1 ENS Live Breaking News

తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం..

శ్రీకాకుళం జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం, స్థానిక ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం జరిగింది.  కార్యక్రమంలో  17 మంది ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు రక్తదానాన్ని చేసారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్షేత్ర సహాయకులను  అభినందించి, వారికి  సర్టిఫికేట్ లను అందచేసారు. అనంతరం ఎం.పి.డి.ఓ.ని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రెడ్ క్రాస్ సంస్థ రక్తాన్ని అందించనున్నట్లు తెలిపారు.   ప్రతీ రోజు అవసరం మేరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు 30 మంది వరకు రక్తాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్ తెలిపారు.  కావున యుపత రక్తదానాన్ని చేసి సమాజానికి మంచి  సేవలు అందించాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో ఎక్కువ మంది మహిళా క్షేత్ర సహాయకులు రక్తదానానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందించారు.

    ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, మండల అభివృధ్ధి అధికారి వి.ప్రకాశరావు, రెడ్ క్రాస్  సంస్థ చైర్మన్ డా.పి.జగన్మోహన్ రావు, డా.నిక్కు అప్పన్న, పెంకి చైతన్యకుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఎపిడిలు  రోజా రాణి, ఎల్. అలివేలు మంగమ్మ, కుందువాని పేట మాజీ సర్పంచ్ ఎస్.సూర్యం,  ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు ఎం.మల్లేశ్వర రావు, బి.రాజేశ్వరి, జి.చిన్నారావు, పి.శంకరరావు, జి. రమణమూర్తి, జి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-08 18:36:04

అభివ్రుద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనారిటీ ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా తెలిపారు. అనంతపురం వచ్చిన ఆయన మంగళవారం ఆర్అండ్బీ అతిథి గ్రుహంలో మీడియాతో మాట్లాడారు. కుల,మత,వర్గ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చేపట్టిన తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను వందశాతం నెరవేరుస్తున్నట్లు తెలిపారు .గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయిందన్నారు . ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ను పవిత్ర భగవద్గీత ,ఖురాన్, బైబిల్ గా భావించి  ప్రభుత్వం ఏర్పాటు చేసిన 18 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా హామీలను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తండ్రి బాటలోనే  ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్నారన్నారు .మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారన్నారు .మొదటి కేబినెట్ లోనే 60 శాతం పదవులను ఆవర్గాలవారికి కల్పించారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్యాబినెట్లో ఐదు మంది ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవులను కల్పించారన్నారు. 

 ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుతో పాటు , ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రానున్న రోజుల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ మనబడి నాడు-నేడు పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నూత్న మైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.రైతుల పక్షపాతిగా రైతు భరోసాకేంద్రాల ఏర్పాటు, పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్, మద్దతు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాల పంపిణీ మరియు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అనేక విధాలుగా ఆదుకుంటున్నారన్నారు.గత ప్రభుత్వం విద్య, వైద్యం ,వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆయా రంగాలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ముఖ్యమంత్రి  దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా చర్యలు తీసుకున్నారన్నారు.కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే విధంగా రాష్ట్రంలో సుమారు ఒక కోటి వరకు  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు.

వెనుకబడిన ఎస్సి, ఎస్టీ ,బిసి,  మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 45 -60 వయస్సు కలిగిన మహిళలకు వైయస్సార్ చేయూత కార్యక్రమం ,విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం జగనన్న  విద్యా దీవెన పథకాన్ని తమ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల నేడు ఎంతో మంది ముస్లిం,మైనార్టీ వర్గాల్లోని యువతీ, యువకులు డాక్టర్లుగా,ఇంజనీర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు.ఈ రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం గతం కంటే మిన్నగా బడ్జెట్ కేటాయించి ముస్లీమ్,మైనార్టీల పక్షపాతిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతోందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు.

