1 ENS Live Breaking News

గ్రూప్ –1 పరీక్షలను పక్కాగా నిర్వహించాలి

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న ఏ.పి.పి.యస్.సి  గ్రూప్ – 1 పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబరులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో  డిసెంబర్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు  గ్రూప్ – 1 పరీక్షలు జరగనున్నాయని అన్నారు. శ్రీ వెంకటేశ్వర కళాశాలకు 117 మంది, శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలకు 195 మంది వెరశి 312 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతీ రోజూ ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 01.00గం. వరకు సాగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని అన్నారు. కోవిడ్ దృష్ట్యా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు కోవిడ్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసారు. తప్పనిసరిగా శానిటైజర్, మాస్కు , సామాజిక దూరం పాటించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎటువంటి తప్పులు జరగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రధ్ధను కనబరచాలని, అభ్యర్ధులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఏదైనా సమస్యలు తలెత్తితే ఏ.పి.పి.యస్.సి సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీశ్వరరావు, సెల్ నెం. 90145 50915 నెంబరును సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, పరీక్షలను సజావుగా , పక్కగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని కోరారు.           ఈ సమావేశంలో ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీర్ యన్.రమేష్, ఎచ్చెర్ల తహశీల్ధారు యస్.సుధాసాగర్, ఉప తహశీల్ధారు బి.ప్రసాదరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి , ఏ.పి.ఎస్.ఆర్.టి.సి, పోలీస్ శాఖ , ఇతర శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-12 21:35:25

త్వరితగతిన కేసులు పరిష్కారం..

జాతీయ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవచ్చని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.రామకృష్ణ కక్షిదారులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం   జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, దీనితో పాటు వర్చువల్ లోక్ అదాలత్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. కక్షిదారులు కోర్టులకు రాకుండా వారు ఉన్న ప్రాంతం నుండే వారి కేసు వివరాలు, రాజీ షరతులను మెయిల్ ద్వారా పంపినట్లయితే వాటిని పరిశీలించి తిరిగి అవార్డును తయారుచేసి వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. కోర్టులు ఉండగా లోక్ అదాలత్ ను ఎందుకు ఆశ్రయించాలనే భావన చాలా మందికి ఉంటుందని, అయితే కోర్టులను ఆశ్రయించేవారిలో ఒకరికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందని, తీర్పు అనుకూలంగా రానివారు వేరే కోర్టులను, ఆపై కోర్టులను ఆశ్రయించే అవకాశముందని, తద్వారా ధనం, సమయం వృధా అవుతుందని చెప్పారు.  కానీ ఇరువర్గాల రాజీమార్గంతో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించడం వలన ఉభయులకు సమన్యాయం జరుగుతుందని, అలాగే కోర్టుకు చెల్లించిన ఖర్చులు కూడా తిరిగిచెల్లించడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసారు. కోర్టులకు వచ్చిన కేసులు, కోర్టులకు రాకముందు ఉన్న కేసులను   ( ప్రీలిటిగేషన్ ) కక్షిదారులు ఒక ఆర్జీ రూపంలో రాసి ఇచ్చినట్లటయితే,  రాజీమార్గం ద్వారా ఉభయులు తెలిపిన షరతులకు లోబడి చట్టబద్ధమైన వాటిని పరిగణలోకి తీసుకొని అవార్డును జారీచేయడం  జరుగుతుందని, ఇరువర్గాల రాజీమార్గం ద్వారా పరిష్కరించబడినందున వేరే కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం లేకుండా తుదితీర్పు అవుతుందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. త్వరితగతిన శాస్వతమైన పరిష్కారం, సామరస్యపూర్వకమైన పరిష్కారం లోక్ అదాలత్ ద్వారా సాధ్యపడుతున్నందున లోక్ అదాలత్ కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని వివరించారు.  ఈ అదాలత్ ద్వారా  సివిల్ , క్రిమినల్ , చెక్ బౌన్స్, ప్రీలిటిగేషన్, మోటారు వాహనాల నష్ట పరిహారం వంటి కేసుల్లో ఎలాంటి కాలహరణం లేకుండా తక్షణమే కేసును పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని, ప్రతీ నెల లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ప్రతీ రెండు,మూడు మాసాలకు మెగా లోక్ అదాలత్ ద్వారా వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 19 కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, ప్రధాన కేంద్రంలో 4 బెంచ్ లను ఏర్పాటుచేయడం జరిగిందని కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.            జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించబడతాయని, ముఖ్యంగా రెవిన్యూ కేసులు ఎక్కువగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భూసేకరణ చెల్లింపుల విషయంలో ఇరువర్గాల రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించబడుతున్నందున ఇటు ప్రభుత్వానికి, అటు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కక్షిదారులు ఇతర కోర్టులను ఆశ్రయించడం వలన కాలయాపన, ధనం వృధా అవుతుందని, కానీ లోక్ అదాలత్ ద్వారా ఎటువంటి ఖర్చులు కాబోవని, అదేవిధంగా ఉభయుల షరతులతో కేసులు పరిష్కరించబడుతున్నందున ఇరువర్గాలకు సమన్యాయం చేకూరుతుందని స్పష్టం చేసారు. ఇరువర్గాల రాజీమార్గంతో పరిష్కరించబడినందున ఇతర కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం కూడా ఉండబోదని కలెక్టర్ తెలిపారు.           ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ,  సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్  టి.వెంకటేశ్వర్లు, థర్ఢ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్  పి.అన్నపూర్ణమ్మ, ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్  యన్.రమేష్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్టు రమేష్, టౌన్ డి.యస్.పి యం.మహేంద్ర, సామాజిక కార్యకర్త బరాటం కామేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-12 21:02:32

ఏ రంగమైనా విలువలే ప్రామాణికం..

