ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.  వివిధ సామాజిక భద్రత పింఛన్లు ద్వారా జిల్లాలో 70 వేల మంది    ఎస్సీ ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.  స్టాండప్ ఇండియా పథకం ద్వారా  జిల్లాలో  ఎస్సీ, ఎస్ టి, మహిళ  అభ్యర్థులు 3000 మంది దరఖాస్తు చేసుకున్నారని, రుణ  10 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు  రుణం సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ ప్రజలు అక్షర శాతం 56 శాతం ఉన్నదని. అన్ని శాఖల సహకారంతో  త్వరలో   ఎస్సీ ప్రజలలో అక్షరాస్యత శాతం పెంచడానికి   కృషిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ   డివిజన్ స్థాయిలో  ఎస్సీ వర్గాల ప్రజలకు   వివిధ చట్టాలపై  వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు, మహిళలకు దిశా యాప్  అవగాహన కార్యక్రమాలు  సంబంధిత  గ్రామ సచివాలయ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో  కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లలో  పటిష్ఠంగా అమలు చేయడానికి మా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తూ ఉందని పేర్కొన్నారు. ఇందుకు  సంబంధించిన నివేదికలు  కమిటీకి అందజేయడం జరుగుతుందని తెలిపారు.  అనంతరం   వివిధ శాఖలకు సంబంధించిన  పలు సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ ప్రజలకు  ఇచ్చే రాయితీల పై  ప్రగతి నివేదికలు  ఆయా శాఖ హెచ్ ఓ డి లు  చదివి వినిపించారు.  డీఎస్పీలు  ఎస్సీ అట్రాసిటీ కేసులు పై సమగ్ర వివరాలను  సభలో చదివి వినిపించారు.   కంపాస్ నెట్ నియామకం  ఉద్యోగ ధ్రువపత్రాన్ని అందజేశారు.    కనేకల్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వీపర్ గా  పని చేస్తూ,సర్వీసులో ఉండగానే మరణించిన ఎర్రిస్వామి కారుణ్య నియామక క్రింద అతని కుమారునికి ముదిగుబ్బ గ్రామ పంచాయతీ కార్యాలయంలో  బిల్ కలెక్టర్ గా  రాజయ్య కు నియామక పత్రామును అందజేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డు కులములు శాసనసభా కమిటీ అధ్యక్షులు శ్రీ గొల్ల బాబూరావు,జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-12-17 21:43:44

కరోనా టీకా ప్రాధాన్యత వైద్యసిబ్బందికే..

రాష్ట్ర ప్రభుత్వం  కోవిడ్ వ్యాక్సిన్ ను జిల్లాలో మొదటి దశలో 47818 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అనంతపురం జిల్లా జనాభా 44,55,346 ఉండగా అందులో మొదటిదశలో  వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సిబ్బందికి టీకాలు  వేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం  ఆదేశించిందన్నారు.. ఆ మేరకు 18577 మంది ప్రభుత్వ ఆరోగ్య సంస్థల సిబ్బంది, 29241 మంది ప్రైవేట్ ఆరోగ్య సంస్థల నుండి లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన 18577 మంది టీకా లబ్దిదారుల్లో  వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఎంఎల్హెచ్పిలు, ఎంపిహెచ్ఎస్ (ఎం అండ్ ఎఫ్), ఎంపిహెచ్ఎ (ఎం అండ్ ఎఫ్), ఎంపిహెచ్ఇఒ, పిహెచ్ఎన్, సిహెచ్ఒ మెడికల్ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ఆశా, ఎడబ్ల్యుడబ్ల్యు / అయాస్,  యుపిహెచ్సిల సిబ్బంది ఉన్నారన్నారు. ప్రైవేట్ ఆరోగ్య సంస్థలకు సంబంధించిన టీకా లబ్ధిదారుల సంఖ్య 29241 మంది  కాగా , అందులో వైద్యులు, స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బంది, ప్రైవేట్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఉన్నారు.గుర్తించిన  లబ్దిదారులకు  వ్యాక్సిన్ వేసేందుకు 3950 మంది డాక్టర్లు, నర్సులు, ఎఎన్ఎం లను గుర్తించడం జరిగిందన్నారు.మొదటి దశలో ఒక పిహెచ్‌సిని ఒక సెషన్ సైట్‌గా  మొత్తం 135 సైట్ లలో అందరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ అందించే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు  కలెక్టర్ ఛైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ, మునిసిపల్ కమిషనర్ ఛైర్మన్ గాపట్టణ స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, తహశీల్దార్ చైర్మన్ గా  మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అలాగే అనంతపురము జిల్లా వైద్య మరియు ఆరోగ్య  శాఖ అధికారి కార్యాలయంలో  08554 277434 ఫోన్ నంబర్ తో  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.  ఈ నెల 12,14 తేదీల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయిలో, 15 తేదీన  జిల్లా స్థాయి అధికారులు, ఎంహెచ్‌ఓ, మెడికల్ ఆఫీసర్లు, ఎస్‌ఓలు మరియు ఎఓలు (ఎన్‌హెచ్‌ఎం / ఎన్‌యుహెచ్‌ఎం), కోల్డ్ చైన్ హ్యాండ్లర్లకు ,16 వ తేదీన  పిహెచ్‌సిల పర్యవేక్షక సిబ్బందికి వ్యక్తిగతంగా  శిక్షణ పూర్తయిందన్నారు.  18 వ తేదీన  వ్యక్తిగతంగా COVID-19 టీకా యొక్క కార్యాచరణ మార్గదర్శకాలపై అన్ని వైద్య అధికారులకు, 21 వ తేదీన కోల్డ్ చైన్ హ్యాండ్లర్ లకు,  22 వ తేదీన ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థకు, 23 వ తేదీన ప్రైవేటు ప్రాక్టీషనర్లకు  శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.. అలాగే 21వ తేదీ నుండి 24 వతేదీ వరకు  పిహెచ్‌సి స్థాయిలో  సూపర్‌వైజర్ సిబ్బంది, ANM లు, ASHA లు, అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. వ్యాక్సిన్  నిల్వ చేసేందుకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా వ్యాక్సిన్ స్టోర్లో నిల్వ చేయబడుతుందన్నారు. ఇందుకు కావలసిన ఐస్ ప్యాక్స్, కోల్డ్ బాక్స్ లు, వాహనాలను సిద్ధం చేస్తున్నామన్నారు..                               కాగా రెండవ దశ లో  ఫ్రంట్ లైన్ కార్మికులకు అనగా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ, పారిశుధ్యం మరియు ఇతర లైన్ విభాగాల సిబ్బందికి, కోమోర్బిడిటీస్ (రక్తపోటు, డయాబెటిస్,క్యాన్సర్లు, సిఓపిడి తదితర వ్యాధులు కల్గిన వారికి,మూడవ  దశ లో సాధారణ ప్రజలందరికీ టీకాలు అందించేందుకు ప్రభుత్వ అదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు..