ఈ సమావేశంలో అనంతపురం, రాప్తాడు శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి ,  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-12-08 18:19:51

వీసీ ప్రసాదరెడ్డికి అభినందనల వెల్లువ

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని  పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి, ఐఐటి శ్రీకాకుళం సంచాలకులు ఆచార్య జగదీశ్వర రావులు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి యూనివర్శిటీలను బలోపేతం చేస్తుందన్నారు. అందులో భాగంగానే అభివ్రుద్ధిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా నాలుగు యూనివర్శిటీలకు పూర్తిస్థాయి ఉపకులపతిలను నియమించిందని ఎమ్మెల్యే అన్నారు. మీ హాయాంలో యూనివర్శిటీ మరింత అభివ్రుద్ధి సాధించడంతోపాటు, విద్య పూర్తయిన విద్యార్ధులకు ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు..

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-08 18:00:05

10‌న ఏయూ పూర్వవిద్యార్థుల వార్షిక సమ్మేళనం

ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమ్మేళనం వేవ్స్ 2020‌ని డిసెంబర్‌ 10‌వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు. మంగళవారం ఏయూ సెనేట్‌ ‌మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గురువారం సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు వర్చువల్‌ ‌విధానంలో ఈ సమ్మేళనం జరుగుతుందన్నారు. ముఖ్యఅతిధిగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ ‌జవదేకర్‌ ‌పాల్గొంటారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం వ్యవస్థాపక అద్యక్షులు గ్రంధి మల్లికార్జున రావు(జిఎంఆర్‌) ‌తదితరులు పాల్గొంటారన్నారు. వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 10‌న ఈ సమ్మేళనం ప్రతీ సంవత్సరం నిర్వహించడం జరుగుతోందన్నారు. మద్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పూర్వవిద్యార్థుల సమ్మేళనం, సాయంత్రం 4 నుంచి 4.30 వరకు ప్రధాన సమావేశం జరుగుతాయన్నారు. సమ్మేళనాన్ని డిజిటల్‌ ‌విదానంలో జూమ్‌, ‌యూ ట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. కోవిడ్‌ ‌నేపధ్యంలో ఈ సమ్మేళనాన్ని వర్చువల్‌ ‌విధానంలో ఏర్పాటుచేసామన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి పూర్వవిద్యార్థులు సంపదగా నిలుస్తున్నారని, వీరిని వర్సిటీకి విలువైన మానవ వనరులుగా నిలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను లాభదాయకంగా మార్పుచేసుకుంటూ వర్చువల్‌ ‌విధానంలో ఉన్నత స్థానాలలో స్థిరపడిన పూర్వవిద్యార్థుల అనుభవ జ్ఞాన సారాన్ని నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం కార్యదర్శి బి.మోహన వెంకట రామ్‌, ‌సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ‌కుమార్‌ ‌రాజా తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-12-08 17:53:43

ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నద్ధం కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న లబ్దిదారులకు ఇళ్లపట్టాల పంపిణి, నిర్మించిన ఇళ్ల పంపిణీని విజయవంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ కోరారు. మంగళవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో టిడ్కో, జిల్లా గృహనిర్మాణసంస్ధ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో నిరుపేదలకు ఇంటిస్ధలాల పట్టాలపంపిణికోసం 3 లక్షల 34 వేల మంది లబ్దిదారులను గుర్తించామని కలెక్టరు చెప్పారు. ప్రభుత్వం గృహనిర్మాణాలకోసం లబ్దిదారుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే ఇంటి నిర్మాణాల్లో రూ. లక్షా 50 వేల రూపాయలు కేంద్రం ద్వారా అందిస్తామన్నారు. పేద, నిరుపేద ప్రజలపై ఎ టువంటి ఆర్ధికభారం పడకుండా మొత్తం ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుందన్నారు. గుర్తించిన లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. డిశంబరు 25 ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు పట్టాలను పంపిణి చేయడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. రాష్ట్రస్ధాయి వేఢుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుందని ఇందులో భాగంగా జిల్లా స్ధాయి, మండల స్ధాయిల్లోనూ పట్టాల పంపిణి కార్యక్రమాలను చేపడుతున్నామని కలెక్టరు ఇంతియాజ్ తెలియజేశారు. అదేరోజు టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన 7 వేల 742 మంది లబ్దిదారులకు నిర్మించిన ఇళ్ల పట్టాలను అందించడం జరుగుతోందన్నారు. గృహనిర్మాణాల కోసం ఎ ంతో విలువైన స్ధలాన్ని లబ్దిదారులకు పట్టాలను అందించే దిశలో పట్టణప్రాంతాలలో ఒకసెంటు, గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్లు భూమిని అందించనున్నామన్నారు. జిల్లాలో ఇందుకోసం ఇప్పటికే 1400 లకు పైగా లేఅవుట్లను సిద్ధం చేసామన్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయ శాఖలతో కలిసి పూర్తి చేయాలని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. ఇంటి నిర్మాణంకోసం స్ధలాలు కేటాయించిన లబ్దిదారుల ద్వారా ఫేజ్-1 లో ఇంటినిర్మాణాలు ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించవలసి ఉందని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు.