ఏ రంగంలోనైనా విలువలే అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. చిత్తశుద్ధి, కష్టపడి పని చేయడం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం ప్రతి రంగంలో ప్రధానమని, తన జీవితంలో వీటిని మాత్రమే నమ్మి ఓ సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగానని తెలిపారు. విశాఖపట్టణం నుంచి  వై.పి.ఓ. గ్రేటర్ చాప్టర్ కు చెందిన యువ పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అంతర్జాల  మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ భవిష్యత్తు అయిన యువ పారిశ్రామికవేత్తలను ఈ కార్యక్రమం ద్వారా కలవడం ఏంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, వ్యాపారం సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని. అది విలువలతో కూడుకుని ఉండాలని సూచించారు. వ్యాపార రంగమే కాకుండా ఏ రంగంలో అయినా విలువలు ఎంతో ముఖ్యమని తెలిపారు.  వ్యాపారం సంపాదన కోసమే అయినా, ఆరోగ్యం కూడా అత్యంత కీలకమని, అదే సమయంలో సంపాదనలో కొంత భాగం సమాజానికి కూడా  కేటాయించి, ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.  ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా వ్యాపార రంగం అంటే ఓ ప్రతికూల భావన ఏర్పడిన మాట వాస్తవమేనని, దాన్ని పోగొడుతూ, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలో ఉండే వారికైనా క్యారక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్  అత్యంత ముఖ్యమని తెలిపిన ఆయన, ప్రస్తుతం అని రంగాల్లో క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాలిటీ, క్యాష్ ప్రాధాన్యత పెరగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లభించదన్న ఉపరాష్ట్రపతి, నలుగురితో కలిసి పంచుకోవడం, నలుగురి మేలును కోరుకోవడం భారతీయ ధర్మం మనందరికీ నేర్పిందని తెలిపారు. ప్రాచీన భారతదేశం అత్యంత సంపన్న దేశంగా వెలుగొందిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశం ఎవ్వరి మీద దాడులు చేయలేదని, ప్రతి సందర్భంలోనూ మన విజ్ఞానాన్ని నలుగురికి పంచేందుకు భారతదేశం విశ్వగురువుగా నాయకత్వం వహిస్తూ, దిశానిర్దేశం చేస్తూ వచ్చిందని, అదే సమయంలో ఎవ్వరి మీద ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించలేదని, వసుధైవ కుటుంబ భావనతో విశ్వమంతా మన కుటుంబంగానే భావించే గొప్ప సంస్కృతి మన సొంతమని తెలిపారు. ఆ విలువలే నేటికీ భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతదేశంగా నిలబెట్టాయని, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  చదువులు ఎంతో ముఖ్యమని, అదే సమయంలో సమాజాన్ని చదవడం కూడా అత్యంత కీలకమన్న ఉపరాష్ట్రపతి, అది మనకు నిత్య జీవిత గమనంలో అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్లం ఎంతో కీలకంగా మారిందని, ఆంగ్ల భాషను నేర్చుకోవడం ఎలాంటి తప్పు లేదని, ఎన్ని భాషలైనా నేర్చుకోమని సూచించిన ఆయన, మాతృభాషను మరువరాదని తెలిపారు.  జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన ఊరుకు, సమాజానికి మేలు చేసేందుకు ముందుకు రావాలన్న ఉపరాష్ట్రపతి, అదే స్ఫూర్తితో మిత్రుల సహకారంతో స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. జీవితంలో ప్రతి సందర్భంలో మిత్రులు తన వెంటే నడిచారని, వాళ్ళే తన ప్రధాన బలమన్న ఉపరాష్ట్రపతి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటులో వారి సహకారం గొప్పదని తెలిపారు. అందుకే నేటికీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం పొందకుండా మిత్రుల సహకారంతోనే సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. వ్యాపారాల్లో ఎంత తలమునకలై ఉన్నా, ఆరోగ్యం మీద అశ్రద్ధ పనికి రాదన్న ఉపరాష్ట్రపతి, ఆహారం, ఆరోగ్యం విషయంలో కచ్చితంగా ఉండాలని సూచించారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలన్న ఆయన, పారిశ్రామిక ప్రగతితో పాటు ప్రకృతి సంరక్షణ అత్యంత కీలకమని తెలిపారు. ఆహారం విషయంలోనూ శ్రద్ధ అవసరమని, జంక్ ఫుడ్స్ లాంటి వాటిని మానుకుని, సంప్రదాయ ఆహారం మీద దృష్టి పెట్టాలని సూచించారు. 

Visakhapatnam

2020-12-11 22:11:07

భూసర్వే అనంతరం యూనిక్ ఐడీ..