Anantapur

2020-12-17 21:37:49

విశాఖలో సినిమా హిస్టరీ డాక్యుమెంటరీ ప్రదర్శన..

జీవితంలో నిరంతరం ఎదురయ్యే ఒత్తిళ్ళ తో సతమతం అయ్యే ప్రతి మనిషికి సినిమా ఒక రిలీఫ్ ఇస్తుందనడంలో సందేహం లేదని.. సినిమా నటుడు, అభయ్ ప్రొడక్షన్స్ వ్యస్థాపకుడు ధనుంజయ్ అన్నారు. ఈ వినోద రంగంలో ఉండే సాధక బాధకాలను ఒక డాక్యుమెంటరీ  ద్వారా ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గురువారం డాబాగార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. "సినిమా హిస్టరీ " పేరుతో నిర్మించిన ఈ  డాక్యుమెంటరీ చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కళా భారతి అడిటోరి యం లో ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశం ఉచితమన్నారు.  హైదరాబాద్ తర్వాత సినీ పరిశ్రమకి అత్యంత అనుకూల ప్రదేశం విశాఖపట్నం మాత్రమేనన్నారు. ఒక గంట నిడివి వుండే ఈ డాక్యుమెంటరీలో .. జూనియర్ ఆర్టిస్టులు మొదలుకొని అన్ని రంగాల వారి ఇతివృత్తాలను  చూపిస్తామన్నారు. సినిమా రంగంలో  అనుమతులకు ఇబ్బందులు పడుతున్నారు. ఔత్సాహికులు హాజరై..  తమ అనుభవాలు,  ఇబ్బందులు, తెలియజేసే అవకాశం కల్పిస్తామన్నారు.  వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. 1890 నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు గడిచిన 125 సంవత్సరాలలో సంభవించిన అనేక మార్పులు, అనేక విషయాలను విశదీకరించే ప్రయత్నం చేస్తున్న ధనుంజయకు అభినందనలు తెలిపారు. సినిమా రంగం అంటే పూల పాన్పు కాదన్నారు. విశాఖపట్నం అంటేనే అందం, ఆహ్లాదం అని అభివర్ణించారు. బాదం గీర్  సాయి మాట్లాడుతూ.. కళాకారులు కళారంగానికి, పాత్రికేయులు తమ సహాయ సహకారాలను అందజేస్తున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో సునీల్ చరణ్, సత్య, ఎం ఎన్ ఆర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-17 21:25:15

అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యంధ్రా రాజధానిగా అమరావతిని నిర్మించుకునే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెడగొతున్నారని తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు,మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమానికి 365 రోజులు పూర్తి అయిన సందర్భంగా గురువారం టిడిపి కార్యాలయంలో మూడురాజధానులపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ,  రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడుతున్న మూడుముక్కలాట కు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే భావితరాలకు కలిగే నష్టాలకు మనమే భాద్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేసారు.రాష్ట్ర ప్రధానకార్యదర్శి మహ్మద్ నజీర్ మాట్లాడుతూ అమరావతి ప్రాముఖ్యాన్ని,గొప్పతనాన్ని దెబ్బతీసేవిధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నిందని దుయ్యబట్టారు.కేవలం రాజధాని మాత్రమే కాకుండా పదమూడు జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి,యువతకు ఉపాధికేంద్రంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తే,జగన్ అమరావతినే లేకుండా చెయ్యడానికి దుర్మార్గపు ఆలోచనలుచేశారని విమర్శించారు.ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా అమరావతిని రాజధాని ఎంపికచేస్తే సాక్షాత్తు శాసనసభలో ఒప్పుకున్న జగన్ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేలా మూడురాజధానుల పేరుతో ఆటలాడుకుంటున్నారని నజీర్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం దాదాపు 29వేలమంది రైతులు  ముఫైమూడు వేల ఎకరాల భూములను త్యాగం చేసారన్నారు.గుజరాత్ లో గాంధీనగర్ దగ్గర గిఫ్ట్ సిటీ పేరుతో,అహ్మదాబాద్ దగ్గరలో దోలేరా పేరుతో కొత్తగా నగరాలు నిర్మిస్తున్నారన్నారు.అద్భుతంగా నిర్మిస్తున్న అమరావతిని ఈ రోజు శిధిలావస్థలో చూస్తుంటే బాధేస్తోందన్నారు.అనంతరం మూడురాజధానులు వద్దు ఒక్కరాజధానే ముద్దు,అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలంటూ నాయకులు కార్యకర్తలు  రైతులకు మద్దతుగా  నినాదాలు చేసారు.ఈ కార్యక్రమంలో విల్లూరి డాక్టర్ చక్రవర్తి,వానపల్లి రవికుమార్,సర్వసిద్ది అనంతలక్ష్మి,పంపాన రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-17 21:20:05

ఘనంగా పెన్షనర్ దినోత్సవం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం శ్రీకాకుళం జిల్లా  ఆధ్వర్యంలో రెవిన్యూ పోలీసు సంఘాలు సంయుక్తంగా  పెన్షనర్స్ డే సంధర్భంగా శ్రీకాకుళం ఆర్ అండ్ బి. అతిధి గృహం వద్ద గల  శాంతా అనురాగ ఆనందనిలయంలో గురువారం  ఉదయం పెన్షనర్స్ దినోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సంధర్భంగా   జిల్లాపెన్షనర్స్ అధ్యక్షులు వీరభద్రస్వామి, రెవిన్యూ పెన్షనర్స్అధ్యక్షులు మోహనరావు పోలీస్ సంఘాధ్యక్షులు రామారావు  జాతీయ పెన్షనర్ల అసోసియేషన్ ఆవశ్యకతను, అసోసియేషన్ ఆవిర్భావానికి చేసిన కృషిని గుర్తు చేసారు.  పెన్షనర్ నకారా  అవిరళ కృషి,  సుప్రీం కోర్టు న్యాయవాది జస్టిస్ చంద్ర చూడ్ తీర్పు పెన్షనర్లకు వరదానమని వారికి  జీవితాంతం ఋణపడి వుంటామని సభ్యులందరూ వ్యక్త పరిచారు. ఈ సంధర్భంగా  విశ్రాంత  డి.ఈ.వో. బి.మల్లేశ్వర రావు,  విశ్రాంత రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పి.యం.జె.బాబు, రిటైర్డ్ ఏ.ఆర్.యస్.ఐ. అప్పారావు  లకు  సన్మానం చేసారు.  సన్మాన గ్రహీతలు పెన్షనర్ సంఘాలకు ధన్యవాదాలు తెల్పుతూ సంఘాలు ఐక మత్యంతో కలసికట్టుగా వుండి పెన్షనర్ల డిమాండ్లను సాధించు కోవాలని తెలిపారు. మరియు ప్రభుత్వం నుండి జీతభత్యాలు,  పెన్షన్లు తీసుకుంటున్న ప్రజా ప్రతి నిధుల నుండి వసూలు ఇన్ కం టాక్స్ వసూలు చేయటం లేదని,  అదే విధంగా  పెన్షనర్ల నుండి వసూలు చేస్తున్న ఇన్ కం టాక్సు రద్దు కోసం  ఐకమత్యంగా పోరాడి సాధించాలని కోరారు.                     ఈ కార్యక్రమంలో కే.సోమసుందర్, యం.యస్.ఆర్.ఎస్. ప్రకాశరావు. నరశింహమూర్తి. డీ.పి.దేవ్. రమణ, బి.జయమ్మ. సత్యవతి  మరియు అధిక సంఖ్యలో పెన్షనర్లు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ  పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2020-12-17 21:11:47