విజయవాడ

2020-12-08 17:41:52

రోస్టర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలి..

విద్యుత్ శాఖలో ఖాళీగా వున్న షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను నిబంధనలు మేరకు రిజర్వేషన్స్ తో మాత్రమే భర్తీ చేయాలని విద్యుత్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ ఏవీ కిరణ్, ఈపీడీసీఎల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ చొప్పల సాయి బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం విశాఖ లోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్ ని కలిసి పలు సమస్యల  పరిష్కారం  విషయమై చర్చించారు.  కార్పొరేట్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మీడియా తో మాట్లాడారు. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు గత కొన్నేళ్లుగా ఇతర కులాలకే కట్టబెట్టారని రోస్టర్ ని ఏ మాత్రం పట్టించుకోలేదని విన్నవించారు. ఇప్పటికయినా బ్యాక్ లాగ్ పోస్టు లతో బాటు అన్ని పోస్టు లను నిబంధనలు మేరకు భర్తీ చేయాలనీ కోరారు.  షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలను నిబంధనలు మేరకు ఎస్సీ ఎస్టీ లతో భర్తీ చేయాలని నిర్ణయించి ఆదేశాలు ఇచ్చినా వాటిని కొందరు స్వార్థపరులైన అధికారులు, కొందరు నాయకులు కలిసి అడ్డుకోవడం  దారుణమని పేర్కొన్నారు.  అలాగే ఎస్సీ ఎస్టీ అధికారులను మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఫోకల్ ప్రాంతాల్లో నియమించాలని కోరారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేలా ఎస్సీ ఎస్టీ ఇంజనీరింగ్  అధికారులను నియమించాలని అప్పుడే అయిదు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కాలనీలకు న్యాయం జరుగుతుందన్నారు. యూనియన్ నేతలకు గత 20ఏళ్ళుగా అమల్లో ఉన్న  ఫుల్ టైమ్ పర్మిషన్ ప్రివిలేజ్ ను ఈ ప్రభుత్వం తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. గణేశ్వరరావు, విశాఖపట్నం అధ్యక్షులు పి. ఈశ్వర్ రావు, కార్యదర్శి సీహెచ్  రుషికేష్, విజయనగరం జిల్లా నిర్మల మూర్తి, ఈపిడీసీఎల్  అదనపు కార్యదర్శి ఎం లక్ష్మణరావు, కోశాధికారి రాజేష్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-08 17:28:13

కెకె రాజుకి శుభాకాంక్షలు తెలిపిన SCRWA..

వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం విశాఖలోకి కెకె రాజు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంతవైభంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు కెకెరాజుకి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ, మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని , దేవుని ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ(సత్య), కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్, సభ్యులు జీ వి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ నార్త్

2020-12-08 16:04:28

11న బిసి కార్పోరేషన్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం..