రాష్ట్రంలో భూములు సర్వే అనంతరం ప్రతి ఒక్కరికి యూనిక్ ID కార్డు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం వై.యస్.ఆర్. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత భూ రికార్డులు, భూ స్థితికి ప్రతిబింబించేలా లేకపోవటం, ఏదైనా ఆస్థి అమ్మాలన్నా కొనాలన్నా పలు సందేహాలతో రెవెన్యూ, సర్వే, రిజిష్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగటం, అర్జీలు పెట్టి వేచి చూసే పరిస్థితి లేకుండా ఉంటుందన్నారు.  ప్రతి గ్రామం, హేబిటేషన్, పట్టణ ప్రాంతాలలో ఉన్నప్రజలకు రీ సర్వే పై వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి ప్రాపర్టీకి ఒక యూనిక్ ఐ.డి. ఇస్తారన్నారు.  సర్వే, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూకు సంబంధించిన సర్వీసులు సచివాలయాల్లోనే ఉంటుందన్నారు.  భూముల రీ సర్వే వలన గ్రామాల్లో ఉన్న వివాదాలు సమసిపోతాయని వివరించారు.  ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. సర్వే టీం ప్రతి గ్రామంలో, మండలంలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి ఒక మొబైల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.  భూ సమస్యలు ఉంటే వెంట వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు.  డివిజన్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు.  గ్రామాల్లో హద్దులు, మార్కింగ్ లను పూర్తి చేయాలన్నారు. వై.యస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పై కొలత రాళ్లు కొనుగోలు చేయాలని తెలిపారు.  ప్రతి ఒక్కరు డిశంబరు 14-19 వరకు జరిగే మొదటి విడత గ్రామ సభలలో పాల్గొని, సర్వే ప్రక్రియ, లాభాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు, ప్రజల సందేహాలు నివృత్తిచేయాలన్నారు. 21 డిశంబరు, 2020 నుండి ప్రారంభించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎటువంటి అర్జీ పెట్టకపోయినా సంపూర్ణమైన సర్వే నిర్వహణ, యాజమాన్యపు హక్కు నిర్థారణ, రికార్డులలో నమోదు అవటం జరుగుతుందని పేర్కొన్నారు.  14 వేల మంది సర్వేయర్లు ఉన్నారని, 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ జరుగుతుందని, మిగిలిన సర్వేయర్లకు శిక్షణ జరిగే విధంగా కలెక్టర్లు చూడాలని చెప్పారు. భూముల రీ సర్వే వలన ప్రయోజనాలను కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు.  ఈ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.   వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జివియంసి కమీషనర్  జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్. విజయ్ కుమార్, ఎ.ఓ. , తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-09 22:05:07

శాశ్వత భూపరిష్కారానికే రీ సర్వే..

శాశ్వత భూ పరిష్కారానికి రి సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  తెలిపారు.  బుధవారం ముఖ్య మంత్రి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సర్వే ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలో వున్న అన్ని రెవిన్యూ గ్రామాల్లోని,  అగ్రికల్చర్ భూమి, ఇంటి స్థలాలు పూర్తి స్థాయిలో రి-సర్వే కార్యక్రమం  చేపట్ట నున్నారని తెలిపారు. మొదటి  విడత డిసెంబర్ 21 నుంచి జూలై 2021 వరకు 5వేల రెవిన్యూ గ్రామాలలోను, రెండవ విడతలో ఆగష్టు 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు 6,500 రెవిన్యూ గ్రామాలలో, 3వ విడతలో జూలై 2020 నుంచి జనవరి 2023  వరకు మిగిలిన 5,500 రెవిన్యూ గ్రామాలలోను సర్వే చేయడం జరుగుతుంది అని చెప్పారు. సర్వే అనంతరం భూమి యజమానికి భూమికి సంబంధించిన యు.ఐ.డి, టైటిల్ కార్డ్ ఇవ్వడం జరిగుతుందన్నారు.  గ్రామాలలో వివరాలను డిస్ప్లే చేయడం జరుగుతుందని, రెండు సంవత్సరాల పాటు అబ్డర్వేషన్ లో వుంచుతారని తెలిపారు.  ఈ లోగా అభ్యంతరాలు వుంటే రెండు సంవత్సరాలలో తెలిపాలని చెప్పారు.  వాటిపై తగు చర్యలు తీసుకుని శాశ్వత భూపరిష్కారం  చేయడం జరుగుతుందని తెలిపారు.   టైటిల్ కార్డులో గ్రామాలు, హేబిటేషన్ తో సహా మ్యాపింగ్  చేయడం జరుగుతుందని తెలిపారు.  ఇకపై సచివాలయాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా పని చేస్తాయన్నారు.  ఈ కార్యక్రమం ద్వారా భూసమస్యలకు  శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.  వివాదాలకు తావు లేకుండా వారసులకు వ్యవసాయ భూములు కాని, ఇళ్ళు కాని, ఇంటి స్థలాలను అందించడం జరుగుతుందని తెలిపారు. డ్రోన్ల సాయంతో సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. మండలాలలో మొబైల్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలలో ల్యాండ్ ట్రిబ్యునల్  ను  డిశంబరు  15 లోగా   ఏర్పాటు చేయాలన్నారు. సర్వే ప్రారంభం కావడానికి ముందుగాని విలేజ్ బౌండరీసు, విలేజ్ సైట్లను మార్కింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.  భూ రక్షణ రాళ్ళను కొనుగోలు చేయు నిమిత్తం టెండరు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.  ప్రతీ మండలంలోను డాటా ప్రోసెసింగ్, డ్రోన్, రి-సర్వే లతో కూడిన టీమ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు.  డిశంబరు 7 నుండి 11 వ తేదీ లోగా ఇంటింటికీ వెళ్ళి సమగ్ర భూసర్వే పై ప్రజలకు అవగాహన చేయాలన్నారు.  డిశంబరు 14 నుండి 19 వ తేదీ లోగా గ్రామాలలోను, వార్డులలోను గ్రామ సభలను నిర్వహించాలని సి.ఎం. తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది సర్వేయర్ లను నియమించామని, వారికి శిక్షణ నిస్తున్న ట్లు చెప్పారు.  అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రధ్ధ మరియు పర్యవేక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ జె.నివాస్, సంయుక్త కలెక్టర్ సుమీత్ కమార్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి,  సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు  ఎ.డి. ప్రభాకర్ రావు, ఇన్ స్పెక్టర్ కె.రామకృష్ణ, డివిజనల్ ఇంజనీరింగ్ సర్వేయరు జి.వెంకట రావు  తదితరులు హాజరైనారు.

Srikakulam

2020-12-09 16:33:43

ఆచార్య కట్టిమణికి జాతీయ పురస్కారం..

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తేజస్వి కట్టిమణికి  జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారం వరించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 157 వసంతాల చరిత్ర కలిగిన కన్నడ సాహిత్య పరిషత్ ఈ సంవత్సరానికి గాను "ప్రొఫెసర్ మరిదేవరు మెమోరియల్ కన్నడ సాహిత్య పరిషత్ అవార్డు 2020" కొరకు ప్రొఫెసర్ తేజస్వి కట్టిమణి ని గిరిజనుల విద్యను విస్త్రుత పరిచినందుకు గాను ఎంపిక చేశారు. పురస్కారాన్ని కర్ణాటక లోని బెంగళూరు  సాహితి పరిషథ్ ఆడిటోరియం లో ప్రధానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద రూ.20వేలు నగదును అందజేశారు. ఆ రివార్డును కన్నడ సాహితి పరిషద్ అధ్యక్షుడు డాక్టర్ మను బడీగార్, కన్నడ ప్రభుత్వ డిపార్ట్మెంట్ అఫ్ కన్నడ అండ్ కల్చర్ డైరెక్టర్ డాక్టర్ రంగప్ప లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కట్టిమని మాట్లాడుతూ, ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మైసూరు రాజు దివాన్ గా ఉన్నపుడు 157 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కన్నడ సాహిత్య పరిషత్ జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో కృషి చేసిన నిష్ట్నాతులైన నిపుణులను ఎంపిక చేసి ఈ అవార్డును ప్రధానం చేస్తుందన్నారు. అలాంటి ప్రతిష్టాత్మక అవార్డు ఈ సంవత్సరానికి గాను తనకు వరించడం.. అదీ తాను ఎక్కువగా కృషి చేసిన గిరిజన విద్యా వ్యవస్థలో రావడం తనకు ఏంటో ఆనందం గా ఉందన్నారు. ఈ అవార్డు తనపై మరింత భాద్యతను పెంచిందన్నారు. సిటియు  ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ హెచ్. లజపతి రాయ్, గిరిజన విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ వి ఎస్ సూర్యనారాయణతో పాటు పలువురు ఆచర్య కట్టిమణి కి అభినందనలు తెలిపారు.   

Vizianagaram

2020-12-09 16:29:10

విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ దాత్రుత్వం..

విధినిర్వహణలో ఎంత కర్కశంగా ఉంటారో..మానవత్వం చాటడంలోనూ అంతే దాద్రుత్వాన్ని చాటుకున్నా విశాఖజిల్లా కలెక్టర్.. కలెక్టర్ చొరవతో రెవిన్యూలో అపస్మారక స్తితిలోకి వెళ్లిన ఉద్యోగికి మంచి వైద్యం అందుతోంది. జిల్లాకలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్న విషయం తెలియడంతో రెవిన్యూ ఉద్యోగులు కూడా తమవంతు సహకారం అందించారు. వివరాలు తెలుసుకుంటే రెవిన్యూ శాఖలో రాంబిల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నకే. విజయ్ భాస్కర్ కు ఇటీవల ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో  కుటుంబ సభ్యులు హుటాహుటిన షీలానగర్లోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఆపస్మరక స్థితిలోకి వెళ్లిన  ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స కు స్పందిస్తున్నారని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు అండగా నిలబడి ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు సమీకరించి విశాఖపట్నం జిల్లా రెవిన్యూ అధికారి ఆశపు ప్రసాద్ ద్వారా విజయ్ భాస్కర్ సతీమణి  శ్రీదేవికి అందించారు. విజయ్ భాస్కర్ కు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వి వినయచంద్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతేకాకుండా ఉద్యోగిని అన్ని విధాలా ఆదుకోంటామని, అధైర్య పడవలసిన అవసరం లేదని కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్  అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు  జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కోశాధికారి  బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఇంకా మిత్రులు, శ్రేయోభిలాషులు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి రవికుమార్, కార్యదర్శి వై శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు బంటు రమణ, ఎమ్ వి సుబ్బారావు, కోశాధికారి ఎస్ సురేష్, జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి శ్రీ రామ్మోహన్ రావు మరియు గ్రామ రెవిన్యూ అధికారి ఎమ్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.  కష్ట కాలంలో తమకు అండగా నిలిచిన రెవెన్యూ ఉద్యోగులకు, జిల్లా అధికారులకు విజయ్ భాస్కర్ భార్య శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఆపద కాలంలో తోటి ఉద్యోగికి  బాసటగా నిలిచిన రెవిన్యూ ఉద్యోగులను, ముందుండి కార్యక్రమాన్ని నడిపించినందుకు సంఘం కార్యవర్గ సభ్యులను జిల్లా రెవిన్యూ అధికారి అభినందించారు.

Visakhapatnam

2020-12-08 20:36:08

ఇళ్లపంపిణీకి ఏర్పాటు పూర్తిచేయాలి..

 నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయము నుంచి జిల్లా, డివిజన్, మండల స్ధాయి అధికారులతో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళ స్ధలాల పంపిణీ, జగనన్న భూ హక్కు, భూరక్ష పధకం , ధాన్యం కొనుగోలు,సంబంధిత సమస్యలు , బియ్యం కార్డుల మ్యాపింగ్, కోవిడ్ -19 చేపట్టిన 50 రోజుల అవగాహన కార్యక్రమాలు, వ్యర్ధ పదార్ధాల పై పోరు, మహిళా సాధికారత చట్టాల పై 100 రోజుల అవగాహన కార్యక్రమాలు, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు , వైయస్ఆర్ బీమా, జగనన్న తోడు, చేయూత, గొర్రెలు-మేకల పంపిణీ, మొబైల్ ట్రక్స్ లబ్దిదారుల ఎంపిక, తదితర అంశాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఈ నెలలోనే ప్రభుత్వ పరంగా  పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు. 10వ తేదీన గొర్రెల-మేకల యూనిట్ల పంపిణీ, 15వ తేదీన 2019 సంవత్సరంలో రైతులకు పెండింగ్ లో ఉన్న క్రాప్ ఇన్సురెన్స్ విడుదల, 21న భూహక్కు, భూరక్షా పధకాల ప్రారంభం, 25వ తేదీన ఇళ్ళ పట్టాల పంపిణీ జరుగనున్నందున అధికారులు ఆయా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలక్టర్ తెలిపారు. జిల్లా లో తొలి దశలో భాగంగా 1.48 లక్షల మందికి ఇళ్ళ పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఇళ్ళ స్ధలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్స్ కు దగ్గర ఉన్నఇసుక స్టాక్ పాయింట్లను మేపింగ్ చేయాలన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 25న జిల్లాలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నందున అధికారులు ఈ కార్యక్రమం పై ప్రధానంగా దృష్టిపెట్టాలన్నారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను రవాణా ఖర్చుల మినహా, ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జియో ట్యాగింగ్, మేపింగ్, లబ్దిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వెంటనే పూర్తి చేయాలని కలక్టర్ తెలిపారు.