బి.సి. ల సంక్రాంతి పండుగ పేరుతో ప్రభుత్వం నియమించిన 56 మంది ఛైర్మన్ లు, డైరెక్టర్లు ఈనెల 11వ తేది ప్రమాణస్వీకారం చేయనున్నారని రాష్ట్ర పంచాయతిరాజ్, కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని బి.సి.ల ప్రమాణస్వీకారం ద్వారా వారిపట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని చాటనున్నారని చెప్పారు. స్ధానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో మంగళవారం బి.సి. కార్పోరేషన్‌ల ఛైర్మన్‌ల, డైరెక్టర్ల ప్రమాణస్వీకార ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించింది. ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ఏలూరులో నిర్వహించిన బి.సి. గర్జనలో డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన తరగతుల కులాలకు అండగా ఉంటానని వారికోసం ప్రత్యేక కార్పోరేషన్‌లను ఏర్పాటు చేస్తానన్న హామి ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో 139 బి.సి. కులాలకు 56 కార్పోరేషన్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బి.సి.లకోసం ఇన్ని కార్పోరేషన్లు ఏర్పాటుచేస్తున్న సందర్భంగా దేశంలో ఏరాష్ట్రంలో లేదన్నారు. బి.సి.ల కోసం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి ముందుచూపు గొప్ప ఆలోచనలతో వారికి తగిన గుర్తింపును ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో బి.సి. కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారని ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు స్ధానిక ఇందిరాగాంధి స్టేడియంలో ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. 6 వేలమంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని అందుకు అనుగుణంగా పాస్‌లు కూడా జారీ చేస్తామన్నారు. బి.సి.లకు వెన్నుగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి.. మంత్రి వేణుగోపాలకృష్ణ ః- వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారిని కల్చర్ ఆఫ్ ఇండియాగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి గుర్తించారన్నారు. నిజమైన బి.సి.ల ప్రజానాయకుడిగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి నిలిచారన్నారు. బి.సి. కార్పోరేషన్‌ల ఏర్పాటుకోసం అధ్యయన కమిటీ వేసి ఏడాది వ్యవధిలో 139 కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్‌లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. వీరిలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, 29 ఛైర్మన్‌లను, 339 మంది డైరెక్టర్లగా మహిళలను నియమించడం జరిగిందన్నారు. బి.సి.లకు పెద్ద ఎ త్తున కార్పోరేషన్‌లు ఏర్పాటుచేయడం ద్వారా వారి కల నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ఈకార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, తదితరులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఒకేవేదికపై డైరెక్టర్లు, ఛైర్మన్‌ల ప్రమాణస్వీకారం ఏర్పాటుచేయడం ద్వారా బి.సి.లకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. డిశంబరు 11న నిర్వహించే కార్యక్రమ ఏర్పాట్లుపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్ధాయి అధికారులు స్టేడియం పరిశీలన అనంతరం తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈసందర్శనా కార్యక్రమంలో దేవాదాయశాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ , సెక్రటరి బి.రామారావు, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, డిసిపి హర్షవర్ధనరాజు, జేసి-3 కె. మోహనరావు, వైయస్ఆర్ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2020-12-08 16:00:53

విశాఖలో భారత్ బంద్ సక్సెస్..

అఖిల భారత రైతు సంఘాల కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు విశాఖనగరంలో నిర్వహించిన భారత్ బంద్ మంగళవారం విజయవంతం అయ్యింది. విశాఖపట్నంలోని వాణిజ్య సంస్థలు, షాపులు, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, విద్యాసంస్థలు, ఆటో, మోటారు, బస్సు, పరిశ్రమలు అన్ని రకా కార్యకలాపాలను మూసివేసి రైతు భారత్‌ బంద్‌కు మద్దత్తు ఇచ్చారు. విశాఖ నగర పరిధిలో  మద్దిపాలెం, కంచరపాలెం,గోపాల పట్నం, పెందుర్తి, మధురవాడ,గాజువాక, మల్కాపురం  ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. నగరంలో పూర్ణామార్కెట్ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్ష్, మద్దిపాలెం నుంచి కాంప్లెక్ష్ వరకు వేలాది మందితో ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ, నరేంద్రమోడీ ప్రభుత్వం   పార్లమెంటులో మద్దతు లేకపోయినా  అక్రమంగా మూజువాని ఓటుతో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ చట్టాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉరితాళ్ళుగా మారాయని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని దేశంలోని అధాని, అంబాని వంటి బడా కార్పోరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేలా కాంట్రాక్టు వ్యవసాయాన్ని తీసుకొచ్చారని మండి పడ్డారు. దీనివల్ల రైతు భూములు కార్పోరేట్‌ సంస్థలకి కాంట్రాక్టు ఒప్పందం చేయాలి. కార్పోరేట్‌ సంస్థలు చెప్పిన పంటలే వేయాలి. పండిన పంటనంతా కంపెనీలకే ఇచ్చేయాలి అన్నారు. ఆఖరికి పండించిన పంట కార్పోరేట్‌ సంస్థలు తీసుకోకపోయినా, ఇస్తానన్న ధర ఇవ్వకపోయినా కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. రైతు భూములపై రైతు హక్కు కూడా కోల్పోనున్నారని అన్నారు. సిపిఐ రాష్ట్ర  సహాయ కార్యదర్శి  జెవి సత్యన్నారాయణ మాట్లాడుతూ రైతు మార్కెట్‌ యార్స్ రద్దుచేస్తున్నారని. తప్పనిసరిగా రైతు తమ పంటను బడా కార్పోరేట్‌ సంస్థలకు అమ్మేలా మరొక చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దీనినే రైతు దేశంలో ఎక్కడైన పంట అమ్ముకోవచ్చని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. నిత్యవసర సరుకుల చట్టం  సవరణ చేసి రైతుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల సంఘాలు, వామ పక్షనాయకులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-08 15:49:36

ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు..

తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌పై నిరంతర అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ఏలూరు సంఘ‌ట‌న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి కాకినాడ కుళాయి చెరువు వ‌ద్ద ఉన్న విక్టోరియా వాట‌ర్ వ‌ర్క్స్, శ‌శికాంత్‌న‌గ‌ర్ ప్లాంటు ప్రాంగ‌ణాల‌ను త‌నిఖీ చేశారు. నీటి స‌ర‌ఫ‌రా తీరుతెన్నుల‌ను నిశితంగా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ తాగు నీటి నాణ్య‌త విష‌యంలో ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, నిర్దేశ ప్ర‌మాణాల మేర‌కు మంచి నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు. విక్టోరియా వాట‌ర్ వ‌ర్క్స్ పాయింట్ నుంచి కాకినాడ‌లోని 60 శాతం ప్రాంతానికి నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని, మిగిలిన 40 శాతం ప్రాంతానికి శ‌శికాంత్‌న‌గ‌ర్ ప్లాంట్ నుంచి స‌ర‌ఫ‌రా అవుతున్న‌ట్లు వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు గ‌త రెండు రోజులుగా జిల్లాలోని మునిసిప‌ల్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగాల అధికారులు నిరంత‌రం అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలిపారు. నీటి శుద్ధి ప్ర‌క్రియ అనంత‌రం నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న తీరును ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిపారు‌. పైపులైన్ల లీకేజీపై ఫిర్యాదులు అందితే వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఏర్పాట్లు చేశామని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ‌నీరు క‌లుషితం కాకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. నీటి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు తెలిపారు. అద‌న‌పు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా నాడు-నేడు విధానంలో నీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌ ఆధునికీక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. న‌మూనాలు తీసుకొని ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌న్నారు. అయితే ఎవ‌రైనా అస్వ‌స్థ‌తకు గురైతే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా, సొంత‌వైద్యంపై ఆధార‌ప‌డ‌కుండా వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ‌క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ కమిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ పీవీవీ స‌త్య‌నారాయ‌ణ రాజు, ఈఈ పి.స‌త్య‌కుమారి, డీఈఈ ఎస్‌.ప్ర‌భాక‌ర‌రావు త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2020-12-08 15:38:14

కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగుల శ్రమదానం..