రైతులను ఆదుకోవడంలో అధికులు చొరవ చూపాలి- జేసి లక్ష్మిశః

జిల్లాలో వర్షాలు, తుఫానుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అధికారులు చొరవ చూపాలని జాయింట్ కలక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మిశ తెలిపారు.  రంగు మారిన ధాన్యం కొనేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, దీనికి సంబంధించి జిల్లా స్ధాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫోన్ లను ఆయా మండలాలకు పంపడం జరుగుతుందని, వాటిన వెంటనే పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ  నెల 21వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూ హక్కు, భూ రక్షా పధకాలు ప్రారంభించనున్నందున అధికారులు భూ సర్వే పై దృష్టి పెట్టాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామంలో జరిగే రీ సర్వే పై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కరపత్రాలు , అవగాహనా సదస్సలు నిర్వహించాలని జేసి అధికారులకు సూచించారు.  ఈ-క్రాప్ బుకింగ్ లో కౌలు రైతుల వివరాలు నమోదుకు అవకాశం కల్పించినందున దీని పై కౌలు రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించి వారి వివరాలు నమోదు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న బియ్యం కార్డుల మేపింగ్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఇళ్ళ పట్టాలకు సంబంధించి పట్టాల ముద్రణకు లబ్దిదారుల వివరాలు పంపించాలని జేసి తెలిపారు. 

అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కీర్తీ చేకూరి.

కోవిడ్-19కు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 50 రోజుల 

అవగాహనా కార్యక్రమాలు సక్రంమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలక్టర్(అభివృధ్ధి) కీర్తీ చేకూరి అధికారులను ఆదేశించారు. 50 రోజులకు రోజు వారీ ఏ కార్యక్రమాలు అమలు చేయాలో ప్రణాళిక లో నిర్దేశించిన ప్రకారం అన్ని ప్రాంతాల్లో అమలయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ ,కార్యక్రమాలకు సంబంధించి వాలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. ఈ 50 రోజుల అవగాహన కార్యక్రమంలో ప్రధానంగా పారిశుధ్యంతో పాటు కోవిడ్ పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా వ్యర్ధాల పై పోరు, మనం- మన పరిశుభ్రత కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యే విధేంగా చూడాలని జేసి తెలిపారు. గ్రామ స్ధాయిలో ఖాళీలుగా ఉన్న ప్రాంతాలలో గ్రీన్ అంబాసిడర్ లను నియమించాలన్నారు. గ్రామ స్ధాయిలో పారిశుధ్యం పై పంచాయతీ సెక్రటరీలు ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. మహిళా సాధికారతా, హక్కులు, చట్టాల పై మహిళలకు అవగాహన కల్పించు నిమిత్తం 100 రోజులు నిర్వహించే కార్యక్రమాలు జిల్లా స్ధాయి నుండి గ్రామ స్ధాయి వరకు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో మహిళల సమస్యల పరిష్కారం నిమిత్తం అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్ధులతో ర్యాలీలు నిర్వహణ, స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. వైయస్ఆర్ బీమాకు సంబంధించి బ్యాంకర్ల లాగిన్ లో ఉన్న దరఖాస్తులను ఎంపిడిఓలు ఆమోదించాలని జేసి కీర్తీ చేకూరి తెలిపారు.

ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలి- జి.రాజకుమారిః

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను అధికారులు సమన్వయంతో పని చేసి నిర్మాణ పనుల్లో పురోగతి చూపించాలని జాయింట్ కలక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి అన్నారు. మంజూరు చేసిన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. వైయస్ఆర్ చేయూత పధకంలో భాగంగా 10వ తేదీన లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నందున బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో మనీ ట్రక్ ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఆమె తెలిపారు. నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమం 2021 జనవరి 1 నుండి ప్రారంభించనున్నందున లబ్దిదారుల జాబితాను సిధ్ధం చేయాలని జేసి రాజకుమారి అధికారులకు సూచించారు.  ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా స్ధాయి అధికారులు, డివిజన్ , మండల స్ధాయి అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2020-12-08 20:27:23

వాలంటీరు ఆరోగ్యం కోసం వాసుపల్లి పరుగులు..

విశాఖ దక్షిణ నియోజవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వాలంటీరు ప్రియాంక కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కెజిహెచ్ లో చేర్పించారు. పరిస్తితి కాస్త ఇబ్బంది కరంగా ఉండటంతో రంగంలోకి దిగి ఎమ్మెల్యే వాసుపల్లి ఈ విషయాన్ని వెంటనే కెజిహెచ్ సూపరింటెండెంట్ తో చర్చించారు. దీంతో తక్షణమే మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి మార్చారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి ప్రియాంకను ఎమ్మెల్యే పరామర్శించి దైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. అంతేకాకుంగా ఈమెకు వైద్యం అందిస్తున్న వైద్యులతోనూ మాట్లాడి ఆమెను ఎలాగైనా క్షేమంగా ఇంటికి చేర్చేవిధంగా మెరుగైన వైద్యసహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనారిటీ నాయకుడు సాధిక్, మహిళా ప్రెసిడెంట్ మాధురి, భాదితరాలు కుటుంబ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-08 20:23:11

మీ సమస్యలు నేరుగా నాతో చెప్పండి..

నాడు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన దివంగత మహానేత వైయస్ఆర్ అయితే ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేడు అనేక సంక్షేమ పథకాలతో ముస్లిం సోదరుల ఉన్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్నివెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. మంగళవారం ఉదయం 7 గంటలకు ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత మచిలీపట్నం టెక్యా ప్రాంతానికి చెందిన కొందరు ముస్లిం మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. తమ పిల్లలకు విద్యా దీవెన డబ్బులు రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ,  మీ పిల్లల చదువుల వివరాలు నాకు తెలియచేయండి. తాను తప్పక విచారణ చేస్తానని హామీ ఇచ్చారు. 2004 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు  ముఖ్యమంత్రి అయిన త‌రువాత‌ ముస్లిం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ద్రోహద పడేలా రిజర్వేషన్ కల్పించడం  అత్యవసరమని భావించి 4% రిజర్వేషన్ ఏర్పరచెరన్నారు. ఆ రిజర్వేషన్ ఫలితంగా ముస్లిం సమాజము విద్య ,ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రాధాన్యత పొందడం ఎంతో అభినందనీయమన్నారు. స్థానిక పేర్ని కృష్ణమూర్తి కాలనీకు చెందిన కొల్లేరు విజయలక్ష్మి తనకు అయిదు నెలలుగా  పింఛన్ రావడం లేదని బియ్యం కార్డు నిలిచిపోతుందని మంత్రి కి తెలిపింది. తనకు ఆధార్ కార్డు ,రేషన్ కార్డు తదితర  వివరాలు ఎందుకు తీసుకోని రాలేదమ్మా అని ఆమెని అడిగి అవి వెంటనే అందచేయాలని మంత్రి పేర్ని నాని అడిగారు. స్థానిక  హుస్సేనుపాలెం యానాదుల కాలనీకి సమీపంలో నివసిస్తున్న మందా రాజేష్  అనే దివ్యంగుడు మూడు చక్రాల సైకిల్ పై భార్యతో సహా వచ్చి మంత్రిని కలిశారు. కొద్ది సంవత్సరాల క్రితం లారీ తనను ఢీ  కొట్టిందని తనకు రెండు కాళ్ళు తొలగించారని తెలిపారు ఆర్ధిక ఇబ్బందులతో ఎంతో ఇబ్బందులు పడుతున్నానని   తనకు ఇంటి స్థలం లేదన్నారు.  రాజేష్ దుస్థితికి జాలిపడిన మంత్రి తప్పకుండా నీకు నివేశన స్థలం ఇస్తానని , కానీ ఆ స్థలం నీ భార్య పేరిట ఉంటుందని తెలిపారు. బందరు మండలం పెద కొత్తపూడి గ్రామానికి చెందిన మాదిరెడ్డి ఏసు అనే రైతు మంత్రిని కలిశారు. తనకు రైతు భరోసా డబ్బులు రాలేదని, దస్తావేజులు లేకపోవడంతో ఆ డబ్బు రాదనీ అధికారులు చెడుతున్నారని పేర్కొన్నాడు.

Machilipatnam

2020-12-08 20:11:48

వర్శిటీలు-పరిశ్రమల మధ్య సమన్వయం అవసరం..

నూతన ఆవిష్కరణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా క్లిష్టమైన అంశమని, ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక రంగం సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు, మార్గదర్శనం చేయాలని సూచించారు. మంగళవారం విశాఖపట్నం నుంచి అంతర్జాల మాధ్యమం ద్వారా టి.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్ -2020 ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. యువతలో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రోత్సహించేందుకు, పెంపొందించేందుకు ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించిన ఆయన, ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాలని కార్పొరేట్ రంగానికి సూచించారు. 

ద ఇండస్ (IndUS) ఎంటర్‌ప్రెన్యూర్స్ (టి.ఐ.ఈ)  సంస్థ సిలికాన్ వ్యాలీ ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ. ఇది నెట్‌వర్కింగ్ ద్వారా అంకుర సంస్థలకు (స్టార్టప్స్) సహకారం అందిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ సమ్మేళనం – 2020 ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. భారతదేశ జనాభాలో 65 శాతం మంది యువత ఉన్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలని ఆకాంక్షించిన ఆయన, మహిళల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్య ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మెంటరింగ్ ద్వారా 50వేల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను టి.ఐ.ఈ. ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా భారతదేశాన్ని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఇటీవలి నాస్కామ్ (ఎన్.ఏ.ఎస్.ఎస్.సీ.ఓ.ఎమ్) నివేదికను ఉటంకించారు.

 టెక్ స్టార్టప్ లలో 50శాతం మంది కరోనాకు ముందు ఉన్న పరిస్థితుల దిశగా త్వరలోనే పుంజుకుంటారన్న నివేదికలోని అంశాలు ఆనందదాయకమన్న ఆయన, భవిష్యత్తులో కచ్చితంగా అన్ని భారతీయ అంకుర సంస్థలు మంచి విజయాలు, ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ అధ్యయనాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామిక దేశాలు సుసంపన్నంగా ఉన్నాయని.. తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక ప్రోత్సాహంతోపాటు ప్రజలకు సౌకర్యం, ఆనందం లభిస్తుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడం లాభాల కోసమే కాదన్న ఉపరాష్ట్రపతి, విద్య, ఆరోగ్య సంరక్షణ, కనీస సౌకర్యాల కల్పన ద్వారా ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకు కూడా ఇది మరింత కీలకమైనదని తెలిపారు. ఇందులో పోటీ మాత్రమే కాకుండా, ప్రజల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు. కరోనా విసిరిన సవాళ్ల గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రస్తుత కాలాన్ని ప్రతికూల పరిస్థితులను అవకాశాలు ఒడిసిపట్టే సమయంగా అభివర్ణించారు.