విజయనగరం కలెక్టరేట్ లోని వివిధ శాఖల కార్యాలయాల్లో, పరిసరాలలో మంగళవారం శ్రమదానం చేపట్టారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించి ఆయా కార్యాలయాలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ స్వయంగా చీపురు చేతబట్టి కార్యాలయంలో ఊడ్చారు. ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి ఆడిటోరియం సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలను ఆయన తొలగించారు. షటిల్ కోర్టును శుభ్రం చేశారు. నూతనంగా మరొక షటిల్ కోర్టు ఏర్పాటు చేయాలని డి.ఆర్.వో. ఎం.గణపతిరావుకి ఈ సందర్భంగా సూచించారు. షటిల్ కోర్టు సమీపంలో లైట్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట మట్టి వేయించాలని కూడా చెప్పారు. ఈ క్రమంలో కాసేపు సిబ్బందితో కలిసి షటిల్ ఆడి అందరినీ ఉత్తేజపరిచారు. అనంతరం కలెక్టరేట్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో చేపట్టిన శ్రమదానం పనులను పరిశీలించారు. పాల్గొన్న అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. మేము సైతమంటూ మహిళా సిబ్బంది.. మన కార్యాలయం మనమే శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన పిలుపును అందుకొని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందీ హాజరయ్యారు. వీరితో పాటుగా వివిధ విభాగాల్లో పని చేసే పలువురు మహిళా అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో శ్రమదానానికి విచ్చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉదయం 7:00 నుంచి 10:00 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో వారి వంతు శ్రమ చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ చేత శెభాష్ అనిపించుకున్నారు. చీపుర్లు చేతబట్టి కలెక్టరేట్ ఆవరణలో, పరిసరాలలో చెత్త ఊడ్చారు. పిచ్చి మొక్కలు తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరిపారేశారు. తొలగించిన చెత్తను, వ్యర్ధాలను ట్రాక్టర్లలో వేశారు. ఈ పనుల్లో చురుగ్గా వ్యవహరించిన మహిళా అధికారులను, సిబ్బందినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.  ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో. ఎం.గణపతిరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, ఏవో దేవ్ ప్రసాద్, క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా ఖజానా శాఖ, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ, సర్వే & లాండ్ రికార్డ్స్ విభాగం, బి. సి. సంక్షేమ శాఖ, ఇతర శాఖల అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-08 15:35:53

బిల్లు ఉపసంహరించేంత వరకూ ఉద్యమం ఆగదు..

అన్నదాతలను మోసగించే బిల్లులను రద్దుచేసేంతవరకు కాంగ్రెస్ పోరాడుతుందని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు తెలిపారు. విశాఖలో మంగళవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ కు సంఘేభావం తెలుపుతూ జగదాంబ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పరిసర ప్రాంతాల లోని దుకాణదారులు షాపులు మూసి మద్దతు తెలపాలని కాంగ్రెస్ నాయకులు అభ్యర్ధించారు.రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న మోడీ తన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని సంకు కోరారు.కేవలం అంబానీ,అదానీ వంటి కార్పొరేట్ లకు మాత్రమే ఈ బిల్లులు లబ్ది చేకూరుస్తాయని సంకు మండిపడ్డారు.రైతులు దేశానికి వెన్నుముక అని అలంటి రైతులనే దోచుకోవాలని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సంకు ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతువ్యతిరేక బిల్లులను ఉపసంహరిస్తామని  రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని సంకు గుర్తుచేశారు.రైతులను ఆదుకోవాలని,రైతువ్యతిరేక బిల్లులను వెంటనే రద్దుచేయాలని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బంద్ లో పాల్గొన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఏ నారాయణరావు మాట్లాడుతూ అన్నదాతల పట్ల మోడీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.ప్రపంచంలో రైతులను మోసగిస్తున్నఘనత  మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేసారు.వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా కాకుండా అసెంబ్లీ లో బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చెయ్యాలని నారాయణరావు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో సంకు వెంకటేశ్వర రావు,జీ.ఏ.నారాయణ రావు లతో పాటుగా రాష్ట్ర బీసీ.సెల్ వైస్ చైర్మన్ మూల వెంకట రావు,ఇంటాక్ అధ్యక్షుడు తమ్మిన నాయుడు,రాష్ట్రయూత్ వైస్ ప్రెసిడెంట్ అంగ వర్మ,దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్ డీ సింకా,కోవిద్-19 కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్,ఇంకా నాయకులు త్రినాధరావు,నూనెల పోలరావు,శేషం శ్రీనివాసరావు,పరదేశి,శ్రీనివాసరావు,ఎం డీ అలీ,రమణ,మహేష్,మొహిద్దీన్ తదితరులు ఈ బంద్ లో పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-08 15:31:26