 నానాటికీ పెరుగుతున్న నూతన సవాళ్ళను ఎదుర్కునేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, అలాంటి ఆలోచనల ద్వారా ముందుకు వచ్చే ఔత్సాహిక, ఆశాజనక అంకుర సంస్థలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి కల్పనలో వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా అంకుర సంస్థలకు సానుకూల వాతావరణాన్ని కల్పించిన భారత ప్రభుత్వాన్ని అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహిచడం అంటే సరైన ఆర్థిక విధానాన్ని రూపొందించడం, ఉత్తమ విద్యా పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని.. దీనిద్వారా ఆవిష్కరణలు, ఆలోచనలు ఏకకాలంలో వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల విజయాలు సృష్టించే ఆర్థిక అవకాశాలు భారతదేశం కోసం మాత్రమే గాక యావత్ ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయన్న ఉపరాష్ట్రపతి, అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఉందని టి.ఐ.ఈ. వంటి సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలైన సంస్థలకు పిలుపునిచ్చారు.

 వారి అనుభవాలను, విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలతో పంచుకోవాలని, అదే విధంగా విశ్వవిద్యాలయాలు సైతం విద్య పూర్తయ్యే సమయానికే విద్యార్థుల్లో పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  ప్రతిభావంతుల నుంచి చక్కటి ఔత్సాహిక పారిశ్రామిక ఆలోచనలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, వారు సిలికాన్‌వ్యాలీ లాంటి చోట్ల మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రతిభావంతులున్న ఇతర ప్రదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగం సానుకూల మార్గంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాపారాన్ని ఆరంభించడం చాలా క్లిష్టమైన పనిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనుభవం ఉన్న మార్గదర్శకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. 

అంతర్జాతీయ టి.ఐ.ఈ. కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు దిశా నిర్దేశం చేసేందుకు 300 మందికి పైగా మెంటర్స్ అందుబాటులో ఉండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉన్నత కార్యక్రమాలు ఆలోచనలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు ఒక మంచి వేదికను అందించడమే గాక, వివిధ ఆలోచనల మధ్య చక్కని వంతెన నిర్మించడంలో సహాయపడతాయన్న ఉపరాష్ట్రపతి, ఇందుకోసం చొరవ తీసుకున్న టి.ఐ.ఈ.ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ  కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, టీఐఈ గ్లోబల్ అధ్యక్షుడు శ్రీ మహవీర్ శర్మ, టీఐఈ హైదరాబాద్ విభాగం బాధ్యుడు, కంట్రోల్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ పిన్నపురెడ్డి శ్రీధర్ రెడ్డి, భారతదేశంతోపాటు వివిధ దేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-08 19:43:46

రాజమండ్రిలో రౌడీయిజం సహించేది లేదు..

రాజమహేంద్రవరంలో రౌడీయిజాన్ని సహించేది లేదని,  తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్షార్హులే నని రాజమహేంద్రవరం ఎంపీ,  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రౌడీ మూకలను సహించేది లేదని, ఎక్కడికక్కడ రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని, రౌడీ మూకలను, బ్లేడ్ బ్యాచ్ లను గుర్తించి నగర బహిష్కరణ చేయాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రౌడీయిజాన్నే సహించలేమని మొత్తుకుంటుంటే ఇక వర్గాలకు తావెక్కడుంటుందని ఎంపీ భరత్ రామ్ ప్రశ్నించారు. స్థానిక ఐదు బళ్ల మార్కెట్ వద్ద జరిగిన దాడి ఘటనపై పోలీసులు త్వరితగతిన విచారణ జరిపి సత్వరం నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ రామ్ పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలో ప్రశాంతతకు భంగం కల్గిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరాభివృద్ధి పై దృష్టి పెట్టి చారిత్రాత్మకమైనరాజమహేంద్రవరం నగరాన్ని హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. ఏదేమైనప్పటికీ నగరంలో రౌడీయిజం పై చర్యలు తీసుకోవాలని, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా నిష్పక్ష పా తంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Rajahmundry

2020-12-08 19:27:28

డ్రై రీసోర్సు సెంటర్ ఏర్పాటుకి స్థల పరిశీలన..