అనంతలో డిప్యూటీ సీఎంకి ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖామంత్రి  ఎస్.బి. అంజద్ బాషాకి అనంతపురంలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన డిప్యూటీ సీఎంకి  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఇతర అధికారులు స్వాగతం పలిసికారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లారు. మంత్రిని కలిసిన వారిలో ఏ. ఎస్. పి.నాగేంద్ర ,డి.ఎస్.పి వీర రాఘవ రెడ్డి  ,ఆర్డిఓ గుణ భూషణ రెడ్డి,వక్ఫ్ బోర్డ్  ఇన్స్పెక్టర్ ఇనాయతుల్లా నాలుగవ టౌన్ సిఐ శ్రీనివాసులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. మంత్రిరాక సందర్భంగా వివిధ ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధుల నుండి ఉప ముఖ్యమంత్రి వినతులను సమర్పించారు. వారిని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పెట్టిన అర్జీలపై తక్షణమే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Anantapur

2020-12-08 12:24:59

ఆ కలెక్టర్ ప్రక్రుతి ప్రేమకోసమే పరితపిస్తుంటారు..

ఒక జిల్లాకి కలెక్టర్ అంటే చుట్టూ పదుల సంఖ్యలో అధికారులు.. చిటికేస్తే జరిగే పనులు.. బిళ్ల బంట్రోతులు..గన్ మేన్ లు.. హోదా మందీ, మార్బలం..కలెక్టరంటే ఇలా ఉంటారు అనుకుంటారు.. కానీ విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ను చూస్తే అవేమీ కనిపించవు.. ఆయనను చూస్తే కనిపించేది ఒక్క ప్రక్రుతి ప్రేమే.. అవును మీరు విన్నది నిజమే..ఆయన పనిచేసే చోట, నివాసం వుండే చోటా చుట్టూ పచ్చని ప్రక్రుతి ఉండాలి...దాని కోసం నిత్యం మొక్కలు నాటుతుంటారు...ఆ మొక్కల్లో పేరుకు పోయిన చెత్తను కూడా స్వయంగా తొలగిస్తుంటారు ..ఇంతలా పనిచేసే జిల్లా అధికారిని చూసిన అధికారులంతా కూడా ఆయన బాటలోనే పయనిస్తారు.. కలెక్టరేట్ లో ప్రతీ వారం చెత్తా చెదారాన్ని కలెక్టర్ స్వయంగా తన ఉద్యోగులతో కలసి శ్రమధానం చేస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెత్తపై యుద్దం ప్రకటించడంతో ఇక రోజూ చెత్తకర్ర పట్టుకొని చెత్తను తరిమి కొడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్ లో సిబ్బందితో కలిసి ప్రాంగణంలో పేరుకుపోయిన పిచ్చితుప్పలను చెత్తను స్వయంగా తొలగించారు కలెక్టర్ హరి జవహర్ లాల్.. కలెక్టర్ మంచి కార్యక్రమానికి ముందుండటంతో అధికారులు కూడా అదే ఉత్సాహంతో పనిచేసి తమ ప్రాంతాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మనమూ-మన పరిశుభ్రత బాగుంటే ఆరోగ్యం పదిలంగా వుంటుందని నమ్మే విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పలువురు ఐఏఎస్ లకు ఆదర్శనంగా నిలుస్తున్నారు. అంతేకాదు పలు అవార్డులు పొందుతూ అందరి మన్ననలూ పొందుతున్నారు. నిజంగా ఇలాంటి కలెక్టర్ ఉన్న జిల్లాలు రాష్ట్రంలో పేరు తెచ్చుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు..!

Vizianagaram

2020-12-08 11:13:35

ఆరోగ్యం కోసం వ్యర్ధాలపై వ్యతిరేకపోరాటం..

వ్యర్ధాల కారణంగానే అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతోందని, ఇందుకోసం ప్రజలను పరిశుభ్రత పట్ల ఆలోచించేలాగా ప్రజలను చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ పేర్కొన్నారు. స్ధానిక ఇరిగేషన్ కార్యాలయ రైతు శిక్షణా కేంద్రంలో యంపిడివోలు, ఇఓపిఆర్ డిలు, సమన్వయ శాఖల అధికారులతో కార్యశాలను నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రంలో కృష్ణాజిల్లాను పరిశుభ్రతకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్ధాయిలోని సిబ్బందితో కలిసి అడుగులు వేయాలన్నారు. నిన్న ఏలూరులో జరిగిన ఒక గుణపాఠంగా అధికారులు తీసుకోవాల్సి ఉందని, ఈవిషయంపై మంత్రులతో కూడా చర్చించడం జరిగిందన్నారు. కృష్ణాజిల్లాను పరిశుభ్రత విషయంలో మోడల్ జిల్లాగా రూపుదిద్దడం జరుగుతుందన్నారు. 15 అంశాల ప్రాతిపదికగా చక్కని కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. ప్రజలలో భద్రతాభావాన్ని ఒక క్రమపద్ధతిలో తీసుకువెళ్లాలని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని అందిస్తారన్నారు. గతంలో పైలెట్ ప్రాజెక్టుగా 118 గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాల రహిత గ్రామపంచాయతీలుగా చక్కని కార్యక్రమాన్ని రూపొందించామని, దీనికి ప్రజల నుండి పెద్ద ఎ త్తున స్పందన వచ్చిందన్నారు. కరోనా పరిస్ధితులలో కొంత ప్రచారాన్ని చేయకపోవడం, కరోనాపై దృష్టిసారించడంలో తిరిగి కొన్ని గ్రామాల్లో యధాస్ధితి వస్తున్నదని, ప్రజలను ఇంటింటి సర్వేద్వారా మరోసారి చైతన్యం చేసే బాధ్యతను యంపిడివోలు సచివాలయ వాలంటీర్ల ద్వారా తీసుకువెళ్లాలని ఇంతియాజ్ స్పష్టం చేసారు. ఈకార్యక్రమంలో భాగంగా పక్షోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టరు యల్. శివశంకర్ మాట్లాడుతూ వ్యర్ధాలపై పోరాటం సమాజ శ్రేయస్సు కోసమేనని ఇందులో ప్రజల వంతు భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. ఇందుకోసం ప్రతీ నెలా నామమాత్రపు రుసుం చెల్లించేలాగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఈవిడతలో 284 గ్రామపంచాయతీలను ఎ న్నుకోవడం జరిగిందని ఆవ్యర్ధాల నుంచి ఆదాయ వనరులను కూడా సమకూర్చుకునే ప్రణాళికలను అమలు చేయడం జరగాలన్నారు. జనవరి 1 నుండి ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇందుకు యంపిడివోలు ఆయా వార్డుల లబ్దిదారులతో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇకెవైసి ద్వారా పోర్టబులిటీ ద్వారా ప్రజాపంపిణి సరుకులు పొందే లబ్దిదారులనుకూడా గుర్తించాల్సిందే నన్నారు. జగనన్నతోడు లబ్దిదారుల ఎ ంపిక దృష్ట్యా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులను కూడా ఆయా సమీక్షలలో భాగస్వామ్యం చేయాలని శివశంకర్ తెలిపారు. జిల్లాలో వెనుకబడినతరగతుల సర్వేను సమర్ధవంతంగా చేపట్టగలిగామని ఇంకా 8 శాతం డేటాను పూర్తి చేయాల్సి ఉందన్నారు. మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లుపై అడుగులు వేయాలని ఆయన సూచించారు. మోడల్ సచివాలయంలో ప్రతీ సోమవారం డ్రస్ కోడ్‌ను అమలు చేసామని, వచ్చే వారం నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ వార్డు , గ్రామ వార్డు సచివాలయాలలో అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. సంక్షేమ కార్యదర్శులు వారి పరిధిలోని స్కూళ్ల తనిఖీలను చేపట్టాలని ఇందుకు యంపిడివోలు, మండల స్ధాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అనంతరం వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లతో వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం స్లోగన్స్‌తో కొవ్వొత్తులతో నిర్వహించిన ర్యాలీని కలెక్టరు ప్రారంభించి వారితో కలిసి కధం తొక్కారు. ఈకార్యక్రమంలో పలువురు జిల్లాస్ధాయి అధికారులు, యంపిడివోలు, ఇఓపిఆర్ డి, గ్రామకార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ

2020-12-07 20:47:15