స్వచ్చ సర్వేక్షణ్ ఏర్పాట్లలో భాగంగా డ్రై రీసోర్సు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని  జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మూడవ  జోన్ లోగల ఎం.ఎస్.ఎఫ్. కేంద్రంలో ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేశారు. అనంతరం ఎం.ఎస్.ఎఫ్. - 3లో మెకానికల్ ఇంజినీరింగు వారు ప్రతిపాదిత కెమెరాల ఏర్పాటు, వేయింగు బ్రిడ్జి ఏర్పాట్లు  మెకానికల్ విభాగం పర్యవేక్షక ఇంజినీరుతో చర్చించారు.  భూ గర్భ డ్రైనేజి పనులు నిర్వహణకు గాను కొనుగోలు చేసిన, 6000 కిలోల హై ప్రెసర్ జేట్టింగు మిషిన్, హైడ్రాలిక్ ఆపెరేటర్ గ్రాబ్ బకెట్ ల పని తీరును మూడవ జోన్ పరిధిలో గల ఇందిరా గాంధి స్టేడియం వద్ద గల యు.జి.డి. హొల్స్ ను ప్రయోగాత్మకంగా నిర్వహించి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా నిబంధనల మేరకు మేన్ హోల్ ను మిషన్ హోల్ గా మార్పుచేసే నిమిత్తం జివిఎంసి స్వయంగా ఈ రెండు మిషన్లను సమకూర్చుకున్నదన్నారు. నగరంలో సుమారు 780 కి.మీ. పరిధిలోగల 38,700 భూ గర్భ డ్రైనేజి హోల్స్ ను మానవ రహిత నిర్వాహణ కొరకు ఈ రెండు మిషన్లు వినియోగించడం వలన, స్వచ్ఛ సర్వేక్షణ్ లో మెరుగైన ర్యాంకు సాధనకు తోడ్పడుతుందని కమిషనర్  ఆశాభావాన్నివ్యక్తీకరించారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీర్లు శ్యాంసన్ రాజు, వేణుగోపాల్, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, సిటీ ప్లానర్ ప్రభాకర్, మూడవ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమ్మాజీ, కార్యనిర్వాహక ఇంజినీరు(నీటి సరఫరా) శ్రీనివాస్, డి.ఇ. మహేష్, మెకానికల్, నీటి సరఫరా విభాగపు ఇంజినీరింగు అధికారులు తదితరులు పాల్గోన్నారు.  

Visakhapatnam

2020-12-08 19:05:51

ఆ ఇద్దరి జీతాలు నిలిపేయండి..

 మీకు ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదు..ఇంకెప్పుడు విధినిర్వహణ సక్రమంగా చేస్తారంటూ జివిఎంసీ కమిషనర్ డా.స్రిజిన శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోన్-1 పరిధిలోని బింద్రానగర్ ప్రాంతంలో జివిఎంసి కమిషనర్ పర్యటించి, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆ ప్రాంతాలలో వాహనం ద్వారా చెత్తను  గృహాల నుంచి సేకరించిడం ప్రత్యక్షంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భాగంగా ఆప్రాంత వాసులను గృహాల  నుండి చెత్తను తీసుకొని వెళ్ళుటకు ప్రతీ రోజూ సిబ్బంది మరియు వాహనం వస్తుందీ లేనిదని, చెత్తను  వేరుచేసి ఇవ్వాలని సిబ్బంది అడుగుతున్నారా లేదా అని అడిగితెలుసుకున్నారు. చెత్తను వేరు చేయకుండా ఇస్తున్నామని అక్కడ ప్రజలు చెప్పగా, వేరుచేసి ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజలకు చెత్త వేరు చేయడంపై సంపూర్ణ అవగాహన కల్పించకుండా అలసత్వం ప్రదర్శించిన ఐదవ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టరు , ఆ ప్రాంత శానిటరీ కార్యదర్శి జీతాల నిలుపుదల చేయాలని సహాయ మెడికల్  ఆఫీసరును ఆదేశించారు. ఆ ప్రాంతంలో రోడ్డును తుడిచి చెత్తను ఎత్తకుండా రోడ్డు ప్రక్కనే పోగు పెట్టడం గమనించి, కార్మీకురాలు వద్ద డబ్బా వంటిది లేక పోవడం గమనించి, ఆమెను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినందుకు ఆమెకు ఒక రోజు వేతనం నిలపాలని ఆదేశించారు. అపార్ట్మెంట్స్ నుండి ఖాళీ స్థలాలలో చెత్త వేయడం గమనించి వారి వద్ద నుండి జరీమనాలు విధించాలని ప్రజా ఫిర్యాదు మేరకు బింద్రానగర్ పరిసర ప్రాంతాలలో కాలువలు నుండి చెత్తను తొలగించి సాయంత్రంలోగా నివేదిక పంపాలని శానిటరీ ఇన్ స్పెక్టర్ ను  ఆదేశించారు. ఖాళీస్థలాలలో చెత్త, తుప్పలను తొలగించని స్థల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఏ.ఎం.ఓ.హెచ్.ను ఆదేశించారు. బింద్రానగర్ ప్రాంతంలో ఇండ్ల వద్ద ఎరువును(హోమ్ కంపోస్టు) తయారు చేసి, స్వయంగా వారి అవసరాల కొరకు ఉపయోగించడాన్ని, స్థానికంగా గృహాలకు వెళ్లి పరిశీలించి, సేంద్రీయ ఎరువు వినియోగాన్ని మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఐదవ వార్డులో డ్రైనేజి ఏర్పాటుకుగాను కావలసిన ప్రైవేటు స్థలాల్ని, నాల్గవ వార్డులో రోడ్డు ఏర్పాటుకు కావలసిన ప్రైవేట్ స్థలాన్ని ఇంజినీరింగు మరియు పట్టణ ప్రణాళిక అధికారులతో కలసి పరిశీలించారు. 

 ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రాము, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాదరాజు, ఏ.ఎం.ఓ.హెచ్. జయరాం, ఏ.సి.పి., కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు(మెకానికల్), సహాయక ఇంజినీరు(నీటిసరఫరా), శానిటరీ ఇన్ స్పెక్టరు, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.   


Visakhapatnam

2020-12-08 18:54:45

ఆడిటోరియం పనులను పూర్తి చేయాలి..

శ్రీకాకుళంలోని  అంబేద్కర్ ఆడిటోరయం  మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.  మంగళవారం స్ధానిక అంబేద్కర్ ఆడిటోరియాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.  పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా మంచి సౌకర్యాలతో ఆడిటోరియాన్ని రూపొందించాలని ఇండనీరింగ్ అధికారులను కలెక్టర్  ఆదేశించారు. నిర్మాణాలు జరిగిన తరువాత క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్కడ తేడా వచ్చినా సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో ఇ.డబ్ల్యు.ఐ.డి.సి. కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర రావు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-08 18:43:55